Social Distancing
-
పార్లమెంట్లో కరోనా నిబంధనల ఉల్లంఘన
సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఎంపీలు కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. సామాజిక దూరం అనే మాటే మర్చిపోయారు. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల ఎంపీలదీ అదే తీరు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం సెంట్రల్ హాల్లో ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ క్రమంలో మొదటి రెండు వరుసల్లో ఆసీనులైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రమే సామాజిక దూరం పాటించారు. మూడో వరుస నుంచి కూర్చున్న ఎంపీలు కోవిడ్–19 ప్రొటోకాల్‌ను లెక్కచేయలేదు. వీరిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కొన్ని బెంచీల్లో ఐదుగురు మాత్రమే కూర్చోవాల్సి ఉండగా, ఏడుగురు కనిపించారు. ఇక చాలామంది ఎంపీలు మాస్కులు కూడా కిందకు దించేశారు. మాస్కులు సక్రమంగా ధరించకుండానే ఒకరితో ఒకరు మాటల్లో మునిగిపోయారు. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం రాజ్యసభ, సా యంత్రం లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. (చదవండి: Nirmala Sitharaman Budget 2022 Speech) -
పండగ పూట... ఊరు పిలుస్తోంది
నను గన్న నా ఊరుకు వందనం. నా మాటలు విని నాకు మాటలు చెప్పిన రావిచెట్టు అరుగుకు వందనం. సైకిల్ టైరును కర్రపుల్లతో పరుగులెత్తించే వేళ నన్ను విమానం పైలెట్‌లా ఫీలయ్యేలా చేసిన ఊరి వీధులకు వందనం. కరెంటు స్తంబం దగ్గర రేగుపళ్లను అమ్మిన అవ్వకు వందనం. దొంగ కొంగలను అదిలించక చేపలకు భద్రం చెప్పిన చెరువుకు వందనం. అక్కా.. పిన్ని... బాబాయ్ పలకరింపులకు వందనం. తప్పు చేస్తే ఉమ్మడిగా కలిసి ప్రేమగా విధించిన దండనకు వందనం. పండగొచ్చింది. ఊరెళ్లాలి. కోవిడ్ సమయం ఇది. జాగ్రత్తగా వెళ్లాలి. సురక్షితంగా తిరిగి రావాలి. పొలిమేరల్లో అడుగుపెడుతూనే జిల్లున తండ్రి పేరు వినపడుతుంది. ‘ఏయ్యా... నువ్వు వెంకన్న కొడుకువే కదా’... ‘ఏమ్మా... రామారావు మేష్టారి చివరమ్మాయివేగా’... ఊరికి అందరూ తెలుసు. ఊరు తన మనుషులను గుర్తు పెట్టుకుంటుంది. తల్లిదండ్రులతో పాటుగా పిల్లల్ని. పిల్లలతో పాటుగా తల్లిదండ్రులని. బ్యాగ్ పట్టుకుని నడుస్తూనే అవే వీధులు. అవే ఇంటి పైకప్పులు. అవే డాబాలు. అవే చిల్లర అంగళ్లు. కొన్ని ఏవో మారిపోయి ఉంటాయి. పాత దగ్గర కొత్తవి వచ్చి ఉంటాయి. మేకప్ కొద్దిగా తేడా. ముఖం అదే. చిర్నవ్వు అదే. కళ్లాపి చల్లిన ముంగిళ్లు ఎదురు పడతాయి. వాటి మీద వేసిన ముగ్గులు తమ రంగులను లెక్కపెట్టమంటాయి. ఒక తల్లి ఎవరో ముసుగు తన్ని నిద్ర పోతున్న పిల్లలను లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక ఇంటి మీద పాకిన గుమ్మడిపాదు తన కాయలను నీకివ్వను పో అంటూ ఉంటుంది. ఈ మనుషుల మధ్యే కదా బాల్యం గడిచింది అని గుండెలకు కొత్త గాలి ఏదో తాకుతుంది. పొద్దున్నే పాల కోసం గిన్నె పట్టుకుని వచ్చింది ఈ వీధుల్లోకే. అదిగో సుబ్బయ్య టీ అంగడి. మళ్లీ ఇస్తాలే అని తాగి మర్చిపోయిన ఒకటి రెండు టీల బాకీ గుర్తుకొస్తోంది. పుల్లట్లు వేసే కాంతమ్మ ఇంటికి కొంత దూరం నడవాలిలే. ఆ చట్నీ అంత రుచిగా ఎలా ఉంటుందో కెఎఫ్సి వాడికి తెలిసుంటే ఫార్ములా కొనుక్కొని వెళ్లేవాడు. పెద్ద శెట్టి అంగడి ఇంకా తెరవలేదు. పండక్కి అమ్మ చీటి రాసిస్తే ఈ అంగడిలోనేగా చక్కెర, బెల్లం, యాలకులు, సగ్గుబియ్యం, ఎండు కొబ్బరి కొనుక్కుని వెళ్లేది. బెల్లం పొట్లం కట్టాక చేయి సాచితే కొసరు అందేది. బుగ్గ పండేది. అబ్బ. కచ్చేరి అరుగు. ఉదయం అక్కడే పేపర్ చదవాలి. మధ్యాహ్నం అక్కడే గోలీలాడాలి. సాయంత్రం అక్కడే ట్రాన్సిస్టర్‌లో పాటలు వినాలి. పులిజూదం ఆటలో ఒలింపిక్స్ మొనగాళ్లు మామూలు లుంగీల్లో అక్కడే తిరుగాడుతుండేవారు. ఊరి వార్తలు చెవిలో పడేసే మహా మహా జర్నలిస్టులు రాత్రి కూడు తినేసి పై కండువా సర్దుకుంటూ వచ్చేసేవారు. అందరికీ నీడనిచ్చే అరుగు చెట్టు వేల కొద్ది గువ్వలకు పురుళ్లు పోసి పోసి పండిపోయి ఉండేది. అది ఆకులు రాల్చి మోడుగా నిలిచే రోజుల్లో ఊరు చిన్నబుచ్చుకుని ఉండేది. నాన్న సైకిల్ ఈ దారుల్లోనే తిరిగేది. అమ్మ చేయి పట్టుకొని తొలాటకు ఇటుగానే వెళ్లేది. ఐసు బండి వస్తే ఏ రంగుది కొనుక్కోవాలో తెలియక రెండు మూడు నిమిషాలు నెత్తి గీరుకునేది. గెలిచిన గోలీలు దొంగలించిన శీనుగాడి మీద నాలుగైదు వారాలు పగబట్టేది. ఊళ్లోని మేనత్త మేమమామలు అసలు చుట్టాలుగా అనిపించకపోయేది. రైలు దిగి వచ్చే బాబాయి పిన్నే తమను కూడా వెంటబెట్టుకుని వెళతారని సంబరం కలిగిచ్చేది. పండగ సెలవుల్లో స్కూలు మైదానంలో గాలిపటాలు ఎగిరేవి. తోకలు లేని పిట్టలు తోకలు ఉన్న పటాల దారాలు లాగేవి. బిళ్లంగోడు దెబ్బకు బిళ్ల గిర్రున గాలిలో లేచేది. హరిదాసు చిడతలకు వాకిట్లో ఇల్లు గుమిగూడేది. బుడబుడల డమరుకానికి పాత బట్టలనీ వెలికి వచ్చేది. గంగిరెద్దుల సన్నాయికి ఒక్కటే పాట వచ్చు. కొమ్మదాసులు చెట్టెక్కి దిగకపోయేది. పిట్టలదొరల కోతలకు పంట చేలు కూడా అచ్చెరువొందేవి. కోలాటానికి మోత ఫెళ్లుఫెళ్లున మోగేది. పులేషగాళ్లు నిమ్మకాయను పళ్లతో కొరికి భయపెట్టేవాళ్లు. తప్పెట్లు తాటాకు మంటల చివరలకు బెదరక సెగ పొందేవి. ఊరి దేవత ఊరేగింపు