sakshi bhavita
-
మంచి ర్యాంక్‌కు మాక్ టెస్టులు
సాక్షి మీడియా గ్రూప్, నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్(తెలంగాణ)/ ఈఏపీసెట్(ఆంధ్రప్రదేశ్), నీట్ మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నీట్’.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్/ఈఏపీసెట్ కోసం లక్షల మంది సన్నద్ధమవుతున్నారు. వీరికి చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన ఎంసెట్/ఈఏపీసెట్, నీట్ మాక్ టెస్టులను నిర్వహించనున్నారు. పరీక్షకు ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్ టెస్ట్ రాయడం ద్వారా.. విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకొని, మరింత మెరుగుపడవచ్చు. అలాగే ‘సాక్షి’ మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపిన టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్‌లకు టెక్నాలజీ పార్ట్నర్గా‘MY RANK’ వారు వ్యవహరిస్తున్నారు. ►సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్) /ఈఏపీసెట్ పరీక్ష 30.06.2022. ►ఎంసెట్ / ఈఏపీసెట్ అగ్రికల్చర్ పరీక్ష 01.07.2022 తేదీల్లో ఆన్లైన్లో జరుగుతుంది. ►సాక్షి మాక్ నీట్ పరీక్ష 03.07.2022 ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ►ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250. అభ్యర్థులు http://www.arenaone.in/mock ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్ మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు వస్తుంది. పరీక్ష కేంద్రం: విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దేశ్ముఖి గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.06.2022 వివరాలకు సంప్రదించాల్సిన నంబర్: 9666013544 -
ఆ మూడు స్కిల్స్‌తోనే.. రూ.2 కోట్ల జీతం
ఐ ఫోన్ల తయారీ దిగ్గజ సంస్థ యాపిల్‌లో చిన్నపాటి కొలువు వచ్చినా చాలు.. కెరీర్ నల్లేరుపై నడకే అనే భావన. ఈ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకోవాలనేది ప్రతిభావంతులైన ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యం. అయితే ఏకంగా సంస్థ ప్రధాన కార్యాలయం (కాలిఫోర్నియా)లో ఉద్యోగం సొంతం చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటి దుర్గా లక్ష్మీనారాయణ స్వామి (దిలీప్ ఇంటి). ఇటీవలే అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసి.. అక్కడ యాపిల్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో నెగ్గి సత్తా చాటిన దిలీప్ మాటల్లోనే.. వర్జీనియా టెక్ యూనివర్సిటీలో 2015లో రెండేళ్ల ఎంఎస్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాను. ఏటా ఇన్స్టిట్యూట్లో యాపిల్, గూగుల్ వంటి సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తాయి. అయితే నన్ను క్యాంపస్ ఇంటర్వూ్య డ్రైవ్‌కు పిలవడానికి ప్రధాన కారణం నా లింక్డ్ఇన్ ప్రొఫైల్. నేను అప్పటికే పూర్తిచేసిన ప్రాజెక్ట్‌లు, పని అనుభవం, అకడమిక్ రికార్డ్లను లింక్డ్ఇన్లో చూసిన యాపిల్ సంస్థ ప్రతినిధులు.. క్యాంపస్ ఇంటర్వూ్యకు హాజరు కావాలని ఈ–మెయిల్ పంపారు. రెండు రౌండ్లలో ఇంటర్వ్యూ వర్క్ ఎక్స్పీరియన్స్, వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా ఇంటర్వూ్యకు సిద్ధమయ్యాను. ఫండమెంటల్స్‌పై పట్టుండటంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వూ్యకు హాజరయ్యాను. రెండు రౌండ్లలో ఇంటర్వూ్య జరిగింది. తొలి రౌండ్లో టెలిఫోనిక్ ఇంటర్వూ్యలో సంతృప్తికరంగా సమాధానాలు చెప్పడంతో.. యాపిల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వూ్యకు (ఆన్–సైట్) హాజరు కావాలని చెప్పారు. రెండు ఇంటర్వూ్యలు 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో జరిగాయి. ఇంటర్వూ్యలో ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలతోపాటు.. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్‌పై పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూలో వేటిపై ప్రశ్నలు/అనుబంధ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందనే దానిపై ముందే కసరత్తు చేసి ఉండటంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగాను. 2.85 లక్షల డాలర్ల (మన కరెన్సీలో రూ. రెండు కోట్ల) వార్షిక వేతనంతో జాబ్ సొంతమైంది. ఆ మూడు నైపుణ్యాలు యాపిల్ లేదా ఇతర ఏ సంస్థలోనైనా ఇంటర్వూ్య సమయంలో అభ్యర్థుల నుంచి మూడు లక్షణాలు గమనిస్తారు. అవి.. కోర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ స్కిల్స్. కోర్ నాలెడ్జ్ విషయంలో ఫండమెంటల్స్‌లో ఏ స్థాయిలో పట్టుందో పరిశీలిస్తారు. అంతేకాకుండా వాటిని అన్వయించే విషయంలో ఆలోచన సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తారు. అన్నీ బాగున్నాయనుకుంటేనే ఆఫర్ ఇస్తారు. ఎంఎస్‌లో ప్రవేశం ఇలా.. వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరడమే అనూహ్యంగా జరిగింది. వాస్తవానికి బిట్స్–పిలానీలో బీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) పూర్తయ్యాక హైదరాబాద్‌లోనే ఇమాజినేషన్ టెక్నాలజీస్ సంస్థలో వైర్లెస్ పీహెచ్వై ఫిర్మ్వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు పనిచేశాను. ఆ సమయంలోనే ఎంబీఏ చదవాలనే ఆసక్తితో క్యాట్‌కు హాజరై 99.3 పర్సంటైల్ కూడా సొంతం చేసుకున్నాను. వాస్తవానికి ఆ పర్సంటైల్‌కు ఏదో ఒక ఐఐఎంలో సీటు వచ్చేదే. కానీ అప్పటికే.. వైర్లెస్ కమ్యూనికేషన్స్‌పై ఆసక్తి పెరగడం, అందులో నైపుణ్యాలు సైతం లభించడంతో.. ఎలక్ట్రానిక్స్‌లోనే ఉన్నత విద్యనభ్యసించాలనే లక్ష్యంతో ఎంఎస్‌పై దృష్టిసారించాను. 2015లో వర్జీనియా టెక్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోవడంతో ప్రవేశం లభించింది. ఇప్పుడు యాపిల్ సంస్థలో రూ. 2కోట్ల వేతనంతో ఉద్యోగం సొంతమైంది. ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్ పరంగా ఉన్నత హోదాలు లభించాలంటే ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంఎస్ చేస్తున్న సమయంలోనే రెండు సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేశాను. అదే విధంగా గత డిసెంబర్ నుంచి వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎ.ఎ. లూయిస్ బీక్స్ వద్ద గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాను. మనదేశంలో ఉన్నప్పుడు కూడా ఐఐటీ–ఢిల్లీ, బార్క్ (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)– ముంబైలలో రీసెర్చ్ ఇంటర్న్‌గా పనిచేశాను. ఎంబీఏ చదవడమే లక్ష్యం ఈ నెల 22 నుంచి విధులకు హాజరుకావాలని చెప్పారు. కానీ, జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పలేదు. అయితే ఎలాంటి విధులనైనా నిర్వర్తించగలననే నమ్మకం ఉంది. ప్రస్తుతం యాపిల్ సంస్థలో ఉద్యోగంలో చేరినా.. ఎంబీఏ చదవడమే నా భవిష్యత్తు లక్ష్యం. ఇంజనీరింగ్ నైపుణ్యాలకు.. నిర్వహణ నైపుణ్యాలు కలిస్తే సాంకేతిక రంగంలో ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ఆస్కారం ఉంటుంది. విజయాలు ఎంహెచ్ఆర్డీ మెరిట్ స్కాలర్షిప్– 2013 ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మెరిట్ స్కాలర్షిప్– 2012 ఆదిత్య బిర్లా మెరిట్ స్కాలర్షిప్, బిట్స్ పిలానీ– 2009–2013 అకడమిక్ రికార్డ్ పదో తరగతి: 556 మార్కులు ఇంటర్మీడియెట్: 980 మార్కులు బీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్) – 9.41/10 జీపీఏ ఎంఎస్ (వర్జీనియా టెక్ యూనివర్సిటీ) – 3.9/4 జీపీఏ కుటుంబ నేపథ్యం తండ్రి: ఇంటి సుబ్బారావు (పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి) తల్లి: సూర్య కుమారి (గృహిణి) స్వస్థలం: వీకే రాయపురం (సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా) -
ఇక నిరంతర నియామకాలు
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ * కరీంనగర్లో ‘సాక్షి’ నిర్వహించిన గ్రూప్స్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి * సదస్సుకు అపూర్వ స్పందన * భారీగా తరలివచ్చిన అభ్యర్థులు * పైరవీలకు తావు లేదన్న ఈటల * అభ్యర్థుల సందేహాలకు నిపుణుల సమాధానాలు కరీంనగర్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ భవిత ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతిలో ‘గ్రూప్స్’ పరీక్షలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో మాదిరిగా డబ్బుల్లేవనో, నిషేధముందనో నియామకాల ప్రక్రియను నిలిపివేయబోమని చెప్పారు. హైదరాబాద్‌లో మాదిరిగానే కరీంనగర్లో కూడా సదస్సుకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లావాసులతోపాటు ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు వేలాదిగా తరలివచ్చారు. దాంతో సదస్సు కిక్కిరిసిపోయింది. లోపల చోటు చాలకపోవడంతో కళాభారతి ఆవరణలో లైవ్ ప్రొజెక్టర్ ద్వారా ఎంతోమంది ఉద్యోగార్థులు కార్యక్రమాన్ని వీక్షించారు. వారిని ఉనుద్దేశించి ఈటల మాట్లాడుతూ... 1969లో తెలంగాణ ఉద్యమం ‘మన రాష్ట్రం, మన ఉద్యోగాలు’ అనే నినాదంతోనే మొదలైందని గుర్తు చేశారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను మేం తీసుకున్నాం. విద్యార్థుల్లేని చోట స్కూళ్లు మూతపడ్డాయి. అవి తప్ప ఇతర ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ ఖాళీల భర్తీని చేపడుతూనే ఉంటాం’’ అని వివరించారు. ఉద్యోగార్థులు సంకల్పాన్ని సడలించకుంటే విజయం తథ్యమని ఉద్బోధించారు. ఉద్యోగ నియామకాలకు ప్రతిభ ఒక్కటే కొలమానమని ఈటల స్పష్టం చేశారు. పైరవీలకు, పైసలకు ఎక్కడా తావు లేదన్నారు. రూ.10 లక్షలు, రూ.20 లక్షలు ఇస్తేనే ఉద్యోగం వస్తుందనే ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మొద్దన్నారు. అభ్యర్థులు మోసపోవద్దని, దళారులను ఆశ్రయించొద్దని, ప్రతిభనే నమ్ముకోవాలని హితవు పలికారు. అక్రమాలు చోటుచేసుకొన్నట్టు తేలితే అవసరమైతే ఆ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడానికి కూడా వెనకాడబోమన్నారు. అభ్యర్థుల కోసం ‘సాక్షి దినపత్రిక’ ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ గ్రూప్స్తోనే సరిపెట్టకుండా జిల్లాల అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పోస్టులను సాధించాలని ఆకాంక్షించారు. సివిల్స్‌పై కూడా ‘సాక్షి’ అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. ‘సాక్షి’ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సందేహాలకు నిపుణుల సమాధానాలు గ్రూప్స్ పరీక్షల విధానం, సిలబస్, పరీక్షకు సన్నాహకాలకు సంబంధించి ఉద్యోగార్థులు తమ సందేహాలను నిపుణుల ముందుంచారు. పోటీ పరీక్షల్లో తెలంగాణ ఉద్యమ చారిత్రక నేపథ్యం, భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు కీలకంగా మారడంతో ఎక్కువగా వాటి గురించి ప్రశ్నించారు. సిలబస్ కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి, జాగ్రఫీ నిపుణుడు, సివిల్స్ సీనియర్ ఫాకల్టీ గురిజాల శ్రీనివాసరావు, చరిత్ర నిపుణుడు లెంకల రామకృష్ణారెడ్డి, ఎకానమీ నిపుణుడు డాక్టర్ కె.ఆర్ రమణ, అర్థమెటిక్, రీజనింగ్ నిపుణుడు మాటూరి లింగమూర్తి, జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణుడు సురుకోంటి మహిపాల్‌రెడ్డి తదితరులు వారి సందేహాలను నివృత్తి చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యాలు పెంచుకోవాలి పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు అదనపు నైపుణ్యాలు అవసరం. తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం పెరగనుంది. రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థితిగతులు, ఉద్యమం, తెలంగాణ సాధించుకున్న తర్వాతి పరిస్థితులకూ ప్రాధాన్యముంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రనూ లోతుగా అధ్యయనం చేయాలి. - కృష్ణారెడ్డి, సిలబస్ కమిటీ సభ్యుడు పక్కా ప్రణాళికతో ముందుకు గ్రూప్స్ పరీక్షలకు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావాలి. దేశ, తెలంగాణ చరిత్రలపై పట్టు సాధించాలి. సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. మాదిరి, గత ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా సాధన చేయాలి. - రామకృష్ణారెడ్డి, చరిత్ర నిపుణుడు శాస్త్రీయ కోణంలో చదవాలి అర్ధశాస్త్రానికి శాస్త్రీయ కోణంలో సన్నద్ధత కావాలి. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాదన్నది అపోహే. నిపుణుల సూచనలతో సరిగా చదివితే మార్కులు సాధించడం సులభమే. - కేఆర్ రమణ, ఆర్థిక శాస్త్ర నిపుణుడు అవగాహన అత్యవసరం సిలబస్‌లో తెలంగాణ అంశాలను చేర్చడంతో అభ్యర్థుల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించేందుకు ‘సాక్షి’ తలపెట్టిన ఈ సదస్సు ఎంతో దోహదపడుతుంది. అభ్యర్థులు ఇంటర్వ్యూకూ ప్రాధాన్యమివ్వాలి. బట్టీ పట్టకుండా అంశాలవారీ అవగాహనతో ముందుకె ళ్లాలి. - ఎస్.మహిపాల్‌రెడ్డి, జీకే, నిపుణుడు భిన్నంగా ఆలోచించాలి ఏ పోటీ పరీక్షకైనా అర్థమెటిక్, రీజినింగ్ కీలక అంశం. గణితశాస్త్రానికి సంబంధం లేని అభ్యర్థులకు ఆందోళన అనవసరం. గత ప్రశ్నపత్రాల సాధన ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. - ఎంఎల్ మూర్తి, రీజనింగ్ నిపుణుడు సరైన దృక్పథమే విజయానికి నాంది గ్రామీణ అభ్యర్థుల్లో తెలంగాణ నుంచి పోటీ పెరుగుతుండటం మంచి పరిణామం. సిలబస్‌లో మార్పులున్నా అయోమయపడకుండా నిర్దిష్ట ప్రణాళికతో చదవాలి. రకరకాల పుస్తకాల నుంచి సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి తప్ప ఒకే పుస్తకంపై ఆధారపడొద్దు.పథకాల వివరాలన్నీ తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో సవివరంగా ఉంటాయి. - గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ -
సాక్షి-భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్
-
నేడూ ఎడ్యుకేషన్ ఫెయిర్
-
జాబ్ రిమైండర్స్
ఓఎన్జీసీ వివిధ విభాగాల్లో 865 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2014 వెబ్సైట్: www.ongcindia.com ........................................................ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2014 వెబ్సైట్: www.nhb.org.in ........................................................ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో 1,194 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014 వెబ్సైట్: http://eapplynew.com/dmrc2014 ........................................................ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో 2,197 ఎస్ఐ పోస్టులు, సీఐఎస్ఎఫ్లో 695 ఏఎస్ఐ పోస్టులు పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2014 పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2014 వెబ్సైట్: http://ssc.nic.in ........................................................ కోల్ ఇండియా లిమిటెడ్ 339 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 14, 2014 వెబ్సైట్: www.coalindia.in -
ఎడ్యుకేషన్ న్యూస్
పాత పద్ధతిలోనే ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ ఇంజినీరింగ్‌లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో ప్రవేశాలను పాత విధానంలోనే చే పట్టాలని ఇంజినీరింగ్ ప్రవేశాల ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. ఈ క్రమంలో తొలుత జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అప్పటికీ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు మిగిలిపోతే చివరగా ఇంటర్మీడియెట్ మార్కులతో ప్రవేశాలు చేపడతారు. గతేడాది అనుసరించిన విధంగా 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో భర్తీ చేస్తారు. గతంలో ఎన్ఆర్ఐ కోటా 5 శాతం మాత్రమే ఉండేది. హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని 15 శాతానికి పెంచుతున్నారు. ఈసారి 15 శాతం ఎన్ఆర్ఐ కోటాలో నేరుగా ఎన్ఆర్ఐ పిల్లలనే చేర్చుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సీట్లు మిగిలిపోతే అవి మేనేజ్మెంట్ కోటాలోకి వెళతాయి. మిగిలిన 15 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లను జేఈఈ మెయిన్, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం అంటూ ఏమీ ఉండదు. అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. ఇక యూనివర్సిటీలకే ఏఐసీటీఈ అధికారాలు టెక్నికల్ కాలేజీలకు ఇకపై యూనివర్సిటీలే అనుమతులిస్తాయి. కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం కూడా వర్సిటీలకే ఉంటుంది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా నిబంధనలు రూపొందించింది. ఏఐసీటీఈ కేవలం సలహా సంస్థ మాత్రమేనని, కాలేజీల పర్యవేక్షణ, అనుమతులిచ్చే అధికారాలు లేవన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో యూజీసీ తాజా నిర్ణయం తీసుకుంది. సాంకేతిక విద్యా కళాశాలల్లో బోధన, పరీక్షలు, పరిశోధనలు, ప్రమాణాల పెంపు కోసం కొత్త నిబంధనలు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా నిబంధనల మేరకు.. ఇంజినీరింగ్, ఎంసీఏ తదితర కోర్సులు నిర్వహించే సాంకేతిక విద్యా కాలేజీలు అనుమతుల రెన్యువల్ కోసం ఇకపై సంబంధిత విశ్వవిద్యాలయాల అనుమతి తీసుకోవాలి. కొత్త కాలేజీలు గుర్తింపు పొందాలంటే నాక్ అక్రెడిటేషన్ తప్పనిసరి. గుర్తింపు కోసం కొత్త కాలేజీలు దరఖాస్తు చేసుకునే ముందు ఆరు నెలల్లో నాక్ అక్రెడిటేషన్ తెచ్చుకుంటామని అండర్ టేకింగ్ ఇస్తేనే యూనివర్సిటీలు అనుమతినివ్వాలి. ఆరేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి నడుస్తున్న కాలేజీలు ఇప్పటి నుంచి ఆరునెలల్లోగా నాక్ అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే నాక్ అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలు, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు కలిగిన కోర్సుల విషయంలో ఇతర అన్ని నిబంధనలు పాటిస్తుంటే.. వాటికి శాశ్వత గుర్తింపునిచ్చే అంశాన్ని యూనివర్సిటీలు పరిశీలిస్తాయి. యూనివర్సిటీలు తాము గుర్తింపు ఇచ్చిన కాలేజీల సమగ్ర సమాచారాన్ని, నిబంధనలు పాటిస్తున్న తీరును పేర్కొంటూ ఏటా యూజీసీకి నివేదిక అందజేయాలి. కాలేజీలకు గుర్తింపు మంజూరు చేసే విషయంలో యూనివర్సిటీలు నిబంధనలను అతిక్రమిస్తే వాటికి గ్రాంట్స్ నిలిపివేయడంతోపాటు యూజీసీ గుర్తింపు రద్దవుతుంది. ఐఐఎం నుంచి డిగ్రీ పట్టా! ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఉత్తీర్ణులు ఇక డిగ్రీ పట్టా అందుకునే అవకాశం త్వరలోనే రానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అంశంపై ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఐఐఎం-ఇండోర్ డెరైక్టర్ రిషికేశ కృష్ణన్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే ఐఐఎం ఉత్తీర్ణులకు డిగ్రీ పట్టాను అందజేస్తారు. ప్రస్తుతం ఐఐఎంలు కేవలం డిప్లొమా/సర్టిఫికెట్లను మాత్రమే అందజేస్తున్నాయి. ఎందుకంటే వీటిని ఏర్పాటు చేసిన చట్టం మేరకు ఐఐఎంలు యూనివర్సిటీ కేటగిరీలోకి రాకపోవటమే. ప్రస్తుతం ఐఐఎంలు అందజేస్తున్న పీజీడీఎం సర్టిఫికెట్‌కు విదేశాల్లో, కొన్ని ఇన్స్టిట్యూట్లలో గుర్తింపు ఉండకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పీహెచ్డీ సమయంలో కూడా కొన్ని ఇన్స్టిట్యూట్లు పీజీడీఎంను అర్హతగా గుర్తించడం లేదు. ఆన్లైన్ కోర్సులు ః 2.5 లక్షల మంది భారతీయుల రిజిస్ట్రేషన్ మసాచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీలు ఆన్లైన్ కోర్సుల నిర్వహణ కోసం ప్రారంభించిన మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు (MOOC) కోసం ఎడ్ఎక్స్ (ed-X) కేంద్రంగా 2.5 లక్షల మంది భారతీయులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆన్లైన్ కోర్సుల్లో చేరే వారికి ఎడ్ఎక్స్ (ed-X) వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అమెరికన్ల తర్వాత ఈ కోర్సుల కోసం అత్యధికంగా దరఖాస్తు చేసుకుంది భారతీయులే. ఎంఐటీ, హార్వర్డ్ కోర్సులు చాలా వరకు స్వల్ప వ్యవధిలో పూర్తయ్యేవి. ఎంచుకున్న కోర్సును బట్టి 4 నుంచి 12 వారాల వరకు కోర్సు వ్యవధి ఉంటుంది. -
ఇగ్నో నుంచి ఎంబీఏ చేయటం ఎలా?
ఇగ్నో నుంచి ఎంబీఏ చేయటం ఎలా? -శ్రీధర్, నిర్మల్. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ద్వారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సును అందిస్తుంది. కోర్సు కాల వ్యవధి: రెండున్నరేళ్లు. అర్హత: 50 శాతం మార్కులతో (రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం) ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు మేనేజీరియల్/ సూపర్ వైజర్/సంబంధిత వృత్తిలో మూడేళ్ల అనుభవం. లేదా 50 శాతం మార్కులతోపాటు ప్రొఫెషనల్ డిగ్రీ (ఇంజినీరింగ్ /మెడిసిన్/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ)/కంపెనీ సెక్రటరీషిప్/లా. జాతీయ స్థాయిలో నిర్వహించే ఓపెన్‌మ్యాట్ పరీక్ష ద్వారా ఎంబీఏ కోర్సులో ప్రవేశం క ల్పిస్తారు. సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు ఫిబ్రవరి, ఆగస్టులలో ఓపెన్మ్యాట్ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎంబీఏలో ఆఫర్ చేస్తున్న స్పెషలైజేషన్స్: హెచ్ఆర్ఎం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్. వివరాలకు: www.ignou.ac.in పలంటాలజీ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి? -బాలు, నిజామాబాద్. పలంటాలజీ అంటే శిలాజ అధ్యయన శాస్త్రం. దీనిలో చరిత్ర పూర్వకాల అధ్యయనంతోపాటు శిలాజాల అధ్యయనం వంటి అంశాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. ఎలాంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా భూమి పరిణామం చెందింది అనే విషయాలను గురించి వివరిస్తుంది. బయాలజీ, జియాలజీ, ఆర్కియాలజీల అంశాలను వివరించే మల్టీడిసిప్లినరీ కోర్సుగా పలంటాలజీని పేర్కొంటారు. ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ -హైదరాబాద్ కోర్సు: అప్లయిడ్ జియాలజీ(పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా) అర్హత: 40 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ. ప్రవేశం: ఎంట్రన్స్ ఆధారంగా వివరాలకు: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం కోర్సు: ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ(టెక్-అప్లయిడ్ జియాలజీ, (పలంటాలజీ ఒక సబ్జెక్ట్‌గా) అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. ప్రవేశం: ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వివరాలకు: www.andhrauniversity.edu.in స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కోర్సుల వివరాలను తెలపండి? నరేందర్, సికింద్రాబాద్. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు బోధించేందుకు అవసరమైన..బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ విభాగంలో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్, విజువల్, ఆటిజం, ఇంపెయిర్మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కరిక్యులం రూపకల్పన, కళాశాలల గుర్తింపు, పర్యవేక్షణ బాధ్యతలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ కోర్సులను పూర్తి చేసిన వారు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా, వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. మన రాష్ట్రంలో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్; స్వీకార్ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్-సికింద్రాబాద్; ఆంధ్రా యూనివర్సిటీ -విశాఖపట్నం (www.andhrauniversity.edu.in); శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం- తిరుపతి (www.spmvv.ac.in); కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ - ఆంధ్ర మహిళా సభ-హైదరాబాద్ (www. andhramahilasabha.org.in) బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఠాగూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ తదితర ఇన్స్టిట్యూట్లలో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు: http://rehabcouncil.nic.in ఎంబీఏ (ఫార్మా మేనేజ్మెంట్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -ప్రవీణ్, కరీంనగర్. ఫార్మసీ రంగానికి నూతన ఔషధాలను కనిపెట్టడంతోపాటు వాటిని మార్కెటింగ్ చేయడం కూడా సవాలుగా మారింది. దాంతో పలు ఫార్మా కంపెనీలు మార్కెటింగ్ సంబంధిత విభాగాలను పర్యవేక్షించడం కోసం వృత్తి నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పలు విద్యాసంస్థలు ఫార్మసీ రంగంలో మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సు చేయడం ద్వారా ఫార్మాస్యుటికల్, కెమికల్, బయోటెక్నాలజీ సంస్థలు, పరిశోధన, విద్యాసంస్థల్లో మేనేజిరియల్ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆఫర్ చేస్తున్న సంస్థలు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పంజాబ్. వెబ్సైట్: www.niper.nic.in నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ముంబై వెబ్సైట్: www.nmims. edu -
రష్యాలో విలీనమైన క్రిమియా
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం ఆర్థిక స్వేచ్ఛలో గుజరాత్ అగ్రస్థానం ఆర్థికాంశాల స్వేచ్ఛకు సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాలో గుజరాత్‌కి అగ్రస్థానం దక్కింది. ఇదే విషయంలో అత్యంత వేగంగా స్కోరును మెరుగుపరుచుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ ఆర్థికవేత్తలు అశోక్ గులాటీ, బిబేక్ దేబ్రాయ్, లవీష్ భండారీ, జర్నలిస్ట్ స్వామినాథన్ అయ్యర్ రూపొందించిన ఈఎఫ్‌ఎస్‌ఐ-2013 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పాలనా యంత్రాంగం పరిమాణం, న్యాయ వ్యవస్థ, ప్రాపర్టీ హక్కులకు భద్రత, వ్యాపార, కార్మిక చట్టాల అమలు మొదలైన అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించారు. దీనిప్రకారం 2005లో అయిదో స్థానంలో ఉన్న గుజరాత్ ఆర్థిక స్వేచ్ఛతోపాటు వేగంగా పరిస్థితులను మెరుగు పరచుకునే విషయంలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. హైకోర్టులలో 25 శాతానికి పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య దేశంలోని అన్ని హైకోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను కేంద్రం 25 శాతానికి పెంచింది. పెండింగ్‌లో ఉన్న 40 లక్షల కేసులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖమంత్రి కపిల్ సిబాల్ మార్చి 19న హైకోర్టుల్లో భర్తీ చేయాల్సిన ఖాళీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపవలసిందిగా అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. 25 శాతానికి పెంచితే ప్రస్తుతం ఉన్న న్యాయ మూర్తుల సంఖ్య 906 నుంచి 1112కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 49 నుంచి 61కి చేరుతుంది. సామాజిక భద్రత పథకాలకు ఆధార్ తప్పనిసరికాదన్న సుప్రీం సామాజిక భద్రత పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్ కార్డు ఉండాలన్న నోటిఫికేషన్లను వెంటనే విరమించుకోవాలని సుప్రీంకోర్టు మార్చి 24న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యుత్, గ్యాస్, కుళాయి కనెక్షన్లు వంటి సేవలు పొందడానికి ఆధార్ కార్డు చట్టబద్ధం కాదని జస్టిస్ బీఎస్ చౌహాన్,జస్టిస్ జె. చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ సమాచారాన్ని సీబీఐతో పంచుకోవాలన్న గోవా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా స్టే విధించింది. అంతర్జాతీయం రష్యాలో విలీనమైన క్రిమియా రష్యాలో క్రిమియాను విలీనం చేసే ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చి 18న సంతకం చేశారు. దీంతో రష్యా సమాఖ్యలో క్రిమియా చేరినట్లయింది. 18వ శతాబ్దం నుంచి రష్యాలో భాగంగా ఉన్న క్రిమియాను 1954లో నాటి సోవియట్నేత నికితా కృశ్చేవ్ ఉక్రెయిన్‌కు బదిలీ చేశారు. నాటి నుంచి క్రిమియాలో మెజారిటీ ప్రజలుగా ఉన్న రష్యా జాతీయులు క్రిమియాను రష్యాలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని పుతిన్ తెలిపారు. క్రిమియాను రష్యా విలీనం చేసుకోవడంతో జీ-8 నుంచి రష్యాను సస్పెండ్ చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. దీంతో జూన్‌లో రష్యాలోని సోచిలో జరగాల్సిన జీ-8 సదస్సు నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లో టీబీ రోగులకు వైద్యం ఆగ్నేయాసియా దేశాల్లో ఏటా టీబీ వ్యాధి సోకే మూడు మిలియన్లలో మూడింట ఒకవంతు రోగులకు వైద్య సేవలు అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యుహెచ్ ఓ) మార్చి 20న విడుదల చేసిన నివేదిక తెలిపింది. టీబీ వ్యాధి మరణాలను సున్నా స్థాయికు తీసుకువచ్చేందుకు వైద్య సేవలు అందని మిలియన్ మందిని గుర్తించి, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా దేశాలను కోరింది. ప్రపంచంలో ప్రతీ సంవత్సరం తొమ్మిది మిలియన్ల మందికి ఈ వ్యాధి సోకుతుంది. ఇందులో మిలియన్ మందికి వ్యాధి తీవ్రంగా ఉంటోంది. తద్వారా వ్యాధి ఇతరులకు విస్తరిస్తుంది. పౌష్టికాహార లోపం, పేదరికం, పర్యావరణం, అధిక స్థాయిలో ప్రజలను తరలించడం వంటి పరిస్థితులు టీబీకి కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియాప్రాంతీయ డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ తెలిపారు. ఓకే పదానికి 175 ఏళ్లు ఇంగ్లిష్ భాషలో అత్యధికంగా వాడుకలో ఉన్న పదం ఓకే (ైఓ)కి 175 వసంతాలు పూర్తయ్యాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ గల నాటి పత్రిక ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్‌లో ఓకే పదం తొలిసారిగా 1839 మార్చి 23న ప్రచురితమైంది. మాల్దీవుల ఎన్నికల్లో పాలక సంకీర్ణం విజయం మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవులు (పీపీఎం) తన సంకీర్ణ భాగస్వామ్య పార్ట్టీల కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించింది. మార్చి 22న జరిగిన ఎన్నికల్లో ఆ కూటమి పార్లమెంట్‌లోని మొత్తం 85 స్థానాలకు గాను 54 స్థానాల్లో గెలుపొందింది. మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ నాయకత్వంలోని ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) 24 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈజిప్ట్‌లో 529 మందికి ఉరిశిక్ష ఈజిప్ట్‌లో ఒకేసారి 529 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఆ దేశంలోని మనియా కోర్టు తీర్పునిచ్చింది. వీరంతా ఆ దేశ పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారులని కోర్టు ప్రకటించింది. ముస్లిం బ్రదర్ హుడ్కు చెందిన వీరంతా ఓ పోలీసు అధికారి హత్యకేసు, ప్రజలపై దాడుల కేసులో దోషులుగా నిర్ధారిస్తూ ఈ శిక్షను విధించింది. ఆధునిక ఈజిప్ట్ చరిత్రలో ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారి. సముద్రంలో కూలిన మలేషియా విమానం తప్పిపోయిన తమ దేశ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలి జలసమాధి అయిందని మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ మార్చి 24న ప్రకటించారు. ఉపగ్రహాల నుంచి లభించిన సమాచారం ఆధారంగా విమానం సముద్రంలో కూలి మునిగిపోయిందన్న నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు. మార్చి 8న మలేషియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎం.హెచ్.-370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరి వెళ్లింది. ఇందులో 239 మంది ప్రయాణికులు, 13మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులున్నారు. స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ మృతి స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ (81) మాడ్రిడ్‌లో మార్చి 23న మరణించారు. 1975లో జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో మరణించిన తర్వాత సూరెజ్ స్పెయిన్ తొలి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. స్పెయిన్‌లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకున్న కాలంలో భాగం పంచుకున్న వారిలో మరణించిన చివరి వ్యక్తి సూరెజ్. నియంతృత్వాన్ని కూల్చి ప్రజాస్వామ్య సంస్కరణలు తీసుకురావడంలో సూరెజ్ నాయకత్వం వహించారు. 1976లో సూరెజ్ను ఆదేశ రాజు ప్రధానిగా నియమించారు. వార్తల్లో వ్యక్తులు రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ మృతి ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ (99) న్యూఢిల్లీలో మార్చి 20న మృతి చెందారు. ఆయన 30 నవలలు రాశారు. ఇందులో స్వీయ కథ ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మ్యాలీస్తో పాటు దసన్ సెట్ క్లబ్, కుష్వంత్ నామా, ద లెసన్స్ ఆఫ్ మై లైఫ్, ట్రైన్‌టు పాకిస్థాన్, విత్ మలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్, ఐ షల్ నాట్ హియర్ ద నైటింగేల్, ద కంపెనీ అండ్ ఉమెన్, ద మార్క్ ఆఫ్ విష్ణు అండ్ అదర్ స్టోరీస్, బ్లాక్ జాస్మిన్, పోట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, వంటి అత్యంత ఆదరణ పొందిన రచనలు చేశారు. ఈయన 1915, ఫిబ్రవరి 2న జన్మించారు. 1947 తర్వాత విదేశీ సర్వీసుల్లో చేరారు. లండన్,పారిస్, ఒట్టావాలలో దౌత్యవేత్తగా పనిచేశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైమ్స్, నేషనల్ హెరాల్డ్ లో సంపాదకుడిగా పనిచేశారు. యోజన పత్రిక (1951-53)కు ఆయన వ్యవస్థాపక సంపాదకుడుగా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఆయన రాజ్యసభ (1980 -1986)కు నియమితులయ్యారు. 1974లో పొందిన పద్మభూషణ్పురస్కారాన్ని స్వర్ణమందిరంపై సైనిక చర్యకు నిరసనగా 1984లో తిరస్కరించారు. ఈసీ ప్రచారకర్తగా అమీర్‌ఖాన్ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రచార కర్తగా ఎంచుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అమీర్సేవలను వినియోగించుకోనుంది. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడమే ఈసీ చేపట్టిన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఈసీ తరపున మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రచారకర్తలుగా సేవలందిస్తున్నారు. ఐ.ఎన్.ఎలో పనిచేసిన బాల ఎ చంద్రన్ మృతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ)కి చెందిన యూత్వింగ్ లో పనిచేసిన బాల ఎ చంద్రన్ (86) సింగపూర్‌లో మార్చి 20న మరణించారు. ఐ.ఎన్.ఎలో పనిచేసిన చివరి సభ్యుల్లో చంద్రన్ ఒకరు. కేరళకు చెందిన చంద్రన్ 1940లో ఏర్పాటు చేసిన ఐ.ఎన్.ఎ యూత్వింగ్ బాలక్ సేనలో పనిచేశారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి రాజీనామా రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ కె.సి.చక్రవర్తి మార్చి 20న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈయన 2009, జూన్ 15న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా చేరారు. మడేళ్ల పదవీ కాలం 2012లో ముగియగా మరో రెండేళ్లు పొడిగించారు. అవార్డులు రాజేశ్ గోపకుమార్‌కు జి.డి.బిర్లా అవార్డు 2013 సంవత్సరానికి జి.డి. బిర్లా అవార్డు భౌతిక శాస్త్రవేత్త రాజేశ్ గోపకుమార్‌కు లభించింది. క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో, స్ట్రింగ్ థియరీలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. శాస్త్ర పరిశోధనలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. సుబ్రాన్సు చౌదరికి డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సుబ్రాన్సు చౌదరికి యునెటైడ్ కింగ్డమ్ సంస్థ అందించే 2014 డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు లభించింది. సెంట్రల్ గోండ్వానా నెట్ (సీజీ నెట్) స్వర కమ్యూనిటీ రేడియో నిర్వహణకుగాను ఈ అవార్డు దక్కింది. ఈ రేడియోను రాయ్‌పూర్‌లో 2004లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రేడియోను మధ్యప్రదేశ్‌లోని హాకర్ గ్రామం నుంచి నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఈ రేడియో మధ్యప్రదేశ్‌లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ రేడియో తొలుత ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైనప్పటికీ దీని కార్యక్రమాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. క్రీడలు ఎయిరిండియాకు నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్ నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్‌ను ఎయిరిండియా గెలుచుకుంది. లక్నోలో మార్చి 23న జరిగిన ఫైనల్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) జట్టును ఓడించింది. మూడో స్థానాన్ని ఉత్తర ప్రదేశ్ హాకీ సాధించింది. రైల్వేలకు హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్ షిప్ నాలుగో హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను రైల్వేస్ గెలుచుకుంది. మార్చి 23న భోపాల్‌లో జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించింది. జార్ఖండ్ మూడో స్థానంలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా హర్యానా జట్టుకు చెందిన మోనిక ఎంపికైంది. రాష్ట్రీయం రాష్ట్రంలో మొదటి మహిళాబ్యాంక్ ఏర్పాటు రాష్ట్రంలో భారతీయ మహిళా బ్యాంక్ మొదటి శాఖను హైదరాబాద్‌లో మార్చి 23న ఆ బ్యాంక్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ ప్రారంభించారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 20 శాఖలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇది 19వ మహిళా బ్యాంక్ శాఖ. తూర్పు తీరానికి సుమేధ నౌక ఐఎన్ఎస్ సుమేధ నౌక మార్చి 23న తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రమైన విశాఖకు చేరింది. గోవా షిప్‌యార్డులో మార్చి7న ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్‌చోప్రా దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు నౌకాదళంలో ఇటువంటి నౌక చేరడం ఇది తొలిసారి. ఇది మూడో తరం ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ విభాగంలో మూడో నౌక. ఈ నౌక యాంటీ పైరసీ, పెట్రోలింగ్, ఫ్లీట్ సపోర్ట్ ఆపరేషన్స్, మారిటైమ్ సెక్యూరిటీ, ఎస్కార్ట్ ఆపరేషన్స్, నేవీ ఆస్తుల పరిరక్షణ వంటి విధులను నిర్వహిస్తుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సదుపాయమున్న ఈ నౌకలో పలు రకాల ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. నౌకలో రెండు బోట్లు ఉంటాయి. ఆటోమేటిక్ పవర్మేనేజ్మెంట్ విధానంలో కమాండర్ నేతృత్వంలో పనిచేసే ఈ నౌకలో 9మంది అధికార్లు,వందమంది సెయిలర్లు ఉన్నారు. -
సాధారణ ఎన్నికలు- వివిధ రంగాలపై ప్రభావం
దేశంలో పదహారో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు జరగనున్నాయి. దేశంలో సుదీర్ఘ కాలం జరిగే ఎన్నికలివి. ఈ సందర్భంలో ఎన్నికలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏ రంగంలో అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి? ఏ రంగంలో ప్రతికూల ధోరణులు పొడచూపుతాయనే అంశాలపై స్పెషల్ ఫోకస్.. ఎన్నికల సంవత్సరాలలో ప్రభుత్వ కోశ విధానంలో భాగంగా పన్నుల వ్యవస్థ, పెట్టుబడి వ్యయం, వినియోగ వ్యయాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వ సేవల పంపిణీని పరిశీలిస్తే.. రాష్ట్రాల ప్రజా పనుల విభాగం చేపట్టే రహదారుల నిర్మాణంపై ఎన్నికలు ధనాత్మక ప్రభావం చూపుతాయి. ఎన్నికలు జరిగే ఏడాదిలో ప్రతిపాదించిన బడ్జెట్లో ప్రభుత్వం పన్ను రేట్ల తగ్గింపును చేపట్టినప్పుడు తన నిధులను పెంచుకునేందుకు మూలధన రాబడులపై ఆధారపడుతుంది. ఈ స్థితి రుణ భారం పెరగడానికి దారితీస్తుంది. పెరిగిన ప్రభుత్వ వ్యయం మొదటి సాధారణ ఎన్నికల (జనరల్ ఎలక్షన్స్)తో పోలిస్తే 2009లో జరిగిన 15వ సాధారణ ఎన్నికల నాటికి ప్రతి ఓటరుపై ప్రభుత్వం వెచ్చించిన మొత్తం వ్యయం 20 రెట్లు పెరిగింది. మొదటి సాధారణ ఎన్నికలలో ఒక ఓటరుపై ప్రభుత్వ వ్యయం దాదాపు రూ.0.60. ఇది 2009 ఎన్నికల నాటికి రూ.12కు చేరుకుంది. 1951-52లో జరిగిన ఎన్నికలకు ప్రభుత్వం రూ.10.45 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం 2009 ఎన్నికల నాటికి రూ. 846.67 కోట్లకు పెరిగింది. 2009 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ (రూ.70 కోట్లు), తమిళనాడు (రూ.80.60 కోట్లు)లలోని ఎన్నికల వ్యయం కంటే మహారాష్ట్ర (రూ.155 కోట్లు), పశ్చిమబెంగాల్ (రూ.150 కోట్లు) లోక్‌సభ ఎన్నికల వ్యయం దాదాపు రెట్టింపు ఉంది. 2014 ఎన్నికల స్వరూపం: 2009 సాధారణ ఎన్నికలలో మొత్తం ఓటర్లు 71.40 కోట్లు కాగా ఇది 2014 నాటికి 81.45 కోట్లకు చేరింది. ఐరోపా యూనియన్ (ఈయూ), అమెరికా దేశాలలో ఉన్న మొత్తం ఓటర్ల (Electorate) కంటే భారత్ ఓటర్ల సంఖ్య అధికం. 16వ సాధారణ ఎన్నికల ప్రక్రియను మే 16 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. గత ఎన్నికలలో 59 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2014 ఎన్నికలకు సంబంధించి మొత్తం పోలింగ్ స్టేషన్లు 9,30,000. భద్రతా సిబ్బందితో పాటు ఎన్నికల కార్యకలాపాలలో మొత్తం 1.10 కోట్ల మంది పాల్గొంటున్నారు. మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారు 2.30 కోట్లు. ఈ ఎన్నికలలో 18 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వినియోగించనున్నారు. వ్యయం రూ.వెయ్యి కోట్లు: 2014 ఎన్నికలలో ప్రభుత్వ వ్యయం అధికారికంగా రూ.1000 కోట్లు ఉండగలదని అంచనా. లోక్‌సభ ఎన్నికలలో భాగంగా మొత్తం 543 నియోజకవర్గాలలో ప్రతి అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిమితిని రూ.70 లక్షలుగా నిర్ణయించారు. అయితే ముఖ్యమైన పార్టీ అభ్యర్థుల వ్యయం ప్రతి నియోజకవర్గంలో పరిమితి కంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఎన్నికలలో రాజకీయ పార్టీలు రూ.30,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఒక అంచనా. అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యయం తర్వాత అధిక ఎన్నికల వ్యయం భారత్‌లోనే నమోదైంది. ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాజకీయ పార్టీల వ్యయం అదనంగా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏయే రంగాలపై ఎంత ప్రభావం? ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం, విదేశీ మూలధన కొరత, తయారీ రంగవృద్ధి క్షీణత తదితర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ప్రస్తుత ఎన్నికల వ్యయం కారణంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో వృద్ధి అదనంగా 0.2 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉండగలదని నేషనల్ స్టాటిస్టికల్ ఛైర్మన్ ప్రొణబ్ సేన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి ముందస్తు అంచనా 4.9 శాతంగా ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్లో ఎక్సైజ్ పన్ను తగ్గింపు కారణంగా ఆర్థిక వ్యవస్థలో వ్యయం పెరిగి, స్వల్పకాలంలో వృద్ధి రేటులో పెరుగుదల సంభవించే సూచనలున్నట్లు ఆర్థికవేత్తల అభిప్రాయం. ఎన్నికల ప్రచారంలో జరిగే వ్యయం కారణంగా 2014 రెండో త్రైమాసికంలో భారత్‌లో వినియోగ వ్యయంలో పెరుగుదల సంభవిస్తుంది. గత సాధారణ ఎన్నికల సమయాలలో జరిగిన వ్యయం కారణంగా వినియోగ వస్తు వాణిజ్యంలో వృద్ధిని గమనించవచ్చు. భారత్ అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమ బడ్జెట్ 2014లో రూ.34,500 కోట్లు కాగా ఎన్నికల కారణంగా ఈ బడ్జెట్లో 8 నుంచి 10 శాతం పెరుగుదల ఉండవచ్చు. ఈ పరిశ్రమ బడ్జెట్ రూ.38వేల కోట్లకు చేరగలదని అంచనా. రాజకీయ ప్రకటనలపై చేసే వ్యయంలో ముద్రణ మాధ్యమం వాటా 45 శాతం, టీవీ చానళ్లలో ప్రకటనల వాటా 38 శాతం. మిగిలింది ఇతర ప్రచార మార్గాలపై చేసిన వ్యయం. ఇతర రంగాలపై ప్రభావం: ఎన్నికలు జరిగే నెలల్లో స్టాక్‌మార్కెట్‌పై ధనాత్మక, రుణాత్మక ప్రభావాలను గమనించవచ్చు. గత ఐదు వారాలలో స్టాక్ ధరలలో అధిక ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఈ స్థితి ఎన్నికలు పూర్తయ్యేవరకు కన్పించే సూచనలున్నాయి. అనశ్వర వినియోగ వస్తువులు, బ్యాంకులు, బేసిక్ ఇంజనీరింగ్ స్టాక్ ధరలలో పెరుగుదలను గమనించవచ్చు. వాహనాలకు చేసే వ్యయానికి సంబంధించి ఎన్నికల నియమావళి (Code of conduct) కఠినతరంగా ఉన్నందున ఎన్నికలలో అభ్యర్థులు వినియోగించే వాహనాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అన్ని రకాల వాహనాల డిమాండ్ తక్కువైనందువల్ల ఆ రంగంపై ఆధారపడిన ప్రజల ఆదాయంలో పెరుగుదల కనిపించదు. కొన్ని రకాల వ్యాపారాలపై ఎన్నికలు ధనాత్మక ప్రభావం చూపుతాయి. వార్తా పత్రికలు, నగరాలలో ప్రకటనల బోర్డుల ఏర్పాటు, సోషల్ మీడియా, రవాణా, ఆతిథ్యం, బస్సులు, టాక్సీ ఆపరేటర్లు సంబంధిత వ్యాపార వర్గాలపై ఎన్నికల ప్రభావం ధనాత్మకంగా ఉంటుంది. ఎన్నికల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని జీడీపీ గుణక ప్రభావం (GDP Multiplier Effect) రూపంలో గమనించవచ్చు. వివిధ వర్గాల ప్రజలు ఆర్జించిన ఆదాయంలో 80 నుంచి 90 శాతం వినియోగంపై వెచ్చించడాన్ని గమనించవచ్చు. శ్రామికులు, అల్పాదాయ వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులలోనూ పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉంటుంది. గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నికల అధికారులు రాజకీయ నేతల దగ్గర నుంచి దాదాపు రూ.185 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ఆకర్షించే క్రమంలో రాజకీయ నేతలు అనేక కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ఓటర్ల మొబైల్ ఫోన్లకు టాక్‌టైమ్ కోసం కొంత మొత్తాన్ని జమ చేయడం వలన టెలికం కంపెనీల వ్యాపారంలో కొంతమేర వృద్ధి కనిపించింది. రాజకీయ నాయకులు లెక్కల్లో చూపించని ద్రవ్యాన్ని ఎన్నికల సమయంలో చలామణిలోకి తీసుకొస్తున్నందువల్ల దేశంలో ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంచనా వ్యాపార ధోరణి అనేక రంగాల్లో ప్రబలుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల జీవన ప్రమాణం కుంటుపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సైజ్ పన్ను రాబడి పెరుగుతుంది. ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా ఉండి ఎక్సైజ్ పన్ను ద్వారా అధిక రాబడి సమకూరుతుంది. సమష్టి చొరవ అవసరం ఎన్నికల సంవత్సరాలలో పన్నురేట్ల తగ్గింపు, మూలధన వ్యయం పెంపు లాంటి చర్యలను ప్రభుత్వాలు చేపడుతున్నందు వల్ల ప్రభుత్వ రాబడి, వ్యయాల మధ్య అంతరం పెరుగుతుంది. ఈ స్థితిని పస్తుత వ్యయాల (Current Spending)ను తగ్గించుకోవడం ద్వారా అధిగమించాలి. దేశంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. విదేశీ పెట్టుబడిదారులు రాబోవు రోజుల్లో అభద్రతా భావానికి లోనుకాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయ పార్టీలు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని హామీలు ఇవ్వాలి. అభివృద్ధి వ్యయాన్ని పెంచే చర్యలను తమ ఎన్నికల ప్రణాళికలలో (Manifesto) చేర్చాలి. పన్నుల వ్యవస్థను అభిలషణీయ విధంగా రూపొందించుకోవాలి. నల్లధన ప్రవాహాన్ని గుర్తించాలి. ఇలా అటు పాలక పెద్దలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే శ్రేయో ఆర్థిక వ్యవస్థ సాకారమవుతుంది. -
దీర్ఘకాలిక వ్యూహం.. దర్జాగా కొలువు...
హోదాకు హోదా.. ప్రతిభకు గుర్తింపు.. సుస్థిరమైన భవిష్యత్.. చక్కటి కెరీర్.. వెరసి నేటి యువతలో బ్యాంకింగ్ రంగం క్రేజ్‌ను సంపాదించుకుంది.. సాధారణ డిగ్రీ నుంచి ప్రొఫెషనల్ డి గ్రీ పట్టా ఉన్న విద్యార్థుల వరకూ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల మీదనే దృష్టి ఉంటోంది. నోటిఫికేషన్ వెలువడడమే ఆలస్యం లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు.. దీంతో విపరీతమైన పోటీ నెలకొని ఉంటోంది.. ఈనేపథ్యంలో ఆయా పరీక్షల్లో విజయం సాధించాలంటే దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలి.. అప్పుడే భవ్యమైన కెరీర్‌కు పునాది ఏర్పడుతుంది.. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, సంబంధిత అంశాలపై విశ్లేషణ ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో నియామక విధానాన్ని పరిశీలిస్తే.. ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ సంబంధిత అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పీఓ/క్లరికల్/ స్పెషలిస్ట్ ఏ స్థాయి హోదా ఉన్న ఉద్యోగాలకైనా సాధారణంగా ఈ అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. అంటే దీర్ఘకాలికంగా ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే.. ఏక కాలంలో పీఓ/క్లరికల్ పోస్టులకు పోటీ పడొచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కు కూడా ఈ ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది (ప్రొఫెషనల్నాలెడ్జ్ను మినహాయిస్తే). విభాగాల వారీగా ప్రిపరేషన్ ఇంగ్లిష్: ఇంగ్లిష్ అత్యంత కీలకమైంది. తెలుగు మీడియం అభ్యర్థులు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి రోజూ దీనికి గంట సమయం కేటాయించాలి. ఇందులో కనీసం 30 నిమిషాలు ఇంగ్లిష్ పేపర్ చదవడం, టీవీ వార్తలు వినడం చేయాలి. దీంతో ఏ పదాన్ని సందర్భానుసారంగా ఏవిధంగా వినియోగించాలో అవగాహన వస్తుంది. అంతేకాకుండా ప్రతి రోజూ 5 నుంచి 10 కొత్త పదాలు నేర్చుకోవాలి. వాటిని వాక్యాల్లో ఏవిధంగా ఉపయోగించవచ్చో తెలుసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో నేర్చుకున్న పదాలను వాడుతూ సంభాషించాలి. ఈవిధంగా చేయడం వల్ల ఇంగ్లిష్ భాషలో పట్టు సాధించడంతోపాటు ఇంటర్వ్యూను దైర్ఘ్యంగా ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతుంది. ఇంగ్లిష్‌లో గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రూట్‌వర్డ్స్‌ను బాగా సాధన చేయాలి. జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటివాటిల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అందువల్ల అభ్యర్థులు వీటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్ నేర్చుకోవాలి. ప్రాథమిక గ్రామర్ అంశాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్; యాక్టివ్, పాసివ్ వాయిస్; డెరైక్ట్-ఇన్‌డెరైక్ట్ స్పీచ్ తదితర అంశాలను సాధన చేయాలి. రీజనింగ్: బ్యాంకుల్లో నియామకం కోసం నిర్వహించే పరీక్షల్లో అత్యంత క్లిష్టమైన విభాగం రీజనింగ్. అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో ప్రశ్నలను సాధించాలంటే విశ్లేషణ సామర్థ్యంతోపాటు తార్కికత (లాజిక్) కూడా అవసరం. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టీస్‌కు కేటాయించాలి. ఇదే క్రమంలో సాధ్యమైనన్ని షార్ట్‌కట్ మెథడ్స్‌ను నేర్చుకోవాలి. తద్వారా త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో కీలకమైన అంశాలు.. సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్ కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; రక్త సంబంధాలు; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: అభ్యర్థుల్లోని గణిత సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో చాలా వరకు ప్రశ్నలు నేరుగా లేదా సూత్రాల ఆధారితంగా ఉంటాయి. కాబట్టి గణిత నేపథ్యం లేని విద్యార్థులు కూడా ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలు, కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, నిష్పత్తులకు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే గణిత మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. దాంతోపాటు 20 వరకు టేబుల్స్, 25 వరకు స్క్వేర్స్, 15 వరకు క్యూబ్స్‌ను నేర్చుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీ: న్యూమరికల్ విభాగంలో ఎక్కువగా సింప్లిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే మూలస్తంభాలైన కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలపై పట్టు సాధించాలి. వర్గమూలాలు, ఘన మూలాలు, శాతాలపై అవగాహన పెంపొందించుకోవాలి. సమస్య చూడగానే నోటితో చెప్పగలిగే స్థాయిలో ప్రిపరేషన్ ఉండాలి. కాలం-పని; కాలం-దూరం, లాభం-నష్టం, రేషియోస్‌కు సంబంధించిన సమస్యల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్నెస్: జనరల్ అవేర్నెస్ విభాగాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. 1. స్టాండర్డ్ జీకే. 2. కరెంట్ అఫైర్స్. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; రాజధానులు వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. నోబెల్, ఆస్కార్లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మారుతున్న అంతర్జాతీయ సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, క్రీడల్లో విజేతలు, విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రముఖ అతిథులు, ముఖ్యమైన సంఘటనలను రోజూ పత్రికల ద్వారా తెలుసుకొని ఓ పుస్తకంలో నోట్ చేసుకోవాలి. జనరల్ అవేర్నెస్ (రిఫరెన్స్ టు బ్యాంకింగ్): ఈ విభాగానికి సంబంధించి బ్యాంకింగ్ రంగంలో తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో ఆర్బీఐ-విధాన నిర్ణయాలు, బ్యాంకింగ్ రంగంలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం (నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్), వివిధ బ్యాంకులు/ఆర్థిక సంస్థల ఉన్నతాధికారుల వివరాలు, బ్యాంకింగ్/ ఆర్థిక రంగంలో ఉపయోగించే పదజాలం (ఎన్పీఏ, ఎన్ఈఎఫ్టీ వంటివి), ద్రవ్య సాధనాలు (చెక్స్, ఏటీఎం కార్డు తదితర), భారత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల నుంచి అధిక శాతం ప్రశ్నలు రావచ్చు. ఈ విభాగంలో మెరుగైన స్కోర్ కోసం ప్రతిరోజూ ఫైనాన్షియల్ డైలీ/మ్యాగజైన్స్ చదవాలి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలపై కూడా దృష్టి సారించాలి. స్టాండర్డ్ జీకేకు సంబంధించి వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షుల పేర్లు; కరెన్సీలు; ఆస్కార్లతో పాటు వివిధ అవార్డుల విజేతల గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమైన సంఘటనలను తెలుసుకోవాలి. ఆర్బీఐ వెబ్సైట్లో ఉండే కామిక్ షో అనే కార్టూన్.. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్: ఈ విభాగంలో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అభ్యర్థులు తొలుత కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ తర్వాత నమూనా ప్రశ్నలపై దృష్టిసారింంచాలి. కంప్యూటర్స్-జనరేషన్స్; ఎంఎస్ వర్డ్; ఎంఎస్ ఆఫీస్; డేటాబేస్ మేనేజ్మెంట్, షార్ట్‌కట్ కమాండ్స్ తదితరాల గురించి తెలుసుకోవాలి. ఇన్పుట్స్ బై: కె.వి. జ్ఞానకుమార్, బ్యాంకింగ్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. రిఫరెన్స బుక్స్: వెర్బల్-నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్ క్వికర్ మ్యాథ్స్ -ఎం.థైరా క్యాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -అరుణ్ శర్మ ఇంగ్లిష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ -హరిమోహన్ ప్రసాద్ {పతియోగితా దర్పణ్ మనోరమ ఇయర్ బుక్ సన్నద్ధం ఇలా ముందుగా అన్ని బ్యాంక్ రిక్రూట్మెంట్ పరీక్షల సిలబస్‌ను, ఆ తర్వాత గత ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. తద్వారా ఇచ్చిన సిలబస్ నుంచి ఎటువంటి ప్రశ్నలు, ఏవిధంగా అడుగుతున్నారనే దానిపై స్పష్టత వస్తుంది. వీలైతే గత కటాఫ్ మార్కులను కూడా తెలుసుకోవాలి. తద్వారా పోటీ ఏస్థాయిలో ఉందో ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మీ సామర్థ్యాలను విశ్లేషించుకుని ఎంత సమయం ప్రిపరేషన్‌కు సరిపోతుందో అంచనా వేసుకోవాలి. ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. పరీక్షించే విభాగాలు ఒకటే అయినా.. ఎంచుకున్న పోస్టును బట్టి ప్రశ్నల క్లిష్టతలో తేడా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక వ్యూహాం దృష్ట్యా విస్తృత స్థాయి లో ప్రిపరేషన్ సాగించాలి. ఒక అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. తద్వారా సబ్జెక్ట్‌పై పట్టు వస్తుంది. ప్రశ్న ఏవిధంగా వచ్చిన సమాధానాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. ............................................................... నోటిఫికేషన్ కోసం ఎదురుచూడకుండా ప్రిపరేషన్ ప్రారంభించాలి. కనీసం మూడు-ఆరు నెలల సమయాన్ని ప్రిపరేషన్ కోసం కేటాయించాలి. ............................................................... ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. ............................................................... గత విజేతల అభిప్రాయాలను విధిగా పాటించాలి. ............................................................... {పతి రోజూ ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు ఒక గ్రూప్‌గా ఏర్పడి మోడల్ పరీక్ష రాయాలి. దాని ఫలితాలను వారే విశ్లేషించుకోవాలి. ఎన్ని గంటలు చదివామనే దానికన్నా ఎంత ఫోకస్డ్గా చదివామన్న దానిపైనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. గ్రూప్‌గా చదవడం వల్ల సమస్యలకు తొందరగా సమాధానాలు గుర్తించేందుకు ఉపయోగపడే షార్ట్‌కట్స్ తెలుస్తాయి. ఐబీపీఎస్ క్లరికల్, పీఓ పరీక్షల్లో విజయానికి వీలైనన్ని మోడల్ పేపర్లు సాధన చేయడం చాలా అవసరం. టైమ్ పెట్టుకొని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల తెలియని ప్రశ్నలపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుంటుంది. షార్ట్‌కట్స్ ఎన్ని తెలిసినా తగినన్ని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయకుంటే ఫలితం ఉండదు. ఇంగ్లిష్‌ను తేలిగ్గా తీసుకుంటే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల రోజులో కొంత సమయాన్ని ఇంగ్లిష్ ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, కంప్యూటర్ జనరేషన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్‌పై అప్డేట్గా ఉండాలి. దినపత్రికల్లోని ఆర్థిక సంబంధమైన ఎడిటోరియల్స్‌ను చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు. బ్యాంకింగ్ టెర్మినాలజీ కూడా ఒంటపడుతుంది. ప్రిపరేషన్‌కు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్, బ్యాంకింగ్ అవేర్నెస్ బుక్స్‌ను ఉపయోగించుకోవాలి. -
గమ్యాన్ని నిర్ణయించే గణితం..
రాష్ట్ర అటవీ శాఖలో వివిధ విభాగాల్లో కలిపి 2,167 పోస్టుల భర్తీ క్రమంలో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.. దీంతో కీలక ఘట్టమైనపరీక్షను నిర్వహించడమే మిగిలి ఉంది.. మొత్తం మూడు విభాగాల్లో జరిగే రాత పరీక్షలో ఎస్సే రైటింగ్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాల్లో అభ్యర్థులందరూ చక్కని ప్రతిభను కనిపించే అవకాశం ఉన్నప్పటికీ.. విజయాన్ని నిర్దేశించేది.. అంతిమ లక్ష్యానికి చేరువ చేసేది మాత్రం.. మ్యాథమెటిక్స్.. ఎందుకంటేపాఠశాల విద్య తర్వాత చాలా మంది అభ్యర్థులు మ్యాథ్స్ చదవకపోవడం, సూత్రాలను అన్వయిస్తూ సాధన చేయాల్సి ఉండడం వంటి కారణాల దృష్ట్యా మ్యాథమెటిక్స్ కీలకంగా మారింది.. దాంతో ఈ విభాగంలో చక్కని స్కోర్ సాధిస్తే అనుకున్న లక్ష్యానికి చేరువగా వచ్చినట్లే.. ఈ నేపథ్యంలో మ్యాథమెటిక్స్‌లో మెరికల్లా మారడానికి విలువైన సూచనలు.. తాజా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర అటవీ శాఖ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, తానాదార్, బంగళా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఆయా పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షలో మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంది. పేపర్-3లో భాగంగా ఉండే ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు. విజయాన్ని నిర్ణయించడంలో ఈ మార్కులే కీలక భూమిక పోషిస్తాయని చెప్పొచ్చు. పరీక్ష విధానం: విభాగం మార్కులు ఎస్సే రైటింగ్ 20 జీకే 100 జనరల్ మ్యాథమెటిక్స్ 100 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రం జనరల్ మ్యాథమెటిక్స్ విభాగానికి 50 మార్కులు కేటాయించారు. ప్రశ్నలు-మార్కుల విభజన: పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే.. పేపర్-3లో జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ప్రశ్నల వారీగా మార్కుల విభజన ఉంటుంది. దీన్ని పరిశీలిస్తే.. ప్రశ్న మార్కులు క్లిష్టత స్థాయి 1 నుంచి 10 1 సులభం 11 నుంచి 40 2 మధ్యస్తం 41 నుంచి 50 3 కఠినం టెక్నికల్ అసిస్టెంట్‌కు నిర్వహించే పరీక్షలో జనరల్ మ్యాథమెటిక్స్ విభాగంలో 30 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో కూడా ప్రశ్నల వారీగా మార్కుల విభజన ఇలా ఉంటుంది. ప్రశ్న మార్కులు క్లిష్టత స్థాయి 1 నుంచి 15 1 సులభం 16 నుంచి 25 2 మధ్యస్తం 26 నుంచి 30 3 కఠినం ఏ ఒక్క అంశాన్ని విస్మరించకుండా: ఆయా పోస్టుల భ ర్తీ కోసం అటవీ శాఖ పేర్కొన్న సిలబస్‌ను పరిశీలిస్తే.. ‘జనరల్ మ్యాథమెటిక్స్ 10వ తరగతి స్థాయి’ అని మాత్రమే ఇచ్చారు. అంటే గణితంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల అన్ని పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ ఒక్క పాఠ్యాంశాన్ని విస్మరించకుండా అన్ని అంశాలను ప్రిపేర్ కావడం ఉత్తమం. ముందుగా ఆయా పాఠ్యాంశాల్లోని ప్రాథమిక అంశాలను నేర్చుకోవాలి. తర్వాత ముందుగా సులభమైన ప్రశ్నలు, అటుపై కఠిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. కీలకమైనవి: సంఖ్యామానం, క.సా.గు.-గ.సా.భా, వర్గ మూలాలు, భిన్నాలు, దశాంశ భిన్నాలు, నిష్పత్తి-అనుపాతం, సరాసరి, శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ-చక్ర వడ్డీ, డిస్కౌంట్, భాగస్వామ్యం, కాలం-దూరం, కాలం-పని, రేఖాగణితం, క్షేత్రమితిలోని వైశాల్యం, ఘనపరిమాణం, బీజగణితం, ఘాతాంకాలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు, సాంఖ్యక శాస్త్రం, ప్రవచనాలు-సమితులు, త్రికోణ మితి, సంభావ్యత, గణన (కంప్యూటర్). క్రమ పద్ధతిలో: ప్రిపరేషన్ కోసం ఒక క్రమ పద్ధతిని పాటించాలి. ముందుగా 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల తెలుగు అకాడమీ గణిత పాఠ్యపుస్తకాలను రిఫర్ చేయాలి. ప్రతి పాఠ్యాంశంలోని సూత్రాలన్నిటినీ ఒక చోట రాసుకొని సాధన చేయాలి. అంకగణితం, బీజగణితం, వ్యాపారగణితం, రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సాంఖ్యకశాస్త్రం, సంభావ్యత పాఠ్యాంశాలలో సాధారణ స్థాయి నుంచి కఠిన స్థాయి వరకు గల సమస్యలపై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రశ్నలను సాధించేటప్పుడు వీలైనన్ని షార్ట్‌కట్ మెథడ్స్‌ను నేర్చుకోవాలి. ఇందుకోసం ఆర్ ఎస్ అగర్వాల్, క్వికర్ మ్యాథ్స్ వంటి పుస్తకాలను రిఫర్ చేయాలి. తద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించవచ్చు. విపులంగా: పరీక్షల్లో నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు, అప్లికేషన్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతుంటారు. ప్రస్తుత పోటీని దృష్టిలో ఉంచుకుంటే ఎక్కువగా అప్లికేషన్ బేస్డ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అంశాన్ని విపులంగా అధ్యయనం చేయాలి. ఒక్కో అంశాన్ని మరో అంశంతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఈ పద్ధతి ఎక్కువగా రేఖాగణితంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు చతుర్భుజ వైశాల్యం తెలిస్తే రాంబస్ వైశాల్యాన్ని సులువుగా నేర్చుకోవచ్చు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిగ్రీ, ఇంటర్మీడియెట్ అర్హతగా పేర్కొన్నారు. కాబట్టి ప్రశ్నలు కూడా అదే స్థాయిలో అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రిపరేషన్ స్థాయి పెంచాల్సి ఉంటుంది. సాధనతో: మాదిరి ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ.. ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే అంశంపై అవగాహన పెంచుకోవాలి. ఏయే అంశాలకు ఎక్కువ వెయిటేజీని ఇస్తున్నారో పరిశీలించాలి. వీలైనన్ని మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చే యాలి. మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సమయం నిర్దేశించుకోవాలి. ఆ సమయంలోనే అన్ని ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించాలి. ఎందుకుంటే ఎంత నేర్చుకున్నా ఇచ్చిన సమయంలోగా సమాధానాలు ఇవ్వకుంటే చక్కని స్కోర్ సాధించడం అసాధ్యం. అంతేకాకుండా ఫలితాలను విశ్లేషించుకోవాలి. తప్పు చేసిన ప్రశ్నకు సంబంధించిన వివరాలపై అవగాహన పెంచుకోవాలి. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు: మ్యాథ్స్ విషయంలో నాన్-మ్యాథ్స్ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి స్థాయికి అనుగుణంగానే మ్యాథ్స్‌లో ప్రశ్నలు ఇస్తారు. వీరు వ్యాపార గణితం, క్షేత్రమితి పాఠ్యాంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. త్రికోణమితి, సంభావ్యత, రేఖాగణితంలోని ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. సాధ్యమైనన్నీ షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. ప్రిపరేషన్లో ఎక్కువ సమయం పేపర్-3కి కేటాయించడం లాభిస్తుంది. ప్రాధాన్యత క్రమంలో సిలబస్‌ను పరిశీలిస్తే.. విస్తృత స్థాయిలో అంశాలు కనిపిస్తాయి. కాబట్టి అన్ని అంశాలపై పట్టు సాధించడం స్వల్ప సమయంలో అసాధ్యం. కాబట్టి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న అంశాలను ప్రాధాన్యత క్రమంలో సాధన చేయాలి. 1 మొదటి ప్రాధాన్యతలో వ్యాపార గణితంపై దృష్టి పెట్టాలి. ఇందులోని నిష్పత్తి-అనుపాతం, శాతం, లాభ- నష్టాలు, బారు వడ్డీ-చక్రవడ్డీ, కాలం-పని, కాలం-దూరం అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. 2 రెండో ప్రాధాన్యతలో క్షేత్రమితిలోని అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ఇందులోని వైశాల్యాలు, ఘనపరిమాణాలు అంశాలపై దృష్టి సారించాలి. వైశాల్యానికి సంబంధించి చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిభుజం, చతుర్భుజం, సమాంతర చతుర్భుజం,ట్రెపీజియం, రాంబస్, వృత్తం, సెక్టర్, కంకణం, బాట వైశాల్యానికి సంబంధించి లెక్కలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఘనపరిమాణాలకు సంబంధించి ఘనం, దీర్ఘఘనం, స్థూపం, శంఖువు, గోళం, ఉపరితల వైశాల్యాలు, వాటి ఘనపరిమాణాలు వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. 3 మూడో ప్రాధాన్యత కింద రేఖాగణితంపై దృష్టి సారించాలి. ఈ అంశం నుంచి కూడా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ అంశాన్ని పూర్తిగా నేర్చుకోవడం కష్టమని భావిస్తే.. కనీసం అందులోని ప్రాథమిక భావనలైనా ఔపోసన పట్టాలి. 4 నాలుగో ప్రాధాన్యత కింద సంఖ్యామానం, క.సా.గు- గ.సా.భా., భిన్నాలు, దశాంశ భిన్నాలు, సాంఖ్యక శాస్త్రం, ప్రవచనాలు-సమితులు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు, ఘాతాంకాలు, వర్గ మూలాలు, గణన అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. Prepared by: Y.Vanamraju, Mathematics Faculty. -
ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఎవరెస్ట్... ఐఈఎస్
అఖిల భారత సర్వీసుల్లో ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్‌ల తర్వాత అత్యున్నత స్థాయిల్లో నిలిచే వాటిలో ఐఈఎస్ (ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్) ఒకటి. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇంజినీరింగ్ కెరీర్‌తో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునేవారికి సువర్ణావకాశం ఐఈఎస్. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఈ పరీక్షకు తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది.. ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితేనే విజయం సాధ్యం.. ఐఈఎస్-2014 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. మొత్తం 4 బ్రాంచ్‌లలో ఐఈఎస్ పరీక్ష ఉంటుంది. అవి.. కేటగిరీ {బాంచ్ 1.సివిల్ ఇంజినీరింగ్ 2.మెకానికల్ ఇంజినీరింగ్ 3. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 4.ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ భర్తీ చేసే విభాగాలు ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీస్ ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ సర్వే ఆఫ్ ఇండియా గ్రేడ్-ఎ సర్వీస్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్ ఇండియన్ ఇన్స్పెక్షన్ సర్వీస్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్ సర్వీస్ గ్రేడ్-ఎ అసిస్టెంట్ నావల్ స్టోర్స్ ఆఫీసర్స్ సెంట్రల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ సర్వీస్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ సెంట్రల్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ సర్వీస్ రెండు దశల్లో ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) అనే రెండు దశల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పరీక్ష స్వరూపం: పార్ట్ 1 రాతపరీక్షలో రెండు విభాగాలుంటాయి. సెక్షన్ 1 ఆబ్జెక్టివ్, సెక్షన్ 2 డిస్క్రిప్టివ్ (వ్యాసరూపం)లో ఉంటుంది. రెండు సెక్షన్లకు మొత్తం 1000 మార్కులుంటాయి. సెక్షన్-2 డిస్క్రిప్టివ్ (కన్వెన్షనల్): ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 200 మార్కులుంటాయి. ఒక్కో దానికి సమయం 3 గంటలు. పేపర్-1: ఏడు ప్రశ్నలుంటాయి. ఏవైనా ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి 40 మార్కులు. పేపర్-2: మొదటి ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి 80 మార్కులు. ఇదే ప్రశ్నకు సంబంధించి మరో 10 అనుబంధ ప్రశ్నలుంటాయి. ఇం దులో మిగిలిన రెండు సెక్షన్లకు మొత్తం 120 మార్కులు. సెక్షన్-ఎ లో మూడు ప్రశ్నలుంటాయి. వీటిలో ఏవైనా రెండింటికి సమాధానం రాయాలి. ఒక్కోదానికి 30 మార్కులు. సెక్షన్-బి లోనూ ఇదే పద్ధతి ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్కులు ఉండవు. కానీ దస్తూరీ ఆకర్షణీయంగా లేకపోతే 5 శాతం వరకు మార్కులు తగ్గవచ్చు. పేపర్-2: ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులుంటాయి. ప్రశ్నల స్థాయి (పేపర్-1) ప్రాథమిక పరిజ్ఞానం 40 శాతం, అప్లికేషన్ పద్ధతి 40 శాతం ఫార్ములా, గ్రాఫ్స్ 15 శాతం రీజనింగ్ 05 శాతం ప్రశ్నల స్థాయి (పేపర్-2) పేపర్-2 వ్యాసరూప ప్రశ్నల విషయానికి వస్తే బీటెక్ సిలబస్‌కు అనుబంధంగానే ఉంటాయి. పెద్దగా వ్యత్యాసం ఉండదు. రాతపరీక్ష జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగంలో ఇంగ్లిష్ భాషపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. సినానిమ్స్, యాంటానిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, కాంప్రహెన్షన్ తరహా ప్రశ్నలు వస్తాయి. స్మృతి ఆధారిత ప్రశ్నలు కాబట్టి సులువుగానే సమాధానాలను గుర్తించవచ్చు. జనరల్ స్టడీస్: ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తోపాటు భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, ప్రభుత్వ పరిపాలన, సైన్స్ అండ్ టెక్నాలజీ, కార్పోరేట్ గవర్నెన్స్, జనాభా లెక్క లు, ప్రపంచ బ్యాంక్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే వీలుంది. ఎక్కువ భాగం మాత్రం కరెంట్ అఫైర్స్ నుంచే అడుగుతారు. కనుక పరీక్ష తేదీకి ఏడాదికి ముందు కాలం లో చోటుచేసుకున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సంఘటనలు, క్రీడలు, అవార్డులు, వార్తల్లో వ్యక్తులపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఇంజినీరింగ్ఆబ్జెక్టివ్ పేపర్లు: ఇంజినీరింగ్ ఆబ్జెక్టివ్ పేపర్-1, పేపర్-2లలోని ప్రశ్నలు... బ్రాంచ్‌ల వారీగా బీఈ/బీటెక్ స్థాయిలో ఉంటాయి. పునస్మరణ, విశ్లేషణ, అన్వయం, ఎర్రర్, డిటెక్షన్ వంటి అంశాల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఇందులో అడిగే ప్రశ్నలకు కేటాయించిన సమయాన్ని పరిశీలిస్తే... మొత్తం 120 ప్రశ్నలకు 120 నిమిషాలు మాత్రమే. అంటే ప్రతి ప్రశ్నకు సమయం నిమిషం మాత్రమే. అందువల్ల వేగం, కచ్చితత్వం అవసరం. కాలిక్యులేటర్లను పరీక్ష హాలులోకి అనుమతించరు. గుర్తుంచుకోదగిన విషయం ఏమిటంటే.... సెక్షన్-1లోఅర్హత మార్కులు వస్తేనే కన్వెన్షనల్ (సెక్షన్-2) జవాబు పత్రాలు దిద్దుతారు. కన్వెన్షనల్ పేపర్లు: సెక్షన్-2లో ఉండే రెండూ పూర్తిగా కన్వెన్షనల్ పేపర్లు. సెక్షన్-1లోని ఆబ్జెక్టివ్ పేపర్లను సమగ్రంగా ప్రిపేరైతే కన్వెన్షనల్ పేపర్లను కూడా సులువుగా రాయొచ్చు. ఉదాహరణకు ఈసీఈలోని నెట్వర్క్ థియరీ టాపిక్‌ను బాగా ప్రిపేర్ అయితే అనలాగ్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్ అంశాలు సులువు అవుతాయి. కన్వెన్షనల్ విభాగంలోని పేపర్-1లో 7 ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. పేపర్-2లో మొత్తం 9 ప్రశ్నలుంటాయి. ఇందులో మొదటి ప్రశ్న విధిగా రాయాలి. సెక్షన్-ఎ లోని 4 ప్రశ్నలకు 2 ప్రశ్నలు. సెక్షన్-బిలోని 4 ప్రశ్నలకు ఏవైనా రెండిటికి సమాధానాలు రాయాలి. గ్రాఫ్స్‌ను ఉపయోగిస్తే మెరుగైన స్కోరుకు ఆస్కారం ఉంటుంది. పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్‌ను అనుమతిస్తారు. ఇందులో డెరివేషన్స్, ప్రాక్టికల్ అప్లికేషన్లకు సంబంధించిన న్యుమరికల్ ప్రశ్నలు, కొంతమేర థియరీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాశామని కాకుండా సరైన సమాధానాలెన్ని రాశామనేదే ముఖ్యం. కొట్టివేతలు లేకుండా నీట్‌గా సమాధానాలు ఇవ్వాలి. లేదంటే 5 శాతం మార్కులు తగ్గే ప్రమాదం ఉంది. ఇంటర్వ్యూ ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు. రాతపరీక్షలో ఫలితాన్ని అనుసరించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, మానసిక, శారీరక దృఢత్వం, పని-బాధ్యతల పట్ల ఆసక్తి, నిజాయితీ వంటి లక్షణాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఎంఈ/ఎంటెక్ అభ్యర్థులను వారి స్పెషలైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సబ్జెక్టు ఆధారిత ప్రశ్నలు, వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై అవగాహన ఉందో లేదో పరిశీలిస్తారు. బీటెక్/ఎంటెక్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలు కూడా ప్రిపేర్ అవడం ఉపయోగకరం. ఉద్యోగం చేస్తుంటే ... దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కవ. ఐఈఎస్-2014 సమాచారం పోస్టుల సంఖ్య:582 అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, సివిల్, మెకానికల్) లేదా తత్సమానం. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరుకావచ్చు. ఎంఎస్సీ/తత్సమాన కోర్సులో వైర్లెస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్ లేదా రేడియో ఇంజనీరింగ్ సబ్జెక్టులను కలిగిన విద్యార్థులు కూడా కొన్ని పోస్టులకు అర్హులు. వయసు: 21-30 ఏళ్లు ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2014 పరీక్ష తేదీ: మే 24, 2014 వివరాలకు: www.upsconline.nic.in ఫైనల్ కటాఫ్ మార్కులు 2013: కేటగిరీ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సివిల్ 290 240 235 230 ఎలక్ట్రికల్ 358 318 285 254 మెకానికల్ 380 338 315 290 ఎలక్ట్రానిక్స్ 435 395 348 305 టాపర్‌గా నిలవాలంటే ప్రాథమిక అంశాలపై లోతైన పరిజ్ఞానం ఉండాలి ప్రిపరేషన్‌కు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి. సంబంధిత టాపిక్స్‌లోని ఫండమెంటల్స్, కాన్సెప్ట్లపై అవగాహన ఏర్పరచుకోవాలి. థియరిటికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. సబ్జెక్ట్‌ను థియరీ, ప్రాబ్లమేటిక్ సబ్జెక్టులుగా విభజించుకోవాలి. బృందంగా చదవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్‌ను పూర్తి చేయవచ్చు. రోజువారీ ప్రిపరేషన్లో టెక్నికల్, జనరల్ ఎబిలిటీ అంశాలు ఉండే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. నిర్వచనాలు, ప్రాబ్లమ్స్‌ను ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల కన్వెన్షనల్ పేపర్‌ను ప్రభావవంతంగా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. గేట్ ప్రశ్న పత్రాలు కూడా సహాయపడతాయి. బాంచ్ల వారీ ముఖ్య అంశాలు ఈసీఈ: ఈ బ్రాంచ్‌లో నెట్వర్క్స్, కంట్రోల్ సిస్టమ్, ఈడీసీ అనలాగ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్ అంశాలకు ఆబ్జెక్టివ్, కన్వెన్షనల్ విభాగాల్లో ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. ఈఈఈ: పేపర్-1 కోసం నెట్వర్క్ థియరీ, కంట్రోల్ సిస్టమ్, మెజర్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. పేపర్-2 పరిధి విస్తృతం. ఇందులో పవర్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ అండ్ అనలాగ్ సర్క్యూట్స్ అంశాలను సమగ్రంగా చదవాలి. ఎలక్ట్రికల్ మెషిన్స్‌లోని డీసీ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్స్, ట్రాన్స్ ఫార్మర్స్పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. మెకానికల్: పేపర్-1, 2లో ఎక్కువ శాతం ప్రశ్నలు థర్మోడైనమిక్స్, హైడ్రాలిక్స్ బేసిక్స్‌పై ఉంటాయి. పేపర్-2లో స్టెంగ్త్ ఆఫ్మెటీరియల్స్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంశాలను చక్కగా చదవాలి. సివిల్: ఈ బ్రాంచ్‌లో దాదాపు అన్ని టాపిక్స్‌ను చదవాల్సిందే. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్, ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అంశాలకు ఆబ్జెక్టివ్, కన్వెన్షనల్ విభాగాల్లో అధిక ప్రాధాన్యం ఉంటుంది. సమగ్రంగా చదివితే విజయం తథ్యం రోజుకు కనీసం 6-8 గంటలు చదవాలి. ప్రతీ అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. సిలబస్ విస్తృతం కనుక 2 నెలల ముందే పూర్తయ్యేలా చూసుకోవాలి. పరీక్షకు ముందు రెండు సార్లు రివిజన్ చేసుకుంటే మంచిది. ఇందుకు సమయపాలన ఎంతో కీలకం. ఒత్తిడిని అధిగమించాలంటే మాక్‌టెస్ట్‌లకు హాజరవ్వాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో వాటిని సరిదిద్దుకోవాలి. కన్వెన్షనల్ పేపర్ల విషయంలో ప్రశ్నల ఎంపికే కీలకం. ఒక్కో పేపర్లో ఏడు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మనం ఏ ఐదింటికి వరుస క్రమంలో సమాధానాలు రాశామో వాటి మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. కనుక జాగ్రత్త వహించాలి. ఎలాంటి కొట్టివేతలు లేకుండా నీట్‌గా సమాధానాన్ని ప్రెజంట్ చేయాలి. ఇంటర్వ్యూలో ఆయా సబ్జెక్ట్ నిపుణులు నలుగురు ఉంటారు. నా ఇంటర్వ్యూ 15-20 నిమిషాల పాటు సాగింది. టెక్నికల్ అంశాలతో పాటు మన వ్యక్తిగత విషయాలు, హాబీస్ గురించి అడుగుతారు. సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలను అడిగేటప్పుడు తెలియకపోతే రాదు అని సూటిగా చెప్పడం మంచిది. ఇంటర్వ్యూలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామా అన్నది కాదు ఎంత ఆత్మవిశ్వాసం కనబరిచామనే అంశాన్ని చూస్తారు. -అనిల్‌కుమార్ అడెపు ఐఈఎస్ -2013 జాతీయస్థాయి ఏడో ర్యాంకర్ పి.శ్రీనివాసులు రెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్, వాణి ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ -
ఉపాధ్యాయ కెరీర్‌కు బాటలు వేసే.. ఎడ్‌సెట్
భావి తరాలను తీర్చిదిద్దే పవిత్ర వ్యాసాంగం.. ఉపాధ్యాయ వృత్తి.. అందుకే గురుదేవోభవ అంటూ.. తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని గురువుకు కట్టబెట్టారు.. అటువంటి మహోన్నతమైన వృత్తిలోకి ప్రవేశించేందుకు బాటలు వేస్తున్న కోర్సుల్లో బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) ఒకటి.. 2014 సంవత్సరానికిగాను బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్, పరీక్ష నిర్వహణపై ఎడ్‌సెట్-2014 కన్వీనర్‌తో ఇంటర్వ్యూ, తదితర వివరాలు.. ఎడ్‌సెట్ ద్వారా బీఈడీ కోర్సులోని ఫిజికల్ సెన్సైస్, బయాలాజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ వంటి ఐదు రకాల మెథడాలజీల్లో ప్రవేశం పొందొచ్చు. 618కాలేజీలు, 60 వేలకుపైగా సీట్లు (దాదాపుగా) పరీక్ష విధానం పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సమాధానాలను గుర్తించడానికి రెండు గంటల సమయం (120 నిమిషాలు) ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 150. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి అనే మూడు భాగాలు ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. పార్ట్-సిలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు పార్ట్-ఎ జనరల్ ఇంగ్లిష్ 25 25 పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ 15 15 టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 10 పార్ట్-సి మెథడాలజీ మ్యాథమెటిక్స్ 100 100 ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ 50 50 కెమిస్ట్రీ 50 50 బయాలాజికల్ సైన్స్ 100 100 బోటనీ 50 50 జువాలజీ 50 50 సోషల్ స్టడీస్ 100 100 జాగ్రఫీ 35 35 హిస్టరీ 30 30 సివిక్స్ 15 15 ఎకనామిక్స్ 20 20 జనరల్ టిప్స్: 120 నిమిషాల్లోనే 150 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ప్రశ్నకు నిమిషం కంటే తక్కువ సమయం లభిస్తుంది. కాబట్టి వీలైనన్ని మోడల్ టెస్ట్‌లను రాస్తూ తక్కువ సమయంలో కచ్చితత్వంతో కూడిన సమాధానాలను ఇవ్వడం నేర్చుకోవాలి. ఎడ్‌సెట్‌లో అడిగే ప్రశ్నలు ఎనిమిది నుంచి డిగ్రీ వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా హైస్కూల్ స్థాయిలో ఉండి.. ఇంటర్, డిగ్రీలలో పునరావృతమయ్యే అంశాలను చదవాలి. తద్వారా సబ్జెక్ట్‌పై మంచి పట్టు వస్తుంది. కనీసం 110 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. కనీసం రోజుకు 5-6 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. సబ్జెక్ట్‌తోపాటు ఇంగ్లిష్, జీకే అంశాలను ప్రతి రోజూ చదవాలి. నోటిఫికేషన్ సమాచారం: అర్హత: 50 శాతం(రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం) మార్కులతో బీఏ/బీఎస్సీ/ బీకాం/బీఎస్సీ(హోంసైన్స్)/బీసీఏ/బీబీఎం లేదా పీజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ లేదా తత్సమానం.డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 24, 2014. రూ. 500 లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2014. పరీక్ష తేదీ: జూన్ 2, 2014 (11్చఝ-1ఞఝ). వెబ్సైట్: http://apedcet.org ప్రిపరేషన్ ప్లాన్.. పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగంలోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, స్పెల్లింగ్, వొకాబ్యులరీ, సినానిమ్స్, యాంటినొమ్స్, సింపుల్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, వాయిస్ డెరైక్ట్ స్పీచ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం కోసం రెన్ అండ్ మార్టిన్ లేదా ఏదైనా ప్రామాణిక గ్రామర్ పుస్తకాన్ని చదవడం ప్రయోజనకరం. పార్ట్-బి: ఈ విభాగం జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటుంది. జనరల్నాలెడ్జ్కు సంబంధించి ప్రామాణిక అంశాలుగా భావించే దేశాలు-కరెన్సీ- రాజధానులు, భౌగోళిక ప్రాధాన్యం, సంస్కృతి, నాగరికత, ముఖ్య కట్టడాలు, ప్రదేశాలు, పండగలు, గ్రంథాలు-రచయితలు వంటి వాటిని విస్తృతంగా చదవాలి. వాటితోపాటు వర్తమానంగా జాతీయంగా, అంతర్జాతీయంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలించాలి. స్టాండర్డ్ జీకే అంశాలను వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఈ విభాగం కోసం మనోరమ ఇయర్ బుక్, రోజూ రెండు దిన పత్రికలు చదవాలి. టీచింగ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగం పూర్తిగా కొత్తది. భవిష్యత్‌లో చేపట్టే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి అభ్యర్థుల ఆసక్తి, నైపుణ్యాలను స్వల్ప స్థాయిలో అంచనా వేయడానికి ఉద్దేశించిన విభాగమిది. ఇందులో టీచింగ్ స్కిల్స్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. బోధించడంలో టీచర్ల సామర్థ్యం, మంచి టీచర్ల లక్షణాలు, వ్యక్తిగత వైరుధ్యాలున్న విద్యార్థులకు బోధించడంలో బోధకుడి సమర్థత, జనరల్ ఇంటెలిజెన్స్, అనలిటికల్ థింకింగ్‌లపై ప్రశ్నలుంటాయి. ఇచ్చిన ప్రశ్నను బట్టి విచక్షణ (సమయస్ఫూర్తి)తో సమాధానం ఇవ్వాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడి స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? వంటి అంశాలను విశ్లేషించుకొని సమాధానం ఇవ్వాలి. పార్ట్-సి: అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్: సమితులు, సంబంధాలు, ప్రమేయాలు, వర్గ సమీకరణాలు, ద్విపద సిద్ధాంతం, సంయోగాలు, మాత్రికలు, త్రికోణమితి, శ్రేణులు, అవకలనం, సమాకలనం, సమూహాలు, వ లయాలు వంటి అంశాలు కీలకమైనవి. మిగతా సబ్జెక్ట్లతో పోల్చితే ఇందులో సమాధానాలను గుర్తించడానికి ఎక్కువ కసరత్తు చేయాలి. కాబట్టి ప్రతి రోజూ చదివిన టాపిక్కు సంబంధించిన మాదిరి ప్రశ్నలను సమయం నిర్దేశించుకుని సాధించాలి. వీలైనన్నీ గ్రాండ్‌టెస్ట్‌లు రాయాలి. ఫిజికల్ సెన్సైస్: ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇందులో అడిగే ప్రశ్నలు అప్లికేషన్ పద్ధతిలో ఉంటాయి. టాపిక్ల వారీగా సిద్ధాంతాలు, నిర్వచనాలు, ఫార్ములాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి. ఫిజిక్స్‌కు సంబంధించి.. యాంత్రిక శాస్త్రం, విద్యుత్, అయస్కాంతత్వం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కెమిస్ట్రీలో.. మూల, భౌతికరసాయన, కర్బన రసాయన శాస్త్రం నుంచి సమాన ప్రాధాన్యతలో ప్రశ్నలు వస్తాయి. మూలక, భౌతిక రసాయన శాస్త్రాలకు ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాలు, కర్బన రసాయన శాస్త్రానికి సంబంధించి డిగ్రీ పుస్తకాలు చదవాలి. బయాలాజికల్ సెన్సైస్: ఇందులో బోటనీ, జువాలజీ అంశాల నుంచి సమాన సంఖ్యతో ప్రశ్నలు వస్తాయి. జంతువుల విసర్జక వ్యవస్థ, కిరణజన్య సంయోగ క్రియ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. సోషల్ స్టడీస్: అత్యధిక మంది అభ్యర్థులు రాసే సబ్జెక్ట్ ఇది. ఇందులో జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిల్లో జాగ్రఫీ నుంచి అత్యధిక ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి ఈ విభాగంపై దృష్టి సారిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. ఇందుకోసం పదో తరగతి వరకు ఉండే జాగ్రఫీ ప్రాథమిక అంశాలను ప్రిపేర్ కావాలి. అట్లాస్, మ్యాప్ ఆధారంగా ప్రిపేర్ కావాలి. సివిక్స్‌లో భారత రాజ్యాంగం-రాజకీయ వ్యవస్థ, రాజనీతి సిద్ధాంతాలు, అంతర్జాతీయ సంబంధాలు, రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఎకనామిక్స్‌లో సూక్ష్మ ఆర్థిక శాస్త్రం, భారత ఆర్థికాభివృద్ధి, పంచవర్ష ప్రణాళికలు, పన్నులు, ద్రవ్య విధానం, బ్యాంకింగ్, జనాభా వంటి అంశాలను అధ్యయనం చేయాలి. వీటిని వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ చదవడం ప్రయోజనకరం. హిస్టరీలో ఆధునిక యుగం, సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణోద్యమం, ఐరోపా-అమెరికా విప్లవాలు, ప్రపంచ యుద్ధాలు, ఐక్యరాజ్యసమితి, భారతదేశ చరిత్రకు స్వాతంత్య్ర ఉద్యమంలోని దశలు, నాగరికతలు, బౌద్ధ-జైన మతాలు, మౌర్యులు, గుప్తులు, ఆధునిక దక్షిణ భారతదేశ చరిత్ర వంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి. ఇంగ్లిష్: ఇందులో ప్రశ్నలు రెండు విధాలుగా ఉంటాయి. మొదటి విధానంలో 8,9,10, ఇంటర్మీడియెట్ తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. అందులో భాగంగా.. లాంగ్వేజ్ ఫంక్షన్స్, ఎలిమెంట్ ఫోనెటిక్స్, ఇడియమ్స్, రైటింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, రిఫరెన్స్ స్కిల్స్ వంటి అంశాల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. రెండో విధానంలో బీఏ స్థాయిలో ఇంగ్లిష్ ఆప్షనల్‌కు సంబంధించి నిర్దేశించిన బీఏ (స్పెషల్ ఇంగ్లిష్)/ మోడర్న్ లిటరేచర్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. జూన్ 23న ఫలితాలు ఎడ్‌సెట్ నిర్వహణకు సంబంధించి ఎడ్‌సెట్-2014 కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ.. దరఖాస్తులు ప్రారంభం: ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 42 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. గతేడాది దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను బట్టి మొత్తం 287 పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం కూడా వచ్చిన దరఖాస్తుల మేరకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. మార్పుల్లేవ్: దరఖాస్తు, పరీక్షా విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు. పాత విధానంలోనే దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరిస్తున్నాం. గతేడాది 1,47,709 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. అత్యధికంగా ఉస్మానియా వర్సిటీ పరిధి నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 1.5 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సబ్జెక్ట్‌ల వారీగా చూస్తే సోషల్స్టడీస్ విభాగం కోసం అత్యధికంగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతేడాది సోషల్ సబ్జెక్టుకు 65,073 దరఖాస్తులు వచ్చాయి. సవరణలకు అవకాశం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు చేసినా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ మధ్య సమయం ఇస్తున్నాం. ఆ సమయంలో నేరుగా విద్యార్థులే వెబ్సైట్లో తప్పులను సరిచేసుకోవచ్చు. లేని పక్షంలో సందేహాలు ఉంటే 0891-2579797 నంబర్లో సంప్రదించవచ్చు. సందేహాలను convenoredcet2014@ gmail.comకు మెయిల్ కూడా చేయవచ్చు. జూన్ 12న ఫైనల్ కీ: ప్రాథమిక ‘కీ’ని జూన్ 5వ తేదీన, ఫైనల్ ‘కీ’ని జూన్ 12వ తేదీన, ఫలితాలను జూన్ 23వ తేదీన విడుదల చేస్తాం. ఫలితాలు విడుదలైన తర్వాత కౌన్సెలింగ్ తేదీలపై నిర్ణయం ఉంటుంది. కోర్సు వ్యవధి పెరగొచ్చు! జస్టిస్ వర్మ కమిషన్ విద్యలో సమూల మార్పులను తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఆ మేరకు బీఈడీ కోర్సుల కాల వ్యవధి పెంపు వంటి మార్పు లు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరగవచ్చు. ఎడ్సెట్తోనే ఫీజు రీయింబర్స్మెంట్: ఎడ్‌సెట్ పరీక్ష రాసిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం, బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశం కూడా ఎడ్‌సెట్ ద్వారానే నిర్వహిస్తాం. ఈ సారి కూడా ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంది. పరీక్ష సమయాని కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. గడువు వరకు వేచి చూడడం కంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం. -వేదుల నరసింహం, న్యూస్‌లైన్, విశాఖపట్నం. -
‘స్ఫూర్తి’గా నిలిచిన ఉన్నత విజయం...
ఎంసెట్‌లో నాలుగు మార్కులు తగ్గడంతో ఎంబీబీఎస్ సీటు దూరమైంది.. అయినా నిరాశ చెందకుండా అందొచ్చిన బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్)ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు.. పక్కా ప్రణాళికతో చదివి, స్వర్ణ పతకం సాధించారు. ఆపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన ఎండీఎస్ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించారు. చిత్తూరు జిల్లాకు చెందిన కె.స్ఫూర్తి రెడ్డి. పేరులోనే స్ఫూర్తిని నింపుకున్న ఆమె గెలుపు బాట అనుభూతుల్ని ‘భవిత’తో పంచుకున్నారు.. మాది చిత్తూరు జిల్లా మదనపల్లి. నాన్న మల్లికార్జునరెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్. అమ్మ విజయలక్ష్మి టీచర్. ఎనిమిదో తరగతి నుంచి బీడీఎస్ వరకు కర్నూల్లోని బాబాయి ప్రసాద్‌రెడ్డి ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. వైద్యునిగా బాబాయికి ఉన్న గుర్తింపు, సేవ చేయడం ద్వారా ఆయన పొందుతున్న సంతృప్తి నాలో డాక్టర్ కావాలన్న ఆశను రేకెత్తించాయి. ఆయన స్ఫూర్తితో ఎప్పటికైనా గొప్ప డాక్టర్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. ‘పది’ నుంచే పట్టుదలతో: పదో తరగతిలో 600 మార్కులకు 557 మార్కులు తెచ్చుకున్నా. ఇంటర్మీడియెట్ బైపీసీలోనూ ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎంసెట్-2007లో నాలుగు మార్కులు తగ్గడంతో ఎంబీబీఎస్ సీటు చేజారింది. బీడీఎస్ సీటు రావడంతో కర్నూలు పుల్లారెడ్డి మెడికల్ కాలేజీలో చేరాను. ఒక ప్రణాళిక ప్రకారం చదవడమనేది పదో తరగతి నుంచే అలవడింది. రోజువారీగా చదవాల్సిన అంశాలను ఒక పేపర్‌పై రాసి, గోడకు అంటించేదాన్ని. ఆ రోజు చదవాల్సిన పాఠాలు పూర్తయితేనే నిద్రపోయేదాన్ని. అది క్రమంగా అలవాటుగా మారింది. ఇదే పద్ధతిని బీడీఎస్లోనూ అనుసరించాను. 69 శాతం మార్కులతో కోర్సును పూర్తిచేశాను. చివరి సంవత్సరంలో స్వర్ణ పతకం సాధించాను. తొలి ప్రయత్నంలో నిరాశ: పీజీ ఎంట్రన్స్ రాయడం ఇది రెండోసారి. బీడీఎస్ పూర్తయిన వెంటనే రాసిన మొదటి ఎంట్రన్స్‌లో ఆశించిన ర్యాంకు రాలేదు. అందుకే కర్ణాటకలోని ఒక కోచింగ్ సెంటర్లో తొమ్మిది నెలలు శిక్షణ తీసుకున్నా. సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాననే భావన నాలో ఉండేది. అది వాస్తవం కాదని శిక్షణ కేంద్రంలో చేరిన తర్వాత తెలిసింది. పాఠ్యాంశాలను రివిజన్ చేస్తూ, లోతైన అధ్యయనం చేయడం ముఖ్యమని గ్రహించాను. కోచింగ్ క్లాస్‌లో చెప్పబోయే అంశాలను ముందే చదువుకొని వెళ్లేదాన్ని. దీంతో తరగతిలో చెప్పే పాఠాలు రివిజన్లా ఉండేది. రోజువారీ పరీక్షలు రాసి, తప్పులను సరిదిద్దుకునేదాన్ని. పీజీ ఎంట్రన్స్‌లో 100కు 89 మార్కులు వచ్చాయి. ఉస్మానియాలో మెడికల్ కాలేజీలో పీజీ పూర్తిచేసి, మంచి డాక్టర్‌గా పేరుతెచ్చుకోవాలన్నది నా లక్ష్యం. అమ్మా, నాన్న ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఎప్పటికప్పుడు ప్రిపరేషన్లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్) ఎంట్రన్స్‌లో 60 శాతం ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి. మిగిలిన 40 శాతం ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. ర్యాంకింగ్‌కు ప్రతి మార్కూ కీలకమే. డెంటల్ పల్స్‌తో మేలు: తప్పులను సమీక్షించుకుంటూ నిజాయితీగా కష్టపడి చదవాలి. పీజీ ఎంట్రన్స్‌లో బీడీఎస్ విద్యార్థులకు ‘డెంటల్ పల్స్’ పుస్తకం ప్రామాణికమైంది. దాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. రివిజన్ చేసిన ప్రతిసారీ కొత్త విషయాలు తెలుస్తాయి. డాక్టర్ గౌరీశంకర్ రాసిన పుస్తకాలతో పాటు టెక్స్ట్‌బుక్స్ చదువుతూ, పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే విజయం సులువవుతుంది. ‘‘అకడమిక్ అంశాలు చదవగానే అంతా వచ్చినట్లే ఉంటుంది. అదే భావనతో పరీక్షకు హాజరైతే ఉత్తీర్ణత సాధిస్తాంగానీ ర్యాంకులు సాధించలేమన్నది గుర్తించాలి. ఇది నాకు స్వీయ అనుభవంలోకి వచ్చాక, విజయం సాధించేందుకు అవసరమైన మార్గం కనిపించింది. ఫలితం ఎండీఎస్ ఎంట్రన్స్‌లో మొదటి ర్యాంకు’’ కె.స్ఫూర్తి రెడ్డి. -
ఇన్స్ట్రుమెంటేషన్లో పీజీ కోర్సుల వివరాలు...
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఇన్సూరెన్స్ కోర్సులు అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? - శ్రీధర్, నిర్మల్. వివిధ సంస్థలు ఇన్సూరెన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల ద్వారా బీమా పరిశ్రమపై ఔత్సాహికుల్లో సమగ్ర అవగాహన కల్పిస్తారు. బీమా వ్యాపారానికి యాక్చూరియల్ సైన్స్ ఆధారం. ఇన్సూరెన్స్ రిస్క్స్, ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని యాక్చూరియల్ సైన్స్ అందిస్తుంది. పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు బీమా వ్యాపారానికి అవసరం. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు యాక్చూరియల్ సైన్స్ ఉపయోగపడుతుంది. ఇన్సూరెన్స్, యాక్చూరియల్ సైన్స్ కోర్సులు: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం), హైదరాబాద్.. ది ఇంటర్నేషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్; ది ఇంటర్నేషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్; ది ఇంటర్నేషనల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రిస్క్ మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అర్హత: గ్రాడ్యుయేషన్. సీఏ, ఐసీడబ్ల్యూఐ లేదా సీఎస్ వంటి ప్రొఫెషనల్ అర్హతలున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐఆర్ఎం.. పీజీ డిప్లొమా ఇన్ యాక్చూరియల్ సైన్స్ కోర్సును కూడా ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iirmworld.org.in యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, చెన్నై.. ఎంఎస్సీ యాక్చూరియల్ సైన్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌తో బీఎస్సీ. వెబ్సైట్: www.unom.ac.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హైదరాబాద్.. ఇన్సూరెన్స్ స్పెషలైజేషన్‌తో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. ఎంట్రన్స్, జీడీ, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.ipeindia.org అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాక్చూరియల్ సైన్స్, నోయిడా.. ఎంబీఏ (ఇన్సూరెన్స్) కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. మ్యాట్/క్యాట్/జీమ్యాట్/అమిటీ ఎంట్రన్స్, జీడీ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.amity.edu కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కంపెనీలు, బ్యాంకులు, బిజినెస్ కన్సల్టెన్సీలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇన్స్ట్రుమెంటేషన్లో పీజీ ప్రోగ్రామ్ వివరాలు తెలియజేయండి? - గణేశ్, వనపర్తి. ఇన్స్ట్రుమెంటేషన్ అప్లికేషన్స్.. మెడిసిన్, టెలీ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఎన్నో విభాగాల్లో ఉపయోగపడతాయి. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్ పూర్తిచేసిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలు ఉంటాయి. కోర్సులు: జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్.. ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఈఈఈ/ఈసీఈ/ఈఐఈ/ఐసీఈలో బీఈ లేదా బీటెక్. గేట్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.jntuh.ac.in ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం.. ఇన్స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. అర్హత: ఈసీఈ/ ఈఈఈ లేదా సంబంధిత సబ్జెక్టుతో బీఈ లేదా బీటెక్. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి.. ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ సిస్టమ్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈఈఈ/ ఈసీఈ/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్/ కంట్రోల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్. వెబ్సైట్: svuniversity.ac.in కెరీర్: కోర్సు పూర్తిచేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలీ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. భారతీయ రైల్వేలు, బీఎస్ఎన్ఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తదితర ప్రముఖ సంస్థల్లోనూ ఉన్నత ఉద్యోగాలుంటాయి. సంస్థలు రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగులను ఎంపిక చేస్తున్నాయి. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ద్వారా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బ్యాచిలర్ ఆఫ్ లా చేయాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలు తెలియజేయగలరు? - గణేశ్, గుంటూరు. రాజీవ్‌గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఐఐటీ ఖరగ్‌పూర్.. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సును అందిస్తోంది. ఈ కోర్సుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. మూడేళ్ల కాల వ్యవధిగల ఈ కోర్సులో ఆరు సెమిస్టర్లుంటాయి. ఆలిండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్/ ఎల్‌శాట్ ఇండియా/ ఎల్‌శాట్ గ్లోబల్, జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, బేసిక్ సైన్స్, లీగల్ ఆప్టిట్యూడ్, ఎస్సే పరిజ్ఞానాన్ని పరీక్షించేలా పరీక్ష ఉంటుంది. వెబ్సైట్: www.rgsoipl.iitkgp.ernet.in నేను బీటెక్ పూర్తిచేశాను. కెనడాలో ఎంఎస్ చేయడానికి విధివిధానాలేమిటి? - బాల, నిజామాబాద్. కెనడాలో ఎంఎస్ చేయాలనుకుంటే తొలుత అక్కడ ఉన్న కొన్ని యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాలి. ఆయా వర్సిటీల్లో ప్రవేశ విధానాలను తెలుసుకోవాలి. నిర్దేశ జీఆర్ఈ, టోఫెల్ స్కోర్ ఆధారంగా వర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. యూనివర్సిటీ కోరిన అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. యూనివర్సిటీ నుంచి అంగీకారపత్రం లభిస్తే అప్పుడు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. -
వరల్డ్ వైడ్ వెబ్‌కు 25 ఏళ్లు
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేయాలన్న సుప్రీం ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను సంవత్సరంలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మార్చి 10న కిందిస్థాయి కోర్టులను ఆదేశించింది. అభియోగాలు నమోదైన సంవత్సరంలోగా విచారణ ముగించాలని పేర్కొంది. ఏడాదిలోగా విచారణ పూర్తికాకపోతే దిగువ కోర్టులు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. విచారణలో జాప్యం వల్ల కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు తమ పదవుల్లో కొనసాగుతున్నారని జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. డ్రాపౌట్ల సంఖ్య 8 కోట్లు భారత్‌లో ప్రాథమిక విద్య పూర్తికాక ముందే బడి మానే స్తున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని యూనిసెఫ్ ప్రతినిధి లూయిస్-జార్జెస్ ఆర్సెనాల్ట్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పిల్లలు వివిధ కారణాల వల్ల మధ్యలోనే స్కూలు డ్రాపౌట్లుగా మారారని తెలిపారు. ప్రాథమిక విద్య (ఎనిమిదో తరగతి వరకూ) పూర్తి కాకుండానే బడి మానేస్తున్న పిల్లల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందన్నారు. 10వ యంగ్ ఇండియన్ సదస్సు 10వ యంగ్ ఇండియన్ సదస్సు న్యూఢిల్లీలో మార్చి 15న ప్రారంభమైంది. ‘ఇండియా-ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే ఇతివృత్తంతో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కు చెందిన యంగ్ ఇండియన్స్ (వైఐ) సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. విద్వేషం చిమ్మే నేతలను బుక్ చేయండి: సుప్రీం కులం, మతం, ప్రాంతం, జాతి ఆధారంగా నేతలు చేసే విద్వేష ప్రసంగాలు సమాజానికి విఘాతకరమని.. అలాంటి ప్రసంగాలు చేసే రాజ కీయ, సంఘ, మత సంస్థల నేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీలు లేదా నేతలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే... ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేయాలా? అన్న అంశాన్ని పరిశీలించాలని లా కమిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కోరింది. నేతల విద్వేష ప్రసంగాలు ప్రజస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయని స్వచ్ఛంద సంస్థ ప్రవాసీ భలాయ్ సంఘటన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు మార్చి 12న విచారించింది. ఎన్నికల్లో నల్లధనం నియంత్రణకు ‘గ్రిడ్’ రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నల్లధనాన్ని నియంత్రించడంలో భాగంగా రెవెన్యూ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక నిఘా వ్యవస్థ(గ్రిడ్)ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ విధమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గురించి ఇది ఎప్పటికప్పుడు ఈసీకి తెలియజేస్తుంది. తద్వారా నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. యూఐడీఏఐకి నిలేకని రాజీనామా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్ పదవికి నందన్ నిలేకని మార్చి 13న రాజీనామా చేశారు. యూఐడీఏఐ చైర్మన్‌గా నిలేకని 2009 జూన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిలేకని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేశారు. అంతర్జాతీయం దేవయానిపై అభియోగాల కొట్టివేత భారత దౌత్యవేత్త దేవయానిపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు మార్చి 12న కొట్టివేసింది. ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉన్న నేపథ్యంలో ఈ అభియోగాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూయార్క్‌లోని జిల్లా కోర్టు జడ్జి షీరా షైండ్లిన్ తీర్పు ఇచ్చారు. దేవయానిపై మార్చి 15 అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. దేవయాని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్నప్పుడు తన ఇంట్లో పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంలో భారత్‌కు 73వ స్థానం రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం విషయంలో భారత్ ప్రపంచంలో 73వ స్థానంలో నిలిచింది. ‘ద ఉమెన్స్ ఇన్ పాలిటిక్స్ మ్యాప్-2014’ అనే పేరుతో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ ఉమెన్ సంస్థలు మార్చి 16న విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం విషయంలో నికరాగువా మొదటి స్థానంలో నిలిచింది. స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళ పార్లమెంటేరియన్ల శాతం 21.8గా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో పార్లమెంటరీ లేదా మంత్రిత్వ పదవుల్లో 9 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆఫ్రికా దేశాలు హైతీ, రువాండా, కాంగో, ఛాద్, జాంబియాలు భారత్ కంటే మెరగైన స్థానాల్లో ఉన్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న క్రిమియా ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా.. ఉక్రెయిన్ నుంచి మార్చి 17న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ ద్వీపకల్పంలోని ఉక్రెయిన్ ప్రభుత్వ ఆస్తులను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. పొరుగునే ఉన్న రష్యాలో చేరేందుకు అంగీకరించాలని ఆ దేశాన్ని కోరింది. ‘‘క్రిమియాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలన్నింటికీ క్రిమియా రిపబ్లిక్ విజ్ఞప్తి చేస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాను రష్యా సమాఖ్యలో సభ్యురాలిగా చేర్చుకోవాలని ఆ దేశాన్ని క్రిమియా రిపబ్లిక్ కోరుతోంది’’ అనే తీర్మానాన్ని క్రిమియా ప్రాంతీయ పార్లమెంటు ఆమోదించింది. ఉక్రెయిన్‌లో కొంత కాలంగా కొనసాగుతున్న సంక్షుభిత పరిణామాల నేపథ్యంలో.. స్వయం ప్రతిపత్తి గల క్రిమియా తాను ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? లేక ఆ దేశం నుంచి విడిపోయి రష్యాలో చేరాలా? అనే అంశంపై మార్చి 16న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓటర్లలో 96.8 శాతం మంది ఉక్రెయిన్ నుంచి వేరుపడి రష్యాలో చేరాలని తీర్పుచెప్పినట్లు రెఫరెండం ఎన్నికల కమిషన్ చైర్మన్ మిఖాయిల్ మలిషేవ్ ప్రకటించారు. మార్చి 30 నుంచి తమ ప్రాంతం మాస్కో కాలమానానికి (జీఎంటీ + 4, ప్రస్తుత క్రిమియా కాలమానం కంటే రెండు గంటలు ముందుకు) మారుతుందని క్రిమియా స్థానిక ప్రధానమంత్రి సెర్గీ అక్సియోనోవ్ పేర్కొన్నారు. ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్ ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా మాజీ వామపక్ష గెరిల్లా కమాండర్ సాల్వెడార్ సాంచెజ్ సెరెన్ ఎన్నికయ్యారు. ఆయుధాల దిగుమతుల్లో భారత్ టాప్ ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల కంటే ముందుంది. ఆ దేశాల కంటే మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానం దక్కించుకుంది. భారత్ తన సైనిక అవసరాలకు స్వదేశీ తయారీ పరిశ్రమ కంటే ఆయుధాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని సిప్రి ప్రస్తావించింది. వరల్డ్ వైడ్ వెబ్‌కు 25 ఏళ్లు వరల్డ్ వైడ్ వెబ్(www) మార్చి 12న పాతికేళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టింది. ఇంటర్నెట్లో ప్రస్తుతం ఒక వెబ్ బ్రౌజర్ నుంచే అనేక వెబ్‌పేజీలు మనం చూడగలుగుతున్నాం. దీనంతటికీ ఇంటర్నెట్ కారణమైనా.. దాని వెనక వరల్డ్ వైడ్ వెబ్ చేరడం వల్లే ఆన్లైన్ ప్రపంచం ఇంతగా సులభ సాధ్యమైంది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టీమ్ బెర్నర్స్ లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీడలు ఇండియన్ వెల్స్ విజేత జొకోవిచ్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. జొకోవిచ్ కెరీర్లో ఓవరాల్‌గా ఇది 42వ టైటిల్. ఇందులో 17 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఆండ్రీ అగస్సీ (అమెరికా) సరసన జొకోవిచ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (26 టైటిల్స్), ఫెడరర్ (21 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. విజయ్ హజారే విజేత కర్ణాటక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. మార్చి 16న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో రైల్వేస్‌ను ఓడించింది. ఈ విజయంతో కర్ణాటక ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటికే రంజీ, ఇరానీ ట్రోఫీలలో విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్ ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. మాగ్నుసన్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలిచాడు. ఇదే రేసులో ఎఫ్1 చరిత్రలో పిన్న వయస్సులో (19 ఏళ్ల 10 నెలల 18 రోజులు) పాయింట్లు నెగ్గిన డ్రైవర్‌గా డానిల్ క్వియాట్ (రష్యా) రికార్డు నెలకొల్పాడు. హాకీ జూనియర్ ఉమెన్స చాంపియన్‌షిప్ హాకీ ఇండియా జూనియర్ ఉమెన్స చాంపియన్‌షిప్‌ను ఛత్తీస్‌గఢ్ గెలుచుకుంది. మైసూర్లో మార్చి 13న జరిగిన ఫైనల్లో కేరళను ఓడించింది. క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్ సచిన్ భారత మాజీ ఆటగాడు, మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’ అవార్డుకు ఈఎస్పీఎన్-క్రిక్ ఇన్ఫో సంస్థ ఎంపిక చేసింది. ఇతర అవార్డుల విజేతలు: టెస్టు బ్యాటింగ్ అవార్డు: శిఖర్ ధావన్ (ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 187 పరుగుల ఇన్నింగ్స్) వన్డే బ్యాటింగ్ అవార్డు: రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై వన్డే డబుల్ సెంచరీ); తొలి ఏడాది అత్యుత్తమ ప్రదర్శన అవార్డు: షమీ (2013లో టెస్టులు, వన్డేలు కలిపి 47 వికెట్లు); ఉత్తమ టెస్టు బౌలింగ్ అవార్డు: మిచెల్ జాన్సన్ (7/40, ఇంగ్లండ్‌పై); ఉత్తమ వన్డే బౌలింగ్ అవార్డు: షాహిద్ ఆఫ్రిది (7/12, వెస్టిండీస్‌పై). అవార్డులు జ్ఞాన్ కొర్రేకు గొల్లపూడి అవార్డు గొల్లపూడి శ్రీనివాస్ (జీఎస్) మెమోరియల్ ఫౌండేషన్ అందజేసే జీఎస్ జాతీయ అవార్డు- 2013కు దర్శకుడు జ్ఞాన్ కొర్రే ఎంపికయ్యారు. గుజరాతీ సినిమా ‘ది గుడ్ రోడ్’కు దర్శకత్వం వహించినందుకుగాను కొర్రేను ఈ పురస్కారం వరించింది. భారతీయ అమెరికన్ విద్యార్థులకు ఇంటెల్ అవార్డులు ఇద్దరు భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆనంద్ శ్రీనివాసన్(17), శౌన్ దత్తా(18) మార్చి 12న ప్రతిష్టాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సైన్స్ అవార్డుల పోటీలో ఎనిమిది, పదో స్థానాలను వీరిద్దరూ కైవసం చేసుకున్నారు. అవార్డు కింద చెరో రూ. 12.23 లక్షల నగదును అందజేశారు. డీఎన్ఏలోని అతి సూక్ష్మ భాగాలను సైతం తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘ఆర్‌ఎన్‌ఎన్‌స్కాన్’ అనే న్యూరల్ నెట్వర్క్ సంబంధిత కంప్యూటర్ మోడల్‌ను శ్రీనివాసన్ ఆవిష్కరించగా.. అణు పదార్థాల చర్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ మోడల్స్‌ను, సూత్రాలను శౌన్ దత్తా అభివృద్ధిపర్చాడు. నలిమెల భాస్కర్‌కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ కవి, భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్‌కు ‘అనువాద సాహిత్యం’లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రఖ్యాత మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన ‘స్మారక శిలగళ్’ నవలను ‘స్మారక శిలలు’ పేరుతో 2010లో భాస్కర్ తెలుగులోకి అనువదించారు. అవార్డు కింద రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు. సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని 1989 నుంచి 24 భాషల్లోని అత్యున్నత అనువాదాలకు అందజేస్తోంది. టోమస్ హలిక్‌కు టెంపుల్టన్ ప్రైజ్ చెక్కు చెందిన మతగురువు, మేధావి టోమస్ హలిక్‌కు 2014 టెంపుల్టన్ ప్రైజ్ లభించింది. పురస్కారాన్ని అందజేసే జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ మార్చి 13న ఈ విషయాన్ని ప్రకటించింది. అవార్డు కింద 1.1 మిలియన్ పౌండ్లు బహూకరిస్తారు. -
రాష్ట్రపతి పాలన - రాజ్యాంగం
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 41 ఏళ్ల తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు.. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత ఏర్పడిన అనిశ్చితిని తొలగించడానికి రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్ర మంత్రి వర్గ సిఫార్సుకూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 2న ఆమోదం తెలిపారు.. దీంతో ఆంధ్రప్రదేశ్ పాలన వ్యవహారాలు గవర్నర్ నరసింహన్ చేతుల్లోకి వెళ్లాయి.. ఈ నేపథ్యంలో ‘రాష్ట్రపతి పాలన’ అంశం సమకాలీన ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి పాలన అంటే ఏమిటి? ఏయే పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అనివార్యం అవుతుంది? ఈ అంశానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తి ఎలా ఉంది? దీనిపై సుప్రీంకోర్టు తీర్పు, న్యాయ సమీక్ష తదితర అంశాలపై విశ్లేషణ.. భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో తమ అధికార, విధులను నిర్వర్తించాలి. సాధారణంగా ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించకూడదు. కానీ దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ దృష్ట్యా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన అధికారాలకు ‘అత్యవసర అధికారాలు’గా పేరు పెట్టారు. రాజ్యాంగం 18వ భాగంలో ప్రకరణ 352 నుంచి 360 వరకు మూడు రకాల అత్యవసర అధికారాలను పేర్కొన్నారు. అవి.. 1. జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352) 2. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356) 3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (ప్రకరణ 360) రాష్ట్రపతి పాలన విధింపు - కారణాలు ప్రకరణ 355 ప్రకారం ప్రతీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అలాకాకుండా ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా పరిపాలన కొనసాగించడానికి అవకాశం లేనప్పుడు లేదా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిన పరిస్థితుల్లో.. గవర్నర్ పంపిన నివేదిక ద్వారా లేదా మరో విధంగా గానీ, రాష్ట్రపతి భావించినప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అలాగే ప్రకరణ 365 ప్రకారం కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే కూడా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన రోజు నుంచి రెండు నెలల్లోగా పార్లమెంట్ రాష్ట్రపతి పాలనను సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదించిన రోజు నుంచి ఆరు నెలల వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. అలా ప్రతి ఆరు నెలలకోసారి పార్లమెంట్ ఆమోదాన్ని పొందాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి పాలనను మూడు సంవత్సరాలకు మించి కొనసాగనివ్వకూడదు. రాష్ట్రపతి పాలన - పరిణామాలు రాష్ట్రపతి పాలన విధించినప్పుడు చోటు చేసుకునే పరిణామాలు 1. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. 2. రాష్ట్ర విధాన సభను రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సుప్తచేతనావస్థలోనే ఉంచారు (అంటే అసెంబ్లీ రద్దు కాకుండా నిద్రాణ స్థితిలో ఉంటుంది). ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు అసెంబ్లీని తిరిగి పునరుద్ధరించవచ్చు. 3. రాష్ట్రపతి.. రాష్ట్ర పాలన బాధ్యతను స్వీకరించి దాన్ని గవర్నర్ ద్వారా నిర్వహిస్తాడు. 4. గవర్నర్‌కు సహకరించడానికి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సలహాదారులుగా నియమిస్తారు. 5. రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంట్, రాష్ట్రపతి ఆర్డినెన్స ద్వారా చట్టాలను రూపొందించవచ్చు. 6. రాష్ట్ర బడ్జెట్‌ను కూడా పార్లమెంట్ ఆమోదిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పులు - న్యాయసమీక్ష 1975లో చేసిన 38వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. రాష్ట్రపతి తన అభీష్టం మేరకు లేదా సంతృప్తి మేరకు ప్రకరణ 356ను ప్రయోగించవచ్చు. ఈ విషయంలో రాష్ట్రపతిదే తుది నిర్ణయం. ఆ నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించరాదు అనే ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ చేశారు. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించారు. ఆ మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు. న్యాయ సమీక్షకు అతీతం కాదు. ఈ మధ్యనే ఢిల్లీలో విధించిన రాష్ట్రపతి పాలనను ప్రశ్నిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దుర్వినియోగం-సమీక్ష అత్యవసర అధికారాలు సమాఖ్య వ్యవస్థకు ప్రమాదం తెస్తాయని, ప్రతిపక్షాలకు చెందిన ప్రభుత్వాలను అణచివేస్తాయని, కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించే అవకాశం ఉందని రాజ్యాంగ నిర్మాతలే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటువంటి అభిప్రాయాలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్లు ఇచ్చిన సమాధానం..‘‘సమాఖ్య వ్యవస్థ కంటే జాతి శ్రేయస్సు మిన్న. చైతన్యవంతమైన ప్రజాభిప్రాయం, చురుగ్గా ఉన్న పార్లమెంట్ గల దేశంలో నియంతృత్వానికి చోటులేదు’’. ‘‘356వ అధికరణం దుర్వినియోగం కావచ్చు. అయినా అది అవసరమైన చెడు’’ అని టి.టి. కృష్ణమాచారి పేర్కొన్నారు. దేశ విభజన సందర్భంలో మతోన్మాదానికి లక్షలాది మంది అమాయకులు బలి అవుతున్న సమయం, జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ దండయాత్రతో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో జాతి మనుగడకు అలాంటి అధికరణలు అవసరమని రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు. అందువల్లనే నజీరుద్దీన్ అహ్మద్ దాన్ని ‘రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన అంశం’ అని కొనియాడారు. ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి పటిష్టమైన ఏర్పాట్లు అవసరమని కె.సంతానం వంటి వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 63 ఏళ్ల అనుభవాలు.. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. 1950 నుంచి 2014 వరకు (కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా) సుమారు 120 కంటే ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ప్రకరణను కేంద్రం రాజకీయ స్వప్రయోజనాలకే దుర్వినియోగం చేసిన సందర్భాలే ఎక్కువని ప్రతిపక్షాలు, రాజ్యాంగ నిపుణులు విమర్శించారు. 1977లో జనతాపార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలోని 9 రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం జనతాపార్టీ పాలన లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. 1984లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని అకారణంగా బర్తరఫ్ చేసి మెజారిటీ లేని నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించడం దుర్వినియోగానికి పరాకాష్టగా పేర్కొనవచ్చు. రక్షణ కవాటంగా (సేఫ్ బై వాల్యూ)గా ఉద్దేశించిన ఈ అధికరణం ఆచరణలో కేంద్రానికి అయిష్టంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ఉపయోగపడే రాజకీయ ఆయుధంగా మారడం దురదృష్టకరం. మృత శాసనమా లేదా మరణ శాసనమా? రాష్ట్రపతి పాలనను రాజ్యాంగంలో చేర్చడంపై రాజ్యాంగ పరిషత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దీనికి సమాధానం చెబుతూ ప్రకరణ.. 356 రాజ్యాంగంలో మృత శాసనంగా (డెడ్ ఆర్టికల్) ఉంటుందని, దీన్ని చాలా జాగ్రత్తగా, అతి తక్కువగా తుది ప్రత్యామ్నాయంగానే వినియోగిస్తారని భరోసా ఇచ్చారు. కానీ తర్వాతి కాలంలో దీనికి భిన్నంగా ఈ ప్రకరణ రాష్ట్రాల పాలిట మరణ శాసనంగా (డెత్ లెటర్)గా పరిణమించిందనేది జగమెరిగిన సత్యం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం పాలకులకు పరిపాటిగా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవాలి. కానీ రాజ్యాంగాన్ని రాజకీయ అవసరాలకనుగుణంగా మార్చుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించడమే అవుతుంది. ప్రపంచ ప్రజాస్వామ్య రాజ్యాంగాల్లో మరెక్కడా లేని ఈ అధికరణను రాష్ట్రపతి ఉపయోగించే రోజు బాధాకరమైంది, అవమానకరమైంది అని రాజ్యాంగ పరిషత్ సభ్యుడు హెచ్.వి.కామత్ అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ బొమ్మై కేసు - మార్గదర్శకాలు 1994లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఆర్ బొమ్మైకేసు సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కేసును ప్రకరణ 356 విషయంలో అత్యంత ప్రామాణికంగా పరిగణిస్తారు. గవర్నర్ నివేదిక రాష్ట్రంలోని వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించరాదు. రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనే అంశాన్ని శాసనసభలో మాత్రమే పరీక్షించాలి. బల నిరూపణ కోసం ముఖ్యమంత్రికి తగిన సమయం ఇవ్వాలి. పార్లమెంట్.. రాష్ట్రపతి పాలనను ఆమోదించే వరకు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయరాదు. లౌకిక తత్వానికి విఘాతం కలిగించినా లేదా దాన్ని కాపాడలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకరణ 356 ప్రకారం రద్దు చేయవచ్చు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం వేరు, రాజ్యాంగపరమైన వైఫల్యం వేరు. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందనే సాకుతో రాష్ట్రపతి పాలన విధించడం సమంజసం కాదు. ప్రకరణ 356ను ప్రయోగించడాన్ని అంతిమ ప్రత్యామ్నాయంగానే చూడాలి. రాష్ట్రంలోని పరిస్థితులను చక్కబెట్టేందుకు రాజ్యాంగంలోని ఇతర ప్రత్యామ్నాయాలైన ప్రకరణ 256, 257లను కూడా ఉపయోగించాలి. రాష్ట్రపతి పాలనను దురుద్దేశంతో విధించినా లేదా రాష్ట్రపతి పాలన విధించడానికి సమంజసమైన కారణాలు లేకపోయినా న్యాయస్థానం జోక్యం చేసుకొని రాష్ట్రపతి ఆదేశాలను కొట్టివేయవచ్చు. రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రద్దు చేసిన ప్రభుత్వాన్ని, విధానసభను పునరుద్ధరిస్తారు. దేశంలో ఎప్పుడెప్పుడు? దేశంలో ఇప్పటి వరకూ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలన ఏదో ఒక సందర్భంలో అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రాష్ట్రపతి పాలన విధించలేదు. అన్నిటి కంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత వరుసగా బీహార్, పంజాబ్‌లలో 8 పర్యాయాలు రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో 1954, నవంబర్ 15 నుంచి 1955, మార్చి 28 వరకు ఒక పర్యాయం రాష్ట్రపతి పాలన విధించారు. సారా వ్యతిరేకోద్యమం, ఆనాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. 1973లో జై ఆంధ్ర ఉద్యమ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు రాజీనామాతో 1973, జనవరి 11 నుంచి డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ) రాష్ట్రపతి పాలన విధించారు. బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
‘లా’కు చక్కటి మార్గం లాసెట్..
ప్రస్తుతం సమున్నత వృత్తిగా లీగల్ ప్రొఫెషన్ వెలుగొందుతోంది. మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్పెషలైజేషన్లతో కళకళలాడుతోంది. బ్యాంకింగ్, బీమా, టెలికం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్.. ఇలా చాలా విభాగాల్లో న్యాయ సేవల అవసరం పెరిగింది. ఆ అవసరమే కొత్త కొలువులను అందుబాటులోకి తెస్తోంది. దీంతో లా కెరీర్.. యువత ఆకర్షణీయ కెరీర్ ఆప్షన్ల జాబితాలోకి చేరింది. లాసెట్-2014 లాసెట్ (లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్). ఈ పరీక్ష ద్వారా మూడేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సు, ఐదేళ్ల ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అర్హత: మూడేళ్ల లా కోర్సుకు 10+2+3 విధానంలో 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఐదేళ్ల లా కోర్సుకు 45 శాతం మార్కులతో ఇంటర్(10+2 విధానంలో). ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది. పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మూడేళ్ల కోర్సుకు, ఐదేళ్ల కోర్సుకు సిలబస్ ఒకటే అయినప్పటికీ, ఎంపిక చేసుకున్న కోర్సును బట్టి ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. ఐదేళ్ల లా ప్రశ్నపత్రం ఇంటర్మీడియెట్ స్థాయిలో, మూడేళ్ల లా ప్రశ్నపత్రం డిగ్రీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రశ్నపత్రంలో 120 ప్రశ్నలు మూడు విభాగాల్లో ఉంటాయి. 90 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు 1.జనరల్ నాలెడ్డ్, మెంటల్ ఎబిలిటీ 30 30 2.కరెంట్ అఫైర్స్ 30 30 3.లా ఆప్టిట్యూడ్ 60 60 సిద్ధమవ్వండిలా: కరెంట్ అఫైర్స్ తేలికైన విభాగం. తక్కువ శ్రమతోనే ఎక్కువ మార్కులు సాధించేందుకు వీలుకల్పిస్తుంది. ఇందులో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ ముఖ్య పరిణామాలపై ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలు ఏదో ఒక రంగానికి పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక, సదస్సులు, అవార్డులు, ఐరాస నివేదికలు, నియామకాలు, ముఖ్య వ్యక్తులు వంటి అంశాల నుంచి వస్తాయి. ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే ప్రామాణిక దినపత్రికలు చదవాలి. జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే స్టాండర్డ్ జీకేను ప్రిపేర్ కావడం మంచిది. ఈ క్రమంలో అవార్డులు, ప్రథమ వ్యక్తులు, గ్రంథాలు-రచయితలు, సంస్థలు-ఏర్పాటు చేసిన సంవత్సరం, భారత రాజ్యాంగం వంటి అంశాలను చదవాలి. మెంటల్ ఎబిలిటీలో ప్రశ్నల క్లిష్టత ఇతర పోటీ పరీక్షల స్థాయి కంటే కొద్దిగా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగం కోసం అనాలజీ, నంబర్ సిరీస్, అల్ఫాబెట్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్ వంటి అంశాలను ప్రాక్టీస్ చేయాలి. న్యాయ విద్య అభ్యసించేందుకు అవసరమయ్యే ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు వస్తాయి. ప్రాథమిక న్యాయ సూత్రాలు, భారత రాజ్యాంగం తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి. : ఐక్యరాజ్య సమితిలోని సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యుల సంఖ్య ఎంత? ఎ) ఐదు బి) మూడు సి) ఏడు డి) రెండు పీజీ లాసెట్ పీజీ లాసెట్ (పోస్ట్‌గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష ద్వారా ఎల్ఎల్ఎం/ఎంఎల్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. అర్హత: ఎల్ఎల్బీ/బీఎల్ ఉత్తీర్ణులు. పరీక్ష విధానం: మొత్తం 120 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. వ్యవధి: 90 నిమిషాలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్లు ఉంటాయి. పార్ట్-ఎలో భాగంగా జ్యూరిస్ ప్రుడెన్స్‌పై 20, కాన్స్టిట్యూషనల్ లాపై 20 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-బిలో మర్కెంటైల్ లా; లేబర్ లా; పబ్లిక్ ఇంటర్నేషనల్ లా; క్రైమ్స్ అండ్ టార్ట్స్; ఐపీఆర్, ఇతర లాలకు సంబంధించిన ఒక్కో అంశంపై 16 ప్రశ్నలు చొప్పున మొత్తం 80 ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంటర్వ్యూ - లాసెట్ కన్వీనర్ లాసెట్, పీజీ లాసెట్-2014 కన్వీనర్ వి.ఆర్.సి.కృష్ణయ్యతో భవిత ప్రత్యేక ఇంటర్వ్యూ... ప్రస్తుతం లా కోర్సులు పూర్తిచేసిన వారికి కెరీర్ పరంగా ఎలాంటి అవకాశాలున్నాయి? లా కోర్సులు పూర్తిచేసిన వారికి ఆకాశమే హద్దుగా అవకాశాలున్నాయి. దేశవ్యాప్త న్యాయస్థానాల్లో విసృ్తత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. న్యాయవాదులుగా, నాయమూర్తులుగా అంచెలంచెలుగా ఉన్నతావకాశాలు అందుకోవచ్చు. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలో ప్రతి సంస్థకూ న్యాయ సలహాదారుల అవసరం ఏర్పడుతోంది. అందువల్ల ఆ సంస్థలు లా కోర్సులు పూర్తిచేసిన వారిని నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో లా ఆఫీసర్లుగా, ప్రభుత్వ అడ్వొకేట్లుగా, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా కెరీర్‌ను ప్రారంభించడానికి అవకాశాలున్నాయి. లాను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు ఎలాంటి నైపుణ్యాలు అవసరం? లాను కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకునే వారికి సమయస్ఫూర్తి, చురుకుదనం, భాషపై పట్టు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఈ ఏడాది లాసెట్, పీజీ లాసెట్‌కు ఎంతమంది దరఖాస్తు చేసుకునే అవకాశముంది? గతేడాది మూడేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సుకు 17,653 మంది, ఐదేళ్ల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సుకు 4,596 మంది, పీజీ లాసెట్‌కు 1712 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది వరుసగా బీఎల్/ఎల్ఎల్బీ కోర్సుకు 25 వేల మంది, పీజీకి రెండు వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశముంది. గతంలో ఓపెన్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించలేదు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏమైనా మార్పులున్నాయా? లా కోర్సుల్లో చేరాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 10+2+3 విద్యార్హతలు తప్పనిసరి. ఓపెన్ యూనివర్సిటీ విధానంలో డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉంటేనే లాసెట్ రాయడానికి అర్హులు. పదో తరగతి, డిగ్రీ పూర్తయ్యాక ఇంటర్‌ను పూర్తిచేసిన లాసెట్ రాయడానికి అర్హులు కారు. రాష్ట్రవ్యాప్త కళాశాలలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి? మూడేళ్ల బీఎల్ కోర్సుకు ఏడు యూనివర్సిటీ కళాశాలలో 450 సీట్లు, 42 ప్రైవేటు కళాశాలలో 7,060 సీట్లు ఉన్నాయి. ఐదేళ్ల బీఎల్ కోర్సుకు ఆరు యూనివర్సిటీ కళాశాలలో 370 సీట్లు, 31 ప్రైవేటు కళాశాలలో 2,960 సీట్లు ఉన్నాయి. పీజీ (ఎల్ఎల్ఎం/ఎంఎల్) కోర్సుకు 9 యూనివర్సిటీ కళాశాలలో 475 సీట్లు, 14 ప్రైవేటు కళాశాలలో 480 సీట్లు అందుబాటులో ఉన్నాయ. - బి.హరిమల్లికార్జునరెడ్డి, న్యూస్‌లైన్. ఎస్వీయూ, తిరుపతి. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 12, 2014. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2014. అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2014. వెబ్సైట్: www.aplawcet.org ఇటీవల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీ లాసెట్)- 2014 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సెట్లను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. -
వ్యక్తిత్వ పరీక్షలో విజయం సాధించాలంటే..
ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర సెంట్రల్ సర్వీసుల (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2013 మెయిన్స్ ఫలితాలను మార్చి 11న యూపీఎస్సీ విడుదల చేసింది. దాదాపు మూడు వేల మంది పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష) దశకు ఎంపికయ్యారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి జరగనున్న నేపథ్యంలో ఇందులో విజయం కోసం తుది దశ ప్రిపరేషన్ వ్యూహాలు.. ప్రఖ్యాత మనోవిజ్ఞాన శాస్త్రవేత్త హాన్స్ ఐసెంక్ ప్రకారం Personality (మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వం) అనేది వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులను తెలిపేది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థులు తనకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తించగలరా? లేదా? అనేదాన్ని తెలుసుకోవడమే పర్సనాలిటీ పరీక్ష ఉద్దేశం. ఇంటర్వ్యూ బోర్డు.. భిన్న ప్రశ్నల ద్వారా అభ్యర్థి మేధస్సును మాత్రమే కాకుండా అతని మానసిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. సివిల్స్ పరీక్ష మొత్తం 2,025 మార్కులకు ఉంటే అందులో 275 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయించారు. నచ్చిన సర్వీస్, కేడర్ చేజిక్కాలంటే ఇంటర్వ్యూలో అధిక మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూలో సాధించే ప్రతి మార్కూ అభ్యర్థి భావి కెరీర్‌ను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పర్సనాలిటీ పరీక్షలో విజయం సాధించేందుకు అభ్యర్థులకు ఉపయోగపడే మార్గాలు... అకడమిక్ అంశాలు ప్రధానం అభ్యర్థి గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌కు సంబంధించిన అంశాలపై పర్సనాలిటీ పరీక్షలో ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది. మెడిసిన్, ఇంజనీరింగ్, కామర్స్ ఇలా రకరకాల అకడమిక్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు ప్రజా సేవలో ఆయా రంగాల ఆవశ్యకత ఏమిటనే కోణంలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎంబీబీఎస్ నేపథ్యం ఉన్న అభ్యర్థిని ఇలా ప్రశ్నించవచ్చు... ‘‘ఒక జిల్లా కేంద్ర ఆసుపత్రిలో లంచాలు ఇవ్వందే వైద్య సేవలు అందడం లేదని, ప్రతి విభాగంలోనూ అవినీతి మేటలు వేసిందంటూ ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. నువ్వే కనుక జిల్లా వైద్యాధికారిగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటావు’’? సామాజిక సమస్యలపై అవగాహన పేదరికం, నిరుద్యోగం, వరకట్నం, మత ఘర్షణలు, లింగ వివక్ష వంటి ఎన్నో సమస్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఇలాంటి వాటిపై అభ్యర్థి ఎలా స్పందిస్తాడు? ఒక సమస్యను ఎదుర్కొనేందుకు తగిన మానసిక దారుఢ్యంతో పాటు ఆ సమస్య పరిష్కారానికి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అభ్యర్థికి ఉందా? అనేదాన్ని బోర్డు సభ్యులు పరిశీలిస్తారు. ఇదే కోణంలో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందువల్ల ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. వర్తమాన అంశాలు అభ్యర్థులు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలపై పట్టుసాధించాలి. రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా రాష్ట్ర విభజనకు సంబంధించి చోటుచేసుకుంటున్న సంఘటనలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ఉదా: చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి సాధ్యమని కొందరు వాదిస్తున్నారు. అలాంటప్పుడు ఈశాన్య రాష్ట్రాలు చిన్నవిగా ఉన్నప్పటికీ ఎందుకని అభివృద్ధి చెందడం లేదు? మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు పెద్దవిగా ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి కదా? అనే ప్రశ్న ఎదురుకావొచ్చు. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ తగ్గుదల వంటి ఆర్థిక సమస్యల్ని అధ్యయనం చేయాలి. దేశాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సాధించాల్సిన సమతుల్యతను పరిశీలించాలి. పొరుగుదేశాలతో భారత్ సంబంధాలతో పాటు సిరియా, ఉక్రెయిన్, అఫ్ఘానిస్థాన్‌లో అస్థిర పరిస్థితులను అధ్యయనం చేయాలి. ఆయా దేశాల్లోని పరిణామాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. నైతిక విలువలు నైతిక విలువల (Moral Values)తో కూడిన ప్రజా పాలన అద్భుత ఫలితాలు ఇస్తుంది. నైతిక విలువలు ఉన్న వ్యక్తి తన మాటల ద్వారా, పనుల ద్వారా చుట్టూ ఉండే సమాజాన్ని ప్రభావితం చేయగలడు. ప్రజా పాలనలో కీలకంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులు ఈ విలువలు కలిగి ఉండటం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే సివిల్స్ జనరల్ స్టడీస్‌లో నైతిక విలువలపై ప్రత్యేకంగా పేపర్‌ను ప్రవేశపెట్టారు. పర్సనాలిటీ టెస్ట్‌లో కూడా అభ్యర్థి నైతిక ప్రవర్తనను పరీక్షించేలా బోర్డు నుంచి ప్రశ్నలు ఎదురుకావొచ్చు. అందువల్ల ప్రభుత్వ పాలనలో నైతికత కోణంలో అభ్యర్థులు మౌఖిక పరీక్షకు సిద్ధమవాలి. సాఫ్ట్ స్కిల్స్ చుట్టూ ఆత్మస్థైర్యం, వేగంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, భావ వ్యక్తీకరణ సామర్థ్యం, విశ్లేషణా సామర్థ్యం, బృంద స్ఫూర్తి, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇలాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు అభ్యర్థి నిజాయితీగా, సమయస్ఫూర్తితో, ఒత్తిడికి తావు లేకుండా ప్రశాంత చిత్తంతో సమాధానాలు ఇవ్వాలి. ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకుంటే తెలియదని నిజాయితీగా అంగీకరించాలి. అంతేగానీ ఏదోఒకటి చెప్పి, మసిపూసి మారేడుకాయ చేయకూడదు. ప్రశ్నను బాగా వినాలి. బిగ్గరగా అరిసేటట్లు కాకుండా నిదానంగా అందరికీ వినిపించేలా సమాధానం చెప్పాలి. ఆ సమాధానంలో ఆత్మ విశ్వాసం తొణికిసలాడాలి. అభిరుచులు (Hobbies) పర్సనాలిటీ పరీక్షలో తప్పనిసరిగా అభ్యర్థి అభిరుచులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. అభ్యర్థులు పుస్తక పఠనం, క్రికెట్ ఆడటం, కవితలు రాయడం.. ఇలా రకరకాల అభిరుచులను బయోడేటాల్లో పేర్కొంటారు. వీటికి సంబంధించి వివిధ కోణాల్లో సమాచారం తెలుసుకోవాలి. ఇష్టమైన విషయానికి సంబంధించిన సమాచారం తెలియకపోతే, మిగిలిన విషయాలపై ఆసక్తి ఏముంటుంది? అని బోర్డు అభిప్రాయపడే అవకాశముంది. బోర్డు సభ్యుల్లో తప్పనిసరిగా ఒక సైకాలజిస్టు ఉంటారు. ఆయన అభ్యర్థి హావభావాలను నిశితంగా గమనిస్తాడు. సమాధానం చెప్పేతీరును పరిశీలిస్తాడు. అందువల్ల కూర్చొనే తీరులోనూ, మాట్లాడే విధానంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. బోర్డు సభ్యులు... అభ్యర్థి తన భావాలను స్వేచ్ఛగా చెప్పగలిగేలా అనువైన వాతావరణాన్ని ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి ఒత్తిడికి గురి కావాల్సిన పనిలేదు. అభ్యర్థి నుంచి ఇంటర్వ్యూ బోర్డు ఆశించే అంశాలు భావ వ్యక్తీకరణలో స్పష్టత. విశ్లేషణ సామర్థ్యం. సామాజిక, ఆర్థిక సమస్యలపై అవగాహన. వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. నైతిక విలువలు, నిజాయితీ. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం. ఆత్మ స్థైర్యం. గుర్తుంచుకోండి: మెయిన్స్‌లో అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు కూడా వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఆప్షనల్‌కు సంబంధించిన సమకాలీన అంశాలను అధ్యయనం చేయాలి. సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థి ఎంపిక చేసుకున్న టాప్ 3 సర్వీస్‌ల ప్రాధాన్యాన్ని, వాటి వర్తమాన అంశాలను తెలుసుకోవాలి. మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావడం వల్ల ఒక ప్రశ్నకు సమాధానం ఎలా చెబుతున్నాం? బలాలు, బలహీనతలేంటి? వంటి విషయాలను గుర్తించి, సరిదిద్దు కోవచ్చు. ఒక విషయంపై స్నేహి తులతో చర్చించి, వారి ద్వారా కచ్చితమైన ఫీడ్‌బ్యాక్ తీసు కోవాలి. రిఫరెన్స్: ఒకట్రెండు తెలుగు, హిందూ దినపత్రికను చదవాలి. ముఖ్యమైన అంశాలపై సొంత, ప్రభావవంతమైన అభిప్రాయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. సంపాదకీయాలను (Editorials) తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. లోక్‌సభ టెలివిజన్, రాజ్యసభ టెలివిజన్, ఎన్డీటీవీ, సీఎన్ఎన్-ఐబీఎన్ వంటి చానళ్లలో సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలపై చర్చా కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. వీటిని పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల అధికారిక వెబ్ైసైట్లలో ఆయా శాఖల వర్తమాన అంశాలు అందుబాటులో ఉంటాయి. టాపర్స్ టాక్.. తీయదనం అనే పదం సులభమైందే అయినా దాన్ని నిర్వచన రూపంలో వ్యక్తం చేయడం కష్టం. Personolity (మూర్తిమత్వం లేదా వ్యక్తిత్వం) కూడా అంతే! అలాంటి ‘పర్సనాలిటీ’ ని పరీక్షించేందుకు బోర్డు సభ్యులు రకరకాల ప్రశ్నలతో అభ్యర్థి మనస్సును మథిస్తారు. ఆ మథనం నుంచి స్వచ్ఛమైన వెన్నలాంటి వ్యక్తిత్వం బయటపడేలా అభ్యర్థి సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉండేందుకు ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ జె.మేఘనాథ్‌రెడ్డి సూచనలు.. సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్ అనేది కేవలం ప్రశ్న-సమాధానం రూపంలో ఉండే మౌఖిక పరీక్ష కాదు.. ఒకరి వ్యక్తిత్వాన్ని ఆసాంతం పరీక్షించేదన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షకు సిద్ధమవాలి. అభ్యర్థులు వెర్బల్, నాన్ వెర్బల్ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు సమ ప్రాధాన్యమివ్వాలి. సరళమైన పదాలను ఉపయోగిస్తూ సూటిగా, క్లుప్తంగా సమాధానం చెప్పడం ఎంత ప్రధానమో.. సమాధానం చెప్పేటప్పుడు కనిపించే ముఖ కవళికలు, హావభావాలు, స్వర స్థాయి, చూపులో తీక్షణత సరిగా ఉండటం కూడా ముఖ్యం. మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం, రోజూ కొంత సమయం అద్దం ముందు నిలబడి మాట్లాడటం ద్వారా ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. అభ్యర్థులు బయో డేటా (Summary Sheet)లో పేర్కొన్న ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, వాటిపై ఎలాంటి ప్రశ్న ఎదురైనా చెప్పగలిగేలా ఉండాలి. స్వస్థలం, విద్యార్హతలు, పని అనుభవం, అభిరుచులు తదితరాల నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగేందుకు అవకాశముందో విశ్లేషించుకోవాలి. అభిరుచులు, విద్యార్హతలకు సంబంధించి అనాసక్తి కనబరచడాన్ని బోర్డు తీవ్రంగా పరిగణిస్తుందన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సాధారణంగా పలానా బోర్డు మంచిదని, పలానా బోర్డు మంచిది కాదనే అపోహలు షికారు చేస్తుంటాయి. ఇలాంటి వాటిని పట్టించుకోకూడదు. అన్ని ఇంటర్వ్యూ బోర్డులూ మంచివే. అభ్యర్థులు చెప్పే సమాధానంలో నిజాయితీ, నాణ్యత, తార్కికత ప్రతిబింబించాలి. అలాంటి సమాధానం బోర్డు సభ్యులను ఆకట్టుకుంటుంది. -
పూల వ్యాపారి కొడుకు.. మెడికల్ పీజీ టాపర్
లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో పాటు దారిలో ఎదురయ్యే చేదు అనుభవాలను తట్టుకునే మనోనిబ్బరం కూడా చాలా అవసరం.. అప్పుడే ఎంతటి కఠిన లక్ష్యమైనా మనకు దాసోహమవుతుందంటున్నారు కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామ్‌డెక్) పీజీసెట్ ఫస్ట్ ర్యాంకర్ టి.అనూష్బాబు. ఆయన విజయ ప్రస్థానం ‘భవిత’తో పంచుకున్నారు.. మాది కాకినాడ. నాన్న కృష్ణ పూల వ్యాపారి. అమ్మ వెంకటరమణ గృహిణి. తమ్ముడు గౌతమ్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి, ప్రస్తుతం వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తమ సంతానంలో ఒక్కరైనా డాక్టర్ కావాలనే కోరిక అమ్మానాన్నల్లో ఉండేది. అక్క అంతగా ఆసక్తి చూపలేదు. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి జీవశాస్త్రం సబ్జెక్టు అంటే చాలా ఇష్టం. దీంతో అమ్మానాన్న నన్ను గొప్ప డాక్టర్‌ను చేయాలని అనుకున్నారు. ఆ దిశగా నన్ను ప్రోత్సహించారు. ఇంటర్మీడియెట్ తర్వాత మెడిసిన్‌లో సీటు రాకపోవడం వల్ల రెండేళ్లు విరామం వచ్చింది. ఈ సమయంలో కొందరు ‘ఎన్ని సార్లు దండయాత్ర చేస్తావంటూ’ సూటిపోటి మాటలనేవారు. అయితే అమ్మానాన్నల ప్రోత్సాహం, మంచి ర్యాంకుతో నిట్‌లో సీటు సంపాదించిన తమ్ముడి స్ఫూర్తితో కష్టపడి చదివాను. ఎంసెట్‌లో 2,196 ర్యాంకు వచ్చింది. కానీ, సీటు కేటాయింపు ఆలస్యం కావడంతో, కర్ణాటక సెట్లో 1160 ర్యాంకు రావటంతో అటు వెళ్లిపోయాను. మెడిసిన్ దిశగా అడుగులు: మంగళూరులోని కేఎస్ హెగ్డే మెడికల్ అకాడమీలో ఎంబీబీఎస్‌లో చేరాను. ఐదున్నరేళ్ల ఈ కోర్సును 67.5 శాతం మార్కులతో పూర్తిచేశాను. ఎంత మంచి స్కోర్‌తో ఎంబీబీఎస్ పూర్తిచేసినా, పోస్టు గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేయకపోతే ప్రయోజనం ఉండదు. అందుకనే ఎంబీబీఎస్ ఫస్టియర్ నుంచే సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించా. ఏ ఏడాది కోర్సులను ఆ ఏడాదే పూర్తిచేశాను. పీజీ చేయడానికి జిప్మర్ ఎంట్రన్స్ కోసం బాగా శ్రమించా. అయితే ఆ పరీక్షను సరిగా రాయలేకపోయా. ఆ ప్రిపరేషన్ కామ్‌డెక్ పీజీసెట్‌కు ఉపయోగపడింది. ఇందులో 180 మార్కులకు 145 మార్కులు సాధించి మొదటి ర్యాంకు చేజిక్కించుకున్నాను. పటిష్ట ప్రణాళిక తోడుగా: ఎంబీబీఎస్ సీటు సాధించే క్రమంలో ఎదురైన ఆటుపోట్లను దృష్టిలో ఉంచుకొని, పీజీ సీటు కోసం మొదటి నుంచి ఏకాగ్రతతో చదివాను. ఎంబీబీఎస్ పూర్తికాగానే పీజీ సీటు సంపాదించడం తపస్సు లాంటిది. సీటు రాకుంటే పడే వేదన వర్ణనాతీతం. మధ్యలో విరామం లేకుండా పీజీ పూర్తిచేయాలి. ఒకసారి మార్గం తప్పితే, గాడిలో పడటం చాలా కష్టం. అందుకే రోజూ 14 గంటల పాటు చదివేవాణ్ని. పీజీ ఎంట్రన్స్‌లో 19 సబ్జెక్టులుంటాయి. అందువల్ల అందుబాటులో ఉన్న సమయాన్ని, సబ్జెక్టుల వారీగా విభజించుకొని చదివాను. ‘‘అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మొదటి ర్యాంకు సాధించగలిగాను. పీజీ రేడియాలజీలో చేయాలా? లేదంటే జనరల్ మెడిసిన్‌లో చేయాలా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ జనరల్ మెడిసిన్‌లో చేరితే, అంకాలజీ స్పెషలైజేషన్ తీసుకుంటాను. పరిశోధనల రంగంపైనా ఆసక్తి ఉంది’’ - టి.అనూష్బాబు -
ఐఐఏ అందిస్తున్న కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) అందిస్తున్న కోర్సుల వివరాలు తెలపండి? - రఘు, మచిలీపట్నం. ఇగ్నో భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ- బెంగళూరు).. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ+పీహెచ్డీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు ఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్ సబ్జెక్టులలో అందుబాటులో ఉంది. ఈ కోర్సులో చేరేందుకు సైన్స్ లేదా ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఐఐఏ.. ఆస్ట్రనామికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎంటెక్+ పీహెచ్డీ (టెక్) కోర్సును అందిస్తోంది. అర్హత: ఆప్టిక్స్ అండ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ లేదా రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్. ఫిజిక్స్/ఎలక్ట్రానిక్ సైన్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ అప్లయిడ్ ఫిజిక్స్‌లో ఎంఎస్సీ పూర్తిచేసిన వారు కూడా అర్హులు. ఐఐఏ.. ప్రత్యేకంగా పీహెచ్డీ ప్రోగ్రామ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iiap.res.in జిప్మర్- పుదుచ్చేరి.. అందిస్తున్న కోర్సుల వివరాలు తెలియజేయండి? - భవాని, నల్గొండ. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) వివిధ రకాల కోర్సులను అందిస్తోంది. బీఎస్సీ: నర్సింగ్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, మెడికల్ రేడియో థెరఫీ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, కార్డియాక్ లేబొరేటరీ టెక్నాలజీ. అర్హత: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2. పోస్ట్ బీఎస్సీ (నర్సింగ్): క్రిటికల్ కేర్ నర్సింగ్, కార్డియాక్ థొరాసిక్ నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ నర్సింగ్, అంకాలజీ నర్సింగ్, నియోనటల్ నర్సింగ్. ఈ కోర్సులను ఏడాది కాల వ్యవధితో అందిస్తున్నారు. ఎంఎస్సీ: మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎల్టీ-మైక్రోబయాలజీ, మెడికల్ బయోమెట్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఎంఎల్టీ సైటో పాథాలజీ, మెడికల్ ఫిజియాలజీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్ కోర్సు, చైల్డ్ హెల్త్ నర్సింగ్ వంటి కోర్సులున్నాయి. మెడికల్ రికార్డ్ ఆఫీసర్, మెడికల్ రికార్డ్ ట్రైనీ, పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్, బ్లడ్ బ్యాంకింగ్ టెక్నాలజీ వంటి స్పాన్సర్డ్ లేదా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాలు: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వెబ్సైట్:jipmer.edu.in ఇంజనీరింగ్ ఫిజిక్స్‌లో బీటెక్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? - వంశీ, వరంగల్. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ప్రక్రియలో ఇమిడియున్న ఫిజిక్స్..ఇంజనీరింగ్ ఫిజిక్స్. ఇది ప్రత్యేకించి ఒక బ్రాంచ్‌కు మాత్రమే పరిమితం కాదు. అప్లయిడ్ ఫిజిక్స్ భావనలు విభిన్న అంశాల్లో పరిశోధనలకు ఉపయోగపడతాయి. కోర్సుల వివరాలు: ఐఐటీ, ఢిల్లీ.. బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+ 2. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కరిక్యులంలో ఫిజికల్ కెమి స్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆఫ్ మెటీరియల్స్, కంప్యూటర్ సైన్స్, మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్, గ్రాఫిక్ సైన్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్ తదితర అంశాలుంటాయి. వెబ్సైట్: physics.iitd.ac.in ఐఐటీ, బాంబే.. బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.phy.iitb.ac.in -
అత్యున్నత కెరీర్‌కు మార్గం సుగమం చేసే ఐసెట్
గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులకు అత్యున్నత కెరీర్ దిశగా మార్గం సుగమం చేసే కోర్సుల్లో ప్రధానమైనవి.. ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులు. మారుతున్న ఉద్యోగా వసరాలకనుగుణంగా జాబ్ మార్కెట్ డిమాండ్ మేరకు సాంకేతిక, వ్యాపార నైపుణ్యాన్ని అందించే ఈ కోర్సుల్లో చేరడానికి ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)..ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాన్ని ఖరారు చేసుకోవచ్చు. 2014 సంవత్సరానికి ఐసెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్, నిర్వహణ తీరుతెన్నులపై ఐసెట్ కన్వీనర్ ఇంటర్వ్యూ, తదితర వివరాలు.. అభ్యర్థిలోని వెర్బల్ (శాబ్దిక), మ్యాథమెటికల్ (గణిత) నైపుణ్యాలను ఒక క్రమ పద్ధతిలో పరీక్షించడానికి ఉద్దేశించిన పరీక్ష ఐసెట్. ఇందులో కచ్చితత్వానికి ప్రాధాన్యతనిస్తారు. పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. మొత్తం 200 మార్కులకు మూడు విభాగాలుగా పరీక్షను నిర్వహిస్తారు. వివరాలు.. విభాగం మార్కులు సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ డేటా సిఫీషియన్సీ 20 ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ అర్థమెటిక్ ఎబిలిటీ 35 ఆల్జీబ్రాకల్ అండ్ జీయో మెట్రికల్ ఎబిలిటీ 30 స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ వొకాబ్యులరీ 10 బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ 10 ఫంక్షనల్ గ్రామర్ 15 రీడింగ్ కాంప్రెహెన్షన్ 15 మొత్తం 200 సమయం 150 నిమిషాలు ప్రిపరేషన్ ప్లాన్: కమ్యూనికేషన్ ఎబిలిటీ: కమ్యూనికేషన్ ఎబిలిటీ విభాగాన్ని తీసుకుంటే ఇది ప్రధానంగా అభ్యర్థిలోని ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. ఇందులోని ప్రశ్నలు వొకాబ్యులరీ, ఫంక్షనల్ గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్ ఆధారంగా ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.. వొకాబ్యులరీ విభాగంలో సమాధానం గుర్తించాలంటే ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం, పట్టు సాధించడం తప్పనిసరి. అంతేకాకుండా గ్రామర్‌కు సంబంధించిన ప్రాథమిక నియమాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇడియమ్స్, ఫ్రేజెస్, సీక్వెన్సెస్ ఆఫ్ టెన్సెస్, వెర్బ్ ప్యాట్రన్స్, కొశ్చన్ ట్యాగ్స్, ఇఫ్ కండిషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ సెంటెన్సెస్ వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో ఇచ్చిన ప్యాసేజ్ను ముందుగా చదవి.. దాని నేపథ్యాన్ని విశ్లేషిస్తూ అవగాహన చేసుకోవాలి. తద్వారా సమాధానాలు గుర్తించడం సులభమవుతుంది. ప్రతిరోజూ ఇంగ్లిష్ దినపత్రికలు, మ్యాగజీన్లు చదవడం ద్వారా ఈ విభాగంలో పట్టు సాధించవచ్చు. కమ్యూనికేషన్ ఎబిలిటీలోని మరో విభాగం బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ. ఇందులో బిజినెస్, కంప్యూటర్ టెర్మినాలజీ నుంచి ఐదు ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఈ ప్రశ్నలు ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక అవగాహనను పరీక్షించే స్థాయిలో ఉంటాయి. కంప్యూటర్, బిజినెస్ రంగానికి సంబంధించి అబ్రివేషన్స్ తెలిసి ఉండా లి. ఈ విభాగం కోసం గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ అందులోని అంశాలాధారంగా మార్కెట్లో లభించే ప్రామాణిక పుస్తకాలను చదవాలి. మ్యాట్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరం. ఈ విభాగాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇందులో కనీసం 30కి పైగా మార్కులు సాధిస్తేనే మంచి ర్యాంకు సాధించవచ్చు. ప్రిపరేషన్ దృష్ట్యా కూడా ఈ విభాగం చాలా సులువైంది. ఎందుకంటే ఇందులోని ప్రశ్నలను సాధించడానికి తార్కికత అవసరం లేదు. చక్కని స్కోరింగ్ చేయడానికి ఈ విభాగాన్ని ఉపయోగించుకోవచ్చు. అనలిటికల్ ఎబిలిటీ: ఇందులో డేటా సిఫీషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. డేటా సఫిషియన్సీలో ప్రతి ప్రశ్నకు ఐ,ఐఐ అనే రెండు స్టేట్మెంట్లు ఇస్తారు. వీటి ఆధారంగా సమాధానం గుర్తించాలి. ఈ క్రమంలో స్టేట్మెంట్ ఐ అవసరమా స్టేట్మెంట్ ఐఐ అవసరమా లేదా రెండూ అవసరమా అనే అంశాన్ని అభ్యర్థి విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలు అర్థమెటిక్, జ్యామెట్రీ, బీజగణిత విభాగాల నుంచి వస్తాయి. కాబట్టి ఆయా అంశాలపై దృష్టి సారించాలి. విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగాన్ని నాలుగు ఉప విభాగాలుగా విభజించారు. అవి.. సీక్వెన్సెస్ అండ్ సిరీస్ (25 ప్రశ్నలు), డేటా అనాలిసిస్ (10 ప్రశ్నలు), కోడింగ్-డీకోడింగ్ (10 ప్రశ్నలు), డేట్ అండ్ టైమ్ ఆరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ (10 ప్రశ్నలు). వీటిల్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్‌లో అనాలజీ, నంబర్ సిరీస్, అల్ఫాబెట్ సిరీస్, క్లాసిఫికేషన్, ఆడ్‌మ్యాన్ అవుట్ వంటి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే 1-20 వరకు టేబుల్స్, 1-30 వరకు వర్గమూలాలు, 1-20 వరకు ఘనాలు, A - Z, Z - A వరకు అక్షర క్రమం (ముందు నుంచి వెనక్కు, వెనక నుంచి ముందుకు), స్థాన విలువలపై పట్టు సాధించాలి. డేటా అనాలిసిస్లో పట్టికలు, వెన్ చిత్రాలు, లాజికల్ వెన్ చిత్రాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలను సాధించాలంటే నిష్పత్తి, సగటు, శాతం వంటి అంశాలపై అవగామన తప్పనిసరి. అంతేకాకుండా పరిశీలన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇచ్చిన చిత్రాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే సమాధానాన్ని గుర్తించడం శ్రేయస్కరం. కోడింగ్-డీకోడింగ్‌లో మెరుగైన మార్కులకు A - Z, Z - A వరకు అక్షర క్రమం (ముందు నుంచి వెనక్కు, వెనక నుంచి ముందుకు), స్థాన విలువల పై పట్టు సాధించాలి. డేట్ అండ్ టైమ్‌లో సీటింగ్ ఆరేంజ్మెంట్, వయసు, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆరైవల్, డిపార్చర్, షెడూల్స్పై ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీ: అత్యంక కీలక విభాగం మ్యాథమెటికల్ ఎబిలిటీ. అభ్యర్థుల వేగాన్ని, కచ్చితత్వాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో మూడు ఉప విభాగాలు ఉంటాయి. అవి.. అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జీబ్రాకల్ అండ్ జీయో మెట్రికల్ ఎబిలిటీ,స్టాటిస్టికల్ ఎబిలిటీ. ఒక రకంగా దీన్ని ప్యూర్ మ్యాథమెటికల్ విభాగంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడంతోపాటు షార్ట్‌కట్ మెథడ్స్, కొండ గుర్తులను రూపొందించుకోవాలి. అర్థమెటికల్ ఎబిలిటీలో ఘాతాంకాలు, నిష్పత్తి, భాజనీయత సూత్రాలు, కసాగు-గసాభా, శాతాలు, ఆకరణీయ సంఖ్యలు, లాభ నష్టాలు, భాగస్వామ్యం, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యాలు, ఘనపరిమాణాలు, క్షేత్రమితి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ పరీక్షల్లోని సంబంధిత సమస్యలను సాధన చేయాలి. ఆల్జీబ్రాకల్ అండ్ జీయో మెట్రికల్ ఎబిలిటీ విభాగంలో సమితులు, సంబంధాలు, ప్రవచనాలు, బహుపదులు, ప్రమేయాలు, ద్విపద సిద్ధాంతం, వర్గ సమీకరణాలు, మాత్రికలు, శ్రేఢులు, నిరూపక జ్యామితి, త్రికోణమితి వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. వీటి కోసం 10వ తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాలను చదివితే సరిపోతుంది. పాలిసెట్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. స్టాటిస్టికల్ ఎబిలిటీలో సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆయా అంశాల్లో అభ్యర్థుల ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఇ స్తారు. సాంఖ్యక శాస్త్రం కోసం 10వ తరగతి గణిత పుస్తకాలు, సంభావ్యత కోసం 10వ తరగతి, ఆపై స్థాయి తరగతుల గణిత పుస్తకాలను చదవాలి. ఇన్ పుట్స్: లలితాబాయి, ఎస్.ఎం.ఎల్.సి. కామేశ్వర రావు. ఐసెట్-2014 నోటిఫికేషన్ సమాచారం అర్హత: ఎంబీఏ-50 శాతం మార్కులతో(రిజర్వ్ అభ్యర్థులకు 45 శాతం) బ్యాచిలర్ డిగ్రీ. ఎంసీఏ-50 శాతం మార్కులతో (రిజర్వ్ అభ్యర్థులకు 45 శాతం) బ్యాచిలర్ డిగ్రీ. 10+2 స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దూర విద్య డిగ్రీకి యూజీసీ, ఏఐసీటీఈ, డీఈసీ జాయింట్ క మిటీ గుర్తింపు ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు: రూ. 250 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 4, 2014. రూ. 500 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 15, 2014 రూ. 2,000 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 25, 2014 రూ. 5,000 లేట్ ఫీజుతో: మే 6, 2014 రూ. 10,000 లేట్ ఫీజుతో: మే 19, 2014 పరీక్ష తేదీ: మే 23, 2014 వివరాలకు: www.apicet.org.in టిప్స్ కనీసం రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష నాటికి కనీసం ఏడు మాక్ టెస్ట్‌లు రాయాలి. కనీసం 165కిపైగా మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. అప్పుడే మంచి కాలేజీలో సీటు సాధించవచ్చు. బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ వాడాలి గతేడాది మాదిరిగానే ఈసారీ కాకతీయ యూనివర్సిటీ ఐసెట్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత నిర్వహణ ఏర్పాట్లపై ఐసెట్-2014 కన్వీనర్ ప్రొఫెసర్ కె. ఓంప్రకాశ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఐసెట్ -2014 ఏర్పాట్లు: ఐసెట్‌ను సక్రమంగా సకాలంలోనే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో భాగంగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. గతంతో పోల్చితే ఈసారి కొన్ని మార్పులు చేశాం. గతంలో నెల రోజుల ముందుగానే దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేది. ఆతర్వాత వచ్చే దరఖాస్తులను అనుమతించే వాళ్లం కాదు. కానీ ఈసారి వారం రోజుల ముందు కూడా అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. ఎంతమంది హాజరు కాబోతున్నారు? గత ఏడాది ఐసెట్ -2013లో 1,39,314 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 1.50 లక్షల దరఖాస్తులు రావొచ్చని అంచనా. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసేటప్పుడు నిబంధనలు చదివి దరఖాస్తును క్షుణ్నంగా పూరించాలి. ఆన్లైన్ దరఖాస్తులో అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాన్ని స్పష్టంగా పేర్కొనాలి. హాల్‌టికెట్లు, ర్యాంకు కార్డులు ఆన్లైన్ ద్వారా డౌన్లోడు చేసుకోవాలి. కొత్తగా మార్పులు: ఖమ్మం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల్లోని ఏజెన్సీల అభ్యర్థుల కోసం ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో మరో పరీక్షా కేంద్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేశాం. మే రెండోవారం కల్లా ఐసెట్ నిర్వహణకు రీజినల్ కోఆర్డినేటర్లను నియమించే ప్రక్రియ పూర్తి చేస్తాం. అభ్యర్థులు ప్రధానంగా గమనించాల్సిన మార్పు.. గతంలో ఓఎంఆర్ షీట్లో సమాధానాలను గుర్తించేందుకు పెన్సిల్‌ను వినియోగించాల్సి ఉండేది. కానీ ఈసారి నుంచి అభ్యర్థులు సమాధానాలను గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. దరఖాస్తు సమయంలో తప్పులు దొర్లితే? దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు దొర్లితే హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేశాక కూడా కొన్ని అంశాలను సవరించుకునే అవకాశం ఉంది. అయితే పేరు, ఇతర అంశాలకు సంబంధించిన సవరణలు మాత్రమే అనుమతిస్తాం. పరీక్షాకేంద్రం, హెల్ప్‌లైన్ సెంటర్‌ను మాత్రం మార్చుకునే వీల్లేదు. ఏవైనా సందేహాలు ఉంటే కన్వీనర్ పేరిట ఉన్న ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఫలితాలు ఎప్పుడు? మే 26వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తాం. కీ విషయంలో జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. జూన్ 9వ తేదీన ఫలితాలను, ఫైనల్ ‘కీ’ కూడా విడుదల చేస్తాం. అభ్యర్థులకు సూచనలు ? పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. బ్లూ లేదా బ్లాక్ పాయింట్పెన్ను మాత్రమే వినియోగించుకోవాలి. ఓఎంఆర్‌షీట్‌లో అన్నికాలాలను పూరించాలి. ఏమైనా ఇతర సమాచారం కోసం convernericet2014 @gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. - డి.రమేష్, న్యూస్‌లైన్, కేయూ క్యాంపస్. -
పంచాయతీ కార్యదర్శి కటాఫ్ 240-250?
మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏపీపీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించింది. ఇటీవల విడుదలైన వీఆర్వో పరీక్ష ఫలితాల్లో వందకు వంద మార్కులు రావడంతో పంచాయతీ కార్యదర్శి పరీక్ష కటాఫ్‌పై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి ప్రశ్నపత్రాల తీరుతెన్నులు, కటాఫ్ అంచనాలపై నిపుణుల విశ్లేషణ.. పంచాయతీ కార్యదర్శి పరీక్షకు 8.14 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 71 శాతం మంది హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 71.21 శాతం మంది హాజరుకాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 (గ్రామీణాభివృద్ధి)కు 70.83 శాతం మంది హాజరయ్యారు. పేపర్-1లో వచ్చిన మూడు ప్రశ్నలు స్వల్ప తేడాతో రెండో పేపర్లోనూ వచ్చాయి. అవి.. 1.బెరి బెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? (పేపర్-1); బి-విటమిన్ లోపం వల్ల సంక్రమించే వ్యాధి? (పేపర్-2). 2.ఏ కమిటీ సూచనల ఆధారంగా నాబార్డ్‌ను స్థాపించారు? (పేపర్-1); నాబార్డ్ సంస్థను ఏ కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించారు? (పేపర్-2). 3.భారతదేశ ఏ రెండు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట ప్రవేశపెట్టారు? (పేపర్-1); రాజస్థాన్‌తో పాటుగా మొట్టమొదట పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభమైన మరో రాష్ట్రం? (పేపర్ 2). పేపర్ 1 (జీఎస్): జనరల్ స్టడీస్ పేపర్లో ఐదారు ప్రశ్నలు తప్ప, మిగిలిన ప్రశ్నలన్నీ తేలిక నుంచి మధ్యస్థాయి (Easy to Moderate) కాఠిన్యత ఉన్నవే. చాలా వరకు ప్రశ్నలు నేరుగా వచ్చాయి. భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?; సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది?; చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యోమగామి ఎవరు? వంటి ప్రశ్నలు ఈ కోవకు చెందుతాయి. ఇందులో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విభాగం నుంచి ఏకంగా 37 ప్రశ్నలు వచ్చాయి. వర్తమాన వ్యవహారాల నుంచి 19 ప్రశ్నలు వచ్చాయి. జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి సింహ భాగం ప్రశ్నలు (దాదాపు 42) వచ్చాయి. గ్రూప్స్, జేఎల్ వంటి పోటీ పరీక్షలకు పకడ్బందీగా సిద్ధమవుతున్న వారు జీఎస్ పేపర్లో 135 వరకు స్కోర్ చేస్తారనడంలో సందేహం లేదు. విపత్తుల నిర్వహణ విభాగం నుంచి ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలు గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల్లో పదేపదే వచ్చినవే. ఉదా: సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది? 1) కటక్ 2) న్యూఢిల్లీ 3) విశాఖపట్నం 4) మదురై జవాబు: 2 ఉదా: ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టాన్ని భారత్‌లో చేశారు? 1) 2003 2) 2004 3) 2005 4) 2006 జవాబు: 3 పేపర్ 2 (గ్రామీణాభివృద్ధి): పరీక్షకు సంబంధించిన పేపర్-2 (గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంత సమస్యలు) సిలబస్‌లో అయిదు అంశాలను పేర్కొన్నారు. అయితే ప్రశ్నపత్రం రూపకల్పనలో వీటికి సమ ప్రాధాన్యం ఇవ్వలేదు. అకౌంటింగ్‌కు సంబంధించి 28 వరకు ప్రశ్నలు వచ్చాయి. ఇవి ఇంటర్, డిగ్రీలో కామర్స్ చదువుకున్న వారు మాత్రమే సమాధానాలు గుర్తించేలా ఉన్నాయి. పేపర్-1 బాగా రాసి, ఉత్సాహంగా పేపర్-2కు హాజరైన వారు ఇందులోని అకౌంటింగ్ ప్రశ్నల సంఖ్య, అడిగే తీరును చూసి నిరాశచెందారు. పదాలు పూర్తిగా కొత్తవి కావడంతో, ప్రశ్నను సైతం అర్థం చేసుకోలేని స్థితిలో ఉండటంతో కామర్స్ నేపథ్యం లేని అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారు. ఉదా: జంట పద్దు విధానంలో ఖాతా పుస్తకాల నమోదు, నిల్వలు తేల్చడంలో దొర్లిన అంకగణిత కచ్చితత్వాన్ని కనుక్కోవడానికి ఈ కింది దాన్ని తయారు చేస్తారు? 1) నగదు పుస్తకం 2) చిట్టా 3) అంకణా 4) బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ జవాబు : 3 ఉదా: రూ.5 వేలు జీతాల చెల్లింపు అంకణాలో క్రెడిట్ వైపు చూపారు. అప్పుడు అంకణాలోని డెబిట్ వైపు 1) రూ.5 వేలు తగ్గుతుంది 2) రూ.5 వేలు అధికంగా చూపుతుంది 3) రూ.10 వేలు తగ్గుతుంది 4) రూ.10 వేలు అధికంగా చూపుతుంది. జవాబు: 3 పంచాయతీరాజ్ హవా! అందరూ ఊహించినట్లుగానే పేపర్-2లో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ- రాజ్యాంగం; స్థానిక సంస్థల నిర్మాణం- విధులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. ఉదా:1)పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని సంవత్సరాల కొకసారి ఎన్నికలు జరపాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది? 2)మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ మూడు ఉన్నాయి? గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో ప్రధానమైన వ్యవసాయం- అనుబంధ రంగాల గురించి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఒకే అంశానికి సంబంధించి నాలుగైదు ప్రశ్నలు వచ్చాయి. విటమిన్లకు సంబంధించి సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ఏది?; ‘ఎ’ విటమిన్ ఆహారంలో లోపిస్తే దెబ్బతినే అవయవం ఏది?; సి విటమిన్ ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తుంది? బి విటమిన్ లోపం వల్ల సంక్రమించే వ్యాధి ఏది? అనే ప్రశ్నలు వచ్చాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల విప్లవాలపై ఆరు ప్రశ్నలు వచ్చాయి. వీటిలో హరిత విప్లవానికి సంబంధించి రెండు, శ్వేత విప్లవం నుంచి రెండు, నీలి విప్లవం నుంచి ఒకటి, యెల్లో విప్లవం నుంచి ఒకటి ప్రశ్నలు వచ్చాయి. కటాఫ్ అంచనా పేపర్-1లో 130-135 మార్కులు తెచ్చుకునే అవకాశముంది. అదే విధంగా రెండో పేపర్లో 110-115 మార్కులు స్కోర్ చేయొచ్చు. దీన్నిబట్టి మొత్తంమీద కటాఫ్ 240-250 (300 మార్కులకు) ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మార్కులు సాధించిన వారు పోటీలో నిలిచేందుకు అవకాశముందంటున్నారు. ఇంటర్ పాఠ్యపుస్తకాల్లోనివే అకౌంటింగ్ ప్రాథమిక అంశాల విభాగంలో వచ్చిన ప్రశ్నల్లో చాలా వరకు ఇంటర్మీడియెట్ కామర్స్ తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నవే. అయిదారు ప్రశ్నలు సీబీఎస్ఈ 11, 12 తరగతి పుస్తకాల్లో ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ స్థాయిలో కామర్స్ చదువుకున్న వారికి ఈ విభాగం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. - కురుహూరి రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ. డేటా ఇంటర్‌ప్రిటేషన్, అకౌంటింగ్ కీలకం! పోటీ పరీక్షల ప్రశ్నపత్రం ఎప్పుడూ సమతూకంగా ఉండాలి. ఏదో ఒక విభాగం వారికి ప్రయోజనం చేకూరేలా ఉండకూడదు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా నిర్దేశించారు. అలాంటప్పుడు అందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి. కానీ, పరీక్షలో ఏకంగా 28 ప్రశ్నలు అకౌంటింగ్‌కు సంబంధించినవి ఉన్నాయి. అవి కూడా జనరల్‌గా కాకుండా పూర్తిగా టెక్నికల్‌గా ఉన్నాయి. కామర్స్ నేపథ్యమున్న విద్యార్థులు మాత్రమే వాటికి సమాధానాలు రాయగలరు. అదే విధంగా సిలబస్‌లో ‘సమకాలీన సమాజంలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలు- అణగారిన వర్గాల సమస్యలు’ అంశాన్ని పేర్కొన్నారు. కానీ, ఈ విభాగం నుంచి చాలా తక్కువ ప్రశ్నలు వచ్చాయి. మొత్తంమీద పేపర్-1లో డేటా ఇంటర్‌ప్రిటేషన్, పేపర్-2లో అకౌంటింగ్లో మంచి స్కోర్ చేసిన వారు తుది జాబితాలో నిలిచే అవకాశముంది. - బి.కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీసర్కిల్. డిగ్రీ అర్హతతో గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్‌తో పోల్చితే ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి పేపర్-1 భిన్నంగా ఉంది. దాదాపు అన్ని ప్రశ్నలూ నేరుగా వచ్చాయి. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. పేపర్-1లో 140 మార్కుల వరకూ స్కోర్ చేయొచ్చు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తప్పనిసరిగా స్టాండర్డ్ జీకేపై పట్టు సాధించాలి. - ఎన్.విజయేందర్‌రెడ్డి, జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలన్న కోరిక ఉన్నప్పటికీ చాలా మంది.. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తారు. అయితే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించే దిశగా సాగిపోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో విజేతల జాబితాలో చోటు లభిస్తుంది. ఎక్కువ మంది గ్రూప్స్‌ను లక్ష్యంగా పెట్టుకుంటారు. కొత్త నోటిఫికేషన్లు రావడానికి మరికొన్ని నెలలు ఆగాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించేందుకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పోటీలో ముందువరుసలో ఉండొచ్చు. ఎన్ని గంటలు చదవాలి: ప్రిపరేషన్‌కు ఎవరెన్ని గంటలు కేటాయించాలనేది వారివారి చేతుల్లోనే ఉంటుంది. వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారు, ఫ్రెషర్స్ తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. జనరల్ స్టడీస్ పట్టుపట్టాలి: డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఎంపీడీవో, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డీఎల్, జేఎల్ వంటి ఉన్నత స్థాయి పోస్టుల నుంచి జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల వరకు నిర్వహించే పరీక్షల్లో జనరల్ స్టడీస్ కీలకపాత్ర పోషిస్తుంది. గ్రూప్స్‌తో పాటు వివిధ పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో జీఎస్‌కు ప్రత్యేక పేపర్ ఉంటుంది. ఓ ప్రణాళిక ప్రకారం చదివితే ఇందులో అత్యధిక మార్కులు సంపాదించవచ్చు. జీఎస్‌లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, మెంటల్ ఎబిలిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్‌లకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలను చదివి, సొంతంగా నోట్స్ రూపొందించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నోట్స్‌ను చదివిన తర్వాత ఇతర ఏ ప్రామాణిక మెటీరియల్‌ను అయినా త్వరగా చదివేందుకు, తేలిగ్గా అర్థం చేసుకునేందుకు అవకాశముంటుంది. అప్డేట్.. అసలైన ఆయుధం: ఏ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులైనా సిలబస్‌లోని విషయాలకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకోవడం (అప్డేట్) ప్రధానం. దీనికోసం ఒకట్రెండు దిన పత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పోటీ పరీక్షల డిస్క్రిప్టివ్ పేపర్లలో అత్యధిక మార్కులు సాధించాలంటే రైటింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం. దీనికోసం అభ్యర్థులు తక్కువ సమయంలో ఎగ్జామినర్ ఆశించిన సమాధానం రాయాలంటే ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి. -
10వ తరగతి బయాలజీ బిట్ బ్యాంక్
జీవన విధానాలు కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ 1.కార్బోహైడ్రేట్లలో ఉండే శక్తిని విడుదల చేసే క్రియ ----------. 2.అన్ని జీవక్రియల్లో ---------- ముఖ్యమైన జీవక్రియ. 3.కిరణజన్య సంయోగక్రియలో---------- వాయువు విడుదలవుతుంది. 4.విద్యుదయస్కాంత వికిరణంలో ---------- కంటికి కనిపించే కాంతి కంటే ఎక్కువ ధైర్ఘ్య తరంగాలుంటాయి. 5.ఆకుపచ్చని మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియను పరీక్షించే సమయం----------. 6.వాయువుల మార్పిడి, నీటి ఆవిరిని ఆకుల నుంచి నియంత్రించేవి----------. 7.---------- దొంతరలను గ్రానా అంటారు. 8.కిరణజన్య సంయోగక్రియలో పత్రహరిత అణువు ---------- చెందుతుంది. 9.అయోడిన్‌ను ---------- కలిగి ఉందని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. 10. కాంతి మీద ఆధారపడే జీవ రసాయన చర్య ----------. 11.మెల్విన్ కాల్విన్---------- పై పరిశోధనలు చేసి నోబెల్ బహుమతిని పొందారు. 12.మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకంటే ----------. 13.---------- అనే జీవక్రియ జీవుల జాతిని శాశ్వతంగా ఉంచడానికి సహాయపడుతుంది. 14.కంటికి కనిపించే కాంతి తరంగ ధైర్ఘ్యం----------. 15.కాంతి కిరణాలలో ఉండే శక్తిని ----------అంటారు. 16.శ్వాసక్రియ చెందే పదార్థాన్ని ---------- అంటారు. 17.మైటోకాండ్రియాలో ఉండే లోపలి ముడుతలను ---------- అంటారు. 18.ఆక్సిజన్ లేకుండా సూక్ష్మ జీవులు జరిపే శ్వాసక్రియను ---------- అంటారు. 19.చాలా రకాల బాక్టీరియాలు ఆక్సిజన్ లేనప్పుడు ---------- ఆమ్లాల్ని ఉత్పత్తి చేస్తాయి. 20.గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ----------. 21.ఫలాలను శీతల స్థలంలో ఉంచినపుడు ---------- రేటు తగ్గుతుంది. 22.ఒక గదిలో ఫలాలను ---------- ఉష్ణోగ్రత మధ్య ఉంచితే అవి తొందరగా పక్వానికి వస్తాయి. 23.గ్లూకోజ్ ఆక్సీకరణంలో మొదటి దశను ---------- అంటారు. 24.సిట్రిక్ ఆమ్లం ఏర్పడేందుకు ఎసిటైల్ కొ ఎంజైమ్ అ, నాలుగు కర్బన పరమాణువులు గల ---------- పదార్థంలో చేరుతుంది. 25.అఖ్కీలో ఎక్కువ శక్తి ---------- అకర్బన అణువుతో నిల్వ అయి ఉంటుంది. 26.అఈ్కకి శక్తిమంతమైన ఫాస్పేట్ కలయికను ---------- అంటారు. 27.గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం ----------. 28.అఖ్కీని విస్తరించగా ----------. 29.ఆక్సీకరణ చెందడానికి కణ శ్వాసక్రియలో ఆహార పదార్థాలు ---------- రూపంలో ఉండాలి. 30.---------- క్రియను జంతువులు జరపలేవు. 31.గ్లైకాలసిస్ తుది దశలో ఏర్పడే ఆమ్లం ----------. 32.వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం ----------. 33.మైటోకాండ్రియాలను ---------- అని కూడా అంటారు. 34.కిరణజన్య సంయోగక్రియలో నిలవ ఉండే శక్తి ---------- నుంచి లభిస్తుంది. 35.ఆక్సీకరణ భాస్వీకరణం ----------లో జరుగుతుంది. 36.అమీబాలో శ్వాసక్రియ ---------- పద్ధతి ద్వారా జరుగుతుంది. 37.కప్పలో నాశికలు ---------- లోకి తెరచుకుంటాయి. 38.వానపాములో హిమోగ్లోబిన్ రక్తంలోని----------లో ఉంటుంది. 39.బొద్దింక రక్తం ---------- గా ఉంటుంది. 40.చర్మ శ్వాసక్రియ ---------- లో జరుగుతుంది. 41.వానపాములో శరీర కుహర ద్రవం ---------- ద్వారా బయటకు వస్తుంది. 42.వాయునాళాలు ఉన్న జీవి ----------. 43.ఉపరికుల గల జీవి ----------. 44.స్వరపేటికను ---------- అని కూడా అంటారు. 45.మానవుడిలో గాలిగొట్టాన్ని శాస్త్రీయంగా---------- అంటారు. 46.మానవుడిలో వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్థి ఉంగరాల ఆకారం ----------. 47.కంఠబిలం మీద మూతలా పనిచేసే నిర్మాణం ----------. 48.స్త్రీలలో ---------- శ్వాసకదలికల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 49. పురుషుల్లో ---------- శ్వాసకదలికల్లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. 50.వాయుగోణులు --------- ల పరిమాణాలు. 51.కప్ప చర్మం ఎండిపోతే అది ---------. 52.బొద్దింకలో శ్వాస రంధ్రాల సంఖ్య ---------. 53.బొద్దింకలో --------- శ్వాసేంద్రియాలు. 54.వానపాములో శ్వాసక్రియ ---------ద్వారా జరుగు తుంది. 55.పుపుస శ్వాసక్రియ --------- ద్వారా జరుగుతుంది. సమాధానాలు 1) శ్వాసక్రియ; 2) కిరణజన్య సంయోగక్రియ; 3) ఆక్సిజన్; 4) పరారుణ కిరణాలు; 5) మొక్కను 2-3 గంటలు సూర్యకాంతిలో ఉంచిన తర్వాత; 6) పత్ర రంధ్రాలు; 7) థైలకాయిడ్; 8) ఆక్సీకరణం; 9) పిండి పదార్థం; 10) కిరణజన్య సంయోగ క్రియ; 11) కార్బన్ స్థాపన (నిష్కాంతి చర్య); 12) అవి ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి; 13) ప్రత్యుత్పత్తి; 14) 400ఝ 700ఝ; 15) క్వాంటం శక్తి; 16) శ్వాసక్రియాధారాలు; 17) క్రిస్టే; 18) కిణ్వనం; 19) లాక్టిక్; 20) 300 సెంటీగ్రేడ్ నుంచి 400 సెంటీగ్రేడ్; 21) శ్వాసక్రియ; 22) 450 సెంటీగ్రేడ్; 23) గ్లైకాలసిస్; 24)ఆక్సాలో ఎసిటికామ్లం; 25) మూడో; 26) పాస్ఫోరిలేషన్; 27) 2 అఖ్కీలు; 28) ఎడినోసిన్ ట్రై పాస్ఫేట్; 29)గ్లూకోజ్; 30) కిరణజన్య సంయోగ క్రియ; 31) పైరువిక్ ఆమ్లం; 32) 0.03-0.04 శాతం; 33) శక్తి ఉత్పాదక కేంద్రాలు; 34) సూర్యకాంతి; 35) మైటోకాండ్రియా; 36) విసరణ/వ్యాపనం; 37) ఆస్యకుహరం; 38) ప్లాస్మా; 39) తెలుపు; 40) వానపాము/ కప్ప/ సాలమండర్; 41) పృష్ట రంధ్రాలు; 42) బొద్దింక (కీటకాలు); 43) అస్థి చేప; 44) శబ్దపేటిక; 45) వాయునాళం; 46) ‘ఇ’; 47) ఉపజిహ్వక/కొండ నాలుక; 48) పక్కటెముకలు; 49) ఉదర వితానం; 50) ఊపిరితిత్తులు; 51) చర్మం ద్వారా శ్వాసక్రియ జరపలేదు 52) 10 జతలు; 53) వాయునాళాలు; 54) చర్మం; 55) ఊపిరితిత్తులు. రవాణా వ్యవస్థలు, మానవ హృదయ నిర్మాణం 1ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా--------- ద్వారా జరుగుతుంది. 2.రక్త రవాణా వ్యవస్థలో --------- పంపు చేసే సాధనం. 3.కప్ప హృదయంలో కర్ణికలకు వెనుకగా --------- ఉంటుంది. 4.సరీసృపాల హృదయంలో --------- అసంపూర్ణంగా విభజన చెందిన గది. 5.ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే హృదయాన్ని --------- అంటారు. 6.ఏక ప్రసరణ రక్త ప్రసరణ వ్యవస్థ---------లో కని పిస్తుంది. 7.శోష రసం --------- వ్యవస్థకి చెందుతుంది. 8.ఎర్రరక్త కణాలు లేని జీవి---------. 9.బొద్దింకలో --------- కండరాలు రక్తాన్ని హృదయంలోకి పంపడానికి సహాయపడతాయి. 10.ఉభయ జీవుల్లో మహాసిరలు కలిసి --------- ని ఏర్పాటు చేస్తాయి. 11.రక్త కోటరాలు ఉన్న జంతువు ---------. 12.13 గదుల హృదయం ఉన్న జంతువు ---------. 13.మెగాస్కోలెక్స్లో --------- ముఖ్య సిరగా పనిచేస్తుంది. 14.మెగాస్కోలెక్స్లో--------- ముఖ్య ధమనిగా పని చేస్తుంది. 15.స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ --------- లో ఉంటుంది. 16.నీలి రంగు రక్తం కలిగిన జంతువులు ---------. 17.పుపుస మహా ధమని --------- నుంచి బయలుదేరు తుంది. 18.మానవుడిలో సామాన్య రక్తపీడనం --------- ఉంటుంది. 19.మానవుడి సామాన్య రక్తపీడనం 120/80లో పై సంఖ్య --------- పీడనాన్ని తెలుపుతుంది. 20.హృదయానికి ఆమ్లజని సహిత రక్తాన్ని తెచ్చేవి ---------. 21.---------లో అడ్డంకులేర్పడితే గుండెపోటు సంభవిస్తుంది. 22.ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలకు మధ్య కవాటం ---------. 23.బి.పి.ని కొలిచే పరికరం ---------. 24.శరీరంలో పైభాగాల నుంచి రక్తాన్ని---------సేకరిస్తుంది. 25.మానవ శరీరంలో --------- అతి పెద్ద ధమని. 26.గ్రద్వయ కవాటానికి మరోపేరు ---------. 27.హృదయంలోని కవాటాలను వాటి స్థానంలో ఉంచ డానికి తోడ్పడే బంధన కణ జాల తంతువులను --------- అంటారు. 28.ఊపిరితిత్తులకు, హృదయానికి మధ్య జరిగే రక్త ప్రసరణను --------- వలయం అంటారు. 29.హృదయానికి, శరీర అవయవాలకు మధ్య జరిగే రక్త ప్రసరణను ____ వలయం అంటారు. 30.రెండు వలయాల్లో రక్తాన్ని పంపు చేసే హృదయాన్ని ____ అంటారు. సమాధానాలు 1) విసరణ/ వ్యాపనం; 2) హృదయం; 3) జఠరిక; 4) జఠరిక; 5) పుపుస హృదయం; 6) చేపల; 7) రవాణా; 8) వానపాము; 9) పక్షాకార; 10) సిరాసరణి; 11) బొద్దింక (కీటకాలు); 12) బొద్దింక; 13) పృష్ట రక్త నాళం; 14) ఉదర రక్తనాళం; 15) కీటకాలు; 16) పీత, నత్త; 17) కుడి జఠరిక; 18) 120/80; 19) సిస్టోల్; 20) పుపుస సిరలు; 21) హృదయ ధమని; 22) అగ్రద్వయ కవాటం; 23) స్ఫిగ్మో మానోమీటరు; 24) పూర్వ మహాసిర; 25) దైహిక మహా ధమని; 26) మిట్రల్ కవాటం; 27) స్నాయు రజ్జువులు; 28) పుపుస; 29) దైహిక; 30) ద్వి వలయ ప్రసరణ హృదయం. రక్తం - దాని అంశాలు, రక్త వర్గాలు 1.శరీరంలో ------------- ద్రవరూపంలో ఉండే కణజాలం. 2.------------- రక్తంలోని మాతృక. 3.రక్తం గడ్డకట్టడంలో -------------ప్రముఖ పాత్ర వహిస్తాయి. 4.------------- ద్రావణాన్ని సెలైన్ అంటారు. 5.రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతం-------------. 6.రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ------------- చూస్తుంది. 7.రక్తం గడ్డకట్టినప్పుడు, దానిమీద ఉండే స్పష్టమైన ద్రవాన్ని ------------- అంటారు. 8.రక్తంలోని హెమోగ్లోబిన్ ------------- ని------------- మోసుకు పోతుంది. 9.ఎర్రరక్త కణాల ఉత్పత్తిని ------------- అంటారు. 10.ఎర్రరక్త కణాలు ------------- కలిగి ఉండటం వల్ల ఎర్రగా ఉంటాయి. 11.చిచిచిలను శరీరంలోని సూక్ష్మ రక్షక భటులు అంటారు. 12.------------- తెల్ల రక్తకణాల అన్నింటిలోనూ అతి చిన్నవి. 13.కేంద్రకం లేని రక్తకణం -------------. 14.------------- వంటి క్షీరదాల ఎర్ర రక్తకణంలో కేంద్రకం ఉంటుంది. 15.ప్లాస్మాలో సుమారు ------------- శాతం కర్బన రసాయనా లుంటాయి. 16.అతిపెద్ద తెల్ల రక్తకణాలు -------------. 17.‘’ ఆకారంలో ఉండే కేంద్రకం ఉన్న రక్త కణం-------------. 18.రెండు తమ్మెల కేంద్రకం ఉన్న రక్తకణం-------------. 19.అనేక తమ్మెలు కలిగిఉన్న కేంద్రకం ఉన్న రక్తకణం-------------. 20.మూత్రపిండం ఆకారంలో ఉన్న కేంద్రకం ఉన్న రక్త కణం -------------. 21.ఎర్ర రక్తకణాల జీవితకాలం సుమారు -------------. 22.తెల్ల రక్తకణాల జీవిత కాలం-------------. 23.తెల్ల రక్తకణాలన్నింటి కంటే ------------- సంఖ్య చాలా తక్కువ. 24.తెల్ల రక్తకణాలన్నింటి కంటే ------------- సంఖ్య చాలా ఎక్కువ. 25.శరీరంలో ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించేవి -------------. 26.’అఆ’ రక్త వర్గం ఉన్న వ్యక్తులను------------- అంటారు. 27.’ై’ రక్త వర్గం గల వ్యక్తులను------------- అంటారు. 28.ఒక వ్యక్తి రక్తం మరొక వ్యక్తికి అతని సిర ద్వారా ఎక్కించడాన్ని ------------- అంటారు. 29.అత్యవసర పరిస్థితుల్లో రక్త వర్గం తెలియనప్పుడు రక్త గ్రహీతకు ------------- రక్త వర్గాన్ని ఇవ్వొచ్చు. 30.’AB’ రక్త వర్గం ఉన్న వ్యక్తులను విశ్వ గ్రహీతలు అనడానికి కారణం -------------. 31.కారల్ లాండ్ స్టీనర్ ------------- కనిపెట్టారు. 32.ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి ------------ ద్వారా ఎక్కిస్తారు. 33.ప్రతిజనకాలు ’అ’, ’ఆ’ రెండూ లేని రక్త వర్గం------------. 34.రక్త గుచ్ఛకరణానికి కారణమైన చర్య ------------. 35.రక్తంలో ప్రతిరక్షకాలుండే స్థానం ------------. 36.రక్తంలో ప్రతిజనకాలుండే స్థానం ____. సమాధానాలు 1) రక్తం; 2) ప్లాస్మా; 3) రక్త ఫలకికలు; 4) 0.9% సోడియం క్లోరైడ్; 5) 0.85-0.9%; 6) హిపారిన్; 7) సీరం; 8) ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్; 9) ఎరిత్రోపాయిసిస్; 10) హిమోగ్లోబిన్; 11) న్యూట్రోఫిల్స్; 12) లింఫోసైట్స్; 13) ఎరిత్రోసైట్స్; 14) ఒంటె; 15) 6-8; 16) మోనోసైట్స్; 17) బేసోఫిల్స్; 18) ఇస్నోఫిల్స్; 19) న్యూట్రోఫిల్స్) 20) మోనోసైట్స్; 21) 120 రోజులు; 22) 12-13 రోజులు; 23) బేసోఫిల్స్; 24) న్యూట్రోఫిల్స్; 25) ఇస్నోఫిల్స్; 26) విశ్వ గ్రహీతలు; 27) విశ్వదాతలు; 28) రక్త ప్రవేశనం; 29) ’ై’ రక్త; 30) అన్ని రకాల రక్త వర్గాల నుంచి రక్తాన్ని గ్రహించడం వల్ల; 31) రక్త వర్గాలను; 32) సిర; 33) ’ై’; 34) ప్రతిజనకం- ప్రతిరక్షకం చర్య; 35) ప్లాస్మా; 36) ఎర్ర రక్తకణాలు. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.జీవక్రియ అంటే ఏమిటి? కొన్ని జీవక్రియల పేర్లు రాయండి? 2.శక్తిని విడుదల చేయడానికి ఏ జీవక్రియ ముఖ్యమైంది? 3.కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యే కారకాలు ఏమిటి? 4.కిరణజన్య సంయోగక్రియకు అవసరమయ్యే కారకాలను, దాని తుది ఉత్పత్తులు చూపే సమీకరణాన్ని రాయండి? 5.చర్యా కేంద్రం అంటే ఏమిటి? 6.విద్యుదయస్కాంత వికిరణంలోని ఇతర భాగాలను పేర్కొనండి? 7.శ్వాసక్రియాధారాలు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలివ్వండి? 8.శ్వాసక్రియను నిర్వచించండి లేదా శక్తిని విడుదల చేయడానికి ఏ జీవక్రియ ముఖ్యమైంది? 9.అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అంటే ఏమిటి? 10.కిణ్వనం అంటే ఏమిటి? 11.శ్వాసక్రియ ఎన్ని రకాలు? అవి ఏవి? 12.ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియనేమంటారు? 13.జల శ్వాసక్రియ అంటే ఏమిటి? 14.కేంద్రక పూర్వ జీవులలో మైటోకాండ్రియా ఉండకపోయినా శక్తి ఏ విధంగా ఏర్పడుతుంది? 15.శక్తికి సంబంధించినంత వరకు కిరణజన్య సంయోగ క్రియకు, శ్వాసక్రియకు బేధం ఏమిటి? 16.రక్తం తెల్ల రంగులో ఉండే రెండు జంతువులను పేర్కొనండి? 17.బొద్దింకలో రక్తం రవాణాలో తోడ్పడదు? కారణ మేంటి? 18.సిరల్లో కంటే ధమనుల్లో ఎక్కువ పీడనం ఎందు కుంటుంది? 19.అగ్రద్వయ కవాటానికి మరో పేరు ఏమిటి? 20.మిట్రల్ కవాటం అంటే ఏమిటి? దాని పని ఏమిటి? 21.ఎక్కువ మొత్తాల్లో కొలెస్ట్రాల్ తీసుకున్నందు వల్ల కలిగే నష్టం ఏమిటి? 22.సీరం అంటే ఏమిటి? 23.హెమటాలజీ అంటే ఏమిటి? 24.ప్లాస్మా, సీరం కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? 25.సెలైన్ అంటే ఏమిటి? 26.ఎరిత్రోపాయిసిస్ అంటే ఏమిటి? 27.రక్త ప్రవేశనమంటే ఏమిటి? 28.విశ్వదాతలంటే ఎవరు? ఎందుకంటారు? 2 మార్కులు: 1.కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి? 2.ఆక్సీకరణ, క్షయకరణలలో భేదాల గురించి రాయండి? 3.ఎలక్ట్రాన్ గ్రహీత అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణ లివ్వండి? 4.మండుట లేదా దహనక్రియ, శ్వాసక్రియల మధ్య భేదాలు రాయండి? 5.రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచిన పండ్లు, కూరగాయలు, గుడ్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి? కారణమేమిటి? 6.గ్లైకాలసిస్ గురించి క్లుప్తంగా రాయండి? 7.వాయునాళం ముడుచుకుపోకుండా ఎలా ఉండగలు గుతుంది? 8.శక్తికి సంబంధించినంత వరకు కిరణజన్య సంయోగ క్రియకు, శ్వాసక్రియకు మధ్య భేదం ఏమిటి? 9.కాంతి భాస్వీకరణానికి, ఆక్సీకరణ పాస్ఫోరిలేషన్కు మధ్య భేదం ఏమిటి? 10.ఉభయ జీవుల్లో సిరాసరణి ఎలా ఏర్పడుతుంది? 11.గుండెపోటు అంటే ఏమిటి? దీనివల్ల కలిగే నష్టం ఏమిటి? 12.ఒక వ్యక్తి బి.పి 120/80 అని రాశారు. ఇది వేటిని తెలుపుతుంది? 13.హృదయ స్పందన గురించి క్లుప్తంగా రాయండి? 14.ఎర్ర రక్తకణాల స్మశాన వాటిక అని దేనినంటారు? 15.రక్త ప్రవేశనం ఎలా చేస్తారు? రక్తాన్ని ఎవరు దానం చేయొచ్చు? 16.రక్త గుచ్ఛకరణం గురించి క్లుప్తంగా రాయండి? 17.విశ్వదాతలు అని ఎవరినంటారు? విశ్వ గ్రహీతలు అని ఎవరినంటారు? 4 మార్కులు: 1.కిరణజన్య సంయోగక్రియకు కార్బన్ డై ఆక్సైడ్ అవసరమని ఎలా నిరూపిస్తావు? 2.కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ స్థాపన గురించి వివరించండి? 3.కిరణజన్య సంయోగక్రియకు కాంతి లేదా వెలుతురు అవసరమని ఎలా నిరూపిస్తావు? 4.కిరణజన్య సంయోగక్రియలో విడుదలైన వాయువు ఆక్సిజన్ అని నిరూపించే ప్రయోగం రాయండి? 5.శ్వాసక్రియలో వేడిమి విడుదలవుతుందని ఎలా చూపించగలం? 6.మైటోకాండ్రియా నిర్మాణాన్ని పట సహాయంతో వివరించండి? 7.అవాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ మధ్య భేదాలను పట్టిక రూపంలో రాయండి? 8.కిరణజన్య సంయోగక్రియకు, శ్వాసక్రియకు మధ్య భేదాలను రాయండి? 9.కుడి, ఎడమ జఠరికల మధ్య భేదాలను రాయండి? 10.కుడి, ఎడమ కర్ణికల మధ్య భేదాలను రాయండి? 11.అధిక రక్త పీడనం అంటే ఏమిటి? అది ఎలా కలుగుతుంది? ఇది కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేవి? 12.ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల మధ్య తేడాలేవి? 13.మానవుడిలో వివిధ రక్త వర్గాలను వర్ణించండి? 5 మార్కులు (పటాలు): 1.ఆకు అడ్డుకోత పటం గీసి, భాగాలు గుర్తించండి? 2.కిరణజన్య సంయోగక్రియకు, ఆకు అనుకూలమైన నిర్మాణం పటం గీసి, భాగాలు గుర్తించండి? 3.మైటోకాండ్రియా నిర్మాణం చూపే పటం గీసి, భాగాలను గుర్తించండి? 4.మానవుడి ఊపిరితిత్తుల పటం గీసి, భాగాలను గుర్తించండి? 5.మానవ హృదయం కవాటాల స్థానాన్ని చూపే పటం గీసి, భాగాలను గుర్తించండి? 6.మానవ హృదయం అంతర్నిర్మాణం పటం గీసి, భాగాలు గుర్తించండి? నియంత్రణ- సమన్వయం మొక్కలు, జంతువులలో రసాయనిక సమన్వయం 1.పరిసరాల్లో కలిగే మార్పులకు ఒక జీవి అనుక్రియ చూపే లక్షణాన్ని ------------ అంటారు. 2.మొక్కలలో పెరుగుదల పదార్థాలుంటాయని మొదటి సారిగా ప్రతిపాదించింది ------------. 3.మొక్కల్లో ఆక్సిన్లు తయారయ్యే స్థలం ------------. 4.ఆక్సిన్లు వేర్ల ------------ ను ప్రోత్సహిస్తాయి. 5.ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం పేరు ------------. 6.జిబ్బరెల్లా ప్యూజికొరై వరి పంటలో ------------ వ్యాధిని కలిగిస్తుంది. 7.అనిషేక ఫలాలు అంటే ------------ ఫలాలు. 8.కొన మొగ్గ పార్శ్వపు మొగ్గలను అదుపు చేయడాన్ని ------------ అంటారు. 9.పత్రాలు, ఫలాలు రాలడం ------------ అనే హార్మోన్ వల్ల జరుగుతుంది. 10.వాయువుల మార్పిడి, ఆకు నుంచి ఆవిరి రూపంలో బయటకు పోయే నీటిని నియంత్రించేది ------------. 11.ప్రత్యేకంగా కణ విభజనను ప్రోత్సహించే హార్మోన్ పేరు ------------. 12.మొక్కల్లో నీరు నష్టపోకుండా సహకరించే హార్మోన్ ------------. 13.ఫలాలు ముందుగా పక్వానికి వచ్చేందుకు ------------ రసా యనం సహకరిస్తుంది. 14.పొట్టి మొక్కలను పొడవు చేయడంలో ------------ ప్రముఖ పాత్ర వహిస్తాయి. 15.ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం అనే రసాయన యౌగికాన్ని సాధారణంగా ------------ అని అంటారు. 16.వినాళ గ్రంథులు వాటి స్రావాలను ------------ లోకి విడుదల చేస్తాయి. 17.మెదడులో వాయునాళానికి దగ్గరగా ఉండే గ్రంథిని ------------ అంటారు. 18.రక్తంలో ------------ పరిమాణం తక్కువైనప్పుడు గ్లూకగా న్ స్రవిస్తుంది. 19.పిండ ప్రతిస్థాపనకు సహాయపడే హార్మోన్ ------------. 20.గ్లైకోజన్‌ను గ్లూకోజుగా మార్చే హార్మోన్ ------------. 21.------------ ని మిశ్రమ గ్రంథి అంటారు. 22.కార్టిసాల్ అనే హార్మోన్‌ను స్రవించేది ------------. 23.అవయవాలను సమన్వయపరిచే రసాయన పదార్థాల ను ------------ అంటారు. 24.తగినంత మొత్తాల్లో వాసోప్రెస్సిన్ ఉత్పత్తి కాకపోతే ------------ వ్యాధి కలుగుతుంది. 25.ఆహారంలో తగినంత అయోడిన్ లేకపోతే ------------ గ్రంథి పరిమాణంలో పెద్దదవుతుంది. 26.పారాథార్మోన్ అధికంగా ఉత్పత్తి అయితే అది ------------ అనే స్థితికి దారి తీస్తుంది. 27.జరాయువు ఏర్పడటంలో సహాయం చేసే హార్మోన్‌ను ------------ అంటారు. 28.శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథి ------------. 29.నాడీ మండలానికి, అంతస్రావీ గ్రంథి వ్యవస్థకు వారధిలా పని చేసే గ్రంథి ____. 30.____ లోపం వల్ల డయాబెటిస్ మిల్లిటస్ వ్యాధి కలుగుతుంది. 31.____ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం. 32.మానసిక ఉద్రేకాలను కలిగించే హార్మోన్ ____. సమాధానాలు 1) క్షోభ్యత; 2) చార్లెస్ డార్విన్; 3) విభాజ్య కణాలు; 4) పెరుగుదలను; 5) 2,4-ఈ; 6) తెలివి తక్కువ మొలక; 7) విత్తనాలు లేని ఫలాలు; 8) అగ్రాధిక్యత; 9) అబ్సిసిక్ ఆమ్లం; 10) అబ్సిసిక్ ఆమ్లం; 11) సైటోకైనిన్; 12) అబ్సిసిక్ ఆమ్లం; 13) ఇథైలిన్; 14) జిబ్బరెల్లిన్లు; 15) ఆక్సిన్; 16) రక్తం; 17) అవటు గ్రంథి; 18) గ్లూకోజ్; 19) ప్రోజెస్టిరాన్; 20) గ్లూకాగాన్, 21) క్లోమం; 22) అడ్రినల్ గ్రంథి; 23) హార్మోనులు; 24) డయాబిటస్ ఇన్సిపిడస్; 25) అవటు; 26) టిటాని; 27) ప్రోజెస్టిరాన్, 28) పీయూష గ్రంథి; 29) పీయూష గ్రంథి; 30) థైరాక్సిన్; 31) ఇన్సులిన్, 32) ఎడ్రినలిన్. మానవ నాడీ వ్యవస్థ 1.శరీరానికి లోపల, వెలుపల జరిగే మార్పులను గ్రహించే వ్యవస్థ -----------. 2.నాడీ మండలం, శరీరం లోపల, వెలుపల జరిగే మార్పులను ----------- ద్వారా గ్రహిస్తుంది. 3.నాడీ కణాలకు ----------- కణాలు, పోషక పదార్థాన్ని అందజేస్తాయి. 4.వార్తలను గ్రహించి, వాటిని సంశ్లేషించి, సమన్వయ పరిచే ముఖ్య కేంద్రం -----------. 5.నాడీ కణ దేహం నుంచి వార్తలను తీసుకొని పోయే భాగాన్ని ----------- అంటారు. 6.నాడీ కణదేహంలో ----------- అనే కణికలుంటాయి. 7.పోలియో వంటి వ్యాధుల్లో వైరస్‌తో నశించేవి ----------- నాడీ కణాలు. 8.నిస్సల్ కణికలు గల కణాలు -----------. 9.ఒక క్రమంలో మైలీన్ తొడుగులో ఉండే ఖాళీలను ----------- అంటారు. 10.-----------నాడులు, మెదడు, వెన్నుపాము నుంచి వార్తలను కండరాలకు తీసుకుపోతాయి. 11.జ్ఞానాంగాల నుంచి ప్రచోదనాలు మెదడు లేదా వెన్నుపాముకు----------- నాడుల ద్వారా చేరుతాయి. 12.శరీరంలో టెలిఫోన్ వైర్లలా పనిచేసే నిర్మాణాలు-----------. 13.నాడీకణం ఉద్దీపనాలకు గురైనప్పుడు ఉత్పత్తయ్యే విద్యుత్ -----------. 14.నాడీ కణ దేహానికి మరొక పేరు -----------. 15.శరీరంలో టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ లేదా రిలేస్టేషన్ మాదిరి పనిచేసే నిర్మాణం -----------. 16.మానవుడిలో మెదడు ఉండే అస్థికలతో తయారైన పెట్టెను ----------- అంటారు. 17.మెదడులోని కణాలకు ----------- పోషక పదార్థాలను అందజేస్తుంది. 18.హృదయ స్పందనలు ----------- కపాల నాడి ఆధీనంలో ఉంటాయి. 19.మెదడును కప్పి ఉంచే వెలుపలి, మధ్య పొరల మధ్య ఉండే ద్రవం -----------. 20.మెదడును కప్పి ఉంచే బయటి పొర -----------. 21.మెదడును కప్పి ఉంచే లోపలి పొర -----------. 22.మస్తిష్కం ఉపరితల వైశాల్యాన్ని వృద్ధి చేసేవి -----------. 23.మానవునిలో వెన్నునాడుల జతల సంఖ్య -----------. 24.మానవునిలోని కపాలనాడుల జతల సంఖ్య-----------. 25.మానవుడిలో పరిధీయ నాడుల జతల సంఖ్య-----------. 26.ముందు మెదడుని-----------అని కూడా అంటారు. 27.మెదడులో అతిపెద్ద భాగం-----------. 28.మస్తిష్కంలో వెలుపలి బూడిద రంగు భాగాన్ని----------- అంటారు. 29.మస్తిష్కార్థ గోళాలకు దిగువున ఉండే మెదడు భాగాన్ని ----------- అంటారు. 30.మెదడులో శరీరం, వివిధ చర్యలను నియంత్రించే ఉన్నత కేంద్రం -----------. 31.ముందు, మధ్య మెదడులను కలిపే మెదడు భాగం -----------. 32.వెన్నుపాము అడ్డుకోతలో ఏ ఆకారంలో ఉండే పదార్థం -----------. 33.వెన్నునాడులన్నీ ----------- నాడులు. 34.మెదడు ఉపరితలం మీద ఉండే గట్ల వంటి వాటిని ----------- అంటారు. 35.గైరీల మధ్య ఉండే గాడులను----------- అంటారు. 36.శరీరం సమతాస్థితిని, భూమి మీద శరీరం ఉండే స్థితులను నిర్వహించేది -----------. 37.శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్త పీడనం వంటి అతి ముఖ్య చర్యలను నియంత్రించే కేంద్రాలు ----------- లో ఉంటాయి. 38.ఆకస్మికంగా, మనకు తెలియకుండా జరిగి, ఆపద నుంచి రక్షించే చర్యలను ----------- చర్యలంటారు. 39.ఉద్దీపనాల సమాచారాన్ని వెన్నుపాములోని ----------- విశ్లేషిస్తాయి. 40.నిబంధన సహిత ప్రతిచర్యలపై ----------- అనే రష్యా శాస్త్రవేత్త పరిశీలన చేశారు. 41.మన జాతీయ గీతాన్ని వినగానే, మనం లేచి నిలబడటం ఒక ----------- చర్య. 42.1990 నుంచి 2000 సంవత్సరం వరకు గల దశాబ్దాన్ని ----------- అంటారు. 43.శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు -----------. 44.అసంకల్పిత ప్రతీకార చర్య నిర్మాణాత్మక, క్రియాత్మక యూనిట్‌ని ----------- అంటారు. 45.అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలోని ____ ఆధీనంలో ఉంటాయి. 46.జంతురాజ్యంలో అతి క్లిష్టమైన నిర్మాణంగా పరిగ ణించేది ____. 47.మానవుని మెదడులో____ బిలియన్లకు పైగా నాడీ కణాలుంటాయి. 48.మానవుడు తీసుకొనే మొత్తం ఆక్సిజన్‌లో మెదడు ____ శాతం ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది. సమాధానాలు 1) నాడీ వ్యవస్థ; 2) గ్రాహకాలు; 3) గ్లీయల్; 4) మెదడు; 5) ఏగ్జాన్; 6) నిస్సల్ కణికలు; 7) చాలక; 8) నాడీ కణాలు; 9) రన్వీర్ కణుపులు; 10) చాలక; 11) జ్ఞాన; 12) నాడులు; 13) 55 మిల్లీ వోల్టులు; 14) సైటాన్/ పెరికార్యా; 15) వెన్నుపాము; 16) కపాలం; 17) మస్తిష్క మేరుద్రవం; 18) 10వ వేగస్; 19) మస్తిష్క మేరుద్రవం; 20) వరాశిక; 21) మృద్వి; 22) గైరి; 23) 31 జతలు; 24) 12 జతలు; 25) 43 జతలు; 26) మస్తిష్కం; 27) మస్తిష్కం; 28) మస్తిష్క వల్కలం; 29) ద్వారగోర్థం; 30) మస్తిష్కం; 31) ద్వారగోర్థం; 32) బూడిద రంగు పదార్థం; 33) మిశ్రమ; 34) గైరీ; 35) సల్సి; 36) అనుమస్తిష్కం; 37) మజ్జాముఖం; 38) అసంకల్పిత ప్రతీకార; 39) మధ్యస్థ నాడీకణాలు; 40) ఇవాన్పావ్లోవ్; 41) నిబంధన సహిత; 42) మెదడు; 43) రెండు శాతం; 44) ప్రతీకార చర్యాచాపం; 45) వెన్నుపాము; 46) మెదడు; 47) 10; 48) 2. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.అగ్రాధిక్యం అంటే ఏమిటి? 2.ఒక మొక్క చివరి భాగాన్ని కత్తిరిస్తే ఏమవుతుంది? దానికి కారణమేమిటి? 3.విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఏ రసాయన పదార్థం ఉపయోగిస్తారు? 4.ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడానికి ఉపయోగించే రసాయనం ఏది? 5.క్షోభ్యత అంటే ఏమిటి? 6.మిశ్రమ గ్రంథి అంటే ఏమిటి? ఉదాహరణనివ్వండి? 7.సింపుల్ గాయిటర్ ఎందుకు ఏర్పడుతుంది? 8.నిర్వాహక కణజాలం అంటే ఏమిటి? 9.డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే ఏమిటి? 10.ఇన్సులిన్ నిర్వర్తించే పని ఏమిటి? 11.నిస్సల్ కణికలు అంటే ఏమిటి? ఇవి ఎక్కడుంటాయి? 12.సైనాప్స్ అంటే ఏమిటి? 13.మెదడును కప్పి ఉంచే పొరలేవి? 14.అసంకల్పిత ప్రతీకార చర్యలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి? 15.ప్రతీకార చర్యాచాపం అంటే ఏమిటి? 16.మెదడు దశాబ్దం అని దేన్ని అంటారు? 17.ప్రతీకార చర్యలు అంటే ఏమిటి? 2 మార్కులు: 1.మొక్కల్లో పెరుగుదల నియంత్రణ పదార్థాలంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి? 2.అగ్రాధిక్యం అంటే ఏమిటి? అది మొక్కలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? 3.టిటాని గురించి క్లుప్తంగా రాయండి? 4.వినాళ గ్రంథులు అంటే ఏమిటి? వివరించండి? 5.డయాబెటిస్ మిల్లిటస్ లేదా మధుమేహ వ్యాధి గురించి క్లుప్తంగా రాయండి? 6.ఈస్ట్రోజన్ చేసే పనులేవి? 7.ప్రొజెస్టిరాన్ చేసే పనులేవి? 8.ఏక్జాన్, డెండ్రైట్‌ల మధ్య భేదాలేవి? 9.అపవాహి, అభివాహి నాడుల మధ్య భేదాలేవి? 10.క్రియాత్మక కరెంట్ లేదా నాడీ ప్రచోదనం అంటే ఏమిటి? 11.ఏక్జాన్, డెండ్రైట్లను ఎలా గుర్తుపడతారు? 12.గెరీ, సల్సి అంటే ఏమిటి? వీటి వల్ల కలిగే ఉపయోగం ఏమిటి? 13.వెన్నుపాము విధులేవి? 14.మస్తిష్కమేరు ద్రవం ఎక్కడ ఉంది? దాని విధులేమిటి? 15.మానవుడి మెదడు ఏ విధంగా అఘాతాల నుంచి రక్షణ పొందుతుంది? 16.ఏదైనా వేడి వస్తువు మీ చేతిని తాకితే వెంటనే మీకు తెలియకుండానే చేతిని ఎలా వెనుకకు తీసుకుంటారో తెలియజేయండి? 17.ప్రతీకార చర్యా చాపం గురించి క్లుప్తంగా రాయండి? 4 మార్కులు: 1.మొక్కల్లో సైటోకైనిన్ల ప్రభావం ఏమిటి? 2.ఆక్సిన్లు అంటే ఏమిటి? అవి మొక్కల పెరుగుదలను ఎలా ప్రభావితం చేస్తాయి? 3.మొక్కల పెరుగుదల అభివృద్ధిలో జిబ్బరెల్లిన్‌ల పాత్ర ఏమిటి? 4.మొక్కల పెరుగుదల పదార్థాలు ఒకదానికొకటి సహకరిస్తాయి (లేదా) అవి ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేస్తాయి. - ఈ వాక్యాన్ని సమర్థించడానికి కొన్ని ఉదాహరణలివ్వండి? 5.శరీరంలో పీయూష గ్రంథి ప్రాముఖ్యం ఏమిటి? ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్లను పేర్కొని, వాటి చర్యలను తెలపండి? 6.అధివృక్క గ్రంథుల గురించి రాయండి? 7.నాడీ కణాన్ని పటం సహాయంతో వర్ణించండి? 8.మానవ మస్తిష్క నిర్మాణాన్ని వివరించండి? 9.వెన్నుపాము నిర్మాణం గురించి క్లుప్తంగా రాయండి? 10.ప్రతీకార చర్యాచాపంలో భాగాలు, వాటి చర్యలను తెలపండి? 11.నిబంధన సహిత, నిబంధన రహిత ప్రతిచర్యలకు భేదాలను రాయండి? ప్రత్యుత్పత్తి మొక్కల్లో అలైంగిక, లైంగిక ప్రత్యుత్పత్తి 1.అలంకరణకు, ఉద్యానవన మొక్కల అభివృద్ధికి ఉపయోగించే ప్రత్యుత్పత్తి విధానం ---------. 2.చామంతి మొక్క సాధారణంగా --------- ద్వారా వ్యాప్తి చెందుతుంది. 3.రణపాలాకు మీద ఉండే మొగ్గలను --------- అంటారు. 4.కాండం ఛేదనంలో కాండానికి ఏటవాలు గాయం చేసే స్థలం ---------. 5.ఈస్ట్‌లో సాధారణంగా జరిగే అలైంగికోత్పత్తి విధానం ---------. 6.కరివేప, వేప మొక్కల్లో శాఖీయోత్పత్తికి తోడ్పడేవి ---------. 7.మొక్క కణం నుంచి పూర్తిగా ఒక మొక్క ఏర్పడే శక్తిని --------- అంటారు. 8.--------- వర్థన యానంలో ఉపయోగించి సామాన్యంగా ఏకస్థితిక మొక్కలను తయారు చేస్తారు. 9.లైంగికోత్పత్తిలో తర్వాత తరం మొక్కల్లో కొత్త లక్షణాలు ఏర్పడటానికి కారణం ---------. 10.జాతి పరిణామక్రియలో ప్రకృతి వరణానికి ఎక్కువగా సహాయపడేది ---------. 11.బ్యాక్టీరియా, యూగ్లీనాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ---------. 12.ఆస్పర్ జిల్లస్లో --------- అనే నిర్మాణం చివర సిద్ధబీజాలు ఏర్పడతాయి. 13.కణజాల వర్థనంలో ఏ మొక్క నుంచి కణాలను వేరు చేసి తీస్తామో దానిని --------- అంటారు. 14.కణజాల వర్థనాల్లో ఎక్స్‌ప్లాంట్ కణాలు విభజన చెందడం వల్ల ఏర్పడిన నిర్దిష్ట ఆకారం లేని కణజాలాన్ని --------- అంటారు. 15.అండాశయంలో పెరగని పిండాలను వర్థన యానంలో పెంచడాన్ని --------- అంటారు. 16.కణజాల వర్థన విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త---------. 17.కణజాల వర్థనం ద్వారా మన దేశానికి చెందిన శాస్త్రజ్ఞులు --------- ఏకస్థితిక మొక్కల్ని పెంచవచ్చని నిరూపించారు. 18.పురుష సంయోగబీజం, స్త్రీ బీజంతో సంయోగం చెందిన తర్వాత ఏర్పడే కణాన్ని --------- అంటారు. 19.లైంగిక ప్రత్యుత్పత్తికి ముఖ్యంగా అవసరమయ్యే పుష్పభాగాలు ---------. 20.పుష్పంలో మూడో వలయంలో---------అమరి ఉంటుంది. 21.3 కేంద్రకం --------- కేంద్రకంతో, పురుష కేంద్రకం పిండకోశంలో కలవడం వల్ల ఏర్పడుతుంది. 22.ఫలదళాలు --------- లో ఉంటాయి. 23.పరాగ మాతృకణంలో --------- విభజన జరుగుతుంది. 24.పురుష సంయోగ బీజం --------- తో సంయోగం చెందితే అంకురచ్ఛద కేంద్రకం ఏర్పడుతుంది. 25.ఫలదీకరణం చెందిన తర్వాత కూడా ఉపయోగపడే పుష్ప భాగం ---------. 26.బాగా ఏర్పడిన పిండంలో వేరుభాగాన్ని సూచించేది ---------. 27.పిల్లతరంలో జన్యువైవిధ్యం ఉండటానికి సాధార ణంగా --------- ప్రత్యుత్పత్తిని ఆచరిస్తారు. 28.--------- విభజన వల్ల రెండు జనకుల ఉత్పత్తి కణాల్లో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య సగానికి తగ్గుతుంది. 29.పుప్పొడి రేణువుల అధ్యయనాన్ని --------- అంటారు. 30.అండంలోని కణజాలాన్ని --------- అంటారు. 31.అండాశయంలో ఉబ్బిన భాగం నుంచి అండాలు పెరిగే భాగం పేరు ---------. 32.పిండకోశంలో ఫలదీకరణం చెందే సమయంలో ద్వయస్థితికలో ఉండే భాగం---------. 33.ఫలదీకరణం చెందిన తర్వాత మొదటిసారిగా ఉండే ద్వయస్థితిక భాగం---------. 34.పిండకోశంలో పరాగనాళం స్త్రీ బీజకణం దగ్గరకు కదిలేటట్లు సహాయపడేవి---------. సమాధానాలు 1) శాఖీయోత్పత్తి; 2) పిలకమొక్కల; 3) పత్రోపరిస్థిత కోరకాలు; 4) కణుపు కింద భాగం; 5) కోరకీభవనం; 6) వేరుమొగ్గలు; 7) టోటిపొటెన్సీ; 8) పరాగ రేణువులను; 9) క్రోమోజోమ్‌లు; 10) లైంగికోత్పత్తి; 11) ద్విధావిచ్ఛిత్తి; 12) కొనిడియోఫోర్; 13) ఎక్స్‌ప్లాంట్; 14) కాల్లస్; 15) పిండసంరక్షణ; 16) హెబర్‌లాండ్; 17) షిప్రగుహ, సతీష్ మహేశ్వరి; 18) సంయుక్త బీజం; 19) కేశరావళి, అండకోశం; 20) కేసరావళి; 21) ద్వితీయ; 22) అండకోశం; 23) క్షయకరణ; 24) ద్వితీయ కేంద్రకం; 25) అండం; 26) ప్రథమ మూలం; 27) లైంగిక; 28) క్షయకరణ; 29) సిద్ధబీజ శాస్త్రం; 30) అండంతః కణజాలం; 31) అండన్యాసస్థానం; 32) ద్వితీయ కేంద్రకం; 33) సంయుక్త బీజం; 34) సినర్జీడ్లు. జంతువుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి 1.పేరమీషియం --------- ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది. 2.వానపాములో ఫలదీకరణం --------- లో జరుగుతుంది. 3.ఈగలో --------- ఫలదీకరణం చెందిన అండాల విడుదలలో సహాయపడుతుంది. 4.కప్పలోని ఏంప్లక్సరీ మెత్తలు--------- లో తోడ్పడతాయి. 5.బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులు---------. 6.సంయోగం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవి ---------. 7.సంయోగం ఒక ---------. 8.ద్విధావిచ్ఛితి వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి పేరమీషియం జరిపే చర్య---------. 9.పేరమీషియంలో సూక్ష్మ కేంద్రకం ఆధీనంలో ఉండే చర్య ---------. 10.మెగాస్కోలెక్స్లో ముష్కాలు ఉండే ఖండితాలు---------. 11.వానపాములో శుక్రగ్రాహికలో నిల్వ చేసేవి ---------. 12.కప్పలో మూత్ర జననేంద్రియ నాళంగా పనిచేసే నాళం ---------. 13.కప్ప మిల్ట్లో ఉండేవి---------. 14.కప్ప స్పాన్‌లో ఉండేవి---------. 15.పురుష బీజకణాన్ని --------- అంటారు. 16.అంతర ఫలదీకరణంలో --------- స్త్రీ జీవి శరీరంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. 17.వానపాము వేరొక వానపాము నుంచి గ్రహించిన శుక్రకణాలను---------లో నిల్వచేస్తుంది. 18.స్వరకోశాలు --------- కప్పలో ఉంటాయి. 19.కప్ప అండంలో వర్ణక పదార్థంతో నల్లగా ఉండే భాగాన్ని --------- అంటారు. 20.కప్ప అండంలో పీతకం ఉండే తెల్లని భాగాన్ని --------- అంటారు. 21.సంయుక్త బీజం జరిపే విభజనలు ---------. 22.పేరమీషియంలో శారీరక చర్యలను నియంత్రించే కేంద్రకం ---------. 23.ఒక సంయోగకం ఉత్పత్తి చేసే పిల్ల జీవుల సంఖ్య ---------. 24.వానపాములో గుడ్లతిత్తిని ఏర్పాటు చేసేది---------. 25.సంపర్కంలో తోడ్పడే ఏంప్లక్సరీ మెత్తలు ఉన్న జంతువు ---------. 26.అండకణంలోనికి చొచ్చుకొని పోయేందుకు ఉపయోగపడే శుక్రకణ నిర్మాణం---------. 27.వానపాములో క్లైటెల్లమ్లో ఉబ్బి ఉన్న ఖండితాలు ____. 28.లైంగిక ద్విరూపకత చూపే జంతువులు ____. సమాధానాలు 1) సంయోగం; 2) గుడ్లకోశం; 3) అండశబిక; 4) సంపర్కం; 5) కప్ప, చేప; 6) పేరమీషియం; 7) లైంగిక ప్రత్యుత్పత్తి; 8) సంయోగం; 9) ప్రత్యుత్పత్తి; 10) 10, 11; 11) శుక్రకణాలు; 12) మూత్రనాళం; 13) శుక్ర కణాలు; 14) అండాలు; 15) శుక్రకణం; 16) శుక్రకణాలు; 17) శుక్రగ్రాహిక; 18) మగ; 19) జాంతవ ధృవం; 20) బృహత్ఖండ ధృవం; 21) సమ విభజనం; 22) స్థూల కేంద్రకం; 23) 4 24) క్లైటెల్లమ్; 25) మగ కప్ప; 26) ఏక్రోజోమ్, 27) 14 నుంచి 17 ఖండితాలు; 28) వానపాము, జలగ. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ 1.మూడో నెల గర్బధారణ నుంచి పిండాన్ని ....... అంటారు. 2.ప్రతిస్థాపనంలో పిండం ....... కుడ్యానికి అంటిపెట్టుకుంటుంది. 3.పిండం కణ వృద్ధి కోసం అది ....... కణవిభజన పద్ధతిని అవలంబిస్తుంది. 4.శుక్రకణానికి ఉండే ....... ఫలదీకరణలో సహాయ పడుతుంది. 5.పౌరుష గ్రంథి మానవ ....... వ్యవస్థలో ఒక అనుబంధ గ్రంథి. 6........ నిర్మాణంలో గ్రాఫియన్ పుటికలు ఉంటాయి. 7.పుటిక నుంచి విడుదలయ్యే అండం....... లోకి ప్రవేశిస్తుంది. 8.స్త్రీలలో ఒకసారి విడుదలయ్యే అండాల సంఖ్య....... . 9.ముష్కాలను ఉత్పత్తి చేసే హార్మోన్ ....... . 10.భ్రూణం, గర్భాశయ కుడ్యానికి ....... ద్వారా అంటి పెట్టుకుంటుంది. 11.రుతు చక్రాన్ని అదుపుచేసే హార్మోన్లు ....... పూర్వ లంబిక నుంచి ఉత్పత్తి అవుతాయి. 12........ లో ఉండే గ్రాఫియన్ పుటికలు ....... విడుదల చేస్తాయి. 13.ముష్కం....... ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే నిర్మాణం. 14.శుక్రోత్పాదిక నాళికలు ఉన్న అవయవం....... 15.శుక్రోత్పాదిక నాళికల నుంచి శుక్రకణాలు ....... లోకి ప్రవేశిస్తాయి. 16.ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తి చేసే నిర్మాణం....... 17.ల్యూటినైజింగ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే నిర్మాణం ....... . 18.శుక్ర కణాలు చలించడానికి అవసరమైన శక్తిని ....... ఉత్పత్తి చేస్తుంది. 19.పగిలిన పుటికను....... అంటారు. 20.పుటిక పగిలిన తర్వాత అది కార్పస్లూటియమ్గా మారడాన్ని ప్రోత్సహించేది....... 22.యాంత్రిక అఘాతాల నుంచి పిండానికి రక్షణనిచ్చేవి ....... . 23.మానవులలో గర్భావధి కాలం సుమారు ....... . 24.భారత ప్రభుత్వం బాల్య వివాహాల అదుపు చట్టాన్ని ....... సంవత్సరంలో ప్రవేశపెట్టింది. 25.స్త్రీ బీజ కోశంలో సంచిల్లాంటి నిర్మాణాలను ....... అంటారు. 26.గ్రాఫియన్ పుటిక నుంచి అండం విడుదలవడాన్ని ....... అంటారు. 27.స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే మార్పుల చక్రాన్ని ....... అంటారు. 28.గర్భధారణ జరిగిన 12వ వారానికి....... ఏర్పడుతుంది. 29.శుక్ర కణానికి ఉండే ఏక్రోజోమ్ శారీరక ....... చర్యల్లో తోడ్పడుతుంది. 30.స్త్రీలలో ఫలదీకరణ జరిగే భాగం ....... . సమాధానాలు 1) భ్రూణం; 2) గర్భాశయ; 3) సమ; 4) ఏక్రోజోమ్; 5) ప్రత్యుత్పత్తి; 6) అండాల; 7) ఫెల్లోపియన్ నాళం; 8) 1; 9) టెస్టోస్టిరాన్; 10) జరాయువు; 11) పీయూష గ్రంథి; 12) అండకోశాల, అండాన్ని; 13) పురుష; 14) ముష్కాలు; 15) శుక్ర నాళికల; 16)పీయూష గ్రంథి; 17) పీయూష గ్రంథి; 18) మైటోకాండ్రియా; 19) కార్పస్లూటియమ్; 20) పీయూష గ్రంథి; 21) ల్యూటినైజింగ్ హార్మోన్; 22) ఉల్బం, ఉల్బక ద్రవం; 23) 40 వారాలు; 24) 1978; 25) స్త్రీ బీజ కోశ పుటిక లేదా గ్రాఫియన్ పుటిక; 26) రుతు చక్రం; 27) కార్పస్లూటియమ్; 28) జరాయువు; 29) ప్రత్యుత్పత్తి; 30) ఫెల్లోపియన్ నాళాలు. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.టోటిపొటెన్సీ అంటే ఏమిటి? 2.ఎక్స్‌ప్లాంట్ అంటే ఏమిటి? 3.కాల్లస్ ఎప్పుడు ఏర్పడుతుంది? 4.అంట్లు అంటే ఏమిటి? 5.సిద్ధబీజ శాస్త్రం అంటే ఏమిటి? 6.రక్షక పత్రాలకు,ఆకర్షణ పత్రాలకు తేడాలు రాయండి? 7.వానపాము ఉభయలైంగిక జీవి అయినప్పటికీ ఆత్మ ఫలదీకరణం ఎందుకు జరపదు? 8.ఎంప్లక్సరీ మెత్తలు కప్పకు ఎలా ఉపయోగపడతాయి? 9.మిల్ట్ అంటే ఏమిటి? 10.స్పాన్ అంటే ఏమిటి? 11.ఒక జంతువును ఉభయ లైంగిక జీవి అని ఎప్పుడు అంటారు? ఉదాహరణ ఇవ్వండి? 12.బాహ్య ఫలదీకరణం జరిపే రెండు జంతువుల పేర్లు రాయండి? 13.మానవులలో అండోత్సర్గం అంటే ఏమిటి? 2 మార్కులు: 1.శాఖీయోత్పత్తి వల్ల కలిగే రెండు ప్రయోజనాలు రాయండి? 2.అంటుకట్టడంలోని రకాలను పేర్కొనండి? 3.కాల్లస్ అంటే ఏమిటి? 4.ద్విధా విచ్ఛిత్తి అంటే ఏమిటి? ఈ పద్ధతి ఏ జీవిలో జరుగుతుంది? 5.శాఖీయ ప్రత్యుత్పత్తి లేదా శాఖీయ వ్యాప్తి అంటే ఏమిటి? 6.పిండ సంరక్షణ అంటే ఏమిటి? ఏ పరిస్థితుల్లో దీనిని అమలు పరుస్తారు? 7.లైంగిక ప్రత్యుత్పత్తి ప్రయోజనాలు తెల్పండి? 8.లైంగిక ద్విరూపకత అంటే ఏమిటి? లేదా జంతువులలో లైంగిక ద్విరూపకతను క్లుప్తంగా రాయండి? 9.శుక్రకణానికి, అండానికి మధ్య భేదాలను తెల్పండి? 10.కప్ప అండంలోని జాంతవ ధృవం, బృహత్ఖండ ధృవాలను ఎలా గుర్తిస్తారు? 11.మగకప్ప, ఆడకప్పలను ఎలా గుర్తు పడతారు? 12.కార్పస్ లూటియం అంటే ఏమిటి? దాని పని ఏమిటి? 13.మానవుని శుక్రకణ నిర్మాణాన్ని వర్ణించండి? 14.భ్రూణం అని దేనినంటారు? 4 మార్కులు: 1.లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తుల్లో ఉండే ముఖ్య తేడాలేమిటి? 2.శాఖీయోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు రాయండి? 3.మొక్కల కణాలు, కణజాల వర్థనం ద్వారా కలిగే ప్రయోజనాలు లేదా ఉపయోగాలు తెల్పండి? 4.మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను పేర్కొని, ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి? 5.అంటుకట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిం చండి? 6.పుష్పంలో ప్రధాన భాగాలను వివరించండి? లేదా పుష్ప నిర్మాణాన్ని తెల్పండి? 7.పిండకోశ నిర్మాణాన్ని పట సహాయంతో వివరించండి? 8.పేరమీషియంలో సంయోగం గురించి క్లుప్తంగా రాయండి? 9.మానవులలో రుతుచక్రాన్ని వర్ణించండి? 10.శుక్రకణానికి, అండకణానికి మధ్య భేదాలేవి? 11.వివిధ గర్భనిరోధక పద్ధతులు తెలపండి? 12.ప్రతిస్థాపన అంటే ఏమిటి? మానవులలో అది ఎలా జరుగుతుంది? 5 మార్కులు: 1.ఉమ్మెత్త పువ్వు నిలువుకోత పటం గీసి, భాగాలను గుర్తించండి? 2.పుష్పం అండ నిర్మాణం పటం గీసి, భాగాలను గుర్తించండి? 3.మొక్కలలో ఫలదీకరణ విధానం చూపే పటం గీసి, భాగాలను గుర్తించండి? 4.కప్ప పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీసి, భాగాలను గుర్తించండి? 5.కప్ప స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం గీసి, భాగాలు గుర్తించండి? 6.మానవ శుక్ర కణం పటం గీసి, భాగాలు గుర్తించండి? హెచ్ఐవీ- ఎయిడ్స్ 1.హెచ్ఐవీ సోకడం వల్ల కలిగే తర్వాత ఫలితం ....... . 2.సురక్షితం కాని లైంగిక సంబంధాలు అంటే ....... ఉపయోగించకపోవడం. 3.హెచ్ఐవీకి మందులేదు ....... ఒక్కటే మార్గం. 4.ఎయిడ్సను కలిగించే జీవి ....... . 5.ఎస్టీడీల వ్యాప్తి, ఎయిడ్సల మధ్య ....... . 6.సరైన నిర్ణయాన్ని తీసుకునే నైపుణ్యానికి అవసరం ....... . 7.హెచ్ఐవీ ఉత్పత్తి చేసే ముఖ్యమైన ఎంజైమ్....... . 8.ఇటీవల 3 మిలియన్లకు పైగా వ్యక్తులను బలిగొన్న వ్యాధి ....... . 9.హెచ్ఐవీ, ఎయిడ్స సోకిన పిల్లలు ....... జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఇవ్వాలి. 10.ఒక వ్యక్తికి ....... సోకినప్పటికీ అతనికి ఆ విషయం తెలియదు. 11.పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడమనేది....... జీవన నైపుణ్యం. 12.వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడగలగడానికి కావలసిన నైపు ణ్యం....... . 13.స్నేహితులు, బంధువులతో చక్కని సంబంధాలు నేర్ప రచే నైపుణ్యం....... . 14.సాధారణంగా హెచ్ఐవీ వ్యాప్తికి అనుకూలించే మార్గం....... . 15.హెచ్ఐవీకి వాహకం....... . 16........ సోకిన వ్యక్తి వెంటనే వ్యాధి చిహ్నాలను చూపలేడు. 17.హెచ్ఐవీ ఉనికిని తెలిపే పరీక్ష ....... . 18.హెచ్ఐవీ సోకిన పిల్లలను పాఠశాలలో చేర్చుకునే విధానం ....... . 19.ఎయిడ్స వ్యాధి వల్ల తగ్గే శరీర బరువు శాతం....... . 20.హెచ్ఐవీ వ్యాధి పొదుగు కాలాన్ని ....... అని కూడా అంటారు. 21.హెచ్ఐవీ తరచూ ఆకారాన్ని మార్చడానికి సహాయపడే ఎంజైమ్....... . 22.హెచ్ఐవీ....... కుటుంబంలో ....... తరగతికి చెందిన ఆర్ఎన్ఏ వైరస్. 23.హెచ్ఐవీ ....... పరిమాణంలో ఉంటుంది. 24.హెచ్ఐవీ ....... ఆకారంలో ఉంటుంది. 25.రక్తంలో వైరస్లు ఉన్నప్పటికీ ప్రతిరక్షకాలు కనిపించని దశను ....... అంటారు. సమాధానాలు 1) ఎయిడ్స దశకు చేరుకోవడం; 2) కండోమ్; 3) నివారణ; 4) హెచ్ఐవీ; 5. దగ్గరి సంబంధం ఉంది; 6) సంభాషణా నైపుణ్యం; 7) రివర్స ట్రాన్స్క్రిప్టేజ్; 8) ఎయిడ్స; 9) సాధారణ; 10) హెచ్ఐవీ; 11) సమస్యలను అధిగమించే; 12) సంభాషణా నైపుణ్యం; 13) వివిధ రకాల వ్యక్తులతో వ్యవహరించే నైపుణ్యం; 14) రక్తం; 15) మానవ రక్తం; 16) హెచ్ఐవీ; 17) రక్త పరీక్ష; 18) ఇతర మామూలు పిల్లలవలె; 19) 10 శాతం; 20) వ్యాధి చిహ్నాలు కనిపించని హెచ్ఐవీ+ దశ; 21) రివర్స ట్రాన్ స్క్రిప్టేజ్; 22) రిట్రో విరిడె, లెంటి వైరస్; 23) 120 నానో మీటర్(10-9 మీ); 24) ఐకోసా హెడ్రల్; 25) విండో పీరియడ్. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.హెచ్ఐవీ ఏ కుటుంబానికి చెందుతుంది? 2.భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎయిడ్స సోకిన వ్యక్తిని ఎక్కడ, ఎప్పుడు గుర్తించారు? 3.హెచ్ఐవీని విస్తరించండి? 4.హెచ్ఐవీ ప్రత్యేకతకు కారణమైన ఎంజైమ్ ఏది? 6.నీ స్నేహితుడు/స్నేహితురాలు నిన్ను పొగతాగమని ప్రేరేపించినప్పుడు నీవు ఎలా ప్రతిస్పందిస్తావు? 7.ఒక వ్యక్తి బాహ్య లక్షణాలను చూసి అతనికి హెచ్ఐవీ సోకిందో లేదో చెప్పొచ్చా? 2 మార్కులు: 1.హెచ్ఐవీలో కనిపించే ఎంజైమ్లేవి? 2.హెచ్ఐవీ నిర్మాణాన్ని వర్ణించండి? 3.ఎయిడ్స వ్యాధి గురించి క్లుప్తంగా రాయండి? 4.హెచ్ఐవీ ప్రతిరక్షకాలను గుర్తించే పరీక్షలను పేర్కొ నండి? 4 మార్కులు: 1.హెచ్ఐవీ.. ఎయిడ్స వంటి సమస్యాత్మక పరిస్థితులను ఎదుర్కోవడంలో జీవన నైపుణ్యాలు ఎలా అవసరమ వుతాయి? ఏయే జీవన నైపుణ్యాలు కలిగి ఉండాలి? 2.హెచ్ఐవీ తనకు సోకకూడదని నిర్ణయం తీసుకున్న వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? 3.ఒక వ్యక్తికి హెచ్ఐవీ సోకిన తర్వాత అతడు ఎయిడ్స దశను ఏయే దశల ద్వారా చేరుకుంటాడు? 4.హెచ్ఐవీ ఏయే మార్గాల్లో వ్యాప్తి చెందుతుంది? 5.ప్రస్తుతం హెచ్ఐవీ వ్యాప్తి ఎందుకు తీవ్ర సమస్యగా పరిణమించింది? 6.హెచ్ఐవీ, ఎయిడ్స మధ్య భేదాలు తెలపండి? పోషణకు అవసరమయ్యే పదార్థాలు/ పోషకాహార లోపం 1.శక్తికి, పెరుగుదలకు, శరీర నిర్మాణానికి అవసరమయ్యే రసాయనిక పదార్థాలను ....... అంటారు. 2.పోషణ అంటే శరీరానికి అవసరమయ్యే అన్ని ....... ను తీసుకోవడం. 3.పాలలోని చక్కెరను ....... అంటారు. 4.చెరకులోని చక్కెరను ....... అంటారు. 5.జంతువుల్లోని స్టార్చని....... అంటారు. 6.కాలేయంలో నిల్వ ఉండే కార్బోహైడ్రేట్లను ....... అంటారు. 7.అమైనో ఆమ్లాలు ....... ల పరిమాణాలు 8.ఐరన్ లోపం వల్ల ....... కలుగుతుంది. 9.గ్రాము పిండిపదార్థం నుంచి ....... కిలో కేలరీల శక్తి వస్తుంది. 10.పొటాషియం అయాన్లు ....... లోపల ద్రవాభిసరణ తులస్థితిని క్రమపరుస్తాయి. 11.కణం లోపల కొత్త అణువులు తయారవడానికి ....... వంటి శక్తి అవసరం. 12.సెల్యులోజ్ ఒక ....... 13.ఒక గ్రాము గ్లూకోజ్ విడుదల చేసే శక్తి ....... . 14.జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రొటీన్లు ఉన్న పదార్థాల ....... 15.గాయిటర్ ....... లోపం వల్ల కలుగుతుంది. 16. ....... ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయి. 17.పెద్దవారికి కాకుండా పిల్లలకు మాత్రమే ....... ఆవశ్యక ఎమైనో ఆమ్లం. 18. ....... వద్ద కొవ్వు ఘన రూపంలో ఉంటుంది. 19.అయోడిన్ లోపం వల్ల ....... కలుగుతుంది. 20.