sickle cell anemia disease
-
నీ కూతురికి అండగా నేనుంటా.. చిన్నారి కుటుంబానికి జగన్ భరోసా
-
బతుకు దయనీయం.. కావాలి సాయం
రాజాం సిటీ/రూరల్: ఇద్దరు పిల్లలు కళ్ల ముందే చనిపోయారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకేమో రక్త హీనత. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం. చికిత్స కోసం ప్రయత్నిస్తున్న ప్రతిసారీ అప్పులు పెరిగాయి గానీ వ్యాధి తగ్గలేదు. 45 రోజులకు ఒకసారి అమ్మాయికి తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. ఈ తంతు పూర్తి చేయడమే ఆ తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతోంది. ఇక పూర్తిస్థాయి లో వైద్యం అందించాలంటే సాధ్యం కావడం లేదని వారు తడి కళ్లతో అంటున్నారు. దాతలు సాయం చేస్తే తమకు మిగిలిన కుమార్తెను కాపాడుకుంటామని ఆశపడుతున్నారు. రాజాం మండలం గురవాం గ్రామానికి చెందిన కుప్పిలి భాస్కరరావు, కుప్పిలి సరోజినిల దుస్థితి ఇది. వీరి కుమార్తె కుప్పిలి స్రవంతి డోలపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈమె ఐదో ఏట అనారోగ్యానికి గురవడంతో పచ్చకామెర్లు అనుకుని నాటు మందులు వాడారు. అయినా తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానిక కేర్ ఆస్పత్రిలో చేరి్పంచారు. అక్కడి వైద్యులు చిన్నారిని పరీక్షించడంతో అసలు విషయం బయటపడింది. సికెల్‌సెల్ ఎనీమియా వ్యాధి ఉందని నిర్ధారించారు. అప్పటి నుంచి ప్రతి నెలా రక్తమారి్పడి చేసుకుంటూ కుమార్తెను కాపాడుకుంటూ వస్తున్నారు. బెంగళూ రు వద్ద నర్సాపూర్‌లో, చెన్నై సమీపంలో రాయివెల్లూరు తదితర చోట్లకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. రూ. 5 లక్షల వరకు అప్పులు చేసి వైద్యం కోసం ఖర్చు చేశారు. ఎప్పటికప్పుడు రాయివెళ్లూరు వెళ్తుండటంతో వైద్యం కూడా తలకు మించిన భా రంగా మారింది. దీంతో గ్రామస్తులు, బంధువులు సహాయ సహకారాలు అందించారు. భారీ మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏమీ పాలుపోవడం లేదు. అప్పులు చేసే స్థితి కూడా దాటిపోయామని, కన్నపేగు ఇలా అయిపోతుంటే చూడలేకపోతున్నామని దాతలే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. సాయం చేయదలచుకున్న వారు 8985481872 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. మేనరిక వివాహంతో.. కుప్పిలి భాస్కరరావు, సరోజిని మేనరిక వివాహం చేసుకున్నారు. వీరికి మొదటగా కుమార్తె జన్మించి మూడేళ్ల వయసులో అనారోగ్యంతో మృతిచెందింది. తర్వాత కుమారుడు, మరో కుమార్తె పుట్టడంతో ఎంతో సంబరపడ్డారు. వీరిద్దరితో సరదాగా కాలం నెట్టుకొస్తున్న తరుణంలో మరోమారు విధి కన్నెర్రజేసింది. కుమారుడు కూడా చనిపోయాడు. ఉన్న ఒక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇంతలో వ్యాధి సోకడంతో వారి బాధ వర్ణణాతీతంగా మారింది. ఒక్కసారి రక్తం ఎక్కించిన తర్వాత ఒక్కో సారి 45 రోజులకు, ఒక్కోసారి నెలలోపే మరలా రక్తం ఎక్కించాల్సి వస్తుందని తల్లిదండ్రులు ‘సాక్షి’ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధికి చికిత్స చేయించడం తమ వల్ల కావడం లేదని, రేపటి రోజును తలచుకుంటేనే భయం వేస్తోందని అంటున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే తమ చిన్నారి బతుకుతుందని కోరుతున్నారు. -
పేదింటికి పెద్ద కష్టం
లావేరు : వారిది రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. అటువంటి కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. వారి ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తె సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతోంది. ఎప్పటికప్పుడు రక్త కణాలు తగ్గిపోతున్నాయి. నిత్యం రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పారు. ఇంతవరకు అప్పులు చేసి సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. బయట అప్పులు పుట్టకపోవడంతో వైద్యం చేయించలేక దీనంగా ఉండిపోయారు. దాతలు సహకరించి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తరుచూ రక్తం మార్చాలి పాలకొండకు చెందిన తేగల రాజు, తేగల జానకమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమార్తెలు. సుమారు 10 ఏళ్ల క్రితం ఉపాధి కోసం రణస్థలం మండలం జేఆర్‌పురం గ్రామానికి వలస వచ్చారు. ఇక్కడ భార్యాభర్త లిద్దరూ కూలి పనులు చేసుకుంటూ బతుకు బండిని సాగిస్తున్నారు. పెద్ద కుమార్తె వనితకు 2011వ సంవత్సరంలో సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని రక్త కణాలు తరుచూ తగ్గిపోతాయి. ఎప్పటికప్పుడు రక్తం ఎక్కించాలి. పాలకొండ, శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రులు, రిమ్స్‌లో వైద్యం చేయించారు. ఇప్పటివరకు సుమారు రూ.4లక్షలు అప్పు చేశారు. ఎలాగైనా కుమార్తె ఆరోగ్యం బాగు చేయించుకోవాలన్న తపనతో స్థోమతకు మించి అప్పులు చేసి వైద్యం చేయించారు. ఇక అప్పులు పుట్టకపోవడంతో చేసేదేమిలేక తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. కుమార్తె పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కంటతడి పెడుతున్నారు. దాతలు సహకరించి తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. దాతలు సహకరించి ఎస్బీహెచ్ బ్యాంకు ఖాతా నంబరు 62400418658కు సాయం చేయాలని కోరుతున్నారు. -
