Movie News
-
విడాకుల తర్వాత మాజీ భర్త గురించి సైంధవి పోస్ట్.. అభినందిస్తున్న ఫ్యాన్స్
విడాకుల తర్వాత కోలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు జివి ప్రకాష్, గాయని సైంధవి మరోసారి ఒక వేదికపై కలవనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. సుమారు 11 ఏళ్ల పాటు కలిసి జీవించిన వారు తమ వైవాహిక బందానికి వీడ్కోలు పలికారు. బాల్యం నుంచే వారిద్దరూ మంచి స్నేహితులు. అలా 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగు అన్వి అనే కూతురు కూడా ఉంది.సింగర్ సైంధవి తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తన మాజీ భర్తకు సంబంధించిన సంగీత కచేరీ గురించి ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. గతంలో ఎన్నో చిత్రాలకు కలిసి పనిచేసిన వీరిద్దరూ మరోసారి ఒక మ్యూజిక్ ప్రోగ్రాం కోసం కలిసి పనిచేయబోతున్నారు. డిసెంబర్ 7న మలేషియాలో జరిగే సంగీత కచేరి కార్యక్రమంలో వారిద్దరూ కలిసి కనిపించనున్నారు. దీంతో అభిమానులు సంతోషించడమే కాకుండా సైంధవిని అభినందిస్తున్నారు. వివాదాలను పక్కనపెట్టి వృత్తిరిత్యా జివి ప్రకాష్‌తో కలిసి పనిచేయడం అభినందించాల్సిన విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా స్నేహం అనే చర్య తమ పరిపక్వతను తెలియజేస్తోందని సోషల్ మీడియాలో పలువురు కొనియాడారు. జి.వి.ప్రకాష్ సంగీతం అందించిన ఈ మధ్యనే విడుదలై ఘనవిజయం సాధించిన ‘అమరన్’ సినిమాలోని ‘గానవే’ పాటను సైంధవి పాడడం గమనార్హం.విడాకుల సమయంలో కూడా జివి ప్రకాష్ గురించి సైంధవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జి.వి.ప్రకాష్ తనకు స్కూల్ నుంచే మంచి స్నేహితుడని ఆమె తెలిపింది. అలా 24 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నామని గుర్తుచేసింది. విడాకుల తర్వాత అదే స్నేహంతో ప్రయాణం చేస్తామని ఆమె తెలిపింది. దానిని సైంధవి పాటిస్తున్నట్లు నెటిజన్లు తెలుపుతున్నారు. ప్రభాస్ చిత్రం 'డార్లింగ్' సినిమాలో 'ఇంకా ఏదో' అనే పాటతో జివి ప్రకాష్ తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. View this post on Instagram A post shared by DMY Creation (@dmycreation) -
అనుకోని తప్పటడుగులు.. లేదంటే ఓ రేంజ్ హీరో అయ్యేవాడేమో! (ఫొటోలు)
-
వ్యాపారవేత్తతో పెళ్లి.. ఐటమ్ సాంగ్ కోసం రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్
చిత్రపరిశ్రమలో ఐటమ్ సాంగ్స్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్లు అవకావం వస్తే కాదనకుండా ఓకే చెప్పుతున్నారు. ప్రస్తుతం క్రేజ్‌లో ఉన్న హీరోయిన్లు నటించిన ఐటమ్ సాంగ్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. అలా ఇంతకు ముందు పుష్ప చిత్రంలో నటి సమంత పాటను, ఇటీవల జైలర్ చిత్రంలో తమన్నా పాటను చూశారు. ఈ తరహా పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ కావడంతో స్టార్ హీరో చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండడం పరిపాటిగా మారుతోంది. తాజాగా నటుడు సూర్య చిత్రంలోనూ ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంటోందని సమాచారం. కంగువ చిత్రం తరువాత ఈయన నటించిన తన 44వ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటించారు. స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ, 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ యాక్షన్ కథా చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో శ్రియ నటించనున్నట్లు తాజా సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి స్టార్ స్థాయికి చేరుకున్న ఈ బ్యూటీ ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని నటనకు కాస్త విరామం తీసుకున్నారు. ఈమె తమిళంలో చివరిగా 2017లో విడుదలైన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో కథానాయకిగా నటించారు. ఆ తరువాత ఎక్కడా కనిపించని శ్రియ ఆ మధ్య కన్నడంలో ఉపేంద్రకు జంటగా ఒక చిత్రంలో నటించడంతో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాంటిది తాజాగా తమిళంలో ఏడేళ్ల తరువాత నటుడు సూర్య హీరోగా నటిస్తున్న ఆయన 44వ చిత్రంలో ఐటమ్ సాంగ్‌తో మెరవనున్నట్లు తెలిసింది. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. అయితే దీని గురించి నటి శ్రియ ఒక భేటీలో పేర్కొనడం విశేషం. ఈ పాట బాగా వచ్చిందని, త్వరలోనే వెలువడనుందనీ ఆమె తెలిపారు. అంతే కాదు ఈ పాటను గోవాలో చిత్రీకరించినట్లు చెప్పారు. కాగా ఈమె నటుడు సూర్యతో నటించిన తొలి చిత్రం ఇదే అవుతుంది. -
గేమ్ ఛేంజర్ కు లైన్ క్లియర్
-
సుకుమార్ నిర్మాతగా చైతూ 'మిథికల్ థ్రిల్లర్'
