SC ST Prevention of Atrocities Act
-
Supreme Court: కులం పేరిట వేధిస్తేనే... ఎస్సీ, ఎస్టీ కేసు
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రత్యేకించి కులం పేరిట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది. అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజికవర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు‘ అని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజన్ స్కారియా అనే యూట్యూబర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేరళకు చెందిన ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టారు. మరుణదాన్ మలయాళీ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్న షాజన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు. షాజన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం, ‘బెదిరింపులకు, లేదా అవమానాలకు గురైన వ్యక్తి కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల (నిరోధక) చట్టం సెక్షన్ 3(1)(ఆర్) వర్తించబోదు. కులం పేరిట అవమానించినప్పుడు, వేధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు, అగ్ర కులస్తులు మైల, పవిత్రత అంటూ నిమ్నవర్ణాల వారిపట్ల కులం పేరిట దురహంకారపూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకే కఠినమైన సెక్షన్లు చేర్చారు. కనుక ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాల ముఖ్యం‘ అని స్పష్టం చేసింది. ‘షాజన్ కేసులో అదేమీ కని్పంచడం లేదు. సదరు వీడియో ద్వారా ఎస్సీ, ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శతృత్వ భావం, దురుద్దేశాల వంటివి వెళ్లగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు‘ అని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్‌ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది. -
Mallareddy: మల్లారెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దళిత కుటుంబంపై కర్ణాటక మంత్రి దాడి
బెంగుళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మంత్రి డి. సుధాకర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సుబ్బమ్మ, ఆశ అనే ఇద్దరు మహిళలు ఎఫ్ఐఆర్లో తెలిపిన వివరాల ప్రకారం మంత్రి సుధాకర్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి బెంగళూర్ యలహంక ప్రాంతానికి చేరుకుని మహిళలు నివాసముండే స్థలంలోని ఆస్తులను కూల్చే ప్రయత్నం చేశారు. జేసీబీ వాహనంతో సహా వచ్చిన ఆ గుంపులో సుమారు 40 మంది ఉండగా వారిలో 15 మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలంలో ఇళ్ల పైకప్పులు ప్రహారి గోడలను కూలుస్తుండగా దళితులైన తల్లీ కూతుళ్లు సుబ్బమ్మ, ఆశ వచ్చి వారిని నిలదీయగా ఆ గుంపు కులం పేరుతో దూషిస్తూ వీరిపై దాడికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీంతో మంత్రి సుధాకర్‌పైనా ఆయన అనుచరులు శ్రీనివాస్, భాగ్యమ్మల తో సహా మరో 35 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది -
కర్ణాటకలో ఘాతుకం.. మైనర్ బాలికపై..
బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గలో ఒక చర్చి ప్రతినిధి తన కళాశాలలో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నందుకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా గురువారానికి ఫెర్నాండెస్ ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. శివమొగ్గలోని ఓ చర్చిలో పనిచేస్తోన్న ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ చర్చి అనుబంధ కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతొ వేధింపులకు గురిచేస్తున్నట్లు స్థానిక కోటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తలిదండ్రులు. పోలీసులు ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ పై పోక్సో చట్టం తోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండుకు తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్ బాలిక బంధువులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు తరలి వచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. -
టీడీపీ నేతల బరితెగింపు
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరి తెగించారు. మంగళవారం రాత్రి బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడి దౌర్జన్యం చేశారు. అడ్డొచ్చిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నానా దుర్భాషలాడారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని సాకుగా తీసుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరితో పాటు పలువురు ఆ పార్టీ నాయకులు అలజడి సృష్టించారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 2019 సంవత్సరంలో రైతులకు ఉచితంగా సబ్మెర్సిబుల్ మోటార్లు పంపిణీ చేశారు. అప్పట్లో మిగిలిపోయిన మోటార్లు ప్రస్తుతం కర్ణాటకకు తరలుతున్నాయంటూ తాజాగా సోషల్‌మీడియాలో ఓ పోస్టు వచ్చింది. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ చౌదరితో పాటు ఆ పార్టీ నాయకులు హైడ్రామాకు తెర తీశారు. మోటార్లు తరలుతున్న వాహనాన్ని ఉన్నం మారుతీ చౌదరి వెంబడించినట్లు, అది కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం లక్ష్మంపల్లికి వెళ్లినట్లు కట్టుకథ అల్లారు. సోదరుడు ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరి, మరికొందరు టీడీపీ నాయకులతో కలసి మారుతీ చౌదరి నేరుగా లక్ష్మంపల్లిలోని బలహీన వర్గానికి చెందిన వడ్డే శారదమ్మ ఇంటి వద్దకు చేరుకున్నాడు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడుతున్న టీడీపీ నేతలను శారదమ్మ, కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తూ లోపలికి చొరబడ్డారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక దళిత యువకుడు విరుపాక్షిని కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. గాయపడిన అతను ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శారదమ్మ ఇంటి వద్దకు చేరుకుని టీడీపీ నేతలను నిలదీశారు. రాత్రి సమయంలో ఇంట్లోకి ఎలా చొరబడతారని, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్ఐ యువరాజ్ బుధవారం పోలీసు సిబ్బందితో కలిసి లక్ష్మంపల్లిలో పర్యటించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల అదుపులో ఉన్నం మారుతీ చౌదరి, నేతలు ఉన్నం బ్రదర్స్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరితో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై వడ్డే శారదమ్మ, హరిజన విరుపాక్షి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు ఉన్నం మారుతీ చౌదరి, ఉన్నం ఉదయ్ భాస్కర్ చౌదరి, యర్రంపల్లి సత్తి, గోళ్ల వెంకటేశులు, కైరేవు తిమ్మరాజు, కరిడిపల్లి రంగప్పలతో పాటు మరో పదిమందిపై 147, 148, 354, 422 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉన్నం మారుతీ చౌదరితో పాటు టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నాయకులు కౌంటర్ కేసుకు తెర తీశారు. ఉన్నం మారుతీ చౌదరి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు కరిడిపల్లి రంగప్ప తననూ కులం పేరుతో దూషించి, దాడికి యత్నించారంటూ బాధితులపైనే బుధవారం మధ్యాహ్నం శెట్టూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
కులం పేరుతో దూషించారు.. ప్రాణహానీ ఉంది: నిర్మాత ఫిర్యాదు
తాను నిర్మిస్తున్న సినిమాను వివిధ కారణాలతో ఆపేందుకు ప్రయత్నించడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ తనను ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిసీ దర్శకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాలు.. నల్లకుంటలో నివసించే మంచాల ప్రమోద్(27) సినిమాలు నిర్మించేందకు గాను శ్రీనగర్ కాలనీకి వచ్చి సొంత బ్యానర్‌పై ‘కంటోన్మెట్ పోస్టాఫీస్’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నీకు ఎందుకంటూ బాల సతీష్, రాజేష్ చిలువురి అనే ఇద్దరు వ్యక్తులు మానసికంగా వేధిస్తూ తనను సినీ పరిశ్రమ నుంచి దూరం చేసేందుకు యత్నించడమే కాకుండా తన సినిమా నిర్మాణాన్ని ఎలాగైనా ఆపాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అలాగే తనను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తూ ఆత్మహత్యకు కూడా ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. గణపతి కాంప్లెక్స్ వద్ద తనతో పాటు సహాయ దర్శకుడు బి. రవితేజపై కూడా కులం పేరుతో దుషించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల సతీష్, రాజేష్ చిలువూరిలపై బంజారాహిల్స్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు
సాక్షి, అనంతపురం: సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాస్తవానికి ప్రకాష్‌ను రెండు రోజుల క్రితమే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లలో 5 క్రిమినల్ కేసులు కానిస్టేబుల్ ప్రకాష్‌పై నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు, దాడి, అక్రమ ఆయుధాల సరఫరా వంటి కేసులు ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళను లొబర్చుకొని ఆమె నుంచి రూ.10లక్షల నగదు, 30 తులాల బంగారు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రకాష్‌పై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. ఆరోపణలు నిజమని తేలడంతో కానిస్టేబుల్ ప్రకాష్‌ను డిస్మిస్ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (పోలీసులపై తప్పుడు కథనాలు.. ఈనాడుకు ఎస్పీ ఫకీరప్ప నోటీసులు) డిస్మిస్ వెనుక కక్ష సాధింపు ఉందని ఎల్లో మీడియా ద్వారా ప్రకాష్ అసత్య ప్రచారం చేశాడు. సీఎం జగన్ చెన్నేకొత్తపల్లి పర్యటన సమయంలో ప్రకాష్.. ఎస్పీ ఆపీస్ సేవ్ ఏపీ పోలీస్ అంటూ ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశాడు. అందుకే ప్రకాష్‌ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారంటూ ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన ఎస్పీ ఫక్కీరప్ప ప్రకాష్ ప్రవర్తన బాగాలేకపోవడంతో డిస్మిస్ చేసినట్లు స్పష్టం చేశారు. అయితే కక్ష సాధింపుతోనే డిస్మిస్ చేశారని ప్రకాష్ ఆరోపించారు. ఎస్పీతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్‌భాషాలపై అనంతపురం టూటౌన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలను డిఐజీ రవిప్రకాస్ చూస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యే కందికుంటపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
సాక్షి, కదిరి (సత్యసాయి జిల్లా): కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌పై పట్టణ పోలీసులు గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎన్జీఓ కాలనీ చివరలో బుధవారం జరిగిన స్థల వివాదంలో కుటాగుళ్లకు చెందిన ఎరికల గంగులప్పను కులం పేరుతో దూషించినందుకు కందికుంటపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ మధు తెలిపారు. అలాగే గంగులప్ప ఆస్తిని కాజేయాలని చూసిన కందికుంటపై బాధితుడి ఫిర్యాదు మేరకు మరో కేసు కూడా నమోదు చేసినట్లు వివరించారు. భూ వివాదంలో అక్కడికొచ్చి దౌర్జన్యం చేయడం, పెట్రోలు తెచ్చి తగలబెట్టాలని చూడటం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న వారందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. చదవండి: (కదిరి టౌన్ సీఐ మధును చంపాలి) -
జాగు చేయక.. బాగు చేసేలా..
జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నం: 18002021989 హెల్ప్‌లైన్ నం:14566 రాష్ట్రస్థాయి హెల్ప్‌లైన్ నం: 040–23450923 సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనులపై అత్యాచారాల (అట్రాసిటీస్) నిరోధక చట్టం అమలును కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, బాధితులకు పరిహారం అందించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన హెల్ప్‌డెస్క్‌ను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అఘాయిత్యాలను అరికట్టడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌తో పాటు ప్రతి రాష్ట్రంలో ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఒకట్రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా అన్ని కాల్సెంటర్లను ప్రారంభించేందుకు ఆ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల విషయంలో ఆయా వర్గాల్లో అవగాహన కల్పించేలా మరింత ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ హెల్ప్‌డెస్క్ ప్రారంభించిన ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా 4,776 మంది యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా... 295 మంది వినతులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 27 వినతులు (గ్రీవెన్స్) నమోదు అయ్యాయి. ఫిర్యాదుల నమోదు ఇలా... హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదులను అత్యంత సులభంగా సమర్పించవచ్చు. ముందుగా https://nhapoa.gov.in/ లింకు ద్వారా అత్యాచారాల నిరోధానికి జాతీయ సహాయ కేంద్రం (నేషనల్ హెల్ప్‌డెస్క్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) పేజీ తెరవాలి. అనంతరం రిజిస్టర్ యువర్ గ్రీవెన్స్ ఆప్షన్‌ను ఎంచుకుని బాధితుడి వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ తదితర పూర్తి సమాచారాన్ని అందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ మొత్తంగా ఏడు దశల్లో జరుగుతుంది. అనంతరం బాధితుడి ధ్రువీకరణతో ఫిర్యాదు సమర్పణ పూర్తవుతుంది. వినతుల నమోదు తర్వాత వెబ్‌పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు క్షణాల్లో వినతులు/ఫిర్యాదుల చిట్టా మొత్తం చేరుతుంది. అక్కడ పరిశీలన పూర్తి చేసిన తర్వాత అంచెలంచెలుగా అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కరించి కేంద్ర అధికారులకు రాష్ట్ర అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టు (చేపట్టిన చర్యలతో నివేదిక) సమర్పించాల్సి ఉంటుంది. వినతులు, ఫిర్యాదుల నమోదులో కేవలం బాధితులే కాకుండా అట్రాసిటీ చట్టాల అమలుపై పనిచేస్తున్న స్వచ్ఛంధ సంస్థలు కూడా భాగస్వాములు కావొచ్చు. వెబ్‌పోర్టల్ ద్వారానే కాకుండా జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నంబర్, హెల్ప్‌లైన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఇక రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులకు కూడా ఫిర్యాదులు పంపవచ్చు. రాష్ట్రంలో secyscdts@gmail.com ద్వారా మెయిల్ పంపడంతో పాటు 040–23450923 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి వినతులు చెప్పుకోవచ్చు. కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అమలు కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్, వెబ్‌పోర్టల్, కాల్ సెంటర్ల నిర్వహణలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 చొప్పున నిధులు ఖర్చు చేస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం వందశాతం నిధులను కేంద్రమే భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్స్, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పూర్తిస్థాయి ప్రత్యేక కోర్టులు (ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్), స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పూర్తిస్థాయి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర కేటగిరీల్లో ఖర్చు చేయాలి. బాధితులకు న్యాయ సహాయం, పరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని ఈ నిధుల కింద ఖర్చు చేయకూడదు. -
ఎస్సీ విద్యార్ధుల చేత టాయిలెట్లు కడిగించిన ప్రధానోపాధ్యాయురాలు
Chennai Police complaint has been registered against Govt School headmistress తిరుపూర్: తమిళనాడులోని తిరుపూర్‌కు చెందని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్ధులచేత బలవంతంగా టాయిలెట్లు శుభ్రం చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్ధులు శుక్రవారం చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (సీఈఓ) ఆర్ రమేష్‌కు పిర్యాదు చేయడంతో, ప్రధానోపాద్యాయురాలు సప్పెండ్ అయ్యింది. తమిళనాడులోని తిరుపూర్‌లోని ఇడువై గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు, 400 మంది విద్యార్ధులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు గీత (45) మూడేళ్లగా ఈ పాఠశాలలో పనిచేస్తుంది. ఐతే 9, 10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఆమెపై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈవో) ఆర్ రమేష్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు తమను కులం పేరుతో దుర్భాషలాడిందని, మరుగుదొడ్లు శుభ్రం చేయమని బలవంతం చేసిందని విద్యార్థులు ఆరోపించినట్లు రమేష్ తెలిపారు. పాఠశాలను సందర్శించి విచారణ చేసిన అనంతరం ఆమెను సస్పెండ్ చేసినట్లు, సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు పిర్యాదు చేసినట్లు రమేష్ మీడియాకు తెలిపారు. కాగా ప్రధానోపాధ్యాయురాలుపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (వేధింపుల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
ఎస్సీ/ఎస్టీ చట్టం అమలుకు హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు(వేధింపుల నిరోధక) చట్టం–1989 సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఒక హెల్ప్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా టోల్–ఫ్రీ నంబర్ 14566 దేశవ్యాప్తంగా నిత్యం అందుబాటులో ఉంటుందని సామాజిక న్యాయ, సాధికారత శాఖ ఆదివారం వెల్లడించింది. మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించింది. వాయిస్ కాల్ లేదా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ) చేయవచ్చని తెలిపింది. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు ప్రాంతీయ భాషల్లో సేవలు పొందవచ్చని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలపై వివక్షకు ముగింపు పలికి, రక్షణ కల్పించేలా చట్టంపై అవగాహన కల్పించడమే హెల్ప్‌లైన్ ఉద్దేశమని వివరించింది. ప్రతి ఫిర్యాదును ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేస్తామని, బాధితులకు సాయం అందిస్తామని తెలియజేసింది. -
ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డికి రిమాండ్
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రైనీ మహిళా ఎస్ఐపై అదే పీఎస్‌కు చెందిన ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి లైంగికదాడికి యత్నించిన కేసులో అతన్ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ నిమిత్తం మహబూబాబాద్ సబ్ జైలుకు పంపినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో ఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు తెలిపారు. విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను నియమించామన్నారు. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిపై ఐపీసీ 354, 354ఏ, 354బి, 354డి, 376(2), 511 ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, తప్పుచేసిన వారికి తప్పకుండా శిక్షపడుతుందన్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులకు నివేదిక పంపించనున్నట్లు ఎస్పీ వివరించారు. జిల్లాలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. -
ఆలయంలోకి ప్రవేశించొద్దని పెళ్లి బృందంపై దాడి..
భోపాల్: దేశంలో దళితులపై వివక్షతను రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికి కొన్ని చోట్ల దళితులు, గిరిజనులు వివక్షతను ఎదుర్కొంటున్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు .. ఇండోర్ జిల్లాకు చెందిన వికాస్ కల్మోడియా అనే గిరిజన యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో, అతను స్థానిక ఆలయానికి చేరుకున్నాడు. కొంత మంది యువకులు పెళ్లి బృందాన్ని ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వరుడి బంధువులు ఆలయంలో ప్రవేశించేది లేదని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా, వివాహ బృందంపై దాడికి తెగపడ్డారు. ఈ క్రమంలో వరుడి తండ్రి ఓం ప్రకాశ్ తమపై దాడిచేసిన యువకులపై స్థానిక మన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివాహ బృందాన్ని భారీ భద్రత మధ్య ఆలయ దర్శనం కల్పించారు. ఆ తర్వాత నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరితో పాటు మరో 9 మంది గుర్తు తెలియని యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసులను నమోదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న మన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా విచారించాలి
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కేసులను వేగంగా దర్యాప్తు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు పారదర్శకంగా సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ చట్టం–1989 (సవరణ చట్టం–2015) అమలుపై రాష్ట్రస్థాయి హైపవర్ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం (వర్క్‌షాప్) శుక్రవారం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రెవెన్యూ, పోలీస్, ప్రాసిక్యూషన్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు హాజరైన ఈ వర్క్‌షాప్‌ను డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, బాలల రక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు ఆయన తమకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. సామాజిక మార్పు, చైతన్యం తీసుకురావడం కోసం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రాసిక్యూషన్, పోలీస్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ విభాగాలు ప్రధాన స్తంభాలుగా నిలబడి సమన్వయంతో పనిచేస్తే ఎస్సీ, ఎస్టీ కేసుల్లో సత్వర న్యాయం అందించవచ్చన్నారు. ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఏపీఎస్సీసీఎఫ్సీ వైస్ చైర్మన్, ఎండీ శామ్యూల్ ఆనంద్‌కుమార్, హైకోర్టు రిజి్రస్టార్ భానుమతి, శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ పాల్గొన్నారు. -
యువరాజ్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
చండీగఢ్: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. గతేడాది జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో సందర్భంగా యువరాజ్ సింగ్.. తోటి క్రికెటర్ యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హరియాణాకు చెందిన ఓ లాయర్ హిస్సార్ పరిధిలోని హాన్సీ పోలీసు స్టేషన్లో యువరాజ్‌పై పిర్యాదు చేశారు. ఆయనపై భారతీయ శిక్షాస్మృతిలోని 153, 153 ఏ, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లోని 3 (1) (ఆర్), 3 (1) ఎస్) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. గత సంవత్సరం జూన్‌లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్లో పాల్గొన్నన్నారు యువరాజ్ సింగ్. ఈ క్రమంలో తోటి ఆటగాడైన యజువేంద్ర చహల్‌ను ఉద్దేశించి మాట్లాడాడు యువరాజ్ సింగ్. ఆ సమయంలో యజువేంద్ర చహల్ సామాజిక వర్గాన్ని ప్రసావిస్తూ.. కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో యువరాజ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై స్పందించిన యువరాజ్.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించినా, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ అప్పట్లోనే ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. యువరాజ్ చేసిన వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తున్నాయని, నిమ్న కులాలను లక్ష్యంగా చేసుకుని ఆయన మాట్లాడారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై లాక్డౌన్ అనంతరం విచారణ జరిపి, వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన హిస్సార్ పోలీసులు.. ప్రస్తుతం యువరాజ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయడం గమనార్హం. త్వరలోనే యువరాజ్‌కు నోటీసులు పంపి ఆయనను విచారిస్తామని ఓ అధికారి వెల్లడించారు. చదవండి: యువీకి సరికొత్త తలనొప్పి 'నా తండ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి' -
కి‘లేడీ’: ఎస్సైలనే బ్లాక్మెయిల్ చేస్తూ..
సాక్షి, హైదరాబాద్: ఎస్సైలను బ్లాక్మెయిల్ చేసి.. డబ్బులు వసూలు చేసిన కిలాడి లేడీ లతా రెడ్డిని బుధవారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసిన లతా రెడ్డి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించింది. పోలీసు అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేదాన్నని తెలిపింది. వివరాలు.. టైలర్‌గా పని చేస్తోన్న లతా రెడ్డి.. తరచుగా ఏదో ఒక సాకుతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఎస్సైలతో పరిచయం పెంచుకునేది. కొద్ది రోజుల పాటు వారితో చనువుగా మెలిగేది. ఆ తర్వాత సమయం చూసుకుని వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసేది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే సదరు ఎస్సైల మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించేది. ఎస్సైలు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఎస్సైలను బెదిరించి డబ్బు వసూలు చేసింది. అయితే నిందితురాలు ఇంతా జరిగినా ఒక్క ఎస్సై కూడా ఆమె మీద ఫిర్యాదు చేయకపోవడం విశేషం. చివరకు ఓ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వనస్థలిపురం పోలీసులు లతా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: నిత్య పెళ్లికూతురు.. నలుగురికి టోపీ ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా.. -
కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒకరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. అనంతరం ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. దళిత పోలీస్ అధికారిని దూషించిన కేసులో ఇటీవల అరెస్ట్ అయిన జేసీని శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలవు దినం కావడంతో పోలీసులు ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. (జేసీ ప్రభాకర్‌రెడ్డికి డీఎస్పీ వార్నింగ్!) త్రీటౌన్ పీఎస్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు. దళిత సీఐ దేవేంద్రను ఎందుకు దూషించారు? పోలీసు అధికారులపై పదేపదే ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారు? కోవిడ్ నిబంధనలు ఎందుకు పాటించలేదు? జనంతో ఎందుకు ర్యాలీ నిర్వహించారు? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నలు సంధించారు. తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు విచారణ చేశారు. (దురుసు ప్రవర్తన.. జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్) -
టీడీపీ సీనియర్ నేతలపై ఎస్సీ,ఎస్టీ కేసు
సాక్షి, తూర్పుగోదావరి : టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, పిల్లి అనంతలక్ష్మి దంపతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కుమారుడు రాధాకృష్ణకు భార్య ఉండగానే రెండో పెళ్లి చేసేందుకు యనమల, చినరాజప్ప, పిల్లి అనంతలక్ష్మి దంపతులు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన భర్తకు రెండో పెళ్లి చేయించేందుకు యత్నించారని మంజుప్రియ వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంజు ప్రియ ఫిర్యాదుతో తొండంగి పోలీస్‌స్టేషన్‌లో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1 పిల్లి రాధాకృష్ణ, ఏ2 పిల్లి సత్యనారాయణ, ఏ3 పిల్లి అనంతలక్ష్మి, ఏ4 యనమల కృష్ణుడు, ఏ5 యనమల రామకృష్ణుడు, ఏ6 చినరాజప్ప, ఏ7 సరిదే హరిలుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ( రెండో పెళ్లికి యత్నం; టీడీపీ నేతలే పెద్దలు ) కాగా, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతుల కుమారుడు రాధాకృష్ణకు బుధవారం అర్ధరాత్రి రెండో వివాహం చేసేందుకు యత్నించారు. దీనికి మాజీమంత్రులు యనమల, చినరాజప్ప తదితర టీడీపీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రాధాకృష్ణ ఇదివరకే తనను పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టాక తనను మోసంచేసి, ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నాడని సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన పిల్లి మంజుప్రియ బుధవారం కాకినాడ ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
‘జొన్నవిత్తుల’పై కేసు నమోదు
నాంపల్లి: సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అంటరానితనాన్ని పునరుద్ధరణ చేసే విధంగా బ్రహ్మణ సమాజాన్ని పురమాయించేలా తెలుగులో పద్యం రాశారంటూ తెలంగాణ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అతని రచనలు ఎస్సీ, ఎస్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. జొన్నవిత్తుల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.(ఆర్జీవీ... ఓ రామబాణం) -
లాక్డౌన్: దళితులపై పెరిగిన దాడులు
