Munna
-
పదహారేళ్లకు తల్లి, కొడుకులను కలిపిన బేకరీ షాప్..
ఆదిలాబాద్: పద్నాలుగేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలుడు పదహారేళ్ల తర్వాత తల్లి చెంతకు చేరాడు. చిన్నతనంలోనే దూరమైన కొడుకు ఇక తమకు దొరకడేమోనని నిత్యం కన్నీటి పర్యంతమైన ఆ తల్లికి ఎదిగిన కొడుకు దరిచేరడంతో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజీపూర్ జిల్లా మహ్మదాబాద్ తహసీల్ పరిధిలోని యూసుఫ్పూర్ గ్రామానికి చెందిన సంత్రదేవి, మున్నాకుమార్ బింద్ దంపతులకు నలుగురు కుమారులు, కూతురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు మహేందర్ బింద్ అలియాస్ మనోజ్‌ను చిన్నతనంలో దగ్గరి బంధువు ముంబయి తీసుకెళ్లి హోటల్లో పనికి కుదిర్చాడు. కొద్ది రోజుల తర్వాత హోటల్లో పని మానేసి వెళ్లిపోయాడు. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ్‌కుమార్ యాదవ్ అనే యువకుడికి తారసపడ్డాడు. తనదీ అదే రాష్ట్రమని, పని కోసం వెతుకుతున్నానని మహేందర్ బింద్ చెప్పడంతో వెంట తీసుకొచ్చి బెల్లంపల్లిలోని బేకరీలో పనికి కుదిర్చాడు. అప్పటి నుంచి ఇక్కడే పని చేస్తుండగా ఓ రోజు ఇంటిపై ధ్యాస మళ్లి బేకరీ యజమాని సుశీల్‌కుమార్ యాదవ్‌కు తన ఇంటి అడ్రస్ కనుక్కోవాలని కోరాడు. దీంతో సుశీల్‌కుమార్ ఆ రాష్ట్రంలోని తన బంధువులకు చెప్పి ఆరా తీశాడు. ఘజీపూర్ జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యూసుఫ్‌పూర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వివరాలు ఇచ్చారు. దీంతో తల్లి సంత్రదేవి, బాబాయ్ కమలేష్బింద్, పిన్నీ బసంత్ బింద్ శుక్రవారం బెల్లంపల్లికి చేరుకున్నారు. ఆపరేషన్ చేసిన గాయం చూసి... కొడుకును వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటొచ్చిన తల్లి అతడిని చూసి ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. కొడుకూ కన్నీటి పర్యంతమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నతనంలో గొంతుకింద చేసిన ఆపరేషన్ గాయాన్ని పరిశీలించి మహేందర్ బింద్ తన కొడుకేనని సంత్రదేవి మురిసిపోయి ముద్దాడింది. కుటుంబసభ్యులను కలిసేలా చేసిన బేకరీ షాప్ యజమాని సుశీల్ కుమార్‌యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్ బింద్ తల్లి, బంధువులతో కలిసి రైలులో ఉత్తరప్రదేశ్‌కు బయల్దేరి వెళ్లాడు. -
నాన్న బాటలోనే మున్నా
సాక్షి, అమరావతి: తండ్రి ఆశయాలకు ఆకర్షితుడైన ఆర్కే కుమారుడు పృథ్వీ (మున్నా) కూడా 16వ ఏటనే (2004 చర్చల అనంతరం) దళంలో చేరాడు. ఏవోబీలో సెక్షన్ కమాండర్‌గా ఎదిగాడు. అయితే 2016 అక్టోబర్ 24న ఏవోబీ రామ్‌గూడాలో పోలీసులు జరిపిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆ ఎన్కౌంటర్ సమయంలో ఆయన తన తండ్రి ఆర్కే అంగరక్షక దళ సభ్యుడిగా ఉన్నారు. అందులో బుల్లెట్ గాయమైన ఆర్కే తప్పించుకోగా.. మున్నా ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మావోయిస్టు కీలక నేత కావడంతో మున్నా బాల్యం అత్యంత నిర్బంధంలో గడిచింది. ఆర్కే ఆచూకీ చెప్పమంటూ ఇంటిపై పోలీసుల దాడులు భయభ్రాంతులకు గురిచేసేవి. ఈ క్రమంలో అతడిని ఒంగోలులో రహస్యంగా చదివించారు. నాన్న కోసం తల్లితో పాటు మున్నా అడవికి వెళ్లినప్పుడల్లా కాంటాక్ట్ దొరకక ఒకోసారి రెండు మూడు నెలలు గిరిజనులతోపాటే అడవిలోనే గడపాల్సి వచ్చేది. అక్కడ తన లాంటి పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసిన మున్నా బాధపడేవాడు. ఒకానోక రోజు మున్నా తన నాన్న ఆర్కేను తల్లితో పాటు అడవిలో కలుసుకున్నాడు. అమ్మతో కొద్ది రోజులు అక్కడే ఉంటానన్నాడు. ఆ కొద్ది రోజులూ చాలా రోజులు అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే మున్నాని ఉద్యమంలోనికి ఆహ్వనించింది ఆర్కేనే అంటారు. తన కొడుకు అందరిలా ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని ఆయన కోరుకోలేదు. తన కొడుకుకు తనలా ప్రపంచ ప్రజలను ప్రేమించడం నేర్పాలని కలలు కన్నాడు. అదే విషయాన్ని భార్యకు ఉత్తరాల్లోనూ రాసేవాడు. మున్నాను మావోయిస్ట్ సైన్యానికే యుద్ధతంత్రాలు నేర్పేంతగా తీర్చిదిద్దాడు. -
మున్నా నేర చరిత్ర.. కేరాఫ్ విజయవాడ
సాక్షి, విజయవాడ: ఒంగోలు జాతీయ రహదారిపై పదమూడేళ్ల క్రితం మారణకాండ సృష్టించిన కేసులో ఉరిశిక్ష పడిన నరహంతక ముఠాలోని ప్రధాన నిందితుడు అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా నేర చరిత్ర విజయవాడలోనే ప్రారంభమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. పదిహేడు సంవత్సరాల కిందట కడప జిల్లా రాజంపేట సమీపంలోని చిట్వేలిలో విస్తరించిన నల్లమల అడవుల్లో గుప్త నిధులున్నాయని నిందితుడు మున్నా కొంతమందిని నమ్మించాడు. వాటిని వెలికి తీస్తామని నమ్మబలికి అనేక మంది వద్ద నుంచి దాదాపు రూ.11 లక్షల వరకు మున్నా గ్యాంగ్ వసూలు చేసింది. మున్నా చేతిలో మోసపోయిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్‌లోని ఓ ఇంట్లో ఉన్న మున్నా, అతని నలుగురు అనుచరుల్ని సత్యనారాయణపురం పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లోనే మున్నా వద్ద మూడు రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు అనంతరం మున్నా అతని ముఠాతో సహా మకాంను విజయవాడ నుంచి గుంటూరుకు మార్చాడు. అక్కడ నల్లమల అడవుల్లో బంగారం తవ్వకాలు అంటూ కొందర్ని మోసం చేశారు. అనంతరం ఒంగోలుకు మకాం మార్చాడు. ఆ జిల్లాలో పోలీసులమని చెప్పి హైవేపై ఇనుముతో వెళుతున్న భారీ లారీలను ఆపి డ్రైవర్, క్లీనర్‌ను దారుణంగా హత్య చేసేవారు. 2008లో నమోదైన ఆ కేసుల్లో.. ఒంగోలు 8వ అదనపు జిల్లా జడ్జి టి.మనోహర్‌రెడ్డి మున్నాతో పాటు మరో 11 మందికి ఉరిశిక్ష వేసిన సంగతి తెలిసిందే. -
