new song
-
'యుద్ధానికి సిద్ధం' జగనన్న కొత్త పాట..
-
జగనన్న కొత్త పాట..!
-
మరో కొత్త పాటను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ
-
వి లవ్ జగన్... కొత్త పాట రిలీజ్
-
వస్తున్నాడు అదిగో...సీఎం జగన్ కొత్త పాట
-
అభిమానుల కోసం కొత్త పాట ‘సిద్ధం’ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్సీపీ కొత్త ఊపు తీసుకొచ్చింది. అభిమానుల కోసం కొత్త పాట ‘సిద్ధం’ను విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన, విపక్షాల కుట్రలకు ‘సిద్ధం’ పాట అద్ధం పడుతోంది. ప్రస్తుతం ‘సిద్ధం’ పాట సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఇక.. ఇప్పటికే విడుదలైన ‘జగనన్న అజెండా’ పేరుతో విడుదలైన వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాట యువత, వైఎస్సార్సీపీ శ్రేణులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాట వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై విపరీతంగా షేర్ చేస్తున్నారు. ‘‘మీబిడ్డ ఒక్కడే ఒక వైపు ఉన్నాడు.. చెప్పుకోవడానికి ఏమీ లేని వాళ్లంతా ఏకం అవుతున్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి, మీరే సైనికులుగా కదలండి’’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాయిస్‌తో మొదలయ్యే ఈ పాటను నల్లగొండ గద్దర్ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. జగనన్న అజెండా సాంగ్….🎵🎶 Jagananna Agenda Full Song…@ysjagan @JaganannaCNCTS#JaganannaAgenda#YSJagan#YSJaganAgain#YSRCPNewSong#YSJaganNewSong pic.twitter.com/dhD4joKIOZ — YSR Congress Party (@YSRCParty) January 13, 2024 -
సిద్ధం సాంగ్..పూనకాలు లోడింగ్
-
గుంటూరు కారం నుండి రమణ ఎయ్ పాట రిలీజ్
-
దుమ్ములేపుతున్న జగనన్న కొత్త సాంగ్..ఎలక్షన్ 2024
-
'ఫైటర్' నుంచి మరో సాంగ్ రిలీజ్.. వింటుంటే అలా!
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఫైటర్'. వార్, పఠాన్ చిత్రాలతో అలరించిన సిద్ధార్థ్ ఆనంద్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాట విడుదల చేశారు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల గొడవ.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు!) ఇప్పటికే 'ఫైటర్' మూవీ నుంచి టీజర్, సాంగ్స్ విడుదల చేయగా అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అలానే అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా 'హీర్ ఆస్మాని' అని మరో పాటని రిలీజ్ చేశారు. ఎయిర్‌ఫోర్స్ పైలెట్ లుక్‌లో హృతిక్ రోషన్ వావ్ అనిపిస్తున్నాడు. పాట కూడా వినసొంపుగా ఉంది. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా, స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా దీపికా పదుకొనే కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
నేను చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలంటే?
-
శంకర్- రామ్‌చరణ్ సినిమా; పది కోట్ల పాట?
దర్శకుడు శంకర్ సినిమాల్లో సాంగ్స్ విజువల్స్ పరంగా, లొకేషన్స్ పరంగా చాలా గ్రాండియర్‌గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ మరో గ్రాండియర్ సాంగ్‌ను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే శంకర్ పది కోట్ల బడ్జెట్‌తో పాట ప్లాన్ చేశారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ న్యూజిల్యాండ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ఈ నెల 20 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతుందట. హీరో రామ్‌చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలపై గ్రాండ్‌గా డ్యూయట్ సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ పాటకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైనే బడ్జెట్‌ను కేటాయించారట. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చుతారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతదర్శకుడు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'మురారి వా' సాంగ్ వచ్చేసిందిగా..
Mahesh Babu Sarkaru Vaari Paata Murari Vaa Song Released: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆడియెన్స్ మళ్లీ మళ్లీ చూసేలా, మరింత చేరువయ్యేలా 'మురారి వా' అనే సాంగ్‌ను యాడ్ చేసింది చిత్రబృందం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ పాటను రిలీజ్ చేసింది. ఈ పాటలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ కాస్ట్యూమ్స్, డ్యాన్స్, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మహేశ్, కీర్తి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అంతేకాకుండా కీర్తి సురేశ్‌ను చాలా గ్లామరస్‌గా చూపించారు. ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించగా శ్రుతి రంజని, ఎంఎల్ గాయత్రి, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. -
అరబిక్ కుత్తు ఎన్టీఆర్ వర్షన్
-
ప్రేమికుల దినోత్సవం కానుకగా లవ్ సాంగ్ రిలీజ్
-
గంగూబాయి నుంచి న్యూ వీడియో సాంగ్ రిలీజ్
-
స్టాండప్ కమెడియన్ ప్రేమలో పడితే..
రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్ రాహుల్’. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. ‘పద..’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటను హీరోయిన్ రష్మికా మందన్న మంగళవారం విడుదల చేశారు. నలుగురు స్నేహితుల రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. స్వీకర్ అగస్తి ట్యూన్ అందించగా, యాజిన్ నిజర్ పాడారు. రెహమాన్ సాహిత్యం అందించారు. ‘‘జీవితంలో ఏ విషయానికి కూడా స్థిరంగా నిలబడడానికి ఇష్టపడని వ్యక్తి స్టాండప్ కమెడియన్‌గా మారతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురయినప్పుడు ఎలా కష్టపడాల్సి వస్తుంది? అన్నదే చిత్రకథ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సిద్ధు ముద్ద. -
సుమ 'జయమ్మ' లిరికల్ వీడియో సాంగ్.. వచ్చేసిందిగా
Suma Kanakala Jayamma Song Lyrical Video Released By SS Rajamouli: బుల్లితెర యాంకర్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతి గడించింది సుమ కనకాల. స్మాల్ స్క్రీన్‌పై వ్యాఖ్యతగా రాణిస్తూనే తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయితీ'. ఈ సినిమాకు విజయ్ కలివారపు దర్శకత్వం వహించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి సాంగ్ అయిన తిప్పగలనా.. చూపులు నీ నుంచే పాటను నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. రామాంజనేయులు రాసిన ఆ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్‌ను విడుదల చేశారు. 'జయమ్మ పంచాయితీ' చిత్రంలోని జయమ్మ లిరికల్ సాంగ్ వీడియోను దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. 'కాసింత భోళాతనం.. కూసింత జాలిగుణం' అంటూ సాగే ఈ సాంగ్‌లో జయమ్మ పాత్ర జీవనశైలి, స్వభావం ఎలా ఉంటుందో చూపించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్రీకృష్ణ ఆలపించారు. అక్కడక్కడా పాట మధ్యలో సుమ కనకాల కూడా తన గాత్రం అందించింది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బలాగ్ ప్రకాశ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకులముందుకు వచ్చి సందడి చేయనుంది 'జయమ్మ పంచాయితీ'. జయమ్మ, చూసే జనం కళ్లకి సూర్యకాంతమ్మ! Happy to Launch #JayammaJayamma song from #JayammaPanchayathi ▶️https://t.co/esGUewjy0R Best wishes to @ItsSumaKanakala & Team @mmkeeravaani @srikrisin @ramjowrites @VijayKalivarapu @Anushkumar04 @PrakashBalaga @vennelacreation @AdityaMusic — rajamouli ss (@ssrajamouli) January 16, 2022 ఇదీ చదవండి: సుమ ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళ -
తొలి ప్రేమే పుట్టిందంటున్న రాజశేఖర్!
రాజశేఖర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శేఖర్’. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ‘శేఖర్’ చిత్రంలోని ‘ప్రేమ గంటే మోగిందంట’ పాటను విడుదల చేశారు. ‘‘బొట్టు పెట్టి.. కాటుక ఎట్టి వచ్చిందమ్మా సిన్నది... బుగ్గ మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతున్నది..’’ అంటూ మొదలైన ఈ పాట ‘డండ డండ డండ లవ్గంట మోగిందంట... తొలి ప్రేమే పుట్టిందంట’ అంటూ సాగుతుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ పాడారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరకర్త. ‘‘ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జీవితా రాజశేఖర్. -
నాకోసం మారావా నువ్వూ!
‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది ఉపశీర్షిక. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నాకోసం మారావా నువ్వూ, లేక నన్నే మార్చేశావా నువ్వూ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేశారు. ప్రేయసి కృతీశెట్టి కోసం నాగచైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. బాలాజీ రచించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా, అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించారు. ‘నా కోసం..’ పాటకి మంచి స్పందన వస్తోంది’ అని చిత్రయూనిట్ తెలిపింది. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్. -
యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్న ‘అతిథి దేవోభవ’ మెలోడీ
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం ‘అతిథి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నువేక్ష నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే.. బాగుంటుంది ఊసులాడితే’ అనే పల్లవితో సాగే ఈ మెలోడీ వినసొంపుగా ఉంది. భాస్కరభట్ల అందించిన లిరిక్స్ ఆకట్టుకోగా, సిద్ శ్రీరామ్, నూతన మోహన్ వాయిస్ దానికి అదనపు ఆకర్షణని తెచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా ఈ లిరికల్ వీడియో సైతం యూత్‌ను విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. చదవండి: క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో `కిరాతక’, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే.. -
‘ఏవమ్ జగత్’ సాంగ్ విడుదల చేసిన 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య
కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఏవం జగత్’. దినేష్ నర్రా దర్శకుడు. మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు.ఎన్, రాజేశ్వరి.ఎన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘రాధాస్ లవ్’ సాంగ్ ని 'వకీల్ సాబ్' ఫేమ్ అనన్య నాగళ్ల విడుదల చేసింది. శివ కుమార్ మ్యూజిక్ అందించగా సందీప్ కూరపాటి, సమీరా భరద్వాజ్ పాడారు. పాటను విడుదల చేసిన అనన్య చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ సందర్భంగా దర్శకుడు దినేష్ నర్రా మాట్లాడుతూ.. ‘వ్యవసాయం భవిష్యత్తు ఏంటి..? రాబోయే తరానికి కావాల్సిన ఆహార అవసరాలు తీర్చేంతా సాగు భూమి కానీ, పండించే అనుభవం కానీ మన దేశ యువతకి ఉందా..? అనే అంశాలను ప్రధానంగా 'ఏవం జగత్' మూవీలో చూపిస్తున్నాం. వ్యవసాయం, మానవ సంబంధాలతో ముడిపడిన అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే ఓ 20 ఏళ్ల యువకుడి కథే మా సినిమా’ అని తెలిపారు. కాగా త్వరలోనే సినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. -
దుమ్మురేపుతున్న రాహుల్ సిప్లిగంజ్ ‘చిచ్చాస్ కా గణేశ్’ పాట
సాక్షి, వెబ్‌డెస్క్: వినాయక చవితి సందర్భంగా పలు సంస్థలు, గాయకులు కొత్త పాటలు విడుదల చేశారు. తాజాగా ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత లక్ష్మణ్ రాసిన పాటకు ప్రముఖ గాయని మంగ్లీ పాడిన అద్భుత సాంగ్ విడుదలైంది. మధుప్రియ కూడా ఓ పాట రూపొందించి విడుదల చేసింది. ఇక తాజాగా ‘బిగ్ బాస్ 3’ విజేతగా నిలిచిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఓ జబర్దస్త్ పాటతో వచ్చాడు. వేంగి సుధాకర్ హైదరాబాదీ భాషలో రాసిన ‘చిచ్చాస్ కా గణేశ్’ పాటకు రాహుల్ దుమ్ములేపేలా పాడాడు. నిఖిల్, హరిణ్య రెడ్డి కోటంరెడ్డి సమర్పించిన ఆ పాట గణపతి మండపాల్లో మార్మోగుతోంది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు అయితే ఈ పాటలో రాహుల్‌కు బిగ్‌బాస్‌లో దోస్తీ అయిన అలీ రెజా ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరూ కలిసి ధూమ్‌ధామ్‌గా డ్యాన్స్ చేశారు. శిరీశ్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు. ఒక సినిమా పాట తెరకెక్కించినట్లు పాటను ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారీ సెట్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్ విడుదల చేసిన ‘గల్లీకా గణేశ్’ పాట మాదిరి ఈ పాట కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. -
‘బుల్లెట్టు బండి’ వధువుకు అద్భుత అవకాశం
తెలంగాణ యాసలో ఎంతో మధురంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాటకు ఓ వధువు తన పెళ్లి బరాత్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఒక జానపదం పాటకు చేసిన డ్యాన్స్ వీడియో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ఆ డ్యాన్స్ చేసిన యువతికి ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఏ పాటకైతే డ్యాన్స్ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకురాలు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయ వివాహం రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన జరిగింది. అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. (చదవండి : బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?) అయితే ఆమె డ్యాన్స్ చేసిన పాటను నిర్మించిన సంస్థ బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్. రచయిత లక్ష్మణ్ సాహిత్యానికి ఎస్కే బాజి సంగీతం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఆ పాటను అద్భుతంగా తెరకెక్కించిన బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వాహకులు నిరూప స్పందించారు. సాయిశ్రీయతో నిరూప ఫోన్లో మాట్లాడారు. (చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు) ‘మా సంస్థలో నిర్మించే తదుపరి పాటకు నువ్వే క్యాస్ట్‌గా (నటించడం) చేయాలి’ అని చెప్పగా సాయిశ్రీ ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. అంత పెద్ద అవకాశం రావడంతో సాయిశ్రీయ కాదనలేకపోయింది. దీంతో సాయిశ్రీయ త్వరలోనే ఆమె ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది. బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆవిర్భవించి దాదాపు రెండేళ్లవుతోంది. ఈ సంస్థ గతంలో అనేక పాటలు రూపొందించింది. రాహుల్ సిప్లిగంజ్, నోయల్‌తో పాటలు పాడించింది. ‘బుల్లెట్ బండి’ పాటతో ఆ సంస్థకు మంచి క్రేజ్ ఏర్పడింది. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
న్యూ లవ్‌లో Freshగా పడ్డానంటున్న విశ్వక్సేన్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘‘ఈ సింగిల్ చిన్నోడే.. న్యూ లవ్వులో ఫ్రెష్షుగా పడ్డాడే.. సిగ్నల్ గ్రీనే చూశాడే.. పరుగులు పెట్టాడే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటని రధన్ స్వరపరచగా బెన్నీ దయాల్ పాడారు. కృష్ణ కాంత్ సాహిత్యం అందించారు. ‘‘మ్యూజికల్ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. హీరో ప్రతిసారీ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడడం.. ఆ ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సందర్భంలో వచ్చే పాట ఇది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. మణికందన్ , సంగీతం: రధన్ .