ఎక్కువ మొత్తాల్లో ఫ్లోరిన్ తీసుకోవడం వల్ల ....... ఏర్పడుతుంది. 21.మనకు ప్రతిదినం కావాల్సిన కాల్షియం సుమారుగా ....... . 22.ఒక గ్రాము కొవ్వు విడుదల చేసే కిలో కేలరీల శక్తి ....... 23.కణబాహ్య ద్రవాల్లో ....... ముఖ్యమైన కేటయాన్. 24.కణజీవ పదార్థంలో ....... ముఖ్యమైన కేటయాన్. 25.దంతాలపైన ఉండే పింగాణి ఏర్పడడానికి ....... అవసరం. 26.ప్రకృతిలో ఉన్న ఎమైనో ఆమ్లాల సంఖ్య ....... . 27.క్వాషియోర్కర్ వ్యాధి ....... లోపం వల్ల కలుగుతుంది. 28.అతిగా తినడం వల్ల, అదనపు శక్తి ....... గా మారుతుంది. 29.శరీరంలో అధికంగా ఉండే కొవ్వు ....... కణాల్లో నిల్వ ఉంటుంది. 30.శరీరం బరువులో 20 శాతం కంటే ఎక్కువ బరువు కొవ్వు వల్ల అయితే, ఆ వ్యక్తికి సంభవించే వ్యాధిని ....... అంటారు. 31.ఇటీవల జరిపిన పరిశోధనల వల్ల స్థూలకాయత్వాన్ని గురించి తెలిసిన విషయం, అది ....... కావచ్చు. 32.కేలరీల పోషకాహార లోపాన్నిచి ....... అని కూడా అంటారు. 33.కాళ్లు, చేతులు పుల్లలుగా ఉండి, పక్కటెముకలు ప్రస్ఫుటంగా కనిపించే శిశువ్యాధి ....... . 34.క్వాషియోర్కర్ అనే పదానికి అర్థం ....... . 35. ....... లోపం వల్ల శరీరం పెరుగుదల తక్కువగా ఉంటుంది. సమాధానాలు 1) పోషకాలు; 2) పోషక పదార్థాల; 3) లాక్టోజ్ ; 4) సుక్రోజ్; 5) గ్లైకోజన్; 6) గ్లైకోజన్; 7) ప్రొటీన్; 8) రక్తహీనత (ఎనీమియా); 9) 4; 10) కణం; 11) అఖ్కీ; 12) కార్బోహైడ్రేట్ (పిండి పదార్థం); 13) 4 కిలో కాలరీలు; 14) మాంసం, గుడ్లు, పాలు; 15) అయోడిన్; 16) ఫ్లోరిన్; 17) హిస్ట్టిడిన్; 18) 200ఇ; 19) సామాన్య గాయిటర్, 20) ఫ్లోరోసిస్; 21) 400-500 మి.గ్రా.; 22) 9.45 కిలో కేలరీలు; 23) సోడియం; 24) పొటాషియం; 25) ఫ్లోరిన్; 26) 24; 27) ప్రోటీనులు; 28) కొవ్వు; 29) ఎడిపోజ్; 30) స్థూలకాయత్వం; 31) వంశపారంపర్యం; 32) శక్తిపోషకాహార లోపం; 33) మెరాస్మస్; 34) నిర్లక్ష్యానికి గురైన శిశువు; 35) ప్రోటీనుల. విటమిన్లు- వనరులు- న్యూనతా వ్యాధులు 1.బియ్యాన్ని పాలిష్ చేసినా, ఎక్కువగా కడిగినా, దానిలో ....... విటమిన్ పోతుంది. 2.గ్లాసైటిస్లో ....... ఎర్రగా తళతళలాడుతుంది. 3.సూర్యరశ్మి శరీరంలోని ఆహారంలో ఉన్న ....... ను విటమిన్ ‘డి’గా మారుస్తుంది. 4.పురుషుల్లో వంధ్యత్వం రాకుండా చేసే విటమిన్ ....... . 5.బొప్పాయి పండులో ....... విటమిన్ అధికంగా ఉంటుంది. 6. ....... విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. 7.థయమిన్ లోపం వల్ల ....... వ్యాధి కలుగుతుంది. 8.విటమిన్ ‘బి3’ లోపం వల్ల కలిగే వ్యాధి ....... . 9.పాంటోథినిక్ ఆమ్ల లోపం వల్ల మంటలు మండే భాగం ....... . 10.విటమిన్ల పుట్టు పూర్వోత్తరాలు ....... శతాబ్దానికి చెందినవి. 11.సర్ హెచ్.జి. హాప్కిన్స పెరుగుదలకు సంబంధించిన ఒక పదార్థం ....... ఉందని కనుక్కొన్నారు. 12.న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణానికి అవసరమయ్యే విటమిన్ ....... 13.వేడికి అతి త్వరితంగా నశించిపోయే విటమిన్ ....... . 14.రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్ ....... . 15.విటమిన్లు ....... . 16.విటమిన్ ‘బి1’ని ....... అని కూడా అంటారు. 17.రైబోఫ్లావిన్ అనేది ....... విటమిన్ రసాయన నామం. 18.హానికర రక్తహీనత ....... విటమిన్ న్యూనత వల్ల కలుగుతుంది. 19.సయనాకోబాలమైన్ అనేది ....... విటమిన్ పేరు. 20. ....... విటమిన్ లోపం వల్ల అలసట కలుగుతుంది. 21.విటమిన్ ‘సి’ లోపం వల్ల ....... అనే వ్యాధి కలుగుతుంది. 22.ఎస్కార్బిక్ ఆమ్లం అనేది ....... విటమిన్ పేరు. 23.ఫాంటోథినిక్ ఆమ్లం ....... లో కరిగే విటమిన్. 24.సయనాకోబాలమైన్ ....... లో కరిగే విటమిన్. 25.ఫోలిక్ ఆమ్లం రసాయనిక నామం ....... . 26.విటమిన్లను మొదటిసారిగా ....... అనే శాస్త్రవేత్త కనుక్కొన్నారు. 27.పురుషుల్లో వంధ్యత్వం ....... విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. 28.విటమిన్లు శరీరంలో సంశ్లేషణం కావు. అందువల్ల వాటిని ....... పోషకాలంటారు. 29.విటమిన్ ‘కె’ ....... కరిగే విటమిన్. 30.పైరిడాక్సిన్ అనేది ....... విటమిన్ పేరు. 31.న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో ....... ప్రముఖ పాత్ర వహిస్తుంది. 32.రోడాప్సిన్, ఇడాప్సిన్ అనే వర్ణకాలు ....... లోని ....... పొరలో ఉంటాయి. 33.నియాసిన్ అనేది విటమిన్ ....... . 34.గ్లాైసైటిస్ అనే వ్యాధి ....... విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. 35.పైరిడాక్సిన్ అనేది ....... విటమిన్ రసాయనిక నామం. 36.బయోటిన్ అనేది ....... . 37.విటమిన్ ‘సి’ లోపం వల్ల కలిగే వ్యాధి ....... . 38. ....... పదార్థం తింటే జపాన్ దేశ నావికుల్లో బెరిబెరి వ్యాధి కలిగిందని తెలిసింది. 39.కొల్లాజన్ ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్ ....... . 40.గాయాలు నయమవడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి తోడ్పడే విటమిన్ ....... . 41.విటమిన్ ‘సి’ ....... ఖనిజ లవణాన్ని శోషణం చేసుకుని, నిల్వ చేయడంలో తోడ్పడుతుంది. 42.జిరాఫ్థాల్మియా వ్యాధి చిచిచిచి కి సంబంధించింది. 43.విటమిన్ ‘ఎ’ రసాయనిక నామం ....... 44.విటమిన్ ‘డి’ రసాయనిక నామం ....... . 45.విటమిన్ ‘ఇ’ రసాయనిక నామంచి ....... 46.విటమిన్ అనే పేరును మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ....... . 47.నోటిమూలల్లో పగలడం, కళ్లనుంచి నీరు కారడం ....... విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. 48.విటమిన్ ‘బి3’ లోపం వల్ల కలిగే వ్యాధి ....... . 49.చిగుళ్లు వాచి, వాటి నుంచి రక్తస్రావం అవడం అనేది ....... వ్యాధి లక్షణం. 50.మన శరీరంలో కెరాటిన్ ....... గా మారుతుంది. సమాధానాలు 1) ఆ1(థయామిన్); 2) నాలుక; 3) కొలెస్ట్రాల్; 4) ’ఉ’ (టోకోఫెరాల్); 5) ’అ’; 6) ’ఈ’ (కాల్సిఫెరాల్); 7) గ్లాసైటిస్; 8) పెల్లాగ్రా; 9) కాళ్లు; 10) 18వ; 11) పాలలో; 12) ఫోలిక్ ఆమ్లం; 13) ’ఇ’ (ఎస్కార్బిక్ ఆమ్లం); 14) ’ఓ’; 15) సూక్ష్మపోషకాలు; 16) థయామిన్; 17) ఆ2; 18) ఆ12; 19) ఆ12; 20) బయోటిన్; 21) స్కర్వి; 22) ఇ; 23) నీటి; 24) నీటి; 25) ఫోలిక్ ఆమ్లం; 26) హెచ్.జి. హాప్కిన్స; 27) ఉ(టోకోఫెరాల్); 28) ఆవశ్యక; 29) కొవ్వులో; 30) ఆ6; 31) ఫోలిక్ ఆమ్లం; 32) కంటి, రెటీనా; 33) ఆ3; 34) ఆ2; 35) ఆ6; 36) విటమిన్; 37) స్కర్వి; 38) పాలిష్ చేసిన బియ్యం; 39) ఇ; 40) ఇ; 41) ఐరన్; 42) కంటి; 43) రెటినాల్; 44) కాల్సిఫెరాల్; 45) టోకోఫెరాల్; 46) ఫంక్; 47) ఆ2; 48) పెల్లాగ్రా; 49) స్కర్వి; 50) విటమిన్ ’అ’. ఉష్ణ మండల వ్యాధులు/ పథమ చికిత్స 1.రోగ జనక జీవులు శరీరంలో ప్రవేశించడాన్ని ....... అంటారు. 2.రోగజనక జీవులు అధిక సంఖ్యలో ఉన ్నప్పటికీ ....... జీవుల్లో అస్వస్థత కలిగించవు. 3.ఎయిడ్స వ్యాధి ....... వల్ల వ్యాప్తి చెందుతుంది. 4.మూత్రంలోని పసుపు రంగు ....... వర్ణద్రవ్యం వల్ల కలుగుతుంది. 5.గవదబిళ్లల వ్యాధి ....... వైరస్ ద్వారా కలుగుతుంది. 6.గవద బిళ్లల వ్యాధిలో ముఖ్యంగా ....... గ్రంథులు వ్యాధికి లోనవుతాయి. 7.పారామిక్సో వైరస్ (ఖూఅ) ....... వ్యాధిని కలిగిస్తుంది. 8.మెదడువాపు వ్యాధికి ....... వాహకాలుగా ఉంటాయి. 9.బోద వ్యాధి క్రిముల డింభకాల పేరు ....... . 10.గామిటోసైట్లు ....... దశ నుంచి అభివృద్ధి చెందుతాయి. 11.క్షయ, గవద బిళ్లలు, కోరింత దగ్గు వ్యాధుల్లో సంక్రమణ జరిగే పద్ధతి ....... . 12.ప్లేగు, మలేరియా ....... ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. 13.శోషరస నాళాలు, శోషరస గ్రంథుల వాపు వల్ల వచ్చే రోగం ....... . 14.హెపటైటిస్ వైరస్.. కణాలను నాశనం చేయడం వల్ల వచ్చే వ్యాధి ....... 15.ప్లేగు, మలేరియా వ్యాధులు, మరోప్రాణి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఆ ప్రాణిని ....... అంటారు. 16.దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త ....... . 17.మలేరియా పరాన్న జీవి జీవిత చరిత్రలో ప్రాథమిక అతిథేయి ....... 18.మలేరియా పరాన్న జీవి, జీవిత చరిత్రలో మానవునిలో గడిపే దశ పేరు ....... చక్రం. 19.మలేరియా పరాన్న జీవి జీవిత చక్రంలో మాధ్యమిక అతిథేయి ....... . 20.పశువులు కలుషితమైన మేత తినడం వల్ల ప్రబలే వ్యాధి ....... 21.ప్లేగు కలిగించే బ్యాక్టీరియాలకు ....... వాహకం. 22.ఎల్లో జ్వరం కలిగించే వాటికి వాహకాలు ....... 23.మలేరియా జ్వరానికి వాహకాలు ....... . 24.హెపటైటిస్ వంటి జ్వరానికి వాహకాలు ....... . 25.తట్టు లేదా దద్దు వ్యాధిని ....... అని కూడా అంటారు. 26.ుబెల్లా వ్యాధిని మొదటిసారిగా వర్ణించినవారు ....... . 27.మెదడువాపు వ్యాధి కారక వైరస్‌ను ....... వ్యాప్తి చెందిస్తుంది. 28. ....... అనే జర్మనీ దేశస్థుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు. 29.ప్రథమ చికిత్సను వ్యాప్తిలోకి తేవడానికి కృషి చేసిన సంస్థ ....... 30.ఎముకల సామాన్య విరుపును ....... ఎముకల విరుపు అంటారు. 31.చాలా చోట్ల ఎముకల విరుపును ....... ఎముకల విరుపు అంటారు. 32.విరిగిన ఎముక రెండు కొనలు ఒకదానిలోనికి మరొకటి దూసుకుపోయినప్పుడు ....... ఎముక విరుపు అంటారు. 33.సాధారణంగా పిల్లల్లో కనిపించే ఎముక విరుపు ....... . 34.అంగన్వాడీ అంటే ....... . 35. ....... గ్రామాలకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. 36.ప్రతి ఏడాది మనదేశంలో ....... మంది పిల్లలు అంధత్వంతో బాధపడుతున్నారు. 37.చేప నూనెలో ఎక్కువగా ఉండే విటమిన్లు ....... 38.ప్రతి ఆరునెలలకు ఒకసారి నోటి ద్వారా పిల్లలకు ....... మైక్రోగ్రాముల విటమిన్ ‘ఎ’ ఇవ్వాలి. 39.అధిక మోతాదుల్లో విటమిన్ ‘ఎ’ ఇచ్చి పిల్లల్లో రేచీకటి రాకుండా చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ ....... . 40.అంధత్వానికి మూల కారణం ....... . సమాధానాలు 1) వ్యాధి సంక్రమణం; 2) వాహక; 3) ప్రత్యక్షంగా తాకిడి; 4) బిల్‌రుబిన్; 5) మిక్సోవైరస్ పరోటైడిస్(ఖూఅ); 6) పెరోటిడ్ (లాలాజలం); 7) తట్టు; 8) పందులు; 9) మైక్రో ఫైలేరియా; 10) ఎరిత్రోసైటిక్; 11) లాలాజల తుంపర; 12) వాహకం; 13) బోద; 14) పచ్చ కామెర్లు; 15) వాహకం; 16) సర్ రోనాల్డ్ రాస్; 17. ఆడ ఎనాఫిలిస్; 18) అలైంగిక; 19) మానవుడు; 20) మాడ్ కౌ; 21) ఎలుకలు; 22) కోతులు; 23) ఆడ ఎనాఫిలిస్; 24) మానవులు; 25) రుబెల్లా; 26) అబుబకర్; 27) క్యూలెక్స్ దోమలు; 28) ఇస్మార్క్; 29) జాన్ అంబులెన్స్; 30) మూసివేయబడిన; 31) ఓపెన్; 32) తాకిడి ప్రభావం వల్ల ఎముకల విరుపు; 33) లేత ఎముక విరుపు; 34) ప్రాంగణం; 35) 100; 36) 60,000; 37) ’అ’, ’ఈ’; 38) 60,000; 39) జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్); 40) విటమిన్ ’అ’ లోపం. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.క్రీడాకారులు గ్లూకోజును ఎందుకు తీసుకుంటారు? 2.జీవశాస్త్రీయంగా సంపూర్ణ ప్రొటీన్లు అంటే ఏమిటి? రెండు ఉదాహరణలివ్వండి? 3.కాల్షియం శరీరానికి ఎలా సహాయపడుతుంది? 4.శరీరంలో కొవ్వులను నిల్వ చేసుకోవడం ఎందువల్ల సులభం? 5.రోగికి గ్లూకోజ్ ఇవ్వడానికి కారణం ఏమిటి? 6.పోషకాహార లోపం అంటే ఏమిటి? 7.స్థూలకాయత్వానికి ఉన్న ఒకే ఒక చికిత్స ఏది? 8.శరీరంలో ఏ కణాలు స్థూలకాయత్వానికి దోహదం చేస్తాయి? ఎందువల్ల? 9.ూఐూ అంటే ఏమిటి? విస్తరించి రాయండి? 10.విటమిన్ ‘ఎ’ రసాయనిక నామం రాయండి? 11.మెదడువాపు వ్యాధికి సకశేరుక అతిథేయులు ఎవరు? ఈ వ్యాధిని కలుగజేసే వైరస్ ఏది? 12.రుబెల్ల అని దేనినంటారు? 13.సంక్రమణ అంటే ఏమిటి? 14.ప్రథమ చికిత్స అంటే ఏమిటి? 15.గ్రామీణ కార్యకర్త ప్రథమ కర్తవ్యం ఏమిటి? 2 మార్కులు: 1.ఫ్లోరోసిస్ అంటే ఏమిటి? ఇది శరీరానికి ఎలా నష్టం కలిగిస్తుంది? 2.అయొడైజ్డ్ సాల్ట్ అంటే ఏమిటి? దీన్ని తీసుకోవడం వల్ల లాభమేంటి? 3.బియ్యం లేదా మాంసం మాత్రమే తింటే కలిగే నష్టం ఏమిటి? 4.స్థూలకాయులు తమ శరీర బరువు పరిమాణం తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? 5.్వషియోర్కర్, మెరాస్మస్ వ్యాధుల మధ్య భేదాలు రాయండి? 6.ఏ పోషకలోపం వల్ల క్వాషియోర్కర్ వ్యాధి కలుగుతుంది? దాని గురించి రాయండి? 7.నియాసిన్ రసాయనిక నామం ఏమిటి? దీని అవసరం ఏమిటి? 8.మరపట్టిన బియ్యాన్ని వండి తిన్నా, వాటిని పలుమార్లు కడిగినా కలిగే నష్టం ఏమిటి? దీని వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? 9.విటమిన్లు ఎన్ని? వాటిని ఎన్ని రకాలుగా విభజించొ చ్చు? అవి ఏవి? 10.మలేరియా వ్యాధిలో ఉండే లక్షణాలు ఏమిటి? 11.మలేరియా వ్యాధి వ్యాప్తిని ఎలా అరికడతారు? 12.పచ్చ కామెర్లలో చర్మం ఎందువల్ల పచ్చగా ఉంటుంది? 13.గవద బిళ్లల వ్యాధి లక్షణాలు ఏమిటి? 14.శరీరంలోకి టెటనస్ క్రిములు ఎలా ప్రవేశిస్తాయి? 15.ప్రథమ చికిత్స అంటే ఏమిటి? ప్రథమ చికిత్స ఉద్దేశాలు ఏవి? 16.గ్రామీణ ఆరోగ్య కార్యకర్త విధులేవి? 17.ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నుంచి ఏ విధమైన ఆరోగ్య సేవలు కోరుకుంటాం? 4 మార్కులు: 1.కాల్షియం గురించి రాయండి? 2.పిల్లల మీద క్వాషియోర్కర్ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది? 3.క్వాషియోర్కర్ గురించి క్లుప్తంగా రాయండి? 4.విటమిన్ ‘ఎ’ లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి రాయండి? 5.విటమిన్లను కనిపెట్టడానికి దోహదం చేసిన కారకాలను తెలపండి? 6.‘బి’ కాంప్లెక్స్ విటమిన్లను పేర్కొని, వాటి రసాయనిక నామాలను రాయండి? 7.మలేరియా పరాన్న జీవి దోమ శరీరంలో ఏయే మార్పులు చెందుతుంది? 8.గ వదబిళ్లల వ్యాధి గురించి వివరించండి? 9.కామెర్ల వ్యాధి కలగడానికి కారణాలు ఏమిటి? కామెర్ల రోగి తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలేమిటి? 10.మెదడువాపు వ్యాధి ఎందుకు ప్రాణాంతకమైన వ్యాధి? అది ఎందువల్ల వస్తుంది? 11.మలేరియా వ్యాధిని నియంత్రించడానికి తీసుకోవాల్సి న చర్యలను పేర్కొనండి? 12.ప్రథమ చికిత్స చేసేటప్పుడు మనిషి ప్రాణాలు కాపాడటానికి ఏయే నియమాలు పాటించాలి? 13.ఎముకల విరుపునకు నువ్వు చేసే ప్రథమ చికిత్స ఏమిటి? 14.ఒక వ్యక్తి శరీర భాగాల్లో జరిగే వివిధ రకాల ఎముకల విరుపు గురించి రాయండి? 15.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించే ముఖ్య కార్యకలాపాలు ఏమిటి? పర్యావరణ విద్య ఆవరణ వ్యవస్థ, సమతుల్యత 1.మొక్కలు పెరిగేందుకు ఉపయోగపడే పై మట్టిని ....... అంటారు. 2.వాన నీటిపై ఆధారపడి వ్యవసాయం చేసే ప్రదేశాల్లో ....... ఒక్కటే మార్గం. 3.వాటర్షెడ్ల వల్ల నేలల్లో ....... పెంచొచ్చు. 4.ఎత్తైన ప్రాంతంలో కురిసిన వాన నీటిని పల్లపు ప్రదేశానికి మళ్లించి ఒకచోట చేర్చడాన్ని ....... అంటారు. 5.ఒక నిర్దిష్ట ప్రదేశంలో పడే వర్షాన్ని ....... తో కొలుస్తారు. 6.కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకునే కార్బన్ సింక్స్‌గా ....... ఉపయోగపడతాయి. 7.భూమి మీద ....... శాతం సముద్ర జలాలే. 8.సముద్ర జలాల్లో ....... శాతం ఉప్పు లవణాలుంటాయి. 9.సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే అడవుల్ని ....... లేదా ....... అంటారు. 10.సముద్ర ప్రవాళాలు ....... తో తయారవుతాయి. 11.భూమి మీద ఉన్న మొక్కలు, జంతువుల్లో అతి పురాతనమైన జాతులు ....... . 12. ....... తి పురాతనమైన అతి పెద్ద నీటి ఆవరణ వ్యవస్థ. 13.సముద్రంలో ....... మీటర్ల లోతున చీకటిగా ఉంటుంది. 14. ....... వల్ల ప్రవాళాల్లో ఉన్న పాలిప్‌లు నశించిపోతున్నాయి. 15.మట్టినీరు ఎరుపు లిట్మస్‌ను నీలి రంగులోకి మారిస్తే ఆ మట్టిలో ....... ఉన్నట్లు. 16.మట్టి నీరు నీలి లిట్మస్‌ను ఎరుపు రంగులోకి మారిస్తే ఆ మట్టిలో ....... ఉన్నట్లు. 17.చీడ పురుగులను తినే బ్యాక్టీరియాకు ఉదాహరణ ....... 18. ....... బయోఫర్టిలైజర్ కాయ ధాన్యాలకు సంబంధించిన మొక్కలకు పోషకాలు అందిస్తాయి. 19.అజోస్పైరిల్లం, అజటో బాక్టర్, అజొల్లా ....... మొక్కలకు పోషకాలు అందిస్తాయి. 20.థయో బెసిల్లస్, బాసిల్లస్, అస్పర్జిల్లస్లు నైట్రోజన్‌ను మొక్కకు కావలసిన ....... ను పోషకాల రూపంలో అందిస్తాయి. 21.పశుగ్రాసం కోసం రకరకాల గడ్డి జాతుల్ని పెంచే పద్ధతిని ....... అంటారు. 22.గట్ల వెంబడి పెంచే రకరకాల చెట్లను ....... అంటారు. 23.మనం ఉండే ప్రాంతంలో ఖాళీ స్థలాల్లో పెంచే అడవులను ....... అంటారు. 24.మొక్కలు, జంతువులు అవి సహజంగా బతికే చోట కాకుండా, క–{తిమంగా అటువంటి ప్రదేశాల్లో సంరక్షించే విధానాన్ని ....... అంటారు. 25.మొక్కలు, జంతువులు అవి సహజంగా బతికే చోటనే సంరక్షించే విధానాన్ని ....... అంటారు. 26. ....... పక్షిని మాంసం కోసం విపరీతంగా చంపి తినడంతో ఆ పక్షి జాతి పూర్తిగా అంతరించింది. 27.మిశ్రమ పంటలను ఒకేసారి పెంచడాన్ని ....... అంటారు. 28.అడవుల సంరక్షణ కోసం ఏర్పడిన గ్రూపులను ....... అంటారు. 29.మొక్కల్లో, జంతువుల్లో ఉపయోగకరమైన జన్యువుల్ని, జీవరసాయనాల్ని వెతికి వాటిపై ఆధిపత్యాన్ని దొంగచాటుగా దక్కించుకోవడాన్ని ....... అంటారు. 30.వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ....... సంవత్సరంలో రూపొందించారు. 31.బయోటెక్నాలజీ పదాన్ని మొదటిసారిగా ....... ఉపయోగించారు. సమాధానాలు 1) మృత్తిక; 2) వాటర్‌షెడ్; 3) తేమను; 4) వాటర్‌షెడ్; 5. రెయిన్‌గేజ్; 6) గడ్డినేలలు; 7) 70; 8) 3.5; 9) మాంగ్రూవ్స లేదా మడ అడవులు; 10) కాల్షియం కార్బొనేట్; 11) సముద్ర ప్రవాళాలు; 12) సముద్రాలు; 13) 200; 14) గ్లోబల్ వార్మింగ్; 15) క్షారత్వం; 16) ఆమ్లత్వం; 17) బెసిల్లస్ తురింజియెన్సిస్, బ్యువేరియా బాసియోనా; 18) రైజోబియం; 19) తృణధాన్యాల; 20) ఫాస్పరస్; 21) ఆగ్రోఫారెస్ట్రీ; 22) వ్యవసాయాధారిత అడవులు; 23) సామాజిక అడవులు; 24) ఎక్సిటు సంరక్షణ; 25) ఇన్‌సిటు సంరక్షణ; 26) డోడో; 27) వ్యవసాయాధారిత అడవులు; 28) వన సంరక్షణ సమితులు; 29) బయోపైరసీ; 30) 1972; 31) కారల్ ఎరికె. కాలుష్యం 1.ప్లాస్టిక్, టైర్లు కాల్చడం వల్ల ---------------- లాంటి క్యాన్సర్ కారకాలు పుడుతున్నాయి. 2.మనం పుట్టించే రకరకాల వ్యర్థాలు నేలలో మొక్కల్ని బతికించే ------------ ను నాశనం చేస్తాయి. 3.హోళిలో వాడే రసాయన రంగుల వల్ల కొందరు ------------ గా మారుతున్నారు. 4.------------- క్యాన్సర్ రోగాన్ని కలిగిస్తుంది. 5.కాస్మిక్ కిరణాల నుంచి -------------వస్తుంది. 6.అణు విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే ------------ చాలా ప్రమాదకరమైంది. 7.-------------- కాలుష్యం వల్ల జన్యు మార్పులు వస్తున్నాయి. 8.కంటికి కనిపించని కాలుష్యం -------------. 9.మనం ----------- డెసిబల్స్ వరకు శబ్దం వినగలం. 10.శబ్ద తీవ్రత------------- డెసిబల్స్ దాటితే మన కర్ణభేరి దెబ్బతింటుంది. 11.ప్రకృతిలోని సమతాస్థితిని ------------- కాపాడుతున్నాయి. 12.సునేర్ లాంటి రసాయనిక రంగుల వల్ల ------------ వ్యాధులు వస్తాయి. 13.ఎక్స్‌రేలు, సెల్యులార్ ఫోన్ల నుంచి ----------- విడుదల అవుతుంది. 14.సముద్రంలోకి ----------- చేరితే నీళ్లపై తెట్టులా ఆయిల్ స్లీక్ ఏర్పడుతుంది. 15.---------- శాతం రోగాలు మనకు నీటి నుంచి వస్తాయి. 16.నీళ్లలో ------------ వల్ల ఎముకలు వంగిపోతాయి. సమాధానాలు 1) డయాక్సిన్, ప్యూరా; 2) సూక్ష్మ పోషకాల; 3) అంధులు; 4) ధార్మికత; 5) రేడియేషన్; 6) అణుధార్మికత; 7) ధార్మిక; 8) శబ్ద కాలుష్యం; 9) 50-60; 10) 90; 11) మహాసముద్రాలు; 12) చర్మ; 13) రేడియేషన్ ; 14) నూనెలు; 15) 80; 16) ఫ్లోరైడ్ . పర్యావరణ అంశాలు 1.మన దేశంలో అటవీ భూముల విస్తీర్ణం ------------ శాతంగా ఉంది. 2.ప్రపంచంలో ------------ జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. 3.ప్రపంచ జనాభా ---------- కోట్లు దాటింది. 4.-------------- ప్రకృతి వనరులకు పుట్టిల్లు. 5.గాలిలో ------------- వాయువు పెరిగితే భూమి వేడెక్కుతుంది. 6.------------- నిల్వలు తగ్గడం వల్ల థర్మల్ విద్యుత్ తగ్గుతుంది. 7.గ్రీన్హౌస్ ఎఫెక్ట్ గురించి మొదటిసారిగా చెప్పిన శాస్త్రవేత్త -------------. 8.శిలాజ ఇంధనాన్ని మండిస్తే ----------- విడుదల అవుతుంది. 9.పునరుత్పత్తి చెందని వనరులకు ఉదాహరణలు ---------,-----------,-----------.. 10.పునరుత్పత్తి చెందని వనరులను -------- అని కూడా అంటారు. 11.ఎంత ఉపయోగించినా తరగని వనరులను -------- అంటారు.\u3102?్చట 12.కార్బన్ డై ఆకై ్సడ్, క్లోరో ఫ్లోరో కార్బన్లు, హైడ్రో కార్బన్లను----------- అంటారు. 13.ట్రోపో ఆవరణం భూమిపై --------- ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. 14.------------ ఆవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. 15.ఓజోన్ సంకేతం------------. 16.ఓజోన్ ---------- రంగులో ఉంటుంది. 17.ఓజోన్ ----------- కిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. 18.----------- ఓజోన్ పొరను పలుచన చేస్తాయి. 19.ఒక ప్రాంతంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్ని నమోదు చేసే పరికరం--------. 20.భూమిపై వ్యాపించి ఉన్న గాలి పొరను------------- అంటారు. 21.------------ భూమిపై 45 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 22.-------------- భూమిపై 80 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 23.------------- భూమిపై 400 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంది. 24.శిలా విగ్రహాలు, చారిత్రక కట్టడాలు ------------ వర్షాలకు పాడైపోతాయి. 25.ఉష్ణ ప్రవాహాల దిశలో మార్పులు రావడం వల్ల వాతావరణంలో ఏర్పడే వేడిని --------- అంటారు. 26.సముద్రాలలో అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు ఏర్పడే అతి పెద్ద సముద్ర అలలను -------------- అంటారు. 27.----------- వల్ల ఒక్కసారిగా పెద్ద వర్షాలు పడి వరదలతో గ్రామాలు, నగరాలు మునిగి పోతాయి. 28.1872లో ఆమ్ల వర్షం గురించి చెప్పిన శాస్త్రవేత్త--------. 29.సముద్ర జలాల్లో అంతరించి పోతున్న చేపలు---------------. 30.సునామీ బారి నుంచి ------------అడవులు రక్షిస్తాయి. 31.ఆమ్ల వర్షపు ఞఏ విలువ----------. సమాధానాలు 1) 19; 2) సగం; 3) 600; 4) సముద్రాలు; 5) కార్బన్ డై ఆకై్సడ్; 6) బొగ్గు; 7) జీన్ బ్యాప్టిస్ట్ ఫోరియర్; 8) కార్బన్ డై ఆకై్సడ్; 9) బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు; 10) సంప్రదాయ ఇంధన వనరులు; 11) సంప్రదాయేతర ఇంధన వనరులు; 12) గ్రీన్హౌస్ వాయువులు/భూమిని వేడెక్కించే వాయువులు; 13) 12 కి.మీ.; 14) స్ట్రాటో; 15) ై3; 16) లేత నీలి; 17) అతి నీలలోహిత; 18) క్లోరోఫ్లోరో కార్బన్లు; 19) సిక్స్ కనిష్ట, గరిష్ట ఉష్ణమాపకం; 20) వాతావరణం; 21) స్ట్రాటో ఆవరణం; 22) మీసో ఆవరణం; 23) ఉష్ణావరణం; 24) ఆమ్ల; 25) ఎల్‌నినో; 26) సునామీ; 27) లానినా; 28) రాబర్ట ఎంజిస్; 29) హలిబల్; 30) మడ లేదా మాంగ్రూవ్స; 31) 1.5 నుంచి 5 మంచి పర్యావరణం కోసం ఏం చేద్దాం? 1.బడి మొత్తం స్థలంలో -------------- శాతం చెట్లు ఉండాలి. 2.తడి చెత్తను నేలలో కప్పేస్తే ------------- గా మారుతుంది. 3.చాక్లెట్లు, బిస్కెట్లు వంటి వాటిమీద ----------- లేబుల్ చూసి కొనాలి. 4.అప్పడాలు, వడియాలు, పండ్ల రసాలు, పచ్చళ్లు వంటి వాటి మీద------- ముద్ర చూసి కొనాలి. 5.పర్యావరణ అనుకూల ఇంధనం ------------. 6.------------- బల్బులు వాడటం వల్ల విద్యుత్ శక్తి వినియోగాన్ని తగ్గించొచ్చు. 7.నూనె, నెయ్యి వంటి వాటి మీద -------------- లేబుల్ చూసి కొనాలి. 8.నీటి కాలుష్య నియంత్రణ చట్టం -----------లో అమల్లోకి వచ్చింది. 9.వాయు కాలుష్య నియంత్రణ చట్టం------------లో అమల్లోకి వచ్చింది. 10.చిప్కో ఉద్యమ నాయకుడు -------------. 11.ప్రపంచంలో ఎక్కువ వాహనాలను సీఎన్జీతో నడుపుతున్న నగరం -------------. 12.అడవులను కాపాడటానికి చేసిన పోరాటాలను----------- ఉద్యమం అంటారు. 13.సీఎన్జీ (CNG)-------------ల మిశ్రమం. 14.సీఎన్జీ గాలి కంటే -----------బరువు ఉంటుంది. 15.సీఎన్జీ (CNG) పూర్తి పేరు ---------. సమాధానాలు 1) 33; 2) కంపోస్టు; 3) ఐఎస్ఐ (ఐఐ); 4) ఊ.్క.ై.; 5) ఇూఎ; 6) కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బ్- సీఎఫ్‌బీ; 7) అగ్మార్క; 8) 1974; 9) 1981; 10) సుందర్ లాల్ బహుగుణ; 11) ఢిల్లీ; 12) చిప్కో; 13) హైడ్రోకార్బన్; 14) తక్కువ; 15) కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ముఖ్య ప్రశ్నలు 1 మార్కు: 1.వాటర్‌షెడ్ అంటే ఏమిటి? 2.పార్కుల ఆవశ్యకత ఏమిటి? 3.సముద్ర ప్రవాళాలు అంటే ఏమిటి? ఇవి వేటితో తయారవుతాయి? 4.తీరప్రాంత చెట్లను ఎందుకు నరకకూడదు? 5.జీవ ఎరువులను ఎందుకు వాడాలి? 6.మొక్కలకు కావల్సిన నైట్రోజన్, ఫాస్ఫరస్‌ను పోషకాల రూపంలో అందించే బయోఫర్టిలైజర్సను పేర్కొనండి? 7.అడవుల వల్ల ప్రయోజనాలేవి? 8.వన సంరక్షణ సమితులు అంటే ఏమిటి? 9.సామాజిక అడవులు అంటే ఏమిటి? 10.అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏమిటి? 11.బయోపైరసీ అంటే ఏమిటి? 12.ైవె ల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 13.బయోటెక్నాలజీ అంటే ఏమిటి? 14.కాలుష్యం అంటే ఏమిటి? 15.రేడియేషన్ జనకాలను పేర్కొనండి? 16.ఏవైనా రెండు ప్రకృతి వైపరీత్యాలను పేర్కొనండి? 17.నూనెలు, ఇంధనాలు సముద్రాల్లో చేరితే ఏమవు తుంది? 18.సంప్రదాయ ఇంధన వనరులు అంటే ఏమిటి? ఉదాహరణలివ్వండి? 19.సంప్రదాయేతర ఇంధన వనరులు అంటే ఏమిటి? ఉదాహరణలివ్వండి? 20.గ్రీన్హౌస్ వాయువులను పేర్కొనండి? 21.గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఇది ఏ విధంగా జరుగుతుంది? 22.గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? 23.వాతావరణం అంటే ఏమిటి? దీన్ని ఎన్ని పొరలుగా విభజించారు? 24.ఓజోన్ పొర ప్రాముఖ్యతను రాయండి? 25.ఆమ్ల వర్షాలు అంటే ఏమిటి? 26.ఎల్‌నినో అంటే ఏమిటి? 27.లానినా అంటే ఏమిటి? 28.సునామీ అంటే ఏమిటి? 29.పాఠశాలలో చెత్తను తగ్గించేందుకు పాటించే పద్ధతు లను రాయండి? 30.మన చుట్ట్టూ ఉన్న జీవన చక్రాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? 31.ఎక్సిటు, ఇన్‌సిటు సంరక్షణ అంటే ఏంటి? 32.కార్బన్ సింకులు అని వేటిని అంటారు? 2 మార్కులు: 1.మొక్కలు పెరిగేందుకు మృత్తిక ఏ విధంగా తోడ్పడు తుంది? 2.వర్షాన్ని ఏ విధంగా రీచార్జ చేయొచ్చో వివరించండి? 3.వాటర్షెడ్ల వల్ల లాభాలు రాయండి? 4.మాంగ్రూవ్స అంటే ఏమిటి? వీటి వల్ల ప్రయోజనా లను రాయండి? 5.జీవ ఎరువులను ఎలా తయారు చేస్తారు? వీటి వల్ల ప్రయోజనాలను రాయండి? 6.నైట్రోజన్ స్థాపక బయోఫర్టిలైజర్సను పేర్కొనండి? 7.సామాజిక అడవుల వల్ల లాభాలేమిటి? 8.బయోటెక్నాలజీ ఉపయోగాలు రాయండి? 9.ఆగ్రోఫారెస్ట్రీ పద్ధతులను తెలియజేయండి? 10.కాలుష్యం వల్ల కలుగుతున్న దుష్ఫలితాలేవి? 11.కాలుష్యాన్ని నివారించేందుకు మనం ఏ చర్యలు చేపట్టాలి? 12.సంప్రదాయ ఇంధన వనరుల వాడకం విషయంలో పొదుపు ఎందుకు పాటించాలి? 13.గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) వల్ల ప్రమాదా లను వివరించండి? 14.ఓజోన్ పొర పలుచనవడానికి కారణాలు రాయండి? 15.మొక్కలపై, ఇతర కట్టడాలపై ఆమ్ల వర్షాల ప్రభావాన్ని వివరించండి? 16.పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏమిటి? దీని కోసం మనం ఏమి చేయాలి? 17.చిప్కో ఉద్యమం అంటే ఏమిటి?\u3102?్చట18.CNG అంటే ఏమిటి? దీని వాడకం వల్ల ప్రయోజనా లను వివరించండి? 19.ఓజోన్ పొర పలుచనైతే కలిగే నష్టాలేవి? 20.ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటే ఏమిటి? 1900 సంవత్సరంలో ఆస్ట్రియా బయాలజిస్టు, ఫిజీషియన్ కారల్ లాండ్ స్టీనర్ .. రక్త కణాల చర్యల ఆధారంగా రక్తాన్ని మూడు వర్గాలుగా విభజించారు. తర్వాత 4వ వర్గాన్ని కనుగొన్నారు. ఒకే వర్గానికి చెందిన రక్తం నమూనాలలో గుచ్ఛకరణం జరగదు. గుర్తుంచుకోండి: ప్రయోగానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఈ కింది విధంగా సైడ్ హెడ్డింగ్స్‌లో రాయాలి. 1. ఉద్దేశం; 2. కావాల్సిన పరికరాలు; 3. ప్రయోగ విధానం; 4. పరిశీలన; 5. నిర్ధారణ; 6. పటం. గుర్తుంచుకోండి: ఒక మార్కు ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు జవాబులను సూటిగా స్పష్టంగా అవసరమైనమేర మాత్రమే రాయాలి. రెండు మార్కుల ప్రశ్నలకు రెండు పాయింట్లు రాయాలి. ప్రశ్నను బట్టి ఒక్కోసారి నాలుగు పాయింట్లు కూడా రాయాల్సి ఉంటుంది. హరితరేణువులలోని అవర్ణికలో జరిగే చర్యల పరంపరగా, కార్బన్ డై ఆక్సైడ్ వినియోగమై గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. అమెరికా శాస్త్రజ్ఞుడైన మెల్విన్ కాల్విన్ కార్బన్ డై ఆక్సైడ్ గ్లూకోజ్‌గా మారే చర్యల్ని గుర్తించాడు. ఈ పరిశోధనకు కాల్విన్కు నోబెల్ బహుమతి లభించింది. Prepared by: సూర సత్యనారాయణ సబ్జెక్ట్ ఎక్స్పర్ట, హైదరాబాద్