శీను ద్వయం..మున్నా గ్యాంగ్‌కు సింహ స్వప్నం
సాక్షి, ఒంగోలు: నేషనల్ హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను హతమార్చిన గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు మున్నాతో సహా 18 మందికి సోమవారం ఒంగోలు 8వ అదనపు జిల్లా కోర్టు జడ్జి మనోహర్‌రెడ్డి శిక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు రావడం వెనుక కానిస్టేబుళ్లు వై.శ్రీనివాసరావు, బీఎస్ శ్రీనివాస్ కృషి ప్రశంసనీయం. మున్నా గ్యాంగ్‌కు శిక్ష పడిందని తెలియగానే బాధిత కుటుంబాలే కాదు.. ప్రస్తుతం పనిచేస్తున్న, రిటైరైన అధికారులు, పలువురు న్యాయవాదులు శీను ద్వయాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఒంగోలుకు చెందిన వై.శ్రీనివాసరావు, బీఎస్ శ్రీనివాస్ 1993లో కానిస్టేబుళ్లుగా ఎంపికై తొలుత పొన్నలూరు పోలీసుస్టేషన్లో విధుల్లో చేరారు. 2008లో మున్నా కేసు వెలుగుచూసినపుడు వై.శ్రీనివాసులు అలియాస్ వాసు మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీ దర్యాప్తు చేయడం, మరో వైపు సింగరాయకొండ కేసులో సాక్షులను ప్రవేశపెట్టాల్సి రావడంతో కానిస్టేబుల్ వాసును అప్పటి ఎస్పీ సీఎస్‌ఆర్‌కేఎల్‌ఎన్ రాజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద లైజన్ ఆఫీసర్‌గా నియమించారు. అతనికి తోడుగా బీఎస్ శ్రీనివాస్‌ను పంపారు. మున్నా గ్యాంగ్‌పై నమోదైన నాలుగు కేసుల్లో సాక్షులకు సమన్లు పంపడం, వారు తప్పనిసరిగా కోర్టుకు హాజరయ్యేలా చూడడం, వారి భద్రతకు ఉన్నతాధికారులతో భరోసా ఇప్పించడంలో ఇద్దరూ సఫలీకృతులయ్యారు. చదవండి: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు; 12 మందికి ఉరి శిక్ష ఆఫర్లు.. బెదిరింపులు.. ఒంగోలు సబ్ జైల్లో ఉంటున్న మున్నా గ్యాంగ్‌తో సఖ్యంగా ఉంటూ అవసరమైన సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేవారు. ఈ క్రమంలో ‘సాక్షులను తీసుకురావడం, వారికి నచ్చజెప్పడం మీకు అనవసరం. మీరు ఆ పని ఆపితే అర కోటి ఇస్తాం’ అంటూ మున్నాతోపాటు అతని బావమరిది హిదయతుల్లా అలియాస్ బాబులు ఆఫర్ చేయగా ఇద్దరూ తిరస్కరించారు. దీంతో వారిద్దరిపై మున్నా అనుచరులు ఆటోతో ఎటాక్ చేయగా తృటిలో తప్పించుకున్నారు. బిహార్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ఘర్, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి బాధిత కుటుంబాలు సాక్ష్యం చెప్పేందుకు రప్పించడం, మృతదేహాలు లభించిన స్థలంలో చూసిన సాక్షులను కోర్టులో హాజరుపరచడంలో వీరిద్దరూ కృషి చేశారు. ఏదో ఒక విధంగా బెయిల్‌పై బయటకు రావాలని మున్నా గ్యాంగ్ కుటిల యత్నాలు చేయగా వాసు, శ్రీనివాస్ అడ్డుతగిలారు. దీంతో ఒక దశలో ‘మా మాట వింటే లక్షాధికారులు అవుతారు.. కాదంటే మీ అంతుచూస్తాం’ అని మున్నా గ్యాంగ్ హెచ్చరించినా వెరవలేదు. ఈ క్రమంలో అప్పటి జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి ఏఆర్ సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు అందించి నిఘా పెంచడంతో మున్నా గ్యాంగ్ ఆగడాలు తగ్గుముఖం పట్టాయి. నిత్యం సైకిల్‌పై కోర్టుకు వెళ్లి వస్తున్న వాసుకు వెపన్ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించగా వాసు సున్నితంగా తిరస్కరించారు. దీంతో మాలకొండయ్య అనే మరో హెడ్ కానిస్టేబుల్‌ను భద్రత కోసం ప్రత్యేకంగా అప్పటి ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ నియమించారు. ఉన్నతాధికారుల అండదండలు మున్నా గ్యాంగ్‌ను కలిసేందుకు వచ్చే పాత నేరస్తులపై దృష్టి పెట్టడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో అప్పటి ఎస్పీ నవీన్‌చంద్ మొదలు ప్రస్తుత ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వరకు లైజన్ ఆఫీసర్లను మార్చే ప్రయత్నం చేయలేదు. ఇదిలా ఉండగా కిల్లర్ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసిన సమయంలో ఉన్న పలువురు ఆఫీసర్లు రిటైరయ్యారు. మరికొందరు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నారు. వీరందరికీ కేసుల స్థితిగతులను వివరించడంతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు చేదోడువాదోడుగా ఉంటూ మున్నా గ్యాంగ్‌కు కఠిన శిక్ష పడేలా చేశారు. అందుకే అందరినీ హడలెత్తించిన మున్నా గ్యాంగ్‌కు వై.శ్రీనివాసరావు, బీఎస్ శ్రీనివాస్ పేరు వింటే ముచ్చెమటలు పట్టేవి. -
