Rukshar Dhillon
-
Rukshar Dhillon: అదిరిపోయే స్టిల్స్ తో నా సామి రంగ...ఆ ఫోజులు చూశారంటే అంతే!(ఫోటోలు)
-
నాగార్జున గారు చాలా హెల్ప్ చేశారు.. థాంక్యూ సార్..!
-
Naa Saami Ranga Pre-Release Event: 'నా సామి రంగ' ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Naa Saami Ranga Movie: ఈ స్టిల్స్ చూస్తే 'నా సామి రంగ' అనాల్సిందే (ఫొటోలు)
-
‘స్పార్క్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నీ ముఖానికి నువ్వు హీరో ఏంటి..?
-
నా మూడేళ్ల కల స్పార్క్
విక్రాంత్ హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విక్రాంత్ మాట్లాడుతూ – ‘‘నాకు సినిమాలంటే ఇష్టం. అమెరికాలో జాబ్ చేస్తున్న క్రమంలో సంపాదనలో పడి కలను మర్చిపోకూడదని ఈ సినిమా తీశాను. ఏడాదిన్నర పాటు ‘స్పార్క్’ కథ రాసుకుని, కష్టపడి మరో ఏడాదిన్నర పాటు ఈ సినిమాను నిర్మించాం. ‘స్పార్క్’ నా మూడేళ్ల కల. యాక్షన్, థ్రిల్, లవ్, కామెడీ, డ్రామా.. అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. యూనివర్సల్ అప్పీల్ ఉన్న మల్టీజానర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు తమిళ నటుడు గురు సోమసుందరం. ‘‘టైటిల్‌కు తగ్గట్లే మా సినిమా ‘స్పార్క్’లా ఉంటుంది’’ అన్నారు మెహరీన్. ‘‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తుండటం హ్యాపీ’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్. -
ఏమా అందంఏమా అందం
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్.. ఎల్.ఐ.ఎఫ్.ఈ’. మెహరీన్ ఫిర్జాదా, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. డెఫ్ ఫ్రాగ్ ్ర΄÷డక్షన్స్పై రూ΄÷ందిన ఈ చిత్రం నవంబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఏమా అందం.. ఏమా అందం.. భామా నీకు భువితో ఏమి సంబంధం’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విక్రాంత్, రుక్సార్ కాంబినేషన్లో ఈ పాట చిత్రీకరించారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర రూ. 79,500! స్పెషాలిటీ?
లైట్ పర్పుల్ కలర్ లెహెంగాలో .. అంతకన్నా లైట్ మేకప్‌తో .. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మెరిసిపోతున్న ఆ సెలబ్రిటీని గుర్తుపట్టారా? రుక్సర్ థిల్లాన్ అంటున్నారు కదా యూత్ అంతా ముక్త కంఠంతో. కరెక్ట్! గతేడాది ఆమె సోదరి పెళ్లి వేడుకలోని ఆ దృశ్యం. రుక్సర్ను పరిచయం చేయడానికి ఆమె నటించిన తెలుగు సినిమాల పేర్లు .. ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం! తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం! ఈ ఫంక్షన్లో ఆమె అటైర్గా మారిన బ్రాండ్స్ వివరాల మీదకూ చూపు మరల్చండి.. వివాణి ‘మనం వేసుకునే దుస్తులు మన అభిరుచినే కాదు మన ఐడెంటినీ వ్యక్తపరుస్తాయి’ అంటారు వాణి వాట్స్. అనడమే కాదు నమ్ముతారు కూడా. ఆ నమ్మకంలోంచి వచ్చిందే మహిళల డ్రెస్ డిజైన్ బ్రాండ్ వివాణి. 2015లో ప్రారంభించింది. ప్రాచీన భారతీయ ఎంబ్రాయిడరీ కళకు మోడర్న్ ఫ్యాషన్ జోడించి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించడమే వివాణి వాల్యూ. కాబట్టే ఆ బ్రాండ్ ఇప్పుడు భారతీయ హస్తకళా రాజసానికి పర్యాయంగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్నప్పటి నుంచి ఆమెకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హస్తకళలు, ఆర్కిటెక్చర్ అంటే ఆసక్తి. ఆ ఆసక్తే కొద్దే పర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. వివాణిని సృష్టించింది. ది చాంద్ స్టూడియో ఏమ్‌బీఏ చదివిన అన్న దేవేశ్, ఎమ్మే సైకాలజీ చేసిన చెల్లి రిమ్ఝిమ్ల కలల ప్రాజెక్టే ‘ది చాంది స్టూడియో’ జ్యూయెలరీ. 1990లో రత్నాలు, వెండి నగల ఎగుమతితో ప్రారంభమైంది ఆ అన్నాచెల్లెళ్ల ఈ ప్రయాణం. వెండి నగల పట్ల ఈ ఇద్దరికీ ఉన్న అభిరుచి.. ఆ నగలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఈ వ్యాపారంలో వాళ్లు గడించిన అనుభవం.. ఈ మూడు ‘ది చాంద్ స్టూడియో’ ఏర్పాటుకు ప్రేరణనిచ్చాయి. ఆకట్టుకునే డిజైన్స్, అందుబాటు ధరలు ఈ బ్రాండ్ యూఎస్పీ. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ : లెహెంగా బ్రాండ్: వివాణి ధర: రూ. 79,500 జ్యూయెలరీ: ఇయర్ రింగ్స్ ధర: రూ.2,800 మాంగ్ టీకా బ్రాండ్: ది చాంది స్టూడియో ధర: రూ.4,800 సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలనుంది. అంతేకాదు ప్రతిభావంతులైన ఎంతోమంది డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్లందరితోనూ పనిచేయాలనుంది. – రుక్సర్ థిల్లాన్ చదవండి👉🏾Varsha Mahendra: అక్కడ కేవలం బ్లవుజులే! ఒక్కో దాని ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు.. -
అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ
టైటిల్: అశోకవనంలో అర్జున కళ్యాణం నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ తదితరులు కథ: రవికిరణ్ కోలా దర్శకత్వం: విద్యా సాగర్ చింతా నిర్మాత: బాపీనీడు. బి సంగీతం: జై క్రిష్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ పలనీ ఎడిటింగ్: విప్లవ్ నైషధం విడుదల తేది: మే 6, 2022 మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'అల్లం అర్జున్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విశ్వక్ సేన్ సరసన రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా అలరించిన ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విభిన్నంగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన చర్యలు పలు విమర్శలను కూడా మూటగట్టుకున్నాయి. విశ్వక్ సేన్‌కు ఓ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన కాంట్రవర్సీ తెలిసిందే. ఇవన్ని దాటుకోని ఎట్టకేలకు నేడు (మే 6) అశోకవనంలో అర్జున కల్యాణం థియేటర్లలో విడుదలైంది. మరీ అల్లం అర్జున్‌గా విశ్వక్ సేన్ ఏమేరకు అలరించాడు ? రివ్యూలో చూద్దాం. కథేంటంటే సూర్యపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అల్లం అర్జున్ (విశ్వక్ సేన్)కు 33 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. ఇరుగుపొరుగు వారి మాటలు భరించలేక చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన మాధవి(రుక్సార్ దిల్లాన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తుంది. దీంతో అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. రెండు వేర్వేరు యాసలు, వేర్వేరు కులాలకు చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి? మాధవి చెల్లెలు వసుధ(రితికా నాయక్) చేసిన చిలిపి పని ఎక్కడికి దారి తీసింది? వీరి మధ్యలో కులాల ప్రస్థావన ఎలా వచ్చింది? అసలు అర్జున్‌కి పెళ్లి అయిందా లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉదంటంటే... 30 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోకపోవడం ఇప్పుడు కామన్. ఇదే పాయింట్‌ని తీసుకొని ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విద్యా సాగర్ చింతా. వయసు మీదపడినా ఇంకా పెళ్లికాలేదు అనే ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారందరికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. పెళ్లి అనేది మనకు నచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలని కానీ.. సమాజం కోసమే.. లేదా కుటుంబ గౌరవం కోసమో చేసుకోవద్దనే విషయాన్ని కామెడీగా చూపించాడు. ట్రైలర్లో చూపించినట్లుగా.. సినిమా అంతా కామెడీగా సాగుతుంది. కొన్ని సీరియస్ అంశాలను కూడా ఎంటర్టైన్మెంట్ జోడించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌తో మాట్లాడేందుకు హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే హీరోయిన్ చెల్లెలు చేసే అల్లరి ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండాఫ్‌లో చాలా సీరియస్ అంశాలను సున్నితంగా చూపించాడు దర్శకుడు. అయితే కథలో కావాల్సినంత కామెడీ ఉన్నా.. నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఫస్టాఫ్‌లో చాలా సాగదీత సీన్లు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకుడి కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకునేలా లేదు. సెకండాఫ్‌లో కూడా ఎంగేజింగ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. క్లైమాక్స్ కూడా రోటీన్ ఉంటుంది. ఎవరెలా చేశారు? కొత్త తరహా చిత్రాలు, పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడు విశ్వక్ సేన్. ఈ చిత్రంలో కూడా సరికొత్త గెటప్‌లో కనిపించాడు. మధ్యవయస్కుడు అల్లం అర్జున్‌గా విశ్వక్ సేన్ మెప్పించాడు. తన వయసుకు మించిన పాత్రను పోషించిన విశ్వక్‌ని అభినందించాల్సిందే. అమాయకుడిగా ఉంటునే..