నాగచైతన్య పుట్టినరోజున కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం 'తండేల్' చేస్తున్న ఈ అక్కినేని హీరో.. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మిథికల్ థ్రిల్లర్ అంటే.. మైథలాజికల్ ప్లస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీ ఇది. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో అజిత్)నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ అనుకుంటున్నారని తెలుస్తోంది. డిసెంబర్ నుంచే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఓ కన్ను.. అందులో నాగచైతన్య పర్వతంపై నిలబడ్డ ప్రతిబింబం రావడాన్ని చూపించారు.'కాంతార', 'విరూపాక్ష', 'మంగళవారం' చిత్రాలతో పాటు 'పుష్ప 2'కి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్లుగా మీనాక్షిని ఎంచుకున్నారు. కానీ ఆ డీటైల్స్ త్వరలో బయటపెడతారు. అలానే మిగతా విషయాలు కూడా త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
మొన్నటి వరకు గొడవలు..! ఇప్పుడు పెళ్లి వేడుకకు హాజరు
-
ఆమె కారణంగానే రెహమాన్ విడాకులు.. స్పందించిన మోహినిదే
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్-సైరాబాను దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పర్పస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు న్యాయవాది వందనా షా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు రెహమాన్ విడాకుల విషయం బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన బృందంలోని సభ్యురాలు మోహినిదే కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ విడాకులకు మోహినిదే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు రెహమాన్-మోహినిదే మధ్య ఏదో సంబంధం ఉందన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై మోహినిదే సోషల్ మీడియా వేదికగా స్పదించారు. తనపై వస్తున్న రూమర్స్‌ని తీవ్రంగా ఖండించారు.‘నా విడాకుల ప్రకటన వెల్లడించిన తర్వాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంటర్వ్యూ ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. వారంతా ఎందుకు నా ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నారో నాకు తెలుసు. వారి అభ్యర్థనను నేను గౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఇలాంటి రూమర్స్‌పై మాట్లాడి నా విలువైన సమయాన్ని వృధా చేసుకోలేను. దయచేసి నా గోప్యతను గౌరవించండి’అని మోహినిదే తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.కాగా, ఇదే ఇష్యూపై రెహమాన్ కొడుకు అమీన్ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా స్పందించాడు. ‘మా నాన్న ఓ లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలను పొందారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, వారసత్వం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. దయచేసి మా నాన్నపై అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయడం ఆపండి. ఆయన్ని, ఆయన వృత్తిని గౌరవిద్దాం. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి’’ అని రాసుకొచ్చారు. -
భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో అజిత్ ఒకడు. ప్రస్తుతం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా చేస్తున్నాడు. ఇతడి భార్య షాలిని.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. రీసెంట్గా తన 44వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. షూటింగ్ నిమిత్తం యూకేలో ఉన్న అజిత్.. భార్య పుట్టినరోజుకి రాలేకపోయాడు. అయితేనేం ఖరీదైన లగ్జరీ కారుని బహుమతి ఇచ్చాడు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!)నవంబర్ 20న షాలినీ.. తన పుట్టినరోజు నాడే లెక్సెస్ LM 350h మోడల్ కొత్త కారుతో కనిపించింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా అజిత్.. షాలినికి కారు బహమతిగా ఇవ్వడం బయటకొచ్చింది. మార్కెట్లో కారు ఖరీదు రెండున్నర కోట్ల రూపాయలకు పైనే ఉందని తెలుస్తోంది. అంతకు ఈ ఏడాది మే 1న అజిత్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. అప్పుడు తన భర్తకు ఇష్టమని చెప్పి, డుకాటీ లేటెస్ట్ మోడల్ రేస్ బైక్‌ని షాలినీ గిఫ్ట్ ఇచ్చింది. ఇలా భార్య, భర్తకు బహుమతి ఇవ్వగా.. ఇప్పుడు తిరిగి అతడి భార్యకు కారు గిఫ్ట్ ఇచ్చాడు.ఇదంతా పక్కనబెడితే అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ సంక్రాంతి రేసులో ఉందని అంటున్నారు. అది కూడా 'గేమ్ ఛేంజర్'తో పాటు జనవరి 10నే థియేటర్లలోకి వస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం తెలుగు రాష్ట్రాల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ తమిళనాడులో మాత్రం చరణ్ మూవీ కలెక్షన్స్ తగ్గే అవకాశముంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?) -
