obeisance
-
మాతృవందనమ్
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మొదటిది అధ్యాపనం కాగా రెండవది– పితయజ్ఞస్య తర్పణం. మనకు ముందుపుట్టి మనకు జన్మనిచ్చిన వాళ్లున్నారు... తల్లిదండ్రులు. లోకంలో ఎవరి రుణం అయినా తీర్చుకోగలమేమో కానీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేం అంటారు రామచంద్రమూర్తి రామాయణంలో. . సౌత్రామణి అని ఒక యాగం. అది చేస్తే పితరుణం తీరుతుంది. కానీ మాతరుణం ? ఎవ్వరికీ సాధ్యం కాదు.రుణం తీరడం లేదా తీర్చుకోవడమంటే ??? నీ జన్మ చరితార్థం కావాలంటే... గహస్థాశ్రమంలో తల్లిదండ్రులకు నమస్కరించి సేవచేయడమే. శంకరో తీతి శంకరః..శంకరుడు ప్రతి ఇంటా ఉన్నాడు... తండ్రి రూపంలో.. అంటే కన్న తండ్రి సాక్షాత్ పరమ శివుడే. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే పరమశివుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించినట్లే. తల్లికయినా అంతే...‘‘భూప్రదక్షిణ షష్టే్కన కాశీయాత్రాయుతేనచ /సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతవందనే’’ అంటూ గహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇంత వెసులుబాటు కల్పించింది శాస్త్రం. అమ్మకు నమస్కరిస్తే... ఆరుసార్లు భూమండలాన్ని ప్రదక్షిణం చేసినట్లు, 10వేల సార్లు కాశీయాత్ర చేసినట్లు, నూరు పర్యాయాలు సేతుస్నానం చేసినంత ఫలం దక్కుతుందన్నది. అందువల్ల కంటిముందు కనిపించే దేవతలయిన అమ్మానాన్నల విషయంలో గహస్థు తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తే ఈశ్వరుడు ప్రీతి పోందుతాడు. ఎవరు ఏది చేయాలో అది నిజాయితీగా చేయాలి.తల్లిదండ్రులు ఉన్నప్పుడో లేనప్పుడో నీ వాటా ఆస్తులు లేదా వారికోసం నీవు పెట్టే ఖర్చులు లెక్కలు వేసుకోవడం కాదు... వారు నీకిచ్చిందేమిటన్నది ద్రవ్య రూపంలో లెక్కలేసుకోకు. సంతోషంగా నువ్వు నూరేళ్ళు పిల్లా΄ాపలతో హాయిగా ఉండాలని తప్ప వారు నీనుంచి ఆశిందేముంటుంది ? నాకు తెలిసిన ఒక మిత్రుడి తల్లి చనిపోతే ... ఆస్తుల వాటా ప్రస్తావన వచ్చినప్పడు నీవాటాకేం వచ్చిందంటే... రాలేదు.. నేనే తీసుకున్నా..అన్నాడు. ఏమిటవి అని అడిగితే.. అమ్మ వాడిన చెప్పులు, కళ్ళద్దాలు.. అన్నాడు... అమ్మ వాడిన అద్దాలు నా గుండెమీద పెట్టుకుంటే అమ్మ నన్ను చూస్తూ ఉన్నట్టే ఉంటుంది.. అమ్మ వాడిన అరిగిపోయిన చెప్పులు... నాకోసం ఆమె అరగదీసుకున్న, కరగదీసుకున్న జీవితాన్ని గుర్తుకు తెస్తుంటుంది... అన్నాడు... ఇవి చాలవూ నాకు... అమ్మ పోయినా ఆమెను రోజూ చూసుకోవడానికి.. అన్నాడు. అదీ కతజ్ఞత. అందుకే వారు చనిపోయిన రోజున పరమ భక్తితో, గౌరవంతో తోడబుట్టినవారందరూ కలిసి తల్లిదండ్రులను స్మరించుకోవడానికే శ్రాద్ధం, తద్దినం ఆచారంగా మారింది. అది శ్రద్ధతో చేయాల్సిన పని కాబట్టి శ్రాద్ధం అయింది. అంతేగానీ దానికి ఫలానా వస్తువులే ఉండితీరాలన్న నియమాలేమీ లేవు...రామాయణంలో...రాముడు గారపిండి ముద్దలు తీసుకెళ్ళి తండ్రి దశరథుడిని స్మరించి పితదేవతలకు పిండం పెట్టాడు. కౌసల్యాదేవి అటుగా వెడుతూ చూసి భోరున ఏడ్చింది. అంటే యజమాని ఏది తింటే పితదేవతలకు అదే పెట్టాలంది శాస్త్రం. రాముడు ఆ సమయంలో అదే తింటున్నాడు కాబట్టి అదే పెట్టాడు. కావలసింది శ్రద్ధ. అందువల్ల గహస్థు తన విహిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అది తర్పణం. అది మహా యజ్ఞం. గృహస్థు చేయాల్సిన పంచమహా యజ్ఞాలలో ఇది ఒకటి. -
రాజైనా తల్లికి నమస్కరించవలసిందే!