ఒంగోలు కోర్టు సంచలన తీర్పు; 12 మందికి ఉరి శిక్ష
ఒంగోలు: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు 8వ అదనపు జిల్లా జడ్జి జి.మనోహర్‌రెడ్డి సోమవారం తీర్పు చెప్పారు. నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి పదేళ్లు, మరొకరికి ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. 2008లో అప్పటి 5వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన దారుణ హత్యలపై ఒకేసారి 12 మందికి ఉరిశిక్ష విధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ గ్యాంగ్ దారుణాలకు సంబంధించి 4 కేసుల్లో మొత్తం 20 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్లు దాఖలు చేశారు. వీటిలో ఒక కేసును సీఐడీ దర్యాప్తు చేయగా 3 కేసుల్ని పోలీసులు దర్యాప్తు చేశారు. సీఐడీ దర్యాప్తు చేసిన కేసులో 17 మంది నిందితులకుగాను బెంగళూరుకు చెందిన హలీంసేట్, షౌకత్ పరారీలో ఉన్నారు. మొత్తం 4 కేసుల్లో 20 మంది నిందితులకుగాను ఇద్దరు పరారీలో ఉండగా మిగిలిన 18 మందికి శిక్షలు విధించారు. జరిగింది ఇదీ.. ఈ ముఠా సభ్యులు పోలీసులమని చెప్పుకొంటూ హైవేపై ఇనుముతో వెళుతున్న పెద్ద లారీలను ఆపి తనిఖీల పేరుతో డ్రైవర్, క్లీనర్లతో మాట్లాడుతున్నట్లు నటించి వారి గొంతులకు తాళ్లు బిగించి దారుణంగా హత్య చేసేవారు. మృతదేహాలను గోతాలలో కుక్కి కాలువలు, వాగుల వెంబడి కట్టల్లో పూడ్చిపెట్టేవారు. లారీలోని ఇనుముతోపాటు, లారీలను సైతం ముక్కలు చేసి పాత ఇనుముకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. 2008లో జరిగిన ఈ సంఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాల్ సుబ్రమణి అదృశ్యం అయ్యారు. వారు ఒంగోలు వరకు యజమాని వీరప్పన్ కుప్పుస్వామికి ఫోన్ టచ్‌లో ఉన్నారు. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లేకపోవడంతో ఆయన ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ట్రైనీ డీఎస్పీ, ప్రస్తుత పీటీసీ ప్రిన్సిపాల్ ఏఆర్ దామోదర్ ప్రాథమిక విచారణలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్, క్లీనర్లను ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద హత్యచేసి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గుండ్లకమ్మ కాలువకట్టలో పూడ్చిపెట్టినట్లు తేలింది. ఛత్తీస్‌ఘడ్ నుంచి కాంచీపురం వెళుతున్న మరో లారీని తెట్టు వద్ద ఆపి డ్రైవర్ భూషణ్‌యాదవ్, క్లీనర్ చందన్‌కుమార్ మెహతోలను చంపేసి మన్నేరు వాగులో పూడ్చిపెట్టారు. తమిళనాడులోని గుమ్మడిపూడి నుంచి కాకినాడ వెళుతున్న మరో లారీని ఏడుగుండ్లపాడు వద్ద ఆపి డ్రైవర్ గూడూరి శ్యాంబాబు, క్లీనర్ గుత్తుల వినోద్‌కుమార్ (పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల వాసులు)లను చంపి నాగులుప్పలపాడు మండలం చదలవాడ గుండ్లకమ్మ ఒడ్డున పూడ్చివేశారు. నాగాలాండ్‌కు చెందిన మరో లారీ డ్రైవర్‌ను దారుణంగా హత్యచేసి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు చప్టా వద్ద పూడ్చిపెట్టారు. ఇక మున్నా వద్ద ఉన్న కార్బన్ మెషీన్గన్కు సంబంధించి నలుగురిపై ఆయుధాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఉరిశిక్షతోపాటు మరికొన్ని శిక్షలు పడినవారు మొహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా, షేక్ రియాజ్ (ఒంగోలు), సయ్యద్ హిదయతుల్లా అలియాస్ బాబు (దొనకొండ మండలం వీరవెంకటాపురం), మొహమ్మద్ జమాలుద్దీన్ అలియాస్ జమాల్ (బెంగళూరు), బత్తల సాల్మన్ (మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు), యేపూరి చినవీరాస్వామి, యేపూరి పెదవీరాస్వామి (గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం రెడ్డిపాలెం), గుండు భానుప్రకాష్ అలియాస్ గజని, రాచమళ్ల సంపత్, గుండెబోయిన శ్రీధర్ (తెలంగాణలోని వరంగల్ జిల్లా హనుమకొండ మండలం కొత్తసాయంపేట), షేక్ హఫీజ్ (ఒంగోలు జయరాం థియేటర్ ప్రాంతం), షేక్ దాదాపీర్ అలియాస్ ఘని (అనంతపురం జిల్లా హిందూపూరం మోడరన్ కాలనీ). యావజ్జీవశిక్షతోపాటు మరికొన్ని శిక్షలు పడినవారు ఆర్ల గంగాధర్ (వై.పాలెం మాజీ ఇన్చార్జి ఎంపీడీవో, ఒంగోలు సుజాతానగర్ నివాసి), షేక్ కమాల్‌సాహెబ్ అలియాస్ కమాల్ (తులసీరాం థియేటర్ ఎదురు ప్రాంతవాసి), షేక్ రహంతుల్లా (ఒంగోలు ఇస్లాంపేట), షేక్ ఇర్ఫాన్ (ఒంగోలు గానుగపాలెం). మిగిలిన శిక్షలు: ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ రఫీకి ఒక కేసులో ఏడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా, గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు వాసి పట్రా గాలెయ్యకు ఆయుధాల చట్టం ప్రకారం నమోదైన కేసులో పదేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా. రివార్డులకు సిఫారసు జాతీయ రహదారిపై దోపిడీ, హత్యలకు సంబంధించి ఒంగోలు తాలూకా పోలీసులు నమోదు చేసిన ఒక కేసును సీఐడీ దర్యాప్తు చేసిందని సీఐడీ ప్రాంతీయ కార్యాలయ అదనపు ఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో మున్నాతో పాటు 10 మందికి ఉరిశిక్ష, ఐదుగురికి జీవిత ఖైదు పడినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 2010లో సీఐడీ డీఎస్పీ రఘు చార్జిషీటును దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరఫున శివరామకృష్ణప్రసాద్ వాదనలు వినిపించారని తెలిపారు. కేసు విజయవంతంగా పరిష్కారమయ్యేందుకు కృషిచేసిన అందరికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టేకప్ చేసిన తొలికేసులోనే మంచి తీర్పువచ్చింది ట్రైనీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ లారీ మిస్సింగ్ కేసు వచ్చింది. తొలుత అనేక అనుమానాలు వెన్నాడాయి. లారీ బయలుదేరిన ప్రాంతం నుంచి టోల్గేట్ల వద్ద సమాచారం సేకరించాం. చివరగా లారీ యజమానితో మాట్లాడిన వివరాలు, లారీ డ్రైవర్ , క్లీనర్లకు సంబంధించిన సమాచారం సేకరించాం. ఈ దశలోనే మాకు పాత ఇనుపకొట్ల వారిపై అనుమానం ఏర్పడింది. అదే కేసు ఛేదించేందుకు అనువుగా మారింది. – ఏఆర్ దామోదర్, అప్పటి ట్రైనీ డీఎస్పీ, ప్రస్తుతం ఒంగోలు పీటీసీ ప్రిన్సిపాల్ దర్యాప్తులో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం దర్యాప్తు సందర్భంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సిమ్ కార్డులను ఇష్టం వచ్చినట్లు మారుస్తుండడంతో వారిని అరెస్టు చేసేందుకు వెళ్లినవారు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. చివరకు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే బయటపడిన విషయాలతో విస్తుపోవాల్సి వచ్చింది. ఎక్కడెక్కడ చంపారు, శవాలను ఎక్కడ పూడ్చారనే వివరాలను వెల్లడించారు. కానీ ఆ శవాలను వారు బయటకు తీస్తున్నపుడు శవాలకు బదులుగా అస్తిపంజరాలను చూడడంతో తీవ్రంగా కలత చెందాం. – టి.శంకరరెడ్డి, అప్పటి టౌన్ డీఎస్పీ, రిటైర్డ్ అదనపు ఎస్పీ -
ప్రకాశం: హైవే కిల్లర్ మున్నాకు ఉరిశిక్ష
-
హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్‌కు రేపే శిక్ష ఖరారు
ఒంగోలు: హైవే కిల్లర్ మున్నా.. ఈ పేరు వింటేనే ఒంగోలు ఉలిక్కిపడుతుంది. లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా చంపి గోతాల్లో కుక్కి వాగుల వద్ద పూడ్చిపెట్టిన ఘటనలు ఒళ్లు జలదరింపజేస్తాయి. 2008లో వెలుగు చూసిన 4 కేసుల్లో 18 మందిపై నేరం నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో 8వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.మనోహరరెడ్డి ఈ నెల 20న తీర్పు వెలువరించనున్నారని జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.శివరామకృష్ణ ప్రసాద్ తెలిపారు. నేరస్తులను మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు పటిష్ట బందోబస్తు నడుమ జిల్లా జైలుకు తరలించారు. నేరాలు వెలుగులోకి వచ్చాయిలా.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారంటూ 2008 అక్టోబర్ 17న లారీ యజమాని వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై నిఘా పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా కోసం గాలింపు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు యత్నించిన మున్నాను కర్ణాటకలోని ఒక మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో అరెస్టు చేసి ఒంగోలుకు తీసుకువచ్చారు. నాలుగు ఘటనల్లో ఏడుగురి హత్య మున్నా గ్యాంగ్ పోలీసు వేషాలు ధరించి హైవేపై వచ్చీపోయే వాహనాలను నిలుపుదల చేసేవారు. మున్నాకు సెక్యూరిటీగా మెషిన్ ధరించిన వ్యక్తి కూడా ఉండటంతో ఎవరో పెద్ద అధికారి వచ్చారనుకుని డ్రైవర్లు లారీలను ఆపేవారు. గ్యాంగ్ సభ్యులు చెకింగ్ పేరుతో లారీలోకి డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు బిగించి అతి కిరాతకంగా హతమార్చేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేసినట్టు నిరూపణ అయ్యింది. తమిళనాడు లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాళ్ సుబ్రమణిలను ఉలవపాడు సమీపంలో హత్యచేసి అందులోని 21.7 టన్నుల ఇనుమును గుంటూరులోని ఒక ప్రముఖ వ్యాపారికి విక్రయించారు. డ్రైవర్, క్లీనర్ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు. మరో ఘటనలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ ఉల్లా నుంచి కాంచీపురానికి ఇనుప లోడును తీసుకెళుతుండగా.. తెట్టువద్ద ఆపి డ్రైవర్ భూషణ్‌యాదవ్, క్లీనర్ చందన్ కుమార్ మెహతోలను చంపి శవాలను మన్నేరు వాగు వద్ద పూడ్చిపెట్టారు. ఇంకో ఘటనలో తమిళనాడులోని గుమ్మడిపూడి నుంచి కాకినాడకు ఇనుప యాంగ్యులర్‌లతో బయల్దేరిన లారీని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నిమ్రా కాలేజీ వద్ద ఆపి డ్రైవర్లు గూడూరి శ్యాంబాబు, గుత్తుల వినోద్‌కుమార్‌లను దారుణంగా హత్యచేసి శవాలను నాగులుప్పలపాడు మండలం చదలవాడ గుండ్లకమ్మ ఒడ్డున పూడ్చిపెట్టారు. నాగాలాండ్‌కు చెందిన లారీని కూడా ఇదేవిధంగా ఆపి డ్రైవర్‌ను హతమార్చి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామంలోని గుండ్లకమ్మ ఒడ్డున చిల్లచెట్లలో పూడ్చిపెట్టారు. మాయమైన లారీలు మద్దిపాడు మండలం సీతారామపురం కొష్టాలు వద్ద లీజుకు తీసుకున్న టుబాకోస్ వెనుక గోడౌన్లో ముక్కలు చేసినట్టు గుర్తించారు. ముఠా నాయకుడు మున్నాపై కడప, నల్గొండ, తెనాలి, విజయవాడ, బెంగళూరు, ప్రకాశం జిల్లాతోపాటు అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. -
మా సినిమాని కుటుంబమంతా కలసి చూడొచ్చు
‘‘నేనీ స్థాయికి రావడానికి పదేళ్లు పట్టింది. నా మీద నమ్మకంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు మున్నా. నా మొదటి సినిమాకే అంత మంచి ప్యాషన్ ఉన్న నిర్మాత బాబుగారు దొరకడం నా అదృష్టం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అని ప్రదీప్ మాచిరాజు అన్నారు. ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ నీలి నీలి ఆకాశం..’ పాట ఒక ఏడాదంతా వినేలా చేసిందంటే మామూలు విషయం కాదు. పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ కావాలి’’ అన్నారు. ‘‘నా ‘పటాస్’ సినిమాని యస్వీ బాబుగారు కన్నడలో రిలీజ్ చేశారు. ఆయన తెలుగులో నిర్మించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సూపర్ హిట్ అవ్వాలి’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘అనూప్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రదీప్ మంచి హీరోగా స్థిరపడాలని కోరుకుంటున్నా’’ అన్నారు హీరో కార్తికేయ. ‘‘మా సినిమాకి ఓటీటీ రిలీజ్‌కి ఆఫర్స్ వచ్చినా మా కష్టాన్ని గుర్తించిన బాబుగారు థియేటర్స్‌లోనే విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషం’’ అన్నారు ఫణి ప్రదీప్. ‘‘ఒక మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది. మా సినిమాని సక్సెస్ చేయాలి’’ అన్నారు చిత్రనిర్మాత ఎస్వీ బాబు. ‘‘నీలి నీలి ఆకాశం..’ పాట ఎంతలా హిట్ అయిందో అంతకంటే గొప్పగా సినిమా ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. అనంతరం నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్లాటినమ్ డిస్క్‌లను అందించారు. ఈ కార్యక్రమంలో అమృతా అయ్యర్, హీరో అడవి శేష్, నిర్మాత సి. కల్యాణ్, కెమెరామాన్ శివేంద్ర, సింగర్స్ సునీత, సిద్ శ్రీరామ్, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ పాల్గొన్నారు. -
మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!
రెబల్‌స్టార్ ప్రభాస్, గోవా బ్యూటీ ఇలియానా జంటగా వచ్చిన చిత్రం ‘మున్నా’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజ్ నిర్మించారు. హారిస్ జయరాజ్ అందించిన పాటలు సూపర్‌డూపర్ హిట్ సాధించడం, ఫస్ట్ లుక్ పోస్టర్లలో ప్రభాస్ లుక్ కొత్తగా డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. అయితే అభిమానుల అంచనాలను ‘మున్నా’ అందుకోలేకపోయాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ స్టైలీష్ లుక్‌ను, ఇలియానా అందచందాలను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ చిత్రం విడుదలై నేటికి పదమూడేళ్లయింది. అప్పటితో పోలిస్తే ప్రభాస్ క్రేజ్ వెయ్యింతలు అయింది. దీంతో మరోసారి ఆ సినిమా ముచ్చట్లు సోషల్‌మీడియాలో మారుమోగిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం ట్విటర్లో ‘#13yearsformunna’ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. చదవండి: ‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’ ట్రెండింగ్ టిక్‌టాక్‌లో శృతిహాసన్, అక్షర హాసన్ -
యూత్‌కి థ్రిల్
కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన మా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం’’ అన్నారు. బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ, వాసు తదితరులు నటించిన ఈ సినిమాకి సహ నిర్మాత: లలితకుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి. -
ఇంజినీరింగ్ నేపథ్యంలో...
కార్తీక్ ఆనంద్, షాలినీ, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ఇది. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. టీజర్ విడుదలైన కొద్ది సేపటికే మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘త్వరలోనే మా చిత్రాన్ని ట్రైలర్‌ని రిలీజ్ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని ప్రశాంత్ తాత అన్నారు. అపూర్వ, బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి. -
లవ్ థ్రిల్లర్
కార్తీక్ ఆనంద్, షాలినీ, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత నిర్మించారు. లలితకుమారి బొడ్డుచర్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో లవ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతో ఇంటెన్సివ్‌గా ఉండి, సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్, రాకెట్ రాఘవ తదితరులు నటించిన ఆ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, లైన్ ప్రొడ్యూసర్: బి.ఆర్.ఎస్.టి.సాయి. -
తూర్పు గదిలో...
