prostitution racket
-
అమెరికాలో తెలుగు యువకుల అరెస్ట్
ఆస్టిన్: అమెరికా టెక్సాస్ స్టేట్‌లో వ్యభిచార ముఠాను అక్కడి పోలీసులు రహస్య ఆపరేషన్ నిర్వహించి.. అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురు భారతీయులు ఉండగా.. అందులో ఐదుగురు తెలుగు యువకులు ఉన్నారు. బలవంతపు వ్యభిచారాన్ని కట్టడి చేసేందుకు హాయ్‌లాండ్ విలేజ్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్‌లోని డెంటన్లో ఈ ముఠా అరెస్ట్ అయ్యింది. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటి తెలుగు వారిగా అక్కడి పోలీసులు గుర్తించారు. వీళ్లంతా ఉన్నత విద్య కోసమే వచ్చినట్లు నిర్ధారించారు.**PRESS RELEASE** pic.twitter.com/LnYMYNoktZ— Denton Co Sheriff (@DentonCoSheriff) August 19, 2024 -
బెంగళూరు: రేవ్‌పార్టీ ముసుగులో వ్యభిచార దందా?
బెంగళూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పార్టీ మాటున సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. బెంగళూర్ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరిగింది. సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ పేరుతో బర్త్‌డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు. మరోవైపు దొరికిన వంద మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహకుల నేర చరిత్ర పై కూపి లాగుతున్నారు.ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!మరోవైపు.. ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర మాదకద్రవ్యాలను వినియోగించారు. దీంతో ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు. శాంపిల్స్ ఫలితాలు ఇవాళేడ్రగ్స్ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ల నుంచి శాంపిల్స్‌ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ పార్టీలో తాను లేనని తెలుగు సినీ నటి హేమ చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఆమె వాదనను ఖండిస్తున్నారు. ఆమె కూడా పార్టీలో పాల్గొన్నారంటూ ఓ ఫొటోను విడుదల చేశారు. అంతేకాదు ఆమె కూడా శాంపిల్స్ ఇచ్చారని ప్రకటించారు. -
కలకత్తా యువతులతో వ్యభిచారం
అబిడ్స్: కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అబిడ్స్ ఫార్చూన్ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు, యువతులు, విటులను నగర టాస్‌్కఫోర్స్, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. హైటెక్ తరహాలో అందరి కళ్లుగప్పి వ్యభిచారం నిర్వహిస్తున్న వారందరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అఖిలేష్ (36) (అఖిలేష్ ఫహిల్వాన్) అనే వ్యక్తి అబిడ్స్‌లో ఫార్చూన్ లాడ్జిని కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా కలకత్తా నుంచి యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న నగర సెంట్రల్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు, అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. లాడ్జి యజమాని అఖిలే‹Ù, మేనేజర్ రఘుపతి, 16 మంది యువతులు, 6 మంది విటులను అరెస్టు చేశారు. వీరిలో యువతులను తుక్కుగూడలోని రెస్క్యూహోమ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ నర్సింహరాజు తెలిపారు. మిగతా వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసును అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మోడల్స్‌తో వ్యభిచారం.. నటి అరెస్ట్
ముంబైలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై కాస్టింగ్ డైరెక్టర్, నటి ఆర్తీ మిట్టల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.సినిమాలో అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలు, మోడల్స్‌ను వేశ్య వృత్తిలోకి దింపుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై నిఘా ఉంచారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇద్దరు డమ్మీ కస్టమర్లను ఆమె దగ్గరికి పంపించారు. పక్కా సమాచారంతో దాడులు జరిపగా ఈ తతంగమంతా సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది అని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పక్కా ఆధారాలతోనే ఆర్తీ మిట్టల్‌ను అరెస్ట్ చేశామని, ఈ ఘటనలో ఇద్దరు మోడల్స్‌ను రక్షించి పునరావాస కేంద్రానికి పంపించినట్లు తెలిపారు. నిందితురాలు ఆర్తి మిట్టల్ సినిమా అవకాశాలు, డబ్బు ఆశ చూపి వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు పోలీసు ఇన్స్పెక్టర్ మనోజ్ సుతార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు. Maharshtra | Mumbai Crime Branch Unit 11, Dindoshi police busted a sex racket running in Goregaon area. Two models were rescued from the spot and a 30-year-old casting director, Aarti Mittal was arrested in this case: Mumbai Crime Branch — ANI (@ANI) April 17, 2023 -