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ...ఈ మూడు అంశలూ ప్రచోదనమయి ఉంటాయి. జీవితాంతం నిలబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డలకు పరదేవతే... పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను ఏమీ చేసుకోలేకపోయినా.. దీపం పెట్టుకోలేక పోయినా, స్తోత్రం చెప్పుకోలేక పోయినా.. తనలో తానే ఏవో సంధిమాటలు మాట్లాడుకుంటున్నా... తన బిడ్డలకు మాత్రం ఉద్ధారకురాలే. ఎలా ? అమ్మ అంటూ ఒక ఆకారం అక్కడ ఉంటే కదూ, కొడుకుకానీ, కూతురు కానీ వెళ్ళి ప్రదక్షిణం చేసుకుని ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకోగలిగేది. ఒక వ్యక్తి అలా తన అమ్మకి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణం, పదివేల మార్లు కాశీయాత్ర చేసిన పుణ్యఫలం దక్కుతుందంటుంది శాస్త్రం. బిడ్డలకు ఇంత పుణ్యం ఇవ్వగలిగిన అమ్మ మాత్రం తనకంటూ తాను ఇలా చేసుకోలేదు. అమ్మ ఉన్నది కాబట్టి నీకా పుణ్యం వస్తున్నది. అమ్మకు నమస్కారం చేయడం అంత గొప్ప ఫలితాన్నిస్తుంది. బాహ్యంలో ఎన్ని యజ్ఞాలుచేసినా, యాగాలు చేసినా, ఎన్నో చండీ హోమాలు చేసినా, దేవాలయాలు కట్టిచ్చినా, అన్నదానాలు చేసినా తల్లికి నమస్కారం చేస్తే వచ్చిన ఫలితంతో సమానమా.. అంటే చెప్పడం కష్టం. అమ్మ–త్రిమూర్త్యాత్మక స్వరూపమై తనంతటతానుగా అంత పుణ్యాన్ని ఇవ్వగలదు. అందుకే మాతదేవోభవ. అందుకే అమ్మ దేవత. అమ్మ పరబ్రహ్మం. తల్లిని గౌరవించని వాళ్ళు లేరు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళూ, బ్రహ్మచారులూ, వానప్రస్థులూ అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. మరి సన్యాసి ఎవరికి నమస్కరిస్తారు? చాతుర్మాస్య దీక్షలు ఎక్కువ చేసినవారెవరున్నారో వారికి మిగిలిన వారు నమస్కరిస్తారు. ఎక్కువ దీక్షలు చేసినవారు, తక్కువ చాతుర్మాస్యాలు చేసిన వారికి నమస్కరించరు. అది సంప్రదాయం. కంచి కామకోటి మఠంవంటి పీఠాలలో కూడ ఇప్పటికీ ఒక నియమం ఉంది. ఒకసారి పిల్లవాడు మఠాధిపత్యం వహించాడనుకోండి. అప్పుడు సందర్శకుల వరుసలో వస్తున్న తండ్రిగారికి కూడా ప్రత్యేకతేం ఉండదు. కడుపునబుట్టిన కొడుకయినా సరే, తండ్రికూడా వచ్చి పీఠాధిపతుల పాదాలకు అందరిలాగే నమస్కారం చేసుకోవలసిందే. కానీ తల్లిగారు వరుసక్రమంలో వస్తున్నారనుకోండి. వెంటనే పీఠాధిపతయినా కూడా లేచి నిలబడి అమ్మగారికే నమస్కారం చేయాలి. అది సంప్రదాయం, అది నియమం. -
పాద పూజ వద్దు!
► గంభీర నమస్కారంచాలు ► కేడర్‌కు స్టాలిన్ వేడుకోలు సాక్షి, చెన్నై: పాదపూజ, సాష్టాంగ నమస్కారం, ఒంగి.. ఒంగి.. దండాలు..పెట్టే సంస్కృతిని ఇకనైనా వీడి, గంభీర నమస్కారంతో నేతల్ని ఆహ్వానిస్తే చాలు అని కేడర్‌కు డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కార్యకర్తలకు, నాయకులకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో రాజకీయ పక్షాల అధినేతలకు పాదపూజ చేయడం, సాష్టాంగ న మస్కారాలు చేయడం, ఒంగి..ఒంగి దండాలు పెట్టడం వంటి సంస్కృతి ఆది నుంచి వస్తున్న విషయం తెలిసిం దే. అధినేతల దృష్టిలో పడేందుకు అనేక మంది అత్యుత్సాహం ప్రదర్శించడం ఎక్కువే. ఈ సంస్కృతి అన్నాడీఎంకేలో ఇన్నాళ్లు మరీ ఎక్కువేనని చెప్పవచ్చు. ఇది కాస్త విమర్శలకు దారి తీసింది. తాజాగా, ఈ సంస్కృతి మళ్లీ ఆ పార్టీలో తెర మీదకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. చిన్నమ్మ శశికళ మెప్పునకు నేతలు అత్యుత్సాహం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.ఈ పరిస్థితుల్లో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన స్టాలిన్ కొందరు కార్యకర్తల రూపంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అభిమానంతో ఆ కార్యకర్తలు తన వద్దకు వచ్చే సమయంలో ఆశీర్వదించాలంటూ కాళ్ల మీద పడుతుండడంతో మేల్కొన్నారు. ఆ సంస్కృతికి డీఎంకేలో చరమ గీతం పాడే విధంగా కేడర్‌కు లేఖాస్త్రం సంధించారు. పాదపూజ వద్దు: సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా తమిళనాడు బాసిళ్లుతున్నట్టు తన లేఖలో గుర్తు చేశారు. అధినేత కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ అతి పెద్ద బాధ్యతల్ని తనకు అప్పగించారని పేర్కొన్నారు. ఆ బాధ్యతల్ని నెరవేర్చడం లక్ష్యంగా ప్రతి ఒక్కర్నీ కలుపుకుని ముందుకు సాగుతానన్నారు. తాను బాధ్యతలు స్వీకరించినానంతరం పెద్ద సంఖ్యలో కేడర్ శుభాకాంక్షల పేరుతో ప్రేమానురాగాలతో అభినందనలు తెలియజేయడానికి వస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే వాళ్లల్లో పలువురు హఠాత్తుగా వ్యవహరిస్తున్న తీరు, మనస్సును ద్రవింపచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తప్పా, మరెవ్వరి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం కేడర్‌కు లేదని సూచించారు. మనిషికి మనిషి గౌరవం ఇవ్వాలని, అయితే, కాళ్ల మీద పడడం వంటి సంస్కృతిని ఇక నైనా వీడాలని విన్నవించారు. కొన్ని చోట్ల సాగుతున్న ఈ సంస్కృతి రాష్ట్రానికి తలవంపులు తెచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇక మీదట ఏ కార్యకర్తలు పాద పూజగానీ, సాష్టాంగ నమస్కారాలు మాత్రం దయ చేసి చేయ వద్దని వేడుకున్నారు. నో కామెంట్స్ : డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా స్టాలిన్ నియామకంపై ఆయన సోదరుడు, ఆ పార్టీ బహిష్కృత నేత ఎంకే అళగిరిని ప్రశ్నించగా నో కామెంట్స్ అని ముందుకు సాగారు. స్టాలిన్, అళగిరిల మధ్య వారసత్వ సమరం సాగిన విషయం తెలిసిందే. శనివారం గోపాలపురంలో అధినేత, తండ్రి కరుణానిధితో అళగిరి భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్యం సమాచారం తెలుసుకున్నారు. అళగిరిని మీడియా కదిలించగా నో కామెంట్స్ అంటూ ముందుకు సాగడం విశేషం. ఇక, చేట్‌పట్ ఎంసీసీ స్కూల్లో జరిగిన పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమంలో అళగిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
పెద్ద దర్గాను సందర్శించిన మంచు విష్ణు