మన్యంలో మహమ్మారి
జనాన్ని మింగుతున్న సికిల్ సెల్ అనీమియా బి.గణేష్ బాబు, ‘సాక్షి’ ప్రతినిధి మన్యాన్ని ఓ మహమ్మారి మింగేస్తోంది. ప్రతి గూడెంలో చిన్న పిల్లలు ఈ వ్యాధి బారినపడి చనిపోతున్నారు. మన్యాన్ని వణికిస్తున్న ఆ జబ్బు పేరు ‘సికిల్ సెల్ అనీమియా’. జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఈ రక్తహీనత జబ్బుకు ఇంతవరకు మందులు లేవు. అసలు ఏజెన్సీలో ఎంతమందికి ఈ జబ్బు ఉంది? ఎందరు మరణించారు? లాంటి ప్రాథమికమైన గణాంకాలు కూడా ప్రభుత్వం వద్ద లేవు. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని గణాంక విభాగంలో ‘సికిల్ సెల్ అనీమియా’ రోగులు వివరాలను అడిగితే.. అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటని? అక్కడి సిబ్బంది ఎదురు ప్రశ్నించారు. గుజరాత్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఈ జబ్బు అదుపునకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ‘సికిల్ సెల్ అనీమియా’పై ఎలాంటి చర్యలూ తీసుకోని రాష్ట్రం ఏపీ ఒక్కటేనంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో దాదాపు 10 లక్షల గిరిజన జనాభా ఉంది. ఇందులో కనీ సం పది శాతం మందికి ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి. ఈ వ్యా దికి గురై మరణించేవారి సంఖ్య ఏటా పెరుగుతూ పోతోంది. యూనివర్సిటీ స్థాయిలో ‘హ్యూమన్ జెనెటిక్స్’ విభాగం వారు జరిపిన పలు శాంపిల్ సర్వేల లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర ఏజెన్సీ పరిసర గ్రామాల్లో నివశిస్తున్న గిరిజనేతర కులాల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటం మరింత ఆందోళన కలిగించే విషయం. నిర్లక్ష్యానికి పరాకాష్ట: పాడేరు పరిసర ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా రోగుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. ఎత్తయిన ప్రాంతం (3,600 అడుగులు) కావడం వల్ల ఈ ప్రాంతంలో ఆక్సిజన్ లభ్యతలో తేడాలుంటాయి. రోగులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. పాడేరు ఏరియా ఆస్పత్రిలో రెండు నెలల క్రితం రక్తం నిలువచేసే రిఫ్రిజరేటర్ చెడిపోయింది. బాగు చేయించడానికి రూ.20 వేలకన్నా ఎక్కువ ఖర్చుకాదు. అయినా పట్టించుకున్న నాధుడే లేడు. ఈ రోగానికి మందులు లేవు. సికిల్ సెల్ క్యారియర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడమే మార్గం. పరీక్ష ఖరీదు పది రూపాయలే: జబ్బు నిర్ధారణకు జరిపే ప్రాథమిక రక్త పరీక్ష ఖరీదు రూ.10లోపే ఉంటుంది. రక్త నమూనాను సోడియం మెటా బై సల్ఫేట్లో కలిపి మైక్రోస్కోప్ కింద చూస్తే రక్తకణాలు మామూలుగా ఉన్నాయా? వంపు తిరిగి ఉన్నాయా? అని తెలుస్తుంది. ఈ ప్రాథమిక పరీక్షను ‘ప్రైమరీ హెల్త్ సెంటర్ల’(పీహెచ్సీ) స్థాయిలోనే జరపవచ్చు. విశాఖ జిల్లాలో సికిల్ సెల్ అనీమియా ఎక్కువగా ఉన్న పాడేరు, అరకు పరిధిలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే ఎక్కడా సికిల్ సెల్ పరీక్షలు జరపడం లేదు. రోగులు మెరుగైన చికిత్సకోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి వచ్చినప్పుడు అక్కడ పరీక్షల్లో మాత్రమే వీరికి సికిల్ సెల్ అనీమియా ఉన్నట్లుగా నిర్ధారణ అవుతోంది. కొడుకు చనిపోయాడు.. కుమార్తెకూ వ్యాధి ఝాన్సీరాణి, క్రాంతిరాజు దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఝాన్సీరాణి పాడేరు సమీపంలోని కిండంగిలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. క్రాంతిరాజు గిరిజన కార్పొరేషన్లో సేల్స్‌మన్. మూడేళ్ల క్రితం 9వ తరగతి చదువుతున్న కొడుకు సురేష్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది. డాక్టర్లు ‘సికిల్ సెల్ అనీమియా’ అన్నారు. అన్ని రకాల వైద్యం చేయిస్తూ వచ్చినా 2013 సెప్టెంబర్‌లో చనిపోయాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోక ముందే కుమార్తె శ్రీలతకూ అదే విధమైన జబ్బు వచ్చింది. కూతుర్ని దక్కించుకోవడమెలాగో తెలియక ఆ దంపతులు పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఇది వీరి ఒక్కరి సమస్యే కాదు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గూడెంలోను వందలాది కుటుం బాలు ఇలాంటి వ్యథను అనుభవిస్తున్నాయి.