తనదైన కామెడీతో నవ్వించాడు. ఇక మాధవిగా రుక్సార్ దిల్లార్ ఆకట్టుకుంది. చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. ఇక హీరోయిన్ చెల్లెలు వసుధ పాత్రలో రితికా నాయక్ పరకాయ ప్రవేశం చేసింది. ఆమె చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. గోపరాజు రమణ తనదైన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జై క్రిష్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా ‘ఓ ఆడపిల్ల ..’అనే పాట అందరికి నచ్చుతుంది. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎటిటర్ విప్లవ్ నైషధం తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణవ విలువసు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఫీమేల్ క్యారెక్టర్ చేయాలని ఉంది
‘‘సెట్స్‌లో నాదైన శైలిలో నటించాలనుకుంటాను. అందుకే దర్శకుల నుంచి పెద్దగా రిఫరెన్సెస్ కూడా అడగను. దర్శకులు చెప్పిన కథ, అందులోని సందర్భాల ప్రకారం నటించడమే నాకు ఇష్టం’’ అని దర్శక–నటుడు విశ్వక్ సేన్ అన్నారు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ చిత్రం రేపు థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ చెప్పిన విశేషాలు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ నా కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. ఈ సినిమాకు మ్యాజిక్ జరిగింది. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. నిజానికి ఈ కథ విన్న వెంటనే సినిమా చేసేయాలనుకున్నాను. కథ వినడమే ఈ టైటిల్‌తోనే విన్నాను. సో.. వేరే టైటిల్స్ అనుకోలేదు. సినిమాలో తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు అనేవి ఒక లేయర్ మాత్రమే. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. సందేశం కూడా ఉంది. ముఖ్యంగా అనవసరంగా పోలికలు పెట్టుకుని ఆత్మన్యూనతా భావంతో బాధపడే అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ‘మీ(మహిళలను ఉద్దేశిస్తూ...) గురించి మీరే నిలబడాలి’ అనే డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆ లోపే పెళ్లి చేసుకుంటాను! ఈ సినిమాలో అల్లం అర్జున్‌కుమార్ పాత్రలో కనిపిస్తాను. నా తొలి సినిమా ‘వెళ్లిపోమాకే’కు చేసిన వర్క్‌షాప్స్ కూడా ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి. 30 ఏళ్ల వయసు మీద పడిన పెళ్లి కాని అల్లం అర్జున్ కుమార్ క్యారెక్టర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ‘మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు అలాంటి ఎంటర్టైన్మెంట్ను మా సినిమా అందిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం బరువు పెరిగాను. నిజానికి బరువు తగ్గడం సులభమే కానీ పెరగడం కష్టం. ఇక పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం ఉంది. నాకు 30 ఏళ్లు దాటే లోపే పెళ్లి చేసుకుంటాను. ఇక యాక్టర్‌గా నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. కమల్‌హాసన్‌గారు ‘భామనే సత్యభామనే’ సినిమాలో చేసిన ఫీమేల్ క్యారెక్టర్ లాంటివి చేయడానికి సిద్ధమే. అలాగే నేను తెలంగాణ హీరోగా మాత్రమే ఉండాలనుకోవడం లేదు. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తాను. పాన్ ఇండియా స్థాయిలో... తమిళ సినిమా ‘ఓ మై కడవులే..’ చిత్రానికి తెలుగు రీమేక్ ‘ఓరి... దేవుడా’ సినిమా చేశాను. ‘దమ్కీ’ సినిమా చేస్తున్నా. అయితే ‘దమ్కీ’ సినిమా కథపై దర్శకుడు నరేష్ కన్నా నాకే ఎక్కువ కమాండ్ ఉందనిపించి ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. నరేశ్‌తో భవిష్యత్‌లో మరో సినిమా ఉండొచ్చు. హిందీలో ఓ సినిమా చేసే ప్రయత్నాలను మొదలుపె ట్టాను. ‘సవారి’ ఫేమ్ సాహితి దర్శకత్వంలో ‘స్టూడెంట్’ అనే సినిమా చేయాల్సి ఉంది. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకు సీక్వెల్ ఉంటుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. -
మా ఇంట్లో దాదాపు ప్రేమ వివాహాలే, నేనూ లవ్ మ్యారేజ్ చేసుకుంటా!
‘‘కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే నిడివి గురించి నాకు పెద్దగా పట్టింపులు లేవు. ఎలాంటి పాత్రైనా చేస్తాను. అలాగే ఫలానా పాత్రలే చేయాలని పరిమితులు పెట్టుకోలేదు కూడా’’ అని అన్నారు హీరోయిన్ రుక్సార్ థిల్లాన్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించారు. విద్యాసాగర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో రుక్సార్ థిల్లాన్ మాట్లాడుతూ.. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా సందేశాత్మకంగా పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో నేను మాధవి అనే సింపుల్ గాళ్ పాత్ర చేశాను. కొన్ని సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడాలి. ఇదో చాలెంజ్లా అనిపించింది. ఇక స్క్రీన్‌పై విశ్వక్, నా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. దర్శకుడు విద్యాసాగర్ నాకు యాక్టింగ్‌లో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక దర్శకులు సుకుమార్‌గారంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది. యాక్టింగ్‌లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్గార్లంటే ఇష్టం. కోవిడ్ వల్ల వరుసగా సినిమాలు చేయలేకపోయాను. రీసెంట్గా హిందీలో ఓ వెబ్ షో చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘మా ఇంట్లో దాదాపు ప్రేమ వివాహాలే. నేనూ ప్రేమ పెళ్లే చేసుకోవాలనుకుంటున్నా. నన్ను బాగా అర్థం చేసుకుని, నా కెరీర్‌ను సపోర్ట్ చేస్తూ, నా అభిప్రాయాలను గౌరవించే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. చదవండి: నాకు ఆశలు కల్పించి వెంటన్నే ఆ ఆశలపై నీళ్లు చల్లడం భావ్యమా? బిగ్‌బాస్ బ్యూటీకి సల్మాన్ ఖాన్ బంపరాఫర్, ఆమె ఎంత అడిగితే అంత! -
'అశోకవనంలో అర్జున కల్యాణం' ట్రైలర్ రిలీజ్..(ఫోటోలు)
-
36 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం నేరమా ?.. ప్రశ్నించిన విశ్వక్ సేన్
Ashoka Vanamlo Arjuna Kalyanam Trailer: 'పాగల్' సినిమా తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్ విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రారంభంనుంచి విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. 'రాసేసుంటది.. మొత్తం రాసేసుంటది స్క్రిప్ట్..' అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ, ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంది. 36 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోకూడదా ? అదేమైనా నేరమా ? జైళ్లో పెడతారా ? అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో తెలంగాణ అబ్బాయి అర్జున్ కుమార్‌గా విశ్వక్ సేన్, ఆంధ్రా అమ్మాయి మాధవిగా రుక్సార్ దిల్లాన్ కనిపించనున్నారు. 33 ఏళ్లు వచ్చిన అర్జున్‌కు ఎందుకు పెళ్లి కాలేదు ? సంబంధం ఫిక్స్ అయిన తర్వాత మాధవి పెళ్లి వద్దని ఎందుకు చెప్పింది ? వంటి అంశాలతో సినిమా చూసి తెలుసుకునేలా ఆసక్తిగా ట్రైలర్ ఉంది. ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. -
పెళ్లికి రెడీ అయిన హీరో విశ్వక్ సేన్.. ముహూర్తం ఫిక్స్
Ashoka Vanam Lo Arjuna Kalyanam All Set To Release: హీరో విశ్వక్ సేన్.. ప్రస్తుతం టాలీవుడ్లో మాంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు. 'వెళ్లిపోమాకే' సినిమాతో పరిచయం అయిన ఈ యంగ్ హీరో ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్, పాగల్ వంటి విభిన్న చిత్రాల్లో నటించి మెప్పించాడు. తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పెళ్లి కోసం ఆరాటపడే మిడిల్ క్లాస్ యువకుడిలా కనిపించి మంచి ఆసక్తి రేపిన విశ్వక్ సేన్ ఫైనల్‌గా తన పెళ్లి తేదీతో కూడిన పోస్టర్‌తో సినిమా రిలీజ్‌ను ప్రకటించాడు. మార్చి4న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక విశ్వక్సేన్కు జోడీగా రుక్సార్ థిల్లోన్ అలరించనుంది. View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