సంబరంగా జరిగేది. పిండి వంటలు లేని ఇల్లు ఎక్కడ? కనిపెట్టిన వారికి బహుమానమండోయ్. ఈ ఇంటి మనుబూలు.. ఆ ఇంటి అరిసెలు... పొరుగింటి లడ్లు... ఇరుగింటి పాయసం. పెద్దవాళ్లు అడక్క పోయినా పిల్లలకు సినిమాకు చిల్లర ఇచ్చేవారు. కొత్త సినిమాల పోస్టర్లు టైమ్ మొత్తం తినేసేవి. ఊరు వదిలి ఉపాధి కోసం వచ్చేశాము. ఊరు గుండెల్లోనే ఉంది. పండగ వచ్చిందంటే అది జాబు రాయకనే పిలుస్తుంది. ఊరిని చూడాలి. మళ్లీ బతకాలి. నేస్తుల్ని కలవాలి. ఊసులను రాసి పోయాలి. ఊరికి బయలుదేరుతున్నా. జాగ్రత్తలు తీసుకుంటున్నా. దూరం పాటిస్తా. పిల్లలను గుంపులో వెళ్లకుండా చూసుకుంటా. ఈ పండగను వదలుకోలేను. ఊరికి వెళతాను. కాని ఊరిని నా నుంచి నన్ను ఊరి నుంచి సురక్షితంగా ఉంచేలా వెళతాను. ఆల్ ది బెస్ట్ చెప్పండి. -
UK: కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం వ్యక్తిగత బాధ్యతను గుర్తు చేస్తూ.. జులై 19 నుంచి ఫేస్ మాస్క్‌లు, సామాజిక దూరం వంటి కోవిడ్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఇష్టం ఉంటే మాస్కులు ధరించవచ్చు అని అన్నారు. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 4 నుంచి టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌ను వీక్షించడానికి పూర్తిస్థాయిలో అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి బ్రిటన్ ప్రభుత్వం జూన్ 21న పూర్తి ఆంక్షలను ఎత్తివేయాలనుకుంది. కానీ డెల్టా వేరియంట్ విజృంభన కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. -
సుశీల్ సాబ్.. ఎక్ ఫొటో ప్లీజ్!
న్యూఢిల్లీ: ప్రియ శిష్యుడు సాగర్ ధన్కర్ను హత్య చేసిన కేసులో అరెస్టయిన రెజ్లర్ సుశీల్ కుమార్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. హత్య కేసులో సుశీల్ నిందితుడిగా ఉన్నాడనే సంగతి పక్కనపెట్టి.. ఢిల్లీ పోలీసులు ఆ మాజీ ఒలింపిక్ మెడలిస్ట్‌తో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నేషనల్ మీడియా హౌజ్‌ల ద్వారా వైరల్ కావడంతో దుమారం మొదలైంది. మాస్క్‌లు లేవు, సోషల్ డిస్టెన్స్ లేదు. పైగా సుశీల్ సహా అందరూ ముఖంలో చిరునవ్వుతో ఫొజులిచ్చారు. ఆ ఫొటో తీసింది కూడా ఓ పోలీస్ అధికారే కావడం విశేషం. అయితే ఇది తాజా ఫొటోనేనా? లేక కరోనా విజృంభణ తర్వాత ఎప్పుడైనా తీశారా? తీస్తే ఎక్కడ తీశారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు ఈ ఫొటో మీడియా హౌజ్‌ల ద్వారా జనం, అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆ అధికారుల అభిమానంపై మండిపడుతున్నారు. సిగ్గులేకుండా ఇలాంటి డ్యూటీ చేస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రజలతో సహా ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అతనిప్పుడు స్పోర్ట్స్ సెలబ్రిటీ కాదని.. ఓ హత్యకేసులో నేరస్థుడనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నాడు. జైలు ప్రాంగణంలో.. అదీ ఓ నేరస్తుడితో ఫొటోలు దిగిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అసోషియేషన్ ఫోరమ్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. చదవండి: సుశీల్ గురించి సాగర్ పేరెంట్స్ ఏమన్నారంటే.. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్‌పై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి అనంతరం మూడు వారాలపాటు పరారీలో ఉన్న సుశీల్‌ను, సహ నిందితుడు అజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఆపై భద్రతా కారణాలతో సుశీల్‌ను తిహార్ జైలు-2కు తరలించారు. ఇక ఇదే కేసులో సుశీల్ జూడో కోచ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: సాగర్ హత్య, ఆ రాత్రి ఏంజరిగిందంటే.. -
We Care for You: వాట్సాప్ సర్వీస్ ద్వారా శాంసంగ్ బెనిఫిట్స్
న్యూఢిల్లీ: కస్టమర్ల సేఫ్టీ కోసం శాంసంగ్ సులువైన సౌకర్యాన్ని తీసుకొచ్చింది. కరోనా టైంలో షోరూమ్‌ల దగ్గర కస్టమర్ల క్యూ తాకిడిని తగ్గించేందుకు వీ కేర్ ప్రొగ్రాం కింద ఓ ఫీచర్‌ను తెచ్చింది. దాని పేరు ‘షాప్ బై అపాయింట్మెంట్’. శాంసంగ్ ప్రొడక్ట్స్ ఏవైనా కొనాలంటే ఇకపై కస్టమర్లు షోరూమ్ దగ్గర వేచిచూడాల్సిన అవసరం లేకుండా.. ముందుగా ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా శాంసంగ్ షాప్ బై అపాయింట్మెంట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని ప్రకారం.. కస్టమర్లకు దగ్గర్లో ఉన్న శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో ఫలానా తేదీ, ఫలానా టైంకి అపాయింట్మెంట్ ఇస్తారు. అంతేకాదు శాంసంగ్ స్మార్ట్ కేఫ్‌లలో అపాయింట్మెంట్ కోసం 9870494949 నెంబర్‌కు వాట్సాప్ చేసి.. కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. ఆ తర్వాత వాళ్లు అపాయింట్మెంట్ ఇచ్చే టైంకి షోరూంకి వెళ్లి.. ఎగ్జిక్యూటివ్‌తో నేరుగా ఇంటెరాక్ట్ అయ్యి కావాల్సిన ప్రొడక్ట్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్ల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ తేలికగా అమలు అవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా డివైజ్‌ల వివరాలు, లేటెస్ట్ ఆఫర్లు, దగ్గర్లోని స్టోర్ల వివరాలు తెలుసుకోవచ్చు. హోం డెలివరీ, హోం డెమో సర్వీసులను కస్టమర్లు అందుకోవచ్చు. అవసరమైన చెల్లింపులను డిజిటల్ పే ద్వారా చేయొచ్చు. ఈ-ఇన్వాయిస్లను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఇక ఈ సర్వీస్‌ల ద్వారా ప్రొడక్టులను కొనే కస్టమర్లకు 1000 రూ. దాకా రివార్డు పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లు శాంసంగ్ స్మార్ట్ క్లబ్ వాలెట్లో జమ అవుతుంది. ఈ సర్వీస్ ద్వారా గేలక్సీ ట్యాబ్స్, స్మార్ట్ వాచీలు, బడ్స్ మీద స్టూడెంట్స్‌కి స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. వీటితోపాటు అదనంగా రిఫరెల్ అడ్వాంటేజ్ ప్రోగ్రాం కింద ఆఫర్లు వర్తించే ఫోన్లపై రూ. 7500 రిఫరల్ బెనిఫిట్(రిఫరెన్స్ చేయడం ద్వారా) కస్టమర్లకు దక్కుతుంది. చదవండి: వాట్సప్ సమస్యలపై గ్రీవెన్స్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం ఎలా? -
రెండేసి ఇళ్లు కొంటున్నారు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా నేపథ్యంలో భౌతిక దూరం అనివార్యమైంది. కరోనా వచ్చాక ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండటం సమస్యే. ఒకవైపు కరోనా చేతికి చిక్కకుండా.. మరోవైపు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు సెకండ్ హోమ్స్ ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల నుంచి దూరంగా ఉండాలన్న లక్ష్యంతో భద్రత, ప్రశాంతమైన ప్రాంతాలలో నివాసం ఉండేందుకు సంపన్న వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, పచ్చని పర్యావరణంతో ఓపెన్ స్పేస్ ఎక్కువగా ప్రాంతాలలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఎవరు కొంటున్నారంటే? ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు చెందిన ప్రవాసులు, హైనెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), సంపన్న భారతీయులు ఎక్కువగా సెకండ్ హోమ్స్‌ను కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ తర్వాత సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు 20–40 శాతం, లావాదేవీలు 15–20 శాతం మేర వృద్ధి చెందాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ జేఎల్ఎల్ సీనియర్ డైరెక్టర్ రితేష్ మిశ్రా తెలిపారు. కొన్ని సంపన్న వర్గాలు నగరంలో 40 కి.మీ. పరిధిలో సెకండ్ హోమ్స్ కోసం ఎంక్వైరీలు చేస్తుంటే.. మరికొందరేమో 300 కి.మీ. దూరం అయినా సరే గ్రీనరీ, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని తెలిపారు. ఎక్కడ కొంటున్నారంటే? ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేందుకు వీలుగా వై–ఫై కనెక్టివిటీ, మెరుగైన రవాణా సేవలు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని నాసిక్, కర్ణాటకలోని మైసూరు, మంగళూరు, తమిళనాడులోని ఊటి, కేరళలోని కొచ్చి, హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కసౌలి, పర్వాను, పుదుచ్చేరి ప్రాంతాలలో సెకండ్ హోమ్స్‌కు డిమాండ్ ఉందని అడ్వైజరీ సర్వీసెస్ కొల్లియర్స్ ఇండియా ఎండీ శుభంకర్ మిత్రా తెలిపారు. దుబాయ్, యూఏఈలోనూ.. మిలీనియల్స్ కస్టమర్లేమో ముంబై నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న నాసిక్, కర్జాత్, డియోలాలి, పన్వేల్ సరిహద్దులలో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీ లు, ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే ధరలు పెద్దగా పెరగని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తున్నారు. చెన్నైలో మహాబలిపురం, కేరళలోని కోవలం మెయిన్ రోడ్లో ఫామ్‌హౌస్‌లకు డిమాండ్ ఉంది. గోవాలోని పలు బీచ్ ప్రదేశాలు కూడా హెచ్ఎన్ఐ ఆసక్తి ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. కొంతమంది సంపన్న వర్గాలు దుబాయ్‌లోనూ సెకండ్ హోమ్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సులువైన విమాన ప్రయాణం ఒక కారణమైతే.. ఆ దేశంలో కోవిడ్ నియంత్రణ మెరుగ్గా ఉండటం మరొక కారణమని తెలిపారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే దుబాయ్‌లో సెకండ్ హోమ్స్ డిమాండ్ 15–20 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. దుబాయ్‌లో రూ.1–1.50 కోట్ల ధరల ప్రాపర్టీలకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. రూ.100 కోట్ల ఫామ్‌హౌస్‌లు.. ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, బెంగళూరు నగరాలలో సెకండ్ హోమ్స్ వృద్ధి 30–40% వరకుందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఢిల్లీలోని చత్తర్‌పూర్, సుల్తాన్‌పూర్‌లలో రూ.10–100 కోట్ల ఫామ్ హౌస్‌లకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. ముంబైలో సెకండ్ హోమ్స్ కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉన్నారు. హెచ్ఎన్ఐ కస్టమర్లేమో... రూ.5–20 కోట్ల మధ్య ధరలు ఉండే స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, మిలీనియల్స్ కొనుగోలుదారులమో.. చిన్న సైజ్, రో హౌస్ అపార్ట్మెంట్ల కోసం అన్వేషిస్తున్నారు. రూ.1–5 కోట్ల ధరలు ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో వర్క్ ఫ్రం హోమ్‌కు వీలుగా వేగవంతమైన వై–ఫై కనెక్టివిటీ, ఆఫీసులకు వెళ్లేందుకు మెరుగైన రవాణా, ఇతరత్రా మౌలిక వసతులను కోరుకుంటున్నారు. -
టెస్టులు సరే.. మరి భౌతిక దూరం ఏదీ?
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కరాళ నృత్యం చేస్తూ విజృంభిస్తుంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు ప్రాణ భయంతో నిర్థారణ పరీక్షల కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకొనేందుకు కూడా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు రోగులు వస్తుండడంతో పీహెచ్‌సీల వద్ద జనం రద్దీ పెరిగిపోతోంది. దీంతో పీహెచ్‌సీల వద్ద కనీస భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు, ఒకరిపై ఒకరు పడుతూ రిజిస్ట్రేషన్ల కోసం ఎగబడుతున్నారు. వీరిని నివారించేందుకు ఆసుపత్రి సిబ్బంది సైతం చేతులెత్తేస్తున్నారు. దీనికి తోడు కనీస సౌకర్యాలు లేక టెస్టులు, వ్యాక్సిన్ల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ► ముషీరాబాద్ నియోజకవర్గంలో బైబిల్ హౌస్, డీబీఆర్ మిల్లు, గగన్మహల్లతో పాటు ముషీరాబాద్, భోలక్పూర్లలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో కరోనా టెస్టులతో పాటు వ్యాక్సిన్‌ను కూడా అందిస్తున్నారు. ► ముఖ్యంగా భోలక్‌పూర్, ముషీరాబాద్ కేంద్రాలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో పాటు ముషీరాబాద్ ప్రధాన రహదారిలో ఉండడంతో ఇక్కడ రద్దీ అధికంగా ఉంది. ► ముషీరాబాద్, భోలక్‌పూర్ కేంద్రాలకు రోజుకు సగటున సుమారు టెస్టులకు, వ్యాక్సిన్‌కు 300 మందికి పైగా హజరవుతున్నారు. ► టెస్టుల కోసం వచ్చే వారు మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తమ సీరియల్ నెంబర్ వచ్చే వరకు సుమారు గంట పాటు ఆవరణలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి. ► అలాగే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఆరగంట పాటు ఎటువంటి రియాక్షన్ లేదని నిర్థారణ అయ్యే వరకు అక్కడ వేచిచూడాల్సి ఉంటుంది. దీనితో ఆ ప్రాంగణం కిటకిటలాడుతోంది. పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలి.... ► టెస్టులు, వ్యాక్సిన్ల కోసం వచ్చే బాధితులు, వారికి సహయకులుగా వచ్చే వారు క్యూ లైన్, భౌతిక దూరం పాటించే విధంగా ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసులు టీం లను ఏర్పాటు చేసి రోగులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. ► దీనికి తోడు మహిళలకు టాయిలెట్ సౌకర్యం, టెస్టులు, వ్యాక్సిన్ అందించే ఆరోగ్య కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు. ( చదవండి: ఇంట్లోకి వస్తువులు తెచ్చుకుందామని.. చిన్నారిని ) -
కేక్ కోసం చొంగ కార్చుకున్న పాక్ మంత్రి, వైరల్
ఇస్లామాబాద్: భారత్‌పై విషాన్ని చిమ్మి వార్తల్లో నిలిచే పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఈసారి ఓ బిత్తిరి చర్యతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో ఇటీవల నిర్మించిన రోడ్డును ప్రారంభించడానికి వచ్చిన ఖురేషీ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వార్తల్లో నిలిచారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఒక పెద్దకేకును కట్ చేశారు. కరోనా నిబంధనల్ని మరచి.. కేక్ కావాలా తీసుకొండని మంత్రి అక్కడున్న జనానికి సూచించారు. దీంతో కారక్రమానికి హజరైనవారు కేక్ ముక్క కోసం ఎగబడ్డారు. వారిలో ఏఒక్కరు కూడా సామాజిక దూరం పాటించలేదు. మాస్క్‌లు ధరించలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాస్కు ధరించిన మంత్రి ఖురేషీ కూడా కేక్ కోసం అర్రులు చాచాడు. తన నోటికి మాస్కు ఉందన్న సంగతి మరచి.. కేక్ తినేందుకు ఆరాటపడ్డాడు. మంత్రిగారి వ్యవహారానికి సంబంధించిన వీడియోను పాక్ జర్నలిస్ట్ నాయ్లా ఇనాయత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఖురేషీ ప్రవర్తన పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో బాధ్యత గల పదవిలో ఉండి ఇవే పిల్ల చేష్టలు అని తిట్టిపోస్తున్నారు. చదవండి: భారీగా తగ్గిన అంతర్జాతీయ వలసలు! -
ఆక్స్ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’ లేదు
లండన్: ఏటా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ఏదో ఒక పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. సాధారణంగా సంవత్సరమంతటా ప్రాచుర్యం పొంది, ప్రజల నోళ్లలో నానిన పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నం. ఈ ఏడాది భాష చాలా అభివృద్ధి చెందిందని చెప్పింది. దీనికి కారణం కరోనా వైరస్. ఈ పదం కారణంగా కోవిడ్, లాక్డౌన్, సోషల్ డిస్టన్స్, రీఓపెనింగ్ వంటి పదాలు విరివిగా వాడుకలోకి వచ్చాయి. దీంతో ఒకే పదాన్ని ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించలేమని చెప్పింది. నెలల వారీగా చూస్తే పలు పదాలు బాగా ప్రాచుర్యం పొందాయి. జనవరిలో బుష్ఫైర్, ఫిబ్రవరిలో అక్విట్టల్, మార్చి నుంచి మే వరకు కోవిడ్–19, లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్, రీఓపెనింగ్ వంటి పదాలు ముందు వరుసలో నిలిచాయి. జూన్‌లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్, ఆగస్టులో మెయిల్–ఇన్, బెలాసరుసియన్, సెప్టెంబర్‌లో నెట్ జీరో, అక్టోబర్‌లో సూపర్ స్ప్రెడర్ పదాలు ప్రాచుర్యం పొందాయి. -