చెన్నై: తమిళనాడు రాష్ట్రం వేధింపుల రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నన్ని దాడులు మరే రాష్ట్రంలో జరగడం లేదని మధురైకి చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజుల్లో నలుగురు దళితులు హత్యకు గురయ్యారంటూ సామాజిక కార్యకర్త కథీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన కొందరు లాక్డౌన్ సమయాన్ని దళితులపై దాడి చేసేందుకు ఓ అవకాశంగా వినియోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కథీర్ మాట్లాడుతూ.. ‘40-50 మంది జనాలు గుంపులుగా ఏర్పడి నిమ్నవర్గాల వారిపై దాడులకు పాల్పడుతున్నారు. లాక్డౌన్ సమయంలో ఇది ఎలా సాధ్యమయ్యింది?. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి దేశంలో గృహహింస పెరిగినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే కేవలం గృహ హింస మాత్రమే కాక కులం పేరుతో జరిగే వేధింపులు కూడా బాగా పెరిగాయి. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేవలం ఒక్క నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 100 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో కొన్ని అత్యాచారం, హత్య, పరువు హత్య వంటి తీవ్ర నేరాలు కూడా ఉన్నాయి’ అని అన్నారు. దేశంలో మొదటి దశ లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత మార్చి 29న ఆరనిలోని మోరప్పంతంగల్ గ్రామంలో పరువు హత్య చోటు చేసుకుందని కథీర్ తెలిపారు. ‘గ్రామంలోని ఒద్దార్ సామాజిక వర్గానికి చెందిన సుధాకర్ అనే యువకుడు వన్నియార్ కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. దాంతో సదరు యువతి తల్లిదండ్రులు సుధాకర్ మీద దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు యువతి తండ్రితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో హైకోర్టు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. ఫలితంగా ఈ తరహా కేసుల్లో నిందితులు సులభంగా బెయిల్ పొంది.. శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు’ అంతేకాక ఈ ఘటనల గురించి ప్రచారం చేసిన రిపోర్టర్ల మీద కూడా దాడులు చేస్తున్నారరని కథీర్ ఆరోపించారు. పట్టణాల నుంచి గ్రామాలకు వస్తోన్న నిమ్న వర్గాల వారి మీద కూడా దాడులు పెరిగాయని కథీర్ వెల్లడించారు. ‘పట్టణాల నుంచి వచ్చిన వ్యక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు గురవుతున్నారు. అంతేకాక ఉన్నత వర్గాల ప్రజల దళితుల కాలనీల చుట్టు కంచెలు ఏర్పాటు చేసి వారిని గ్రామంలోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దుకాణాదారులు వారికి నిత్యావసరాలు అమ్మడం లేదు’ కరోనా మహమ్మారి సమయంలో కూడా, కులతత్వం ఆగిపోలేదని.. ఈ వివక్షను, దాడులను ఆపడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని కథీర్ కోరారు. (వలస కూలీలను బూటుకాలితో తన్నిన పోలీస్) -
‘ఎస్సీ, ఎస్టీ చట్టం’ రాజ్యాంగబద్ధమే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం –2018 చట్టబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిరూపించలేకపోతే సదరు వ్యక్తికి బెయిల్ మంజూరు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే ప్రాథమిక విచారణ అవసరం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరులంతా సమానమనీ, సోదరభావాన్ని పెంపొందించుకోవాలనీ, ముందస్తు బెయిల్ అవకాశాన్ని దుర్వినియోగం చేయడం పార్లమెంట్ ఉద్దేశాలకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ ఈ చట్టంలోని సెక్షన్ 18ఏ కింద పార్లమెంట్ ç2018లో సవరణలు చేసింది. అంతకుముందు డాక్టర్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టింది. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు కొన్ని నిబంధనలను విధించింది. వీటిలో ప్రధానమైవి.. ‘నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండటం. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే ప్రాథమిక విచారణ చేపట్టడం, అరెస్టు చేయడానికి అనుమతి పొందాల్సి రావడం’. ప్రభుత్వోద్యోగుల విషయంలో అయితే నియామక అధికారి ఆమోదం, ప్రభుత్వేతర ఉద్యోగైతే సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆమోదం పొందాకే అరెస్టు చేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిష్ప్రయోజకంగా మార్చిందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వ్యక్తిగత స్వేచ్ఛ, సమానత్వపు హక్కులకు భంగకరమంటూ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ ఇంకొందరు కోర్టుకెళ్లారు. ఎస్సీ, ఎస్టీల పట్ల దేశంలో కొనసాగుతోన్న వివక్ష కారణంగా చట్టం రూపకల్పనకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ప్రాథమిక విచారణ అక్కర్లేదని స్పష్టంచేసింది. -
ఎస్సీ, ఎస్టీ చట్టసవరణకు సుప్రీం కోర్టు మద్దతు
-
ఆ చట్టానికి సుప్రీం బాసట..
సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టానికి సర్వోన్నత న్యాయస్ధానం మద్దతు పలుకుతూ ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదుకు సీనియర్ పోలీస్ అధికారి అనుమతి అవసరం లేదని, ప్రత్యేక పరిస్ధితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఉండేలా చట్ట సవరణలో వెసులుబాటు కల్పించారు. ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదంటూ దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో ఆ చట్టానికి కోరలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించింది. శబరిమల వివాదంపై.. శబరిమల వివాదంపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఒకరి మతం, విశ్వాసాల విషయంలో మరొక మతస్తులు ఫిర్యాదు చేయవచ్చా అనే అంశం సహా పలు కోణాల్లో విచారణను సర్వోన్నత న్యాయస్ధానం చేపట్టనుంది. ఈ వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించేలా సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరిపించనుంది. ఈ విచారణలో పిటిషనర్లకు ఏడు రోజులు, ప్రతివాదులకు ఏడు రోజుల పాటు సుప్రీంకోర్టు సమయాన్ని కేటాయించింది. చదవండి : తీగలాగితే డొంక కదిలింది! -
‘సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోకి’
ఢిల్లీ: సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంచార, విముక్త జాతులను ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావాలని బుధవారం ఆయన రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. సమసమాజ స్థాపన లక్ష్యంగా అణగారిన వర్గాల ప్రజలు దౌర్జన్యాలు, దుర్మార్గాల పాలిట పడకుండా మన రాజ్యాంగ నిర్మాతలు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం వచ్చిందని గుర్తు చేశారు. సమాజంలో అణచివేతకు, నిరాదరణకు గురయ్యే వర్గాల ప్రజలను అత్యాచారాలు, దౌర్జన్యాల నుంచి కాపాడటం ఈ చట్టం ఉద్దేశమని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను మాత్రమే ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చి మిగిలిన సంచార, విముక్త జాతులను విస్మరించడం దురదృష్టకరమని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. సమాజంలో ఈనాటికీ సంచార ఇతర విముక్త జాతుల ప్రజలు దయనీయమైన జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. వారు తరచుగా దోపిడీ, దౌర్జన్యాలకు గురవుతున్నారని గుర్తుచేశారు. అత్యాచార నిరోధక చట్టం కింద ఉన్న ఎస్సీ, ఎస్టీల కంటే.. వారి పరిస్థితి దారుణంగా ఉందని ఆయన చెప్పారు. ఈ జాతులకు చెందిన ప్రజలను దోపిడీ, దౌర్జన్యాల నుంచి కాపాడటానికి ఇప్పుడు దృఢ నిశ్చయంతో చర్యలు చేపట్టాలన్నారు. అప్పుడే వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సంచార, విముక్త జాతులన్నింటినీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలోకి తీసుకురావాలని విజయసాయిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
దళితవర్గాలకు ఉపశమనం
షెడ్యూల్ కులాల, తెగల(అత్యాచారాల నిరోధక) చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. ఈ చట్టం కింద ఫిర్యాదులొచ్చినప్పుడు తక్షణం అరెస్టు చేయొద్దని, దాఖలైన కేసు ఈ చట్టం పరిధిలోకి వస్తుందా రాదా అన్నది తొలుత పరిశీలించాలని గత ఆదేశాల్లో సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులొచ్చినప్పుడు వారి నియామక అధికారి నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలని, ప్రైవేటు ఉద్యోగుల విషయంలోనైతే సీనియర్ సూపరింటెండెంట్(ఎస్ఎస్పీ) అనుమతి తీసుకోవాలని కూడా నిర్దేశించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవనుకున్న పక్షంలో నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చునని తెలిపింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ భూషణ్ గవాయ్‌ల నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ మార్గదర్శక సూత్రాల్లో ముందస్తు బెయిల్ అంశం మినహా మిగిలినవాటిని వెనక్కి తీసుకుంది. సుప్రీంకోర్టు నిరుడు ఇచ్చిన తీర్పు దళిత, గిరిజన వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఇప్పటికీ అంటరానితనం బలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి తీర్పు తమ మనుగడకు చేటు కలిగిస్తుందని ఆ వర్గాలు కలవరపడ్డాయి. ఆ తీర్పును నిరసిస్తూ నిరుడు ఏప్రిల్ 2న దేశవ్యాప్త బంద్ జరగడం, అందులో హింస చెలరేగి 11మంది ప్రాణాలు కోల్పోవడం, విధ్వంసం చోటుచేసుకోవడం అందరికీ గుర్తుంది. పర్యవసానంగా కేంద్ర ప్రభుత్వం ఆ తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతోపాటు పలు సంస్థలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధిపత్యకులాల్లో కులదురహంకారం బలంగా ఉన్నదని, దళితులను తోటి మనుషులుగా పరిగణించే మనస్తత్వం కరువైందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1955లో తొలిసారి ఈ వివక్షను అంతమొందించేందుకు అంటరాని తనం(నేరాల)చట్టం తీసుకొచ్చింది. 1976లో దానికి ఎన్నో మార్పులు, చేర్పులు చేసి పౌరహక్కుల చట్టంగా కొత్త చట్టాన్ని రూపొందించారు. ఆచరణలో లోటుపాట్లను గుర్తించాక 1995లో దానికి మరికొన్ని నిబంధనలు జోడించారు. కానీ ఎన్ని మార్పులు చేసినా ఆశించిన ఫలితం రాలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారలేదు. దళితులకు కనీస హక్కులు నిరాకరించడం, వారి ప్రాణాలు తీయడం, ఇబ్బందులకు గురిచేయడం వంటివి ఉన్నకొద్దీ పెరుగుతూ పోయాయి. దేశంలోని పలుప్రాంతాల్లో దళితుల ఊచకోతలు యధేచ్ఛగా సాగాయి. ఈ తీరు గమనించాక 1989లో మరింత పకడ్బందీ నిబంధనలతో షెడ్యూల్ కులాల, తెగల(అత్యాచారాల నిరోధక) చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. అయితే కేవలం చట్టాల వల్ల మనుషుల్లో మార్పు రాదు. అవి సక్రమంగా అమలైనప్పుడే, నిందితులకు సత్వరం శిక్షలు పడే వ్యవస్థ ఉన్నప్పుడే ఎంతోకొంత ఫలితం వస్తుంది. దాన్ని చక్కదిద్దే దిశగా చర్యలు తీసుకోవాల్సిన తరుణంలో అసలు చట్టాన్నే నీరుగారిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని సుప్రీంకోర్టు గమనించలేకపోయింది. అయితే ఈ చట్టం దుర్వినియోగం కావడం లేదని చెప్పడం అసత్యమే అవుతుంది. కానీ ఆ నిర్ధా రణకు రావడానికి సుప్రీంకోర్టు చూపిన కారణాలు సబబుగా లేవు. ఈ చట్టం కింద దాఖలవుతున్న కేసుల్లో శిక్షల శాతం తక్కువ గనుక అది దుర్వినియోగమవుతున్నట్టేనని భావించడం సహేతుకం కాదు. అదే గీటురాయి అన్ని చట్టాలకీ వర్తింపజేస్తే వాటిలో ఎన్ని మిగులుతాయో చెప్పడం కష్టం. కేవలం తప్పుడు కేసులు పెట్టడం ఎక్కువగనకే ఫలానా చట్టంకింద శిక్షలు పడటం తక్కువన్న నిర్ధారణకు రాలేం. అందునా వివక్షను అంతమొందించడానికి ఉద్దేశించిన షెడ్యూల్ కులాల, తెగల చట్టం కింద ఫిర్యాదులొచ్చినప్పుడు పోలీసులు వాటిని వెంటనే స్వీకరించి నిందితులపై చర్యలు తీసుకుంటారని ఆశించలేం. ఎందుకంటే ఇలాంటి నేరాలకు పాల్పడేవారంతా సమాజంలో ఎంతో పలుకుబడిగలవారు అయి ఉంటారు. ఎవరినైనా కొనగల స్థాయిలో ఉంటారు. తమనెవరూ ఏం చేయలేరనే భరోసాతో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగడం అంత సులభం కాదు. ఎవరి ఒత్తిళ్లకూ, ఏ ప్రలోభాలకూ లొంగని వ్యక్తిత్వం ఉండే అధికారులు మాత్రమే నిష్పక్షపాతంగా వ్యవహరించగలుగుతారు. ఇవేమీ లేనప్పుడు ఫిర్యాదు చేయడానికెళ్లిన దళితులకు బెదిరింపులు ఎదురవుతాయి. కొన్నిసార్లు వారికి డబ్బు ఆశ చూపి రాజీ పడమని చెబుతారు. ‘పెద్దవాళ్ల’తో పెట్టుకుంటే ముందూమునుపూ ముప్పు కలుగుతుందంటారు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో తాత్సారం చేస్తారు. చివరకు కేసు పెట్టినా అందులో దర్యాప్తు సక్రమంగా ఉండదు. న్యాయస్థానాల వరకూ వెళ్లాక సాక్షుల్ని బెదిరిస్తారు. విచారణ ఏళ్ల తరబడి సాగడం వల్ల దళితులే నిరాశకులోనై ఆసక్తిని కోల్పోతారు. ఇవేమీ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నిందితులకు శిక్ష పడుతుంది. ఎస్సీ, ఎస్టీ చట్టంకింద వచ్చే ఫిర్యాదుల్లో 50 శాతం వరకూ న్యాయస్థానాలముందుకే పోవని నాలుగేళ్లక్రితం ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ జరిపిన అధ్యయనంలో తేలింది. కనుక శిక్షల శాతం తక్కువుండటాన్ని బట్టి దాని దుర్వినియోగాన్ని నిర్ధారించడం పొరపాటు. దీనికితోడు దేశవ్యాప్తంగా దళితులపై వేధింపుల ఉదంతాలు నానాటికీ పెరుగుతున్నాయని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నివేదిక చెబుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవడం స్వాగతించదగ్గది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి తగిన దర్యాప్తు జరపడం పోలీసుల విధి అని సుప్రీంకోర్టు తాజా తీర్పులో తెలియజేసింది. అయితే ఫిర్యాదులు వచ్చిన సందర్భాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేదని తేలినపక్షంలో బాధ్యులైనవారిపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉండాలి. ఎందుకంటే దాన్నిబట్టే నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరవుతుంది. కనుక ఈ విషయంలో తగిన దృష్టి పెట్టాలి.