Hyderabad: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడుకాకుండా ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ గోనె సురేష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గౌలిదొడ్డిలోని కాన్క్లేవ్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో సైబరాబాద్ యాంటీ హ్యుమన్ ట్రాకింగ్ యూనిట్ సభ్యులు శుక్రవారం రాత్రి 7.30 గంటలకు దాడి చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులతో డేటింగ్ యాప్ ద్వారా విటులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్లు పూర్ణిమా కుమారి (22), మనీష్ కుమార్ పాండే (20), హోటల్ మేనేజర్ శ్రీమంత కలిట (35), విటుడు ఎల్.రవీంద్రరెడ్డిలను అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిందితుడు ప్రిన్స, ఆర్గనైజర్ అజయ్ అలియాస్ రాహుల్ పరారీలో ఉన్నారు. మహారాష్ట్ర, బీహార్‌కు చెందిన ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. రూ.1200 నగదు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: (చిత్తూరు: రొంపిచర్లలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు) -
మహిళల అవసరమే ఆసరాగా వ్యభిచారం.. పరారీలో మమత
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని న్యూహౌజింగ్‌బోర్డు కాలనీలో 15రోజులుగా మమత అనే మహిళ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతోంది. చుట్టుపక్కల ఉండే పేద మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకొని వారితో వ్యభిచారం చేయిస్తోంది. బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీ సులకు సమాచారం అందడంతో కాలనీలో ఆమె అద్దెకు ఉంటున్న నివాసంలో దాడి చేశారు. ఇద్దరు మహిళలతో పాటు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డారు. ఆ సమయంలో వ్యభిచార గృహ నిర్వాహకురాలు మమత పరారైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. చదవండి: (Swetha: ఫేస్బుక్ ద్వారా మగాళ్లకు రిక్వెస్టులు పంపుతూ..) -
Mysuru: పక్కా ప్లాన్‌తో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
సాక్షి, మైసూరు: మైసూరు భుగతహళ్లి శివార్లలోని వెంకటగిరి లేఔట్లో ఉన్న ఒక ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులు శ్రీధర్ రెడ్డి, సందీప్‌లను అరెస్ట్ చేసి ఓ మహిళను రక్షించారు. ఓ వ్యక్తి పరారయ్యాడు. మైసూరు మహిళా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. చదవండి: (ఉపాధ్యాయ వృత్తికే మచ్చ.. విద్యార్థి తల్లితో సన్నిహితంగా ఉంటూ..) -
కొమరంభీం జిల్లా: మూసేసిన ఫ్యాక్టరీలో గప్‌చుప్‌గా వ్యభిచారం
సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్: జిల్లా రెబ్బెన మండల పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రాస్ రోడ్లో మూసివేసిన ఓ పరిశ్రమలో వ్యభిచార గృహాలను నిర్వహించడాన్ని గుర్తించారు. నిందితుడిని జనగాం జిల్లాకు చెందిన మడసి రమేష్ కుమార్‌గా నిర్ధారించారు పోలీసులు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నుండి మహిళలను తెప్పించి గుట్టుచప్పుడు వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం తో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్విస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెబ్బెన పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. -
Bhimavaram: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్
సాక్షి, భీమవరం (ప్రకాశం చౌక్): మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పట్టణంలోని ఓ మసాజ్ సెంటర్‌పై శుక్రవారం రాత్రి దాడి చేసి నిర్వాహకులు, ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ బి.శ్రీనాథ్ చెప్పారు. శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. భీమవరం టూటౌన్ సీఐ బి.కృష్ణకుమార్, సీసీఎస్ సీఐ ఎ.రఘుకు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్ అదేశాల మేరకు శుక్రవారం రాత్రి పట్టణంలోని టూటౌన్ ఏరియా కెనరా బ్యాంక్ సమీపంలో ఏ9 బ్యూటీ సెలూన్, స్పాపై దాడి చేశారన్నారు. దీనిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బురద ఝాన్సీలక్ష్మి అలియాస్ నందినితో సహా ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి రూ.31,500 నగదు, చెక్కు బుక్, స్వైపింగ్ మెషిన్ వస్తువులను సీజ్ చేశామన్నారు. చదవండి: (Hyderabad: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..) స్పా నిర్వహణలో ఝూన్సీలక్ష్మీతోపాటు పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన ఇంటి రాహూల్ కూడా ఉన్నట్లు గుర్తించామని, ఇతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. మిగిలిన ఏడుగురు అమ్మాయిలను విజయవాడ హోమ్‌కు తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మసాజ్, స్పా సెంటర్లపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. వీటిపై పర్యవేక్షణ, అకస్మాతు దాడులకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఇటీవల ఓ స్పా సెంటర్‌పై కూడా దాడి చేసి అక్కడ వ్యభిచారం చేస్తున్న వారి కూడా అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేశామన్నారు. ఈ రెండు మసాజ్, స్పా సెంటర్లపై సకాలంలో దాడులు నిర్వహించి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా పట్టుకున్న సీఐలు కృష్ణకుమార్, రఘు, సిబ్బందిని డీఎస్పీ అభనందించారు. వీరికి అవార్డు, రివార్డుల కోసం ఎస్పీకి సిఫారసు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై వి.రాంబాబు పాల్గొన్నారు. చదవండి: (పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య) -
క్రైమ్ సెల్ఫోన్లో బుకింగ్: విటుల వద్దకే అమ్మాయిల డోర్ డెలివరీ!
సాక్షి, యాదాద్రి: ఇద్దరు బాలికలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ముఠా ఒకటి పట్టుబడటం యాదగిరిగుట్టలో మరోసారి సంచలనం సృష్టించింది. బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపి వారిని పలు విధాలుగా హింసించిన ఘటన 2018 జూలైలో బయటపడింది. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత గుట్టలో మళ్లీ వ్యభిచారం జరుగుతోందనే అనుమానం కొంతకాలంగా ఉంది. ఆ అనుమానాలు నిజం చేస్తూ ముఠా పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్న పోలీసులు ఈ ముఠాకు చెందిన మరి కొంతమంది బాలికలు కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, హైదరాబాద్ జిల్లాల్లో ఉన్నారని అనుమానిస్తున్నారు. వ్యభిచార నిర్వాహకులు సాంకేతికతను ఉపయోగించుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా విటుల వద్దకే అమ్మాయిలను పంపిస్తున్న వైనం వెలుగుచూసింది. ఈ కారణంగానే అనుమానితుల ఇళ్లలో పోలీసులు దాడులు చేసినా ఎలాంటి ఆ«ధారాలూ లభించడం లేదు. సెల్‌ఫోన్ ద్వారా బుక్ చేసుకున్న వారు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డబ్బులు పంపించగానే అమ్మాయిలను పంపిస్తూ దందా కొనసాగిస్తున్నారు. ఇలా ఈ నెల 2వ తేదీన విటుని వద్దకు పంపించే క్రమంలోనే ఒక బాలిక యాదగిరిపల్లి నుంచి తప్పించుకుంది. సిరిసిల్ల వెళ్లేందుకు ప్రయత్నించి.. విటుని వద్దకు వెళ్లాల్సిన బాలిక.. అనసూయ తనను తరచు కొడుతూ హింసిస్తుండటంతో, తనను బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో సిరిసిల్లలో ఉండే వ్యభిచార నిర్వాహకుడు కంసాని శ్రీనివాస్ వద్దకు వెళ్లాలని నిర్ణయించుకుంది. యాదగిరిపల్లి పక్క గ్రామమైన వంగపల్లికి కాలిబాటన చేరుకున్న బాలిక అక్కడ రూ.20 అడుక్కుని జనగామ బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడినుంచి సిరిసిల్ల వెళ్లేందుకు విద్యార్థులను డబ్బులు అడుగుతుండగా విద్యార్థులు 100 నంబర్‌కు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి వివరాలు అడగడంతో ఆ బాలిక కంసాని అనసూయ పేరు చెప్పింది. దీంతో యాదగిరిగుట్టలో మూడేళ్లుగా సాగుతున్న వ్యభిచారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ సమాచారంతో సీపీ అలర్ట్ మైనర్ బాలిక వ్యభిచార కూపంలో చిక్కుకున్న విషయం పోలీసులు మీడియాకు వెల్లడించకముందు (ఈ నెల 3న) కలెక్టర్ పమేలా సత్పతి రాచకొండ సీపీ మహేష్ భగవత్ దృష్టికి తీసుకుపోయారు. ఆయన వెంటనే వ్యభిచార కూపంలో ఉన్న బాలికలను రక్షించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో షీ టీం, ఎస్ఓటీ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నాలుగు చోట్లకు వెళ్లారు. హుస్నాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్లలో ఏకకాలంలో అనుమానితుల ఇళ్లపై మెరుపు దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే మరో మైనర్ బాలిక దొరికింది. ఇద్దరు బాలికలను ప్రస్తుతం అధికారులు సఖి కేంద్రంలో ఉంచారు. చిత్రహింసలతోనే వెలుగులోకి.. యాదగిరిపల్లిలో ఉంటున్న కంసాని అనసూయ వ్యభిచారం చేయిసూ్తనే తిండి పెట్టకుండా, కొట్టడం, తిట్టడం చేస్తుండడంతో అది భరించలేని బాలిక తప్పించుకుంది. ఈ బాలికతో పాటు మరో బాలికను కూడా చిన్నతనంలోనే అనసూయ ఎక్కడినుంచో తెచ్చుకుని తన చెల్లెలు కూతుళ్లని చెప్పి పెంచింది. వారికి కొంత వయసు రాగానే వ్యభిచార కూపంలోకి దించింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఉంటున్న కంసాని శ్రీనివాస్‌కు వద్దకు కూడా పంపిస్తూ మూడేళ్లుగా వ్యభిచారం చేయిస్తోంది. వ్యభిచార నిర్వాహకులు ఎక్కడినుంచో చిన్నారి బాలికలను తెచ్చి తమ బ«ంధువుల పిల్లలుగా పెంచడం, తర్వాత వ్యభిచార కూపంలోకి దించడం యాదగిరిగుట్టలో ఎప్పటినుంచో జరుగుతోంది. 2018 జూలై 30న ఐదేళ్ల చిన్నారిని చిత్రహింసలు పెడుతుంటేనే వ్యభిచార ముఠాగుట్టు రట్టుఅయ్యింది. అప్పట్లో ఏకంగా 34 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. తాజాగా వ్యభిచార కూపం నుంచి బయటపడిన ఓ బాలిక తనకు తల్లిదండ్రులు ఉన్నారని చెప్పింది. నాన్న తాగి వచ్చి అమ్మను కొట్టేవాడని, తనను చిన్నతనంలోనే అమ్మేశారని తెలిపింది. మరో బాలిక తన వివరాలను వెల్లడించలేదు. -