భార్యాభర్తలకూ భౌతికదూరం తప్పదు!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా లండన్, టూ టైర్, త్రీ టైర్ నగరాల్లో, కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు, సుదీర్ఘకాలంపాటు సన్నిహిత సంబంధాలు కలిగిన జంటలు ఇంట్లో అయినా, బయటైనా కలుసుకున్నప్పుడు ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ మార్గదర్శకాల్లో పేర్కొంది. అంటే వారు లైంగిక సంబంధాలు కొనసాగించరాదని పరోక్షంగా స్పష్టం చేసింది. ఒకే కప్పు కింద నివసిస్తున్న భార్యాభర్తలు, సహజీవనం సాగిస్తున్న జంటలు ఇంటా బయట భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, వారు లైంగిక సంబంధాలు కొనసాగించవచ్చని పేర్కొంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో ఉన్నప్పుడు భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, బయటకు వెళ్లినప్పుడు పాటించాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఉద్యోగం రిత్యా, లేదా మరే ఇతర కారణాల వల్లనో వేర్వేరుగా జీవిస్తున్న భార్యాభర్తలు, సహజీవన జంటలు ఇంటా బయట కలసుకున్నప్పుడు భౌతిక దూరం పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను లైంగికంగా కలుసుకోరాదని చెప్పే హక్కు ప్రభుత్వానికి లేదని, ఇది తమ ప్రైమసీ హక్కులకు భంగం కలిగించడమేనంటూ వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కొత్తగా విధించిన ఆంక్షలు ఎంతవరకు సబబంటూ ప్రభుత్వ వర్గాలను ప్రశ్నించగా, సమాజంలో ఇప్పటికీ కరోనా వైరస్ వేగంగా విజంభిస్తోందని, కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే ఇతర కుటుంబ సభ్యులకు సోకకుండా నివారించేందుకే ఈ నిబంధనలంటూ ప్రభుత్వ వర్గాలు సమర్థించాయి. -
‘ఇలా అయితే కరోనా గొలుసు తెంచలేం’
సాక్షి, న్యూఢిల్లీ: మాస్క్‌ను ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు అనుసరించకుండా ఉంటే కరోనా మహమ్మారి గొలుసును తెంచడం చాలా కష్టమని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అన్నారు. హెల్త్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన ఆయన... ఇప్పటికీ చాలా మంది మాస్క్‌లు ధరించడం లేదని, సామాజిక దూరం పాటించలేదని అన్నారు. అలా అయితే కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం సాధ్యం కాదని అన్నారు. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తరువాత దాదాపు అన్ని సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు పునఃప్రారంభం అయ్యాయని, ఇలాంటి సమయంలో కరోనా మార్గదర్శకాలు పాటించడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెల్త్ వర్క్‌ల కృషిని అభినందించారు. వారి సేవ ఎన్నటికి మరవలేనిదని అన్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చదవండి: గుడ్‌న్యూస్ : జనవరి నాటికి కోవిడ్-19 వ్యాక్సిన్ -
వైరల్: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది
కొన్ని జంతువులు చేసే పనులు మనుషులను అశ్చర్యపరచడంతోపాటు ఆలోచింపజేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ చిన్న కుక్కపిల్ల ఓ పార్కులో తెలివిగా చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ‘వెల్కమ్ టూ నేచర్’ అనే ట్వీటర్ ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఈ చిన్న కుక్క పిల్ల చాలా సీరియస్‌గా సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ.. పార్క్‌లో తిరుగుతోంది’ అని కాప్షన్ జతచేసింది. ఇప్పటివరకు ఈ వీడియోను ఒక లక్ష మంది వీక్షించగా, 13 వేలమంది లైక్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ వైరస్ నియంత్రణకు సామాజిక దూరం నిబంధన పాటించాలని ప్రజలకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొంతమంది ఆకతాయిలు ఎటువంటి సామాజిక దూరం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన సంఘటనలను మనం చాలానే చూశాం. అయితే వైరస్‌పై ఎలాంటి అవగాహన లేని ఓ చిన్న కుక్క పిల్ల సామాజిక దూరం పటించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘క్యూట్ ఉన్న కుక్కపిల్ల చేస్తున్న పని చాలా గొప్పది’, ఆ కుక్క పిల్ల మనుషుల కంటే చాలా స్మార్ట్‌గా ఉంది. అలా ఉండటం దానికే మంచిది’’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ కుక్కపిల్ల సామాజిక దూరం నిబంధనను పాటిస్తున్న తీరును చూస్తే మనుషులు కచ్చితంగా పాటిస్తారని చెప్పగలను’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
కుక్క పిల్ల చాలా తెలివైంది
-
ఇలా చేస్తే 2 లక్షల మరణాలు నివారించవచ్చు..
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ని తుదముట్టించే వ్యాక్సిన్ ఏది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటివి పాటిస్తే.. వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చనే సంగతి అనుభవపూర్వకంగా తెలిసి వస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) నిర్వహించిన మోడలింగ్ అధ్యాయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి కఠినంగా పాటిస్తే.. 2020 డిసెంబరు నాటికి భారతదేశంలో రెండు లక్షల కరోనా మరణాలను నివారించవచ్చని తెలిపింది. కేసుల సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని అధ్యాయనం వెల్లడించింది. అంతేకాక భారత్ లాంటి అధిక జనాభా కల దేశంలో మహమ్మారి విజృంభణ ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయలేం కాబట్టి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి ఇండియాలో అత్యవసరమని అధ్యాయనం స్పష్టం చేసింది. (చదవండి: 69% మందికి లక్షణాల్లేవ్..!) ఇప్పటికే ఢిల్లీ వంటి కొన్ని పట్టణాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి మంచి ఫలితాలిచ్చాయంది. ఈ అధ్యాయనం ప్రకారం భారతదేశంలో ఆగస్టు నాటికి కరోనా మరణాల సంఖ్య 60 వేల పై చిలుకు ఉండగా.. డిసెంబరు, 2020 నాటికి 2,91, 145 మంది కోవిడ్ బారిన పడి మరణిస్తారని మోడలింగ్ అధ్యాయనం అంచాన వేసింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 చేరింది. -
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
-
‘బాలయ్య కరోనా మంత్రం’పై జోకులే జోకులు!
సాక్షి, అనంతపురం: వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ప్రవర్తనతో వార్తల్లో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజలకు ఉచిత సలహాలిచ్చి విమర్శలు కొనితెచ్చుకున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైన బాలయ్య 9 నెలలుగా అటువైపు కన్నెత్తైనా చూడలేదు. ఈక్రమంలో ఆయన తీరుపై స్థానికంగా విమర్శలు రావడంతో సోమవారం హిందూపురంలో పర్యటించారు. అయితే, భౌతికదూరం నిబంధనలను పాటించకుండా సమావేశంలో పాల్గొన్నారు. (దళితులు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు) దాంతోపాటు.. కరోనాకు భయపడొద్దని, వేద మంత్రాలతో కరోనాను ఎదుర్కొందామని చెప్తూ లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారు. కరోనా నివారణ కోసం ఈ మంత్రాన్ని పఠించాలని ప్రజలకు సూచించారు. తాను చెప్పిన మంత్రాన్ని 108 సార్లు చెబితే కరోనా దరిచేరదని బాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సింది పోయి మంత్రాలు చదవమనడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ‘బాలయ్య కరోనా మంత్రం’ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. (టీడీపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్’) -
మెట్రో రీ ఓపెన్.. ఫైన్ల మోత
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలుగా నిలిచి పోయిన మెట్రో రైళ్లు.. అన్‌లాక్ 4.0లో భాగంగా వచ్చే నెల తొలివారంలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించనున్నట్లు మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం నూతన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నారు మెట్రో అధికారులు. ఈ మేరకు గురువారం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సమావేశం అయ్యి చర్చించారు. దీని ప్రకారం ఫేస్ మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం, రైళ్లు లేదా ప్లాట్‌ఫామ్‌లలో సామాజిక దూరం పాటించకపోవడం, ఉమ్మి వేయడం, చెత్తాచెదారం పడేయడం.. ఖాళీగా ఉండటానికి ఉద్దేశించిన సీట్లపై కూర్చోవడం వంటివి చేస్తే భారీ జరిమానాలు విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. (చదవండి: కోవిడ్-19 : దీదీ కీలక నిర్ణయం) అంతేకాక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకరు నిత్యం మెట్రో రైలు, స్టేషన్లో ఉంటారని.. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూస్తారని సమాచారం. ఇక నిబంధనలు పాటించని వారిపై ఫైన్ల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని వారికి మొదటిసారి 500 వందల రూపాయల జరిమానా విధిస్తారని.. పలుమార్లు నిబంధలు ఉల్లంఘించేవారి విషయంలో ఈ మొత్తం భారీగా పెరగనున్నట్లు సమాచారం. జనతా కర్ఫ్యూ విధించిన నాటి నుంచి ఢిల్లీ మెట్రో సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఇతర రవాణా మార్గాలను అనుమతిస్తున్నారు కానీ మెట్రో మాత్రం ప్రారంభం కాలేదు. దీని ద్వారా ప్రతి రోజు ఢిల్లీలో 2.4 మిలియన్ల మంది ప్రయాణిస్తారు. -
26 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి
లండన్: కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజల్ని కాపాడడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం భౌతిక దూరం. ఇన్నాళ్లూ ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోతుందని అనుకుంటూ వచ్చాం. కానీ ఆ దూరం సరిపోదని ఆక్స్ఫర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్–19 రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, పాడినప్పుడు ఆ వ్యక్తి నోటి నుంచి వెలువడే కంటికి కనబడని తుంపర్లు కొద్ది సెకండ్లలోనే 26 అడుగుల వరకు ప్రయాణిస్తాయని బీఎంజే జర్నల్‌లో ప్రచురితమైన ఆ సర్వే వెల్లడించింది. వైరస్ బారిన పడిన వ్యక్తి మాట్లాడినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయని, అదే దగ్గడం, తుమ్మడం లేదంటే పాటలు పాడడం వంటివి చేసినప్పుడు ఏకంగా 26 అడుగుల దూరం ప్రయాణిస్తాయని ఆ సర్వే తేల్చింది. అందులోనూ తలుపులన్నీ మూసి ఉంచిన ప్రదేశాలు, గాలి వెలుతురు రాని ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గతంలో కాలిఫోర్నియా యూనివర్సిటీ, స్టాన్ఫార్డ్ యూనివర్సిటీల పరిశోధనల్లో 20 అడుగుల దూరం వరకు తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని వెల్లడైంది. తాజా అధ్యయనంలో 26 అడుగుల వరకు తుంపర్లు ప్రయాణిస్తాయని వెల్లడి కావడంతో కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడానికి భౌతిక దూరం నిబంధనలు మార్చాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మహిళల్లో ముప్పు తక్కువకి కారణమిదే ! ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 గణాంకాల ను పరిశీలిస్తే మహిళల్లో కంటే పురుషులకే వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి గల కారణాలను అమెరికాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్‌కి చెందిన శాస్త్రవేత్తలు అన్వేషించారు. వారి పరిశోధనల్లో మహిళల్లో సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ వల్ల వైరస్ సోకే ముప్పు తక్కువగా ఉందని తేలింది. కరోనా వైరస్ సోకితే గుండె మీద తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. మహిళల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా నిరోధిస్తూ ఉంటుంది. అదే విధంగా కరోనా వైరస్ ప్రభావం నేరుగా గుండెపై పడకుండా ఈస్ట్రోజ న్ అడ్డుపడు తుందని, దీం తో వైరస్ సోకినా మహి ళల్లో ముప్పు తక్కువగా ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ లియాన్నె గ్రోబన్ చెప్పారు. తాము చేసిన అధ్యయనం కోవిడ్ చికిత్సకి పనికి వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. -
కరోనా: వైద్య నిపుణుల హెచ్చరికలు
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం తదితర జాగ్రత్తలు తీసుకుంటూ.. వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవడం ముందుకు సాగడమే ప్రస్తుతం మన ముందున్న మార్గం. అయితే మాస్కులు పట్ల ప్రజల్లో అవగాహన పెరిగినప్పటికీ, చాలా మంది భౌతిక దూరం పాటించడం లేదని, మాస్కు ఉందనే ధీమాతో ఎదుటి వ్యక్తులకు చేరువగా ఉండటం పట్ల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల కరోనా వైరస్ తన రూపం మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతున్న వేళ.. మనిషికి, మనిషికీ మధ్య ఆరు ఫీట్ల కంటే ఎక్కువ దూరం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు బీఎంజే అనే మెడికల్ జర్నల్‌లో అంటువ్యాధి నిపుణులు పలు కీలక విషయాలు వెల్లడించారు. (చదవండి: మాస్కులతో పెరుగుతున్న నిర్లక్ష్యం) కరోనా ఉధృతి పెరుగుతున్న వేళ ఇండోర్లు, వెలుతురు తక్కువగా ఉండే చోట్ల ఆరడగుల కంటే ఎక్కువ దూరం పాటించాలని సూచించారు. మాస్కు ధరించడం, బయట తిరుగుతున్న సమయం, జన సమూహ సాంద్రత, తదితర అంశాలు వైరస్ వ్యాప్తిలో ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఈ విషయం గురించి వర్జీనియా టెఖ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ లిన్సే మార్ మాట్లాడుతూ.. ‘‘ఆరు ఫీట్ల దూరం పాటించడం బాగానే ఉంటుంది. అయినప్పటికీ వైరస్ సోకే ప్రమాదం ఉండదని కచ్చితంగా చెప్పలేం’’అని అభిప్రాయపడ్డారు. కాగా గాలి ద్వారా సోకే ఏదేని వైరస్ కణాలు కనీసం ఆరడగుల దూరం వరకు వ్యాప్తి చెందగలవని జర్మన్ బయోలజిస్టు కార్ల్ ఫ్లగ్ దాదాపు 200 ఏళ్ల క్రితం( 1800ల్లో) ఓ పరిశోధనలో భాగంగా వెల్లడించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఈ విషయంపై పరిశోధనలు సాగించిన చాలా మంది శాస్త్రవేత్తలు ఆయన వాదనతో ఏకీభవించలేదు.(చదవండి: కరోనా కట్టడికి కిటికీలు తెరవాలి!) ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ సెంటర్లు కనీసం ఆరు ఫీట్ల దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కనీసం ఒక మీటర్ లేదా మూడడుగులు దూరం పాటిస్తే సరిపోతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల్లో కేవలం ఒకటిన్నర మీటర్లు(5 ఫీట్లు), మరికొన్ని దేశాల్లో ఆరున్నర ఫీట్ల దూరం పాటించాలని నిబంధనలు విధించాయి. ఇక ముఖానికి మాస్కులు ధరించడం అలవాటు చేసుకున్న ప్రజలంతా తమకు కరోనా సోకదనే ధీమాతో ఉన్నట్లు లండన్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ సామాజిక లేదా భౌతిక దూరం పాటించడానికి సుముఖంగా లేరని సర్వేలో తేలింది. దీంతో కరోనా వైరస్ రెండోసారి గనుక దాడి చేసినట్లయితే ప్రజలను భౌతిక దూరం పాటించేలా చేయడం చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కరోనా పై జనాల్లో అతిభయం
-
మంత్రులు, అధికారులు భౌతిక దూరం పాటించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రులు, అధికారులు భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, కేంద్రం నిర్దేశించిన మేరకే జనం హాజరయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల ఆదేశించింది. కరోనా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. మంత్రులు, అధికారులు ఎక్కడా భౌతిక దూరం పాటించడం లేదని, కేంద్ర నిబంధనలకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వందలాది మంది ఆయా సమావేశాల్లో పాల్గొంటున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ నివేదించారు. ఈ మేరకు 120కి పైగా వీడియోలను ఆధారాలుగా సమర్పిస్తానని తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలు పాటించకపోవడంతో కరోనా వ్యాప్తి చెందుతోందని, మంత్రులు, అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
దక్షిణ కొరియాకు షాక్.. భారీగా కేసులు
సియోల్: కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేసినట్లు వెల్లడించిన దక్షిణ కొరియాలో తాజాగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసులు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సియోల్ ప్రాంతంలో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సగం జనాభా అనగా సుమారు 51 మిలియన్ల మంది ఇక్కడే నివసిస్తున్నారు. శనివారం ఇక్కడ 166 కొత్త కరోనా కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 11 నుంచి చూస్తే.. ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. శుక్రవారం 103 కేసులు వెలుగు చూశాయి. వరుసగా రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 100 దాటడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త కేసులలో 11 మినహా మిగిలినవి లోకల్ ట్రాన్స్మిషన్ వల్ల సంక్రమించాయని.. అవి కూడా చాలావరకు సియోల్ ప్రాంతంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. (కోవిడ్‌కు దక్షిణ కొరియా కళ్లెం ఇలా..) దక్షిణ కొరియాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం ప్రకటించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో 15,039 కేసులు నమోదు కాగా 305 కరోనా మరణాలు సంభవించాయి. కొత్తగా వెలుగు చూసిన కేసులలో 155 స్థానికంగా నమోదయ్యాయన్నారు అధికారులు. ఇవన్ని కూడా ఎక్కువ జనసాంద్రత కల్గిన సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే నమోదయ్యయని తెలిపారు. ఈ ప్రాంతంలో వేలాది చర్చిలను మూసివేయలేదు. దాంతో వైరస్ వ్యాప్తికి ఇవి కేంద్రాలుగా నిలిచాయి. చర్చి నిర్వహకులు కరోనా నివారణ చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యారంటున్నారు అధికారులు. ఆరాధకులు మాస్క్ తీసేసి ప్రార్థనల్లో పాల్గొనడమే కాక.. పాటలు పాడే సమయంలో, భోజన సమయంలో గుంపులుగా చేరడం, మాస్క్ ధరించకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందన్నారు అధికారులు. అంతేకాక నర్సింగ్ హోమ్‌లు, పాఠశాలలు, రెస్టారెంట్లు, బహిరంగ మార్కెట్లు, డోర్ టూ డోర్ సేల్స్ పర్సన్ల వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. (ఏంటి డాక్టర్ ఇదీ..) నేడు దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవం. యుఎస్, సోవియట్ దళాలు కొరియాపై దశాబ్దాలుగా ఉన్న జపాన్ ఆక్రమణను ముగించిన రోజు కాబట్టి దక్షిణ, ఉత్తర కొరియా రెండింటిలోనూ ఆగస్టు 15న ప్రతి సంవత్సరం పండుగలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా వేడుక నిర్వహించారు. అయితే నిర్వహకులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని అధికారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో సామాజిక దూరం అమలు చేయలేదు. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన నియమాలు అమలు చేస్తుందని భావిస్తున్నారు జనాలు. -
ఆశా జీవులు
సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ముందు వరుసలో ఉండి కరోనా వ్యాప్తి నిరోధానికి పాటు పడినన్నాళ్లూ ఆశా వర్కర్లను పిలిచి కిరీటం పెట్టని ఢిల్లీ ప్రభుత్వం.. ఇప్పుడు వాళ్లు తమ గౌరవ వేతనాన్ని కనీసం పదివేల రూపాయలకైనా పెంచాలని కోరుతూ నిరసనకు కూర్చుంటే.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేస్తోంది! ఢిల్లీలో ఆశా వర్కర్లు జూలై 21 నుంచి ధర్నాలో ఉన్నారు. వారిలో కొందరు బుధవారం జంతర్ మంతర్ దగ్గర భైఠాయించినప్పుడు సుమారు 100 మంది ‘ఆశా’ జీవులపై పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, ఎపిడమిక్ డీసీజ్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద కేసులు పెట్టారు! ఆశా వర్కర్లు ప్రస్తుతం 4 వేల రూపాయల వేతనానికి మోయలేని సేవలే అందిస్తున్నారు. ఇంకో ఆరువేలు పెంచాలని, పి.పి.ఇ. కిట్లు ఇవ్వాలని వారి డిమాండ్. విజ్ఞప్తిని డిమాండ్ వరకు ప్రభుత్వమే తెచ్చుకుంది. తిరిగి ప్రభత్వమే ఇప్పుడు వారిపై కేసులు పెడుతోంది. ఆశావర్కర్ల ఢిల్లీ కో ఆర్డినేటర్ కవితా యాదవ్ మాత్రం ఈ కేసుల గురించి కన్నా పెరుగుతున్న కరోనా కేసుల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీని కరోనాకు వదిలి పెట్టామే అని అపరాధ భావన వాళ్లను నిలువనిచ్చేలాను, కూర్చోనిచ్చేలానూ లేదు.‘ప్రభుత్వానికి లేకుంటే మాకు ఉంటుంది కదా’ అని సేవలకు పునరంకితం అయేందుకు తన సేనను సమాయత్తం చేసున్నారు కవిత. -
జిమ్స్ రీ ఓపెన్.. కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేకుందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నెల 5 నుంచి వీటిని తిరిగి ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ మేరకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. జిమ్ ట్రైనర్లు, సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తెలిపింది. మాస్క్ తప్పక ధరించాలని.. అంతేకాక జిమ్‌కు వచ్చే ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. అయితే కంటైన్మెంట్ జోన్లలోని యోగా ఇనిస్టిట్యూట్లు, జిమ్‌లు తెరిచేందుకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అంతేకాక స్పాలు, స్మిమ్మింగ్ ఫూల్లు తెరవడానికి కూడా అనుమతిలేదు. జిమ్‌లు తెరుస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి... (లాక్డౌన్ ఎఫెక్ట్.. శరీరం సహకరించడం లేదు) 1. 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు మూసివేసిన ప్రదేశాలలోని జిమ్‌లను ఉపయోగించవద్దని కోరింది. 2. జిమ్ సెంటర్లలో అన్ని వేళలా ఫేస్ కవర్, మాస్క్ తప్పనిసరి. కానీ వ్యాయామం చేసేటప్పుడు, మాస్క్ వాడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది కనుక విజర్ మాత్రమే ఉపయోగించవచ్చు. 3. ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. 4. యోగా సెంటర్, జిమ్‌లో వ్యక్తుల మధ్య నాలుగు మీటర్ల దూరం ఉండాలి. పరికరాలను ఆరు అడుగుల దూరంలో ఉంచాలి. సాధ్యమైతే వాటిని ఆరుబయట ఉంచాలి. 5. గోడలపై సరైన గుర్తులతో భవనంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి నిర్దిష్ట మార్గాలను ఏర్పాటు చేయాలి. 6. ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ కోసం, ఉష్ణోగ్రతను 24-30 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంచాలి. వీలైనంతవరకు తాజా గాలిని తీసుకోవాలి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జిమ్, యోగా సెంటర్ గేట్లలో శానిటైజర్ డిస్పెన్సర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు తప్పనిసరిల. సిబ్బందితో సహా కరోనా లక్షణాలు లేని వ్యక్తులు మాత్రమే జిమ్‌లోనికి అనుమతించబడతారు. -
నేడు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక భేటీ