-
జాక్స్ ధమాకా...
బెంగళూరు గెలిచేందుకు 6 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. కోహ్లి 69 పరుగులతో... విల్ జాక్స్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక్కడ సెంచరీ అయితే గియితే కోహ్లిదే అవుతుంది లేదంటే లేదు! కానీ ఎవరూ ఊహించని విధంగా జాక్స్ రెండే ఓవర్లలో సెంచరీ పూర్తి చేశాడు. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్లో జాక్స్ 4, 6, నోబాల్ 6, 2, 6, 4, 0లతో 29 పరుగులు సాధించాడు. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో తొలి బంతికి కోహ్లి ఒక పరుగు తీసి జాక్స్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6లతో 28 పరుగులు పిండుకొని సంచలన శతకం సాధించి అబ్బురపరిచాడు. జాక్స్ 29 బంతుల్లో 44 పరుగులు చేయగా... ఆ తర్వాత 12 బంతుల్లో ఏకంగా 56 పరుగులు సాధించి సెంచరీ మైలురాయిని అందుకోవడం విశేషం. అహ్మదాబాద్: మళ్లీ బౌలర్ డీలా... బంతేమో విలవిల... బ్యాట్ భళా! అంతే మరో 200 పైచిలుకు స్కోరు... దీన్ని 16 ఓవర్లలోనే ఛేదించిన తీరు చూస్తుంటే ఈ వేసవి వడగాడ్పులతో వేడెక్కించడమే కాదు... ఐపీఎల్ సిక్సర్లతో కిక్ ఎక్కిస్తోంది! ప్లే ఆఫ్స్ రేసుకు దాదాపు దూరమనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇంటాబయటా పరుగుల హోరెత్తిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై జయభేరి మోగించింది. 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేసింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీస్కోరు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), షారుఖ్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగారు. అనంతరం ఆర్సీబీ 16 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సిక్సర్లతో హోరెత్తించారు. జాక్స్ 2 ఓవర్ల విధ్వంసంతో... కోహ్లితో ఛేదన ప్రారంభించిన డుప్లెసిస్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో ఓవర్లో నిష్క్రమించాడు. సాయికిశోర్ వేసిన ఆ ఓవరే వికెట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఎవరూ బౌలింగ్‌కు దిగినా... పరుగులు, ఈ దశ దాటి మెరుపులు... దాన్ని మించి ఉప్పెనే! పవర్‌ప్లేలో బెంగళూరు 63/1 స్కోరు చేసింది. సగం ఓవర్లు ముగిసేసరికి 98/1 అంటే వంద కూడా చేయని జట్టు ఇంకో 6 ఓవర్లు ముగిసేసరికే 108 పరుగుల్ని చేసి మ్యాచ్‌నే ముగించింది. కోహ్లి 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నప్పుడు జాక్స్ 16 బంతుల్లో 16 పరుగులే చేశాడు. 14 ఓవర్లలో బెంగళూరు స్కోరు 148/1. ఈ దశలో మోహిత్ వేసిన 15వ ఓవర్లో, రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో జాక్స్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఆర్సీబీ 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి విజయతీరానికి చేరింది.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) కరణ్ శర్మ (బి) స్వప్నిల్ 5; గిల్ (సి) గ్రీన్ (బి) మ్యాక్స్‌వెల్ 16; సుదర్శన్ (నాటౌట్) 84; షారుఖ్ (బి) సిరాజ్ 58; మిల్లర్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–6, 2–45, 3–131. బౌలింగ్: స్వప్నిల్ 3–0–23–1, సిరాజ్ 4–0–34–1, యశ్ దయాళ్ 4–0–34–0, మ్యాక్స్‌వెల్ 3–0–28–1, కరణ్ శర్మ 3–0–38–0, గ్రీన్ 3–0–42–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (నాటౌట్) 70; డుప్లెసిస్ (సి) సబ్–శంకర్ (బి) సాయికిశోర్ 24; విల్ జాక్స్ (నాటౌట్) 100; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (16 ఓవర్లలో వికెట్ నష్టానికి) 206. వికెట్ల పతనం: 1–40. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–18–0, సందీప్ 1–0–15–0, సాయికిశోర్ 3–0–30–1, రషీద్ ఖాన్ 4–0–51–0, నూర్ అహ్మద్ 4–0–43–0, మోహిత్ 2–0–41–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X ఢిల్లీ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రైజింగ్‌కు బ్రేక్
హెడ్ విధ్వంసం సృష్టించలేదు... క్లాసెన్ కుమ్మేయలేదు... మార్క్రమ్ మెరుపుల్లేవు... అభిషేక్ ఆశించిన స్థాయిలో చెలరేగలేదు... వరుస మ్యాచ్‌లలో పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దూకుడుకు సొంతగడ్డపై బ్రేక్ పడింది. 300 స్కోరు సంగతేమో కానీ ఛేదనలో ఒకదశలో 100 కూడా దాటడమే కష్టమనిపించింది.వరుసగా నాలుగు విజయాల తర్వాత హైదరాబాద్ జట్టు తలవంచింది. మరోవైపు వరుసగా ఆరు పరాజయాలు... మైదానంలో దిగేదే ఓడేందుకా అన్నట్లు ఆడుతూ ఒక్క గెలుపు కోసం తపించిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు భారీ ఊరట లభించింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించడంతో ఎట్టకేలకు ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో రెండో విజయం దక్కింది. సాక్షి, హైదరాబాద్: సీజన్లో తిరుగులేకుండా సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీలు చేయగా... కామెరాన్ గ్రీన్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు) రాణించాడు.అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓడిపోయింది. షహబాజ్ అహ్మద్ (37 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్ కమిన్స్ (15 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. పటిదార్ మెరుపులు... భువనేశ్వర్ ఓవర్లో 3 ఫోర్లతో డుప్లెసిస్ (12 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా... కమిన్స్ ఓవర్లో కోహ్లి 2 ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. డుప్లెసిస్, జాక్స్ (6) వెనుదిరిగిన తర్వాత కోహ్లి ఆశ్చర్యకర రీతిలో ఒక్కసారిగా నెమ్మదించాడు. తన 17వ బంతికి సిక్స్ కొట్టిన కోహ్లి... ఆ తర్వాత 25 బంతులపాటు బౌండరీ కొట్టలేకపోవడం అనూహ్యం.అయితే మరో ఎండ్‌లో పటిదార్ విధ్వంసం ఆర్సీబీ స్కోరును పరుగెత్తించింది. లెగ్‌స్పిన్నర్ మార్కండే లక్ష్యంగా అతను చెలరేగిపోయాడు. అతని రెండో ఓవర్లో ఒక సిక్స్ కొట్టిన పటిదార్... అతని తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6, 6 బాదడం విశేషం. కోహ్లి, పటిదార్ తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా... గ్రీన్ చక్కటి షాట్లతో స్కోరును 200 పరుగులు దాటించాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆర్సీబీ 64 పరుగులు చేసింది. టపటపా... తొలి ఓవర్లోనే హెడ్ (1) అవుట్ కావడంతో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. జాక్స్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన అభిషేక్ తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. అంతే... ఆ తర్వాత పరుగులు రావడం ఆగిపోవడంతో పాటు హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోయింది.మార్క్రమ్ (8 బంతుల్లో 7; 1 ఫోర్), క్లాసెన్ (3 బంతుల్లో 7; 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 13; 1 సిక్స్) ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. దాంతో సన్‌రైజర్స్‌కు ఏ దశలోనూ గెలుపు అవకాశాలు కనిపించలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) సమద్ (బి) ఉనాద్కట్ 51; డుప్లెసిస్ (సి) మార్క్రమ్ (బి) నటరాజన్ 25; జాక్స్ (బి) మార్కండే 6; పటిదార్ (సి) సమద్ (బి) ఉనాద్కట్ 50; గ్రీన్ (నాటౌట్) 37; లోమ్రోర్ (సి) కమిన్స్ (బి) ఉనాద్కట్ 7; కార్తీక్ (సి) సమద్ (బి) కమిన్స్ 11; స్వప్నిల్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–48, 2–65, 3–130, 4–140, 5–161, 6–193, 7–206. బౌలింగ్: అభిషేక్ శర్మ 1–0–10–0, భువనేశ్వర్ 1–0–14–0, కమిన్స్ 4–0–55–1, నటరాజన్ 4–0–39–2, షహబాజ్ 3–0–14–0, మార్కండే 3–0–42–1, జైదేవ్ ఉనాద్కట్ 4–0–30–3. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కార్తీక్ (బి) యశ్ 31; హెడ్ (సి) కరణ్ (బి) జాక్స్ 1; మార్క్రమ్ (ఎల్బీ) (బి) స్వప్నిల్ 7; నితీశ్ కుమార్ రెడ్డి (బి) కరణ్ 13; క్లాసెన్ (సి) గ్రీన్ (బి) స్వప్నిల్ 7; షహబాజ్ (నాటౌట్) 40; సమద్ (సి అండ్ బి) శర్మ 10; కమిన్స్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 31; భువనేశ్వర్ (సి) సిరాజ్ (బి) గ్రీన్ 13; ఉనాద్కట్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–3, 2–37, 3–41, 4–56, 5–69, 6–85, 7–124, 8–141. బౌలింగ్: జాక్స్ 2–0–23–1, సిరాజ్ 4–0–20–0, యశ్ దయాళ్ 3–0–18–1, స్వప్నిల్ 3–0–40–2, కరణ్ శర్మ 4–0–29–2, ఫెర్గూసన్ 2–0–28–0, గ్రీన్ 2–0–12–2. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X పంజాబ్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ లైవ్ అప్డేట్స్
IPL 2024 RCB vs SRH Live Updates: ఎస్ఆర్హెచ్పై ఆర్సీబీ ఘన విజయం..ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో షాబాజ్ అహ్మద్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్యాట్ కమ్మిన్స్(31), అభిషేక్ శర్మ(31) పర్వాలేదన్పించారు.ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కామెరాన్ గ్రీన్,కరణ్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.ఏడో వికెట్ డౌన్..124 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి భువనేశ్వర్ కుమార్ వచ్చాడు.కష్టాల్లో ఎస్ఆర్హెచ్..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షాబాజ్ అహ్మద్(13), ప్యాట్ కమ్మిన్స్(3) పరుగులతో ఉన్నారు.56 పరుగులకే 4 వికెట్లు..207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్ వేసిన స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో తొలుత మార్క్రమ్(7) ఔట్ కాగా.. తర్వాత క్లాసెన్(7) ఔటయ్యారు. 6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 62/4. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(10),షాబాజ్ అహ్మద్(3) ఉన్నారు.రెండో వికెట్ డౌన్..37 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 37/2. క్రీజులో మార్క్రమ్(3), నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ట్రావిస్ హెడ్.. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దంచి కొట్టిన ఆర్సీబీ.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 207 పరుగులుటాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ అదరగొట్టింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్ పాటిదార్(50), విరాట్ కోహ్లి(51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్ రెండు వికెట్లు, ప్యాట్ కమ్మిన్స్,మార్కండే తలా వికెట్ సాధించారు.18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 179/518 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(27), కార్తీక్(7) ఉన్నారు.విరాట్ కోహ్లి ఔట్..ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. జయ్‌దేవ్ ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 142/4మూడో వికెట్ డౌన్..పాటిదార్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన పాటిదార్.. ఉనద్కట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 132/312 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 126/212 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(46), రజిత్ పాటిదార్(49) పరుగులతో ఉన్నారు. పాటిదార్ దూకుడుగా ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.రెండో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన విల్ జాక్స్.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 73/2. క్రీజులో విరాట్ కోహ్లి(34), పాటిదార్(6) పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ..48 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన ఫాప్ డుప్లెసిస్.. నటరాజన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 49/1. క్రీజులో విరాట్ కోహ్లి(23), విల్ జాక్స్(1) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ..టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ఫాప్ డుప్లెసిస్(15) పరుగులతో ఉన్నారు.తొలుత బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ..ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్ఆర్హెచ్ మాత్రం ఒక మార్పు చేసింది.తుది జట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
IPL 2024 RCB Vs SRH: 277 కాదు... 287
బెంగళూరు: సన్‌రైజర్స్ ఆటతీరు చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద పెద్ద రికార్డుల్లో నిలిపింది. బెంగళూరు టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగానే విధ్వంసానికి పునాది పడింది...బ్యాటింగ్ తుఫాన్‌తో హైదరాబాద్ మ్యాచ్ గెలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక సీజన్లో తమ రికార్డుకు ‘2.0’ ను చూపించింది. ముంబైపై 277 రికార్డును రోజుల వ్యవధిలోనే 287 పరుగుల అత్యధిక స్కోరుతో హైదరాబాద్ జట్టు తిరగరాసింది. ఈ ఎండల్ని తట్టుకోలేని జనాలకు మెరుపుల పండగని పంచిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 25 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి మునుపెన్నడూ చేయని 287 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకం బాదగా... హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఆకాశానికే చిల్లులుపడేలా సిక్స్‌లు కొట్టాడు. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) దంచేశాడు చివరి వరకు పోరాడగా..డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. దంచుడే... దంచుడు! రెండో ఓవర్ నుంచే హెడ్ వీరంగం మొదలైంది. టాప్లీ ఓవర్లో 4, 6 కొట్టగా, ఫెర్గూసన్ ఐదో ఓవర్లో రెండు సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాదాడు. దీన్ని యశ్ తదుపరి ఓవర్లోనూ రిపీట్ చేయడంతో 20 బంతుల్లో హెడ్ ఫిఫ్టీ పూర్తవగా, పవర్‌ప్లే స్కోరు 76/0. జాక్స్ ఏడో ఓవర్ వేస్తే హెడ్ వరుసగా 4, 6, 6 బాదేశాడు. తర్వాత అభిషేక్ సిక్సర్‌తో 7.1 ఓవర్లోనే సన్‌రైజర్స్ వందను దాటేసింది. తర్వాతి ఓవర్లో అభిషేక్ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను టాప్లీ అవుట్ చేసి 108 పరుగుల ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. క్లాసెన్ క్రీజులోకి రాగా... వైశాక్ 12వ ఓవర్లో మూడు ఫోర్లతో హెడ్ 39 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని కాసేపటికే అవుటయ్యాడు. ఇక క్లాసెన్ వంతు! అప్పటిదాకా అడపాదడపా షాట్లతో 21 పరుగులు చేసిన క్లాసెన్ బాదే బాధ్యత తను తీసుకున్నాడు. లోమ్రోర్ 9 బంతులేసిన 14వ ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. తదుపరి వైశాక్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్ కొట్టి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. టాప్లీ, ఫెర్గూసన్‌ల వరుస ఓవర్లలో ఒక్కో సిక్స్‌తో విరుచుకుపడిన క్లాసెన్‌కు ఫెర్గూసన్ చెక్‌పెట్టాడు. క్రీజులో ఉన్న మార్క్రమ్ (17 బంతుల్లో 32నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)కు అప్పుడే వచి్చన సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తోడయ్యాడు. వచ్చీ రాగానే టార్గెట్ తుఫాన్‌పై కదం తొక్కుతూ టాప్లీ వేసిన 19వ ఓవర్లో ఆడిన ఐదు బంతుల్ని 4, 4, 6, 6, 4లుగా బాదాడు. ఆఖరి ఓవర్లో మార్క్రమ్ 4, 6 కొడితే సమద్ మరో సిక్సర్ బాదాడు. 19వ ఓవర్లో 25, 20వ ఓవర్లో 21 పరుగులు హైదరాబాద్ గెలుపులో కీలకమయ్యాయి. బెంగళూరు తగ్గలేదు! ఎంతకొట్టినా ఎంతకీ కరగని లక్ష్యమని బెంగళూరు బెదిరిపోలేదు. ఆఖరి దాకా తగ్గేదే లే అన్నట్లుగా సన్‌రైజర్స్ ఫీల్డర్లను చెమటలు పట్టించింది. ఓపెనర్లు కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డుప్లెసిస్ కొండంత లక్ష్యానికి దీటైన ఆరంభం ఇచ్చారు. ఇద్దరు తొలి ఓవర్లో చెరో బౌండరీతో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. తర్వాత ఓవర్ ఓవర్‌కూ సిక్స్‌లు, ఫోర్లతో వేగాన్ని పెంచారు. భువీ నాలుగో ఓవర్లో ఇద్దరు చెరో 2 బౌండరీలతో 3.5 ఓవర్లోనే బెంగళూరు 50 దాటింది. నటరాజన్, కమిన్స్ ఓవర్లలో అవలీలగా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 78/0 స్కోరు చేసింది. కోహ్లిని మార్కండే బౌల్డ్ చేయడంతో తొలిదెబ్బ తగిలింది. మరోవైపు డుప్లెసిస్ 24 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. కానీ విల్‌జాక్స్ (7) నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో దురదృష్టవశాత్తు రనౌటవడం, పటిదార్ (9)తో పాటు డుప్లెసిస్ స్వల్పవ్యవధిలో పెవిలియన్ చేరడం జట్టును వెనుకబడేలా చేసింది. అయితే పదో ఓవర్లో క్రీజులోకి వచి్చన దినేశ్ కార్తీక్ షాట్లతో విరుచుకుపడటంతో భారీ స్కోరు కాస్తా దిగి వస్తుండటంతో హైదరాబాద్ శిబిరం కాస్తా ఇబ్బంది పడింది. 23 బంతుల్లో కార్తీక్ ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. అయితే 12 బంతుల్లో 58 పరుగుల సమీకరణం కష్టసాధ్యం కావడంతో పాటు 19వ ఓవర్లో 6, 4 కొట్టిన కార్తీక్‌ను నటరాజన్ అవుట్ చేయడంతో పరాజయం ఖాయమైంది. 11, 12 ఓవర్లలో వరుసగా 5, 8 పరుగులే రావడం.... 15వ ఓవర్లో కమిన్స్... హిట్టర్ మహిపాల్ (11 బంతుల్లో 19; 2 సిక్స్‌లు)ను అవుట్ చేసి 6 పరుగులే ఇవ్వడం సన్‌రైజర్స్‌ను గట్టెక్కించింది. లేదంటే పరిస్థితి కచి్చతంగా మరోలా ఉండేది! స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఫెర్గూసన్ (బి) టాప్లీ 34; హెడ్ (సి) డుప్లెసిస్ (బి) ఫెర్గూసన్ 102; క్లాసెన్ (సి) వైశాక్ (బి) ఫెర్గూసన్ 67; మార్క్రమ్ నాటౌట్ 32; సమద్ నాటౌట్ 37; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–108. 2–165, 3–231. బౌలింగ్: విల్ జాక్స్ 3–0–32–0, టాప్లీ 4–0–68–1, యశ్ దయాళ్ 4–0–51–0, ఫెర్గూసన్ 4–0–52–2, వైశాక్ 4–0–64–0, మహిపాల్ 1–0–18–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) మార్కండే 42; డుప్లెసిస్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 62; జాక్స్ రనౌట్ 7; పటిదార్ (సి) నితీశ్ (బి) మార్కండే 9; సౌరవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కమిన్స్ 0; దినేశ్ కార్తీక్ (సి) క్లాసెన్ (బి) నటరాజన్ 83; మహిపాల్ (బి) కమిన్స్ 19; అనూజ్ నాటౌట్ 25; వైశాక్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–80, 2–100, 3–111, 4–121, 5–122, 6–181, 7–244. బౌలింగ్: అభిషేక్ 1–0–10–0, భువనేశ్వర్ 4–0–60–0, షహబాజ్ 1–0–18–0, నటరాజన్ 4–0–47–1, కమిన్స్ 4–0–43–3, మార్కండే 4–0–46–2, ఉనాద్కట్ 2–0–37–0. 287: ఐపీఎల్లో ఒక టీమ్ సాధించిన అత్యధిక స్కోరు. ఇదే సీజన్లో తాము చేసిన 277 స్కోరును సన్‌రైజర్స్ సవరించింది. ఓవరాల్‌గా టి20ల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ 314 పరుగులు చేసింది. 22: సన్‌రైజర్స్ సిక్సర్లు. గతంలో బెంగళూరు కొట్టిన 21 సిక్సర్ల రికార్డు బద్దలైంది. 4: హెడ్ చేసిన సెంచరీ (39 బంతుల్లో) ఐపీఎల్లో నాలుగో వేగవంతమైంది. గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) ముందున్నారు. సన్‌రైజర్స్ తరఫున గతంలో వార్నర్ 43 బంతుల్లో సెంచరీ చేశాడు. 549: ఒక టి20ల్లో నమోదైన అత్యధిక పరుగులతో కొత్త రికార్డు. ఇదే సీజన్లో హైదరాబాద్, ముంబై మధ్య 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్లో నేడు కోల్‌కతా X రాజస్తాన్ వేదిక: కోల్‌కతా రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
RCB Vs MI: ముంబై ఫటాఫట్...
ముంబై: ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విధ్వంసం మంచు ముక్కలా కరిగించేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సిక్సర్ల సునామీతో ముంబై 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, రజత్ పటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించారు. ముంబై బౌలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. కోహ్లి విఫలం సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి (3) విఫలమవగా, విల్ జాక్స్ (8) నిరాశపరిచాడు. ఈ దశలో బెంగళూరును కెప్టెన్ డుప్లెసిస్ అండతో పటిదార్ ధాటిగా నడిపించాడు. 12వ ఓవర్లో కోయెట్జి బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లు బాదిన పటిదార్ 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే వెనుదిరిగాడు. మ్యాక్స్‌వెల్ (0) ఈ సీజన్లో మూడోసారి డకౌటయ్యాడు. అడపాదడపా షాట్లతో డుప్లెసిస్ 33 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే బుమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు. డుప్లెసిస్, హిట్టర్ లామ్రోర్ (0)లతో పాటు, సౌరవ్ (9), వైశాక్ (0)లను బుమ్రా అవుట్ చేసినా... దినేశ్ కార్తీక్ ధనాధన్ ఆటతో బెంగళూరు మంచి స్కోరు చేసింది. ఇషాన్, సూర్యల తుఫాన్‌తో... భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు. ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై పవర్‌ప్లేలోనే 72/0 స్కోరు చేసింది. ఇషాన్ 23 బంతుల్లో అర్ధసెంచరీని సాధించగా, రోహిత్ నింపాదిగా ఆడాడు. కేవలం 8.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 100 చేరింది. అదే ఓవర్లో ఇషాన్ దూకుడు ముగిసింది. అనంతరం సూర్యకుమార్ విధ్వంసం సృష్టించి 17 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్, సూర్యలు అవుటయ్యాక హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్స్‌లు), తిలక్ వర్మ (10 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడి ముంబైను విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) ఇషాన్ (బి) బుమ్రా 3; డుప్లెసిస్ (సి) డేవిడ్ (బి) బుమ్రా 61; జాక్స్ (సి) డేవిడ్ (బి) మధ్వాల్ 8; పటిదార్ (సి) ఇషాన్ (బి) కోయెట్జీ 50; మ్యాక్స్‌వెల్ (ఎల్బీడబ్ల్యూ) గోపాల్ 0; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 53; లామ్రోర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; సౌరవ్ (సి) ఆకాశ్ (బి) బుమ్రా 9; వైశాక్ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్‌దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–14, 2–23, 3–105, 4–108, 5–153, 6–153, 7–170, 8–170. బౌలింగ్: నబీ 1–0–7–0, కోయెట్జీ 4–0–42–1, బుమ్రా 4–0–21–5, ఆకాశ్ 4–0–57–1, శ్రేయస్ గోపాల్ 4–0–32–1, షెఫర్డ్ 2–0–22–0, హార్దిక్ 1–0–13–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) కోహ్లి (బి) ఆకాశ్‌దీప్ 69; రోహిత్ (సి) టాప్లీ (బి) జాక్స్ 38; సూర్యకుమార్ (సి) మహిపాల్ (బి) వైశాక్ 52; హార్దిక్ (నాటౌట్) 21; తిలక్ వర్మ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–101, 2–139, 3–176. బౌలింగ్: టాప్లీ 3–0–34–0, సిరాజ్ 3–0–37–0, ఆకాశ్‌దీప్ 3.3–0–55–1, మ్యాక్స్‌వెల్ 1–0–17–0, వైశాక్ 3–0–32–1, 2–0–24–1. ఐపీఎల్లో నేడు లక్నో X ఢిల్లీ వేదిక: లక్నో రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement