Registration charges
-
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో షాక్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడుకు ఆదేశాలు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉత్తర్వులు ఇవ్వడంతో.. ఫిబ్రవరి 1 నుంచి పెంచిన విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. అర్బన్, రూరల్ అన్ని ప్రాంతాల్లోనూ బాదుడుకు అనుమతులిచ్చింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలు పెంచేందుకు నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కారు ప్రజలపై పెను భారాలను మోపుతోంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల బాదుడుతో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతం పెంచేందుకు జీవో కూడా జారీ చేసేసింది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను పెంచనుంది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతోపాటు గోడలు లేని ఇళ్ల విలువల్ని కూడా పెంచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది.కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.అందులో భాగంగానే మార్కెట్ విలువలను అడ్డగోలుగా సవరిస్తోంది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచుతున్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. అపార్ట్మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి.ఇదీ చదవండి: CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి! -
ఏపీలో భారీగా రిజిష్ట్రేషన్ ఛార్జీలు బాదుడుకు రంగం సిద్ధం
సాక్షి,విజయవాడ : అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఏపీలో భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంచేలా నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 40 నుండి 50 శాతం వరకు విధించనుంది. అయితే, అమరావతి విలువ పెరగలేదని నిర్ణయించుకున్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు నుంచి అమరావతికి మినహాయింపు ఇచ్చింది.అన్ని చోట్ల పెంచి అమరావతికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తగ్గి, అమరావతిలో పెంచేందుకు ప్లాన్ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమైంది. భూములతో పాటు నిర్మాణాల విలువ పెంచేయాలని తీసుకున్న నిర్ణయానికి జాయింట్ కలెక్టర్ల కమిటీలు ఆమోదం తెలిపారు.దీంతో వచ్చే నెల ఒకటో తేదీ నుండే పెంచిన ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నివాస, అపార్ట్ మెంట్లు, వాణిజ్య భవనాల విలువ భారీగా పెరగనుంది. కాగా,ఎన్నికల ముందు భారం మోపమని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే జనంపై బాదుడుకు సిద్దమవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు. -
మరో బాదుడుకు సిద్ధమైన కూటమి
-
AP: రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు: ప్రజలపై .. ఇక బాదుడే బాదుడు
సాక్షి,అమరావతి : రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ప్రజలపై భారాలు మోపుతూనే ఉంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడుకు సిద్ధమైంది. భూముల విలువ పెంచి రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15 నుండి 20 శాతం భూముల విలువ పెంచుతున్నట్టు మంత్రి సత్యప్రసాద్ ప్రకటించారు. భూములతో పాటు నిర్మాణాలు విలువ పెంచేసి రిజిస్ట్రేషన్ చార్జీల భారం మోపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఫిబ్రవరి 1 నుండి రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు అమల్లోకి రానుంది. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పెను భారాలు మోపుతోంది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను అమాంతం పెంచేస్తోంది. ఇప్పటికే నిర్మాణాల విలువను నిర్ధారించింది. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లనూ వదలకుండా వాటి విలువలను పెంచేసింది. భూముల విలువ పెంచినా, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పైకి 20 శాతం వరకు పెంపు ఉంటుందని చెబుతున్నా 50 శాతం వరకు పెంచుతున్నారని తెలుస్తోంది.అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని భూముల విలువ కేటగిరీలను బట్టి 30 నుంచి 60 శాతం వరకు పెంచేస్తున్నారు. దీంతో నగరాల్లో అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసిన వారిపై అదనంగా రూ.లక్షల భారం పడనుంది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం ఉన్న భూముల క్లాసిఫికేషన్లను మార్చేస్తున్నారు. అంటే ప్రతి ఏరియాలోని భూమికి ప్రస్తుతం ఒకే విలువ ఉండగా, దొడ్డిదారిన దాని క్లాసిఫికేషన్ మార్చి రెండవ విలువను పెట్టాలని నిర్ణయించారు. దీనికి కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు.ప్రస్తుతం వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమిగా.. ఇళ్ల స్థలాలైతే జాతీయ రహదారులను ఆనుకుని ఉన్నవి.. వాటి వెనుక ఉన్నవి.. అంటూ పలు రకాలుగా క్లాసిఫికేషన్‌లో ఉన్నాయి. ఒక ఏరియాలో మెట్ట భూమి విలువ రూ.10 లక్షలు, మాగాణి భూమి విలువ రూ.20 లక్షలుగా ఉందనుకుందాం. ఇప్పుడు రూ.10 లక్షలు ఉన్న మెట్ట భూమిలో ఒకచోట రూ.15 లక్షలు, పక్కనే ఉన్న దానికి రూ.20 లక్షలు పెడుతున్నారు. అంటే ప్రతి క్లాసిఫికేషన్‌లోనూ కొత్తగా రెండో రేటు పెడుతున్నారు.జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్ పెడుతున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి ఆనుకున్న భూమికి ఒక రేటు, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒకరేటు, సందుల్లో వాటి వెనుక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు.వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు రకరకాలుగా మార్చారు. ఒక ఏరియాలోనే గతంలో మాదిరిగా ఒక క్లాసిఫికేషన్‌లో ఉన్న భూమికి ఒక రేటు కాకుండా ప్రతి దాని రేటు మార్చేస్తున్నారు. తద్వారా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్ విలువను వీలును బట్టి రెండు, మూడు రకాలుగా పెంచేశారు.ఏరియాను బట్టి కాదు.. స్థలాన్ని బట్టి రేటు సాధారణంగా భూముల విలువను.. ఉన్న దానిపైనే ఎంతో కొంత పెంచడం ఆనవాయితీ. కానీ ఆదాయాన్ని భారీగా పెంచుకోవడం కోసం గుట్టుచప్పుడు కాకుండా క్లాసిఫికేషన్లు మార్చుతున్నారు. దీంతో ప్రతి వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోనున్నాయి.ఏరియా ప్రాతిపదికన కాకుండా సంబంధిత భూమి ప్రాతిపదికన రేటు పెట్టడంతో అన్ని భూముల విలువలు పెరిగిపోనున్నాయి. ఎక్కడైనా ఈ ఏరియాలో భూమి రేటు ఎంత ఉందని అడగడం సహజం. కానీ ఇకపై ఆ ఏరియాలోని ప్రతి స్థలం రేటు.. రోడ్డు పక్కన ఒకలా, రోడ్డు లోపల మరోలా మారిపోవడం వల్ల రేటు చెప్పడం అంత సులువు కాదు. పూరి పాకలనూ వదల్లేదు ఇప్పటికే నిర్మాణాల విలువను ప్రభుత్వం ఖరారు చేసి ఉత్తర్వులిచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల వారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు, నాన్ ఆర్సీసీ రూఫ్‌లతోపాటు పూరిళ్లు, గోడలు లేని ఇళ్ల విలువనూ పెంచేసింది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఉన్న అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు, నివాస భవనాలకు చదరపు అడుగు విలువను రూ.1,490కి పెంచింది.నగర పంచాయతీల్లో చదరపు అడుగు రూ.1,270, గ్రామ పంచాయతీల్లో చదరపు అడుగుకు రూ.900కు పెంచింది. సెల్లార్, పార్కింగ్ ఏరియాతోపాటు ప్రతి అంతస్తులో అదనపు ఫ్లోర్లకు రేటు పెంచారు. వాణిజ్య భవనాల విలువను కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రూ.1,800కు, నగర పంచాయతీల్లో రూ.1,540కి, పంచాయతీల్లో రూ.1060కు పెంచారు.ఇతర ఆర్సీసీ నిర్మాణాలే కాకుండా ఆర్సీసీ రూఫ్‌లు లేని ఇళ్ల విలువను సైతం పెంచేశారు. చివరికి పెంకుటిళ్లు, పాకలు, గోడలు లేని ఇళ్లను సైతం వదలకుండా వాటి విలువను చదరపు అడుగుకు రూ.5 నుంచి రూ.20 వరకూ పెంచింది. అన్ని రకాల నిర్మాణాల్లోనూ ఎస్ఎఫ్టీ రేటు రూ.30 నుంచి రూ.90 వరకు పెంచారు. -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోటెత్తిన జనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వస్తే అన్నిటితోపాటు ఆస్తుల విలువలూ పెరగడం తథ్యం. ఇప్పుడూ అదే పరిస్థితి. జనవరి ఒకటో తేదీ నుంచి భూములు, నిర్మాణాల విలువలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అదీ సాదాసీదాగా కాదు.. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. దీంతో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు తలకుమించిన భారంగా మారనున్నాయి. ప్రస్తుతం రూ.2 లక్షలు కట్టాల్సిన రిజిస్ట్రేషన్ల ఛార్జీలు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెరగనున్నాయి. అన్ని రకాల ఆస్తుల విలువల్లో భారీగా పెరుగుదల ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ ఛార్జీల భారం నుంచి తప్పించుకునేందుకు స్థిరాస్తులు కొనే వారు ఈ నెలాఖరులోపే రిజి్రస్టేషన్లు పూర్తి చేసుకునేందుకు హడావుడి పడుతున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. రెండు రోజులుగా కార్యాలయాల్లో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా రోజుకు 80 వరకు రిజి్రస్టేషన్లు జరుగుతాయి. గురువారం ఒక్క రోజే 220 రిజి్రస్టేషన్లు జరిగాయి. శుక్రవారమూ 250 వరకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఏపీలో మరో బాదుడుకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం
-
బాబు భారీ బాదుడు.. ఏపీ ప్రజలపై రిజిస్ట్రేషన్ ఛార్జీల బండ
-
ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నా రాయితీ
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి కొనుగోలు చేసే ప్రతీ ఎలక్ట్రిక్ వాహనానికి రాయితీ వర్తించనుంది. రిజిస్ట్రేషన్ చార్జీలు, లైఫ్ ట్యాక్స్ సహా అన్ని రకాల పన్నులు చెల్లించాల్సిన పని ఉండదు. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహన పాలసీని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అమలులోకి తెచ్చింది. తక్కువ వాహనాలే ఉంటాయన్న ఉద్దేశంతో.. కొనుగోలు చేసే తొలి 5 వేల కార్లకు, ద్విచక్ర వాహనాల్లో తొలి 2 లక్షల వాహనాలకు.. ఇలా అన్ని కేటగిరీలు కలిపి దాదాపు 2.25 లక్షల వాహనాలకు ఆ రాయితీలను పరిమితం చేశారు. వాటిల్లో దాదాపు 1.60 లక్షల వాహనాలు భర్తీ అయ్యాయి. కార్లలో 5 వేల పరిమితి దాటి పోయింది. కొత్తగా కార్లు కొనేవారికి రాయితీలు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆ విధానాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాహనాల సంఖ్యతో ప్రమేయం లేకుండా.. ఎన్ని వాహనాలు కొన్నా, రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రకటిస్తూ జీఓ నెం.41 జారీ చేసింది. అపరిమిత రాయితీ.. గతంలో ఉన్న రాయితీ విధానాన్ని య«థావిధిగా కొనసాగిస్తూనే, రాయితీ పొందే వాహనాల సంఖ్యపై సీలింగ్ ఎత్తేసింది. ఇక నుంచి ఎంతమంది, ఎన్ని వాహనాలు కొన్నా పూర్తి రాయితీ వర్తించేలా పాలసీలో మార్పులు చేసింది. అయితే బస్సుల వరకు వచ్చే సరికి కొన్ని పరిమితులు విధించింది. ఆర్టీసీ బస్సులు, ఉద్యోగులను ఉచితంగా తరలించేందుకు వినియోగించే ప్రైవేట్ కంపెనీల బస్సులకు మాత్రం పూర్తి రాయితీలు వర్తిస్తాయి. పర్మిట్లతో నడిచే టూరిస్టు, ట్రావెల్స్ బస్సులు, విద్యార్థులను తరలించే విద్యా సంస్థల బస్సులకు ఈ రాయితీలు వర్తించవని స్పష్టం చేసింది. 2026 డిసెంబరు 31 వరకు వర్తింపు గత ప్రభుత్వం వాహనాల సంఖ్యపై సీలింగ్ విధిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కాలపరిమితిని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త విధానం ఈ సంవత్సరం నవంబరు 18 నుంచి 2026 డిసెంబరు 31 వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. గడువు తీరిన తర్వాత మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించింది. అప్పుడు రూ.473 కోట్లు.. ఇప్పుడు ఎంతో? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అందుబాటులోకి తెచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం పది వేల ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు 1.61 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. కొత్తగా కొన్న వాహనాలకు (సీలింగ్ లోపు ఉన్న వాహనాలు) వర్తించిన రాయితీ మొత్తం రూ.473 కోట్లు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు భారీగా పెరిగింది. అన్ని కేటగిరీ వాహనాలు కలిపి నిత్యం 15 వరకు అమ్ముడవుతున్నాయి. వీటిల్లో ఐదారు కార్లు ఉంటున్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాయితీ రూపంలో వాహన దారులకు కలిగే లబ్ధి విలువ భారీగానే ఉండనుంది. ఈ లెక్కన గతంతో పోలిస్తే రాయితీల మొత్తం మూడురెట్లు పెరుగుతుందని అంచనా. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం వినియోగంతో సంవత్సరానికి రూ. లక్ష వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది (కేటగిరీ ఆధారంగా కాస్త అటూ ఇటుగా). ఆ వాహనదారుల సంగతేంటి..? గత ప్రభుత్వ విధానం ప్రకారం కొన్ని కేటగిరీల వాహనాలకు సంబంధించి సంఖ్యాపరంగా ఉన్న పరిమితి దాటిపోయింది. ఆ తర్వాత కొన్న వాహనాలకు రాయితీ రావటం లేదు. అన్నింటికి రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించినందున, తమను వాటిల్లో భాగంగా పరిగణించాలంటూ యజమానులు కోరుతూ రవాణాశాఖ కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. కానీ, కొత్త విధానం సోమవారం నుంచి అమలులోకి వస్తున్నందున, రాయితీ ఇవ్వలేమంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించి, రాయితీ తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.ఎలక్ట్రిక్ వాహనాలు కొనేలా చైతన్యం తెస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని, ఈ దిశలో ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన విధానంలో చేసిన మార్పులను ఆయన ఆదివారం సచివాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యపై సీలింగ్ విధించటంతో కొత్తగా ఆ వాహనాలు కొనేవారికి రాయితీలు రావటం లేదని, అందుకే తాము వాటి సంఖ్యపై ఉన్న పరిమితిని తొలగించామ న్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలు సామాజిక బా ధ్యతగా భావించి, ప్రైవేట్‌గా చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యా సంస్థల బస్సులకు రాయితీ వర్తింపు విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. -
భూమి విలువ పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల పెంపునకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రిజిస్ట్రేషన్ విలువకు, వాస్తవ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని.. అందువల్ల భూముల మార్కెట్ విలువను సవరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2021లో గత ప్రభుత్వం భూముల విలువను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచిందని, అయినా ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు మధ్య భారీ తేడా అలాగే కొనసాగుతోందని అన్నారు.నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉందని గుర్తు చేశారు. గురువారం సచివాలయంలో.. రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన శాఖలైన వాణిజ్య పన్నులు, స్టాంపులు.. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనులు, రవాణా శాఖలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్నిచోట్లా భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. స్టాంప్ డ్యూటీపై అధ్యయనం చేయండి ‘ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలి. రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలి. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల మార్కెట్ ధరల సవరణ ఉండాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది.. తగ్గించాలా.. పెంచాలా..అనేది కూడా అధ్యయనం చేయాలి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు చాలాచోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రజోపయోగాల కోసం సేకరించిన స్థలాలను గుర్తించి అధునాతన మోడల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. పన్ను ఎగవేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి ‘రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పన్నుల ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అవసరమైన సంస్కరణలు చేపట్టాలి. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు. ఆదాయం పెంపుపై ఇకపై ప్రతినెలా ఆదాయం సమకూర్చే శాఖల ఉన్నతాధికారులంతా సమీక్షలు జరపాలి. తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకుని ఆదాయం సమకూరేలా కృషి చేయాలి. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలి. క్షేత్రస్థాయిలో తనిఖీలు, ఆడిటింగ్ పక్కాగా జరగాలి. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచి్చగా పన్ను వసూలు చేయాలి. జీఎస్టీ రిటర్న్స్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలి. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలి. ఇసుక నుంచి వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలి..’ అని సీఎం ఆదేశించారు ఆదాయం ఎందుకు పెరగలేదు? గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్ కారణంగా మద్యం అమ్మకాలు, ఇతర వస్తు విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలు చెప్పాలంటూ అధికారులను రేవంత్‌రెడ్డి నిలదీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
