playing
-
కాల్ గర్ల్‌గా నటించడం గౌరవంగా ఉందన్న శోభిత (ఫోటోలు)
-
అచ్చం బిచ్చగాడిలా నమ్మించి..
అతనో నటుడు.. చిన్నచిన్న వేషాలు వేస్తుంటే వచ్చే డబ్బుతో ఇల్లు గడవట్లేదు. ఎలాగా అని ఆలో చించి ఓ కొత్త వేషం వేశాడు. అది సినిమాల్లోనో, సీరి యళ్లలోనో కాదు.. బయట జనం మధ్యలో నటించడం మొదలుపెట్టాడు. ఈ వేషం సూపర్ సక్సెస్ అయింది. నెలకు ఎనిమిది లక్షల రూపాయలకుపైనే సంపాదించి పెట్టేస్తోంది. అది కూడా ఆదాయ పన్ను వంటివేమీ కట్టాల్సిన అవసరం లేని సంపాదన. మరి ఆ వేషమేంటో తెలుసా..? ‘బిచ్చగాడు’. చైనాలో ని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లు జింగాంగ్ కథ ఇది. అతను సుమారు పన్నెండేళ్ల కింద ఓ రోజు ‘నటన’ మొదలుపెట్టాడు. అక్కడ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే పర్యాటక ప్రదేశం ‘కిన్మింగ్ షాంగే గార్డెన్’ను ఎంచుకున్నాడు. ముఖానికి కాస్త మసి, చిరుగులు– అతుకులతో ఉన్న బట్టలు వేసుకుని.. ఓ చేతి లో కర్ర, మరో చేతిలో చిప్ప పట్టుకుని.. చూడగానే జాలి కలి గేలా అమాయ కపు మొహం వేసుకుని అడుక్కోవడం మొదలుపెట్టాడు. మనోడి నటనా కౌశలానికి పర్యాట కులు పడిపోయి దండిగానే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అలా నెలకు రూ.8లక్షలకుపైనే సంపాదిస్తున్నాడట. జింగాంగ్ అడుక్కోవడం మొదలుపెట్టిన కొత్తలో అతడి కుటుంబ సభ్యులు ఛీకొట్టి వదిలేసి పోయారట. కానీ బాగా డబ్బులు వెనకేశాక.. మళ్లీ అంతా తిరిగొచ్చేశారట. అంతా ‘నటన’!? -
గోపాల మురిపాల బాల
కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్‌వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
సంపూర్ణంగా కోలుకున్న లాలూ
న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. చాలా హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని తేజస్వి యాదవ్ క్యాప్షన్ పెట్టారు. -
అలా కొట్టుకుపోయారు
-
ఆ అమ్మాయి ఫుట్‌బాల్ గేమ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
-
చీరకట్టులో.. చెంగు చెంగున గోల్స్
-
అమ్మలాంటి ఆవు..బుజ్జోడి నవ్వులు
-
బుడ్డోడి ధైర్యం సల్లగుండా.. భయం లేకుండా ఎలా కొండచిలువుతో ఆడుతున్నాడో చూడండి !
-
Video: ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి
బోరు బావులు చిన్నారుల పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల తెరిచి ఉంచిన బోరు బావిలో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న మావియా అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. జిల్లా లోని కోట్ల సాదత్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బావిలో నుంచి బాలుడి అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంపై పోలీసులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చిన్నారిని కాపాడేందుకుసహాయక చర్యలు ప్రారంభించాయి. ముందుగా ఆక్సిజన్‌ను బోరుబావిలోకి పంపించారు. 5 గంటలు తీవ్రంగా శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. చివరికి బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో బాలుడికి స్వల్ప గాయాలు కాగా.. అతడు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ బోరు బావి హాపూర్ మున్సిపాలిటీకి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం దీనిని తవ్విందని, చాలాకాలంగా ఇది నిరుపయోగంగా ఉందని తెలిపారు. సుమారు 35 ఏళ్ళ క్రితం ఈ బోరు బావిని తవ్వారని పేర్కొన్నారు. చదవండి: Honey Trap: సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ.. వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు
-
వైరల్ వీడియో : బెలూన్ తో ఆటలాడుతున్న కుక్క
-
కంగారుతో ఆడుతున్న మంత్రి రోజా
-
మూడేళ్ల బాలిక.. ఏనుగంటే భయం లేకుండా ఎంత పనిచేసింది!
గువాహటి: సాధారణంగా చిన్నపిల్లలకు ఏనుగంటే మహ సరదా. మావటి వాడు ఏనుగును.. ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు దానిమీద ఎక్కడానికి ఇష్టపడుతుంటారు. ఏనుగుకు ఏదైన తినిపించి తెగ సంబరపడి పోతుంటారు. దాని తొండం చేత ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా, అస్సాంలో ఒక బాలిక ఏనుగంటే ఏ మాత్రం భయం లేకుండా దానితోనే ఫుట్ బాల్ ఆడింది. అంతటితో ఆగకుండా దాని పాలను తాగడానికి ప్రయత్నిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. అస్సాంలోని గోలాఘడ్ జిల్లాలో ఒక కుటుంబం ఏనుగును పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో అది వారితో ఒక అనుబంధాన్ని కల్గి ఉంది. వారు ప్రతి రోజు ఏనుగుకు మంచి ఆహరం ఇస్తారు. ఈ క్రమంలో.. ఏనుగు కూడా వారితో ప్రేమగా ఉంటుంది. ఆడుకోవడం కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలో యజమానికి హర్షిత బోరా అనే మూడేళ్ల కూతురు ఉంది. ఆమె చిన్నప్పటి నుంచి ఏనుగును చూస్తూ పెరిగింది. ఆమెకు ఏనుగంటే ఎంతో ఇష్టం. ఏనుగు కూడా బాలిక దగ్గరకు వెళ్లి తొండంతో ప్రేమగా నిమురుతుంది. ఈ క్రమంలో మూడేళ్ల బాలిక ఏనుగుతో ఫుట్‌బాల్ ఆడుకుంటుంది. ఆమె ఏనుగువైపు బాల్‌ను విసరగానే.. ఏనుగు తన తొండంతో ఆ బాల్‌ను అందుకుంది. ఆ తర్వత తిరిగి బాలికవైపు విసిరింది. ఈ క్రమంలో... బాలిక మరోక అడుగు ముందుకు వేసింది. ఏనుగు మోకాలంతా పొడవులేని బాలిక.. అసలు భయం లేకుండా.. ఏనుగు కింది నుంచి అటూ ఇటూ దాటూకుంటూ ఆడుకుంది. ఆ తర్వాత.. దాని పొదుగు దగ్గరకు వెళ్లి దాని పాలను తాగడానికి కూడా ప్రయత్నించింది. ఏనుగు, బాలికతో సరదాగా ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. బాలికకు ఎంత ధైర్యం..’, ‘ ఏనుగు మోకాలంతా కూడా లేదు..’, ‘ అయినా.. అప్రమత్తంగా ఉండాలి..’, ‘భలే ఆడుకుంటుంది..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఇంటి నుంచి కిడ్నాప్ చేసి.. అమానుషంగా ప్రవర్తించారు! -
‘బసవన్న’ ఆశలు సంక్రాంతి పైనే
సాక్షి, పాల్వంచ(ఖమ్మం): సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు మూడురోజుల ముందునుంచే ఎక్కడ ఉన్న డూడూ బసవన్నలు గ్రామాల్లో సందడి చేస్తాయి. ఈ పండుగ గంగిరెద్దులను ఆడించేవారి జీవితాల్లో కొంత కాంతిని నింపి మూడు రోజుల ముందే ప్రారంభం కావడంతో పల్లెల్లో పండగశోభ సంతరించుకుంటుంది. కరోనా ప్రభావంతో గంగిరేద్దుల జీవితాల్లో ప్రభావం చూపిందని చెప్పవచ్చు. వేకువజామున చలిలో గంగిరెద్దులతో ఇంటింట తిరిగడం కనపిస్తుంది. గంగిరెద్దులు ఆడిచేవారికి పండగే ఆధారపడి ఉంటాయి. పండగ సందర్భంగా ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇస్తారు. ఇలా పండగ పూర్తి అయ్యేనాటికి వచ్చిన ఆధాయంతో ఆరునెలలపాటు సంతోషంగా కుటుంబం అంతాగడుపుతారు. తర్వాత కూలీపనులు చేసుకుంటు జీవనం సాగిస్తుంటారు. చిన్నప్పటి నుంచే శిక్షణ గంగిరెద్దులు విన్యాసాలు చేసే విధంగా వారు చిన్నప్పటి నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ గంగిరెద్దులను నమ్ముకుని అనేక కుటుంబాలు పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ మండలంలో జీవనం సాగిస్తున్నాయి. తాత ముత్తాతల నుంచి గంగిరెద్దులను ఆడించుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఎలాంటి వ్యవసాయ భూములు, ఇళ్లు, కనీసం రేషన్‌కార్డులు లేవని వాపోతున్నారు. సంక్రాంతి పండగ తోపాటు ఎవ్వరైన పెద్దవాళ్లు కాలం చేస్తే పదవ రోజున ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గంగిరెద్దులతో విన్యాసాలు చేయించి పరుగులు పెట్టిస్తారు. ఇలా బసవన్నల ఆడించుకుంటుంటే దయగణాలు అంతో ఇంతో దానంచేస్తే వచ్చిన వాటితోనే జీవనంసాగిస్తున్నామని గంగిరెద్దులను ఆడించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, పింఛన్లు అందజేయాలని వారు వేడుకుంటున్నారు. చదవండి: ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆత్మహత్యాయత్నం -
Harish Rao: బ్యాట్ పట్టి.. షాట్స్ కొట్టి..
సాక్షి, సిద్దిపేట(మెదక్): నెలరోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా ఉంటూ.. కరోనా మూడో వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వైద్యాధికారులతో సుదీర్ఘ సమీక్షలు జరుపుతూ హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో తనిఖీలతో తలమునకలైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం సరదాగా క్రికెట్ ఆడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ఫుడ్, స్పోర్ట్స్ డ్రైవ్ ఇన్ హోటల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బాక్స్ క్రికెట్ నెట్లో కొద్దిసేపు బ్యాట్ పట్టి అందరినీ ఆకట్టుకున్నారు. చదవండి: బతుకునిచ్చే చెట్టుపైనే ఊపిరి పోయె -
భారీకొండ చిలువతో చిన్నారి ఆటలు, చూస్తే షాకవ్వాల్సిందే!
సాధారణంగా చాలామంది పాముని చూడగానే భయంతో వణికిపోతుంటారు. పాము ఉందంటే ఆ దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా ఇష్టపడరు. ఒక్కొసారి పాములు, కొండ చిలువలు దారితప్పి.. జనవాసాల మధ్యన, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోనికి వస్తుంటాయి. లేదా చాలా తక్కువ మంది ఇళ్లలోనే పాములను పెంచుకుంటారు. అలాంటి వారు పాముకి బయపడకుండా వాటితో మంచి స్నేహాన్ని ఏర్పరుచుకుంటారు. తాజాగా ఓ చిన్నారి పెద్ద పాముతో ఎలాంటి బెరుకు లేకుండా ఆడుకుంటున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందులో అయిదారేళ్ల వయసున్న చిన్నారి రెడ్ కలర్ టీషర్టు ధరించి తన ఇంటి ఆవరణంలో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడి భారీ కొండ చిలువ వచ్చింది. అయితే కొండచిలువను చూసిన చిన్నారి ఏమాత్రం భయపడలేదు. పైగా నవ్వుతూ పాము దగ్గరకు వెళ్తుంది. కొండ చిలువను పట్టుకొని దానితో ఆటలాడుతుంది. ప్రశాంతంగా పాము మీద పడుకుంటుంది. చిన్నారి పక్కన పాము పాకడం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచినట్లు అనిపిస్తుంది. చదవండి: ‘మేరా ఫౌజీ అమర్ రహే’.. పెళ్లినాటి దుస్తుల్లో భర్తకు తుది వీడ్కోలు ఇక చిన్నారి వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. కొండచిలువతో ఆడిన పసిపాప ధైర్య హృదయాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుండగా, లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. కాగా చిన్నారి ఆడుకుంటున్న పాము శిక్షణ పొందిన పెంపుడు జంతువు అని తెలిసింది. చదవండి: ప్రేయసికి వెరైటీగా ప్రపోజ్ చేసిన ఆసీస్ మహిళ.. ఎలాగో చూడండి..! View this post on Instagram A post shared by 🐍SNAKE WORLD🐍 (@snake._.world) -
విషాదం: ఆడుకుంటూ.. అనంతలోకాలకు
వేర్వేరు ఘటనల్లో నివారం ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్ కోళ్ల ఫారంలో మక్కల బస్తాలు మీద పడి ఒకరు, కోనరావుపేట మండలంలోని హన్మాజీపేటల్లో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. ఈ ముగ్గురూ ఆడుకుంటూనే అనంతలోకాలకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. సాక్షి,కోనరావుపేట(వేములవాడ): ఇంట్లో ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి విద్యుదాఘాతంతో మృతిచెందింది. స్థానికుల కథనం ప్రకారం.. వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన గొర్రె అనిత–సంజీవ్ దంపతులు తమ కూతురు వాంగ్మయి(2)తో కలిసి మండలంమరిమడ్ల(అహ్మద్ హుస్సేన్‌పల్లి)లోని బంధువులు ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం వాటర్ హీటర్ స్విచ్ ఆఫ్ చేసి, ఉన్నా చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ముట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పాపను జిల్లా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మరో ఘటనలో.. మక్కల బస్తాలు మీద పడి.. ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా గోధూర్ గ్రామంలోని రాజరాజేశ్వర కోళ్లఫారంలో మక్కల బస్తాలు మీదపడి నందిని(4) మృతి చెందింది. ఏఎస్సై రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంగీత–భీంరావు దంపతులు తమ కూతురు నందినితో కలిసి ఉపాధి కోసం పది రోజుల కిందట గోధూర్ వచ్చారు. స్థానిక రాజరాజేశ్వర కోళ్లఫారంలో కూలీలుగా పనికి కుదిరారు. శనివారం తల్లిదండ్రులు పనిలో నిమగ్నం కాగా కోళ్లఫారానికి సంబంధించిన గోదాములో నందినితోపాటు మరికొంత మంది కూలీల పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో మక్కల బస్తాలు నందినిపై పడ్డాయి. పిల్లలు అరవడంతో కూలీలందరూ అక్కడికి చేరుకున్నారు. బస్తాలు తీసి చూడగా ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలై, స్పృహ కోల్పోయింది. వెంటనే మెట్పల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కోళ్ల ఫారం యజమాని మిట్టపెల్లి మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. చదవండి: మాటిమాటికీ సెల్‌ఫోన్, బైక్ అడిగేవాడు.. కాదనడంతో క్షణికావేశంలో.. -
ప్లేయర్లతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడిన రోజా
-
అయ్యయ్యో.. టీవీ చానెల్ ఎంత పనిచేసింది!
వాషింగ్టన్: ఉన్నట్టుండి అమెరికాలోని ఒక టీవీ చానల్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. వాతావరణ వివరాలను ప్రసారం చేస్తున్న బులిటెన్‌లో ఏకంగా పోర్న్ కంటెంట్‌ను ప్రసారం చేసింది. దీంతో వీక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈవినింగ్ న్యూస్కాస్ట్లో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. (kidney transplantation: సంచలనం) స్థానిక వార్తా ఛానెల్ అశ్లీల క్లిప్‌ను ప్రసారం చేయడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. సాయంత్రం వార్తల బులిటెన్‌లో భాగంగా వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ వాతావరణ అప్డేట్ ఇస్తున్నారు. ఇంతలో పోర్న్క్లిప్ టెలికాస్ట్ కావడం ప్రారంభమైంది. 13 సెకన్ల స్పష్టమైన వీడియో టెలికాస్ట్ అవుతోంటే..యాంకర్, కో యాంకర్, కోడి ప్రోక్టర్ గానీ దీన్ని గమనించనేలేదు. వివరాల అనంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రాఫిక్ వీడియో వచ్చేదాకా ఇది ప్రసారమైంది. అయితే దీనిపై సంబంధిత టీవీ ఛానెల్ స్పందించింది. పొరపాటు జరిగిందంటూ ఛానెల్ క్షమాపణలు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై వీక్షకుల నుండి ఫిర్యాదులు రావడంతో సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. -
ఇంత పారవశ్యమా, ఇలాంటి వీడియో మీరెపుడూ చూసి ఉండరు
దసరా పండుగ వేళ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వీడియో వైరల్‌గా మారింది. ఒక కోతి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఏకంగా ఒక సాధువు ఒడిలో కూర్చున్న వానరం లయబద్ధంగా కర్తల్ ప్లే చేసి అక్కడున్న వారినందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా స్వయంగా ఆ రాముడి కోసం దిగి వచ్చిన హనుమాన్ అంటూ ముగ్ధులవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఒక కోతి భజన చేస్తున్న సాధువుల చెంతకు చేరింది. వారితో పాటు భక్తి కీర్తనల్లో మునిగియంది. తాళానికి కనుగుణంగా భజనలో ఒక వాయిద్యాన్ని వాయిస్తూ ఆనందంలో మునిగిపోయింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయితున్నారు. ఇది హనుమంతుడి రూపమే అంటూ మురిసి పోతున్నారు. ఇంత పారవశ్యామా ఇలాంటి కోతిని తాను ఎన్నడూ చూడలేదు అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. చాలా ఆనందంగా ఉందంటూ మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. పంకజ్ పరాశర్ తన ఫేస్బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను లక్షలాది మందికి వీక్షించగా, 30 వేల మంది షేర్ చేశారు. -
ఫుట్‌బాల్‌తో ఆడుకున్న ఎలుగుబంట్లు
-
అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా..
హయత్‌నగర్(హైదరాబాద్): ఇంటి ముందు తెరిచి ఉన్న నీటి సంపు ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన అభం శుభం తెలియని ఏడాదిన్నర పాప నీటి సంపులో పడి మృతి చెందిన విషాధ ఘటన శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం రాచకొండ సమీపంలోని కడీలబాయి తండాకు చెందిన వాకుడోతు రా జు, సంతోషి దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. హయత్‌నగర్‌లోని రంగనాయకుల గుట్ట సమీపంలో ఉంటున్నారు. ► రాజు లారీపై లేబర్ పని చేస్తుండగా ఆయన భార్య సంతోషి హోటల్లో పని చేస్తోంది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు నిత్య(ఏడాదిన్నర) శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ సమీపంలో ఉన్న మరో ఇంటివైపు వెళ్లింది. ఆ ఇంటి ముందు ఉన్న సంపు మూత తెరిచి ఉండటంతో నిత్య సంపులో పడిపోయింది. చాలా సేపు ఎవరూ గమనించలేదు. గంట తర్వాత నిత్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం మొదలు పెట్టారు. చివరకు సంపులో తెలియాడటంతో నిత్యను బయటికి తీశారు. అప్పటికే పాప మృతి చెందింది. మురుగు వచ్చిందని.. సంపు మూత తెరిచి ఇటీవల కురుస్తున్న వర్షాలకు సమీపంలోని ఇంటి వద్ద ఉన్న సంపులో మురుగు చేరింది. దీంతో మురుగును బయటి పంపించేందుకు సంపు మూతను తెరి ఉంచినట్లు ఇంటి యజమాని తెలిపింది. సంపు మూతనుపెట్టకుండానే తాను పనికి వెళ్లింది. చుట్టూ ఎటువంటి రక్షణ లేకపోవడంతో అభం శుభం తెలియని చిన్నారి సంపులో పడి మునిగిపోయిందని స్థానికులు తెలిపారు. ► ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: పెంచి పెద్ద చేస్తే.. ప్రాణం తీసింది -
కూలిన శబ్దం విని తల్లి పరుగున బయటకు.. తీరా అక్కడ చూస్తే..
సాక్షి, గచ్చిబౌలి( హైదరాబాద్): అప్పటిదాకా తమ కళ్ల ఎదుటే ఇంట్లో తిరిగిన చిన్నారి కాసేపటికే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆడుకుంటుండగా దిమ్మె కూలి గేటు మీద పడటంతో దుర్ఘటనలో ఆరేళ్ల బాలుడు అసువులు బాశాడు. ఈ విషాదకర ఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు.. మహారాష్ట్రకు చెందిన దంపతులు రాహుల్ సూర్యవంశీ, మీనా సూర్యవంశీ గోపన్‌పల్లిలో జర్నలిస్ట్ కాలనీని ఆనుకొని ఉన్న వివేకానందనగర్ (60 గజాల సైట్)లో నివాసం ఉంటున్నారు. వీరికి నితేష్ (6), రూపేష్ కవల కుమారులతో పాటు కూతురు స్నేహ ఉన్నారు. రాహుల్ కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో రెండో తరగతి చదువుతున్న నితేష్ ఆన్లైన్ క్లాసులు ముగియడంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న ప్లాట్ నంబర్ 125 గేటుకు వేలాడుతూ ఆడుకుంటున్నాడు. దిమ్మె కూలడంతో ఒక్కసారిగా ఇనుప గేటు మీద పడింది. దీంతో బాలుడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కూలిన శబ్దం విని తల్లి మీనా పరుగున వెళ్లి ఇరుగుపొరుగువారి సహాయంతో బయటకు తీశారు. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు నితేష్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా ప్రతాపం: ఆట పాటలకు టాటా!
సాక్షి, సిటీబ్యూరో: మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకాశంలో హరివిల్లు విరిస్తే.. అవి తమ కోసమేనని ఆనందించే పిల్లలు సెకండ్‌వేవ్ కరోనా విజృంభణ నేపథ్యంలో ఆటపాటలకు వీడ్కోలు పలికారు. ఉరకలెత్తే ఉత్సాహానికి ఫుల్స్టాప్ పెట్టారు. క్రీడా మైదానాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. కాలనీలు, పార్కుల్లో సందడి లేకుండాపోయింది అపార్ట్మెంట్లు, విల్లాలు అప్రకటిత స్వీయ కర్ఫ్యూ విధించుకున్నాయి. ఆట పాటలతో, ఆనందోత్సాహాలతో గడిపే చిన్నారులు మరోసారి నాలుగు గోడల్లో బందీ అయ్యారు. కొద్దిరోజుల క్రితం బడులకు పరుగులు తీసిన పిల్లలు ఇప్పుడు తిరిగి ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్ మహమ్మారి ఈసారి పిల్లలను సైతం వదలడంలేదు. కరోనా ఈసారి పిల్లలపైనా ప్రతాపం చూపుతోంది. గత ఏడాది చిన్నారులపై కోవిడ్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం, ఇళ్లకే పరిమితం కావడంతో పిల్లలు పెద్దగా వైరస్ బారిన పడలేదు. బయటకు వెళ్లి వచ్చే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచే ఎక్కువగా పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందింది. అదే సమయంలో తల్లిదండ్రులు చాలావరకు జాగ్రత్తలు తీసుకోవడంతో చిన్నారులు పెద్దగా వైరస్ బారిన పడలేదు. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. పిల్లలు, పెద్దల రాకపోకలు బాగా పెరిగాయి. పెద్దవాళ్లతో కలిసి షాపింగ్‌కు వెళ్లడం, సినిమాలు, టూర్లు, పండగలు, వేడుకల్లో పాల్గొనడంతో చాలాచోట్ల పిల్లలు సైతం వైరస్ బారిన పడ్డారు. మూడు నెలలకుపైగా పిల్లలు స్కూళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో మహమ్మారి చిన్నారులపై ప్రభావం చూపింది. గ్రేటర్ పరిధిలో గత ఏడాది డిసెంబర్ నాటికి 15 ఏళ్లలోపు పిల్లలు కేవలం 10 శాతం వైరస్‌కు గురి కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 27 శాతం మందికి వైరస్ సోకినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో తక్కువగా ఉన్న కోవిడ్ కేసులు మార్చిలో భారీగా పెరిగాయి. గత శనివారం ఒక్కరోజే 13 శాతం వరకు పిల్లల కేసులు నమోదయ్యాయి. 30 నుంచి 40 ఏళ్ల వయసువారు ఈసారి ఎక్కువగా వైరస్ బారిన పడుతుండగా ఆ తర్వాత స్థానంలో పిల్లలే ఉంటున్నట్లు సమాచారం. ఈ నెల 16న ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 21 నుంచి 30 ఏళ్ల వారు, ఆ తర్వాత 30 నుంచి 40 ఏళ్లవారు 21.6 శాతం చొప్పున ఉంటే 11 నుంచి 20 ఏళ్లలోపువారు 10.3 శాతం వరకు వైరస్‌కు గురి కావడం గమనార్హం. 11 ఏళ్లలోపు పిల్లలు 2.7 శాతం వరకు ఉన్నారు. పెద్దవాళ్లతో పోల్చుకుంటే పిల్లల సంఖ్య చాలా తక్కువే అయినా గతేడాది కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పటికే నగరంలో అనేక చోట్ల అపార్ట్మెంట్లు, విల్లాల్లోకి బయటి వారిని అనుమతించడంలేదు. కొన్ని చోట్ల ‘తమ ఇంటికి రావద్దని, తాము సై తం ఎవరి ఇళ్లకే వెళ్లబోమని’ మర్యాదపూర్వకమైన బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలను అపార్ట్మెంట్ కారిడార్లలోకి కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో నిన్నా మొన్నటి దాకా స్నేహితులతో గడిపిన చిన్నారులు ఇప్పుడు ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.