the power supply
-
సర్పంచ్ ఇంటి ముట్టడి
గుంతకల్లు రూరల్ : ఊరంతా విద్యుత్ సరఫరా చేసినా.. తమ కాలనీకి మాత్రమే నిలిపివేయడంపై మండల పరిధిలోని పులగుట్టపల్లి ఎస్సీ కాలనీ వాసులు మండిపడ్డారు. అసలే వారంరోజులుగా విద్యుత్ సరఫరా లేక అంధకారంలో మగ్గుతుంటే.. విద్యుత్ పునరుద్ధరించిన తర్వాత కూడా కాలనీకి సరఫరా చేయకపోవడంపై ఆగ్రహావేశాలకు గురయ్యారు. అదే ఆవేశంతో బుధవారం రాత్రి గ్రామ సర్పంచ్ ఇంటిని ముట్టడించి ఆమెను ఇంట్లో నుంచి బయటికి వెళ్లనీయకుండా నిర్బంధించారు. వివరాల్లోకెళితే.. గ్రామంలో వారం రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి, దాదాపు 80 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం విద్యుత్ శాఖ అధికారులు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో వేరొకటి ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అంతటితో ఆగని విద్యుత్ శాఖ ఏఈ షఫి గ్రామంలోని ఎస్సీకాలనీలో నివాసం ఉంటున ్న ప్రతి ఇంటి నుంచి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తే తప్ప కాలనీకి విద్యుత్ సరఫరా ఇచ్చేదిలేదంటూ ఎస్సీ కాలనీకి మాత్రమే సరఫరా నిలిపివేశారు. దీంతో బుధవారం రాత్రి ఓ వైపు గ్రామం మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండగా, ఎస్సీకాలనీలో మాత్రం కటిక చీకటి ఆవహించింది. అసలే ఊరి చివర ఉన్న ఎస్సీకాలనీలో నిత్యం పాముల బెడద ఎక్కువగా ఉండటం, దానికితోడు కాలనీలో చీకటి అలుముకోవడంతో దాదాపు 100 మంది దాకా కాలనీవాసుల కట్టలు తెంచుకొన్న ఆగ్రహంతో సర్పంచ్ ఇంటిపైకి ఎగబడ్డారు. తమ కాలనీకి కరెంటు సరఫరాను పునరుద్ధరించేవరకు సర్పంచ్‌ని ఇంటినుంచి బయటికి వెళ్లనివ్వబోమంటూ బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్బంధించారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్‌ను ప్రశ్నించగా.. సమస్య పరిష్కరించాలని తాను విద్యుత్‌శాఖ ఏఈని పదేపదే కోరానని, ఆయన మాత్రం డబ్బు కట్టేదాకా కాలనీకి కరెంటు వదిలే ప్రసక్తేలేదని తెగేసి చెప్పాడని ఆమె బదులిచ్చారు. -
కరెంట్ కోతలపై కర్షకుల ఆందోళన
బచ్చన్నపేట : విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని, ప్రభుత్వం స్పందించి వ్యసాయూని కి సక్రమంగా కరెంట్ సరఫరా చేయూలంటూ పలు ప్రాంతాల్లో రైతులు శనివారం రాస్తారోకోలు నిర్వహించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎదుట టీడీపీ మండల అధ్యక్షుడు ఎలికట్టె మహేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు రైతులతో కలిసి బైఠాయిం చారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయూలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇలాగే మొండివైఖరి అవలంబిస్తే... ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏఈ రాంబాబుకు వారు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చల్లా సుధాకర్‌రెడ్డి, సత్తిరెడ్డి, దశరథ, అంబదాస్, మట్టిరవి, చంద్రారెడ్డి, పాకా ల మహేందర్, పాకాల లింగం, ఇంద్రయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కురవిలో.. రైతాంగానికి కనీసం ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కురవిలోని మానుకోట-ఖమ్మం ప్రధా న రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై బైఠారుుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ కోతలతో చేతికొచ్చే పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫ రా చేసి, రైతు ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. సీపీఐ మండల కార్యదర్శి ఎన్.