బెంగళూరు: రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దాడులకు తెగబడేందుకు పట్టుబడిన ఉగ్రవాదులు ప్రణాళికలు రచించుకున్నారా? అంటే రాష్ట్ర హోంశాఖ నుంచి అవుననే సమాధానామే వస్తోంది. ఇప్పటికే నలుగురు పట్టుబడినా పూర్తిగా ఊపిరి పీల్చుకోవడానికి లేదని ‘26 మిషన్’ లో మరికొంత మంది పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉగ్రవాద ఆరోపణల పై సయ్యద్ ఇస్మాయిల్ ఆఫత్, సద్దాం హుసేన్, సూబర్, రియాజ్ సయ్యద్ అ హ్మద్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్న విష యం తెలిసిందే. విచారణలో వీరు పలు విషయాలను వెళ్లడిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకా రం నలుగురికీ బాంబుల తయారీ పై మంచి పట్టు ఉం ది. ముఖ్యంగా సయ్యద్ ఇస్మాయిల్ ఆఫత్ దుబయ్‌లో ఉన్న ఓ ఉగ్రవాదితో ఎక్కువ సార్లు మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ‘డీ కోడ్’ చేసిన అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరులో వి ధ్వంసాలు సృష్టించడానికి దుబైయ్ నుంచి అనుమతి లభించనట్టు తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్లీపర్‌సెల్స్‌కు పేలు డు పదార్థాల రవణా కూడా చేయడానికి వీరుప్రణాళికలు రూపొందించుకున్నారు.
అయితే వీరు నలుగురూ పోలీసులకు దొరికి పోయారు. ఇదిలా ఉండగా వీరి నుంచి ఇప్పటికే కొంతమంది స్లీపర్‌సెల్స్ పేలుడు పదార్థాలను పొందారని ఉగ్రవాదుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని విశ్లేషించిన అధికారులు నిర్థారణకు వచ్చారు. ‘స్లీపర్‌సెల్స్’ గణతంత్ర దినోత్సవంలో దాడులు చేయడానికి అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండ గా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయం ఁకృష్ణ*లో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో హోంశాఖ మంత్రి కే.జే జార్జ్‌తోపాటు పోలీసు శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నగరంలో ‘26’న పేలుడుకు స్కెచ్ !
Published Wed, Jan 14 2015 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM
Advertisement