Fact Check: పరిశ్రమలపై పనికిమాలిన కథ
సాక్షి, అమరావతి : అసత్యాలను అక్షరాలుగా పేర్చడంలో ఆరితేరిన రామోజీరావు అనేకానేక అబద్దల కథనాలతో ఈనాడును నింపేస్తున్నారు. రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమలపైనా విషం చిమ్ముతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ చార్జీలకు సంబంధించి కనీస అవగాహన లేకుండా, లేని భారాన్ని ఉన్నట్లు చూపిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గతంలో ఎంత రుణం తీసుకున్నా రూ.10 వేలు చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు దాన్ని 25 రెట్లు పెంచి వాటిపై భారం వేశారంటూ పచ్చి అబద్ధాన్ని ఈనాడులో అచ్చేశారు. నిజానికి మార్ట్గేజ్ బాండ్‌కు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో ఎటువంటి మార్పు లేదు. గతంలో ఉన్న ఛార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అయినా 25 రెట్లు పెరిగిందని అబద్దాలు ప్రచురించేశారు. ఎక్కడ ఏ పరిశ్రమకు ఎలా పెరిగిందో మాత్రం చూపలేకపోయారు. దాన్నిబట్టే ఈనాడులో అచ్చేసింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఆ రెండింటికీ తేడా తెలియదా? డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకి, మార్ట్గేజ్ బాండ్‌కి తేడా తెలియకుండా రామోజీ అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నిజానికి సూక్ష్మ, చిన్న పరిశ్రమలు రుణాలు పొందినప్పుడు ఇచ్చే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్‌కు మాత్రమే వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది. మ«ద్య తరహా పరిశ్రమలకు ఎప్పుడూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు లేదు. మధ్యతరహా పరిశ్రమ రూ.5 కోట్లు రుణం తీసుకుంటే దాని మార్ట్గేజ్ బాండ్‌కి స్టాంప్ డ్యూటీగా 0.5 శాతం చొప్పున 2.5 లక్షలు చెల్లిస్తున్నారనడం పూర్తి అవాస్తవం. డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ని మార్ట్గేజ్బాండ్గా ఊహించుకుని దానికి 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కట్టాలనే కాకి లెక్క వేసి ప్రజలను మాయ చేయాలనేది రామోజీ ప్రయత్నం. ఒకవేళ ఏదైనా పరిశ్రమ తీసుకునే ఎన్ని కోట్ల రుణానికైనా డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకు చెల్లించే స్టాంప్ డ్యూటీ రూ.50 వేలు మాత్రమే. 0.5 శాతం స్టాంపు డ్యూటీ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్‌కు వర్తించదు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్టాంపుల చట్టం ప్రకారం వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ కడితే సరిపోతుంది. 25 రెట్ల భారం ఎక్కడ వేసినట్లు? ఈ కనీస పరిజ్ఞానం కూడా రామోజీకి లేదు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజలు, పరిశ్రమలకు అనుకూలంగా అనేక మార్పులు జరిగాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల వ్యవస్థతో పాటు ఈ–స్టాంపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిద్వారా గతంలోకంటే సులభంగా ప్రజలు రిజిస్ట్రేషన్ల సేవలు పొందుతున్నారు. ఇలాంటి అంశాలను తప్పుదోవ పట్టించే క్రమంలో రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పరిశ్రమలపై రిజిస్ట్రేషన్ల ఛార్జీలతో బాదేస్తున్నారంటూ ఒక కల్పిత కథనాన్ని ప్రచురించారు. -
హైదరాబాద్‌లో తగ్గిన స్థిరాస్తి క్రయవిక్రయాలు.. కారణాలివే..!
సాక్షి, హైదరాబాద్: 2022లో స్థిరాస్తి లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మహా నగర పరిధిలో గతేడాది పరుగులు తీసిన క్రయ విక్రయాలు ఈ ఏడాది మందగించాయి. ఖాళీ స్థలాల, ఫ్లాట్ల ధరలు పెరుగుదల, గృహ రుణాలపై వడ్డీ, రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుదల, కరోనా అనంతరం మధ్య తరగతి కుటుంబాల ఆదాయం తగ్గటం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వంటి అంశాలు స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా గతేడాతో పోతే సుమారు 20 శాతం తగ్గినట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఒమిక్రాన్‌వైరస్ దెబ్బ, తర్వాత నెలలో రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరుగుదలతో ఆదిలోనే ఖాళీ స్థలాలు, ఇళ్ల అమ్మకాలపై దెబ్బపడింది. మరోవైపు ప్రభుత్వం కఠిన నిబంధనలతో వెంచర్లకు అనుమతులు తీసుకుని, ప్లాట్లు చేసి విక్రయించటం స్థిరాస్తి రంగం వ్యాపారులకు భారంగా తయారైంది. వాస్తవంగా మెరుగైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, మౌలిక సదుపాయల కల్పన ఉన్న కారణంగా స్థిరాస్తి రంగానికి డిమాండ్ మాగానే ఉంటుంది. ►మెట్రో నగరాల్లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకొని విశ్వనగరంగా రూపాంతరం చెందేందుకు హైదరాబాద్ నగరం సరికొత్త అవతారాలతో అన్నీచోట్లకు విస్తరిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే నివాస ఖర్చులు తక్కువ కావడంతో ఉపాధి వలసలు అధికం కావడంతో పాటు ఇక్కడే శాశ్వత నివాసాల కోసం ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు పరిశ్రమలు తరలిరావడంతో గృహ, వాణిజ్య నిర్మాణాలకు డిమాండ్ ఉన్నా..తాజా పరిస్ధితులు ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. విలువలు పై..పైకి గ్రేటర్లో పరిధిలో చదరపు అడుగు ధర గత ఏడాదితో పోల్చితే బాగానే పెరిగింది. మొత్తం రెసిడెన్షియల్ మార్కెట్లో చదరపు అడుగు సగటు ధర రూ.3,513 పలుకుతోంది. ఇది కిందటేడాది పోలిస్తే 12శాతం ఎక్కువ. హైదరాబాద్ జిల్లాలో చదరపు అడుగు సగటు ధరపై 18 శాతం, మేడ్చల్–మల్కాజ్‌గిరిలో 23 శాతం, రంగారెడ్డిలో 13 శాతం, సంగారెడ్డి జిల్లాలో 42 శాతం పెరిగింది. ►దీంతో గతేడాది పోల్చితే రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. నగర శివారు చుట్టూ 20– 30 కిలోమీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు, ఫ్లాట్లకు డిమాండ్ పెరగడంతో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. తక్కువ విస్తీర్ణంపై మొగ్గు ఈ ఏడాది కొనుగోలు దారులు అధిక శాతం తక్కువ విస్తీర్ణం గల ఇళ్లపై మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. విస్తీర్ణం పరంగా చూస్తే, 500 నుంచి 1,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో వీటి వాటా 22 శాతం పైనే ఉండగా గతేడాది 15 శాతంగా నమోదైంది. 1,000 కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు మాత్రం భారీగా తగ్గా కిందటేడాది ఇండ్ల రిజిస్ట్రేషన్‌లో వీటి వాటా 74 శాతంగా ఉండగా, ఈ ఏడాది నవంబర్‌లో 65 శాతానికి పడిపోయింది. ఇళ్ల రిజిస్ట్రేషన్లు తక్కువనే.. ►మహా నగర పరిధిలో రెసిడెన్షియల్ మార్కెట్‌ను పరిశీలిస్తే గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఇళ్ల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టినా మొత్తం రిజిస్ట్రేషన్లలో మేడ్చల్ జిల్లా వాటా 41 శాతంగా నమోదు కగా, 39 శాతం వాటాతో రంగారెడ్డి జిల్లా , హైదరాబాద్ జిల్లా వాటా 14 శాతంగా నమైంది. ►గ్రేటర్‌లోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో ప్రస్తుత ఏడాదిలో నవంబర్ చివరి నాటికి రూ.30,415 కోట్ల విలువ గల 62,159 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరగగా..గత సంవత్సరం ఇదే కాలంలో రూ.33,531 కోట్ల విలువ చేసే 75,453 రెసిడెన్షియల్ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రియల్టీ విభాగాల అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ►ఈ ఏడాది నగర శివారులోని రంగారెడ్డి జిల్లాలో 2,49, 135 దస్తావేజులు నమోదైతే గతేడాది 2,74064 దస్తావేజులు నమోదైనట్లు రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
AP: కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ
సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. 13 కొత్త జిల్లా కేంద్రాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ వర్తిస్తుంది. కొత్త జిల్లా కేంద్రాల ఆస్తుల విలువ పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్బన్, రూరల్ ప్రాంతాల మార్కెట్ విలువ సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్ కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలికింది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ప్రారంభించారు. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరగనుంది. పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొచ్చు. అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్థిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసంతో పాటు సుస్థిర ప్రగతికి బాటలు వేస్తుంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది. -
ఎగబడి కొంటున్న జనం! హైదరాబాద్‌లో ఈ ధర ఇళ్లకు యమ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు రాత్రికి రాత్రే పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు సరైన నిర్ణయం కాదని, దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు గృహాలను కొనలేరని స్థిరాస్తి నిపుణులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయినా సరే ప్రభుత్వం ఏవీ పట్టించుకోకుండా ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటూ మార్కెట్ విలువలను కూడా పెంచేసింది. ఫలితంగా గత నెలలో నగరంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. మధ్య తరగతి గృహాల మార్కెట్‌గా పేరొందిన హైదరాబాద్ రియల్టీపై రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయం గట్టి దెబ్బే వేసింది. రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అపార్ట్మెంట్లపై రిజిస్ట్రేషన్ చార్జీల పెరుగుదల ఎక్కువ ప్రభావం చూపించింది. గత నెలలో ఈ కేటగిరీ కేవలం 844 అపార్ట్మెంట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అదే గతేడాది ఫిబ్రవరిలో ఈ విభాగంలో 2,888 ఫ్లాట్లు అమ్ముడుపోవటం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో నగరంలోని గృహ విక్రయాలలో రూ.25 లక్షలలోపు ధర ఉన్న అపార్ట్మెంట్ల వాటా 42% కాగా.. ఈ ఏడాది ఫిబ్ర వరి నాటికిది 16%కి పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో చూస్తే ఈ విభాగం విక్రయాల వాటా 32 శాతంగా ఉంది. క్షీణత రెండోసారి: 2022 ఫిబ్రవరిలో నగరంలో రూ.2,722 కోట్ల విలువ చేసే 5,146 యూనిట్లు విక్రయమయ్యాయి. ఇందులో 52 శాతం యూనిట్లు రూ.25–50 లక్షల మధ్య ధర ఉన్నవే. కాగా.. ఈ ఏడాది జనవరిలో రూ.2,695 కోట్ల విలువ చేసే 5,568 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 6,877 యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే అమ్మకాలు 25 శాతం తగ్గాయి. సేల్స్‌లో క్షీణత నమోదవటం 2022 ఆర్ధిక సంవత్సరంలో ఇది రెండోసారని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లో ఈ ధర ఇళ్లకు డిమాండ్: గతేడాది ఫిబ్రవరిలో జరిగిన అపార్ట్మెంట్ విక్రయాలలో హైదరాబాద్ వాటా 20 శాతం ఉండగా..ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 10 శాతానికి క్షీణించింది. మేడ్చల్–మల్కాజ్గిరి వాటా 39 శాతం నుంచి 42 శాతానికి, రంగారెడ్డి వాటా 37 శాతం నుంచి 43 శాతానికి, సంగారెడ్డి వాటా 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగాయి. "రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాల విక్రయాలు గతేడాది ఫిబ్రవరిలో 34 శాతం ఉండగా.. ఇప్పుడవి 52 శాతానికి వృద్ధి చెందాయి. అలాగే రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న గృహాలు 7 శాతం నుంచి 9 శాతానికి, రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహ విక్రయాలు 7 శాతం నుంచి 9 శాతానికి" పెరిగాయి. 16 శాతం డౌన్: గతేడాది ఫిబ్రవరిలోని గృహ విక్రయాలలో 1,000 చ.అ.లోపు విస్తీర్ణం ఉండే మధ్యతరగతి అపార్ట్మెంట్ల వాటా 19% ఉండగా.. ఇప్పుడవి 16 శాతానికి పడిపోయాయి. గత నెలలోని అమ్మకాలలో 74 శాతం అపార్ట్మెంట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణాలున్నవే. 2021 ఫిబ్రవరిలో వీటి వాటా 70%గా ఉంది. అలాగే 2,000 చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన గృహాలు కూడా 10% నుంచి 11%కి వృద్ధి చెందాయి. చదవండి: దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్ సేల్స్ -
సొంతిల్లు భారమే.. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా?
ధరలు పైపైకి... హైదరాబాద్ శివార్లలోని నారాపల్లిలో గతేడాది జూలైలో చదరపు గజం ధర రూ.20 వేలు. 500 గజాల స్థలం కొంటే రూ.కోటి అయ్యేది. దానిపై 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోయేది. జూలైలో చదరపు గజానికి ధర రూ.30 వేలకు, రిజిస్ట్రేషన్ చార్జీ 7.5 శాతానికి పెంచారు. దానితో 500 గజాల స్థలానికి ధర రూ.1.5 కోట్లకు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.11.25 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు మరోసారి భూముల ధరలను పెంచు తున్నారు. చదరపు గజానికి ధర రూ.45 వేలకు చేరుతుండటంతో.. అదే 500 గజాల స్థలానికి ధర రూ.2.25 కోట్లు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► అంటే గతేడాది జూలైకి ముందు 500 గజాలకు రూ.కోటి ధర ఉంటే.. ఇప్పుడు రూ.2.25 కోట్లకు రూ.6 లక్షలున్న రిజిస్ట్రేషన్ చార్జీ ఇప్పుడు రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► వరంగల్ చౌరస్తా ఏరియాలో గతంలో చదరపు గజానికి రూ.27,500 ధరతో.. 500 గజాలకు రూ.1,37,50,000కు చెల్లిస్తే సరిపోయేది. దానిపై రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.8.25 లక్షలు అయ్యేవి. జూలైలో భూముల ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో.. ధర రూ.1,62,50,000 (చదరపు అడుగుకు రూ.32,500 చొప్పున), రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.12,18,750కు (7.5శాతం లెక్కన) చేరాయి. తాజాగా మరోసారి ధరలు పెంచడంతో.. అదే స్థలానికి రూ.2,07,50,000 (చదరపు అడుగు రూ.41,500) ధర, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.15,56,250 చెల్లించాల్సి వస్తోంది. అంటే.. ఆ స్థలానికి ఏడు నెలల కింద మొత్తంగా రూ.1,45,75,000 చెల్లిస్తే.. ఇప్పుడు రూ. 2,23,06,250 అవుతోంది. ..రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితికి చిన్న ఉదాహరణలివి. ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలనే సామాన్యుడికి ఇది అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వం భూముల విలువలను సవరించడంతో.. స్థలాల యజమానులు కూడా రేట్లు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్ల ధరల పరిస్థితిపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: ఏడు నెలల క్రితమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింటినీ పెంచిన సర్కారు.. తాజాగా మరోసారి స్థలాల ధరలను సవరించనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ అమల్లోకి రానున్నాయి. ఇలా భూముల విలువలు పెరిగిపోవడం, నిర్మాణ సామగ్రి ధరల భారం కలిసి.. ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరలపై ప్రభావం పడింది. భూముల ప్రభుత్వ ధరలకు, మార్కె ట్ విలువకు మధ్య వ్యత్యాసం తగ్గింది. దీనితో స్థలాల యజమానులు భూముల ధరలను పెంచేస్తున్నారు. మరోవైపు కొద్దినెలలుగా సిమెంట్, స్టీల్, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగాయి. రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల చాలా మంది కార్మికులు సొంత రాష్ట్రాలకు, ఊర్లకు వెళ్లిపోయారు. దానితో నైపుణ్యమున్న కూలీల రెట్లు రెం డింతలు అయ్యాయి. ఇలా పెరిగిన వ్యయంతో అ పార్ట్మెంట్లు, ఇళ్ల ధరలు భారంగా మారుతున్నా యి. భూముల ధరలు పెరగడం వల్ల అపార్ట్మెంట్ల ధరలు ఒక్కో చదరపు అడుగుకు రూ.500 వరకు పెరుగుతాయని నరెడ్కో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్‌కుమార్ ముమ్మారెడ్డి తెలిపారు. సొంతంగా కట్టుకుందామన్నా.. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చాలా మంది సొంత ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. కొందరు కట్టిన ఇళ్లు కొనుక్కునే పనిలో పడగా.. చాలా మంది ఇప్పటికే కొనిపెట్టుకున్న స్థలాల్లో ఇంటి నిర్మాణాలపై దృష్టిపెట్టారు. అయితే సిమెంట్, స్టీల్, రంగులు, ఎలక్ట్రిక్ వస్తువులు వంటి అన్నిరకాల నిర్మాణ సామగ్రి ధరలు 50 శాతానికిపైగానే పెరిగాయి. లేబర్ ఖర్చులైతే రెండింతలయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలూ పెరిగాయి. దీనితో మొత్తం నిర్మాణ వ్యయం మొతెక్కుతోంది. ఇంటీరియర్లు కాకుండా ప్రధాన నిర్మాణాల కోసం.. ఏడాదిన్నర కింద సగటున చదరపు అడుగుకు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వ్యయం అయ్యేది. కాంట్రాక్టర్లు అయితే రూ.1,500–1,600 వరకు చార్జీ చేసేవారు. పెరిగిన ధరలతో సాధారణంగానే ఒక్కో చదరపు అడుగుకు రూ.1,700 వరకు ఖర్చవుతోంది. అదే కాంట్రాక్టర్లు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ చార్జి చేస్తున్నారు. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా? బ్రాండ్ హైదరాబాద్‌గా వేగంగా ఎదుగుతుండటానికి కారణం.. ఇక్కడ ధరలు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయమేనని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే.. ఇతర నగరాలకు భాగ్యనగరానికి వ్యత్యాసం ఉండదని.. కంపెనీలు నగరానికి వచ్చే విషయంలో ఇబ్బంది అవుతుందని అంటున్నాయి. కాగా.. భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని ఆరు శాతానికి తగ్గించాలని క్రెడాయ్, ట్రెడా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను కలిసి కలిసి విజ్ఞప్తి చేశాయి. ఇతర రాష్ట్రాల తరహాలో చార్జీలు తగ్గించాలి రెండేళ్లుగా అనిశ్చిత పరిస్థితులతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వ్యయభారం ఎక్కువైంద ని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖ ర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంపుడ్యూటీని తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా భూముల ధరలను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా పెంచలేదు కదా అని కరోనా వంటి అనిశ్చితి సమయంలో రెండుసార్లు సవరించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. భూముల ధరలను పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీలను సగానికి తగ్గించాలని సూచించారు. అపార్ట్మెంట్లపై ప్రభావం ఇదీ.. ► హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో పాత రేటు ప్రకారం వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు రూ.24 లక్షలు, రిజిస్ట్రేషన్ కోసం రూ.1.8 లక్షలు వ్యయం అయ్యేది. ఇప్పుడు కొత్త రేట్లతో అదే అపార్ట్‌మెంట్‌కు ధర రూ.30 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.25 లక్షలకు పెరుగుతున్నాయి. ఇదే పరిమాణమున్న ఫ్లాట్ శంషాబాద్‌లో గతంలో రూ.35 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.7 లక్షలు ఉంటే.. ఇప్పుడు ధర రూ.45 లక్షలు, చార్జీలు రూ.3,37,500 కట్టాల్సి వస్తోం ది. హైదరాబాద్ వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. పైగా జీఎస్టీ కింద 5 శాతం పన్ను అదనంగా చెల్లించక తప్పదు. ► కరీంనగర్ ప్రకాశం గంజ్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు 2 వేలు ధర ఉండేది. ఇప్పుడు రూ.2,500 చేశారు. గతంలో 1,500 చదరపు అడుగుల అపార్ట్మెంట్ విలువ రూ. 30లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1.80 లక్షలుగా ఉండేవి. ఇప్పుడు అదే ఫ్లాట్ విలువ రూ.37.5 లక్షలకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2,81,250కు చేరాయి. ► ఖమ్మంలో వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు గతంలో మొత్తంగా రూ. 17 లక్షలు ఖర్చయితే.. ఇప్పుడు రూ. 21.5 లక్షలకు చేరుతోంది. జిల్లాల్లో పరిస్థితి ఇదీ.. ► జనగామలోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్ సమీపంలో.. గతేడాది జూలైకి ముందు 1000 గజాల స్థలం రూ.కోటి, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.6 లక్షలు ఉండేవి. జూలైలో, తాజాగా పెరిగిన ధరలు, చార్జీలతో.. ప్రస్తుతం ధర రూ.2 కోట్లకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.15 లక్షలకు చేరుతున్నాయి. ► మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్‌వద్ద గతంలో 200 గజాల స్థలాని కి రూ.47 లక్షలు ధర, రిజిస్ట్రేషన్ చా ర్జీలు రూ.3,52,500అయ్యేవి. ఇప్పు డు పెరిగిన ధరలతో.. అదే స్థలానికి ధర రూ.63.60లక్షలు, చార్జీలు రూ. 4.77 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ► కరీంనగర్‌లోని కోర్టు ఏరియాలో స్థలం ధర గతంలో గజానికి రూ.19,500 ఉండేది. 120 గజాల (గుంట) భూమికి రూ.23,40,000 ధర, రూ.1,40,400 రిజిస్ట్రేషన్చార్జీ అయ్యేవి. ఇప్పుడు గజానికి రూ.26,400 లెక్కన అదే స్థలానికి.. రూ.31,68,000 ధర, రూ. 2,37,600 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి రానుంది. ► నిజామాబాద్ జిల్లాలో భూముల ధరలను 30 శాతం వరకు, అపార్ట్మెంట్ల ధరలను 25 శాతం వరకు పెంచారు. పెరిగిన ధరలపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం కూడా పడుతోంది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఎకరానికి రూ.30 లక్షల కనీస ధర ఉండగా రూ.52 లక్షలకు పెంచారు. ► ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీ లో 100 గజాల స్థలానికి గతంలో రూ.8,50,000 ధర, రూ.63,500 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తే సరిపోయేది. తాజాగా స్థలం విలువ రూ. 11,50,000కు, రిజిస్ట్రేషన్ చార్జీల భారం రూ.86,250కు చేరుతోంది. -
ఖాళీ స్థలం చూపిస్తూ యూడీఎస్లో విక్రయాలు
అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్)లో విక్రయాలు చేయరాదని, నిబంధనలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. అక్రమ డెవలపర్లకు చెవికెక్కడం లేదు. హైదరాబాద్‌లో సొంతిల్లు కొనాలనే సామాన్యుని కలను ఆసరా చేసుకొని అందినకాడిక దండుకుంటున్నారు. స్థల యజమానితో ఒప్పందం చేసుకొని.. అదే ఖాళీ ప్లేస్‌లో తక్కువ ధరకే అపార్ట్మెంట్ కడుతున్నామనడంతో కొనుగోలుదారులు కూడా ముందు వెనకా ఆలోచించకుండా తెగ తొందరపడి కొనేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: కరోనా సమయంలో శామీర్‌పేటలో 3.85 ఎకరాలలో జీ+10 అంతస్తులలో ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మొత్తం 1,200 ఫ్లాట్లకు గాను 300 ఫ్లాట్లను చ.అ.కు రూ.1,600లకే విక్రయించింది. ఇందులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఆడిటోరియం వంటివి నిర్మిస్తామని ప్రకటించింది. పైగా ఎమినిటీస్ చార్జీలు లేవు. కార్ పార్కింగ్ ఫీజు కట్టక్కర్లేదు. జీఎస్టీ లేదు. రిజిస్ట్రేషన్ కూడా ఉచితమేనని ప్రకటించింది. ఈస్థాయిలో ఆఫర్లు ఇవ్వటం తో సామాన్యులు ఎగబడ్డారు. వందల సంఖ్యలో ఫ్లాట్లను విక్రయించి కోట్లాది రూపాయలను సంపాదించింది. మరి, నిర్మాణ పనులు మొదలయ్యాయా అంటే ఇంకా కంపెనీ దగ్గర సమాధానం లేదు. రూ.11 వేల అద్దె చెల్లిస్తుందంట.. ఇక ఇప్పుడిదే ప్రాంతంలో ఫేజ్–2 అని మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 11 ఎకరాలలో జీ+10 టవర్లను నిర్మిస్తోంది. 9 బ్లాక్‌లలో మొత్తం 1,170 ఫ్లాట్లుంటాయి. చ.అ.ను 2,600లకు విక్రయిస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముందస్తుగా రూ.8 లక్షల సొమ్ము చెల్లించి ఫ్లాట్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేస్తారంట. 45 రోజుల వ్యవధిలో మిగిలిన సొమ్ము చెల్లిస్తే.. 121 గజాల స్థలాన్ని కొనుగోలుదారునికి రిజిస్ట్రేషన్ చేస్తారంట. ఈ స్థలాన్ని తిరిగి డెవలపర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాసుకుంటాడంట. ఆపైన నిర్మాణ పనులను మొదలుపెడతారట. ఇప్పటివరకు సదరు నిర్మాణ సంస్థకు అనుమతులు రాలేదు. రెరాలో నమో దు కాకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. మొత్తం 11 ఎకరాల ప్రాజెక్ట్ కాగా ఫేజ్–1లో 5.5 ఎకరాలకు మాత్రమే నిర్మాణ అనుమతులు వచ్చాయని కంపెనీ యజమాని తెలిపారు. ప్రస్తుతానికైతే అందులోనే విక్రయాలను చేస్తున్నామని చెప్పారు. నిర్మాణ అనుమతులు రాకముందే యూడీఎస్లో చ.అ. రూ.1,600 చొప్పున 200 ఫ్లాట్లను విక్రయించామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నష్టం ఎలాగంటే? నిర్మాణ సంస్థలు హెచ్ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల అమ్మకాలకు బదులుగా ప్రాజెక్ట్ కంటే ముందే అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (యూడీఎస్) పేరిట స్థలాన్ని రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలకు బదులుగా.. యూడీఎస్లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్ విధానంతో బిల్డర్లకు భారీగా ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసలుబాటు అందుబాటులో ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం భౌతికంగా ఫిర్యాదు చేయాల్సిందే. -
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి. మార్కెట్ విలువ సవరణలను స్వాగతిస్తూనే.. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంపును మాత్రం డెవలపర్ల సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. విలువ, చార్జీలు రెండూ ఒకేసారి పెంచితే కొనుగోలుదారుల మీద తీవ్రమైన భారం పడుతుందని.. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోగా బ్లాక్‌మార్కెట్‌కు ఊతమిచ్చినట్లే అవుతుందని అభిప్రాయపడ్డాయి. 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా విలువల సవరణ జరిగింది. ప్రతీ రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షించి.. కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. రాష్ట్రంలో జరిగిన పాలనాపరమైన సంస్కరణల కారణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంతాలలో భూములు, ఆస్తులతో పాటు గ్రామీణ ప్రాంతా లలో వ్యవసాయ భూముల విలువ భారీగా పెరిగాయి. ప్రధానంగా ఏడేళ్లలో హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలు, హెచ్ఎండీఏ పరిధిలోని భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపునకు ప్రభుత్వం అధికారిక విలువల సవరణకు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు నిర్ణయించింది. సర్వే నంబర్ల వారీగా విలువల సవరణ.. ప్రస్తుతం తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతంగా ఉన్నాయి. ఇందులో స్టాంప్ డ్యూటీ 4 శాతం, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వం సవరించనున్న భూముల మార్కెట్ విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించాల్సిన అవసరముందని ఓ రిటైర్డ్ సబ్‌రిజిస్ట్రార్ సూచించారు. ఏ ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచినా సరే గ్రామాన్ని యూనిట్ ప్రాతిపదికన తీసుకుని సవరిస్తుంటుంది. ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నంబర్లు మినహా మిగిలిన గ్రామం అంతా ఒకటే విలువ ఉంటుంది. అందుకే అంతర్గత రోడ్లు, అభివృద్ధి కార్యకలాపాలు జరిగే సర్వే నంబర్ల వారీగా మార్కెట్ విలువలు పెంచాలి. దీంతో లావాదేవీలను బట్టి చార్జీలు వసూలవడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకోవాలి.. కరోనా సమయంలో గృహ కొనుగోలుదారులకు ఉత్సాహం నింపేందుకు, అదే సమయంలో ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మహారాష్ట్ర, పుణే, కర్ణాటక రాష్ట్రాలు స్టాంప్‌డ్యూటీని 3 శాతం తగ్గించాయి. మహారాష్ట్ర, పుణేలలో అన్ని రకాల గృహాలకు స్టాంప్‌డ్యూటీ మినహాయింపునిస్తే.. కర్ణాటకలో మాత్రం రూ.35 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు వెసులుబాటు కల్పించింది. మహారాష్ట్రలో గతేడాది డిసెంబర్లో మినహాయింపు ప్రారంభం కాగా ప్రతి నెలా రిజిస్ట్రేషన్లు మూడెంకల వృద్ధిని సాధించాయి. డిసెంబర్లో 204 శాతం, ఈ ఏడాది మేలో 2,489 శాతం, జూన్‌లో 327 శాతం వృద్ధి చెందాయి. ఆదాయం పెంపు అన్వేషణలో తెలంగాణ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర విధానాన్ని అవలంభించాలని పలువురు డెవలపర్లు సూచించారు. మార్కెట్ విలువను పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలను 3 శాతానికి తగ్గిస్తే రెట్టింపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. చెంపదెబ్బ గోడదెబ్బ రెండూ తగుల్తయ్.. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో బ్లాక్, వైట్ మనీ అంతరాన్ని తగ్గించాలంటే మార్కెట్ విలువ సవరణతోనే సాధ్యమవుతుంది. అయితే ఇదే సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పెంచితే కొనుగోలుదారులకు చెంపదెబ్బ గోడ దెబ్బ రెండూ తగుల్తయ్. దీంతో మళ్లీ బ్లాక్ మార్కెట్ దారిలో లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే వ్యక్తిగత ఆస్తుల విలువ పెరగదు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల ప్రాపర్టీల అసెట్ వ్యాల్యూ పెరుగుతుంది. దీంతో ఆర్థిక సంస్థలు ఎక్కువ మొత్తంలో రుణాలను మంజూరు చేస్తాయి. మార్కెట్ విలువలు పెరగడం వల్ల 6–12 నెలల పాటు లావాదేవీలు తగ్గిపోతాయి. అప్పటివరకు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచొ ద్దు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీల సంఖ్య తగ్గుతాయేమో కానీ ఆదాయం విలువ మాత్రం పెరుగుతుంది. – నరేంద్రకుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ రిజిస్ట్రేషన్ చార్జీలకూ ఐటీసీ ఇవ్వాలి.. స్టాక్ ఎక్స్ఛేంజ్లో షేర్లు ట్రేడ్ అయినట్లుగానే ప్రాపర్టీలు కూడా ట్రేడింగ్ అవుతున్నాయి. ఒకటే ప్రాపర్టీ మీద పలుమార్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కాబట్టి గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ విలువను తాజా రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించాలి. అంటే జీఎస్టీలో ఎలాగైతే ఐటీసీ ఇస్తున్నారో అలాగే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకు ఇవ్వాలి. ఉదాహరణకు రూ.50 లక్షలకు కొన్న అపార్ట్మెంట్.. రెండు మూడేళ్ల తర్వాత రూ.70 లక్షలకు విక్రయిస్తే రూ.70 లక్షల మీద రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయకూడదు. తాజా రిజిస్ట్రేషన్ విలువ నుంచి ఇంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ విలువ రూ.50 లక్షలకు తీసేయాలి. పెరిగిన ధర ఏదయితే ఉందో రూ.20 లక్షల మీదనే రిజిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేయాలి. ‘ఒకే దేశం–ఒకే పన్ను’ విధానమైన జీఎస్టీ.. రియల్ ఎస్టేట్ లావాదేవీల విషయంలో మాత్రం అమలవ్వడం లేదు. 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు, 5 శాతం జీఎస్టీ రెండూ చెల్లించాల్సి వస్తుంది. – సీ శేఖర్ రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ -
ధరల పెరుగుదల స్వల్పమే
భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు సంబంధించి ప్రజలపై భారం పడకుండా, ప్రభుత్వానికి నష్టం రాకుండా ఆ శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రతి ఏడాదీ ఆగస్టులో రిజిస్ట్రేషన్ ధరలు పెరగడం సహజం. అందులో భాగంగా ఈ ఏడాది కూడా భూముల రిజిస్ట్రేషన్ ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. పెంచే ధరలలో కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారుల నుంచి అనుమతులు కూడా వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖల వారిగా పరిస్థితిని ఆ శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. సాక్షి, నెల్లూరు: రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాదీ ఆగస్టు ఒకటో తేదీన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి భూముల విలువలు పెంచుతారు. రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారుల నిర్ణయంతో ఈ ధరల పెంపు ఉంటుంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆగస్టు ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్ ధరలు పెంచే ముందు ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంటారు. అదే విధంగా ఈ నెల 26వ తేదీ వరకు పెంచుతున్న ధరలపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు స్వీకరించనున్నారు. ఎవరైనా ధరల పెంపుదలపై సూచనలు, సలహాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలోని పలు చోట్ల ధరల పెంపుదలకు ముందే భూముల రిజిస్ట్రేషన్లు పలువురు చేయించుకుంటున్నారు. ప్రణాళిక సిద్ధం నెల్లూరును రిజిస్ట్రేషన్ పరంగా రెండు జిల్లాలుగా పిలుస్తారు. గూడూరు జిల్లా కింద 10 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నెల్లూరు జిల్లా కింద తొమ్మిది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. మొత్తం 19 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిలో ఎక్కువగా నెల్లూరు, స్టౌన్‌హౌస్‌పేట, కావలి, సర్వేపల్లి, నాయుడుపేట, సూళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి రాబడి వస్తోంది. కాగా ప్రతి ఏటా పెంచే ధరలలో భాగంగా ఈ ఏడాది కూడా 10 శాతం భూములు విలువలు పెంచుతున్నట్లు, దాని ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారుల నుంచి కూడా అనుమతులను ఇటీవలే తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను సబ్రిజిస్ట్రార్లతో ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారులు ధరల పెంపుదలపై చర్చిస్తున్నారు. ఏయే ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందో, ప్రజలకు ఎక్కడా భారం కాకుండా, నష్టం లేకుండా చేసే విధంగా చూడాలని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆగస్టు ఒకటి నుంచి అమలు చేస్తున్నాం జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూమల విలువ పెంచుతున్నాం. అందుకు తగ్గట్లు ప్రణాళికను రూపొందించాం. జిల్లా ఉన్నతాధికారుల నుంచి కూడా అనుమతులు తీసుకున్నాం. ధరల పెంపుదలపై ఈ నెల 26వ తేదీ లోపు ఎవరైనా సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. పెంచిన ధరలను అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపిస్తున్నాం. – మునిశంకరయ్య, జిల్లా రిజిస్ట్రార్ -
నో రిజిస్ట్రేషన్ ఫీజ్ : కేంద్రం బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత వాహనాల (ఎలక్ట్రిక్ వాహనాలు) పై కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేయాలని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. బ్యాటరీతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ముసాయిదా ప్రకటన ప్రకారం పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సాహమిచ్చే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాలుష్యం ఉద్గారాలు వెదజల్లని ఈవీ వాహనాల వినియోగాన్ని భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పదేళ్ల తర్వాత (2030) కేవలం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నీతి అయోగ్ కూడా సూచనలు చేసిందని తెలుస్తోంది. 2030 నాటికి వాడకంలో విద్యుత్ వాహనాలే ఉండాలన్నదే లక్ష్యం. అలాఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాల వైపు వాహనదారులు చూసేలా రిజిస్ట్రేషన్ చార్జీలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల రెన్యువల్ కోసం కూడా ఎలాంటి చెల్లింపులు జరపనక్కర్లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్లతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ మిగతా అన్ని విద్యుత్ ఆధారిత వాహనాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. కాగా, తమ ఈ నిర్ణయంపై నెల రోజుల లోపు అభిప్రాయాలను తెలుపవచ్చని రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
3,000 కార్లను సమకూర్చుకుంటున్న డ్రైవెన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ లగ్జరీ కార్ సబ్స్క్రిప్షన్ సర్వీసుల కంపెనీ కార్2డ్రైవ్ హైదరాబాద్‌లో తన సేవలను ప్రారంభించింది. సంప్రదాయ పద్ధతిలో కారు కొనుగోలుకు బదులు.. ఎటువంటి డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా కేవలం చందా చెల్లించడం ద్వారా కస్టమర్ తనకు నచ్చిన కారును ఎంపిక చేసుకోవచ్చు. కారు డ్యామేజ్, రిపేర్లు, బీమా భారం అంతా కంపెనీదే. డ్రైవెన్ ప్రమోట్ చేస్తున్న కార్2డ్రైవ్ బెంగళూరులో కూడా సేవలు అందిస్తోంది. ఒక్కో కారు ఖరీదు రూ.1 కోటి పైనే ఉంటుందని డ్రైవెన్ ఎండీ అశ్విన్ జైన్ శుక్రవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘ప్రస్తుతం కంపెనీ వద్ద 145 లగ్జరీ కార్లున్నాయి. 500 సీసీ అపై సామర్థ్యమున్న సూపర్ ప్రీమియం 55 బైక్‌లు ఉన్నాయి’ అని వివరించారు. కొత్తగా 3,000 వాహనాలు.. దీర్ఘకాలిక చందా, అద్దె విధానంలో కార్లను అందించేందుకు డ్రైవెన్ వచ్చే 12 నెలల్లో 3,000 కార్లను కొనుగోలు చేయనుంది. కస్టమర్ కోరిన మోడల్, ఫీచర్ల ఆధారంగా వాహనాన్ని అందజేస్తారు. ఈ విధానంలో రూ.3 లక్షల కారును సైతం వినియోగదారు ఎంచుకోవచ్చు. వాహనాల కొనుగోలుకు రూ.700 కోట్లు సమీకరించే పనిలో ఉన్నట్టు డ్రైవెన్ భాగస్వామి సయ్యద్ హుస్సేన్ వెల్లడించారు. ‘ఈ–వీ’ పేరుతో షేర్డ్ మొబిలిటీ సేవలను ఏప్రిల్‌లో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. వచ్చే 18 నెలల్లో ఆరు నగరాల్లో 30,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఇందుకోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. -
రిజిస్ట్రేషన్ల మోత
వెంకటగిరి రాజావీధి తదితర ప్రాంతాల్లో చదరపు గజం స్థలం గరిష్టంగా రూ.9500 ఉండగా తాజాగా భూముల విలువ పెంపుతో రూ.10,000 దాటనుంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.1600 మించని చదరపు గజం విలువ తాజా పెంపుతో రూ.1700 పై చిలుకుగా మారనుంది. గతంలో కట్టడాల రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగుకు రూ.900 ఉండగా తాజాగా రూ.950కి చేరనుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ పరిధిలోని సర్వేనంబర్లు, డి నంబర్ల ఆధారంగా భూములు, స్థలాల ప్రభుత్వ మార్కెట్ విలువలను సమీక్షిస్తున్నారు. వెంకటగిరి (నెల్లూరు): భూముల విలువ పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీంతో పట్టణ ప్రజలకు మరోసారి భూముల రిజిస్ట్రేషన్ చార్జీల షాక్ తగలనుంది. వెంకటగిరి ప్రాంతంలో మన్నవరం భెల్ పరిశ్రమ ఏర్పాటుతో పెరిగిన రియల్‌భూమ్ ఆ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో పూర్తిగా పడిపోయింది. రెండేళ్ల క్రితం పెద్దనోట్ల రద్దు ప్రభావం, ఆదాయపన్ను శాఖ నోటీసులతో భూముల క్రయ విక్రయాలు పూర్తిగా మందగించాయి. ఇప్పుడిప్పుడే రియల్ఎస్టేట్ రంగం కోలుకుంటున్న తరుణంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి భూముల విలువ పెంపు కలకలం రేపుతోంది. ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే పట్టణ రేపటి నుంచి స్థిరాస్తి విలువలు పెంపు నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని పట్టణాల పరిధిలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్థిరాస్తి విలువలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి పెంచుతున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థిరాస్తి విలువ 0– నుంచి 5 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన స్థిరాస్తి విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లో పెంచడం లేదన్నారు. మిగిలిన నెల్లూరు నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మాత్రమే పెంచుతున్నట్లు తెలిపారు. అందు కోసం కావాల్సిన వాటిని తయారు చేసే పనిలో సబ్రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. జిల్లా రిజిస్ట్రార్ అబ్రహం -
వ్యాపారులకు అందలం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి సీఆర్డీఏ పరిధిలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై మండిపాటు పట్నంబజారు : కార్పొరేట్ వర్గాలకు రెడ్ కార్పెట్ వేస్తూ.. కంత్రీగాళ్లకు కొమ్ముకాస్తూ.. బడా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తూ, సామాన్య ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపేలా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా సీఆర్డీఏ పరిధిలో భూములు, భవనాల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావుకు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు రెండేళ్ల పాలనలో అడుగడుగునా చట్టాలు తుంగలో తొక్కుతూ ఆదాయం కోసం హడావుడిగా జీవోలు విడుదల చేయడంపై మండిపడ్డారు. సీఆర్డీఏ పరిధిలో టీడీపీకి చెందిన బడా వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూర్చేలా జీవో విడుదల చేయడం సమంజసమేనా అని నిలదీశారు. బడా వ్యాపారులకు అన్నం.. సామాన్యులకు సున్నం అన్నచందంగా చంద్రబాబు సర్కారు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిందని ఎద్దేవా చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జిల జీవోను తక్షణమే ఉపసంహరించుకుని చార్జీల పెంపుపై ప్రజాభిప్రాయం సేకరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజలకు వెలుసుబాటు ఇవ్వకుండా గంటల్లోనే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలకు ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. -
చౌక గృహ రుణాలకు ఆర్బీఐ బూస్ట్
- 10 లక్షల వరకూ రుణాలపై ఆఫర్! - రుణ విలువ లెక్కింపులోనే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు న్యూఢిల్లీ: చౌక గృహాల నిర్మాణాలకు మరింత ఊపునిచ్చే చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ప్రకటించింది. రూ.10 లక్షల వరకూ గృహ రుణాలకు సంబంధించిన నిబంధనలను సడలించింది. గృహ విలువకు సంబంధించి వ్యయం, రుణ మంజూరీలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కలపడానికి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. మొత్తం గృహ నిర్మాణ వ్యయం విషయంలో ఈ చార్జీల వాటానే దాదాపు 15 శాతం వరకూ ఉంది. ఈ మొత్తం సైతం రుణగ్రహీతకు భారం అవుతున్న పరిస్థితుల్లో ఆర్బీఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ప్రకారం ఎల్టీవీ (లోన్ టు వ్యాల్యూ) నిష్పత్తి లెక్కింపు ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంటేషన్ చార్జీలను కూడా ఇకపై బ్యాంకులు కలుపుతాయి. హౌస్ ప్రాపర్టీ విలువలో ఇప్పటివరకూ బ్యాంకులు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇతర డాక్యుమెంటేషన్ చార్జీలను కలపడం లేదు. ఈ వ్యయాలు సైతం భారంగా మారుతున్నాయని, రుణ విలువ లెక్కింపు ప్రక్రియలో వీటిని కూడా జోడించాలని ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), దిగువస్థాయి ఆదాయ వర్గాల (ఎల్ఐజీ) నుంచి పలు విజ్ఞప్తులు అందుతున్నట్లు ఆర్బీఐ విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ తెలిపింది. తాజా నిర్ణయానికి ఆయా అంశాలే కారణమని సైతం వెల్లడించింది. ప్రభుత్వ సంస్థల ప్రాజెక్టుల విషయంలో... ఒకవేళ ప్రభుత్వం లేదా చట్టబద్ధ సంస్థలు చౌక గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టినట్లయితే, ఆయా అథారిటీలు నిర్దేశించిన అంచెల ప్రకారం బ్యాంకులు రుణ మంజూరీలు చేయవచ్చని కూడా ఆర్బీఐ ఆదేశించింది. ఆయా సందర్భాల్లో వినియోగదారు ‘నిర్మాణ దశలకు అనుగుణంగా రుణ మంజూరు’ అంశాలను బ్యాంకులు ఇక్కడ పరిగణనలోకి తీసుకోనక్కర్లేదని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో వివరణ ఇచ్చింది. బ్యాంకుల నుంచి ఈ మేరకు వచ్చిన సందేహాల పరిష్కారంలో భాగంగా ఆర్బీఐ ఈ సూచనలను చేసింది. -
జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వడ్డన
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా జిల్లా ప్రజలపై అదనపు బాదుడికి సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి జపాన్ పర్యటనకు వెళ్తూ అత్యంత రహస్యంగా రెండు జీవోలను రాష్ట్ర ప్రజలపై రుద్దారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేశారు. అది కూడా బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. ఒకటి ఒంగోలు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం కాగా, రెండోది మార్కాపురం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం. ఈ రెండింటి పరిధిలో తొమ్మిదేసి చొప్పున సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. మొత్తం 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ల క్రయ, విక్రయాలు జరుగుతుంటాయి. భూములు, స్థలాలు నిర్ణయించిన మార్కెట్ విలువను బట్టీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ణయిస్తారు. గతంలో కంటే ప్రతి రిజిస్ట్రేషన్‌పై చార్జీల మోత మోగించిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కింది. ముందెన్నడూ ఈ విధంగా అన్ని రకాల సేవలపై చార్జీలు పెంచలేదు. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లా మొత్తం మీద 209 కోట్ల రిజిస్ట్రేషన్ ఆదాయలక్ష్యంగా విధించారు. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, రాష్ట్రం విడిపోయినప్పటికీ జిల్లాకు ప్రత్యేకంగా ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి జరగకపోవడంతో భూముల ధరలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైంది. రిజిస్ట్రేషన్ పరంగా జిల్లావ్యాప్తంగా స్టాంప్ డ్యూటీదే సింహభాగం. ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి 125 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటు ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీల వలన అదనంగా 15 కోట్ల భారం జిల్లా ప్రజలపై పడనుంది. మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరానికి 84 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటు పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీల వల్ల అదనంగా మరో 10 కోట్ల భారం ప్రజలపై పడనుంది. స్టాంప్‌డ్యూటీ గతంలో 4 శాతం ఉంటే ప్రస్తుతం ఒక శాతం పెంచడంతో అది 5 శాతమైంది. అదే విధంగా రిజిస్ట్రేషన్ చార్జీల కింద గతంలో స్టాంప్ డ్యూటీ మీద 0.5 శాతం విధించేవారు దానిని ఇప్పుడు ఒక శాతానికి పెంచారు. సెటిల్మెంట్స్, గిఫ్ట్ డీడ్లపై మార్కెట్ విలువను బట్టీ ఒకశాతం స్టాంప్ డ్యూటీ విధించేవారు, దానిని ప్రస్తుతం 2 శాతంగా పెంచారు. దీంతో పాటు రక్త సంబంధీకులకు కానుకల రూపంలో ఇచ్చే రిజిస్ట్రేషన్లు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, ఇతరుల మధ్య జరిగే భాగస్వామ్య ఒప్పందాల రిజిస్ట్రేషన్ల స్టాంప్ డ్యూటీని కూడా ఒకటి నుంచి 2 శాతానికి పెంచారు. ఇతరుల మధ్య జరిగే ఒప్పందాలు (అగ్రిమెంట్లు) రిజిస్ట్రేషన్లపై గతంలో 2 శాతం స్టాంప్‌డ్యూటీ ఉండేది. ప్రస్తుతం దానిని 3 శాతానికి పెంచారు. అదే విధంగా ఇతరుల మధ్య కానుకలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగితే గతంలో 4 శాతం డ్యూటీ విధించేవారు, దానిని ప్రస్తుతం 4 నుంచి 5 శాతానికి పెంచారు. కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందాలు (అగ్రిమెంట్లు) రూపంలో రిజిస్ట్రేషన్లు చేసుకుంటే గతంలో 0.5 శాతంగా ఉండేది, దానిని ఒక శాతానికి పెంచారు. అన్ని రకాల ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లపై పెంచి కూర్చోవడంతో ప్రజలు ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. -
ఏపీలో రిజిస్ట్రేషన్ ఫీజుల బాదుడు
-
ఏపీలో రిజిస్ట్రేషన్ ఫీజుల బాదుడు
ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ ఫీజులు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. స్టాంపు డ్యూటీని 4 నుంచి 5 శాతానికి పెంచారు. ఇంతకుముందు 2013లో జారీచేసిన ఉత్తర్వులను సవరిస్తూ తాజాగా కొత్త ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. రిజిస్ట్రేషన్ ఫీజును 0.5 శాతం నుంచి 1 శాతానికి పెంచారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య జరిగే ఒప్పందాలపై కూడా ఒక శాతం పీజు సవరణ జరిగింది. ఇతర ఒప్పందాలపై 6 నుంచి 3 శాతానికి ఫీజును సవరించారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తారు.