సురేందర్‌కుమార్, నాయకులు పోగుల శ్రీనివాస్, నెల్లూరి నాగేశ్వర్రావు, తురక రమే ష్, అప్పాల వెంకన్న, నిలిగొండ నాగేశ్వర్‌రా వు, బుడమ వెంకన్న, దూదికట్ల సారయ్య, బస్వశ్రీను, రాంమూర్తి, సైదులు, ప్రవీణ్, వీరన్న, కొమురయ్య, ఉప్పలయ్య, బుర్రి సమ్మయ్య, గుర్వయ్య, రాములు పాల్గొన్నారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..? జనగామ రూరల్ : ‘పంటలు ఎండుతున్నా పట్టించుకోరా.?, అప్పు తెచ్చి సాగు చేస్తే కరెంట్ కోతలతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి.’ అంటూ తెలంగాణ రైతు సంఘం జనగామ డివిజన్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోతలకు నిరసనగా నెహ్రూ పార్కు వద్ద జనగామ- సిద్దిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి నిరంతరం ఏడు గంటల విద్యుత్‌తో పాటు రుణాలు సకాలంలో మాఫీ చే సి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఆర్. మీట్యానాయక్, నాయకులు ఎం.బీరయ్య, జీఎల్ఎన్ రెడ్డి, పీ.ఉపేందర్, ఎ.సత్యనారాయణ, ఎస్.దుర్గాప్రసాద్, బీ.శ్రీరాములు, జే.మల్లేశం, పీ.సుదర్శన్, ఎం.మల్లయ్య, టీ.ఆనందం, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా ఎన్జీవోస్ కాలనీ : వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రభాకర్, కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు గంటలు విద్యుత్ అందిస్తున్నామని చెబుతున్న అధికారులు కనీసం మూడు గంటలు కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతాంగానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. ధర్నాలో నాయకులు ఎన్.ప్రసాద్, ఆలకుంట్ల సాయి లు, ముంజంపల్లి వీరన్న, సిద్దబోయిన జీవన్, గొంది సమ్మయ్య, జగత్‌రెడ్డి, చిర్ర సూరి, పైండ్ల యాకయ్య, బొమ్మగాని వెంకన్న, చింత నవీన్, చిర్ర భద్రయ్య, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన దళిత మహిళలు
తనకల్లు: మీటర్లను బిగించుకోలేదన్న కారణంగా అధికారులు మండల కేంద్రంలోని దళితవాడకు వారం రోజులుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనిని నిరసిస్తూ ఆ కాలనీ మహిళలు బుధవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్లోని 205 జాతీయ రహదారిపై బైఠాయించి రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఆందోళనకారులు మాట్లాడుతూ కాలనీలో 500 కుటుంబాలవారు జీవిస్తున్నారన్నారు. విద్యుత్ లేకపోవడంతో వృద్ధులు, పిల్లలు, మహిళలు రాత్రిపూట బయటకు రావడానికి బయపడుతున్నారన్నారు. సోమవారం గ్రీవెన్స్‌ను అడ్డుకుని తాహశీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపినా ఏ అధికారి పట్టించుకోక పోవడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన విరమించాలని ఎస్ఐ వెంక టప్రనసాద్ చెప్పినా వారు వినలేదు. ట్రాన్స్‌కో అధికారులు వెంటనే వచ్చి దళితవాడకు విద్యుత్ పునరుద్ధరిస్తేగాని ఇక్కడి నుంచి కదిలేదిలేదని ఎండను సైతం లెక్కచేయకుండా వారు భీష్మించారు. తహశీల్దార్ శివయ్య, ఈఓపీఆర్డీ ఆదినారాయణలకు ఎస్ఐ సమాచారం అందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. తహశీల్దార్ ట్రాన్స్‌కో అధికారులతో ఫోన్లో సంప్రదించి దళితవాడకు వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని, అయితే నెల రోజుల్లో విద్యుత్ మీటర్లు బిగించుకోవాలని తహశీల్దార్,ఈఓ పీఆర్డీ గడువు ఇవ్వడంతో కాలనీవారు ఆందోళన విరమించారు. -
ట్రాన్స్‌కోనా మజాకా!
బాల్కొండ/రెంజల్/నిజామాబాద్ నాగారం: వ్యవసాయానికి కరెంటు సరఫరా వేళలలో పూటకో నిర్ణయం తీసుకుంటూ ట్రాన్స్ కో అధికారులు రైతులను అయోమయంలో పడవేస్తున్నారు. ఆదివారం నుంచి సరఫరా వేళలను మార్చారు. కానీ, ఇన్కమింగ్ పేరిట కోతలను తీవ్రం చేశారు. శుక్రవారం రాత్రి 10.20 గంటలకు కరెంట్ కట్ చేస్తే, 11.20 గంటలకు వచ్చింది. మళ్లీ శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు, ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 1.20 వరకు, 3.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఇన్కమింగ్ పేరిట విద్యుత్ కోతలను విధిం చారు. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నాలు చేశారు. ఇప్పటి వరకు మూడు గ్రూపులలో కరెంటును సరఫరా చేసిన ట్రాన్స్‌కో అధికారులు ఆదివారం నుంచి దానిని నాలుగు గ్రూపులకు మార్చారు. సరఫరాలో అధిక లోడ్ పడకుండా ఉండాలనే గ్రూపులుగా విభజించామని గతంలో ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ప్రస్తుతం ‘డి’ గ్రూపు వేళలను చూస్తే, రెండు గ్రూపులలో ఒకే సారి సరఫరా ఎలా సాధ్యమవుతుందో అధికారులకే తెలియాలి. రాత్రి కరెంట్‌కు ఎగనామం పెట్టడానికే ‘డి’ గ్రూపును సృష్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేమి తీరు! ఎ గ్రూపులో రాత్రి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు, బి గ్రూపులో 12 గంటల నుంచి 2 గంటల వరకు, సి గ్రూపులో 2 గంటల నుంచి 4 గంటల వరకు స రఫరా చేస్తారు. డి గ్రూపులో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఎ, బి, సి గ్రూపులలో రాత్రి పూట ఇచ్చే క రెంటుపై అధిక లోడ్ పడదా? సరఫరాకు అంతరాయం జరగదా? ఇది అధికారులకే తెలియాలి. -
విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆగ్రహం
సీత్యాతండా (వేములపల్లి), న్యూస్‌లైన్: విద్యుత్ సక్రమంగా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తోపుచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సీత్యాతండా సబ్‌స్టేషన్‌ను పలు గ్రామాల రైతులు శుక్రవారం ముట్టడించారు. సీత్యాతండా, పుచ్చకాయలగూడెం, దేవతలబాయిగూడెం, బొమ్మకల్ గ్రామాల రైతులు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకొని ఆగ్రహంతో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు రోజులుగా కేవలం అర్ధగంట మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని చెప్పారు. దీంతో వరి నాట్లు వేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని, రెండు రోజులుగా కేవలం 23 నిమిషాలు విద్యుత్‌ను సరఫరా చేసి గంట 20 నిమిషాలు సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారని ఆరోపించారు. తమ గ్రామాలకు వచ్చే ఫీడర్‌కు మాత్రమే విద్యుత్‌ను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సుమారు మూడు గంటల పాటు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. సబ్‌స్టేషన్‌లోని టీవీ, నిల్వ ఉన్న మీటర్లు, సబ్‌స్టేషన్ అద్దాలు, గేటును పూర్తిగా ధ్వసం చేశారు. ట్రాన్స్ఫార్మర్ల పైకి వెక్కి పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు వచ్చి విద్యుత్‌ను ఏడు గంటలు ఇస్తామని హామీఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీ సులు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. సబ్‌స్టేషన్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన రైతులపై ఏఈ తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు.