Somajiguda
-
రంగీలా రాస్ అదిరేటి స్టెప్పులు.. వినసొంపైన గీతాలు (ఫోటోలు)
-
కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్‌పై ఫోర్జరీ కేసు..
బంజారాహిల్స్: కోటక్ మహేంద్ర బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్‌తో పాటు మరో 5 మందిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోర్జరీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–70లోని అశ్వని లేఅవుట్, ప్రశాసన్‌నగర్‌లో నివసించే జి.అరి్మతారెడ్డి అప్పటి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ హిమాయత్‌నగర్ బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరిగ్గా ఆమెకు హౌసింగ్ లోన్ మంజూరయ్యే సమయానికి ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ కోటక్ మహేంద్ర బ్యాంక్‌లో విలీనమైంది. తనకు రుణం మంజూరైందని సమాచారంఅందడంతో ఆమె కోటక్ మహేంద్రబ్యాంక్ సోమాజీగూడ బ్రాంచ్‌ను ఆశ్రయించగా అక్కడి బ్యాంక్ అధికారులు ఆమె నుంచి ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో వడ్డీ రేటు ఒక రకంగా చెప్పి ఆ తర్వాత అదనపు వడ్డీ రేట్లను నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు తెలియకుండా వేశారు. ఉద్దేశపూర్వకంగా పోర్జరీ డాక్యుమెంట్లతో ఒప్పందాలను ఉల్లంఘించి తనను మోసం చేశారంటూ బాధితురాలు 2020 జనవరి 7న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాగా పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో ఆమె 17వ అదనపు చీఫ్ జ్యూడిషియల్ మెజి్రస్టేట్ను ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్ ప్రకాష్ ఆప్టే, ఎండీ ఉదయ్ కోటక్, సోమాజీగూడ బ్రాంచ్ మేనేజర్ జే ప్రదీప్‌కుమార్, హిమాయత్‌నగర్ రీజనల్ మేనేజర్ ఎన్.ప్రశాంత్‌కుమార్, సోమాజీగూడ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్.రామచంద్రన్, బ్యాంక్ అధికారి సుదీర్, ఉద్యోగి గుత్తా ఈశ్వర్లపై కేసు నమోదు చేశారు. తాను ఈ లోన్ కోసం ఎన్నోసార్లు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగా తనను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. తన నుంచి ఖాళీ పేపర్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్న అధికారులు ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదన్నారు. తన నుంచి బౌన్స్ చార్జెస్ అక్రమంగా వసూలు చేశారన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.50 వేల కోట్ల టర్నోవర్‌ను దాటిన మలబార్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రూ.50 వేల కోట్లను మించి రికార్డు వార్షిక టర్నోవర్ సాధించిందని సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ తెలిపారు. సోమాజిగూడ మలబార్ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ లగ్జరీ ప్రోడక్ట్స్‌లో మలబార్ గ్రూప్ 19వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.51,218 కోట్ల వార్షిక రిటైల్ గ్లోబల్ టర్నోవర్ సాధించింది’’ అన్నారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికల్లో భాగంగా దేశ, విదేశాల్లో వచ్చే ఏడాదిలో 100 కొత్త షోరూములు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా అదనంగా 7 వేల మందికి ఉపాధి కలి్పస్తామని అహమ్మద్ పేర్కొన్నారు. -