మున్నా, ప్రియాంక ఆగస్టిన్ జంటగా శ్రీనివాస్ మరియు సుధీర్ నిర్మాణంలో శరగడం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రోషిని కేరాఫ్ తూర్పు గది’. ఈ చిత్రం ఆడియో లాంచ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ మధ్యకాలంలో కథా బలం ఉన్న సినిమాలే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మంచి కథలతో సినిమా రూపొందిస్తే కచ్చితంగా సక్సెస్ సాధించవచ్చు. ఇండస్ట్రీలో ఎంప్లాయిమెంట్ చిన్న సినిమాల వల్లే జరుగుతుంది’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘చాలా ఏళ్లుగా ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్నాను. సినిమా మేకింగ్‌లో టీమ్ అందరూ చాలా మంచి సహకారం అందించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నా, ప్రియాంక, సుధీర్, ముత్యాల రాందాస్, జేవీ మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నమ్మితే నట్టేట ముంచాడు
పెర్కిట్(ఆర్మూర్): సుమారు 20ఏళ్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నగల తయారీ కోసం ఆర్డరు ఇచ్చిన బంగారంతో రాత్రికే రాత్రి బిచాన ఎత్తేశాడు ఆర్మూర్‌లో స్థిర పడ్డ భూపాల్ మన్నా అనే నగల తయారీదారుడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన భూపాల్ మన్నా 20ఏళ్ల క్రితం ఆర్మూర్‌కు కుటుంబంతో వలస వచ్చాడు. అనంతరం ఇక్కడి బంగారు వర్తకులు, సామాన్య ప్రజల విశ్వాసం పొందుతూ నగల తయారీ వ్యాపారం చేపట్టాడు. ఆర్మూర్ ప్రాంతంతో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాలకు సైతం తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఏజెంట్లను నియమిస్తూ వ్యాపారులు, సామాన్యుల నుంచి బంగారు నగల ఆర్డర్లు తీసుకునేవాడు. ఈ క్రమంలో భూపాల్ మన్నా ఆదివారం రాత్రికి రాత్రే సుమారు రూ.41 లక్షల 60 వేల విలువ గల కిలోన్నర బంగారంతో ఉడాయించాడు. సోమవారం ఆర్డరు ఇచ్చిన నగలను తీసుకెళ్లడానికి వచ్చిన వ్యాపారులకు భాపాల్ దుకాణం మూసి ఉంది. దీంతో ఫోన్ చేసి చూడగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. వారం క్రితం నుంచే ప్రణాళిక భూపాల్ మన్నా బంగారంతో ఉడాయించేందుకు వారం క్రితం నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారం క్రితమే భార్యను ఆర్మూర్ నుంచి పంపిచేశాడు. తన వద్ద ఉన్న 15 మంది నగల తయారీదారులు సైతం ఆదివారం నుంచి కనిపించడం లేదని స్థానికుల సమాచారం. ఈ వ్యాపారంలో భూపాల్ మన్నా బాగానే గడించాడని వ్యాపారంతో సంబంధమున్నవారు తెలిపారు. ఇళ్లల స్థలాలతో పాటు ఇటీవలే నూతనంగా ఒక ఇంటిని ఖరీదు చేసినట్లు సమాచారం. ఈజీ మనీ ఆశలో భూపాల్ అప్పుల పాలైనట్లు సమాచారం. తక్కువ ధరకే బంగారం వచ్చే పలు స్కీముల ఉచ్చులో పడి అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఆర్మూర్ ప్రాంతవాసుల వద్ద వేసిన చీటీలకు సైతం ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు ఒకరొకరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో రెండు కిలోల వరకు బంగారాన్ని భూపాల్ తనతో తీసుకెళ్లి ఉంటాడని వ్యాపారవర్గాల సమాచారం. కూతురు పెళ్లి కోసం.. తన కూతరితో పాటు, బావ మరిది కూతరు వివాహానికి అవసరమయ్యే నగల కోసం 400 గ్రాముల బంగారాన్ని భూపాల్ మన్నాకు ఇచ్చాం. ఈరోజు నగలను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తీరా దుకాణానికి వచ్చే సరికి మూసి ఉంది. నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదు. –లింగన్న, నిర్మల్ న్యాయం చేయాలి... నగల తయారీ కోసం భూపాల్ మన్నాకు 40 తులాల బంగారాన్ని ఇచ్చాం. బంగారం తీసుకుని ఉడాయిస్తాడని అనుకోలేదు. నమ్మక ద్రోహం చేసి భూపాల్‌ను పోలీసులు అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలి. –వెంకటేశ్, డీకంపల్లి, నందిపేట -
హారర్ గదిలో...
మున్నా, ప్రియాంకా శర్మ, మధుశ్రీ, ప్రసన్న వర్మ ముఖ్య తారలుగా శ్రీనివాస్ శరగడం దర్శకత్వంలో ఎస్. శ్రీనివాస్, ఎస్. సుధీర్ నిర్మిస్తున్న సినిమా ‘రోషిణి కేరాఫ్ తూర్పుగది’. సీఐ రంజిత్‌కుమార్‌గా పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో వీరకేశవ నటిస్తున్నారు. ఈ నెల 17 నుంచి పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ మొదలవుతోంది. ‘‘ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది. కీలక పాత్రధారులపై హారర్ సీన్లు చిత్రీకరిస్తున్నాం. వీరకేశవగారి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, సమర్పణ: జీవీకే. -
కేరాఫ్ తూర్పు గది
మున్నా, ప్రియాంక, మధుశ్రీ ముఖ్య తారలుగా శరగడం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రోషిణి కేరాఫ్ తూర్పుగది’. శ్రీవారి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.శ్రీనివాస్, ఎస్.సుధీర్ నిర్మిస్తున్నారు. రాజ్ కిరణ్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘హార్రర్‌తో కూడిన కామెడీ చిత్రమిది. భువనగిరి గౌరీ శంకర్ విలన్‌గా, రంజీత్‌కుమార్ పోలీసాఫీసర్‌గా తమ పాత్రలకు న్యాయం చేస్తున్నారు. పాలకొల్లు, నర్సాపురంలో తర్వాతి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం. రాజ్‌కిరణ్ మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: నండూరి వీరేషం. -
మహల్లో ఏం జరిగింది?
మున్నా, బిందు అశ్విని, ఉమ ముఖ్య పాత్రల్లో సిద్ధార్థ్ కన్నా దర్శకత్వంలో సుధీర్ గుండెపూడి శివ నిర్మిస్తున్న హారర్ మూవీ ‘శాంతాబాయ్’. ప్రచార చిత్రా లను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. శాంతాబాయ్ మహల్లో ఏం జరిగింది? అన్నది సస్పెన్స్’’ అన్నారు. ‘‘శాంతాబాయ్ అనే అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకుని, ఈ చిత్రకథ తయారు చేశా’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: బేబి సుహాన, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వెంకట్. -
హైకోర్టులో ఆర్కే భార్య పిటిషన్
హైదరాబాద్: ఏవోబీలో ఎన్కౌంటర్ తర్వాత కనిపించకుండా పోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే భార్య శిరీష హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే బూటకపు ఎన్కౌంటర్లో మావోయిస్టులను చంపారన్నారు. మరికొందరు పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. తప్పించుకుపోయిన వారిలో అగ్రనేత ఆర్కే కూడా ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారన్నారు. అయితే, ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఆయన భార్య అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై పోలీసులు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆయన్ను విడుదల చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టే అవకాశం ఉంది. కాగా ఈ నెల 24న జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్లో ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఆర్కే బెదిరింపులకు లొంగడు: శిరీష
ఒంగోలు : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మోహరించిన పోలీసు బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని మావోయిస్టు అగ్రనేత ఆర్కే (అక్కిరాజు హరగోపాల్) సతీమణి శిరీష డిమాండ్ చేశారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లతో బెదిరించినంతమాత్రాన ఆర్కే లొంగిపోడని అన్నారు. మల్కన్‌గిరిలో జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని శిరీష ఆరోపించారు. ఇది ప్రభుత్వం చేసిన అతి పెద్ద ఘోరమని, రాత్రి నిద్రిస్తున్న వారిపై దొంగదెబ్బ తీసి పొట్టన పెట్టుకున్నారన్నారు. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే బూటకపు ఎన్కౌంటర్లో అందరిని చంపారని ఆమె అన్నారు. కాగా ఈ నెల 24న జరిగిన ఏవోబీ ఎన్కౌంటర్లో ఆర్కే తనయుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కుమారుడు మృతి బాధ కలిగించినా, పీడిత ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందన్నారు. మున్నా ప్రజల కోసం ప్రాణం సైతం ఇచ్చేందుకు వెనుకాడనని తనకు ఎప్పుడో చెప్పాడని శిరీష అన్నారు. కాగా ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకూ మొత్తం 30మంది మావోయిస్టులు మృతి చెందారు. -
ఆ సమయంలో ఆర్కే అక్కడ లేరు...
మల్కన్‌గిరి : ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కానీ, అరుణ కానీ లేరని, ఆర్కే కుమారుడు మున్నా మాత్రం ఎన్కౌంటర్లో మరణించినట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలిపారు. కూంబింగ్‌కు వెళ్లిన పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ వారు వినకుండా కాల్పులు ప్రారంభించారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు జరపడం వల్ల ఇంతమంది చనిపోయారని చెప్పారు. మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఎన్కౌంటర్లో కొందరు తీవ్రంగా గాయపడి తప్పించుకు పారిపోయారన్నారు. ఒక్కరు కూడా తమకు లొంగిపోలేదని పేర్కొన్నారు. బూటకపు ఎన్కౌంటర్ ఎంతమాత్రం కాదన్నారు. చట్టప్రకారం, ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం మృతదేహాలను 72 గంటల పాటు భద్రపరుస్తామని, మృతుల సంబంధీకులు వస్తే అప్పగిస్తామని చెప్పారు. విజయనగరంలో ఉంటున్న మురళి కుటుంబసభ్యులు మాత్రమే ఇప్పటికవరకు తమను ఫోన్లో సంప్రదించారని, మృతదేహాన్ని తీసుకువెళతామని చెప్పారని తెలిపారు. కాగా ఏవోబీ ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం 28మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
మేడ్చల్‌లో మున్నా దారుణ హత్య
హైదరాబాద్ : మేడ్చల్‌లోని శ్రీ జయదుర్గా హోటల్లో దారుణం చోటు చేసుకుంది. హోటల్లో సప్లైర్‌గా పని చేస్తున్న మున్నా (35) అనే వ్యక్తిని మరో సప్లైర్ రాజ్‌కుమార్ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ పరారయ్యాడు. మిగతా సిబ్బంది వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మున్నా, రాజ్కుమారుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణే ఈ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మున్నా స్వస్థలం మహారాష్ట్ర అని పోలీసులు చెప్పారు. -
ప్రజా సమస్యలపై కౌన్సిలర్ ధర్నా
తాడిపత్రి టౌన్(అనంతపురం): ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్ మున్నా ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బుధవారం నాడు సమస్యల పరిష్కరించాలంటూ ఆయన ధర్నా చేపట్టారు. స్థానిక మూడోవార్డులోని అడ్డువారి వీధిలో నీరు, పారిశుధ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటిని పరిష్కరించాలని మున్సిపల్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి, కమిషనర్ శివరామకృష్ణకు స్థానిక కౌన్సిలర్ మున్నా పలుమార్లు విన్నవించారు. అయితే, ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవటంలేదంటూ స్థానిక కౌన్సిలర్ మున్నా ధర్నాకు దిగారు.సమస్యలను పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ఆయన ప్రకటించారు. సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఆయన ధర్నా సాగిస్తున్న అడ్డువారి వీధికి అధికారులు తరలివెళ్లారు. -
నిద్రమత్తులో యువకుడు మృతి
హైదరాబాద్: నిద్రమత్తులో ప్రమాదవశాత్తూ నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనంపై నుంచి కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఇల్లూర్ గ్రామానికి చెందిన షాహిద్ బాషా అలియాస్ మున్నా(23) బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలోని లోటస్ పాండ్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో సెంట్రింగ్ పనిచేస్తున్నాడు. మంగళవారం అర్దరాత్రి నిర్మాణంలో ఉన్న ఆ భవనం ఐదో అంతస్తుపై పడుకుని నిద్రపోయాడు. కాగా నిద్ర మత్తులో పక్కకు దొర్లడంతో కింద పడిపోయాడు. దాంతో తలకు తీవ్ర గాయాలవడంతో ఈ విషయాన్ని గమనించిన సహచర కూలీలు ఖాజా, రాజులు అతణ్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మున్నా ముఠాలో నలుగురి అరెస్టు
మున్నా ముఠాలో నలుగురి అరెస్టు సాక్షి, ఒంగోలు నర హంతకుడు మున్నా ముఠాలోని నలుగురు సభ్యులను ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాసన్ తన సిబ్బందితో కలిసి నగరంలోని పోతురాజు కాలువ వద్ద గురువారం సాయంత్రం అరెస్టుచేశారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, రెండు కత్తులు, తొమ్మిది తూటాలు స్వాధీనం చేసుకున్నారు. తన చాంబర్లో ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుప్తనిధులు కనుగొని వెలికితీస్తామని చెప్పి మున్నా పలువురి నుంచి పెద్దఎత్తున నగదు వసూలు చేసేవాడు. తిరిగి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తే వారిని హతమార్చేందుకు తన ముఠాసభ్యులను వినియోగించుకునేవాడు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన గంగాధర్‌రెడ్డి, నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీనివాసులు అనే వారిని హత్యచేసేందుకు మున్నా పథకం రచించాడు. ఇంతలో కర్నూలు మూడో పట్టణ ఇన్స్పెక్టర్ వలలో మున్నా చిక్కుకుని జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. అప్పుడు తప్పించుకున్న అతడి ముఠా సభ్యులు మహ్మద్ జమాలుద్దీన్ అలియాస్ జమాల్ (బెంగళూరు), ఎస్కే ఖాదర్‌బాషా అలియాస్ బాబా (ఒంగోలు), తుమ్మల సురేశ్‌బాబు అలియాస్ సురేశ్ (వేమూరు, గుంటూరు జిల్లా), అప్పలస్వామి నాయుడు (వైజాగ్) ల ను ఒంగోలు పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద ఒక 9 ఎంఎం, మరో 7.68 ఎంఎం తుపాకులు, రెండు కత్తులు, తొమ్మిది తూటాలను స్వాధీనం చేసుకున్నారు. మున్నాపై ఇప్పటికే 20 కేసులు ఉన్నాయని, ఒంగోలు రెండో పట్టణ పోలీసుస్టేషన్లో డీసీ (డోషియర్ క్రిమినల్) షీట్ ఉంది. మున్నా, అతని అనుచరులు జిల్లాలో ఇప్పటికే 13 మందిని హత్య చేశారు. ఇనుప లోడ్లతో వెళ్తున్న లారీ లను దారిమళ్లించేవారు. ఇనుము, లారీలను ముక్కలుగా చేసి పా త ఇనుము కింద అమ్మేస్తారు. మున్నా వద్ద మరో తుపాకీ, బెంగళూరుకు చెందిన ఇమ్రాన్ వద్ద రెండు తుపాకులు ఉన్నట్లు తెలి సిందని, వాటి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు. కానిస్టేబుల్ నుంచే తుపాకుల సరఫరా మున్నా, అతని ముఠాకు మోహన్‌కుమార్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తుపాకులు అమ్మేవాడని తమ దర్యాప్తులో తేలినట్లు ఎస్పీ వెల్లడించారు. మోహన్‌కుమార్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాచలంలోని వెంకటాపురం పోలీసుస్టేషన్ గార్డుగా పనిచేస్తున్నాడని తెలిపారు. మోహన్‌కుమార్‌కు పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తి తుపాకులు అందజేసేవాడని చెప్పారు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. తుపాకులను ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి లక్ష రూపాయలకు విక్రయించేవాడని ఎస్పీ వివరించారు. సమావేశంలో ఏఎస్పీ బి.రామానాయక్, నగర డీఎస్పీ పి.జాషువా, తాలూకా సీఐ ఐ.శ్రీనివాసన్, ఎస్ఐలు సమీవుల్లా, రంగనాథ్ పాల్గొన్నారు. -
వీరయోధునికి ఘన నివాళి
యాదగిరి, న్యూస్‌లైన్ : గుల్బర్గాలో ఈనెల 8న జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ మున్నాను మట్టి కరిపించి.. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ మల్లికార్జున బండె కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్లో ఎస్ఐ మల్లికార్జున బండెతో పాటు ఇద్దరు ఏఎస్ఐలు తీవ్రంగా గాయపడిన సంగతి విదితమే. తలలోకి తుపాకీ గుళ్లు దూసుకుపోవడంతో కోమాలోకి వెళ్లిన మల్లికార్జున బండెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది ప్రార్థనలు చేశారు. అయితే మంగళవారం రాత్రి ఆయన మరణ వార్త వెలువడిన వెంటనే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బుధవారం గుల్బర్గాలో అప్రకటిత బంద్ వాతావరణం ఏర్పడింది. యజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు బంద్ చేసి.. బండె మృతికి సంతాపం సూచించారు. హైదరాబాద్-కర్ణాటకలో బీదర్ నుంచి మొదలుకుని గుల్బర్గా, యాదగిరి, రాయచూరుతో పాటు అన్ని చోట్ల పలువురు ప్రముఖులు, సంఘ సంస్థల నుంచి బండె వీర మరణానికి సంతాపం వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తగా గుల్బర్గా నగరంతో పాటు ఆళంద, జేవర్గి పట్టణాల్లో బుధ, గురువారాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తూ గుల్బర్గా ఉపవిభాగం అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్తగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా బండెకు సకాలంలో వైద్య చికిత్సలు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అభిమానులు, కన్నడ సంఘాల కార్యకర్తలు బుధవారం గుల్బర్గాలో టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. నగరంలోని శాస్త్రి సర్కిల్లో గుమికూడిన అభిమానులు గుల్బర్గా ఎస్పీ అమిత్‌సింగ్‌ను ఘెరావ్ చేసి మల్లికార్జున బండె భౌతికకాయాన్ని సత్వరం తెప్పించాలని డిమాండ్ చేశారు.