గోదావరి అల్లుడు వచ్చేశాడు.. 'అశోకవనంలో అర్జున కల్యాణం' టీజర్ రిలీజ్
Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Teaser Out: టాలీవుడ్‌కి లవర్ బాయ్‌గా పరిచమయమై మాస్ హీరోగా అభిమానులను సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్, పాగల్ వంటి చిత్రాలతో అలరించిన విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ సినిమాలో వడ్డీ వ్యాపారిగా అలరించనున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదటి నుంచి విభిన్నంగా చేస్తుంది చిత్రబృందం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, సాంగ్ ఆకట్టుకున్నాయి. 'ఓ ఆడపిల్లా' పాటతో విశ్వక్ సేన్ సరసన నటించే హీరోయిన్ రుక్సార్ దిల్లాన్ అని రివీల్ చేశారు మేకర్స్. తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'ఇంటర్‌క్యాస్ట్ అరేంజ్డ్ మ్యారెజ్ సినిమాల్లో అయినా అయితదారా.. ఇదే ఫస్టా' అంటూ ప్రారంభమైన సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సంబాషణలు, సీన్లు, పెళ్లి కోసం విశ్వక్ సేన్ చేసే ప్రయత్నాలు అలరించాయి. ఈ సినిమాతో సరైనా సమయంలో పెళ్లి చేసుకోకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో హ్యూమరస్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ చివరిలో విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. మార్చి 4న ప్రేక్షకులముందుకు రానున్నాడు ఈ గోదావరి అల్లుడు. -
తన రిలేషన్షిప్ గురించి చెప్పిన విశ్వక్ సేన్ బ్యూటీ
Rukshar Dhillon Said About Her Relationship In Past: 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రుక్సార్ దిల్లాన్. వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది ఈ ఏబీసీడీ బ్యూటీ. ప్రస్తుతం యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాలో కథానాయికగా చేస్తోంది. ఈ చిత్రం ముప్పై ఏళ్లు వచ్చిన ఓ వడ్డీ వ్యాపారీ పెళ్లి కోసం పడే పాట్ల నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది రుక్సార్. తాను గతంలో రిలేషన్షిప్లో ఉన్నానని పేర్కొంది. అలాగే తనకు కాబోయేవాడు నిజాయితీగా, నిబద్ధతో ఉంటడాలని కోరుకుంటోందట ఈ అమ్మడు. (చదవండి: విశ్వక్ సేన్‌కు పిల్ల దొరికేసింది.. జనవరి 19న) ఆమె పెళ్లి చేసుకుని జీవితాంతం గడిపే వ్యక్తి గురించి ముందు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటోంది రుక్సార్. పూర్తిగా అర్థం చేసుకున్నాకే వివాహం చేసుకుంటానని చెప్తున్న రుక్సార్‌కు ప్రేమ వివాహంపై నమ్మకం ఉందని తెలిపింది. 2017లో ఆకతాయి సినిమాతో టాలీవుడ్లో తెరంగ్రేటం చేసింది. లండన్‌లో పుట్టిన ఈ సుందరి ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. బెంగళూర్‌లో నివాసం ఉంటోన్న ఈ భామ 2020లో 'భాంగ్రా పా లే' అనే హిందీ సినిమాతో బీటౌన్‌కు కూడా పరిచయమైంది. (చదవండి:ఒక్క సంబంధం చూడండి, లేదంటే ఎలా పడేయాలో చెప్పండి) -
అశోకవనంలో అర్జున కళ్యాణం హీరోయిన్ రుక్సర్ దిల్లాన్ క్యూట్ ఫొటోలు
-
విశ్వక్ సేన్‌కు పిల్ల దొరికేసింది.. జనవరి 19న
Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Special Glimps Out: 'వెళ్లిపోమాకే' సినిమాతో లవర్ బాయ్‌గా పరిచయమైన విశ్వక్ సేన్ తర్వాత మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్, పాగల్ వంటి విభిన్న చిత్రాల్లో నటించి మెప్పు పొందాడు. తాజాగా విశ్వక్ మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్ కుమార్‌గా అలరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కథకు తగినట్లుగా విభిన్నంగా ప్రమోట్ చేస్తూ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇదీవరకు పెళ్లి కోసం చింత మ్యారేజ్ బ్యూరోను సంప్రదించినట్లుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాగే ఇటీవల 'ఇంకా రెండు రోజులే ఉంది. పిల్లని వెతికి పెట్టండి' అంటూ ఓ వీడియో ట్వీట్ చేశాడు విశ్వక్ సేన్. ఆ రెండు రోజులు కాస్త గడిచి సంక్రాంతి రావడంతో పండుగ సందర్భంగా విశ్వక్ సేన్‌కు కాబోయే భార్యను పరిచయం చేశారు. పిల్ల దొరికేసింది అంటూ ఓ వీడియో ద్వారా హీరోయిన్ ఎవరో చూపించారు మేకర్స్. ఇందులో పసుపులేటి మాధవిగా రుక్సార్ దిల్లాన్ అలరించనుంది. ఈ హీరోయిన్ ఇంతకుముందు కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ సినిమాల్లో నటించింది. వీడియోలో సింగర్ రామ్ మిరియాల పాడిన 'ఓ ఆడపిల్ల.. నువ్ అర్థం కావా' సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లిరిక్ సాంగ్ అయిన ఈ పాటను జనవరి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదీ చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా బారిన పడ్డ విశ్వక్ సేన్ -
‘ఏబీసీడీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్‌ప్యూజ్డ్ దేశీ) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : అల్లు శిరీష్, రుక్సర్ ధిల్లాన్, భరత్, రాజా, నాగబాబు సంగీతం : జుడా సాండీ దర్శకత్వం : సంజీవ్ రెడ్డి నిర్మాత : మథురా శ్రీధర్, యష్ రంగినేని మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ హీరోగా ప్రూవ్ చేసకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉన్నాడు. తెలుగులో నాలుగు సినిమాలు హీరోగా నటించినా స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చే హిట్ ఒక్కటి కూడా పడలేదు. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన ఏబీసీడీ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశాడు. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో ఈ మంచి సక్సెస్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయిన అల్లు శిరీష్ సూపర్ హిట్ సాధించాడా..? కథ : అరవింద్ ప్రసాద్ (అల్లు శిరీష్) అలియాస్ అవి.. న్యూయార్క్‌లో సెటిల్ అయిన ఇండియన్ మిలియనీర్ విద్యా ప్రసాద్ (నాగబాబు ) కొడుకు. తన అత్త కొడుకు బాషా అలియాస్ బాలషణ్ముగం (భరత్)తో కలిసి సరదాగా లైఫ్ గడిపేస్తుంటాడు. నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాంటి బాధ్యత లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. తన కొడుక్కి డబ్బు విలువ, జీవితం విలువ తెలియ జేయాలనుకున్న విద్యా ప్రసాద్.. వెకేషన్ పేరుతో అవి, బాషాలను ఇండియాకు పంపిస్తాడు. అలా ఇండియాకు వచ్చిన వారిద్దరిని నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని చెప్తాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఉండిపోయిన అవికి లోకల్ పొలిటీషన్ భార్గవ్‌తో గొడవ అవుతుంది. అవి, భార్గవ్‌ల మధ్య గొడవకు కారణం ఏంటి..? అమెరికాలో పెరిగిన అవి, బాషాలు ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? ఓ సాధారణ యువకుడిగా ఇండియాలో అడుగుపెట్టిన అవి.. సెలబ్రిటీగా, యూత్ ఐకాన్‌గా ఎలా మారాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : అల్లు శిరీష్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మంచి పరిణతి చూపించాడు. ఎలాంటి రెస్పాన్సిబులిటీ లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేసే కుర్రాడి పాత్రలో సరిగ్గా సరిపోయాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లోనూ మంచి నటన కనబరిచాడు. బాలనటుడిగా సుపరిచితుడైన భరత్ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యాడు. తన పరిధి మేరకు బాగానే ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రుక్సర్ ధిల్లాన్ నటనకు పెద్దగా అవకాశం లేని పాత్రలో కనిపించారు. లుక్స్ పరంగా మాత్రం మంచి మార్కులు సాధించారు. హీరో తండ్రి పాత్రలో నాగబాబు ఒదిగిపోయాడు. విలన్‌గా రాజా పరవాలేదనిపించాడు. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, శుభలేక సుధాకర్, కోట శ్రీనివాసరావు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొద్ది పాటు మార్పులతో రీమేక్ చేశాడు దర్శకుడు సంజీవ్ రెడ్డి. కథ పరంగా బాగానే ఉన్నా కథనంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. బలమైన సంఘర్షణ లేకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇండియా వచ్చిన తరువాత హీరో ఇబ్బంది పడే సన్నివేశాల్లో మరింత కామెడీ, ఎమోషన్స్ చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు సాదా సీదాగా నడిపించేశాడు. కథలోనూ బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవటం కూడా మైనస్ అయ్యింది. జుడా సాండీ అందించిన సంగీతం బాగుంది. ‘మెల్ల మెల్ల మెల్ల మెల్లగా’ పాటతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి సినిమాకు మరో ప్లస్ పాయింట్. అమెరికాలో తెరకెక్కించిన సీన్స్‌తో పాటు హైదరాబాద్‌లోని స్టమ్లో తెరకెక్కించిన సన్నివేశాలను కూడా కలర్ఫుల్గా కెమెరాలో బంధించారు సినిమాటోగ్రాఫర్ రామ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ : కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటం బలమైన సన్నివేశాలు లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఏబీసీడీలకు వేళాయె
అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా తెరకెక్కిన చిత్రం‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి’ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంతో సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఎన్నారై పాత్రలో అల్లు శిరీష్, అతని స్నేహితుడి భరత్ నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల విడుదలై టీజర్‌కు అనూహ్య స్సందన వచ్చింది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ అందుకున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ప్రెసిడెంట్‌గారి మనవరాలు
లండన్‌లో పుట్టి గోవాలో పెరిగి బెంగళూరులో చదువు పూర్తి చేసింది రుక్షర్ ధిల్లాన్. కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైన రుక్సర్ ఆమధ్య ‘కృష్ణార్జున యుద్ధం’తో ‘ప్రెసిడెంట్‌గారి మనవరాలు’గా తెలుగు తెరపై మెరిసింది. అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న రుక్షర్ గురించి కొన్ని ముచ్చట్లు... డిగ్రీ తరువాతే... గోవాలో నైంత్ గ్రేడ్ పూర్తయిన తరువాత తదుపరి చదువుల కోసం బెంగళూరు వచ్చింది రుక్షర్. అక్కడ బిషప్ కాటన్ హైస్కూల్లో చదువుకుంది. ఆ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. బెంగళూరులో వ్యాపారప్రకటనల్లో నటిస్తున్న రోజుల్లోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే... ‘‘డిగ్రీ తరువాతే సినిమాలు’’ అని డిసైడ్ కావడంతో సినిమాల జోలికి వెళ్లలేదు. తొలి సినిమా ‘రన్ ఆంటోనీ’ సినిమాతో వెండితెరకు పరిచమైంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రాజ్‌కుమార్ మనవడు వినయ్ రాజ్‌కుమార్ సరసన నటించింది. ఈ సినిమాలో సూసైడ్ బాంబర్‌గా నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ‘కృష్టార్జున యుద్ధం’ సినిమాలో రియా పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. షో టైమ్ ‘షో టైమ్’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఎందుకంటే ఆ సినిమాను డైరెక్టర్ చేయబోయే యస్.యస్.కాంచీ బాహుబలి డైరెక్టర్ రాజమౌళికి కజిన్ అనేదే ఆమె ఉత్సాహానికి కారణం. ‘సెలెక్ట్ అవుతానా!’ అనే చిన్న బెరుకు ఉండేదట. మొత్తానికైతే ఆడిషన్లో సెలెకై్ట ఆ సినిమాలో భాగమైపోయింది. చారిత్రక పాత్రలు... విభిన్నమైన పాత్రలు చేయడం అంటే తనకు ఇష్టం అని చెబుతుంది రుక్షర్. సంజయ్ లీలా బన్సాలీ సినిమాల్లో కనిపించే చారిత్రక పాత్రలు వేయడమంటే తనకు ఇష్టమట. ‘భాంగ్రా పా లె’ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన రుక్షర్ ‘ఫలానా ఇండస్ట్రీలో మాత్రమే పనిచేయాలని ఉంది’లాంటి పట్టింపులు లేవు అని చెబుతుంది. ‘ప్రాంతీయ చిత్రాలు కూడా ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ అవుతున్నాయి’ అంటూ ప్రాంతీయ చిత్రాల గొప్పతనాన్ని చెప్పకనే చెప్పింది రుక్షర్. -
అప్పుడే ఎక్కువ సినిమాలు వస్తాయి
‘‘కాన్సెప్ట్ చిత్రాలు తీసే ‘మధుర’ శ్రీధర్‌గారికి సినిమాలంటే చాలా ప్రేమ. సినిమాలను ప్రేమించే నిర్మాతల చిత్రాలు బాగా ఆడితే మరిన్ని వస్తాయి. కథ చెప్పే విధానం, సినిమాలు చూసే విధానం మారాలంటే శ్రీధర్‌లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ జంటగా భరత్ ముఖ్య పాత్రలో సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ అన్నది ఉపశీర్షిక. డి. సురేశ్‌బాబు సమర్పణలో ‘మధుర’ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్. రంగినేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 17న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను త్రివికమ్ర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘జల్సా’ టైమ్‌లో శిరీష్‌ను చిన్నకుర్రాడిగా చూశాను. సినిమాను అర్థం చేసుకుని ప్రేమించే వ్యక్తి తను. సినిమాను ప్రేమించే వాళ్లు ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. మా చిత్రం గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కువగా మాట్లాడతాను. శ్రీధర్, సురేశ్‌బాబు, యష్గార్లకు థ్యాంక్స్. నన్ను బాగా ప్రెజెంట్ చేసిన దర్శకుడు సంజీవ్‌గారికి, మంచి మ్యూజిక్ అందించిన జుడో సాండీకి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘సీరియస్ కాన్సెప్ట్ సినిమాలు నిర్మించే నేను ఓ ఫన్ మూవీ తీయాలని చాలా రోజులుగా అనుకున్నాను. ఆ క్రమంలో చేసిన సినిమాయే ‘ఏబీసీడీ’. శిరీష్, భరత్ ఫెంటాస్టిక్‌గా నటించారు’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్. ‘‘ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే కారణం శిరీష్‌గారే. ఆయన ఎప్పటికీ నా హీరోగానే ఉంటారు. ఈ జర్నీలో ముందు నుంచి నాతో భాగమైన ‘మధుర’ శ్రీధర్‌గారికి థాంక్స్’’ అన్నారు సంజీవ్ రెడ్డి. -
‘ ఏబీసీడీ ’మూవీ ట్రైలర్ లాంచ్
-
‘రిచ్‌గానే పుట్టాను.. రిచ్‌గానే పెరిగాను’
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ సరైన హిట్ కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. చివరగా.. ‘ఒక్క క్షణం’ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈసారి పక్క భాషలో హిట్ అయిన ఓ చిత్రం కన్నేశాడీ ఈ హీరో. మళయాలంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని ఏబీసీడీ(అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం పోస్టర్స్, సాంగ్స్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మాష్టర్ భరత్ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్‌బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించగా.. జుడా శాండీ సంగీతాన్ని సమకూర్చారు.