KCR: దయచేసి ఆస్పత్రికి రావొద్దు: కేసీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: సర్జరీ అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రిలోనే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ని పరామర్శించేందుకు ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అయితే ఇవాళ సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఆస్ప్రతి వద్దకు చేరుకున్నారు. ఆయన్ని చూసేందుకు అనుమతించాలంటూ పోలీసులను కోరారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు పోలీసులు కుదరదని చెప్పారు. దీంతో కేసీఆర్.. బీఆర్ఎస్.. కేటీఆర్ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు చేతులెత్తిసిన క్రమంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ఆయన క్యాడర్‌ను సముదాయించడంతో కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ విజ్ఞప్తి.. మరోవైపు ఆస్పత్రి బయట పరిస్థితులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లాయి. దీంతో బీఆర్ఎస్ కేడర్‌ను, అభిమానుల్ని ఉద్దేశించి ఆయన వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. ‘‘నేను కోలుకుంటున్నా.. త్వరలో మీ ముందుకు వస్తా. దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దు. నాతో పాటు వందలాది మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు. వాళ్లకు ఇబ్బంది కలిగించొద్దు. దయచేసి పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు సహకరించాలి. నాపట్ల అభిమానం చూపుతున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారు: తెలంగాణ మంత్రులు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలంగాణ మంత్రులు అన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన్ని ఇవాళ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరామర్శించేందుకు వచ్చాం. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. బహుశా రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవుతారేమో’’ అని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పగా.. ‘‘కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరాం. త్వరగా సభకు వచ్చి వారికున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని అందించాలని కోరాం. అందరూ నాయకులను కలుపుకుని ప్రజలకు మంచి పాలన అందిస్తామని ఆయనకు హామీ ఇచ్చాం. స్పీకర్ ఎన్నికలో కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేవిధంగా సహకరించాలని అడిగాం’’ అని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. -
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పొన్నం
-
కాసేపట్లో యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
-
మాజీ సీఎం కేసీఆర్ కు సర్జరీ సక్సెస్
-
నేడు కేసీఆర్ కాలుకి శస్త్ర చికిత్స చేయనున్న వైద్యులు
-
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్
-
వ్యాపారానికి అద్వితీయం.. జాబితాలో ద్వితీయం..
సాక్షి, హైదరాబాద్: ఫుడ్‌కోర్టులు, షాపింగ్‌మాల్స్, గేమింగ్ జోన్స్, రిటైల్ షాపులు, మల్టీప్లెక్స్‌లు ఇలా అన్నీ గుదిగుచ్చి ఓ వ్యాపారకూడలిగా మారే ప్రాంతాలను హైస్ట్రీట్స్గా పిలుస్తున్నారు. కాస్మోపాలిటన్ సిటీలకు ఈ హైస్ట్రీట్సే ఆకర్షణ. పగలు అందమైన ఆకాశహర్మ్యాలు, రాత్రిళ్లు నియాన్‌లైట్ల వెలుగుజిలుగులతో మెరిసిపోయే ఈ హైస్ట్రీట్స్‌కు వెళ్తే ‘‘ఎంతహాయి ఈ నగరమోయి..ఎంత అందమోయి ఈ నగరమోయి’’అని పాడుకోవాల్సిందే మరి. నగరంలో ఎక్కడ్నుంచైనా ఈ హైస్ట్రీట్స్‌కు రవాణా సౌకర్యం, ఆధునిక వసతులు, పార్కింగ్, వినోద, విహార సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ హైస్ట్రీట్లలో ప్రతి చదరపు అడుగుల ఆదాయం షాపింగ్ మాల్స్‌లో కంటే ఎక్కువగా ఉంటుంది. హైస్ట్రీట్‌లో చదరపు అడుగుల ఆదాయం ఏడాదికి సుమారు రూ.36.42 లక్షలు కాగా..షాపింగ్ మాల్స్‌లో రూ.11.31 లక్షలుగా ఉంటుంది. ఖరీదైన ప్రాంతంగా జూబ్లీహిల్స్ నగరంలోని ఐదు ప్రాంతాలలో రిటైల్ అద్దెల పరంగా అతి ఖరీదైనప్రాంతం మాత్రం జూబ్లీహిల్సే. ఇక్కడ చదరపు అడుగు రిటైల్ స్పేస్ సగటు అద్దె నెలకు రూ.200–225 కాగా, దాని తర్వాత బంజారాహిల్స్ (రూ.190–230), సోమాజిగూడ (రూ.150–175), అమీర్‌పేట (రూ.110–130), గచ్చిబౌలి ప్రాంతాలు రూ.140గా ఉన్నాయి. హైస్ట్రీట్స్ జాబితాలో రెండోస్థానంగా సోమాజిగూడ... కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లపై ‘ఇండియా రియల్ ఎస్టేట్ విజన్–2047’పేరుతో నరెడ్కో–నైట్‌ఫ్రాంక్ ఇండియా నిర్వహించిన ఓ అధ్యయన నివేదికలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ హైస్ట్రీట్ రెండో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఇక ఈ నివేదికలో బెంగళూరులోని ఎంజీ రోడ్ తొలిస్థానంలో నిలిచింది. దేశంలోని టాప్ 20 హైస్ట్రీట్స్ జాబితాలో హైదరాబాద్ నుంచి సోమాజిగూడతోపాటు ఐదు ప్రాంతాలున్నాయి. ఇందులో గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్‌పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి. ఆధునిక రిటైల్ హైస్ట్రీట్స్ లో ఎన్సీఆర్దే అగ్రస్థానం దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 30 హైస్ట్రీట్స్ ఉండగా...ఈ హైస్ట్రీట్స్ 1.32 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 52 లక్షల చదరపు అడుగుల స్థలంతో ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతంలోని ఎన్సీఆర్ తొలిస్థానంలో ఉండగా..18 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ మలిస్థానంలో నిలిచింది. ఇక అహ్మదాబాద్, బెంగళూరు ఒక్కో నగరంలో 15 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. ఆధునిక రిటైల్ స్పేస్ పరంగా చూస్తే...ఎనిమిది ప్రధాన నగరాలలో 57 లక్షల చదరపు అడుగుల వాటా ఉండగా..14 లక్షల చదరపు అడుగులతో ఎన్సీఆర్ అగ్రస్థానంలో, 11 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచాయి. -
జె ఎన్ జె హెచ్ ఎస్ మహిళా సభ్యుల సమావేశం
-
టాప్ 10 మార్కెట్లలో నాలుగు బెంగళూరులోనే.. ఎక్కడెక్కడో తెలుసా?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సోమాజిగూడ దేశంలోని ప్రముఖ 30 ప్రాంతాల్లో (ప్రముఖ మార్కెట్ ప్రాంతాలు) రెండో స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరులోని ఎంజీ రోడ్డు మొదటి స్థానంలో నిలవగా, ముంబై లింకింగ్ రోడ్డు మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ (పార్ట్ 1, 2) ఉన్నట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు లభించే మెరుగైన అనుభవం ఆధారంగా ఈ స్థానాలను కేటాయించారు. కస్టమర్లకు మెరుగైన ప్రాంతాలు బెంగళూరులో ఎక్కువగా ఉన్నాయి. టాప్–10లో నాలుగు ఈ నగరం నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లోని ప్రాంతాలను టాప్–30 కోసం నైట్ ఫ్రాంక్ అధ్యయనం చేసింది. ‘థింక్ ఇండియా థింక్ రిటైల్ 2023 – హై స్ట్రీట్ రియల్ ఎస్టేట్ అవుట్‌లుక్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. కొల్కతా పార్క్ స్ట్రీట్ అండ్ కామెక్ స్ట్రీట్ ఐదో స్థానంలో ఉంటే.. చెన్నై అన్నా నగర్, బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, నోయిడా సెక్టార్ 18 మార్కెట్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్, చర్చి రోడ్ టాప్ 10లో ఉన్నాయి. వీటిని ప్రముఖ ప్రాంతాలుగా చెప్పడానికి అక్కడ పార్కింగ్ సౌకర్యాలు, అక్కడకు వెళ్లి రావడంలో ఉండే సౌకర్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 8 పట్టణాల్లోని ప్రముఖ మార్కెట్ ప్రాంతాల్లో 13.2 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఇందులో 5.7 మిలియన్ చదరపు అడుగులు ఆధునిక రిటైల్ వసతులకు సంబంధించినది. ఈ టాప్–30 మార్కెట్లలో 2023–24లో 2 బిలియన్ డాలర్ల వినియోగం నమోదైనట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. -
సోమాజిగూడ విల్లామేరీలో ఫ్రెషర్స్ డే వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్: సోమాజీగూడలో లలిత జ్యువలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
-
యశోద ఆసుపత్రికి సీఎం కేసీఆర్..
సాక్షి, హైదరాబాద్: సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ సతీమణి శోభకు యశోద వైద్యులు మోకాళ్ల సర్జరీ చేశారు. కేసీఆర్ తన సతీమణి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ సతీమణి ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేసుకున్న సీఎం సతీమణిని పలువురు తెలంగాణ మంత్రులు, నేతలు పరామర్శించారు. చదవండి: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ ఘాటు లేఖ -
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై బండి సంజయ్ స్పందన
-
ఆసుపత్రిలో సీఎం కేసీఆర్.. బండి సంజయ్ స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను యశోద ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా.. ఆస్పత్రిలో కేసీఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు యాంజియోగ్రామ్ టెస్టులు పూర్తి అయినట్లు, గుండెలో ఎలాంటి బ్లాక్స్ లేవని యశోద వైద్యులు వెల్లడించారు. యాంజియోగ్రామ్ టెస్టులు నార్మల్‌గానే వచ్చాయని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. ఈ సందర్భంలోనే సీఎం కేసీఆర్‌కు ప్రతీ ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం స్టేబుల్‌గా ఉందని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ గారికి ప్రతి ఏటా ఫిబ్రవరిలో పరీక్షలు చేస్తుంటాం. రెండు రోజులుగా బలహీనంగా ఉన్నట్లు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం: సీఎం వ్యక్తిగత డాక్టర్ శ్రీ ఎం.వి.రావు pic.twitter.com/WUxlaFwo7J — Telangana CMO (@TelanganaCMO) March 11, 2022 కేసీఆర్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, రాజకీయాల్లో వీరిద్దరూ బద్ద శత్రువులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరి మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఆరోగ్యంపై స్పందిస్తూ మొట్టమొదటి సారిగా బండి సంజయ్ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.@TelanganaCMO — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 11, 2022 -
తరాష్ ఎగ్జిబిషన్లో జిగేలుమన్న భామలు
-
నవంబర్ 15న బంజారాహిల్స్‌తోపాటు ఈ ప్రాంతాలకు నీళ్లు బంద్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న సోమవారం పలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది. పంజగుట్ట శ్మశాన వాటిక ఎదురుగా రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో అక్కడున్న 1000 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌ను మరోచోటకు మార్చాల్సిన నేపథ్యంలో సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల కారణంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని తెలిపింది. నిర్వహణ డివిజన్ 6లో ఎర్రగడ్డ, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్నగర్, వెంగళ్రావునగర్, సోమాజిగూడ, వెంకటగిరి సెక్షన్ల పరిధిలోని ప్రాంతాల్లో, నిర్వహణ డివిజన్ 9లో మూసాపేట సెక్షన్ పరిధిలోని పాండురంగానగర్, కబీర్‌నగర్ ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదు. నిమ్స్‌కు నీటి సరఫరా బంద్ నిమ్స్‌కు 24 గంటలు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి శుక్రవారం నిమ్స్ యాజమన్యానికి సర్కులర్ జారీ చేసింది. ఈ నెల 15వ తేది సాయంత్రం నుంచి 16వ తేది రాత్రి వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 24 గంటల పాటు శ్రస్త చికిత్సలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. -
‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పాడు.. తీరా చూస్తే!
సాక్షి, పంజగుట్ట: సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు మృతిచెందాడని సమాచారం ఇచ్చారు. తీరా శ్వాస తీసుకోవడం గమనించి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పల్స్ చెక్ చేయగా 95 చూపించింది. వారు నిర్ఘాంతపోయి ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బాధితుల కథనం మేరకు సనత్‌నగర్‌కు చెందిన మహేందర్ అనే వ్యక్తి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతన్ని మొదట ఈసీఐఎల్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్ చేసుకోలేదు. అక్కడ నుంచి సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం అడ్మిట్ చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా చికిత్స కోసం వారు అప్పటికే రూ.3.5 లక్షలు చెల్లించారు. శనివారం మధ్యాహ్నం మహేందర్ చనిపోయాడని చెప్పి వెంటిలేటర్ తొలగించి బయటకు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు రోధిస్తూ వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా మహేందర్ శ్వాస తీసుకోవడాన్ని గమనించి వెంటనే పల్స్ చూడగా బతికే ఉన్నాడని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బతికున్న రోగిని చనిపోయాడని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ధర్నాకు దిగి ఆస్పత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించి మహేందర్‌ను తిరిగి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. చదవండి: Hyderabad Rains: మళ్లీ కుమ్మేసిన వాన.. ఎక్కడ ఏమైందంటే! -
యశోదా ఆసుపత్రులపై ఐటీ దాడులు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు యశోదా ఆసుపత్రులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్, సోమాజిగూడ, మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు, ప్రమోటర్ల నివాసంలో తనిఖీలు చేపట్టారు. 20కి పైగా ఐటీ శాఖ బృందాలు.. మూడు బ్రాంచ్‌లకు చెందిన ముగ్గురు డైరెక్టర్ల ఇళ్లల్లోపాటు(సురేందర్ రావు-సోమాజిగూడ, రవీందర్ రావు-సికింద్రాబాద్, దేవేందర్ రావు-మలక్‌పేట), నాగార్జున హిల్స్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ దాడులు అర్థరాత్రి వరకు కొనసాగినట్లు సమాచారం. వీరి నుంచి కీలక పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నట్లు ఆదాయపు పన్నుశాఖ వర్గాలు తెలిపాయి. చదవండి: యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ? -
కరోనా వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ఆలస్యమైంది
-
తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పండి: మంత్రి కేటీఆర్
-
కరోనా కోసం నా స్టయిల్ మార్చుకోలేదు
సాక్షి, హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంత కాదు. వర్మను విమర్శించే వాళ్లు ఎంతమంది ఉంటారో.. అంతకు మించి ఆరాధించే వారు ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంచలన దర్శకుడిని ఇష్టపడే యువ రచయిత రేఖ పర్వతాల అతనిపై ఓ పుస్తకాన్ని సైతం లిఖించి.. తన అభిమానాన్ని చాటుకున్నారు. రచయిత్రి రేఖ పర్వతాల రచించిన ‘వర్మ మన ఖర్మ’ పుస్తకాన్ని సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. సీనియర్ పాత్రికేయిరాలు స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ .. చిన్న వయస్సులోనే రేఖ పుస్తకం రాయడం సంతోషకరమన్నారు. తన గూర్చి ఏం రాశావు అని ఎప్పుడూ అడగలేదని, ఆమె ఫ్యాషన్ ఆమెను పూర్తిచేసుకోమ్మన్నానని తెలిపారు. తాను రచయిత్రి స్థానంలో ఉంటే అంకితం నాకు ఆయనకు అని పెట్టకుండా నాకు వాడికి అని పెట్టేవాడినన్నారు. తాను ఎప్పుడూ ఒకే ఫిలాసఫీ ఫాలో అవ్వనని, నా కన్వినెంట్ ప్రకారం అవి మారుస్తుంటానన్నారు. ప్రతీ మనిషిలో ఒక మృగం, రాక్షసుడు దాగి ఉంటారని దాన్ని బయటకు తీయడం తప్పు అని అందరూ అంటారని, కాని మృగాన్ని బయటకు తీసి మనం చేయాలనుకున్నది చేయాలని తాను చెపుతానన్నారు. సమస్యలగూర్చి ఎప్పుడూ పట్టించుకోనని, ఆలోచిస్తే ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని, కాని భాధపడితే లాభం ఉండదన్నారు. బర్నింగ్ టాపిక్స్‌పై తాను సినిమాలు తీయనని, మంటలు ఆరాక సినిమాలు తీస్తానన్నారు. తాను ఇప్పటివరకు మాస్క్ ధరించలేదని, సానిటైజర్ వాడలేదని, భౌతికదూరం పాటించలేదని కరోనా కోసం తన లైఫ్‌స్టైల్‌ను మార్చుకోనని, తాను తనలాగే బతుకుతానని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. రచయిత్రి రేఖ పర్వతాల మాట్లాడుతూ .. ఆర్జీవీ అంటే తానకు చాలా ఇష్టమని, ఆయన నాకు గురువు లాంటివారన్నారు. నాకు కూడా ఆర్జీవీలా స్వతంత్రంగా బతకడం ఇష్టమన్నారు. కార్యక్రమంలో వర్మ తల్లి సూర్యవతి, సోదరి విజయ, రచయిత్రి తల్లి సుమతి, తండ్రి రత్నయ్య, సైకాలజిస్ట్ విషేశ్ పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. -
143 మంది అత్యాచారం చేశారు
పంజగుట్ట: రాష్ట్ర పోలీసు చరిత్రలో అత్యంత అరుదైన కేసు రికార్డులకు ఎక్కింది. గతంలో రాష్ట్రంలోనే అత్యధిక కేసులు, దేశంలోనే రెండో బెస్ట్ ఠాణా రికార్డుల్ని సొంతం చేసుకున్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో గురువారం నమోదైన ఈ కేసు వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. గడిచిన 11 ఏళ్లుగా తనపై 143 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ సోమాజిగూడలో నివసిస్తున్న ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 42 పేజీలతో ఇది జారీ కావడం గమనార్హం. ఇందులో యువతి పేర్కొన్న ప్రకారం.. 138 మంది ప్రముఖు లు, విద్యార్థి సంఘాల నేతల పేర్లు, మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులంటూ పోలీసులు రిజిస్టర్ చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామానికి చెందిన బాధితురాలికి (25) 2009లోనే వివాహమైంది. ఆమె మైనర్‌గా ఉండగానే మిర్యాలగూడకు చెందిన కె.రమేశ్‌తో పెళ్లి జరిగింది. ఆమె భర్త, ఆడపడుచు, అత్త, మామ, సోదరులతో పాటు వారి బంధువులు దాదాపు 20 మంది శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయాన్ని బాధితురాలు 9 నెలల తర్వాత తన తల్లికి చెప్పింది. 2010లో భర్త నుంచి విడాకులు తీసుకున్న యువతి పుట్టింటికి చేరుకుని తన చదువు కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఈమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించాడు. ఇతనితోపాటు గడిచిన 11 ఏళ్లలో అనేక మంది నటులు, యాంకర్లు, ప్రముఖుల పీఏలు తనను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లారని, వారితోపాటు స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు కలిసి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 5 వేల సార్లు అత్యాచారం.. ఇప్పటివరకు 5 వేల సార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు తెలిపింది. వీరిలో 138 మంది పేర్లు తన ఫిర్యాదులో పొందుపరిచిన బాధితురాలు గుర్తుతెలియని మరో ఐదుగురు ఉన్నట్లు వెల్లడించింది. వీళ్లంతా తన ఫొటోలు, వీడియోలు యూట్యూబ్‌లో పెడతానని భయపెట్టేవారని, బలవంతంగా అఘాయిత్యాలకు పాల్పడ్డారని పోలీసుల వద్ద వాపోయింది. తాము చెప్పినట్లు వినకపోతే గన్‌తో కాల్చేస్తామని, ముఖంపై యాసిడ్ పోస్తామని కొందరు బెదిరించేవారని, తనతో కూడా బలవంతంగా మద్యం తాగించేవారని, కొన్ని సందర్భాల్లో తాను గర్భవతిని అయ్యానని, ఆ దుండగులే బలవంతంగా గర్భం తీయించారని తెలిపింది. దళితురాలినైన తనను కులం పేరుతో దూషించేవారని, వయాగ్రా ట్యాబ్లెట్స్ వేసుకుని మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ బాధలు భరించలేకపోయిన తాను గాడ్ పవర్ ఫౌండేషన్ సంస్థ వారిని కలిశానని, వారిచ్చిన ధైర్యం, సహకారంతోనే పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఈ దురాగతాలకు పాల్పడిన వారిలో కొందరు తనపై హత్యాయత్నం చేశారని, ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉందని వెల్లడించింది. బాధితురాలు ఫిర్యాదు అందించేందుకు బురఖా ధరించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు 42 పేజీలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించిన పంజగుట్ట అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వాంగ్మూలం నమోదు చేశారు.