rtc driver
-
ఖమ్మంలో విషాదం.. రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు
ఖమ్మం: జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయల్దేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాసరావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. అయితే ఆయన ఆలస్యం చేయలేదు. ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును వెంటనే పక్కకు ఆపారు. ఆపై దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు స్వస్థలం వేంసూరు మండలం రామన్నపాలెంగా తెలుస్తోంది. -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో గ్యాంగ్ లీడర్ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనతో పాటు తక్కువ ధరకే బంగారం, నోట్ల మార్పిడి తదితర నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లీడర్ దేవరకొండ సుదీర్ అలియాస్ అజయ్‌రెడ్డిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించి ఎయిర్ గన్లు 4, హ్యాండ్‌కప్స్ 4, వాకీటాకీలు 4, కత్తులు రెండు, ఫోల్డింగ్ ఐరన్ స్టిక్‌లు రెండు, జామర్స్ 2, పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్, నగదు రూ.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై రాష్ట్రంలోని 10 పోలీస్ స్టేషన్లలో 25 కేసులున్నాయని, కావలి టూ టౌన్ పోలీసుస్టేషన్లో సస్పెక్టెడ్ షీటు ఉందన్నారు. నిందితుడు అనుచరులతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం, నోట్ల మార్పిడి, నకిలీ పోలీసుల అవతారంలో నేరాలు, మోసాలకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు. ఇటీవల నిందితుడి మోసాలపై పలువురు ఫిర్యాదులు చేయగా.. వాటిపై కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ హిమవతి, కావలి డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు. -
డ్రైవర్‌ను సస్పెన్షన్ చేసిన ఆర్టీసీ అధికారులు.. దీనితో డ్రైవర్ తీవ్రనిర్ణయం..
గోపాల్పేట: ఉరేసుకుని ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. తాడిపర్తికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్ (52) కొన్నేళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. నాలుగు నెలల కిందట ఆర్టీసీ అధికారులు చంద్రశేఖర్‌గౌడ్‌ను సస్పెన్షన్ చేశారు. అప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ సభ్యులు అతడిపై కోపంతో ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లారు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com విద్యుదాఘాతంతో ‘భగీరథ’ లైన్‌మేన్ మృతి గోపాల్పేట: విద్యుదాఘాతంతో మిషన్ భగీరథ పథకం లైన్‌మేన్ మృతి చెందిన ఘటన గోపాల్పేట మండలం తాడిపర్తిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తాడిపర్తిలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ అయింది. పైప్‌లైన్‌కు మరమ్మతు చేసేందుకుగాను కాశీంనగర్‌కు చెందిన వాటర్‌మేన్ సతీష్ (45) వెల్డింగ్ మిషన్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష చిన్నచింతకుంట: పోక్సో కేసులో నిందితుడికి మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. చిన్నచింతకుంట మండలం లాల్‌కోటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పోగుల రాజుపై 2018లో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
దాడి చేసింది టీడీపీ రౌడీలే
సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్‌పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు. ఆధారాలతో సహా రౌడీ మూకల ఫోటోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. ప్రశాంత ప్రాంతం కావలిలో ఎవరు ఎటువంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా లోకేశ్, పవన్ కల్యాణ్ బుర్రలేని మాటలు మాట్లాడారని విమర్శించారు. దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలసి తాను ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తుండగా సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందో వివరాలు సేకరించాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు. టీడీపీ, దాని తోక పార్టీలు ప్రతి విషయాన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. నిందితుడు సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్కరున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్ అందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. ప్రధాన ముద్దాయి సుధీర్ గతంలో తన కారుపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. గతంలో జనసేన తరఫున తనపై పోటీ చేసిన సుధాకర్ వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉన్నాయని, వాటిని హైదరాబాద్‌లో మోహరించి ఏం చేస్తున్నాడో తమకు సమాచారం ఉందన్నారు. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ‘ఐ సపోర్ట్ బాబు’ అనే బ్యానర్ పట్టుకున్నాడని చెప్పారు. శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు. -
రౌడీమూకపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అసాంఘిక శక్తులను ఏమాత్రం ఉపేక్షించొద్దని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విస్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో కావలిలో ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసు శాఖ 14 మంది నిందితులను గుర్తించడంతోపాటు ఏడుగురిని 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం గమనార్హం. నిందితులకు అధికార వైఎస్సార్సీపీతో ఏమాత్రం సంబంధం లేదని, వారిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకునేందుకు విపక్ష టీడీపీ – జనసేన వేసిన ఎత్తుగడలు పారలేదు. పరారీలో ప్రధాన నిందితుడు ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై రౌడీమూకల దాడిని ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. దాడికి పాల్పడ్డవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా తక్షణం కఠిన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు శాఖను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసు శాఖ దాడి దృశ్యాల వీడియో ఫుటేజీని పరిశీలించి 14 మంది నిందితులను గుర్తించింది. కావలి – తుమ్మలపెంట మార్గంలో రాష్ట్రం దాటేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. బండి విల్సన్, పుట్టా శివకుమార్‌రెడ్డి, షేక్ ఖాజావలి, కుప్పాల వంశీ, షేక్ కలీమ్ చోటు, షేక్ ఇలియాజర్, షేక్ బాజీలను అరెస్ట్ చేసినట్టు ఆదివారం ప్రకటించారు. 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ఏడుగురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తోపాటు మిగిలినవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాతోపాటు అన్ని చోట్లా విస్తృతంగా గాలిస్తున్నారు. గతంలోనే నేర చరిత్ర.. రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులకు గతంలోనే నేర చరిత్ర ఉంది. కావలి ప్రాంతంలో ఈ ముఠా ఎన్నో ఏళ్లుగా రౌడీయిజం, సెటిల్మెంట్లు చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. అమాయకులను మోసగిస్తున్న నిందితులపై గతంలోనే పోలీసులు సస్పెక్ట్ షీట్లు తెరిచారు. బండి విల్సన్‌పై 14 కేసులు, శివకుమార్‌రెడ్డిపై 8 కేసులు ఉండటం గమనార్హం. మిగిలిన ఐదుగురిని వీరి అనుచరులుగా గుర్తించారు. ఆర్టీసీ డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడికి పాల్పడిన నిందితులపై పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 341, 332, 307, 323, 427 రెడ్‌విత్ 34 సీఐపీ సెక్షన్ల కింద కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రాజకీయ రాద్ధాంతం డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని అధికార వైఎస్సార్ సీపీతోపాటు అంతా ఖండించినా టీడీపీ – జనసేన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన నిందితులతో అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేకున్నా లోకేశ్ సహా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారు. 24 గంటల్లోనే వాస్తవాలు బహిర్గతం కావడంతో విపక్ష నేతలు తోక ముడిచారు. ఆర్టీసీ యూనియన్ల హర్షం ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించిన విధానం, ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేయడం పట్ల ఆర్టీసీ యూనియన్లు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. ఈ ఉదంతం వెలుగులోకి రాగానే నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ సంఘాలకు ఎండీ భరోసానిచ్చారు. సుధీర్ ముఠా మోసాలపై ఫిర్యాదు చేయాలి వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించాం. కావలికి చెందిన ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్ కుమారుడి నిశ్చితార్థం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లడంతో పరారయ్యాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేస్తాం. రూ.1.5 కోట్ల విలువైన రెండు వాహనాలను జప్తు చేశాం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. సుధీర్ ముఠా చేతిలో మోసపోయిన వారు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం. – తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ, నెల్లూరు జిల్లా -
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆరుగురి అరెస్ట్
కావలి/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన కేసులో పోలీసులు శనివారం ఆరుగురిని అరెస్టు చేశారు. మిగిలినవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 24 గంటల్లోపే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన ఆరుగురిని ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన నిందితులను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేందుకు ఏఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. కాగా దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు(ఏపీ16జెడ్0702) డ్రైవర్ బి.రామ్‌సింగ్ కావలి ట్రంక్‌రోడ్డు వద్ద కారును పక్కకు తీయాలంటూ హారన్ మోగించాడు. దీంతో కారు యజమాని ఆర్టీసీ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. స్థానికులతో పాటు అక్కడే ఉన్న కానిస్టేబుల్ సర్దిచెప్పడంతో అతడు అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. అనంతరం తన స్నేహితుడైన దేవరకొండ సుధీర్‌తో పాటు మరికొందరికి ఫోన్ చేశాడు. వారంతా కారు, ద్విచక్రవాహనాల్లో బస్సును వెంబడించి మద్దూరుపాడు వద్ద అడ్డుకున్నారు. డ్రైవర్ రామ్సింగ్ను బస్సు నుంచి కిందకు దించి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. అటుగా వెళ్తున్న కావలి రూరల్ సీఐ ఎం.రాజేశ్ ప్రయాణికులు రోడ్డుపై ఉండటాన్ని గమనించి వివరాలు ఆరా తీశారు. గాయపడిన డ్రైవర్ రామ్సింగ్ను చికిత్స నిమిత్తం వెంటనే కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడితో మాట్లాడి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ.. దాడి ఘటనకు సంబంధించి దేవరకొండ సుధీర్, విల్సన్, శివారెడ్డి, మల్లి, కిరణ్ సహా మొత్తం 10 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా ఏఎస్పీ హిమవతి నేతృత్వంలో కావలి డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో నిందితుల కోసం తీవ్రంగా గాలించారు. కావలిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన కాగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. కావలిలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా డ్రైవర్ రామ్‌సింగ్‌పై దాడిని పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) వేర్వేరు ప్రకటనల్లో ఖండించాయి. దాడికి నిరసనగా ఆదివారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపనున్నట్టు పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు చంద్రయ్య, ఈయూ నేతలు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు, అప్పారావు ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు వినతిపత్రం సమర్పిసా్తమన్నారు. అంతకుముందు విజయవాడలో చికిత్స పొందుతున్న రామ్సింగ్ను ఈయూ నేతలు పరామర్శించారు. -
ఆసిఫాబాద్: ఛాతీలో నొప్పి.. దూకేసిన ఆర్టీసీ డ్రైవర్
కుమ్రం భీం ఆసిఫాబాద్: జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మార్గంలో ప్రమాదం సంభవించింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సు నుంచి బయటకు దూకేశాడు. అదుపు తప్పిన బస్సు.. బోల్తా పడింది. ప్రమాదం జరిగినప్పుడు సదరు సూపర్ లగ్జరీ బస్సులో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. ఒకరికి గాయాలైనట్లు సమాచారం. ప్రయాణికుడితో పాటు ఛాతీ నొప్పికి గురైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. -
Telangana: ఆర్టీసీలోనూ 95% పోస్టులు స్థానికులకే
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలోనూ ఇకపై 95 శాతం పోస్టులను స్థానికులకే కేటాయించనున్నారు. జోనల్, మల్టీజోనల్ పద్ధతిలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ‘95 శాతం స్థానికత’ను పరిగణనలోకి తీసుకొనేలా శాసనసభ ఇటీవల ఆమోదించడంతో దాన్ని ఆర్టీసీలో అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. స్థానికులకే పోస్టుల ప్రక్రియ అమలు విధివిధానాలకు సంబంధించి కొన్ని అంశాలను ప్రతిపాదించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 రెవెన్యూ జిల్లాలు ఉండగా ఆర్టీసీలో మాత్రం 11 రీజియన్లే ఉన్నాయి. అలాంటప్పుడు స్థానికతను ఏ రకంగా పరిగణనలోకి తీసుకోవాలనే విషయమై పాలకమండలి సభ్యులు చర్చించారు. ఓ ప్రతిపాదనను ఖరారు చేసి ప్రభు త్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు. ప్రభు త్వం ఆమోదించాక కొత్త రిక్రూట్మెంట్ చేపట్టనున్నారు. ప్రస్తుతానికి డిపో మేనేజర్ కంటే దిగువ అధికార పోస్టుల్లో ఖాళీలు ఉండగా త్వరలో డ్రైవర్, కండక్టర్ పోస్టుల్లో కూడా ఖాళీలు ఏర్పడనున్నాయి. ఆర్టీసీ ఆసుపత్రికి ఐదుగురు వైద్యులు.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటైన నర్సింగ్ కాలేజీకి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కొత్తగా అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ సేవలకు సంబంధించి డయాలసిస్ టెక్నీషియన్లు, నర్సులను ఔట్ సోర్సింగ్ కింద నియమించుకొనేందుకు ఆసుపత్రి పాలకమండలికి బోర్డు అనుమతించింది. చదవండి: మునుగోడుపై టీఆర్ఎస్ పోస్ట్‌మార్టం.. ‘పోలైన ఓట్లలో 50శాతం మనకే’ -
సండే స్టోరీ: ఈ ప్రేమ బస్సు ఇలా సాగిపోనీ...
‘మరో చరిత్ర’ సినిమాలో కమల హాసన్, సరితల మధ్య సంవత్సరం ఎడబాటు పెడతారు తల్లిదండ్రులు ప్రేమను నిరూపించుకోమని. కేరళలో గిరి, తార ఏకంగా 20 ఏళ్లు ఎడబాటును పాటించారు– ఎందుకంటే వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లడానికి జాతకాలు కలవలేదు గనక. కేరళ ఆర్.టి.సిలో ఒకే బస్సుకు అతను డ్రైవర్‌గా ఆమె కండక్టర్‌గా పని చేస్తారు. బస్సులో సొంత ఖర్చుతో అనేక హంగులు పెట్టారు. వారికీ, వారి బస్సుకీ ఫ్యాన్స్ బోలెడు. అజ్ఞాతంగా ఉన్న వీరి ప్రేమ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దేశాలు దాటుతోంది. సండే రోజు బస్సు ప్రేమను తెలుసుకోవచ్చు. ఈ ప్రేమ కథ 2000 వ సంవత్సరంలో మొదలైంది. ఆమె, అతడూ కాకుండా మధ్యలో ఒక బస్సు కూడా ముఖ్య పాత్ర ధరించింది. ‘నువ్వు ఎక్కవలసిన బస్సు ఇరవై ఏళ్లు లేటు’ అన్నట్టు పెళ్లి మాత్రం 2020లో జరిగింది. అయితే ఏమి వారు సంతోషంగా ఉన్నారు. ఒకరితో ఒకరు అంతే ప్రేమగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. అలెప్పీ.. ఒరు ప్రేమకథ గిరి గోపీనాథ్‌కు అప్పుడు 26. తారా దామోదరన్‌కు 24. ఆమె అలెప్పీకి సమీపంలోనే ఉండే ముత్తుకులం అనే పల్లె నుంచి సిఏ కోర్సుకు ఆడిటింగ్ నేర్చుకోవడానికి అలెప్పీలోని ఒక కోచింగ్ సెంటర్‌కు వచ్చేది. గిరి మేనమామది ఆ కోచింగ్ సెంటర్. అప్పటికి సరైన ఉద్యోగం లేని గిరి ఆ కోచింగ్ సెంటర్లో మేనమామకు సహాయంగా ఉండేవాడు. అతనికి తార నచ్చింది. తారకు గిరి. ‘మొదటిసారిగా వాలెంటైన్స్ డే రోజు ఒక గ్రీటింగ్ కార్డు ద్వారా నా ప్రేమను ఆమెకు తెలియచేశాను. ఆమె కూడా ఓకే అంది’ అంటాడు గిరి. కొన్నాళ్లు ఈ గ్రీటింగ్ కార్డులతోనే వాళ్ల సందేశాలు నడిచాయి. ‘పెళ్లి చేసుకుందాం’ అని గిరి అంటే ‘మా ఇంటికొచ్చి మాట్లాడు’ అని తారా అంది. గిరి పెద్దలతో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. ‘మాకు ఓకే. కాని జాతకాలు కలవాలి’ అని అమ్మాయి తరఫువారు అన్నారు. జాతకాలు కలవలేదు. గిరి కుటుంబం కూడా కలవని జాతకాలను చూసి జంకింది. ఈ పెళ్లి ఏ మాత్రం జరగదు అని ఇరుపక్షాలు తేల్చి చెప్పారు. గిరి మనసు విరిగిపోయింది. తార కుంగిపోయింది. కాని ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గిరి కోచింగ్ సెంటర్లో పని మానేసి 2007లో కేరళ ఆర్టీసీలో డ్రైవర్ అయ్యాడు. తార కోసం పెళ్లాడకుండా ఉండిపోయాడు. ‘నా కోసం ఒకతను వేచి ఉండగా నేను మరొకరిని ఎలా చేసుకుంటాను..’ అని తార కూడా వచ్చిన సంబంధాలను తిరగ్గొట్టసాగింది. అంతేనా... తానూ ఎలాగో పరీక్షలు రాసి 2010లో ఆర్టీసి కండక్టర్ అయ్యింది. ఇద్దరూ అలెప్పీలోని హరిపాద్ బస్టాండ్‌లో రూట్ నంబర్ 220కు డ్రైవర్, కండక్టర్లుగా మారారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు మెల్లగా మొదట బస్సుకు, తర్వాత ఆర్టీసి స్టాఫ్‌కు, ఆపైన పై అధికారులకు తెలిసింది. ‘బస్సే మా ప్రేమ వారధి’ అనుకుని వారిద్దరూ పెళ్లి మాట ఎత్తకనే కొనసాగారు. 2020లో పెళ్లి 2019లో కరోనా లాక్డౌన్ వచ్చాక బస్సులు వాటితో పాటు వీరిరువురి ప్రేమ హాల్ట్ అయ్యింది. కలుసుకోవడం వీలు కాలేదు. కావడం లేదు. అప్పటికి వారి వయసు 46, 44లకు చేరాయి. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వీరిరువురి పట్టుదలకు పెద్దలు తల వంచారు. జాతకాలు ఓడిపోయాయి. ఏప్రిల్ 5, 2020న తమ హరిపాద్ ఆర్టీసి బస్టాండ్‌లో తమ రూట్ నం 220 బస్సును సాక్షిగా పెట్టి దండలు మార్చుకున్నారు. అంతేనా? పై అధికారులకు చెప్పి విహార అటవీ ప్రాంతమైన మలక్కపారాకు స్పెషల్ ట్రిప్ బుక్ చేసుకున్నారు. అలా ఒక బస్సులో ప్రేమించుకుని, ఆ బస్సు ఎదుట పెళ్లి చేసుకుని, దానిలోనే హనీమూన్‌కు వెళ్లిన జంటగా వీళ్లు రికార్డు స్థాపించారు. సోషల్ మీడియాలో వైరల్ పెళ్లి సమయంలో వీరి మీధ కథనాలు వచ్చినా వారం క్రితం వల్లికదన్ అనే ఒకతను ఇన్‌స్టాలో వీరి ప్రేమ కథను వీడియో తీసి పెట్టడంతో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పది లక్షల మంది వీరి ప్రేమ కథ చూశారు. వీరి ప్రేమ బలానికి ఫిదా అయ్యారు. అలెప్పీ వెళితే రోజూ ఉదయం 5.30కు హరిపాద్‌లో బయలుదేరే వీరి రూట్ నంబర్ 220 బస్ ఎక్కండి. ఆ ప్రేమ బస్సులో అలా సాగిపోండి. ఎన్నో హంగులు... డ్యూటీలో డ్రైవర్, కండెక్టర్లు అయినా వాస్తవానికి వారు ప్రేమికులే కదా. అందుకని పై అధికారుల పర్మిషన్తో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. హాయిగా పాటలు వింటూ ప్రయాణిస్తారు. తాము ఉండే బస్సు అందంగా ఉండాలని సొంత ఖర్చుతో ప్రత్యేక అలంకరణలు చేశారు. నేరాలు జరిగి ఉద్యోగాలు దెబ్బ తినకుండా సిసి టీవీలు బిగించుకున్నారు. ఎల్ఇడి డిస్ప్లే కూడా. ఇవన్నీ ప్రయాణికులకు నచ్చాయి. హరిపాద్ బస్ స్టాండ్ నుంచి 220 రూట్లో తిరిగే పాసింజర్లు ఆ బస్సుకు– గిరి తారలకు ఫ్యాన్స్‌గా మారారు. అంతేనా... వారంతా ఒక అభిమాన సంఘంగా మారారు. ఈ ప్రేమ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ సభ్యులు ‘లీజర్ ట్రిప్’ బుక్ చేసుకుని ఈ బస్సులో పిక్నిక్లకు వెళ్లేవారు. ప్రేమజంట గిరి తారలకు ఈ ట్రిప్పులే డ్యూయెట్లు. -
డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు
రాయదుర్గం: డ్రైవింగ్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు. ఆ సమయంలోనూ ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించాడు. ఓ వైపున నొప్పి గుండెను మెలిపెడుతున్నప్పటికీ పంటి బిగువన బాధను భరిస్తూనే బస్సును నియంత్రించాడు. 40 మంది ప్రయాణికులను కాపాడి.. తాను మాత్రం కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. కండక్టర్ హరినాథ్ తెలిపిన వివరాల మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన ఇస్మాయిల్ (56) స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఏపీ 02 జెడ్ 4341 నంబరు గల బస్సును తీసుకుని రాయదుర్గం నుంచి బళ్లారికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలోని డి.హీరేహాళ్ మండలం సోమలాపురం వద్దకు రాగానే ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి మొదలైంది. నీళ్లు తాగి సముదాయించుకుని బస్సును అలాగే ముందుకు నడిపాడు. కొంత సేపటికే నొప్పి మరింత తీవ్రమైంది. వేగంగా వెళుతున్న బస్సును నియంత్రించి రోడ్డు ప్రక్కగా నిలిపాడు. ప్రయాణికులు పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే డ్రైవర్ ఇస్మాయిల్‌ను సమీపంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మాత్ర మింగిన కొద్దిసేపటికే ఇస్మాయిల్ మృతి చెందాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి దేవుడిలా తమ ప్రాణాలు కాపాడాడని ప్రయాణికులు పేర్కొన్నారు. -
ఆ డ్రైవర్ తొలగింపు చెల్లదు: ఏపీ హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడిపారంటూ ప్రయాణికులు, సహోద్యోగులు చెప్పిన సాక్ష్యం ఆధారంగా ఆర్టీసీ డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. డ్రైవర్‌ను తిరిగి సర్వీసులోకి తీసుకోవడంతోపాటు అతనికి ప్రయోజనాలన్నీ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను 8 వారాల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ విశాఖ ఆర్టీసీ డిపో మే నేజర్ దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. మద్యం మత్తులో బస్సు నడుపుతున్నారన్న ఆరోపణలపై విశాఖపట్నంలోని జ్ఞానాపురానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వరరావు అనే డ్రైవర్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనిపై వెంకటేశ్వరరావు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ వెంకటేశ్వరరావు తొలగింపును సమర్థిం చింది. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, మద్యం తాగి వాహనం నడిపారన్న విషయంలో ప్రయాణికులు, సహోద్యోగి చెప్పిన సాక్ష్యం ఆధారంగా వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగించడం చెల్లదన్నారు. మద్యం తాగారని నిరూపించేందుకు వైద్య పరమైన సాక్ష్యం ఉండాలని తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ విశాఖపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పైన పేర్కొన్న మేరకు తీర్పునిచ్చింది. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్ చొక్కా పట్టుకొని మహిళ వీరంగం
-
ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా..
షాద్‌నగర్: ఆర్టీసీ బస్సు తమ వాహనానికి సైడ్ ఇవ్వలేదని ఓ ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో చోటు చేసుకుంది. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ మీదుగా వనపర్తికి వెళ్తోంది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వాహనంలోని వ్యక్తులు బస్సును ఓవర్ టేక్ చేసి బెంగళూరు హైవేపై మధ్యలో నిలిపేశారు. కొందరు వ్యక్తులు వాహనంలోనుంచి దిగి ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా.. అంటూ ఊగిపోయారు. బస్సు దిగి కిందికి రావాలంటూ బూతు మాటలతో విరుచుకుపడి కర్రతో డ్రైవర్‌పై దాడికి యత్నించారు. దీంతో వాహనాలు కొద్ది సేపు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటున్న వ్యక్తులు జాతీయ రహదారిపై హల్చల్ చేస్తున్న దృశ్యాలను అటువైపు నుంచి వెళ్తున్న ప్రయాణికులు చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జాతీయ రహదారిపై హల్చల్ చేసిన వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులని సమాచారం. కాగా, ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎలా స్పందిస్తారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
20 మంది ప్రాణాలు కాపాడి.. గుండెపోటుతో మృతి
సేలం/తమిళనాడు: విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో ఆదివారం మృతిచెందారు. గుండెనొప్పి రాగానే బస్సును డ్రైవర్ చాకచక్యంగా నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈరోడ్ జిల్లా కౌందంపాడికి చెందిన సెల్వరాజ్ (52) ప్రభుత్వ బస్సు డ్రైవర్. ఆదివారం ఉదయం 7.30 గంటలకు కౌందంపాడి నుంచి పెరుందురైకి 20 మంది ప్రయాణికులతో వెళుతున్నారు. మార్గమధ్యంలో సెల్వరాజ్‌కు ఛాతిలో నొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కన ఆపి కండక్టర్‌కి విషయం చెప్పాడు. ప్రయాణికులు సెల్వరాజ్‌ను మరో వాహనంలో సిరువల్లూరు పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. సిరు వల్లూరు పోలీసులు మృతదేహాన్ని గోపిచెట్టి పాళయం ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ : డిపో ముందు పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
-
ఆర్టీసీ డ్రైవర్ ఇంటికెళ్లి సర్ప్రైజ్ చేసిన స్టార్ హీరో
సాధారణంగా ఓ వ్యక్తికి సమాజంలో గుర్తింపు, హోదా వచ్చిదంటే చాలు.. వారు ఇక సెలెబ్రిటీ అయిపోతారు. హోదాని దృష్టిలో పెట్టుకొని, తమకంటే తక్కువ స్థాయిగల వారితో మాట్లాడడానికే నిరాకరిస్తారు. చిత్రపరిశ్రమలో అయితే ఇది మరీ ఎక్కువ. ఒక్క సినిమా తీసి హిట్ కొడితే చాలు.. ఇక ఆ హీరో చరిత్రే మారిపోతుంది. ఉండే ఇల్లు మొదలు... చేసే స్నేహం వరకు అన్ని మారిపోతాయి. గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. తన ఎదుగుదలకు సహకరించిన వారితో పాటు, చిన్ననాటి స్నేహితులను కూడా మర్చిపోతారు. కానీ కన్నడ స్టార్ హీరో దర్శన్ మాత్రం ఇందుకు విరుద్దం. చిన్ననాటి స్నేహితులతో పాటు, తనను స్కూల్‌కు తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ని కూడా మర్చిపోలేదు. తాజాగా ఆయన చిన్నతనంలో తనను స్కూల్‌కు తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ ఇంటికి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ ఆర్టీసీ డ్రైవర్ నిన్న (మార్చి 22)80వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ విషయం హీరో దర్శన్ దృష్టికి వెళ్లింది. ఎప్పటి నుంచో తనను కలుద్దామనుకున్న దర్శన్.. ఇదే మంచి సమయం అనుకొని బర్త్‌డే రోజు ఆయన ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశాడు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన పోటోలను దర్శన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దర్శన్ చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శన్ రియల్ హీరో అని కామెంట్లు చేస్తున్నారు. Sarathi meets the real sarathi who used to be KSRTC bus route driver of Our school, today Meet & wished him on his 80th birthday and took his blessings pic.twitter.com/prEQOd4ZZk — Darshan Thoogudeepa (@dasadarshan) March 22, 2021 -
డ్రైవర్ల కుటుంబంలో విషాదం..
ప్రకాశం, కారంచేడు: ఆ తండ్రికి నలుగురు కొడుకులు.. అందరూ డ్రైవింగ్‌నే వృత్తిగా ఎంచుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయిన తండ్రి గతంలోనే కాలం చేయగా ఆయన కుమారుల్లో ఇద్దరు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇటీవల చనిపోయిన తోటి ఉద్యోగి కర్మకాండలకు వెళ్లొస్తున్న సోదరులను టిప్పర్ రూపంలో మృత్యువు బలితీసుకుంది. మండలంలోని దగ్గుబాడు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ఊపిరి వదిలారు. అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటం, వారిలో ఒకరి పుట్టిన రోజు కూడా కావడంతో వారి స్వగ్రామం పర్చూరులో తీవ్ర విషాదం అలముకుంది. స్థానిక ఎస్ఐ బి.నరసింహారావు తెలిపిన వివరాల మేరకు.. చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేసిన చెరుకూరి జగన్మోహనరావు పర్చూరులో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. పదవీ విరమణ అనంతరం జగన్మోహనరావు మృతి చెందగా ఆయన భార్య కూడా ఇటీవలే కాలం చేసింది. ఆయన నలుగురు కుమారులు కూడా అందరూ డ్రైవర్లుగానే స్థిరపడ్డారు. వీరిలో పెద్ద కుమారుడు కోటేశ్వరావు పర్చూరులో స్కూల్ బస్సు డ్రైవర్, రెండవ కుమారుడు హనుమంతరావు చీరాల ఆర్టీసీ డ్రైవర్, మూడవ కుమారుడు పర్చూరులో స్కూల్ బస్సు డ్రైవర్, చిన్నకుమారుడు చీరాలలోని టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల చినగంజాంకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాసరావు మృతి చెందగా బుధవారం ఆయన దశ దిన ఖర్మకు హాజరయ్యేందుకు చీరాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న హనుమంతరావు (53) ఆయన తమ్ముడు శ్రీనివాసరావు(51) ఉదయం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో ఇంకొల్లు వైపు నుంచి పర్చూరు వస్తుండగా పర్చూరు వైపు నుంచి ఇంకొల్లు వైపు వెళ్తున్న టిప్పర్ మండలంలోని దగ్గుబాడు కోల్డ్ స్టోరేజీ సమీపంలో వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమంతరావు, శ్రీనివాసరావు ఇద్దరూ ఎగిరి రోడ్డుపై పడి తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే రోజు ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం, రెండు కుటుంబాలు వీధిన పడటంతో పర్చూరులో విషాదఛాయలు అలముకున్నాయి. హనుమంతరావుకు భార్య, వివాహాలు అయిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, వివాహాలు అయిన ఇద్దరు కుమార్తెలున్నారు. పుట్టిన రోజు మృత్యు ఒడికి.. బుధవారం శ్రీనివాసరావు పుట్టినరోజు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుందామని చెప్పాడు. తల స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకొని వెళ్లిన భర్త విగత జీవిగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. అన్నతో కలిసి ఇంటికి బయలుదేరిన శ్రీనివాసరావును టిప్పర్ రూపంలో మృత్యువు కబళించిందని గ్రామస్తులు వాపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ బి.నరసింహారావు వివరాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఆర్టీసీ సమ్మె: మృత్యు ఒడిలోకి కార్మికుడు
సాక్షి, వరంగల్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల మరణాలు ఆగడం లేదు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కఠినవైఖరి వీడకపోవటంతో తీవ్ర మనస్థాపానికి చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో చోటుచేసుకుంది. నర్సంపేటకు చెందిన యాకుబ్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత 46 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెలో చురుకుగా పాల్గొంటున్నాడు. అయితే కార్మికుల పక్షాన కోర్టు తీర్పు రాకపోవడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కార్మికుని మృతిపై జేఏసీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. మూడు నెలలుగా జీతాల్లేక ప్రభుత్వం పరోక్షంగా వేధించడం వల్లే యాకుబ్ మరణించాడని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల మృత్యు ఘోష ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినిపించటం లేదా అంటూ పలువురు మండిపడుతున్నారు. -
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
-
తెలంగాణ ఆర్టీసీలో మరో బలిదానం
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరో ప్రాణం బలైపోయింది. మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేష్ బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే నరేష్ ప్రాణాలు విడిచాడు. నరేష్‌కు భార్య పోలమ్మ, ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, సాయికిరణ్ ఉన్నారు. అతను 2007 నుంచి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత ఐదేళ్లుగా నరేష్ భార్య హృద్రోగంతో బాధపడుతోందని, నెలకు రూ. 5వేల మందులు వాడుతున్నారని, మరోవైపు ఇద్దరు పిల్లలు చదువుతుండటంతో నరేష్ ఆర్థికంగా అనేక బాధలు పడుతున్నాడని, ఈ క్రమంలో మొదలైన సమ్మె ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని తోటి కార్మికులు చెప్తున్నారు. నరేష్ ఆత్మహత్య వార్త తెలియడంతో అఖిలపక్ష నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని, కోర్టు విచారణ పేరిట కాలయాపన చేయకుండా కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి.. సమస్యను పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నా చావుకు ముఖ్యమంత్రే కారణం! ఆత్మహత్య చేసుకునే ముందు ఆర్టీసీ డ్రైవర్ నరేష్ సూసైడ్ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. ‘నా చావుకు ముఖ్యమంత్రే కారణం. నా వల్ల ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలి. ఆర్టీసీలో నాదే చివరి బలిదానం కావాలని ముఖ్యమంత్రిగారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నా కుటుంబానికి వచ్చిన ఇబ్బంది మరో కుటుంబానికి రాకూడదు. ఇది నేను సొంతంగా రాసిన లేఖ. నా అంత్యక్రియలకు అశ్వత్థామరెడ్డి హాజరుకావాలి. ఆర్టీసీ కార్మికులు బాగుండాలి’ అంటూ ఈ లేఖలో నరేష్ పేర్కొన్నాడు. ఈ లేఖను చూసి ఆర్టీసీ కార్మికులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు
వర్ధన్నపేట: ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడి గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండె పోటుకు గురయ్యాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీకటి వీరస్వామి తొర్రూరు డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెలాఖరున ఆయన రిటైర్మెంట్ ఉంది. ఈ క్రమంలో సమ్మె కొనసాగుతుండటంతో తాను ఒక్కడినే విధుల్లో చేరాలా.. వద్దా అని నిర్ణయించుకోలేక మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. విధుల్లో చేరకపోతే రావాల్సిన డబ్బులు వస్తాయో రావో అని ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం మేడ్చల్: నగరంలోని రాణిగంజ్ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్న ఆర్టీసీ కారి్మకుడు గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశాడు. మండలంలోని డబీల్‌పూర్ గ్రామానికి చెందిన షేక్‌బాబా రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో మెకా నిక్‌గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మె ఎటూ తేలకపోవడంతో మనస్తాపం చెందిన షేక్‌బాబా ఇంట్లో ఉన్న గుళికల్ని కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగా డు. షేక్బాబాను గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం నగర శివార్లలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె : విధుల్లో చేరేందుకు మరొకరు సిద్ధం
సాక్షి, కామారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్‌లైన్‌తో మరో ఆర్టీసీ కార్మికుడు విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. కామారెడ్డి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సయ్యద్ హైమద్ తిరిగి విధుల్లో చేరుతున్నట్టు డిపో మేనేజర్‌కు ఆదివారం మధ్యాహ్నం రిపోర్టు చేశారు. రెండు నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైమద్ మీడియా ఎదుట వాపోయారు. ఎన్నికల ముందు సమ్మె చేస్తే లాభం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పండగల ముందు సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. విధుల్లో చేరేందుకు తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. స్వచ్ఛందంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా..హైమద్ నిర్ణయంతో పల్లెబాట కార్యక్రమాన్ని డిపో కార్మికులు రద్దు చేసుకున్నారు. అతని కుటుంబ సభ్యులకు సర్ది చెప్పే యత్నం చేశారు. ఇక ఉప్పల్ డిపోలో అసిస్టెంట్ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న కేశవ కృష్ణ.. తిరిగి విధుల్లో చేరుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం డిపో మేనేజర్‌కు లేఖ అందజేశారు. (చదవండి : కేసీఆర్ డెడ్‌లైన్.. విధుల్లో చేరిన ఉద్యోగి) చేరండి.. పూర్తి భద్రత కల్పిస్తాం సాక్షి, నారాయణపేట : సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు నిర్భయంగా విధుల్లో చేరొచ్చునని జిల్లా ఎస్పీ డాక్టర్ చేతన చెప్పారు. విధుల్లో చేరాలనుకునే కార్మికులకు పోలీస్ శాఖ తరపున పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. -
డోర్ మూయకుంటే డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు
తమిళనాడు, తిరువొత్తియూరు: ప్రయాణిస్తున్న బస్సు తలుపులు మూయకుంటే డ్రైవర్, కండక్టర్లపై చర్యలు తీసుకుంటామని రవాణశాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ తరపున నిత్యం 19 వేల బస్సులు నడుస్తున్నాయి. ఇందులో చెన్నై, కోవై, మదురై, తిరుచ్చి నగరాలకు వెళ్లే బస్సుల్లో రద్దీ ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రజలు ఫుట్‌బోర్డుపై వేలాడుతున్నట్టు ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బస్సు తలుపులను మూయడానికి వీలు పడడం లేదు. తద్వారా పెద్ద ప్రమాదం జరుగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బస్సు ఫుట్‌రోడ్డుపై నుంచి కింద పడిన కొన్ని సంఘటనలు ఉన్నాయని, ఈ ప్రమాదాలను నివారించటానికి తప్పనిసరిగా డ్రైవర్లు బస్సు ప్రయాణిస్తున్న సమయంలో డోర్లు మూసి ఉంచాలని లేని పక్షంలో బస్సు డ్రైవర్, కండక్టర్లకు నోటీసులు పంపించి చర్యలు తీసుకుంటామని రవాణ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. -
మోతీ నగర్లో తప్పిన ప్రమాదం; అదుపులో తాత్కాలిక డ్రైవర్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొని కొంత మేర ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే వారికి సిటీలో నడిపిన అనుభవం లేకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మంగళవారం సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోతీ నగర్లో కూకట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారుపై దూసుకెళ్లింది. ఇన్నోవా డ్రైవర్ గమనించి అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు. కాగా, కొద్ది నిమిషాల ముందే ఇన్నోవా వాహనంలో స్కూలు పిల్లలను వారి ఇండ్ల దగ్గర వదిలేసి రావడం గమనార్హం. -
అశ్వత్థామరెడ్డిపై కేసు పెట్టిన డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 21వ రోజు కూడా కొనసాగింది. సీఎం కేసీఆర్ ప్రకటన తో కార్మికుల్లో కొంత గందరగోళం నెలకొన్నా శుక్రవారం కూడా కార్మికులు ఉధృతంగానే నిరసనలు వ్యక్తం చేశారు. కొందరు కార్మికులు డిపో మేనేజర్లకు ఫోన్ చేసి విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో జేఏసీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎవరూ విధుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. కూకట్పల్లి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న కోరేటి రాజు విధుల్లో చేరుతున్నట్లు లిఖిత పూర్వకంగా డీఎంకు దరఖాస్తు సమర్పించి జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందంటూ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హన్మకొండ ఏక శిలా పార్కులో కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భూపాలపల్లిలో విద్యా సంస్థలకు వెళ్లి కార్మికులు విద్యార్థుల మద్దతు కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అఖిల పక్షనేతలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మద్దతు ఇస్తూ నల్లగొండ డిపో వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేటలో ఆర్టీసీ జేఏసీ, టీజేఎస్, ఎమ్మార్పీఎస్, సీఐటీయూ నేతలు కొత్త బస్టాండ్ వద్ద సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఖమ్మం బస్టాండ్ వద్ద జేఏసీ, అఖిలపక్ష నేతలు నిరసన దీక్ష చేపట్టారు. నార్కట్‌పల్లి డిపో డ్రైవర్ జమీల్ గుండెపోటుతో మృతి చెందటంతో ఆయన మృతదేహంతో డిపో వద్ద కార్మికులు ధర్నా చేశారు. మృతుడి కుటుంబసభ్యులకు చెరుకు సుధాకర్ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. దామరచర్ల మండలం నర్సాపురంలో రమావత్ దీప్లా అనే డ్రైవర్ సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో కార్మికుల నిరసన కార్యక్రమాల్లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. అలాగే శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వంటావార్పు.. సంగారెడ్డి బస్టాండ్ వద్ద వంటా వార్పు చేపట్టారు. మంత్రి హరీశ్‌రావు పర్యటన ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్‌లో కార్మికులు ర్యాలీ నిర్వహించి నిరాహారదీక్షలో పాల్గొన్నారు. సిద్దిపేట డిపో వద్ద ఏర్పాటు చేసిన నిరసనసభలో సీపీఐ నేత చాడవెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ మంకమ్మ తోటలో బస్సుల కోసం ఎలగందుల స్కూల్ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మెట్పల్లి డిపోవద్ద కార్మికులు చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట గోదావరిఖని డిపో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. 30న సభకు జనసమీకరణపై దృష్టి ఈ నెల30 సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన జేఏసీ.. జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇందుకు రాజకీయ పార్టీల సాయాన్ని కోరింది. కార్మికుల కుటుంబసభ్యులతో పాటు సాధారణ ప్రజలు, పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు శుక్రవారం మధ్యాహ్నం జేఏసీ నేతలు బీజేపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఇతర నేతలతో చర్చించారు. జన సమీకరణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ భేషజాలకు పోతున్నందున అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా జన సమీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. సరూర్‌నగర్ బహిరంగ సభలో అన్ని పార్టీల నేతలు పాల్గొనేలా జేఏసీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతించకపోతే హైకోర్టును ఆశ్రయించాలని జేఏసీ నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన అశ్వత్థామరెడ్డి రంగంలోకి విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అడ్డు కున్నా శుక్రవారం రాత్రి విద్యార్థులు భారీ బహి రంగ సభ నిర్వహించారు. మధ్యాహ్నం నుంచే సభకు ఏర్పాట్లు జరిగినా అనుమతిలేదంటూ పోలీసులు మైకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరుకావటం జేఏసీకి ఉత్సాహాన్నిచ్చింది. ఇకపై ఉద్యమాన్ని తాము ముందుకు తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు సమ్మెకు సంఘీభావం తెలుపుతూ ప్రత్యక్షంగా పాల్గొంటాయని వెల్లడించారు. 72 శాతం బస్సులుతిప్పాం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎక్కువ సంఖ్య(72 శాతం)లో బస్సులు తిప్పినట్లు ఆర్టీసీ ప్రకటించింది. శుక్రవారం 6,519 బస్సులు తిప్పామని, ఇందులో ఆర్టీసీ బస్సులు 4591 ఉండగా, ఆర్టీసీ అద్దె బస్సులు 1,928 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.