అందమైన తెలుగు హీరోయిన్.. మరికొన్నాళ్లు వెయిటింగ్ తప్పదు! (ఫొటోలు)
-
18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్
‘దేవుడ దేవుడా తిరుమల దేవుడా... చూడర చూడరా కళ్లు విప్పి చూడరా...’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో జోరుగా స్టెప్పులేశారు రజనీకాంత్. ఆ పాటలో ‘రిపీట్టే’ అని ఉంటుంది. 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇలా లాంగ్ గ్యాప్‌తో ‘రిపీట్టే’ అంటూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన పద్దె నిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్నారు చిరంజీవి. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. ఇక ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ యూనిట్ జపాన్‌లో ఉంది. అక్కడ చిరంజీవి–త్రిషపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. 38 ఏళ్ల తర్వాత...సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’కి దర్శకుడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కలిసి నటిస్తుండటం విశేషం. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో సత్యరాజ్ తండ్రి పాత్ర చేయగా, రజనీకాంత్ ఆయన కొడుకుగా నటించారు. అయితే కావేరీ జలాల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ కారణంగా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ (2007) చిత్రంలో సత్యరాజ్‌ని విలన్‌గా తీసుకోవాలకున్నారు దర్శకుడు శంకర్. అయితే సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్రని సుమన్ చేశారని కోలీవుడ్ టాక్. తాజాగా ‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్–సత్యరాజ్‌లను ఒప్పించారు లోకేశ్ కనగరాజ్. ఈ మూవీలో రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇరవై ఏళ్ల తర్వాత... మలయాళ చిత్ర పరిశ్రమలో హిట్ జోడీగా పేరొందిన మోహన్ లాల్, శోభన మరోసారి కలిసి నటిస్తున్నారు. అది కూడా దాదాపు ఇరవైఏళ్ల తర్వాత కావడం విశేషం. మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ‘ఎల్ 360’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోంది. ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు మోహన్ లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ యాభైకి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ చివరిగా నటించిన చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ 1994లో విడుదలైంది. ఆ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోని వీరు (‘సాగర్ ఆలియాస్ జాకీ రీ లోడెడ్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, శోభన అతిథి పాత్ర చేశారు) ఇరవై ఏళ్ల తర్వాత ‘ఎల్ 360’ కోసం మరోసారి తెరని పంచుకుంటున్నారు. కాగా ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 56వ సినిమా కావడం విశేషం.పాన్ ఇండియా సినిమా కోసంమలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల కాంబినేషన్ ఓ పాన్ ఇండియా సినిమాకి కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. అయితే జోషి దర్శకత్వం వహించిన ‘ట్వంటీ 20’ (2008) చిత్రం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ మూవీ చేయలేదు. అయితే మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్ లాల్ ఓ అతిథి పాత్ర చేశారు. కాగా పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం శ్రీలంకలో ఘనంగా ప్రారంభమైంది. ‘‘మలయాళ సినిమా చరిత్రను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. శ్రీలంక, అబుదాబీ, అజర్ బైజాన్, లండన్, థాయ్‌ల్యాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చితో సహా పలు ప్రాంతాల్లో 150 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరపనున్నాం’’ అని పేర్కొన్నారు మేకర్స్. 38 ఏళ్ల తర్వాత... హీరో రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘లేడీస్ టైలర్’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అర్చన నటించారు. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్, అర్చన కలిశారు. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటిస్తున్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా నటిస్తున్నప్పటికీ ఈ కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. రాజేంద్రప్రసాద్ భార్యగా అర్చన నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రూపేష్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాయే ‘షష్ఠిపూర్తి’కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం.పంతొమ్మిదేళ్ల తర్వాత... తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య, హీరోయిన్ త్రిషలది హిట్ జోడీ. వీరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో సినిమా రానుందని టాక్. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట ఆర్జే బాలాజీ. కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కోలీవుడ్ టాక్. ‘మౌనం పేసియదే’ (2002), ‘ఆయుద ఎళుత్తు’ (2004), ‘ఆరు’ (2005) వంటి చిత్రాల్లో నటించారు సూర్య, త్రిష. తాజాగా నాలుగోసారి ఆర్జే బాలాజీ సినిమా కోసం వీరిద్దరూ తెరని పంచుకోనున్నారట. ఈ వార్త నిజం అయితే 19 సంవత్సరాల తర్వాత వీరి జోడీ రిపీట్ అవుతుంది.టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధం హీరోలు మాధవన్–సిద్ధార్థ్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్’. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం కాగా, సింగర్ శక్తిశ్రీ గోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్–సిద్ధార్థ్ ఈ సినిమాలో కలిసి నటించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘యువ’ (2004). ఆ సినిమా తర్వాత మాధవన్–సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ‘ది టెస్ట్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలుఉన్నాయని కోలీవుడ్ టాక్.– డేరంగుల జగన్ -
ఓటీటీలో తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
ఓటీటీలు రావడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ కథలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. అలా సినిమాలుగా తీయలేని కథల్ని కొన్నిసార్లు వెబ్ సిరీసులుగా తీయడం చూస్తూనే ఉన్నాయి. అలా రాజేంద్ర ప్రసాద్, దివి, శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన సిరీస్ పేరే 'హరికథ'. ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)మర్డర్ మిస్టరీకి మైథలాజికల్ టచ్ ఇచ్చి తీసిన ఈ సిరీస్ డిసెంబరు 13 నుంచి హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అధర్మం హద్దు మీరినప్పుడు, అన్యాయాన్ని ఎదురించాల్సిన వారు చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు.. ఆ ధర్మాన్ని కాపాడడానికి దేవుడే వస్తాడు అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. అదే టైంలో రక్తపాతంతో భయంకరంగా అనిపించింది.పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి... ఇలా శ్రీవిష్ణు దశావాతారాల్లోని కొన్ని రూపాల్లో ఉన్న వ్యక్తి.. వరస హత్యలు చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్నది దేవుడా? మరెవరైనా అని పరిశోధించే పోలీస్ ఆఫీసర్‌గా శ్రీ రామ్ నటించారు. రంగస్థల నాటక కళాకారునిగా రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!) -
టాలీవుడ్ హీరోయిన్గా టీమిండియా క్రికెటర్ భార్య!
టీమిండియా స్పిన్నర్ చాహల్ గురించి క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన బౌలింగ్, ఫన్ మూమెంట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అటు ఐపీఎల్‌లోనూ చాలామంది స్టార్ క్రికెటర్లతో ఇతడికి మంచి బాండింగ్ ఉంది. కొన్నేళ్ల క్రితం ధనశ్రీ వర్మ అనే యూట్యూబర్‌ని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారబోతుందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?)స్వతహాగా డ్యాన్సర్ అయిన ధనశ్రీ వర్మ.. పలు ఆల్బమ్ సాంగ్స్‌తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌లోనూ ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈమె తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్.. హీరోగా పరిచయమవుతున్నాడు.చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైంది. డ్యాన్స్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా డ్యాన్స్ కచ్చితంగా రావాల్సిన హీరోయిన్ పాత్ర ఉంది. దాని కోసమే ధనశ్రీని అడగ్గా.. ఆమె ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. ఈమెకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర జరిగినట్లు సమాచారం. ఏదేమైనా టీమిండియా క్రికెటర్ భార్య.. టాలీవుడ్లో హీరోయిన్ అంటే వినడానికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా!(ఇదీ చదవండి: మా నాన్నపై అసత్య ప్రచారం చేయొద్దు: ఏఆర్ రెహమాన్ కొడుకు) -
నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్‌బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?
బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లకంటే నెగిటివ్ అయిన వాళ్లే ఎక్కువ. అలా ప్రస్తుత సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన బ్యూటీ సోనియా ఆకుల. ఇప్పుడు ఈమె తన ప్రియుడు యష్ పాల్‌తో నిశ్చితార్థం చేసుకుంది. పెద్దగా హడావుడి లేకుండా గురువారం ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్‌బాస్ 8వ సీజన్ అంటే ఈసారి ఓ కంటెస్టెంట్‌గా హౌసులోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.బయటకొచ్చిన తర్వాత నిఖిల్ నిజ స్వరూపం తెలుసుకుని పలు ఇంటర్వ్యూలో అతడిని కడిగిపారేసింది. బిగ్‌బాస్ లోనే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. డిసెంబరు రెండో వారంలో పెళ్లి జరిగే అవకాశముంది.(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ) -
ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమాకి ఉంది: అక్కినేని అమల
‘‘ఓ ఉత్తమమైన ప్రదేశంగా ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమా మాధ్యమానికి ఉంది’’ అని అక్కినేని అమల అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘రోడ్ నెం 52’ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమల విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశంలోఎందరో ప్రతిభావంతులైన యువత సినీ రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారని, వారిని తీర్చిదిద్దే పనిలో తాము పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.కొన్నేళ్లుగా వందలాది మందికి తమ అన్నపూర్ణ సంస్థ శిక్షణ అందించిందని, ఇప్పటికే పలువురు సినిమా రంగంలో పని చేస్తున్నారని వివరించారు. మహారాష్ట్రకు చెందిన యువకులు అచ్చ తెలుగు కథాంశం ఎంచుకుని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారని ‘రోడ్ నెం 52’ రూపకర్తల్ని అభినందించారు అమల. ‘రోడ్ నెం 52’ రచయిత– దర్శకుడు సరోజ్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అథర్వ మహేష్ గాగ్ తమ అనుభవాలు పంచుకున్నారు. నటీమణుల పాత్రల నిడివి పెరగాలి‘‘నటీమణులకు తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది’’ అనే అభిప్రాయం ‘ఇఫీ’లో నిర్వహించిన సదస్సులో వ్యక్తమైంది. సినీ పరిశ్రమలో మహిళా భద్రత అనే అంశంపై జరిగిన చర్చలో నటి–నిర్మాత వాణీ త్రిపాఠి టికూ మోడరేట్ చేసిన ఫ్యానెల్ పాల్గొంది. నటి సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో ఏదో ఇలా వచ్చి అలా పోయేవి కాకుండా మహిళలు తాము నటించే పాత్రలు బలంగా ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు.‘‘లొకేషన్లో మహిళలు వేధింపులకు గురి కాకూడదు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలి’’ అని దర్శకుడు ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు. ‘‘వినోదంపై దృష్టి సారిస్తూనే సమానత్వానికిప్రా ధాన్యం ఇవ్వడంతో పాటు బాధ్యతాయుతమైన చిత్రనిర్మాణం సాగాలి’’ అని ఖుష్బూ అన్నారు. మహిళలు తెరపై గౌరవప్రదంగా, తెరవెనుక సురక్షితంగా ఉండాలని, మహిళల భద్రతకి సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ఫ్యానెల్ ముగిసింది. -
గేమ్ ఛేంజర్: అక్కడా ఇక్కడా కాదు, ఏకంగా అమెరికాలోనే!
సినిమా తీయడం ఒకెత్తయితే ప్రమోషన్స్ చేయడం మరో ఎత్తు. సినిమాను జనాల్లోకి తీసుకునేందుకు చిత్రబృందం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని నగరాల్లో టూర్స్ చేస్తుంటారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తారు.ఇదెక్కడి మాస్‌రా మావాఅయితే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎవరూ ఊహించని ప్లేస్‌లో చేస్తున్నారు. అక్కడా, ఇక్కడా కాదు.. ఏకంగా అమెరికాలోనే ప్లేస్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటలకు ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనున్నట్లు అధికారికంగా వెల్లడించారు.గేమ్ ఛేంజర్ పేరుకు సార్థకంఈ విషయం తెలిసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ప్రమోషన్స్‌లోనే గేమ్ ఛేంజర్ అని నిరూపించుకున్నారు.. ఇదెక్కడి ప్రమోషన్స్‌రా.. భలే ప్లాన్ చేశారు అంటూ ప్రశంసిస్తున్నారు. ఇకపోతే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 'Mega MASS'ive Event in the USA 🇺🇸 💥The pre-release event of #GameChanger will happen in the USA - the first time ever for an Indian cinema ❤️🔥📍 Curtis Culwell Center, 4999 Naaman Forest Garland TX 75040🗓️ 21st DEC, 6:00 PM ONWARDSSee you soon, America!Event by… pic.twitter.com/rcjVCrDGOX— Game Changer (@GameChangerOffl) November 22, 2024 చదవండి: ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో.. నాగార్జున -
గుడ్‌న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైన హీరోయిన్ సనా ఖాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ముగ్గురం నలుగురం కాబోతున్నామని పేర్కొంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినీ కెరీర్కాగా హీరోయిన్ సనా ఖాన్.. 2005లో యేహై హై సొసైటీ అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్‌రామ్ కత్తి మూవీతో తెలుగులో అరంగేట్రం చేసింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 2019లో తమిళ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. మధ్యలో హిందీ బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. సినిమాలు మానేసిన తర్వాత నవంబర్ 2020 నవంబరులో ముస్లిం మతగురువు, వ్యాపారవేత్త అనాస్ సయ్యద్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో పాపాయి జన్మించింది. View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) చదవండి: క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి -
అలాంటప్పుడే నటీమణులకు గౌరవం పెరుగుతుంది: సుహాసిని
తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే నటీమణులకు తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది అన్న అభిప్రాయం ఇఫీ (భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) సదస్సులో వ్యక్తమైంది. సినీ ఇండస్ట్రీలో మహిళా భద్రత అనే అంశంపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా నటి సుహాసిని మణిరత్నం మాట్లాడుతూ.. సినిమాల్లో ఏదో అలా వచ్చి ఇలా పోయేవి కాకుండా మెరుగైన కీలక పాత్రల కోసం మహిళలు ప్రయత్నించాలన్నారు. భద్రత, గౌరవం కావాలిపరిశ్రమలో వర్క్ ఎథిక్స్ గురించి అవగాహన పెoచాలని పిలుపునిచ్చారు. ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. నటీమణులు వేధింపులకు గురయ్యే అవకాశం లేని సినిమా సెట్లను రూపొందించాలన్నారు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలన్నారు. కుష్బూ సుందర్ మాట్లాడుతూ వినోదంపై దృష్టి సారిస్తూనే, సమానత్వానికి కూడా ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా సినిమాలను రూపొందించాలన్నారు. లింగ వివక్షపై చర్చఅలా ఈ సదస్సులో పని చేసే చోట భద్రత, సమానత్వం, సినిమా పాత్రలపై చర్చించారు. లింగ వివక్ష ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్యానెలిస్ట్‌లు ఏకగ్రీవంగా అంగీకరించారు. మహిళల భద్రతకు సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ప్యానెల్ ముగిసింది. ఇకపోతే భారత్ హై హమ్ పేరిట దూరదర్శన్‌లో ప్రసారం కానున్న యానిమేషన్ సిరీస్ పోస్టర్‌ను నాగార్జున విడుదల చేశారు. ఇసుకలో అద్భుతాలుఅలాగే ప్రఖ్యాత ఆర్టిస్ట్ సుందరం పట్నాయక్.. గోవాలోని మెరామర్ బీచ్‌లో అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హాల సైకత శిల్పాలను తయారు చేశాడు. కాగా నవంబర్ 20న.. 55వ ఇఫీ ( భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం) వేడుకలు గోవాలో మొదలయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ ఈ నెల 28 వరకు జరగనున్నాయి. -
బర్త్ డే మూడ్‌లో బుల్లితెర బ్యూటీ.. బ్లాక్ డ్రెస్‌లో రామ్ చరణ్ హీరోయిన్!
బర్త్ డే మూడ్‌లో బుల్లితెర బ్యూటీ తేజస్విని గౌడ..బ్లాక్ బ్యూటీలా ఎవడు హీరోయిన్ అమీ జాక్సన్..చిల్ అవుతోన్న హీరోయిన్ హన్సిక.. గ్రీన్ డ్రెస్‌లో విష్ణుప్రియ లేటేస్ట్ లుక్స్ View this post on Instagram A post shared by Ritesh Deshmukh - रितेश विलासराव देशमुख (@riteish) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Amy Jackson Westwick (@iamamyjackson) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
అలా చేస్తే సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు: పూరి జగన్నాధ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకులను అలరించాడు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో బిగ్‌బుల్‌గా కనిపించారు.సినిమాల విషయం పక్కనపెడితే.. దర్శకుడు పూరి మ్యూజింగ్స్ పేరుతో మోటివేషనల్ సందేశాలు ఇస్తుంటారు. జీవితంలో తను అనుభవాలతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి వాటిని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన మరో గొప్ప సందేశాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటారు. అదేంటో మనం కూడా వినేద్దాం.పూరి మ్యూజింగ్‌లో మాట్లాడుతూ..' చైనాలో లావోజు అనే గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన 571 బీసీలో జన్మించారు. ఆయనొక మంచి మాట చెప్పారు. నీ ఆలోచనలను గమనించు. ఎందుకంటే అవే నీ మాటలవుతాయి. నీ మాటలే నీ యాక్షన్స్ అవుతాయి. అవే నీ అలవాట్లు.. ఆ తర్వాత అదే నీ క్యారెక్టర్ అవుతుంది. మరి మనకు థాట్స్ ఎలా వస్తాయి. మనం రోజు దేన్నైతే చూస్తామో అవే గుర్తుకొస్తాయి. చదివే పుస్తకాలు, చూసే వీడియోలు, సంభాషణలన్నీ మన ఆలోచనలు మార్చేస్తాయి. పనికిరానివన్నీ చూస్తూ టైమ్ పాస్ చేస్తే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు. ' అని అన్నారు.ఆ తర్వాత..' మనం మొబైల్లో రోజు ఎన్నో చూస్తుంటాం. రోడ్డెక్కితే ఏదో ఒకటి మనం చూస్తుంటాం. వీటిలో మనం దేనికైనా ఎమోషనల్ అయితే.. అందులోనే మనం కొట్టుకుపోతాం. రోజు నాలెడ్జ్ పెంచుకోకపోయినా ఫర్వాలేదు.. నాన్ సెన్స్ తీసుకోకపోతే చాలు. అందుకే మంచిది, మనకు పనికొచ్చేది మాత్రమే తీసుకుంటే మంచిది. అప్పుడే మన థాట్స్ మారతాయి. మన క్యారెక్టర్‌తో పాటు రాత కూడా మారుద్ది. ' అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మన పూరి జగన్నాధ్ చెప్పినవి జీవితంలో పాటిస్తే సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా పాటించాల్సిందే. -
మళ్ళీ వాయిదా పడిన పుష్ప 2..?
-
తండ్రికున్న చరిష్మా ఈమెకెక్కడిది?.. షారూఖ్ కూతురిపై ట్రోలింగ్
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఈజీగా రాణించొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు! ఎంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటారు. పైగా వారి అంచనాలు కూడా ఆకాశాన్నంటేలా ఉంటాయి. వాటిని అందుకోవడానికి సెలబ్రిటీ కిడ్స్ మరింత కష్టపడాల్సి ఉంటుంది.ఆదిలోనే ట్రోలింగ్ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ కాన్ కూతురు సుహానా గతేడాది 'ద ఆర్చీస్' అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తను పోషించిన వెరోనికా పాత్రకు గానూ విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా సుహానా ఓ సెల్‌ఫోన్ యాడ్‌లో నటించింది. ఇందులో ఆమె ఓ డైలాగ్ చెప్పి తర్వాత వచ్చే మ్యూజిక్కు స్టెప్పులేస్తుంటుంది. ఇప్పుడు మరోసారిఈ యాడ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగానే నెటిజన్లు ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తండ్రికున్న చరిష్మా కూతురికి లేదని విమర్శిస్తున్నారు. 'తన స్క్రీన్ ప్రెసెన్సే నెగెటివ్‌గా అనిపిస్తోంది, 10 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆ యాడ్ చూడలేకపోతున్నా..', 'తను సైడ్ క్యారెక్టర్లకే పనికొస్తుంది తప్ప ప్రధాన పాత్రలకు కాదు' అని హేళన చేస్తున్నారు. అందరి నోళ్లు మూయిస్తుంది!కొందరు మాత్రం తన హెయిర్ స్టైల్ బాగోలేదని, డైరెక్షన్ కూడా సెట్టవలేదని.. అందుకు పూర్తిగా సుహానాదే తప్పని నిందించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సుహానా ప్రస్తుతం తన తండ్రితో కలిసి కింగ్ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీతో అయినా తనను విమర్శించేవారి నోళ్లు మూయిస్తుందేమో చూడాలి!చదవండి: క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి -
ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు డాల్బీ విజన్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో జర్మనీకి వెళ్లారని అన్నారు. అక్కడే సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారని నాగ్ వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న నాగార్జున సినిమా, థియేటర్ టెక్నాలజీపై మాట్లాడారు.మొట్ట మొదటిసారి ఈ సదుపాయాన్నిఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నామని నాగార్జున తెలిపారు. మనదేశంలో తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్ సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా.. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ-2024 ఈవెంట్ ఈనెల 28 వరకు కొనసాగనుంది. -
కుమారుడి బర్త్ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్గా నటించింది. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సుధీర్ బాబు తన కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆయన కుమారుడు చరిత్ మానస్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఈ రోజు నాకు ప్రత్యేకమంటూ కుమారుడిపై ప్రేమను చాటుకున్నారు. చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా, సోదరి మంజుల కూడా సందడి చేశారు.కాగా.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని బర్త్ డే వేడుకల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసింది. On your special day, I want you to know how much I love and cherish you. You're growing up to be an incredible individual! Happy birthday, cherry ❤️ @Just_Charith pic.twitter.com/7HGrRdno55— Sudheer Babu (@isudheerbabu) November 22, 2024 -
కిల్లర్‌తో వస్తోన్న టాలీవుడ్ డైరెక్టర్.. ఆసక్తిగా పోస్టర్స్!
శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ లాంటి డిఫరెంట్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ సుక్కు పూర్వాజ్. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో కిల్లర్ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ కీలక పాత్రలో కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే కిల్లర్ మూవీపై అంచనాలు పెంచేస్తున్నాయి. పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్‌తో కనిపిస్తోన్న ఈ పోస్టర్స్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమానుఏయు అండ్ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో థింక్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Venkata Suresh Kumar Kuppili (@poorvaaj) -
'జీబ్రా' సినిమా రివ్యూ
యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన ధనంజయ, 'బాహుబలి' సత్యరాజ్, సత్య, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌తోనే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా (నవంబర్ 22) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?షేర్ మార్కెట్, స్కామ్ అనగానే చాలామందికి 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. లేదంటే మొన్నీమధ్యనే తెలుగులో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి, దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' అద్భుతమైన హిట్. మరీ ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్‌తోనే తీసిన మూవీ 'జీబ్రా'. అందులో డబ్బు కొట్టేసి హీరో ఎవరికీ దొరకడు. ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు. కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్‌కి దొరికిపోతాడు.హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది. సూర్య, అతడి తల్లి, అతడి ప్రేయసి స్వాతి.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోతాం. కాసేపటికే తనకో సమస్య వచ్చిందని స్వాతి.. హీరో సాయం కోరుతుంది. మనోడుతో చాలా తెలివితో బ్యాంకులో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు. కానీ ఇక్కడే ఊహించని సమస్య మరొకటి వస్తుంది. రూ.4 లక్షలతో స్కామ్ చేస్తే రూ.5 కోట్ల కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది. ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలీ.. పెద్ద పెద్ద గుండాలనే శాసించే ఇతడికి రూ.5 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు 4 రోజులు పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.కథ పరంగా ఇది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంక్ సిస్టమ్‌లోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు. సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం, దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్కో దాన్ని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్‌గా ఉంది.చెస్‌లో మంత్రి, గుర్రం, ఏనుగు, భటులు ఇలా చాలా ఉంటాయి. ఈ సినిమాలో చెస్ గేమ్‌లా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మెటాఫర్స్, డ్రస్సు కలర్స్ మీరు సినిమాలో చూడొచ్చు. అన్నీ ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుక్కి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇది కాస్త ల్యాగ్, రొటీన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్‌ని కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?సూర్య పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్లో కనిపిస్తాయి. డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్‌గా చేసిన ధనంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతడి పాత్ర బాగుందనిపిస్తుంది. సత్య సిట్చుయేషనల్ కామెడీ సూపర్. డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు. రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల ఇతడి పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది. బాబాగా చేసిన సత్యదేవ్, స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్.. ఎవరికి వాళ్లు పూర్తి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే రైటింగ్‌కి నూటికి 90 మార్కులు వేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు ఇది నచ్చదు. డిఫరెంట్ థ్రిల్లర్స్, అందులోనూ బ్యాంక్ స్కామ్ తరహా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'జీబ్రా' నచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ 'లక్కీ భాస్కర్' రిలీజైన కొన్నిరోజుల తర్వాత థియేటర్లలోకి రావడం దీనికి ఓ రకంగా మైనస్.రేటింగ్: 2.75/5- చందు డొంకాన(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ)