Pelait
-
గాల్లో తేలినట్టుందే ...
విమానంలో వెళ్తున్నప్పుడు ప్రయాణికుల సీటులో కూర్చుని బుల్లి కిటికీలోంచి బయటకు చూస్తే.. వచ్చే అనుభూతి వేరు. మేఘాలు.. అంతా చిన్నచిన్నగా కనిపించడం.. తొలిసారి విమానం ఎక్కినోళ్లయితే.. చిన్నపిల్లల్లా సంబరపడిపోతారు. అదే పెలైట్ సీటులో కూర్చునే చాన్స్ ఇస్తేనే.. అక్కడ్నుంచి వ్యూ అదిరిపోదూ.. ట్రిటాన్ అనే ఈ విమానమొక్కితే.. అలాంటి అరుదైన అనుభూతి మన సొంతమవుతుంది. ఈ విమానానికి రెండు వైపులా రెండు అదనపు క్యాబిన్లలాంటివి ఉంటాయి. ఒక్కోదానిలో ఐదుగురు వరకూ కూర్చోవచ్చు. వాటిల్లో కూర్చుంటే పైలట్ సీటులో కూర్చున్నట్లు ఉంటుందని.. అన్ని వైపులా అద్దాలే ఉండటంతో అద్భుతమైన అనుభూతి మీ సొంతమవుతుందని దీని డిజైనర్ అమెరికాకు చెందిన మైక్రోనాటిక్స్ సంస్థ చెబుతోంది. ప్రపంచంలో పేరొందిన పర్యాటక ప్రాంతాల మీదుగా దీన్ని నడపనున్నట్లు ప్రకటించింది. త్వరలో ఈ విమానం తయారీ, ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపింది. -
యాక్టర్ అయిన పెలైట్
సినిమా ఫ్యాషన్ అయినప్పుడు వేరే వృత్తిపై మనసు లగ్నం కావడం కష్టమే. అలా పెలైట్‌గా శిక్షణ పొంది యాక్టరయ్యూరు జితేష్. ఉపాధ్యాయ కుటుంబానికి చెందిన ఈయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. హీరోగా తొలి చిత్రం చిక్కు ముఖి. మలి చిత్రం తలకోణం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇంతకీ ఈయన కథేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. అందుకే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివినా సినిమా రంగంపైనే మొగ్గు చూపాను. చదువుకునే రోజుల నుంచే స్టేజీ అనుభవం ఉంది. పలు నాటకాలు ఆడాను. ఆ తరువాత మోడలింగ్ రంగానికి పరిచయమయ్యాను. ప్రముఖ వాణిజ్య సంస్థలు చెన్నై సిల్క్స్, రామ్రాజ్ శ్రీదేవి టెక్స్‌టైల్స్‌కు మోడల్‌గా నటించాను. యూకేలో 45 నిమిషాల నిడివి గల రెండు చిత్రాల్లో నటించాను. నృత్య దర్శకుడు శ్రీధర్ వద్ద నృత్యంలో శిక్షణ పొందాను. ఒక నాటక ప్రదర్శనలో చూసిన చిక్కిముఖి చిత్ర నిర్మాత ఆ చిత్రంలో కథానాయకుడిగా అవకాశం కల్పించారు. ఆ తరువాత తలకోణం చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మధ్యనే నాళై ఇయక్కునర్ (రేపటి దర్శకులు) టీమ్‌కు చెందిన భారతీ బాలకుమారన్ దర్శకత్వంలో సత్య ప్రమాణం అనే లఘు చిత్రంలో నటించాను. ఈ లఘు చిత్రం త్వరలో చలన చిత్రంగా రానుంది. చిన్నతనం నుంచి నటుడు అజిత్ అంటే పిచ్చి అభిమానం. ఒక రకంగా ఆయనే నాకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మంచి చిత్రాలు చేసి నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం నటుడిగా ఎదగాలన్నదే. -
రమ్మన్నా... రానన్న పైలట్
హెలికాప్టర్ పైలట్‌తో పొన్నాల గొడవ హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు హెలికాప్టర్ కష్టాలొచ్చి పడ్డాయి. తెలంగాణ అంతటా తిరిగేందుకు హెలికాప్టర్ అద్దెకు తీసుకుంటే పార్టీ అభ్యర్థులెవరూ ప్రచారానికి పిలవకపోవడం కనీసం తన సొంత జిల్లాలో తిరిగేందుకైనా ఉపయోగించుకుందావునుకున్నా దానికీ తిప్పలే ఎదురవుతున్నాయి. వుంగళవారం ఓచోటకు రావడానికి పెలైట్ నిరాకరించడంతో పొన్నాలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పైలట్‌ను తిట్టుకుంటూ హెలికాప్టర్ దిగి కారులో వెళ్లిపోయారు. దీంతో నిర్ఘాంతపోయిన పైలట్ పైఅధికారికి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. సినీనటి విజయశాంతి, పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కోదండరె డ్డిలతో కలిసి మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు పొన్నాల తన సొంత నియోజకవర్గంలోని మద్దూరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ సమీపంలోని మడికొండకు వెళ్లేందుకు పొన్నాల హెలికాప్టర్ వద్దకు వచ్చారు. ఈనెల 25న రాహుల్‌గాంధీ మడికొండకు వస్తున్నందున బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లాలని పైలట్‌ను ఆదేశించారు. దీనికి పైలట్ నిరాకరించాడు. షెడ్యూల్ ప్రకారం బేగంపేటకు మాత్రమే తీసుకెళతానని, మడికొండకు వెళ్లేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేదన్నాడు. దీంతో అసహనానికి లోనైన పొన్నాల వెంటనే మీ పై అధికారికి ఫోన్ కలపాలంటూ వుండిపడ్డారు. దానికీ పైలట్ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన పొన్నాల పైలట్‌ను దుర్భాషలాడి హెలికాప్టర్ దిగి కారులో మడికొండ వెళ్లారు. దీంతో విజయశాంతి, కోదండరెడ్డిలను మాత్రమే తీసుకుని పైలట్ హైదరాబాద్‌కు చేరి పొన్నాలపై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. కాగా, సాయంత్రం పొన్నాల హైదరాబాద్‌కు రోడ్డు మార్గానే బయలుదేరారు. నామినేషన్లు ముగిసిన నాటి నుంచి పోలింగ్ జరిగే వరకు తెలంగాణ అంతటా ప్రచారం చేయడానికి పొన్నాల హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నారు. గంటకు లక్షకుపైగా వెచ్చిస్తున్న హెలికాప్టర్ అనుకున్న రీతిలో ఉపయోగపడడం లేదనే భావనతో ఆయన ఉన్నారు. దీనికితోడు కాంగ్రెస్ అభ్యర్థులెవరూ ప్రచారానికి రావాలని తనను పిలవకపోవడం కూడా ఆయనకు ఇబ్బందిగా మారింది. వృథా చేయకుండా హెలికాప్టర్‌ను హైదరాబాద్-వరంగల్ షటిల్ సర్వీస్‌లా వాడుకుందామని భావిస్తే అదీ కుదరడం లేదని పొన్నాల బాధ.