passbooks
-
ఓవైపు ధరణి.. మరోవైపు బట్వాడా సమస్యలు.. అధికారుల తీరు గిట్లుండాలే!
రాష్ట్రంలో భూముల లావాదేవీలు జరిగి నెలలు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు అందడం లేదు. ఇదేమిటని రెవెన్యూ కార్యాలయాలకు వెళితే తపాలా శాఖ ఆపేసిందని.. అక్కడికి వెళితే రెవెన్యూశాఖ నుంచి తమకు రానేలేదని చెప్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు వాస్తవం ఏమిటంటే.. లక్షల కొద్దీ పాస్‌బుక్కులు రెవెన్యూ కార్యాలయాల్లోనే గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని తపాలాశాఖ ద్వారా రైతులకు బట్వాడా చేసేందుకు సంబంధించిన చార్జీలను రెవెన్యూ శాఖ చెల్లించకపోవడమే దీనికి కారణం. పాస్బుక్ల ముద్రణ, బట్వాడా కోసం రైతుల నుంచే రూ.300 వసూలు చేస్తున్న రెవెన్యూ శాఖ.. తపాలా శాఖకు చార్జీలు చెల్లించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. పాస్బుక్ల ముద్రణ, తపాలా ద్వారా ఇంటికి చేర్చేందుకు బట్వాడా ఖర్చును రైతులు అప్పుడే రెవెన్యూ శాఖకు చెల్లించారు. కానీ నెలలు గడుస్తున్నా పాస్‌బుక్ మాత్రం చేతికి అందడం లేదు. ఒకరిద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులకు పాస్‌బుక్‌లు అందాల్సి ఉంది. ఎప్పుడో రైతుల ఇళ్లకు చేరాల్సి ఉన్న ఈ పాస్‌బుక్‌లు రెవెన్యూ శాఖ కార్యాలయాల్లోని బీరువాల్లో మూలుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే ధరణి సమస్యలు గందరగోళంతో రైతులు ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు పాస్‌బుక్‌లు రాకపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చెల్లింపులు లేక బకాయిలు.. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతుల నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే రూ.300 చొప్పున రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఆ మొత్తంతో పాస్‌బుక్‌ను ముద్రించి, తపాలా శాఖ ద్వారా రైతుల ఇళ్లకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములో ఒక్కో పాస్బుక్కు రూ.40 చొప్పున తపాలాశాఖకు చార్జీగా చెల్లించాలి. కానీ ఏడాది నుంచి ఈ చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. తపాలా శాఖ పాస్‌బుక్‌లను ఠంచనుగా బట్వాడా చేస్తున్నా.. అందుకు సంబంధించిన చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు. అప్పుడప్పుడు ఎంతో కొంత మొత్తం ఇస్తూ వస్తోంది. దీనితో బకాయిలు రూ.3 కోట్ల వరకు చేరుకున్నాయి. చార్జీల సొమ్ము చెల్లించాలని తపాలా శాఖ ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ శాఖ నుంచి స్పందన లేదు. అయినా ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తపాలా అధికారులు బట్వాడాను కొనసాగిస్తూ వచ్చారు. ఆడిట్ అభ్యంతరాలతో.. ఇంతగా బకాయిలు పేరుకుపోతున్నా.. ఇంకా సేవలు ఎలా అందిస్తున్నారంటూ తపాలా శాఖను అంతర్గత ఆడిట్ అధికారులు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తపాలా శాఖ బకాయిల వసూలుపై దృష్టిపెట్టింది. బకాయిలు చెల్లించకుంటే ఏప్రిల్ ఒకటి నుంచి బట్వాడా నిలిపేస్తామని రెవెన్యూ శాఖకు తేల్చి చెప్పింది. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తపాలాశాఖ ఏప్రిల్ ఒకటి నుంచి పాస్బుక్ల బట్వాడాను నిలిపేసింది. ఇకపై పాస్‌బుక్‌లను పంపవద్దని స్పష్టం చేసింది. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లోనే లక్షల సంఖ్యలో పాస్‌బుక్‌లు పేరుకుపోయాయి. తప్పుడు సమాచారంతో అటూ ఇటూ.. పాస్‌బుక్కులు అందకపోవడంలో తప్పు తమది కాదని.. తపాలా శాఖనే దగ్గరపెట్టుకుని పంపటం లేదంటూ కొందరు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తుండటంతో రైతులు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. అసలు పాస్ పుస్తకాలు తమ వద్దకు రానేలేదని, రెవెన్యూ అధికారుల వద్దనే ఉంటాయని తపాలా సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఇదంతా గందరగోళంగా మారిపోయింది. చార్జీల బకాయిలు, పాస్బుక్ల బట్వాడా నిలిపివేత అంశాలపై రెవెన్యూ, పోస్టల్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ఇంతకు ముందు రవాణాశాఖలోనూ.. గతంలో డ్రైవింగ్ లైసెన్సుల విషయంలోనూ ఇదే తరహాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ బట్వాడా కోసం వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసిన రవాణాశాఖ.. తపాలా శాఖకు ఆ చార్జీలను చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా రవాణాశాఖ స్పందించకపోవటంతో.. గతేడాది తపాలా శాఖ డ్రైవింగ్ లైసెన్సుల బట్వాడాను నిలిపేసింది. అప్పట్లో ఆ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. ట్రాన్స్‌పోర్టు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు బకాయిల్లోంచి దాదాపు రూ.కోటి వరకు చెల్లించేలా చర్యలు చేపట్టారు. దానితో తపాలా శాఖ బట్వాడాను పునరుద్ధరించింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ వంతు వచ్చింది. -
ఇది రైతుల పాలిట వరమా... శాపమా?
‘‘ధరణి ఒక విప్లవం. ఈ పోర్టల్ నిర్మాణం కోసం నేను, చీఫ్ సెక్రటరీ ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పనిచేశాం. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఇక ఏ రైతుకైనా తన భూమి సరిహద్దులు చిటికెలో తెలిసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇక భూసమస్యలకు తావే ఉండదు’’– ‘ధరణి’ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ లోపలా, బయటా చేసిన ప్రసంగాల్లో నమ్మబలికిన మాటలివి. కానీ ఆచరణలో ధరణితో రైతన్నల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలోకి పడిన పరిస్థితి ఏర్పడింది. రైతన్నల ఈ గోసకు కారణమెవరంటే ముమ్మాటికీ కేసీఆర్ అసమర్థ విధానాలే అంటే అతిశయోక్తి కాదు. ఏళ్ల తరబడి భూ వివాదాలను పరిష్కరించేందుకు ధరణి కార్యక్రమం ఒక ‘జిందా తిలిస్మాత్’గా కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసింది. 2020 అక్టోబర్ 19న ప్రారంభమైన ‘ధరణి’ కార్యక్రమం ఎటువంటి సమస్యలనూ పరిష్కరించకపోగా మరిన్ని కొత్త సమస్యలను సృష్టించింది. ఈ కొత్త చిక్కులతో రైతులు చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు భూ సమస్యల పరిష్కారం కోసం 5 లక్షల దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో వున్నాయి. మరో 8.50 లక్షల సాదా బైనామా దరఖాస్తుల స్థితీ అదే. ఈ సమస్యలకు పరిష్కారం చెప్పే నాథుడే కనబడటం లేదు. రెవెన్యూ చట్టాల్లో సవరణలు చేయకుండా, ధరణి మాడ్యూల్స్‌లో మార్పులు చేయకుండా భూ సమస్యల పరిష్కారం సాధ్యం కాదంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు చేతులెత్తేశారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రెవెన్యూ సదస్సులు సైతం సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే వాయిదా పడ్డాయి. జిల్లా కలెక్టర్లకు వచ్చిన ధరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 14 రోజుల సమయం కేటాయించింది. కానీ అది ఆచరణలో సాధ్యంకాదని జిల్లా కలెక్టర్లు వాపోతున్నారు. అగ్రికల్చరల్ అసైన్డ్ ల్యాండ్స్‌కు డిజిటల్ సైన్ కోసం అప్లై చేసుకునే అవకాశం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టతను ఇవ్వకపోవడంతో అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక పట్టాదారుడు తనకు సంబంధించిన భూ విస్తీర్ణంలో మార్పులు చేర్పులు చేయించుకోవడం తలనొప్పి వ్యవహారంగా మారింది. ప్రస్తుతం ధరణి పోర్టల్ నిబంధనల ప్రకారం తనకున్న భూ విస్తీర్ణం కంటే ఎక్కువ భూమి నమోదైతే భూ విస్తీర్ణం పొందిన పట్టాదారుడు తనకు ఎక్కువ భూ విస్తీర్ణం నమోదైందని రూ. 1000 ఆన్లైన్లో కట్టి పట్టాలో మార్పులు కోరాలి. ఈ రకంగా తన భూ విస్తీర్ణాన్ని తగ్గించాలని ఎదురు డబ్బు కట్టి మరీ కోరేవారు ఎవరు ఉంటారో ధరణి పోర్టల్ డిజైన్ చేసిన ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ధరణి పోర్టల్ అమల్లోకి రాగానే నిమిషాల్లో మ్యూటేషన్లు జరిగిపోతాయంటూ కేసీఆర్ సెలవిచ్చారు. కానీ ప్రస్తుతం కనీసం సరిహద్దు మ్యాప్‌లు కూడా లేకుండానే రిజిస్ట్రే్టషన్లు జరిగిపోతున్నాయి. దీంతో గట్టు తగాదాలు, ఘర్షణలు నిత్యకృత్యాలయ్యాయి. ధరణిలో వచ్చిన మరో సమస్య బైనంబర్లతో రిజిస్ట్రేషన్లు. దీనివల్ల సామాన్యులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బైనంబర్లతో రిజిస్ట్రేషన్లు పొందినవారికి రెవెన్యూ అధికారులు బైనంబర్ల ఆధారంగా భూసరిహద్దులు చూపడం కష్టసాధ్యమౌతోంది. దీంతో ఎవరైనా ఏ భూమికైనా తానే హక్కుదారుడననే వాదనకు దిగేందుకు ఈ విధానం తావిస్తోంది. ధరణి పోర్టల్‌లో కొత్తగా తీసుకువచ్చిన ‘రైట్ టు ప్రైవసీ మాడ్యూల్’ ద్వారా రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు అక్రమంగా సంపాదించిన భూములకు గోప్యత పొందే అవకాశం కలుగుతోంది. ధరణిలో వెల్లువెత్తిన భూ సమస్యలను పరిష్కారం చేయాలంటే క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరి. కానీ దానికి తగిన రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వం వద్ద లేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో 33 రకాల ట్రాన్సాక్షన్స్ మాడ్యూల్స్, 11 రకాల ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ అందుబాటులో వున్నాయి. వీటితోపాటు భూ వివాదాల పరిష్కారానికి సరళతరమైన మాడ్యూల్స్‌ను ధరణి పోర్టల్‌లో చేర్చితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదు. ధరణి లోపాలవల్ల భూ రిజిస్ట్రేషన్లు, వాస్తవ పట్టాదారులు పాసు పుస్తకాలలో వున్న సమస్యలతో... రైతుబంధు, రైతు బీమా, రుణ మాఫీ వంటి పథకాలకు నోచుకోవడం లేదు. పట్టాదారు పాసు పుస్తకం లేనిదే రైతన్నకు బ్యాంకులో రుణ సౌకర్యం పొందే అవకాశం కూడా లేదు. ధరణితో దగా పడ్డ రైతన్నలు ఇప్పటికే ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. అందుకు ఆదిలాబాద్ జిల్లా కంజర్ల గ్రామమే ఉదాహరణ. సాదా బైనామాపై వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన జైపాల్ రెడ్డి కుటుంబానికి పట్టా లేకపోవడంతో ఆ భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. దీంతో ఆ గ్రామస్థులంతా తిరగబడి అదే రైతుకు భూమి దక్కేలా పోరాడారు. (క్లిక్: ఇది సర్కారీ కాంట్రాక్టుల దోపిడీ!) రాష్ట్రప్రభుత్వం మొద్దునిద్ర వీడి రాష్ట్రంలో వున్న భూ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి. ధరణి పోర్టల్‌లో వున్న సమస్యలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి. ధరణి పోర్టల్‌లో వున్న లోపాల దిద్దుబాటు కోసం ప్రభుత్వం టైమ్ బౌండ్ ప్రోగ్రాం రూపొందించాలి. రైతాంగం ఇచ్చిన లక్షలాది అర్జీల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదపడాలి. ప్రచార ఆర్భాటం కోసమే రెవెన్యూ సదస్సుల పేరుతో కాలయాపన చేస్తే... భూ సమస్యల బాధితులను సమీకరించి బీజేపీ ఉద్యమిస్తుంది. - బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు -
నమోదులో తప్పులు .. రైతుల తిప్పలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన దాయాదుల మధ్య భూమి పంచాయితీ వచ్చింది. ఈ పంచాయితీ కారణంగా ఒకరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఆ భూమిని పార్ట్–బీలో పెట్టారు. ఆ భూమిపై ఎవరికీ పాసు పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ దాయాదుల మధ్య రాజీ కుదిరింది. భూమి పంపకాలపై ఓ స్పష్టత వచ్చింది. దీంతో దాయాదులు పాత పట్టాదారు పేరు మీద పాసు పుస్తకం కోసం ధరణిలో దరఖాస్తు చేసుకునేందుకు వెళితే సాఫ్ట్వేర్ అంగీకరించడం లేదు. ఈ భూమిపై ఏదో కేసు ఉందని చెబుతోంది. ఏం కేసు ఉందో, కేసు నంబర్ ఏంటో.. వివరాలు తెలియక, ఏం చేయాలో లబోదిబోమంటున్నారు. సాక్షి, హైదరాబాద్: భూములకు సంబంధించిన హక్కులు, వాటి రికార్డుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పాసుపుస్తకాల కోసం చేసుకున్న దరఖాస్తులు ఎటు వెళ్లాయో కూడా అర్థం కాక రాష్ట్రంలోని దాదాపు 25 లక్షలకు పైగా ఎకరాలకు చెందిన రైతులు తలలు పట్టుకుంటున్నారని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. ఇదిలావుంటే వచ్చిన పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేసేందుకు ధరణి పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. పాసుపుస్తకాల్లో పేరు, ఊరు, తండ్రిపేరు, విస్తీర్ణం, భూమి రకం, సంక్రమించిన విధానం... ఇలా పలు అంశాల్లో రెవెన్యూ సిబ్బంది నిర్వాకం కారణంగా దొర్లిన తప్పులు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. వీటిని సవరించాలంటూ పెట్టుకున్న దరఖాస్తులు కలెక్టర్ల లాగిన్లలోనే ఉండిపోతున్నాయి. ఈ దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని, కలెక్టర్లకు నివేదికలు పంపడం లేదని తెలుస్తోంది. దీంతో తప్పుల సవరణలకు సంబంధించిన దరఖాస్తులు నెలలు, ఏళ్ల తరబడి అలా పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. గుట్టలుగా పాసుపుస్తకాలు ఇక, కొత్త పాసుపుస్తకాల కోసం చేసుకున్న దరఖాస్తులు అతీగతీ లేకుండా పోతున్నాయి. ఈ పాసుపుస్తకాలను బయట ముద్రించాల్సి ఉండడం, వాటిని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ద్వారా రైతులకు పంపాల్సి ఉండడంతో అసలు ఆ పుస్తకాలను ముద్రించారో లేదో కూడా అర్థం కావడం లేదు. మరోవైపు, ముద్రించిన పాసుపుస్తకాలు గుట్టల కొద్దీ సీసీఎల్ఏ కార్యాలయంలో పేరుకుపోతున్నాయని, వాటిని రైతులకు పంపేందుకు గాను అవసరమైన స్టాంపులు కొనేందుకు కూడా సీసీఎల్ఏ వర్గాల వద్ద నిధుల్లేవని తెలుస్తోంది. దీంతో వచ్చిన పుస్తకాలు వచ్చినట్టు సీసీఎల్ఏ కార్యాలయంలో ఉండిపోతున్నాయే తప్ప రైతుల దరి చేరడం లేదు. ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి రైతుల భూములకు సంబంధించిన పాసుపుస్తకాలు, ఆ పుస్తకాల్లో నమోదైన తప్పులు, భూరికార్డుల ప్రక్షాళనలో పార్ట్‌బీ (వివాదంలో ఉన్న భూములు) కింద నమోదు చేసిన భూముల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రైతు సంఘాలంటున్నాయి. లేకపోతే ఈ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కనిపించడం లేదని పేర్కొంటున్నాయి. -
కలెక్టర్ కట్టె పట్టినా అంతే!
జిల్లాలో మొత్తం రైతుల ఖాతాలకు గాను 2,121 ఖాతాలకు సంబంధించి భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కేవలం సాంకేతిక కారణాలతో డిజిటల్ సంతకాలు కాలేదు. రైతులకు సంబంధించి ఆధార్ కార్డు నంబర్లు లేవని చెప్పడంతో పాటు ఇతర కారణాలతో వీటిని పక్కన పెట్టారు. ప్రభుత్వం పదేపదే చెబుతున్నా... జిల్లా కలెక్టర్ బరిగె పట్టుకున్నట్లుగా వెంటపడుతున్నా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలేమో! సాక్షి, హన్మకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన(ఎల్‌ఆర్‌యూపీ) కార్యక్రమం జిల్లాలో ప్రహసనంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ప్రతీ శనివారం ఎల్‌ఆర్‌యూపీ సమస్యలపై డీఆర్వో నుంచి వీఆర్వో స్థాయి వరకు అధికారులతో నేరుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ వారంలో సాధించిన, ఇంకా సాధించాల్సిన ప్రగతిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజావాణికి వచ్చిన భూసమస్యల విషయంలో అధికారులు తక్షణం స్పందించాలని, రైతుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. అయినా కొందరు అధికారుల్లో మార్పు రావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూలాల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కారం చేసే ఉద్దేశం వారిలో కనిపించడంలేదు. అలా కాకపోతే ఉద్యోగులు ‘ఆశించిన ఫలితం’ దక్కడం లేదనే భావనతో కొన్ని పనులు పక్కన పడేస్తున్నారు. మరికొన్నిచోట్ల సర్వేల పేరుతో పెండింగ్‌లో పెడుతున్నారు. సర్వే పూర్తి చేసుకుని తమ భూమి రికార్డుల్లో నమోదు చేయమని వెళ్తే ఆ సర్వే నంబర్లో ఖాళీ లేదని చెబుతున్నారు. లేదంటే చుట్టుపక్కల ఉన్న అందరూ కలిపి సర్వే చేయించుకోండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతులు వీఆర్వోలు, మండల కార్యాలయాల చుట్టూ తిరగలేక అలిసిపోతున్నారు. చివరకు మళ్లీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి ప్రతీ సోమవారం కలెక్టరేట్‌కు వస్తున్నారు. పైసలిస్తేనే పని... అర్బన్ జిల్లాలో మెజార్టీ మండలాల్లో భూములు విలువ ఎకరానికి రూ.కోట్లల్లో ఉంది. ఇలాంటి చోట రైతు బందు పథకంతో పాటు విలువైన భూమిని తమ పేరుతో భద్రంగా ఉంచుకోవాలని రైతులు ఆరాటపడటం సహజం. దీనిని అదనుగా తీసుకుని రెవెన్యూ సిబ్బంది తమకు అడినంత ఇస్తేనే పనిచేస్తున్నారు. కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మిలాఖత్ అయి పక్కన భూములు ఉన్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. భూమికి మార్కెట్లో ఉన్న ధరను బట్టి రెవెన్యూ సిబ్బంది తమ కమీషన్ డిమాండ్ చేన్నారు. రూ.కోట్లల్లో ధర ఉన్నచోట రూ.లక్షల్లో ఇవ్వాల్సిందే. రైతులకు సంబంధించి అన్ని రుజువులు ఉన్నా అడిగినంత ఇస్తేనే పనులు చేస్తున్నారు. 21 శాతం పార్ట్ బీలో... రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 1,31,210 ఖాతాలతో పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. ఇందులో 89,243 ఖాతాలు అంటే 68శాతం వ్యవసాయ భూములకు సంబంధించినవి ఉన్నాయి. మిగతా వాటిలో 14,430 అంటే 11శాతం వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ అసైన్డ్ లాండ్స్‌కు ఖాతాలు మంజూరు చేశారు. ఈ లెక్కన వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు మొత్తంగా 1,03,673 ఖాతాలతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. మిగతా 21 శాతం అంటే 27,537 ఖాతాలు పార్ట్ ‘బీ’ భూములకు సంబంధించినవి ఉన్నాయి. -
కొత్త పట్టా పుస్తకాలెప్పుడో!
సాక్షి, ఆదిలాబాద్: భూరికార్డుల ప్రక్షాళన జరిగి దాదాపు మూడేళ్లు గడుస్తుంది. అయినా ఇంత వరకు వివాదాస్పదంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంతో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సర్వే సమయంలో ఎలాంటి సమస్యలు లేని భూములను పార్ట్–ఏలో చేర్చి కొత్త పట్టాపాసు పుస్తకాలు అందించారు. వివాదాలు ఉన్న భూములను పార్ట్–బిలో చేర్చి ఇంత వరకు కొత్త పట్టా పాసుపుస్తకాలు అందజేయలేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. మూడు ఎకరాలకుపైనే.. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూ వివరాలను పరిశీలించిన అధికారులు సర్వే లో వివాదాలు ఉన్న భూములను పార్ట్–బీలో చే ర్చారు. రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ జరిగి ఇరవై నెలలు గడుస్తున్నా..పార్ట్–బీ భూములకు ఇంత వరకు పూర్తిస్థాయి పరిష్కారం లభించడం లేదు. దీంతో ఆ భూములు కలిగిన పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో 5400 ఎకరాలపైగా భూములను పార్ట్–బీలో చేర్చగా, గతేడాది నుంచి ఇప్పటి వరకు 2 వేల ఎకరాల భూములకు మాత్రమే పరిష్కర మార్గం చూ పారు. మిగతా 3,400 ఎకరాలకు మోక్షం కలగలేదు. పార్ట్–బీలోని భూములన్నింటీకి పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశించినా ప్రభుత్వం వివిధ కారణాలతో పక్కన పెడుతూ వస్తోంది. గత ఎనిమిది నెలలుగా వరుస ఎన్నికల నేపథ్యం లో పార్ట్–బీ భూ సమస్యల జోలికి అధికారులు వెళ్లలేదు. మోక్షం లభించేనా? నియోజకవర్గంలో జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్, అర్బన్, మావల మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలోని సుమారు 3400 ఎకరాలకుపైగా భూములు పార్ట్–బీలో పెండింగ్‌లో ఉం ది. వీటకి పూర్తిస్థాయి పరిష్కరం లభించే అవకాశం కనిపించడం లేదు. కోర్టుకేసులు, కుటుంబ వివాదాలు ఉన్న భూములను అధికారులు పక్కనపెట్టగా, చిన్న చిన్న సమస్యలున్న భూములను మాత్రమే పరిశీలన చేసి పరిష్కరిస్తున్నారు. దీంతో అసలు సమస్య ఉన్న భూములు పెండింగ్‌లో నే ఉన్నాయి. అయితే కొన్ని భూములకు చిన్న స మస్యలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదని, కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఓసారి దృష్టి సారిస్తే.. భూ సమస్యలు పరిష్కారం అవుతాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పార్ట్–బీలోని కొన్ని భూములపై రెవెన్యూ, సివిల్ కోర్టు కేసులు, సరిహద్దు గుర్తింపు సమస్యలున్నాయి. పాసు పుస్తకం ఇవ్వాలి నా పేరు మీద వ్యవసాయ భూమి ఉంది. పాత పట్టా పాస్‌బుక్‌లు ఉన్నాయి. కానీ కొత్త పట్టా పాసు పుస్తకాలు ఇంత వరకు ఇవ్వలేదు. చాలాసార్లు అధికారులను అడిగినా.. ఇంత వరకు జారీ చేయలేదు. దీంతో రైతుబంధు, ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్నాం – ప్రసాద్, ఖానాపూర్, ఆదిలాబాద్ -
అందరికీ పాస్ పుస్తకాలు అందేలా కృషి
సాక్షి, దమ్మపేట: ఏళ్లతరబడి సాగులో ఉన్న భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ విషయంలో జరుగుతున్న జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అర్హులైన రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దమ్మపేటలోని టీడీపీ మండల కన్వీనర్ నాయుడు చెన్నారావు ఇంటికి గురువారం వచ్చిన ఎమ్మెల్యేను వచ్చారు. దమ్మపేట, మందలపల్లి రైతులు కొందరు రైతులు కలిశారు. రైతులు గడ్డిపాటి సత్యం, అడపా సుబ్బారావు, ఎంఏ కబీర్, గడ్డిపాటి బాబు తదితరులు మాట్లాడుతూ... భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని అన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ, ఏళ్లతరబడి పట్టాదార్ పాçస్ పుస్తకాలు పంపిణీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల కోసం ఇంట్లో అందరం తిరుగుతున్నామని అన్నారు. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం కారణంగా రైతుబంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు అందడం లేదని, భూమి క్రయ–విక్రయాలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూలో ఏమైనా పొరపాట్లుంటే సరిచేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో మండలంలో అన్ని సర్వే నంబర్లను అధికారులు ప్రక్షాళన చేయలేదని ఫిర్యాదు చేశారు దమ్మపేట శివారు నల్లకుంటలోని 273/1, జమేదార్ బంజర్‌లోని 884/1 సర్వే నంబర్లతోపాటు పట్వారీగూడెం, నాగుపల్లి రెవెన్యూ గ్రామాల్లోని కొన్ని సర్వే నంబర్లోని భూ రికార్డులను ప్రక్షాళన చేయలేదని వివరించారు. ఈ కారణంగా ఆయా నంబర్లలోని రైతులకు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు అందలేదని చెప్పారు.దీనికి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించారు. ఈ సమస్యలు నియోజకవర్గవ్యాప్తంగా ఎక్కువగానే ఉన్నాయని అన్నారు. వీటి పరిష్కారంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘రెవెన్యూ రికార్డుల్లో లోపాలు, అర్హులైన రైతులకు పట్టాదార్ పాస్ పుసస్తకాలు, పోడుదారులకు పట్టాల పంపిణీపై ఆదివాసీ ఎమ్మెల్యేలం ఐదుగురం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఈ సమస్యను వివరించాం. సమగ్ర సర్వే చేసి, రైతులకు న్యాయం చేద్దామని అన్నారు. రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరో రెండు నెలల్లో ఈ సమస్యలు పరిష్కారమవుతాయి’’ అని చెప్పారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ అత్తులూరి వెంకటరామారావు, రైతులు– నాయకులు ఎండీ వలీపాష, ఎండీ అబ్దుల్ జిన్నా, బొల్లిన రవికుమార్, గన్నమనేని విజయ్‌కుమార్, చెప్పుల జగదీష్, ఉయ్యాల లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
కరుణించు ‘ధరణి’ మాతా
సాక్షి, హైదరాబాద్: చీదెళ్ల అనే ఇంటి పేరు ఉన్న ఓ రైతు ఆధార్‌కార్డులో ఇంటి పేరు సీహెచ్ అని ఇంగ్లిష్‌లో నమోదయింది. అదే పట్టాదారు భూరికార్డుల్లో చీదెళ్ల అని పూర్తిగా తెలుగులో నమోదయి ఉంది. ఆధార్‌లో సీహెచ్ అని, పట్టాదారు రికార్డుల్లో చీదెళ్ల అని వేర్వేరుగా ఇంటిపేరు ఉండి సరిపోలకపోవడంతో పాసుపుస్తకం మంజూరుకు సాఫ్ట్వేర్ సహకరించడం లేదు. ఆ రైతు మీ సేవలో తన వేలిముద్రలను ఇచ్చి పట్టాదారు రికార్డుల్లోగాని, ఆధార్ కార్డుల్లోగాని ఒకే విధమైన ఇంటి పేరును నమోదు చేసుకుంటేనే పాసుపుస్తకం జారీకి వీలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’వెబ్సైట్ ద్వారా రెవెన్యూ సేవల విషయంలో కలుగుతున్న అవాంతరాలకు ఇదో మచ్చుతునక. ధరణి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే కాంట్రాక్టును అనుభవం లేని ఐఎల్ఎఫ్ఎస్ అనే సాఫ్ట్వేర్ సంస్థకు ఇవ్వడం, ఏ అధికారి స్థాయిలో ఏ సమస్యను పరిష్కరించే అధికారం ఇవ్వాలనే విషయంలో సమగ్రత లోపించడం, రెవెన్యూ సిబ్బందిపై పడుతున్న అదనపు పనిభారం వెరసి రాష్ట్ర రైతాంగం క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు పడుతోంది. ధరణి ప్రాజెక్టు ద్వారా రైతులకు సమీకృత రెవెన్యూ సేవలందించాలని, క్రయ, విక్రమాలు జరగ్గానే రైతు ఇంటికి నేరుగా పాసుపుస్తకాలు పంపాలని, ఆ పాసుపుస్తకాలు బ్యాంకుల్లో తనఖా పెట్టకుండానే రికార్డుల ద్వారా సదరు రైతులకు రుణాలిప్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పుట్ల కొద్దీ సమస్యలతో ఇటు రైతులను, అటు రెవెన్యూ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ధరణి ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యలివే... –ఆధార్ కార్డు, పట్టాదారు రికార్డుల్లో పేర్లు సరిపోలకపోతే పాసుపుస్తకం జారీకి సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో ఎంట్రీకి గంటల కొద్దీ సమయం పడుతోంది. –తహసీల్దార్లు డిజిటల్ సంతకాలు చేసి పంపిన పాసు పుస్తకాలు ఆరునెలలు దాటినా ఇంతవరకు రాలేదు. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు ప్రాంతాల కంపెనీలకు ఈ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు ఇవ్వడంతో అసలు ఏ కంపెనీని ఆరా తీయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాసుపుస్తకాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని దుస్థితి. –ధరణి సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా తప్పుగా నమోదైతే మళ్లీ దాన్ని సరిచేసే అవకాశం తహసీల్దార్ స్థాయిలో కూడా లేదు. ఆర్డీవో లాగిన్లోకి వెళ్లి దానిని సరిచేయాల్సి వస్తోంది. ఆర్డీవోలు అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో ఈ పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా నమోదు చేసిన కొత్త సర్వే నంబర్లను ధరణిలో నమోదు చేసే అధికారం తహసీల్దార్ స్థాయిలో లేదు. అదే విధంగా గత రికార్డుల్లో మిస్సింగ్ అయిన నంబర్లను కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఇవి కూడా ఆర్డీవో స్థాయి లాగిన్ ద్వారా చేయాల్సి వస్తుండడంతో తీవ్ర కాలయాపన అవుతోంది. రీసెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్)ను సరిచేసే అధికారం జేసీలకిచ్చారు. ఉదాహరణకు ఒక సర్వేనంబర్ రికార్డుల్లో 20 ఎకరాల భూమి ఉంటే... క్షేత్రస్థాయిలో నిజంగా భూమి 18 ఎకరాలే ఉందనుకోండి. అప్పుడు ఆ భూమికి సంబంధించిన వాస్తవ వివరాలను ధరణిలో నమోదు చేయలేకపోతున్నారు. ఆర్డీవో, జేసీల లాగిన్‌లో ఉన్న అధికారాల పరంగా మార్పులు చేయాలంటే సదరు ఆర్డీవో లేదా జేసీ బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి చేశారు. దీంతో ఆర్టీవో, జేసీ స్థాయి అధికారులు అనేక పనుల్లో బిజీగా ఉండడం, వారే స్వయంగా లాగిన్‌ను బయోమెట్రిక్ ద్వారా ఓపెన్ చేయాల్సి రావడంతో సమస్యల పరిష్కారానికి నెలల సమయం పడుతోంది. ఒక్క పాసుపుస్తకం మంజూరు కావాలంటే తహసీల్దార్ నాలుగు సార్లు బయోమెట్రిక్ నమోదు చేయాల్సి వస్తోంది. ఒక సర్వే నంబర్లో ఐదెకరాల భూమి ఉంటే... అందులో నాలుగెకరాలు సాగు భూమి, మరో ఎకరం వ్యవసాయేతర భూమి ఉందనుకోండి. ఈ రెండింటిని విడివిడిగా నమోదు చేసేందుకు సాఫ్ట్వేర్ సహకరించడం లేదు. ఇంతవరకు ధరణి ప్రాజెక్టు వివరాలను పబ్లిక్ డొమైన్‌లోకి తేలేదు. సీసీఎల్ఏ వెబ్సైట్లో అన్ని రికార్డులు ఉంచామని చెపుతున్నా అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మీ సేవా కేంద్రాలు, లేదంటే సొంత కంప్యూటర్లు, ఫోన్ల ద్వారా ధరణిలోని భూముల వివరాలు అందుబాటులోకి తేవడంతో పాటు సమస్యల పరిష్కారానికి ఓ టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా... బేతుపల్లి సర్వే నంబరు 878/211/అ లో నాకు 1.10 ఎకరాల వ్యసాయభూమి ఉంది. భూప్రక్షాళనలో నా భూమి రికార్డు చేయలేదు. ఎన్నిసార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోవటం లేదు. నా సర్వే నంబర్లో భూమి లేదని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల నుంచి భూమిని సాగు చేసి అనుభవిస్తున్నాం. రెవెన్యూ యంత్రాంగం భూమి లేనివాళ్లకు కూడా రికార్డుల్లో ఎక్కించటం వల్లే నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుంది. నాతోపాటు వందమందికిపైగా రైతులకు పాస్ పుస్తకాలు రాలేదు. ఎస్.వీరరాఘవులు, నారాయణపురం, సత్తుపల్లి మండలం, ఖమ్మంజిల్లా కొలువు లేదు.. సాయం లేదు ‘నాకు అశ్వారావుపేటలో సర్వే నంబరు 1228లో నా తండ్రి పంచి ఇచ్చిన రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి పట్టా జారీ కాలేదు. అసైన్డ్ భూమి కావడంతో భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా వారసత్వం చేసి ఇవ్వాలి. కానీ ఎన్నికలు, ఇతర కారణాల వల్ల కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం జారీ కాలేదు. దీంతో రైతుబంధు సహాయం అందటం లేదు. నార్లపాటి బుచ్చిబాబు, అశ్వారావుపేట, కొత్తగూడెం జిల్లా సంవత్సరం నుండి తిరుగుతున్నాం మా కుటుంబానికి చింతలపాలెం శివారులోని 226 సర్వే నంబరులో 2.20 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి పాసుపుస్తకాల కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి పోయాం. అదిగో ఇస్తున్నాం... ఇదిగో ఇస్తున్నాం.. అని తిప్పుతున్నారు. గట్టిగా అడిగితే సైట్ ఓపెన్ కావడం లేదంటున్నారు. ఉన్నతాధికారులకు పంపామని చెబుతున్నారు. –దేవిరెడ్డి నాగమణి, గుడిమల్కాపురం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా సిబ్బంది పెంచి పనిభారం తగ్గించాలి రిజిస్ట్రేషన్ పద్ధతిలో మార్పు తేవడంతోపాటు కోర్ బ్యాంకింగ్ ద్వారా రైతులకు మేలు చేయాలనే తలంపుతో చేపట్టిన ధరణి నిజంగా మంచి ప్రాజెక్టే. అయితే, రైతులకు ఆశించిన మేలు జరగాలంటే మాత్రం సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి. రెవెన్యూ సిబ్బందిపై ఉన్న అదనపు భారాన్ని తగ్గించాలి. కొత్తమండలాలు, జిల్లాలకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలి. –కె. గౌతం కుమార్, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతుబీమా
నల్లగొండ అగ్రికల్చర్ : ‘‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం భూమి ఉన్న ప్రతి రైతుకూ వర్తిస్తుంది. బాండ్లు రాలేదని దిగులుపడాల్సిన అవసరం లేదు. పాస్‌బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ జిరాక్స్‌లను తీసుకెళ్లి మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆన్లైన్లో నమోదు చేయించాలి. ఆన్లైన్లో నమోదు అయిన నాటి నుంచి రైతు బీమా వర్తిస్తుంది’’ అని జేడీఏ జి.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హలో జేడీఏ’ కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు పట్టాదార్ పాస్‌బుక్కులు, రైతు బంధు చెక్కులు, బీమా పథకం, విత్తనాల పంపిణీపై ఉన్న సందేహాలను ‘జేడీఏ’తో ఫోన్లో మాట్లాడి నివృత్తి చేసుకున్నారు. ఎక్కువ మంది పట్టాదార్ పాస్‌బుక్కులు, రైతు బంధు చెక్కుల గురించే మాట్లాడారు. రైతుల ప్రశ్నలు, జేడీఏ సమాధానాలు వారి మాటల్లోనే... ప్రశ్న : మట్టినమూనా పరీక్షలను ఎక్కడ చేయించాలి – మురళీయాదవ్, మిర్యాలగూడ జేడీఏ : మిర్యాలగూడలోని భూసార పరీక్షాకేంద్రంలో మట్టినమూనాలను తీసుకెళ్లి పరీక్షలు చేయించుకోవచ్చు. ప్రశ్న : పాస్బుక్కు, చెక్కు రాలేదు – ఎల్లయ్య, పోలంపల్లి, చందంపేట జేడేఏ : మీ తహసీల్దార్‌ను సంప్రదించండి, పాస్బుక్కు వచ్చిన తరువాత రైతుబంధు చెక్కును ఇప్పిస్తాం. ప్రశ్న : పత్తిలో వేరుపురుగు వచ్చి చెట్లు చచ్చిపోతున్నాయి. ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి శ్రీనివాస్ మాడుగుల పల్లి జేడీఏ : ట్రైకోడర్మవిరిడిని నీటిలో కలిపి చెట్టు వేర్ల దగ్గర తడిచే విధంగా పోయండి. సూక్మపోషకాలను పిచికారీ చేయండి. దీంతో పురుగు నాశనమవుతుంది. ప్రశ్న : పాస్బుక్కు రాలేదు, బీమా వర్తిస్తుందా? భిక్షం, మిర్యాలగూడ జేడీఏ : మండల వ్యవసాయాధికారిని కలిసి ఆన్లైన్లో నమోదు చేయించండి. నమోదు అయిన నాటినుంచి బీమా వర్తిస్తుంది. ప్రశ్న : రైతుబంధు చెక్కులు ఎప్పుడు వస్తాయి? పల్లె క్రిష్ణయ్య, వేములపల్లి జేడీఏ : పాస్ బుక్కులు వచ్చిన తరువాత రైతు బంధు చెక్కులు వస్తాయి. ప్రశ్న : రైతు బీమా పధకానికి ఎక్కడ అన్లైన్ చేయించాలి? అనికుమార్‌రెడ్డి, తిమ్మన్నగూడెం జేడీఏ : మండల వ్యవసాయాధికారిని కలిసి పాస్బుక్కు జీరాక్స్, ఆధార్ కార్డుతో నామినిది కూడా జీరాక్స్ వస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రశ్న : పాస్బుక్కు వచ్చి నెల రోజులు అయ్యింది. ఇప్పటికీ రైతుబంధు చెక్కు రాలేదు. యాదయ్య, తొండ్లాయి, శంకర్, నల్లగొండ, ఘనీ, హాలియా జేడీఏ : త్వరలోనే చెక్కు వస్తుంది. ప్రశ్న : పాస్‌బుక్కులు రాలేదు సత్తిరెడ్డి ఉట్లపల్లి, వెంకటయ్య, బొల్లెపల్లి, వెంకటేశ్వర్లు, సిరసనగండ్ల జేడీఏ : తహసీల్దార్‌ను, లేదా ఆర్డీఓలను కలవండి. బుక్కులు వచ్చిన తరువాత చెక్కులను ఇప్పిస్తాం. ప్రశ్న : రబీలో సబ్సిడీ విత్తనాలు ఇస్తారా శ్రీను, మునుగోడు జేడీఏ : వేరుశనగ, మినుము, ఉలువులు సబ్సిడీపై ఇస్తాం ప్రశ్న : రుణమాఫీ రాలేదు సుజాత, కట్టంగూరు జేడీఏ : ప్రభుత్వానికి నివేదికను పంపించాం. ప్రభుత్వంనుంచి ఆమోదం వస్తే రుణమాఫీ వస్తుంది. -
దేశానికే ఆదర్శం రైతుబంధు
బోధన్‌రూరల్(నిజామాబాద్): తెలంగాణ ప్రభుత్వం అమలు చే స్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బోధన్ మండలం రాజీవ్‌నగర్ తండాలో శనివారం ఆయ న రైతులకు రైతుబీమా బాండ్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.5లక్షల జీవిత బీమా పథకం తీసుకొచ్చిందని చెప్పారు. ఒక్కో రైతు తరపున రూ.2,271 ప్రీమియం చెల్లిస్తున్నామని వివరించారు. రైతులు ఏ కారణంతో మృతి చెం దినా 10 రోజుల్లో రూ.5 లక్షలు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అర్హులందరికీ డబుల్ బె డ్రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. అధికారులపై ఆగ్రహం.. గ్రామంలో భూరికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పా స్ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీపై మం త్రి ఆరా తీయగా, తమకు చెక్కులు, పాస్ బుక్కు లు రాలేదని గ్రామస్తులు వెల్లడించారు. దీంతో మంత్రి పోచారం బోధన్ తహసీల్దార్ గంగాధర్, ఏవో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి గోవింద్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో రైతులు, భూముల వివరాలు కూడా చెప్పలేని వీఆర్వో రాజన్నను తీవ్రంగా మందలించారు. కలెక్టర్ రామ్మోహన్‌రావ్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌రావు, మున్సిపల్ చైర్మన్ ఎల్లం, రైతు సమన్వయ సమితి మండల కో–ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ పాల్గొన్నారు. మత్స్యకారులకు అన్ని విధాలా చేయూత బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారికి జీవనోపాధి కల్పిస్తోందని, ఒక్కొక్కరికి కనీసం నెలకు రూ.15 వేల జీతం లభించేలా చర్యలు చేప డుతోందని మంత్రి పోచారం పేర్కొన్నారు. శనివారం ఆయన బాన్సువాడలోని కల్కీ చెరువులో 1.70 లక్షల చేప విత్తనాలను వేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. దళా రులు మత్స్యకారులను దళారులు దోచుకొంటున్నారని, ఇకపై దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు సాగాలని స్పష్టంచేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తం గా 3.08 కోట్ల చేప విత్తనాలను చెరువుల్లో వేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాల నుంచి చెరువులు ఏ సంఘాల ఆధీనంలో ఉంటే చేపలు వారే పట్టుకోవాలని, కొత్త సంప్రదాయానికి తెరతీయొద్దని సూచించారు. ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ అంజిరెడ్డి, మత్స్యశాఖ ఏడీ పూర్ణిమ పాల్గొన్నారు. నవంబర్‌లో రెండో విడత ‘సాయం’ బీర్కూర్: నవంబర్ 18 నుంచి రెండో విడత పెట్టు బడి సాయం అందజేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బీర్కూర్‌లోని తెలం గాణ తిరుమల దేవస్థానాన్ని శనివారం దర్శించుకున్న మంత్రి.. అనంతరం తిమ్మాపూర్‌లో రైతు బీమా బాండ్లను పంపిణీ చేశారు. అనంతరం మా ట్లాడుతూ.. బీమా పరిహారం మంజూరులో పది రోజులు దాటితే వడ్డీతో సహా చెల్లించేలా బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపా రు. త్వరలోనే విచారణ పూర్తి చేయించి అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్ వోఎఫ్ఆర్ పట్టాలతో పాటు పెట్టుబడి సా యం అందిస్తామన్నారు. చేపల చెరువుల విషయంలో గంగపుత్రులు, ముదిరాజ్‌లు సమన్వయంతో వ్యవహరించాలని, అనాధిగా వస్తున్న ప్రకారం ఎవరికి హక్కు ఉంటే వారికే అవకాశం ఇవ్వాలని ఫిషరిస్ ఏడీఏ రాజనర్సయ్యకు సూచించారు. తిరుమల తరహాలో.. తిరుమల దేవస్థానాన్ని సందర్శించిన అనుభూతి కలిగేలా బీర్కూర్ శ్రీవెంకటేశ్వరాలయాన్ని తీర్చిదిద్దుతామని పోచారం తెలిపారు. రూ.13 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఆలయానికి చెందిన 68ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ చేయించాలన్నారు. -
అట్టహాసంగా ‘బీమా’ బాండ్ల పంపిణీ
ఫిబ్రవరి 26న కరీంనగర్ వేదికపై సీఎం కేసీఆర్ ఇచ్చిన మరోహామీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. రైతు సమన్వయ సమితి సభ్యుల తెలంగాణ స్థాయి అవగాహన సదస్సు అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన విషయం విధితమే. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు ఇదే వేదిక నుంచి ప్రకటించారు. ఆ హామీ మేరకు ఉమ్మడి జిల్లాలో 2.39 లక్షల మందికి రైతుబీమా బాండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్‌లో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాకు 2.39 లక్షల బాండ్లు రాగా, ఈ నెల 13 వరకు ఊరూరికి వెళ్లి అధికారులు నేరుగా రైతులకు అందజేయనున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన 18 నుంచి 60 ఏళ్లలోపు అర్హులైన రైతులకు ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రస్తుతం వచ్చిన బాండ్లను చూసి తమకు రాలేదన్న భావన ఏ రైతుకూ అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న వారికి ఈ బాండ్లు వస్తాయని, ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకూ తావులేదని చెబుతున్నారు. భూ రికార్డుల ఆధునికీకరణ కింద అన్ని పట్టాదారు పాస్‌పుస్తకాలు ఒకేసారి లేకపోవడంతో అందరికీ ఒకేసారి బాండ్లు రావడం లేదని, ఈ విషయాన్ని రైతులు గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది నిరంతర కార్యక్రమమని పేర్కొంటున్నారు. ఈ నెల 15 నుంచి బాండ్లు అమల్లోకి వస్తాయని, ఏడాది పాటు ఏ కారణంతోనైనా అర్హత ఉన్న రైతు చనిపోతే వారి కుటుంబానికి 15 రోజుల్లోపు ఐదు లక్షల పరిహారం ఎల్ఐసీ కంపెనీ చెల్లిస్తుందని తెలిపారు. ఇది మంచి పథకమని, బాండ్ల పంపిణీకి సంపూర్ణంగా సహకరించాలని కోరుతున్నారు. జిల్లాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిన రైతుల వద్దకువెళ్లి అధికారులు సర్వే చేశారు. ఆ మేరకు అర్హత ఉన్న వారికి బీమా వర్తింప చేస్తూ వస్తున్నారు. అలాగే రికార్డుల ఆధునికీకరణ కింద ప్రతీ వారం, పక్షం రోజులకోసారి కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన వివరాలను తీసుకొని వ్యవసాయ అధికారులు సదరు వాటిలో అర్హత ఉన్న రైతులకు బీమా వర్తింపజేస్తున్నారు. దీంతో దశలవారీగా బీమా బాండ్లు వస్తున్నాయి. అయి తే, వచ్చిన బాండ్లను వచ్చినట్లుగానే రైతులకు అందించాలన్న లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తున్నది. ఈ నేపథ్యంలోనే మొదటి దశగా వచ్చిన 2.39 లక్షల బాండ్లను ఈ నెల 6 నుంచి 13లోపు పంపిణీ చేయడానికి ఆయా జిల్లాల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే బాండ్ల ను నేరుగా రైతుల ఇంటికి తీసుకెళ్లి అప్పగిస్తారు. రైతు సంక్షేమానికి రూ.55 వేల కోట్లు.. రైతుల సంక్షేమమే ప్రధానలక్ష్యంగా ఏటా రూ.55–60 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తుందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు సామూహిక జీవితబీమా పథకం కార్యక్రమాన్ని మంత్రి జ్వోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందుగా రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి రాజేందర్‌ను రాజీవ్ రహదారి నుంచి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు అభిమానంతో చేతులపై ఎత్తుకుని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రాజేందర్ మాట్లాడుతూ.. రైతుల కోసం ప్రభుత్వం ఎంతగానో పనిచేస్తున్నప్పటికీ, దేవుని కరుణ లేకపోవడంతో వర్షాలు పడటం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ. 55 వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామని, రెండు, మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు. రూ.7 వేల కోట్లతో రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతుబంధు పథకం కింద రూ.12 వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు తెలిపారు. రైతుబీమా పథకం ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రైతుబీమా పథకంలో చేరిన రైతు చనిపోతే 15 రోజుల్లోగా ఆ రైతు సూచించిన నామినికి రూ.5 లక్షల చెక్కు అందుతుందని తెలిపారు. -
ఆ భూములకు పాస్‌పుస్తకాలు ఇప్పట్లో లేనట్టే
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూములకు పాస్‌పుస్తకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. అసైన్డ్ భూముల్లో కబ్జాలో ఉండి సాగు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే పాస్‌పుస్తకాలివ్వాలని, ఇతరుల ద్వారా కొనుగోలు చేసిన భూములను రీ అసైన్ చేసినప్పటికీ వాటికి పాస్‌పుస్తకాలు ముద్రించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసైన్డ్ భూములను గతంలో కొనుగోలు చేసి ఇప్పుడు రీఅసైన్ అయిన రైతులకు కూడా పాస్‌పుస్తకాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇది న్యాయపరంగా సమ్మతం కాదని, అసైన్మెంట్ కమిటీ ఆమోదం పొంది, డీఫాం పట్టా వచ్చిన తర్వాతే వాటికి పాస్‌పుస్తకాలు ముద్రించాలని గత వారం సీసీఎల్ఏ నుంచి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పాటు సాదాబైనామాల కింద పరిష్కారం చేసిన భూములకు కూడా పాస్‌పుస్తకాలు ముద్రించవద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి, సాదాబైనామాల కింద రైతులకు భూములపై యాజమాన్య హక్కులు కల్పించారు. అయితే, ఆ తర్వాత సాదాబైనామాలు రాసిన వారి వారసులు, ఇతరుల నుంచి ఫిర్యాదులు వచ్చిన సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ఆ క్రమంలోనే సాదాబైనామాల ద్వారా పరిష్కారమయి, వివాదాస్పదమయిన భూములకు కూడా పాస్‌పుస్తకాలు ముద్రించవద్దని తాజా ఉత్తర్వుల్లో జిల్లా స్థాయి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈరెండు కేటగిరీల సర్వే నెంబర్లను ప్రత్యేకంగా నోషనల్ ఖాతాల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. దీంతో రీఅసైన్, సాదాబైనామా కోటాలో యాజమాన్య హక్కులు పొందిన రైతులకు పాస్‌పుస్తకాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇచ్చే రబీ సీజన్ పెట్టుబడి సాయానికి కూడా పుస్తకాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. దీంతో పాస్‌పుస్తకాలు వచ్చేంతవరకు రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. -
గ్రామానికి రాకుంటే మండలానికే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రైతుల పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. గ్రామాలవారీగా రెవెన్యూ యంత్రాంగం రైతుల వద్దకు వెళ్లి పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తోంది. అయితే అవగాహన లేమితోపాటు ఎండలు, శుభకార్యాల వంటి కారణాల వల్ల స్థానికంగా నివాసం ఉండని దాదాపు 25 శాతం మంది పాస్‌పుస్తకాలు తీసుకునేందుకు రావడం లేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ నెల 10 నుంచి 19 వరకు ఆ మండలంలోని ఏయే గ్రామాల్లో ఎప్పుడు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలో రెవెన్యూ యంత్రాంగం షెడ్యూల్ రూపొందించింది. ఉదాహరణకు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామంలో ఈ నెల 10 నుంచి 19లోగా ఏదో ఒకరోజు మాత్రమే పాస్‌పుస్తకాల పంపిణీకి షెడ్యూల్ ఇచ్చింది. చాలా మంది అవగాహన లేక ఈ నెల 10 నుంచి 19 వరకు ఆ గ్రామానికి ఎప్పుడు వెళ్లినా పాస్‌పుస్తకాలు ఇస్తారనే ఆలోచనతో ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో షెడ్యూల్ ప్రకటించిన రోజును తేలికగా తీసుకుని వెళ్లడం లేదు. అయితే అలా షెడ్యూల్ రోజు గ్రామానికి వెళ్లి పాస్‌పుస్తకాలు తీసుకోని వారికి మళ్లీ ఆ గ్రామంలో పాస్‌పుస్తకాలు ఇవ్వబోమని రెవెన్యూ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. షెడ్యూల్ రోజు గ్రామానికి వెళ్లకపోతే నేరుగా మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఈ షెడ్యూల్ తర్వాతే... ఈ నెల 10 నుంచి 19 వరకు సెలవు రోజుల్లో కూడా గ్రామాలవారీ షెడ్యూల్ ఉన్నందున ఏ గ్రామంలో షెడ్యూల్ ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన పాస్‌పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. ప్రతి రోజూ ఫలానా గ్రామంలో పంపిణీ చేసిన పాస్‌పుస్తకాల వివరాలను మొబైల్ యాప్ ద్వారా జిల్లా, రాష్ట్ర అధికారులకు పంపి మిగిలిపోయిన పాస్‌పుస్తకాలను ఎమ్మార్వో కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు. మొత్తం అన్ని గ్రామాల్లో పంపిణీ పూర్తయ్యాకే మళ్లీ వాటిని స్ట్రాంగ్ రూంల నుంచి బయటకు తీస్తారు. అంటే షెడ్యూల్ మేరకు పాస్‌పుస్తకం తీసుకోని రైతులు ఈ నెల 20 తర్వాతే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. పాస్‌పుస్తకం కోసం వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి తమ ఖాతా నంబర్ చెప్పాలని, పాస్‌పుస్తకం, రైతు తీసుకెళ్లిన ఆధార్‌లోని ఫొటోలు సరిపోలితే అక్కడే సంతకం తీసుకుని పాస్‌పుస్తకం ఇస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. -
ఎండలున్నాయి...జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈనెల 10 నుంచి చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ఎండల్లో చేపట్టవద్దని, ఉదయం 7ృ11, సాయంత్రం 5ృ8 గంటల వరకే పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) మంగళవారం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్ నంబర్ లేనప్పటికీ రైతులు ఆధార్ నంబర్ వివరాలు తీసుకువస్తే వారి వ్యవసాయ ఖాతా వివరాలను పరిశీలించి చెక్ ఇచ్చేయాలని, ఆ తర్వాత పాస్‌పుస్తకాలపై డిజిటల్ సంతకాలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేవలం తప్పుల్లేని పాస్‌పుస్తకాలను మాత్రమే పంపిణీ చేయాలని, ఏ రైతు పాస్‌పుస్తకం ఆ రైతుకు మాత్రమే ఇవ్వాలన్నారు. పాస్‌పుస్తకం ఇచ్చాక రైతు నుంచి సంతకం లేదా వేలిముద్ర తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లోకి వెళ్లే బృందం టీల్యాండ్ పోర్టల్ నుంచి పహాణీని తీసుకుని వెళ్లాలని సూచించారు. -
‘మింట్’కే ముద్రణ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: కొత్త పాస్ పుస్తకాల ముద్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సెంట్రల్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. ఎంవోయూలో పేర్కొన్న మేరకు రాష్ట్రంలోని రైతులకు అవసరమైన 72 లక్షల ఈ–పట్టాదారు పాస్ పుస్తకాలు కమ్ టైటిల్ డీడ్లను సెంట్రల్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అందజేయనుంది. ఇందుకుగానూ ప్రతి పాస్ పుస్తకానికి రూ.200 (పన్నులు అదనం) చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. నామినేషన్ పద్ధతిలో ఖరారు చేసిన ఈ కాంట్రాక్టుకు కేబినెట్ కూడా షార్ట్ సర్క్యులేషన్ పద్ధతిలో ఆమోదం తెలపడంతో కొత్త పాస్ పుస్తకాల ముద్రణ ప్రారంభమైందని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. సమయం తక్కువగా ఉన్నందున హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లోని ప్రెస్‌తో పాటు దేవాస్(మధ్యప్రదేశ్), నాసిక్(మహారాష్ట్ర), నోయిడా(ఉత్తరప్రదేశ్)లోని ప్రెస్‌లను కూడా ఏకకాలంలో వినియోగించనున్నారు. రోజుకు 2.5 లక్షల పాస్ పుస్తకాలను నాలుగు ప్రెస్‌లలో ముద్రించేలా ప్రణాళిక రూపొందించారు. మార్చి 11వ తేదీ కల్లా కొత్త పాస్ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. ఐఎల్ఎఫ్ఎస్కు ‘ధరణి’బాధ్యతలు భూరికార్డుల నిర్వహణకు ఉద్దేశించిన ధరణి వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(ఐఎల్ఎఫ్ఎస్)కు అప్పగించారు. ఈ వెబ్సైట్ నిర్వహణకు పిలిచిన టెండర్లలో ఐఎల్ఎఫ్ఎస్ ఎల్1గా నిలవడంతో కాంట్రాక్టును ఖరారు చేశారు. ధరణి వెబ్ డిజైన్, సైట్ అభివృద్ధి, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పేందుకు షార్ట్ సర్క్యులేషన్ పద్ధతిలో కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మూడేళ్లకు రూ.116.05 కోట్ల ఖర్చు అంచనాతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్లు, తహసీల్దార్ కార్యాలయాల డాటాను అనుసంధానం చేయనున్నారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను జీపీఎస్ పద్ధతిలో వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనున్నారు. కాగా, ధరణి వెబ్సైట్ రూపకల్పనపై సోమవారం సీసీఎల్ఏ కార్యాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. చిరునవ్వులు.. దుక్కి దున్నుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇస్తున్న కొత్త పాస్ పుస్తకాలను కొన్ని ప్రత్యేక లక్షణాలతో తయారు చేస్తున్నారు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాస్ పుస్తకంపై కాకతీయ తోరణం, చార్మినార్, భారీ నీటి ప్రాజెక్టులు, ఎరువులు చల్లుతూ, దుక్కి దున్నుతున్న రైతులు, చిరునవ్వులు చిందిస్తున్న రైతు కుటుంబాల మహిళల చిత్రాలు ముద్రించనున్నారు. ‘రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.. బంగారు తెలంగాణ మన స్వప్నం–మన లక్ష్యం’అనే నినాదాలను కూడా రాయనున్నారు. మొత్తం 18 భద్రతా ప్రమాణాలతో పాస్ పుస్తకాలను ముద్రిస్తున్నారు. ప్రతి పుస్తకంలో 20 పేజీలుంటాయి. ఇందులో పట్టాదారు మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలు, హద్దులతో కూడిన పట్టాదారు భూమి మ్యాప్, లావాదేవీలు, క్రయ విక్రయాల వివరాలు ఉండనున్నాయి. -
పాస్ పుస్తకంపై నా ఫొటో వద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చే కొత్త పాస్ పుస్తకాలపై తన ఫొటో ముద్రించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. కొత్తగా ఇచ్చే పాస్ పుస్తకాల నమూనాలను శుక్రవారం ప్రగతి భవన్లో అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. పచ్చని పంటలకు గుర్తుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న పాస్ పుస్తకాన్ని సీఎం ఎంపిక చేశారు. పాస్‌బుక్‌లో తన ఫొటో ఉన్న నమూనాలను కూడా అధికారులు ఈ సందర్భంగా కేసీఆర్‌కు చూపించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ‘పాస్ పుస్తకంపై రైతు ఫొటో తప్ప మరెవరి ఫొటో వద్దు. రాజకీయ నాయకుల ఫొటోలు అవసరం లేదు. కేవలం రైతు ఫొటో, తెలంగాణ ప్రభుత్వ ముద్ర మాత్రమే పాస్ పుస్తకంపై ఉండాలి’అని ఆదేశించారు. ‘నాణ్యమైన విద్యుత్ సరఫరాకు నిధులివ్వండి’ సాక్షి, న్యూఢిల్లీ: సిరిసిల్ల సెస్‌కు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను సెస్ పాలకవర్గం కోరింది. శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, పలువురు డైరెక్టర్లు కేంద్రమంత్రిని కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సెస్ అభివృద్ధి, పనితీరు గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. -
పకడ్బందీగా పాస్ పుస్తకాలు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 11న నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం కోసం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఊరికో నోడల్ అధికారిని నియమించడంతోపాటు రైతులకు అదేరోజున అందేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, గ్రామ పంచాయతీల ఎన్నికలు, అభివృద్ది పథకాల అమలు తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్ష జరిపారు. బోగస్ దందాలకు ఇక సెలవు.. 16 అంశాలతో పాసుబుక్కుల ముద్రణ ప్రభుత్వం పకడ్బందీగా రూపొందించే ఈ–పాస్‌పుస్తకాలతో బోగస్ దందాలకు తెర పడుతుందని, 16 రకాల రక్షణ ప్రత్యేకతలతో పాసుబుక్కులను రూపొందించామని సీఎం కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. భూస్వామ్య వ్యవస్థ అంతకంతకు తగ్గిపోగా.. సన్న, చిన్నకారు రైతులతో పాటు భూమి ఉన్న ప్రతిఒక్కరికీ పాసు పుస్తకాలు అందేలా చూడాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేందుకు గ్రామానికో నోడల్ అధికారి ని నియమించాలని సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ వ్యవహారంలో రెవెన్యూశాఖ మరింత కీలకంగా వ్యవహరించాలని, తహసీల్దారు, నాయబ్ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ల బాధ్యులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ సవరణల ప్రకారమే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని, నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలను నిర్వహించేందుకు సర్వంసన్నద్ధం కావాలని సూచించారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలతోపాటు, తండాలను పంచాయతీలుగా మార్చే జాబితాపైనా చర్చించారు. ఉమ్మడి కరీంనగర్లో 6,62,345 రైతులు.. ఆ మేరకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘గణాంకాల పుస్తకం–2017’, భూరికార్డుల సర్వే ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం భూమి 29,55,750 ఎకరాలుండగా, అటవీ, బంజరు, నివాస స్థలాలను మినహాయిస్తే సాగుభూమి 13,42,045 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఆహార పంటలు 7,88,975 ఎకరాలు కాగా, వాణిజ్య పంటలు 5,53,070 ఎకరాల్లో సాగవుతున్నాయి. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 6,62,345 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా.. 5,09,098 పాసు పుస్తకాలు చెలామణిలో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ–పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంతో కొత్త వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వ్యవసా య భూములు, చిన్న, సన్నకారు, పెద్ద రైతుల సం ఖ్య ఆధారంగా పాసు పుస్తకాలను ముద్రిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు మార్చి 11న పంపిణీ చేయనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ–పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు, పండుగ వాతావరణంలా నిర్వహించేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం చేసినట్లు తెలిసింది. సమావేశానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, శరత్, కృష్ణభాస్కర్, శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. పరిధి రైతులు భూమి(ఎకరాల్లో) 1.25 ఎకరాల వరకు 2,74,368 1,78,063.75 1.25 నుంచి 2.5 1,72,669 315075.75 2.5 నుంచి 5 1,45,008 5,07,758.55 5 నుంచి 7.5 41,805 2,48,635.075 7.5 నుంచి 10 13,585 1,16,427.2 10 నుంచి 12.5 6,994 77,462.1 12,5 నుంచి 18.75 5,397 80,517.3 18.75 నుంచి 25 1,438 30,583.15 25 నుంచి 50 935 29,827.875 50 ఎకరాల పైన 146 12375.17 -
రైతులకు అండగా..
సాక్షి,ఆదిలాబాద్: రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ దివ్యదేవరాజన్, జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా రైతు సమస్యల పరిష్కారంపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన, పట్టాపాస్‌బుక్‌ల పంపిణీ, పంట పెట్టుబడి, 24 గంటల విద్యుత్ సరఫరా, పంచాయతీ ఎన్నికలు, పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టానికి సవరణ, గొర్రెల పంపిణీ, మండల కార్యాలయాల నుంచి రిజిస్ట్రేషన్లు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సదస్సు సాయంత్రం 7గంటల వరకు కొనసాగింది. పట్టాపాస్‌బుక్‌ల పంపిణీలో అందరి భాగస్వామ్యం.. భూరికార్డుల ప్రక్షాళనలో వివాదం లేని భూములకు సంబంధించి పార్ట్–ఏ పూర్తయినందున వ్యవసాయ భూములకు ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న పట్టాపాస్‌బుక్‌లను మార్చి 11న ఒకేసారి పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. మండలానికి ఒక నోడల్ అధికారిని ఈ ప్రక్రియ పరిశీలనకు నియమించాలని కలెక్టర్లకు చెప్పారు. పాస్‌బుక్‌లు ఒకరోజు ముందు, లేనిపక్షంలో అదేరోజు గ్రామానికి పంపేలా ఏర్పాట్లు చేయాలని, గ్రామానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. పట్టాపాస్‌బుక్‌ల పంపిణీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు అందరు భాగస్వాములై కార్యక్రమాన్ని ప్రహసనంగా నిర్వహించాలని తెలిపారు. భూరికార్డుల నమోదు కోసం ప్రభుత్వం కొత్తగా ‘ధరిణి’ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. మార్చి 12 వరకు ‘ధరిణి’ వెబ్సైట్లో పూర్తి భూ వివరాలను నమోదు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. అమ్మకం, కొనుగోలుదారుకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు అప్డేట్ చేస్తుండాలని తెలిపారు. ఇందుకోసం మండలాల్లోనూ రిజిస్ట్రేషన్ చేపట్టాలని పేర్కొన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా మండలాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వివరించారు. మండలాల్లో రిజిస్ట్రేషన్ల కోసం హైపవర్ కంప్యూటర్లు, అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది మానసికంగా సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త గ్రామపంచాయతీలను ఎలాంటి వివాదాలు లేకుండా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. భౌగోళిక సరిహద్దుల నిర్ధారణలో జాగ్రత్తగా వ్యవహరించాలని, సర్వే నంబర్లు వేర్వేరు గ్రామాలకు వేర్వేరుగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 25లోగా ఈ చర్యలను పూర్తి చేయాలన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం విషయంలో కొత్తగా వచ్చే సర్పంచులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, వందశాతం పన్నుల వసూళ్ల విషయంలో గ్రామపంచాయతీలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యతను సర్పంచులకు తెలియజేయాలని సూచించారు. గ్రామ జనాభా ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.25లక్షల వరకు నిధులు అందజేస్తామని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తమ అభిప్రాయాలను ప్రిన్సిపల్ సెక్రెటరీకి మెయిల్ ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ చట్టానికి కూడా సవరణ చేసే అవకాశం ఉందని తెలిపారు. రైతు సమన్వయ సమితీల బాధ్యత.. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. పంటలను మార్కెట్లకు తెచ్చేందుకు, అమ్ముకునేందుకు రైతులకు సమన్వయ సమితీలు సహకారం అందిస్తాయని, మద్దతు ధర దక్కేలా చూస్తాయని పేర్కొన్నారు. పంట పెట్టుబడి పథకాన్ని కేంద్రం ప్రశంసిస్తుందని తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ద్వారా పూర్తిస్థాయిలో మేలు చేయడం జరిగిందన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను నివారించడం ద్వారా రైతుకు పంటల విషయంలో న్యాయం చేయడం జరిగిందని పేర్కొన్నారు. పంట కాలనీలు ఏర్పాటు చేయడంలో రైతు సమితీలు కీలకంగా వ్యవహరించాయని ప్రశంసించారు. -
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాస్ పుస్తకాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు కొత్త పాస్ పుస్తకాలు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీకి ముహూర్తం కుదిరింది. మార్చి 11న అన్ని గ్రామాల్లో ఒకేరోజు కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్రపతి లేదా ప్రధానిని ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. పాస్ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్ విధానంలో సంస్కరణలపై శనివారం ప్రగతి భవన్లో 8 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఇందులో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, శాంతకుమారి, కార్యదర్శి స్మితా సభర్వాల్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, మీసేవా కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నమెంట్ జీఎం డి.శ్రీధర్, సీనియర్ మేనేజర్ సుధీర్ గోలి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళన ద్వారా వచ్చిన ఫలితాలను ఇందులో విశ్లేషించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేవలం తెలంగాణలో మాత్రమే సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని అన్నారు. ‘‘ఇది దేశానికే ఆదర్శం. ఇప్పుడు భూమి వివరాలన్నీ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలతో కూడిన పాస్ పుస్తకాలు కొత్తగా ప్రింట్ చేస్తున్నాం. భూముల వివరాన్నింటినీ కోర్ బ్యాంకింగ్ తరహాలో ఉండే వెబ్సైట్లో నమోదు చేస్తాం. ఈ ల్యాండ్ వెబ్‌సైట్‌కు ‘ధరణి’ అనే పేరును ఖరారు చేశాం. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తున్నాం’’ అని అన్నారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా మార్చి 11 నుంచే అమలు చేయనున్నట్టు తెలిపారు. అదేరోజు మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇకపై భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. రెండు శాఖల మధ్య మరింత సమన్వయం కోసం ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న వాకాటి కరుణకే రిజిస్ట్రేషన్ల్ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘పార్ట్ ఏ’ సక్సెస్.. త్వరలో ‘పార్ట్ బీ’ రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల పాటు నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన పార్ట్–ఎ విజయవంతమైందని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 90 శాతానికి పైగా భూముల విషయంలో స్పష్టత వచ్చిందని, ఏ భూమికి ఎవరు యజమానో తేలిందని చెప్పారు. ఈ వివరాల ఆధారంగానే కొత్త పాస్ పుస్తకాల జారీ, పంట పెట్టుబడి మద్దతు పథకం అమలు చేస్తామని చెప్పారు. కోర్టు కేసులు, ఇతర వివాదాలు, అభ్యంతరాలు ఉన్న భూములను పార్ట్–బిలో పరిష్కరిస్తామన్నారు. పార్ట్–బి చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, దీనిపై త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పార్ట్–ఎ ద్వారా లెక్క తేలిన భూములకు సంబంధించిన వ్యవసాయ ఖాతాలు దాదాపు 71 లక్షలున్నాయని, వారందరికీ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. కోర్ బ్యాంకింగ్ తరహాలో ‘ధరణి’ రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూభాగానికి సంబంధించిన వివరాలతోపాటు ఎప్పటికప్పుడు జరిగే మార్పులను నమోదు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి’ వెబ్సైట్ నిర్వహించనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ వెబ్‌సైట్‌ను కోర్ బ్యాంకింగ్ తరహాలో నిర్వహిస్తామని, ఇందుకు ప్రత్యేకంగా ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ వివరాలు, పేరు మార్పిడి వివరాలు అదే రోజు ఈ వెబ్సైట్లో నమోదు అవుతాయని, మండల కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల దీన్నుంచి వివరాలు తీసుకోవచ్చన్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా ‘ధరణి’ ద్వారా అందే సమాచారంతో క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చని తెలిపారు. అవినీతి, నకిలీలు తొలగించడమే లక్ష్యం భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణలో వందకు వంద శాతం పారదర్శకత సాధించడం, అవినీతి నిరోధించడం, నకిలీ పాస్ పుస్తకాలను అరికట్టడం లాంటి లక్ష్యాలతో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘‘రైతులు, ప్రజలు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పాలి. కేవలం ఒకేసారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రావాలి. పాస్ పుస్తకం వారి ఇంటికే కొరియర్ ద్వారా చేరాలి. ఎవరి వద్దకూ వెళ్లకుండానే తమ పని ఒక్కరోజులో పూర్తి కావాలి. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని విధంగా రిజిస్ట్రేషన్ల విధానం ఉండాలి. నకిలీ పాస్ పుస్తకాల ద్వారా రుణాలు పొంది ప్రభుత్వాన్ని కూడా మోసం చేసిన దాఖలాలున్నాయి. ఇకపై అలా సాధ్యం కాదు. భూ రికార్డుల నిర్వహణను ప్రభుత్వం కట్టుదిట్టంగా చేస్తుంది. అందుకోసమే సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రతీ విషయం ‘ధరణి’లో నమోదవుతుంది’’ అని వివరించారు. ఎమ్మార్వోలకు సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు రైతులు, ఇతరులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రతీ మండల రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 584 మండలాలుండగా.. ప్రస్తుతం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వాటిని యథాతథంగా కొనసాగిస్తూనే మిగిలిన చోట్ల తహశీల్దార్లకు సబ్‌రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించనున్నారు. శని, ఆదివారాలు, ఇతర సెలవులు మినహాయించి వారానికి ఐదు రోజులు ఉదయం పూట తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో వారు హాజరు కాలేకపోతే, ఆ బాధ్యతలను డిప్యూటీ తహశీల్దార్లకు అప్పగిస్తారు. ‘స్లాటు’ పద్ధతిలో రిజిస్ట్రేషన్ ఇకపై భూములకు సంబంధించిన క్రయ విక్రయ లావాదేవీలను స్లాటు పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పాస్‌పోర్టులు, వాహనాల రిజిస్ట్రేషన్ల తరహాలో అమ్మేవారు, కొనేవారు పరస్పర అంగీకారానికి వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ వద్ద సమయం తీసుకోవాల్సి ఉంటుంది. వీరు లైసెన్స్డ్ డాక్యుమెంట్ రైటర్లకు ఫీజు చెల్లించి, వారు రాసిన కాగితాల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే ఇరు వర్గాలు స్వయంగా డాక్యుమెంట్ రాసుకున్నా అనుమతిస్తారు. సబ్ రిజిస్ట్రార్లు ఇచ్చిన సమయం ప్రకారం ఇరువర్గాలు పాస్ పుస్తకాలతో హాజరుకావాలి. బయోమెట్రిక్ విధానం ద్వారా ఇద్దరి వేలిముద్రలు, ఫోటోలు, సంతకాలు తీసుకుంటారు. ఎంత భూమి అమ్ముతున్నారో అంత భూమిని అమ్మేవారి పాస్ పుస్తకం నుంచి సబ్ రిజిస్ట్రార్ తొలగిస్తారు. అదే సమయంలో కొన్న వారి పాస్ పుస్తకంలో నమోదు చేస్తారు. తర్వాత సబ్ రిజిస్ట్రార్ ముద్ర వేసి, సంతకం చేస్తారు. భూమిని కొత్తగా కొంటున్న వారయితే, కొత్త పాస్ పుస్తకం ఇస్తారు. అందులో కొన్న భూమి వివరాలు నమోదు చేస్తారు. ఇద్దరి పాస్ పుస్తకాలను అదే రోజు ఎమ్మార్వోకు పంపుతారు. సదరు భూమి యజమానిగా అమ్మిన వారి పేరు తొలగించి, కొన్న వారి పేరిట మార్పిడి(మ్యుటేషన్) చేస్తారు. ఈ వివరాలను ఎమ్మార్వో కార్యాలయంలోని భూమి రికార్డుల్లో నమోదు చేస్తారు. వెబ్సైట్ వివరాలు ఎస్ఎంఎస్ మ్యుటేషన్ తర్వాత తహశీల్దార్ కార్యాలయంలోని ఐటీ అధికారికి ఈ వివరాలు పంపాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఐటీ అధికారిని వెబ్సైట్లో నమోదు చేస్తారు. అలా నమోదు చేసిన వివరాలు అమ్మిన, కొన్న వారికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. పాస్ పుస్తకాలను ఇప్పటి మాదిరిగా ఆర్డీవోకు పంపాల్సిన అవసరం లేదు. పేరు మార్పిడి (మ్యుటేషన్) బాధ్యత పూర్తిగా ఎమ్మార్వోదే. మ్యుటేషన్ తర్వాత తహశీల్దార్ సంతకం చేసి ముద్ర వేసి పంపుతారు. ఆ పాస్ పుస్తకాలను అదే రోజు మళ్లీ సబ్ రిజిస్ట్రార్‌కు పంపుతారు. ఎమ్మార్వో నుంచి తనకు అందిన పాస్ పుస్తకాలను సబ్ రిజిస్ట్రార్ కొరియర్ ద్వారా అమ్మినవారికి, కొన్నవారికి పంపుతారు. కొన్న వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు పంపుతారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాయం నుంచి పంపిన వెంటనే ఇద్దరికీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం కూడా ఇస్తారు. రైతులకిచ్చే పాస్‌పుస్తకంలో ఖాతా నంబరుతో పాటు పాస్ యూనిక్ కోడ్, గ్రామం, మండలం కోడ్, యజమాని ఆధార్ నంబరు ఉంటాయి. రాష్ట్రంలో భూభాగం వివరాలు – 2.80 కోట్ల ఎకరాలు: రాష్ట్రంలోని మొత్తం భూభాగం – 1.42 కోట్ల ఎకరాలు: ఎలాంటి వివాదాలు లేని వ్యవసాయ భూమి – 17.89 లక్షల ఎకరాలు: కోర్టు కేసులు, వివాదాలు, చిక్కులు కలిగిన భూములు – 11.95 లక్షల ఎకరాలు: రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూములు – 84.00 లక్షల ఎకరాలు: చెరువులు, కుంటలు, కాల్వలు, రైల్వేలైన్లు, సబ్ స్టేషన్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల కింద భూములు, కోర్టు కేసుల్లోని అటవీ భూములు. – 24 లక్షల ఎకరాలు: నగరాలు, పట్టణాలు, గ్రామాల నివాస ప్రాంతాలు, వివాదాలు లేని అటవీ భూమి -
పాస్‌బుక్ అప్డేట్కు ఛార్జీలు
మీరు బ్యాంకు బ్రాంచు వద్ద పాస్‌బుక్‌ను అప్డేట్ చేయించుకుంటున్నారా? అయితే ఇక నుంచి దానికోసం కూడా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్‌బుక్ అప్డేటింగ్కు ఛార్జీలు విధించాలని ప్లాన్ చేసింది. ఒక్కోసారి పాస్‌బుక్ అప్డేషన్కు 10 రూపాయల ఛార్జీలు విధించాలని తన వెబ్సైట్లో ఓ నోటీసులో తెలిపింది. తాము ప్రతిపాదించిన ఈ ఛార్జీలు 2018 జనవరి 20 నుంచి అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది. ఏ బ్యాంకు కూడా పాస్‌బుక్ అప్డేషన్కు ఛార్జీలు విధించడం లేదు. బ్యాంకు ఆఫ్ ఇండియానే ఈ ఛార్జీలనే అమల్లోకి తీసుకొస్తుంది. ఉచితంగా లభించే పలు బ్యాంకు సర్వీసులకు ఛార్జీలను విధించనున్నట్టు బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. ఈ సర్వీసుల్లో పాస్‌బుక్ అప్డేషన్ కూడా ఉన్నట్టు తెలిపింది. ఒక్కోసారి అప్డేషన్కు రూ.10 ఛార్జీలను విధించనున్నామని, ఈ ఛార్జీలను ఆటోమేటిక్‌గా అకౌంట్ హోల్డర్స్ అకౌంట్‌ను డెబిట్ చేసుకోనున్నట్టు నోటీసులో పేర్కొంది. అంతేకాక ఛార్జీలు విధించబోతున్న సర్వీసుల్లో నగదు విత్‌డ్రా, నగదు డిపాజిట్, బ్యాలెన్స్ స్టేట్మెంట్, కైవేసీ అప్డేట్, సంతకం, ఫోటో వెరిఫికేషన్, చెక్ డిపాజిట్, వడ్డీ సర్టిఫికేట్ పొందడం, ఇంటర్నెట్ లేదా మొబైల్ పాస్‌వర్డ్‌ను అన్‌బ్లాక్ చేసే అభ్యర్థనలు కూడా ఉన్నాయి. ఈ ఛార్జీలన్నీ జనవరి 20 నుంచి అమల్లోకి వస్తున్నాయని బ్యాంకు తెలిపింది. ప్రతిపాదనల్లో కేవలం రెండు సర్వీసులు మాత్రమే ఉచితంగా లభించనున్నాయి. అవి చెల్లింపులు ఆపడం, సూచనల అభ్యర్థనలు. ఆసక్తికరంగా ఈ ఛార్జీలు, బేస్ బ్రాంచు విధిస్తున్న సర్వీసు ఛార్జీలు కన్నా అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం విధిస్తున్న ఛార్జీల సర్వీసులు, అంతకముందు ఉచితంగా లభ్యమయ్యేవి కావడం గమనార్హం. -
పాస్‌పోర్టు కన్నా పక్కాగా!
సాక్షి, హైదరాబాద్ : ‘‘ఒక రైతు ఇంకో రైతుకు తన భూమిని అమ్మాడు.. ఇద్దరూ కలసి పాస్ పుస్తకాలు తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లారు.. వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిపోవాలి. ఆ తర్వాత ఈ వివరాలన్నీ గంటలో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తాయి. అక్కడ కూడా అదే రోజు మ్యుటేషన్ జరిగిపోవాలి. లేదంటే తెల్లారి అయిపోవాలి. పాస్ పుస్తకాల కోసం తహసీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కట్టే కొరియర్ చార్జీలతోనే పాస్‌పోర్టు లాగా పాస్ పుస్తకాలు టపాలో వస్తాయి. రెవెన్యూ వ్యవస్థలో బ్యాంకుల తరహా కోర్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. టూల్ ప్రాసెసింగ్ కూడా అవుతోంది. దాంట్లోనే రికార్డులన్నీ అప్లోడ్ చేస్తాం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రక్షాళన చేసిన భూరికార్డుల ఆధారంగానే రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. జనవరి 26 నుంచి కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 26 రకాల భద్రతా చర్యలతో, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా పాస్‌పోర్టు కన్నా పక్కాగా పాస్ పుస్తకాలను తయారు చేస్తున్నట్లు వివరించారు. మంగళవారం అసెంబ్లీలో భూరికార్డుల ప్రక్షాళనపై జరిగిన లఘు చర్చకు సమాధానమిస్తూ సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే... రికార్డుల్లో గందరగోళం వల్లే సమస్యలు భూముల వివరాలు, రికార్డుల విషయంలో ప్రజలు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు.. రాస్తే రామాయణమంత, వింటే భారతమంత. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. భూరికార్డుల్లో వ్యత్యాసం ఎలా ఉందంటే.. ప్రస్తుత కామారెడ్డిలోని గాంధారి మండలం గుజ్జల అనే గ్రామంలో ఖాస్రాలో 1403.13 ఎకరాలుంటే.. 1బీ ప్రకారం 1795.13 ఎకరాలుంది. రికార్డుల్లోనే 392 ఎకరాల తేడా ఉంది. మరో గ్రామంలో 3 వేల ఎకరాల తేడా ఉంది. ఇలా వింత, అస్తవ్యస్త, గందరగోళంగా రికార్డులు తయారు చేశారు కాబట్టే చాలా మంది చెలరేగిపోయారు. పైరవీకారులు, ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాలు, పాస్ బుక్కుల సృష్టికర్తలు, డబుల్ రిజిస్ట్రేషన్లు.. ఇలా అనేక అకృత్యాలు జరిగాయి. నిజాం రాజులు మంచి పనులు చేశారు మన రెవెన్యూ వ్యవస్థకు ప్రాతఃస్మరణీయుడు సాలార్జంగ్–1. 1932–34 వరకు ఉన్న నిజాం రాజు సర్వే సెటిల్మెంట్ చేశారు. నిజాం విషయంలో అనేక అభిప్రాయాలుంటాయి. కానీ మా దృష్టిలో మాత్రం ప్రపంచంలో ఎవరూ చేయని మంచి పనులు చేశారు. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో జల్, జంగల్, జమీన్ పేరుతో కొమురం భీం పోరాటం చేస్తే తన దేశం వాళ్లయితే తప్పుడు నివేదిక ఇస్తారేమోనని హైమన్‌డార్ఫ్ అనే ఫ్రెంచ్ దేశస్తుడితో కమిషన్ వేయించి, ఆ నివేదిక ఆధారంగా లక్ష ఎకరాలు పంచిన చరిత్ర నిజాంది. కానీ, మన సమైక్య పాలకులు ఉద్దేశపూర్వకంగా నిజాం చరిత్రను చెరిపి, నలిపివేసి మలినం చేశారు. సర్వస్వతంత్ర హైకోర్టును, స్వతంత్ర న్యాయవ్యవస్థను కూడా ప్రపంచంలో మొదట ఏర్పాటు చేసింది నిజాం రాజే. నిజాం రాజు ఏర్పాటు చేసిన స్వతంత్ర న్యాయ వ్యవస్థ కారణంగా మా కుటుంబం లబ్ధి పొందింది. అప్పట్లో 1939–40 ప్రాంతంలో అప్పర్ మానేరు ప్రాజెక్టు కింద మా భూములు పోయాయి. కానీ పరిహారం సరిపోలేదని మా నాన్న కోర్టుకెళ్తే మాకు ఇంకా రూ.70 వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. దాన్ని నిజాం రాజు చెల్లించాడు. ఆషామాషీగా ప్రారంభించలేదు.. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఆషామాషీగా ఏమీ ప్రారంభించలేదు. దీన్ని ప్రారంభిస్తున్నప్పుడు నాకు కూడా సందేహాలు కలిగాయి. మిర్యాలగూడ, భువనగిరి ఆర్డీవోలను క్షేత్రస్థాయికి పంపించాం. రంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లతో పరిస్థితిని అధ్యయనం చేయించాం. వారి అనుభవాలను పరిశీలించాకే ఓ నిర్ధారణకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీన్ని 100 శాతం పారదర్శకతతో అమలు చేస్తున్నాం. అప్పటికప్పుడు పరిష్కారం కానివి తప్ప మిగతావన్నీ సరి చేయమంటున్నాం. దాదాపు 55 లక్షల మంది రైతు కుటుంబాలతో ముడిపడి ఉన్న సమస్య ఇది. దీనికోసం టాంటాం వేయిస్తున్నాం. రైతులకు నోటీసులిస్తున్నాం. పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాం. తెలంగాణలో మొత్తం 2.76 కోట్ల ఎకరాల భూభాగం ఉంది. 10,885 రెవెన్యూ గ్రామాలున్నాయి. అందులో గ్రామీణ రెవెన్యూ గ్రామాలు 10,806. వాటిలో మొదటి దశలో 6,242 గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన ప్రారంభం కాగా.. 3,500 గ్రామాల్లో పూర్తయింది. 1,418 బృందాలు అహోరాత్రులు పాల్గొంటున్నాయి. మరో వారం రోజుల్లో 2,742 గ్రామాల్లో పూర్తయితే మొత్తం 60 శాతం అయిపోతుంది. మిగిలిన 40 శాతాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 31 కల్లా పూర్తి చేస్తాం. ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో ప్రక్షాళన చేస్తాం. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం అన్ని వివాదాలు పరిష్కారమై, సమస్యలు రాని భూమి (పార్ట్–ఏ) 87 శాతంగా తేలింది. అందులో 14 జిల్లాల్లో ఇది 90 శాతం కన్నా ఎక్కువ ఉంది. మరి మేం చేసింది ప్రజలకు ఎలా చెప్పాలి? కాంగ్రెస్ వింత వైఖరి అవలంబిస్తోంది. అసెంబ్లీలో మేం చేసింది చెప్పుకుంటే సభను ప్రచార వేదికగా వాడుకుంటామంటున్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇస్తే డబ్బు వృథా అంటున్నారు. మరి మేం చేసింది ప్రజలకు ఎలా చెప్పాలి? అయినా భూరికార్డుల ప్రక్షాళన కోసం అన్ని భాషల పత్రికల్లో కలిపి మేం ఇచ్చిన ప్రకటనల విలువ కేవలం రూ.7.35 కోట్లే. నేను పుట్టిన చింతమడక పడమటి గడ్డపై 93 ఎకరాలను 136 మందికి అసైన్ చేశారు. ఈ భూమిని కొందరు అమ్ముకున్నారు. కొన్నవారు కూడా దాదాపు అదే సామాజిక వర్గానికి చెందిన వారే. అందుకే అసైన్డ్ విషయంలో గ్రామం ఎలా నిర్ణయిస్తే అలా చేస్తాం. అసైనీలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనీయం. భూదాన భూములపై సిన్హా కమిటీ నివేదిక ఆధారంగా చర్యలుంటాయి. నయీం ఆక్రమించిన భూములు, మియాపూర్ భూములు.. ఇలా అన్ని అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశాం. వాటికి, రెవెన్యూ వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదు. వారికి అధికారిక కార్యక్రమాల్లో తలదూర్చే అవకాశం లేదు. కాగితాల్లేకుండానే రుణాలిచ్చే విధానం తెస్తాం రికార్డుల ప్రక్షాళన వివరాలు అప్పుడే ఆన్లైన్లో పెట్టొద్దని చెబుతున్నాం. ముందు హార్డ్‌కాపీ తయారు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్ కార్యాలయాలతోపాటు రెÐవెన్యూ ఉన్నతాధికారులు, సీఎం, సీఎస్ల కార్యాలయాల్లో ఐటీ అధికారులను నియమిస్తాం. వారే రెవెన్యూ రికార్డుల వివరాలను అప్లోడ్ చేస్తారు. భూమికి సంబంధించిన రికార్డుల అప్డేషన్ 100 శాతం డైనమిక్‌గా ఉంటే జీడీపీ దానంతట అదే 2 శాతం పెరుగుతుందని అనేక అధ్యయన సంస్థలు, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలు చెప్పాయి. రిజిస్ట్రేషన్ బాధల నుంచి ప్రజలు విముక్తులు కావాలి. ప్రస్తుతం ఉన్న 141 రిజిస్ట్రేషన్ కార్యాయాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. మిగిలిన 443 మండలాల్లో తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ అధికారాలు ఇస్తాం. గతంలో ముక్కుపిండి వసూలు చేసే భూమి పన్నే ఆదాయవనరుగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వమే భూమికి పెట్టుబడి ఇస్తా అనే కాలం వచ్చింది. మనం కూడా కాలాన్ని బట్టి మారాలి. నా అభిప్రాయాన్ని బట్టి రైతుకు ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. అన్నీ ఒకే సర్వే నంబర్లో ఉండాలి. ఇది నా ప్రతిపాదన మాత్రమే. మ్యుటేషన్ అధికారాలు కూడా తహశీల్దార్లకు ఇస్తున్నాం. పంటరుణాల కోసం రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో పెట్టుకోకూడదు. ఆన్లైన్లోనే కాగితాల్లేకుండా రుణాలిచ్చే విధానాన్ని అమల్లోకి తెస్తాం. భూరికార్డుల ప్రక్షాళనలో పాలుపంచుకుంటున్న రెÐðవెన్యూ సిబ్బందికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇస్తాం. పాస్‌బుక్కులపై ఇంకెవరూ రాయలేరు.. వచ్చే ఏడాది మే నెల నుంచి ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సాయం బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నాం. అందుకే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టాం. ఈ రికార్డుల ఆధారంగానే పెట్టుబడి సాయం ఇస్తాం. జనవరి 26 నుంచి కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తాం. 26 రకాల భద్రతా చర్యలతో వీటిని తయారు చేస్తున్నాం. నెలరోజులు నీళ్లలో ఉన్నా ఇది పాడు కాదు. దీనిపై ఇంకెవరూ ఏమీ రాయలేరు. దీనిపై రాసే పెన్నులు కేవలం రెవెన్యూ అధికారుల వద్దే ఉంటాయి. పాస్‌పోర్టు కంటే బాగుండే టాంపర్ చేసే వీల్లేని పాస్‌పుస్తకాన్ని తయారు చేస్తున్నాం. ప్రతి రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్రంలోని అందరు రైతుల రికార్డులు అందుబాటులో ఉంచుతాం. వీటిని ప్రజలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీకి కూడా ఒక కాపీ ఇస్తాం. ఫిబ్రవరి నెలలో పట్టణాల్లో ప్రక్షాళన జరుపుతాం. అవసరమైన చోట్ల సర్వే చేస్తాం. -
నకిలీ పాసుపుస్తకాలు, పహనీలు!
పంట రుణం పొండం కోసం.. నిర్మల్‌లో యథేచ్ఛగా తయారీ ఖానాపూర్‌లో వెలుగు చూసిన ఘటన ఆర్డీవో, తహసీల్దార్ సంతకాల ఫోర్జరీ పుస్తకాల్లో తేడాలు గుర్తించిన ఎస్బీఐ.. ఖానాపూర్ : ఇటీవల ఐటీడీఏ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందా జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన ఘటన మరువకముందే.. నూతన జిల్లాగా ఏర్పడబోయే నిర్మల్ కేంద్రంగా నకిలీ పహనీలు, పట్టా పాసు పుస్తకాల తయారీ దందా ఉదంతం తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నకిలీ పాసుబుక్ తయారు చేసి బ్యాంకు అదికారులను బురిడి కొట్టించేలా ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బుక్కులోని చిన్న చిన్న లోపాలతో అధికారులకు పట్టుబడేలా చేశాయి. నిర్మల్ కేంద్రంగా ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇదీ సంగతి.. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మోసాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ, ఆర్థిక సహకారం అందాలని ప్రభుత్వాలు అన్ని పనులకు సైతం దాదాపు ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నాయి. కానీ ఖానాపూర్ మండలంలోని వెంకంపోచంపాడ్ గ్రామానికి చెందిన కొందరు నిర్మల్ కేంద్రంలో ఓ మీసేవ యజమాని సహకారంతో ఏకంగా ఆన్లైన్లో నకిలీ పహనీ పత్రాలు, పట్టా పాసు పుస్తకాలు తయారు చేస్తున్నారు. భూములు లేకున్నా పుస్తకంలో భూములు ఉన్నట్లు సర్వే నంబర్లు రాసి చూపి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాన్ని సష్టించి వాణిజ్య బ్యాంకుల్లో పంట రుణాలు, ఇతర రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓSవ్యక్తి శుక్రవారం నకిలీ పాసు పుస్తకాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ పాస్‌బుక్ బాగోతం గురించి తహసీల్దార్ ఆరె నరేందర్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కె.రాఘవేంద్రన్ వెల్లడించారు. వెలుగు చూసిందిలా.. వెంకంపొచంపాడ్ గ్రామానికి చెందిన పవార్ ఆనంద్ అనే వ్యక్తి అతడి భార్య అనిత పేరుతో మూడు ఎకరాల నాలుగు గుంటల భూమి సర్వే నంబర్ 341/1/1లో ఉన్నట్లు 226 పట్టా నంబర్‌తో నకిలీ పాసు పుస్తకాన్ని తయారు చే యించాడు. ఆ పుస్తకంలో నిర్మల్ ఆర్డీవో సంతకంతో పాటుగా తహసీల్దార్, వీఆర్వో సంతకాన్ని సైతం ఫోర్జరీ చేశాడు. అలాగే నిర్మల్‌కు చెందిన ఓ మీసేవ యజమాని సహకారంతో ఆన్లైన్లో నకిలీ పహనీ సర్టిఫికెట్లు కూడా సష్టించగలిగాడు. దొంగ పాసుపుస్తకాలు కూడా నిర్మల్‌లోనే కొనుగోలు చేసినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలిసిందని తహసీల్దార్ నరేందర్ తెలిపారు. అయితే ఈ డూప్లికేట్ పాసు పుస్తకాన్ని ఖానాపూర్ ఎస్బీఐ బ్యాంకులో అందజేసి పసుపు పంటకు రుణం ఇవ్వాలని ఆనంద్ కోరాడు. బ్యాంకు అధికారులు ఆ పాసు పుస్తకాన్ని పరిశీలించి చూడగా దానిపై యూనిక్ ఐడీ లేకపోవడంతో అనుమానం వచ్చి రెవెన్యు కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవార్ అనిత భర్త ఆనంద్ పేరిట వెంకంపోచంపాడ్ గ్రామ పరిధిలో 226 పట్టా నంబర్‌తో సర్వే 341/1/1లో, 3.04 ఎకరాల భూమి ఎక్కడా లేదని తహసీల్దార్ నిర్ధారించారు. నకిలీ పాసుపుస్తకాలను తయారు చేసి బ్యాంకులను ఆయా శాఖల అధికారులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రహించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం ఇలా డూప్లికేట్ పాసు పుస్తకాలు తయారు చేసిన వ్యక్తిపై గ్రామ పరిధి గల పెంబి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తహసీల్దార్ నరేందర్ తెలిపారు. ఈ దందాలో ఉన్న నిందితులందరిపైనా సమగ్ర విచారణ చేపిస్తామని పేర్కొన్నారు. ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. -
కదులుతున్న నకిలీ పాస్‌పుస్తకాల డొంక
ఫిర్యాదు చేస్తున్న రైతులు వందల సంఖ్యలో నకిలీ పాస్‌పుస్తకాలు రెవెన్యూ అధికారుల సహకారంతో ముఠా కార్యకలాపాలు ? ఫీల్డ్ ఆఫీసర్ల సాయంతో బ్యాంకుల్లో రుణాలు ? కొడకండ్ల : మండలంలోని నకిలీ పాసు పుస్తకాల డొంక కదులుతోంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకొని వేలాది రూపాయలు తీసుకొని నకిలీ పాస్ పుస్తకాలను అందించిన ముఠా లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. నాలుగైదేళ్లుగా నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి రెవెన్యూ, బ్యాంక్ అధికారుల సాయంతో రుణాలు పొందిన అక్రమార్కుల బాగోతం వెలుగులోకి వస్తోంది. మండల కేంద్ర శివారు దుబ్బతండాకు చెందిన దరావత్ భీమానాయక్, బానోత్ యాకూబ్ నకిలీ పాస్ పుస్తకాల తయారీ కేసులో శుక్రవారం అరెస్టయిన సంగతి తెలిసిందే. విషయం తెలిసిన తర్వాత వారి ద్వారా పాస్‌పుస్తకాలు చేయించుకున్న పలువురు రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తమ పుస్తకాలను అధికారులకు చూపించారు. వాటిని నకిలీ పుస్తకాలుగా అధికారులు తేల్చడంతో కడగుట్టతండ రైతులు లబోదిబోమంటున్నారు. భీమా నాయక్, యాకూబ్ తమ వద్ద డబ్బులు తీసుకొని నకిలీ పాస్‌పుస్తకాలను తయారు చేసిచ్చి బ్యాంక్‌లో రుణాలు కూడా ఇప్పించినట్లు వారు ఫిర్యాదు చేశా రు. రెవెన్యూ సిబ్బందితోపాటు బ్యాంక్‌లోని ఫీల్డ్ ఆఫీసర్లు ముడుపులు తీసుకొని ఈ ముఠాకు సంపూర్ణ సహకారం ఇచ్చారనే ఆరోపణ లకు రైతుల ఫిర్యాదులు బలం చేకూరుస్తున్నాయి. నకిలీ పాస్‌పుస్తకాలను తయారు చేసిన తర్వాత కంప్యూటర్ పహాణీ, 1 బీలో నమోదు కోసం రెవెన్యూ సిబ్బంది, అధికారులకు ఈ ముఠా పెద్ద ఎత్తున ముడుపులిచ్చినట్లు తెలుస్తోంది. ఒకేసారి పెద్దమొత్తంలో నకిలీ పాస్ పుస్తకాలకు సంబంధించిన ఫైళ్లను ఈ ముఠా తయారు చేసుకొని సంబంధిత వీఆర్వో, అధికారుల సహకారంతోనే మ్యూటేషన్, కరెక్షన్ పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. పూర్వ అధికారుల సాయంతోనే.. కొద్దిరోజులే ఇక్కడ పనిచేసిన ఓ మహిళా అధికారికి జనగామ లో ఉన్న తన నివాసంలోనే ఈ ముఠా పనులను చక్కబెట్టగా, ఆ తర్వాత కొద్దికాలం ఇన్‌చార్‌్జగా వ్యవహరించిన పాలకుర్తి తహసీల్దార్ హయాంలోను జోరుగా అక్రమాలు చోటుచేసుకున్నాయ నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని పోచంపల్లి, గంట్లకుంట, రామవరం తదితర గ్రామాల్లోని దళారులు ఈ ముఠాతో జతకట్టి వందల సంఖ్యలో నకిలీ పాస్ పుస్తకాలను చలామణీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అసలు భూములు లేని రైతుల పేరిట కూడా నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంక్‌లో రుణాలు ఇప్పించగా వారు ప్రభుత్వ రుణమాఫీలో కూడా లబ్ధిపొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందిం చి నకిలీ పాస్ పుస్తకాల బాగోతంపై సమగ్ర దర్యాప్తు చేయించినట్లయితే ముఠాకు సంబంధించిన మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
‘పాసు పుస్తకాల రద్దు సరికాదు’
ఎ.కొండూరు: రైతు పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు ఆలోచన మానుకోవాలని తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేస్తే రైతులు అనేక ఇబ్బందులు పడతారన్నారు. అడంగళ్‌లో రైతుల పేర్లు తప్పులతడకగా ఉన్నాయని, వాటి సవరణ కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. బిల్లులు అందక పోవడంతో గృహనిర్మాణాలు పూర్తికాక లబ్ధిదారులు పూడి గుడిసెల్లో నివాసముంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ధనికులకు పెన్షన్లు మంజూరు చేస్తూ అర్హులైన పేదల పేర్లు తొలగిస్తున్నారన్నారు. టీడీపీ జెండాలు పట్టుకుంటే సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పార్టీలకుతీతంగా సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించారని గుర్తు చేశారు. మరుగుదొడ్ల బిల్లులు చేయడంలో జాప్యం జరుగుతుందని, అధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అర్హులకు తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేయాలన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా నాయకులు నరెడ్ల వీరారెడ్డి, జెడ్పీటీసీ పాలం ఆంజనేయులు, మండల అధ్యక్షుడు భూక్యా గనియా, తూమ్మూరు వెంకటేశ్వరరెడ్డి, అత్తునూరు వెంకటరెడ్డి, చిట్టూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
భూముల కోసం ఎమ్మార్వోకు గిరిజనుల ఫిర్యాదు
అశ్వరావుపేట: ‘‘గత ఇరవై సంవత్సరాలుగా ఈ భూములను మేమే సాగు చేసుకుంటున్నాం.. ఇప్పుడు అటవీశాఖ వాళ్లొచ్చి ఈ జమీన్ సర్కారోళ్లదని కంచె వేస్తున్నారు. మీరైనా న్యాయం చేయండి’’ అని గిరిజనులు అశ్వరావుపేట తహశీల్దార్‌కు మొరపెట్టుకున్నారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం ఉట్లపల్లిగ్రామంలో అటవీ అధికారులు తమ భూముల్లో కంచె వేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో మంగళవారం తహశీల్దార్ భవాని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఉన్న పంటలను కొనసాగించుకోనివ్వాలని ఆ తర్వాత సర్వే నంబర్ల ప్రకారం కంచెలు వేసుకోవాలి.. ఒకవేళ స్థానికుల వద్ద పాస్‌పుస్తకాలు లేని భూమి కొలతల్లో బయటపడితే దాన్ని అటవీశాఖకు అప్పగిస్తామని ఆమె తెలిపారు. -
పాస్‌పుస్తకాల మాయంపై ఎంఆర్ఐ రిమాండ్
లింగంపేట: నిజామాబాద్ జిల్లా లింగంపేట తహశీల్దారు కార్యాలయంలో పట్టాదారు పాస్‌పుస్తకాలు మాయమైన వ్యవహారంలో మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ రేఖను బుధవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే గతంలో పట్టుబడిన ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలను మండల కార్యాలయంలో ఉంచారు. అవి కనిపించకుండా పోవటంపై రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రపరిచిన పాసుపుస్తకాలు గత ఏడాదిలో తహసీల్ కార్యాలయం నుండి మాయమయ్యాయి.సుమారు 80కి పైగా పట్టాపాసు పుస్తకాలు మాయమైనట్లు గత ఏడాది ఆగస్టు 29న ‘పాస్‌పుస్తకాలు మాయం’ అనే శీర్షికన సాక్షి ప్రచురించిన కథనానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ఈ వ్యవహారం గురించి అప్పటి కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారుు. ఆర్డీఓ ిఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు పాసుపుస్తకాలు మాయం కావడానికి అప్పటి తహసీల్దార్( ప్రస్తుత బిచ్కుంద తహసీల్దార్) దన్వాల్, లింగంపేట మండల ఆర్ఐ రేఖ బాధ్యులని పేర్కోంటూ ఇద్దరిపై కేసునమోదు చేసారు. ఈరోజు ఆర్ఐ రేఖను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. దన్వాల్ను త్వరలో అరెస్ట్ చేస్తామనీ ఎస్ఐ చెప్పారు.