Syed Ismail
-
నగరంలో ‘26’న పేలుడుకు స్కెచ్ !
బెంగళూరు: రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దాడులకు తెగబడేందుకు పట్టుబడిన ఉగ్రవాదులు ప్రణాళికలు రచించుకున్నారా? అంటే రాష్ట్ర హోంశాఖ నుంచి అవుననే సమాధానామే వస్తోంది. ఇప్పటికే నలుగురు పట్టుబడినా పూర్తిగా ఊపిరి పీల్చుకోవడానికి లేదని ‘26 మిషన్’ లో మరికొంత మంది పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉగ్రవాద ఆరోపణల పై సయ్యద్ ఇస్మాయిల్ ఆఫత్, సద్దాం హుసేన్, సూబర్, రియాజ్ సయ్యద్ అ హ్మద్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్న విష యం తెలిసిందే. విచారణలో వీరు పలు విషయాలను వెళ్లడిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకా రం నలుగురికీ బాంబుల తయారీ పై మంచి పట్టు ఉం ది. ముఖ్యంగా సయ్యద్ ఇస్మాయిల్ ఆఫత్ దుబయ్‌లో ఉన్న ఓ ఉగ్రవాదితో ఎక్కువ సార్లు మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ‘డీ కోడ్’ చేసిన అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరులో వి ధ్వంసాలు సృష్టించడానికి దుబైయ్ నుంచి అనుమతి లభించనట్టు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్లీపర్సెల్స్కు పేలు డు పదార్థాల రవణా కూడా చేయడానికి వీరుప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే వీరు నలుగురూ పోలీసులకు దొరికి పోయారు. ఇదిలా ఉండగా వీరి నుంచి ఇప్పటికే కొంతమంది స్లీపర్‌సెల్స్ పేలుడు పదార్థాలను పొందారని ఉగ్రవాదుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని విశ్లేషించిన అధికారులు నిర్థారణకు వచ్చారు. ‘స్లీపర్‌సెల్స్’ గణతంత్ర దినోత్సవంలో దాడులు చేయడానికి అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండ గా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయం ఁకృష్ణ*లో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో హోంశాఖ మంత్రి కే.జే జార్జ్‌తోపాటు పోలీసు శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో మలుపు
పేలుడు పదార్థాలు సరఫరా చేసిన ముగ్గురి అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు మరో మలుపు తిరిగింది. హైదరాబాద్ లో బాంబులు పేల్చేందుకు కావలసిన పేలుడు పదార్థాలను సమకూర్చిన ముగ్గురిని సోమవారం బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లతో ఈ ముగ్గురికీ సంబంధం ఉందని పోలీసు ల విచారణలో తేలింది. ఇక్కడ బాంబులు పేల్చేందు కు కావాల్సిన పేలుడు సామగ్రిని ఈ ముగ్గురే సమకూర్చినట్లు కూడా గుర్తించారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతిచెందగా 131 మంది గాయపడిన సంగతి తెలి సిందే. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐదుగురు నిందితులను గుర్తించింది. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హాది అలియాస్ తబ్రేజ్ అలియాస్ దానియాల్ అలియాస్ ఆసద్ (28), కర్ణాటకకు చెందిన మహ్మద్ అహ్మద్ సిద్ధిబాప అలియాస్ యాసిన్ భక్తల్ అలియాస్ షుక్రూ(30)లను ఎన్ఐఏ గతంలో అరెస్ట్ చేసింది. వీరు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఇక కర్ణాటకకు చెందిన మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భక్తల్ అలియాస్ ఇస్మాయిల్ షాబంద్రీ(38), పాకిస్తాన్‌కు చెందిన వఖాస్ అలియాస్ జావిద్ అలియాస్ అహ్మద్ అలియాస్ నాబీల్ అహ్మద్(25), బిహార్‌కు చెందిన మహ్మద్ తహసీన్ అక్తర్ హసన్ అలియాస్ మోను(25) పరారీలో ఉన్నారు. వీరిపై ఎన్ఐఏ రివార్డు కూడా ప్రకటించింది. తాజా అరెస్టులతో ఈ కేసులో నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బెంగళూరులో అరెస్ట్ అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లను విచారించేందుకు హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం బెంగళూరు వెళ్లిన ఎన్ఐఏ బృందం.. పీటీ వారెంట్‌పై ఈ ముగ్గురిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.