హైటెక్ సెక్స్ రాకెట్
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో దేశ, విదేశీ మహిళలను ఆకర్షించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పలు వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం 14,190 మంది యువతుల ఫొటోలు, వివరాలు పెట్టి.. కాల్‌సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తున్న ఈ గ్యాంగ్.. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా ఈ దందా సాగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్ సహా 18 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడంతో పాటు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఈ ముఠా వివరాలను ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ దార కవితతో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు వెల్లడిస్తున్న కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ కవిత హోటల్ వర్కర్‌గా పనిచేస్తూ వ్యభిచారం దందా వైపు.. బేగంపేటకు చెందిన మహ్మద్ సల్మాన్ ఖాన్ అలియాస్ సమీర్ 2016–19 మధ్యకాలంలో సోమాజిగూడలోని కత్రియా, పార్క్ హోటళ్లలో పనిచేశాడు. అప్పట్లో వ్యభిచార ముఠా బాధితురాలు ఒకరు ఓ హోటల్లో బస చేయడం గమనించిన సమీర్..సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్స్ అలవాటు ఉన్న సమీర్‌కు మరో డ్రగ్ వినియోగదారుడు, మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన మహ్మద్ అదీమ్ అలియాస్ అర్నవ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి 2016 నుంచి సోమాజిగూడ కేంద్రంగా వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టారు. వీరితో పాటు మొత్తం 17 మంది ప్రధాన ఆర్గనైజర్లు వేర్వేరు రాష్ట్రాలలో వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా దందా సాగిస్తున్నారు. ఒక్కో వాట్సాప్ గ్రూప్‌లో 300 మంది ఆర్గనైజర్లు సభ్యులుగా ఉన్నారు. వీటిద్వారా మొత్తం 14,190 మంది యువతులతో వ్యభిచారం సాగిస్తున్నారు. ముఠా దొరికింది ఇలా... ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన యువతులను విచారించిన పోలీసులు.. గత నెల 15న బేగంపేటకు చెందిన సల్మాన్, పీఅండ్‌టీ సన్‌సిటీకి చెందిన మహ్మద్ అబ్దుల్ కరీంలను అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఆర్గనైజర్ల జాబితా వెలుగులోకి వచ్చింది. దీంతో యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ టీమ్‌తో బృందాన్ని ఏర్పాటు చేసి.. సల్మాన్, కరీంతో పాటు పలువురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరిలో రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్‌తో పాటు మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన అర్నవ్, టోలిచౌకికి చెందిన మహ్మద్ సమీర్, సోమాజిగూడకు చెందిన హర్బిందర్ కౌర్ అలియాస్ సిమ్రాన్ కౌర్, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన యరసారి జోగేశ్వర్రావు, బాలానగర్‌కు చెందిన నడింపల్లి సాయిబాబా గౌడ్, సన్‌సిటీకి చెందిన శైలేంద్ర ప్రసాద్, యూసుఫ్‌గూడకు చెందిన మహ్మద్ అఫ్సర్, కూకట్‌పల్లికి చెందిన పసుపులేటి గంగాధరి, ఆసిఫ్‌నగర్‌కు చెందిన రిషీ, బీరంగూడకు చెందిన కోడి శ్రీనివాస్, గోల్కొండకు చెందిన అలీసామ్, అనంతపురానికి చెందిన మహ్మద్ ఫయాజ్, కర్ణాటకకు చెందిన విష్ణు, సాయి సుధీర్, ఒడిశాకు చెందిన సర్భేశ్వర్ రౌట్లు ఉన్నారు. వీరు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లలో 39 కేసులలో నిందితులుగా ఉన్నారు. తాజాగా వీరిపై గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి ఠాణాలలో ఐదు కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ.95 వేల నగదుతో పాటు 34 సెల్ఫోన్లు, 3 కార్లు, ల్యాప్‌టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ (మాదకద్రవ్యం)ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌లు, ఆధార్లు.. విటులతో సంప్రదింపుల కోసం నిర్వాహకులు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరుల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కోల్‌కతా, అసోం రాష్ట్రాల యువతులతో పాటు థాయ్‌లాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, రష్యా దేశాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విదేశీ మహిళలకు నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు సృష్టించి వివిధ నగరాలకు తరలిస్తున్నారు. దందా సాగుతోందిలా.. ఆర్గనైజర్ల కింద ఉండే బ్రోకర్లు ఉద్యోగా లిప్పిస్తామంటూ పేద మహిళలకు ఎర వేస్తా రు. వారి వివరాలను సేకరిస్తారు. ఆపై బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతా రు. విటులను ఆకర్షించేందుకు బాధిత అమ్మాయిల ఫొటోలు, ఇతర వివరాలు దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ గ్రూప్‌లలో పెడతారు. లొకాంటో, స్కోక్కా, మైహెవెన్మోడల్స్.కామ్ నటాషారాయ్. ఇన్ వంటి కాల్‌గర్ల్స్ వెబ్సైట్లలోనూ వాటిని పోస్ట్ చేస్తారు. వీటిని చూసిన విటులు తమకు నచ్చిన యు వతుల కోసం అందులోని వాట్సాప్ నంబ ర్లకు ఫోన్ చేస్తారు. కాల్ సెంటర్ల ప్రతినిధు లు అమ్మాయిల వివరాలు, రేట్లను తెలిపి.. ఏ హోటల్‌కు వెళ్లాలో సూచిస్తారు. ఓకే అనుకున్నాక ఆ ప్రతినిధి విటుడిని ఆర్గనైజర్‌తో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిస్తారు. డీల్ కుది రాక స్టార్ హోటళ్లలో గదులు, ఓయో రూ మ్స్, అవసరమైతే విమాన టికెట్లు బుక్ చేస్తారు. విటులు నగదు లేదా ఆన్లైన్లో చెల్లింపులు చేయాలి. అందులో 30% యువతికి, 35% అమ్మాయిల ఫొటోలను ప్రచారం చేసేవారికి, కాల్‌సెంటర్ ప్రతినిధులకు ఇస్తా రు. 35 శాతం నిర్వాహకులు వాటాలుగా పంచుకుంటారు. ఈ దందాలో ఒక్కో ఆర్గనైజర్ రూ.40 లక్షల వరకు ఆదాయం ఆర్జించినట్లు డీసీపీ కవిత తెలిపారు. -
ఆర్ఎంపీ వైద్యం చేస్తూ.. యువతులతో వ్యభిచారం
సాక్షి, గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఆర్ఎంపీ వైద్యం చేస్తూ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న మహిళపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భవానీపురం స్వాతిరోడ్కు చెందిన రామటెంకి రాధిక భర్త ఆర్ఎంపీగా చేస్తూ కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె ఇంటి వద్దనే వైద్యం చేస్తోంది. దాంతో పాటు వాట్సాప్ ద్వారా పార్టీలను బుక్ చేసుకుని వారికి అమ్మాయిలను పంపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఓ వ్యక్తి రూ.10వేలకు ఓ అమ్మాయిని బుక్ చేసుకున్నాడు. అతనిని గొల్లపూడి స్కూల్ వద్దకు రమ్మని అతని నుంచి రూ.5వేలు తీసుకుని, మిగిలిన డబ్బులు యువతికి ఇవ్వమని ఒప్పందం కుదుర్చుకుంది. స్కూల్ సమీపంలోని బే లీవ్స్ హోటల్లో రూమ్ నంబరు 101 లో ఉన్న ఆ యువతి వద్దకు అతనిని పంపింది. సమాచారం తెలుసుకున్న భవానీపురం సీఐ ఒమర్ సిబ్బందితో హోటల్‌కు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేయిస్తున్న రాధికను అరెస్ట్ చేశారు. బాధితురాలిని హోమ్‌కు తరలించారు. చదవండి: (Hyderabad: మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి!) -
హైదరాబాద్‌లో వ్యభిచార దందా బట్టబయలు
సాక్షి, హైదరాబాద్(పంజగుట్ట): స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై పంజగుట్ట పోలీసులు ఆకస్మిక దాడి చేసి సబ్ ఆర్గనైజర్, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు... సోమాజిగూడలోని సూర్యానగర్ కాలనీలో ఉన్న నేచ్యురల్ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారం అందుకున్న పంజగుట్ట అడిషనల్ ఇన్స్పెక్టర్ బి.దుర్గారావు నేతృత్వంలో బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. సబ్ ఆర్గనైజర్ నర్సింహ, ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గుంటూరులో దారుణం.. బ్యూటీపార్లర్‌లో భార్యను చంపిన భర్త) -
Hyderabad: రాజేంద్ర నగర్లో వ్యభిచార ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారాన్ని యాంటి హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ బృందం గుట్టురట్టు చేసింది. ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా, ఆరుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించనున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న అంజయ్యనగర్‌లోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సైబరాబాద్ యాంటి హ్యూమన్ ట్రాకింగ్ యూ నిట్ బృందం బుధవారం సాయంత్రం 6.30 గంటలకు దాడి చేశారు. ఉజబెకిస్తాన్‌కు చెందిన యువతితో పాటు ఇద్దరు ఢిల్లీ, ఇద్దరు వెస్ట్ బెంగాల్, ఒకరు ముంబైకి చెందిన యువతులకు విముక్తి కలిగించారు. అమీర్‌పేట్ మార్కెట్‌కు చెందిన జితేందర్(35),పుణేకు చెందిన శ్రీకాంత్(47), అపర్ణ సేరెన్ పార్క్ గచ్చిబౌలికి చెందిన యు.లక్ష్మయ్య(42)లను అదుపులోకి తీసుకొని గచ్చిబౌ లి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో 6సెల్ఫోన్లు, 38 కండోమ్ ప్యాకెట్లు, రూ.81,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధిత యు తులను రెస్క్యూ హోంకు తరలించనున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం) -
లాడ్జ్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముగ్గురు యువతులు, 12మంది..
ఒడిశా(బరంపురం): నగరంలో గత కొద్ది రోజులుగా రహస్యంగా నడుస్తున్న సెక్స్ రాకెట్‌ను ఎస్పీ శరవన్ వివేక్ భగ్నం చేశారు. దీనిని నిర్వహిస్తున్న కేంద్రంపై ఆయనే స్వయంగా మఫ్టీలో దాడి చేయడంతో ముగ్గురు యువతులతో 12మంది విటులను అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన నగర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం బరంపురం పోలీసు జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. పక్కా సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి తానే స్వయంగా మఫ్టీలో బుల్లెట్‌పై బీఎన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బరంపురం టాటా బెంజ్ జంక్షన్లో ఉన్న తులసీ గెస్ట్‌హౌస్(లాడ్జి) వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై దాడి చేయడంతో పాటు కోల్‌కతాకు చెందిన ముగ్గురు యువతులతో పాటు 12మంది నిందితులు పట్టుబడగా, అందరినీ అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లాడ్జి యజమానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నరు. నిందితులను మంగళవారం బరంపురం సబ్ కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ వివరించారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. చివరికి వేరే అమ్మాయితో..) -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
సాక్షి, గుంతకల్లుటౌన్: స్థానిక ఆచారమ్మ కొట్టాలలోని వ్యభిచార గృహంపై వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు శనివారం రాత్రి 11 గంటలకు వన్‌టౌన్ సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ మురారి, సిబ్బంది అక్కడకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళతో పాటు ఓ యువతి, విటుడిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2వేలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
Hyderabad: స్పాల ముసుగులో వ్యభిచారం.. ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా..
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్లో నిబంధనలకు విరుద్ధంగా స్పాల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు స్పా సెంటర్లపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.13లోని మోరా థాయ్ స్పాతో పాటు ఫిలింనగర్‌లోని మరో రెండు స్పాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే మోరా థాయ్ స్పా మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ఈ స్పా యజమాని విశాల్బాయ్ మున్సుక్ బాయ్ గజేరా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు భాగస్వాములు కార్తీక్, అలీఖాన్‌లు కూడా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఫిలింనగర్‌లోని మరో రెండు స్పాలపై కూడా దాడులు జరిగాయి. ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించి స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసుల వైఖరిపై విమర్శలు... మరోవైపు ఫిలింనగర్‌లోని స్పాలలో గత ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో వెల్లడైంది. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లనే నిర్వాహకులు స్పా కేంద్రాలను వ్యభిచార గృహాలుగా మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ సెక్టార్ పరిధిలోని స్పాలన్నీ వ్యభిచార కూపాలుగా మారాయని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇక్కడి స్పాల వ్యవహారాలపై పోలీసులు విచారణకు ఆదేశించారు. -
Hyderabad: గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళా ఆర్గనైజర్లతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. ఎస్సై గౌతమ్ వివరాల ప్రకారం.. చింతల్ వాణీనగర్‌లో సరిత(39), పార్వతి(27)అనే ఇద్దరు మహిళలు ఓ గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి నిర్వహించి ఇద్దరు నిర్వాహితురాళ్లతో పాటు విటుడు బోయిన్‌పల్లికి చెందిన బండి రాజేందర్(34)లను అదుపులోకి తీసుకుని జీడిమెట్ల పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. 17మంది మహిళలకు..
ముంబై: ఉపాధి కల్పిస్తామని ఆశజూపి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టి వారితో డబ్బులు సంపాదిస్తున్న ముఠా గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. గురు వారం ముంబై మీడియాకు పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటికి పనిమనుషులు కావాలన్న ప్రకటనలతో వివిధ రాష్ట్రాలనుంచి మహిళలను రప్పించి వారిని ముంబైలోని ఓ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. అవసరమైన విటులకు ఈ మహిళలను హోటళ్లకు, ప్రైవేట్‌రూమ్‌లకు పంపించి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 4న రాజు, సాహిల్ అనే ఇద్దరు వ్యక్తులు తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారంటూ ఓ మహిళ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ)ను ఆశ్ర యించడంతో దాన్ని ఫిర్యాదుగా స్వీకరించిన ఈ బృందం రంగంలోకి దిగింది. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నెరుల్ ప్రాంతంలోని శిరవాణే గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 17 మంది మహిళలను ఏహెచ్‌టీయూ బృందం కాపాడింది. వీరికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న 9మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (సమాజం తప్పుగా భావించింది.. మాది అన్నా చెల్లి బంధం) -
వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ముంబై, గుజరాత్ల నుంచి అమ్మాయిలను..
ముంబై: గుట్టు చప్పుడు కాకుండా థానె పట్టణంలో వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని థానె పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన బిలాల్ కొకాన్ మోరల్ (26) అనే వ్యక్తి థానె, ముంబై, నవీ ముంబై, పుణె, చెన్నై, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లనుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచార ముఠాను గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నాడు. ఈ సమాచారాన్ని అందుకున్న థానెలోని మానవ అక్రమరవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీసీ) పోలీసులు వలపన్ని బిలాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటుగా మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం థానెలోని కోప్రీ పోలీసు స్టేషన్లో బిలాల్‌ను ఉంచి మరింత సమాచారాన్ని పోలీసులు రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు. -
వ్యభిచార కూపాలు.. విచ్చలవిడిగా సాగుతున్న దందా
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని తంగళ్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వ్యభిచార దంగా జోరుగా సాగుతోంది. అయితే ఈ మురికి కూపంలోకి బాలికలను బలవంతంగా దింపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తంగళ్లపల్లి, సిరిసిల్లలో సుమారు 12 మంది బాలికలు ఈ వృత్తిలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మధ్య తంగళ్లపల్లికి చెందిన ఓ మహిళ విజయవాడకు చెందిన 3 ఏళ్ల చిన్నారిని రూ.2 లక్షలకు కొనుగోలు చేయగా ఏపీ పోలీసులు వచ్చి సదరు మహిళను అదుపులోకి తీసుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 15న ‘వ్యభిచార ముఠా గుట్టురట్టు’ శీర్షికన ప్రచురించడంతో వ్యభిచార మాఫియాలో మానవ అక్రమ రవాణా కూడా జరుగుతున్నట్లు బహిర్గతమైంది. పోలీసుల్లోనే లీకు వీరులు..? జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం రూరల్ సీఐ అనిల్‌కుమార్, తంగళ్లపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి, ఇల్లంతకుంట ఎస్సై మహేందర్, సిబ్బంది వేశ్య గృహాలను తనిఖీ చేశారు. కాగా, తనిఖీలకు ముందే బాలికలను లీకు వీరుల మూలంగా తప్పించినట్లు చర్చ జరుగుతోంది. కొంత మంది పోలీస్ సిబ్బంది వేశ్య గృహాల వారికి ముందుగానే లీక్ చేస్తూ అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచార కూపాల్లో ఉన్న బాలికలకు సంబంధించి పక్కా ఆధారాలు, డీఎన్ఏ టెస్టులు వంటివి నిర్వహిస్తే వారి సంతామేనా..? కాదా..? అని రుజువు చేసి బాలికలకు విముక్తి కలిగించవచ్చు. తంగళ్లపల్లిలో తనిఖీలు చేస్తున్న పోలీసులు వేశ్య గృహాల తనిఖీ సిరిసిల్లక్రైం: సిరిసిల్ల టౌన్, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని వేశ్య గృహాలను మంగళవారం పోలీసులు ఏకకాలంలో తనిఖీ చేశారు. తనిఖీ ల్లో బాలికలు పట్టుబడలేదని వెల్లడించారు. ఆ యా గృహాల్లో ఉంటున్న వారికి కౌన్సెలింగ్ ని ర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేకుండా ని వాసం ఉండడానికి వీలు లేదని హెచ్చరించా రు. కుటుంబీకులు తప్ప వేరే వాళ్లు ఉంటే వారి కి సంబంధించిన అన్ని వివరాలు ఉండాలన్నా రు. వ్యభిచార గృహాలుగా పేరున్న వారందరి ఆధార్ గుర్తింపులు ఇవ్వాలని ఆదేశించారు. సీఐ అనిల్ కుమార్, ఎస్ఐలు రఫీక్‌ఖాన్, చిననాయక్, మహిళా పోలీసు సిబ్బంది ఉన్నారు. -
Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం
మియాపూర్: గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్ట్మెంట్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను, ఇద్దరు మహిళలను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లోని ప్రభా సాయిధరమ్ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు అపార్ట్మెంట్లో మంగళవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం చిన్నజాగ్రావుపేటకు కిష్టాఫర్ సన్నీ(25), చెలమ భరత్ (35), మరో ఇద్దరు మహిళలను గుర్తించారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా కిష్టాఫర్ సన్నీ, చెలమ భరత్‌లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ వ్యభిచారం నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: (ప్రాణం తీసిన సెల్‌ఫోన్ వివాదం.. నవ వధువు ఆత్మహత్య) -
Hyderabad: అపార్ట్మెంట్లో వ్యభిచారం.. పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై మియాపూర్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ లింగానాయక్ తెలిపిన మేరకు.. మియాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో గురువారం దాడి చేశారు. ఒంగోలుకు చెందిన నిర్వాహకులు షేక్ ఇర్ఫాన్ (22), సాయిగణేష్రెడ్డి (27), మహిళను అదుపులోకి తీసుకున్నారు. దీంతో షేక్ ఇర్ఫాన్, గణేష్రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. చదవండి: (దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్) -
మియాపూర్‌లో సీక్రెట్‌గా హైటెక్ వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ రైడ్‌లో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో ఉన్న సాయిరాం రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 1205లో గుట్టుగా హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఒంగోలుకు చెందిన షైక్ ఇర్ఫాన్(26), సాయి గణేష్ రెడ్డి(27)లు.. మహిళలతో వ్యభిచార వ్యవహారం నడుపుతున్నారు. కాగా, ఫ్లాట్‌లో వ్యభిచారం నడిపిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు శుక్రవారం రైడ్స్ వెళ్లారు. దాడుల్లో భాగంగా ఇద్దరు నిర్వాహాకులను అదుపలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో అదుపులోకి తీసుకున్న ఓ మహిళను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: న్యూడ్ కాల్స్‌తో పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్.. ప్రియుడ్ని హత్య చేసి యాక్సిడెంట్‌గా డ్రామా -
వ్యభిచార గృహంపై దాడి: ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్(నాగోలు): వ్యభిచార గృహంపై ఎల్బీనగర్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నాగోలు బండ్లగూడ కృషినగర్‌లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా టైలరింగ్ చేస్తోంది. ఈ వృత్తి ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆమె నివాసంపై దాడి చేయగా వ్యభిచారం చేస్తూ అనూష, కొత్తపేటకు చెందిన గురుజాల అనిల్‌కుమార్ పోలీసులకు పట్టుబడ్డారు పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. చదవండి: (వివాహేతర సంబంధం.. మహిళతో న్యూడ్ కాల్స్.. వాటిని రికార్డ్స్ చేసి!)