tasks
-
మార్చి 31 డెడ్‌లైన్: చేయాల్సిన కీలకమైన పనులు ఏంటో తెలుసా?
సాక్షి, ముంబై: అనేక కీలకమైన ఆర్థిక పనులకు మార్చి 31 తుది గడువు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31 చివరి రోజు లోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే మన జేబుకు చిల్లు పడక తప్పదు. ఎలాంటి ఆర్థిక జరిమానాలు లేదా ఖాతాల డీయాక్టివేషన్ లాంటి ప్రమాదం లేకుండా, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా పాన్ ఆధార్ లింకింగ్, పన్ను ప్రణాళిక లాంటికొన్ని ముఖ్యమైన పనులను ఒకసారి చూద్దాం. 2023, మార్చి 31 లోపు పూర్తి చేయాల్సిన పైనాన్షియల్ టాస్క్స్ ► పాన్ -ఆధార్ కార్డ్ లింక్: మార్చి 31 లోపు పాన్ ఆధార్ కార్డ్‌లను లింకింగ్ పూర్తి చేయాలి. లేదంటే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. దీంతో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్ చేయలేరు. ► అలాగే రూ. 1,000 ఫైన్. అంతేకాదు తప్పుడు లేదా చెల్లని పాన్‌ను కోట్ చేస్తే రూ. 10,000 జరిమానా . ► అప్డేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్: 2019-2020, AY 2020-21కి సంబంధించిన అప్డేట్ చేయబడిన ఆదాయ-పన్ను రిటర్న్‌ను 31 మార్చి 2023 లోపు సమర్పించడం అవసరం. గడువు ముగిసాక ఫైల్ చేయలేరు. ► ముందస్తు పన్ను చెల్లింపు: రూ. 10,000 కంటే పన్ను చెల్లించాల్సి ఉన్న చెల్లింపుదారుడు ముందస్తు పన్ను చెల్లించాలి. జూన్ 15లోగా 15 శాతం, సెప్టెంబర్ 25లోగా 45 శాతం, డిసెంబర్ 15లోగా 75 శాతం, మార్చి 15 నాటికి 100 శాతం చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. అయితే, మూలధన లాభాలు వంటి అదనపు ఆదాయం ఉన్నా, ఉద్యోగాన్ని మార్చుకున్నా మీరు ముందస్తు పన్నును లెక్కించి చెల్లించాల్సి ఉంటుంది. ► 2022-2023కి సంబంధించిన మొత్తం ముందస్తు పన్నును మార్చి 15లోపు ఇంకా చెల్లించనట్లయితే, మార్చి 31, 2023లోపు చెల్లించే అవకాశం ఉంది. మార్చి తర్వాత, నెక్ట్స్ ఐటీఆర్ వరకు బకాయిపై నెలకు 1 శాతం వడ్డీని చెల్లించాలి. ► ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే, అత్యధిక పరిమితి రూ. 1.5 లక్షలతో పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ► పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టండి: పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్డ్ డిపాజిట్ ,ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ వంటి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచచ్చు ► ఫారమ్ 12బీ: ఉద్యోగం మారినట్టయితే వారు ఫారమ్ 12B పూరించడాన్ని మర్చిపోవద్దు. ► మ్యూచువల్ ఫండ్ నామినేషన్: సెబీ సర్క్యులర్ ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారు మార్చి 31 లోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖాతా బంద్ అవుతుంది. ► మార్కెట్ రెగ్యులేటరీ ప్రకారం మార్చి 31లోపు NSE NMF ప్లాట్‌ఫారమ్‌లో మొబైల్ నంబర్ , ఇమెయిల్ ఐడీని ధృవీకరించుకోవడం అవసరం. ► క్యాపిటల్ గెయిన్: ఇంతకుముందు ఈక్విటీలపై దీర్ఘకాలిక పన్ను రహితంగా ఉండేది. ఈక్విటీ ఫండ్‌పై దీర్ఘకాలిక మూలధన లాభం 1 లక్ష కంటే ఎక్కువ మొత్తంలో ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా పన్ను రేటు 10 శాతం. సో..పెట్టుబడులను రీడీమ్ చేయాలనుకుంటే పన్ను రహిత పరిమితి రూ. 1 లక్ష ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మార్చి 31లోపు రిడీమ్ చేసుకోవచ్చు. స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను 15 శాతం ► ప్రధానమంత్రి వయ వందన యోజన: సీనియర్ సిటిజన్లు, రిటైర్ మెంట్ ఫండ్ కోసం ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) వంటి పలు ఆప్షన్స్ ఉన్నాయి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు మార్చి 31, 2023 లోపు దీన్ని ప్రారంభిస్తే మంచింది. ► ఈ పాలసీలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల పథకంలో, పెట్టుబడిదారులు 7.4 శాతం చొప్పున పెన్షన్ పొందుతారు. ఈ పథకం కింద 10 సంవత్సరాల నిర్ణీత కాలానికి. రూ.9,250 నెలవారీ పెన్షన్ , రూ. 1.62 లక్షల కనీస పెట్టుబడిపై, నెలవారీ పెన్షన్ రూ. 1,000 వరకు వస్తుంది. -
బిగ్‌బాస్‌లో ఈరోజంతా ‘కెవ్వు కేకే’నా?
రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న బిగ్‌బాస్ సీజన్2 షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బుధవారం జరిగిన షోలో రెండు టీమ్‌లు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో పోటీపడటం ఆసక్తికరంగా మారింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు నిన్నంతా బిగ్‌బాస్ హౌస్‌లో కథంతా డబ్బు చుట్టే జరిగింది. ఆ డబ్బును చేజిక్కించుకుని కంటెస్ట్‌గా గెలవాలని తేజస్వీ, కంటెస్టెంట్‌తో పాటు తన టీమే గెలవాలని కౌశల్ టీం ఆడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. చివరగా కంటెస్టెంట్‌గా తేజస్వీ గెలవగా.. కౌశల్, సామ్రాట్ టీమ్స్‌లో కౌశలే విజయం సాధించాడు. గెలిచినందుకు వీరిద్దరికి బిగ్‌బాస్ అభినందనలతో పాటు, ఓ ప్రత్యేకమైన ఓటు హక్కును బహుమతిగా ఇచ్చాడు. సందర్భం వచ్చినప్పుడు ఆ ఓటు హక్కు గురించి వివరిస్తానని బిగ్‌బాస్ వారికి తెలిపాడు. ఇక నేటి షోలో ఇంటి సభ్యులందరూ హుషారుగా ఉన్నట్టున్నారు. కెవ్వు కేక సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ.. కేక పుట్టిస్తున్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లో రూల్స్‌ను పాటించడం లేదనీ, ఈ విషయంపై ఓ ఇద్దరిని బిగ్‌బాస్ శిక్షిస్తున్నాడంటూ ఓ ప్రోమోను విడుదల చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరో, వారికి విదించిన శిక్షలేమిటో తెలియాలంటే నేటి కార్యకమ్రాన్ని వీక్షించాల్సిందే. -
బిగ్‌బాస్2లో లిప్‌లాక్
తమిళ బిగ్‌బాస్2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది.. హౌస్మేట్స్ మధ్య టాస్క్‌ల జోరు పెరిగింది.. హౌస్మేట్స్ జనని, ఐశ్వర్యల మధ్య లిప్‌లాక్ శుక్రవారం నాటి ఎపిసోడ్లో హైలెట్‌గా నిలిచింది. టాస్క్‌లో భాగంగా ముంతాజ్, బాలాజీ డైపర్లు వేసుకుని చిన్న పిల్లల్లా ప్రవర్తించారు. జనని, వైష్ణవి మీసాలు పెట్టుకుని మగాళ్లలాగా నటించారు. ఐశ్వర్య, రమ్య ట్విన్స్లాగా నటించి హౌస్మేట్స్ అడిగిన ప్రశ్నలకు ఒకరి తర్వాత ఒకరు సమాధానాలు చెప్పారు. ఎపిసోడ్ ప్రారంభంలో హౌస్మేట్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ముగింపుకు వచ్చేసరికి అంత బద్ధకంగా తయారయ్యారు. మొత్తానికి తమిళ్ బిగ్‌బాస్2 షో రోజురోజుకు మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. అంతకుమించి అనిపించేలా షో సాగిపోతోంది. కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తమిళ టీవీ వీక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. -
‘బెటాలియన్’ పనులు వేగవంతం
‘అనంత’కు ఆరు కిలోమీటర్ల దూరంలో.. రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మాణాలు అనంతపురం సెంట్రల్ జైలు సమీపంలో 118 ఎకరాల్లో బెటాలియన్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తొలివిడతగా రూ. 13కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో తొలుత ఎంపిక చేసిన స్థలం చుట్టూ ప్రహరీ, విద్యుత్, అంతర్గత రహదారులు, నీటి వసతి పనులు పూర్తి చేశారు. అదే సమయంలో పాలక భవనం, మన్ బ్యారక్, సిబ్బంది క్వాటర్స్, ఆయుధగారం పనులు చేపట్టారు. ఈ పనులు శరవేగంతో పూర్తి అవుతున్నాయి. రానున్న కాలంలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, రక్షక విభాగాలకు సంబంధించిన మూడు నుంచి నాలుగు వేల మంది నివాసముండేలా 800 క్వాటర్స్ నిర్మాణాలు చేపట్టనున్నారు. చుట్టూ పరుచుకుంటున్న పచ్చదనం ఏపీఎస్పీ 14వ బెటాలియన్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతం చుట్టూ పచ్చదనం పరుచుకుంటోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో నాటిన రెండు వేల మొక్కలు పచ్చదనాన్ని సంతరించుకుని విస్తరిస్తున్నాయి. బ్లాక్‌ల వారిగా వరుస క్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. విశాలమైన మట్టి రోడ్లనే వేశారు. పాలక భవనం దాదాపు పూర్తి కావస్తోంది. బెటాలియన్ సిబ్బందికి ఇక్కడ వివిధ రంగాలలో ప్రత్యేక శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది ; జగదీష్‌కుమార్, కమాండర్ బెటాలియన్ ఏర్పాటుకు సంబంధించి తొలుత అడ్మినిస్ట్రేషన్ భవనం, మన్ బ్యారెక్, ఆయుధగారం వంటి నిర్మానాలు చేస్తున్నాం. మరిన్ని పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు నిధుల అవసరం చాలా ఉంది. ఏదేమైనా నిర్మాణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. -
వాటా గోల.. నిర్మాణం డొల్ల
కర్నూలు–దేవనకొండ రోడ్డుపై విజి‘లెన్స్’ – తారు రోడ్డు, కంకర నమూనాల సేకరణ – పరీక్షకు పంపినæ విజిలెన్స్ అధికారులు – నాసిరకం పనులపై ఫిర్యాదు చేసిన ఎంపీ బుట్టా – ఆగుతూ సాగుతున్న రోడ్డు పనులు – అధికార పార్టీ నేతల తీరే కారణం సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు–దేవనకొండ రోడ్డు నిర్మాణం సా..గుతోంది. అధికార పార్టీ నేతల వసూళ్ల నేపథ్యంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. నాసిరకం పనులపై స్వయంగా కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే విజిలెన్స్ అధికారులు కొద్ది రోజుల క్రితం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించినట్లు సమాచారం. వాస్తవంగా రోడ్డు వేయాల్సిన వెడల్పు? తవ్వాల్సిన లోతు? కంకర వినియోగం? నిబంధనలను ఎలా పాటిస్తున్నారు? అనే అంశాలను విజిలెన్స్ అధికారులు పరిశోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు అనుగుణంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతాలను పరిశీలించి కంకరతో పాటు తారు నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద మరోసారి కర్నూలు–దేవనకొండ రోడ్డు నిర్మాణ వ్యవహారం విజిలెన్స్ తనిఖీలతో తెరమీదకు వచ్చింది. ఇదీ రోడ్డు కథ కర్నూలు నుంచి దేవనకొండ వరకు 4/4 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వరకు రోడ్డును వెడల్పు చేయడంతో పాటు కొత్త రోడ్డు నిర్మాణం కోసం జూలై 2009లో రూ.102.01 కోట్లకు పరిపాలన అనుమతినిస్తూ రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ ధర కంటే 27 శాతం తక్కువ ధరను కోట్ చేసి రోడ్డు పనులను జీవీఎస్ఆర్ సంస్థ దక్కించుకుంది. అయితే, వివిధ కారణాలతో పనులను నిలిపేసింది. తాము చెల్లించిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్(ఈఎండీ)ని కూడా తీసేసుకున్నా ఫరవాలేదనే రీతిలో కంపెనీ వ్యవహరించింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ వ్యయాన్ని రూ.132 కోట్లకు పెంచి 1వ తేదీ నవంబర్ 2016 నాటికి పనులను పూర్తిచేయాలని 2014 నవంబర్‌లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆ సమయానికి కూడా పనులు పూర్తయ్యేలా లేవు. ఆది నుంచీ వాటాల గోలనే.. కర్నూలు–దేవనకొండ రోడ్డు వ్యవహారంలో ఆది నుంచీ వాటాల గోల జరుగుతోంది. అధికార పార్టీ నేతలతో పాటు ఈ రోడ్డు వెంటనున్న పలువురు ప్రజా ప్రతినిధులు వాటా అడుగుతున్నారంటూ సదరు సంస్థ పనులు చేయకుండా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ వ్యయాన్ని పెంచి అదే సంస్థ పనులు చేపట్టేలా అధికార తెలుగుదేశం ప్రభుత్వం నవంబర్ 12, 2014లో నిర్మాణ వ్యయాన్ని రూ.132 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా సదరు సంస్థ పనులను ప్రారంభించిన తర్వాత కూడా అధికార పార్టీ నేత, మాజీ మంత్రి కాస్తా రోడ్డు నిర్మాణ వ్యయంలో వాటా అడగడంతో పాటు తాము చెప్పిన ప్లాంటు నుంచే కంకర తీసుకెళ్లాలని షరతు విధించారు. అప్పట్లో కూడా కొద్ది రోజుల పాటు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగినా.. కోడుమూరుకు చెందిన అధికార పార్టీ నేత తమ నుంచే ఇసుక తీసుకెళ్లాలంటూ పనులు నిలిపివేయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు రోడ్డు పనులకు అధికార పార్టీ నేతలు అడ్డుపడుతూనే ఉన్నారు. ఈ వాటాల గోల నేపథ్యంలో రోడ్డు పనులు కాస్తా నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో పనుల నాణ్యతపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. -
రైతన్నల ఆశలు ఆవిరి
♦ ఏళ్ల తరబడి సాగుతున్న భవనాశి మినీ రిజర్వాయరు పనులు ♦ ప్రాజెక్టు వ్యయం రూ.27 కోట్లు ♦ ఏయేటికాయేడు పూర్తవుతుందని ఎదురు చూస్తున్న రైతులు ♦ పనులు పూర్తికాకపోవడంతో నైరాశ్యంలో రైతాంగం పాలకుల నిర్లక్ష్యమో, అధికారుల ఉదాసీనతో తెలియదు కానీ, కోట్లకు కోట్లు ఖర్చుచేసి కడుతున్న ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూ రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. అనుకున్న సమయంలో పనులు పూర్తికాకపోవడంతో పచ్చని పంట పొలాలుగా మారాల్సిన భూములు బీడువారి రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. 7 వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రారంభించిన భవనాశి రిజర్వాయర్ పనులు నత్తకు నడకలు నేర్పుతూ పాలకుల ఉదాసీనతకు ప్రత్యక్ష తార్కాణంగా నిలుస్తున్నారుు. అద్దంకి : అద్దంకి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సమీపంలో భవనాశి చెరువును మినీ రిజర్వాయరుగా మార్చాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. తద్వారా ప్రస్తుతం ఉన్న 1798 ఎకరాల ఆయకట్టును పెంచి, 7 వేల ఎకరాలకు నీరందించాలని సంకల్పించారు. బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం సమీపంలోని గుండ్లకమ్మ నదికి అడ్డంగా చెక్‌డ్యామ్ నిర్మించి, దాని నుంచి ఫీడరు చానల్ ఏర్పాటుతో, చెరువుకు నీరు తెచ్చి మినీ రిజర్వాయరుగా మార్చాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా జలయజ్ఞంలో ప్రాజెక్టుగా గుర్తింపునిచ్చి, రూ.27 కోట్ల నిధులు కేటాయించారు. 2008లో దేవస్థానానికి ఎదురుగా పనుల ప్రారంభం కోసం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. 2010 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రారంభంలోనే జాప్యం: వెంటనే పనులు మొదలు పెట్టాల్సిన కాంట్రాక్టరుకు రెవెన్యూ శాఖ నుంచి భూముల అప్పగింత కార్యక్రమం పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. ఎట్టకేలకు 2013లో రెవెన్యూ శాఖ భూముల అప్పగింతతో పనులు మొదలయ్యాయి. రిజర్వాయరు పనులు మూడు భాగాలుగా విభజన.. మినీ రిజర్వాయరు పనులను మూడు భాగాలుగా విభజించారు. ప్రాజెక్టుకు కేటాయించిన రూ.27 కోట్ల నిధుల్లో రూ.7.35 కోట్లు గుండ్లకమ్మ నదిలో చెక్‌డ్యామ్ నిర్మాణానికి కేటాయించగా ఆ పనులు పూర్తయ్యాయి. పూర్తై చెరువు కట్ట ఎత్తుపెంపు పనులు.. రిజర్వాయరు పనుల్లో రెండో భాగమైన భవనాశి చెరువు కట్ట ఎత్తుపెంపు, చక్రాయపాలెం వద్ద 200 మీటర్ల పొడవున అలుగు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీని కోసం రూ.1.71 కోట్లు కేటాయించారు. నిలిచిన ఫీడర్ చానల్ పనులు.. బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం చెక్‌డ్యామ్ నుంచి మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల, చక్రాయపాలెం వరకూ 12.6 కిలోమీటర్ల ఫీడర్ చానల్ నిర్మాణం కోసం 192 ఎకరాల భూమిని సేకరించి రూ.13.74 కోట్లు కేటాయించారు. ఈ పనులు మధ్యలో నిలిచిపోయాయి. ప్రస్తుతం వెంపరాల చెరువు నుంచి చక్రాయపాలెం వరకూ కాలువ తీశారు. ప్రాజెక్టు సర్వేలో గుర్తించని 7.25 ఎకరాల భూమితో చిక్కు.. ప్రాజెక్టు కాలువ కోసం సేకరించిన భూమిలో మండలంలోని మైలవరం, ఉప్పలపాడు గ్రామాల రైతులకు చెందిన 7.25 ఎకరాలను నష్టపరిహారం జాబితాలో చేర్చకపోవడంతో ఆ భూముల్లో కాలువ తవ్వేందుకు ఆటంకం ఏర్పడింది. కొత్తగా వచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం ఆ భూముల రైతులకు నష్టపరిహారం చెల్లిస్తేనే అక్కడ కాలువ తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ పనిని రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంది. నిలిచిన బ్లాస్టింగ్ పనులు.. తీసిన కాలువలో చట్టు(రాయి) పడటంతో దాన్ని బ్లాస్టింగ్ చేయాల్సి వచ్చింది. బ్లాస్టింగ్‌కు అనుమతి తెచ్చి పనులు మొదలు పెట్టినా, ధ్వనుల మోతకు మైలవరం, ఉప్పలపాడు గ్రామాల్లో ఇళ్లు నెర్రెలిస్తున్నాయని స్థానికులు ఆందోళన చేయడంతో ఆ పనులు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాల అడ్డంకులు.. ఇదే కాలువలో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉండటం, వాటిని తొలగించడానికి విద్యుత్ శాఖ అధికారుల అనుమతులు రాకపోవడంతో తీసిన కాలువలోనూ పనులు జరగటం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది అక్టోబరు నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. కదలాల్సిన యంత్రాంగాలు.. ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే అటు రెవెన్యూ, ఇటు విద్యుత్ శాఖ అధికారుల నుంచి అనుమతుల మంజూరు, నష్టపరిహారం ఇవ్వాల్సిన రైతులకు రెవెన్యూ శాఖ ద్వారా నష్టపరిహారం ఇవ్వడంతోపాటు, బ్లాస్టింగ్ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాలు జిల్లా ఉన్నతాధికారులు గమనించి ప్రాజెక్టు పూర్తి చేయాలని రైతులు వేడుకొంటున్నారు. -
ముంబైలోనూ పనుల్లేవ్!
పుణేకు వలసకట్టిన తెలంగాణ పల్లెలు * మహబూబ్‌నగర్ జిల్లా నుంచే అధికం * నీటి కొరతతో ముంబైలో నిర్మాణ పనులకు బ్రేక్ * మూతపడిన కార్ఖానాలు * వలస జీవులకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు గుండారపు శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ముంబై: ‘ఊళ్లో మూడేళ్లుగా వర్షాల్లేక పంటలన్నీ ఎండిపోయాయి.. ఏవైనా పనులు చేసుకుందామని భార్యాపిల్లలతో ఇక్కడికి వచ్చా..’ ‘పంటల కోసం అప్పులు చేశా.. పనులుంటే రెక్కలు ముక్కలు చేసుకొనైనా తీర్చేవాడిని. కానీ అక్కడ పనుల్లేక ఇక్కడికి రావాల్సి వచ్చింది’ ...కరువు తరిమేయడంతో తెలంగాణ నుంచి పొట్ట చేతబట్టుకొని మహారాష్ట్రకు వలస వచ్చిన వారి గోడు ఇది! ఉన్న ఊళ్లో పనుల్లేక తెలంగాణ నుంచి పెద్దఎత్తున జనం పుణేకు చేరుకుంటున్నారు. ఇప్పటివరకు ముంబై, ఆ నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు వలసలు ఎక్కువగా ఉండేవి. అయితే ప్రస్తుతం అక్కడ కూడా పనులు కరువయ్యాయి. మహారాష్ట్ర కూడా కరువు కోరల్లో చిక్కుకోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రైతులు, కూలీలు ముంబైకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణను ఆనుకుని ఉన్న మరాఠ్వాడా, విదర్భలలో మూడేళ్లుగా దుర్భర కరువు నెలకొంది. దీంతో ఆ ప్రాంతాల నుంచి కూలీలు భారీ సంఖ్యలో ముంబై చేరుకున్నారు. దీంతో పనికి పోటీ ఏర్పడింది. మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలవారికి కూలీ పనుల్లో కొంత మేర ప్రాధాన్యం దక్కుతుండడంతో ముంబైలో తెలంగాణవాసులకు పనులు తగ్గాయి. దీనికితోడు తీవ్ర కరువు నేపథ్యంలో ముంబైలో భవన నిర్మాణం ఇతరత్రా పనులు ఆగిపోయాయి. మిల్లులు, ఇతర చిన్నచిన్న కార్ఖానాలూ మూతబడ్డాయి. దీంతో తెలంగాణ నుంచేగాకుండా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి పుణేకు వలసలు పెరిగాయి! పుణే రైల్వేస్టేషన్ కిటకిట.. తెలంగాణ నుంచి వస్తున్న వలసజీవుల్లో సగం మంది పుణేకే చేరుకుంటున్నారు. అర్ధరాత్రి కూడా పుణే రైల్వేస్టేషన్ పరిసరాలు తెలంగాణ వలస జనంతో కిటకిటలాడుతున్నాయి. కొందరు భార్యాపిల్లలతో వస్తుండగా.. మరికొందరు వారిని ఇంటివద్దే వదిలి ఒంటరిగా వస్తున్నారు. మిగిలినవారు ఠాణే, రాయిఘడ్కు చేరుకుంటున్నారు. కొద్దిమంది మాత్రమే ముంబై వెళ్తున్నారు. వలస వస్తున్నవారిలో ఎక్కువ మంది మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారే ఉంటున్నారు. ప్రస్తుతం పుణే జిల్లాలో నిర్మాణ పనులు జోరుగా సాగుతుడడంతో పుణే నగరంతోపాటు పింప్రీ-చించ్వడ్ చుట్టుపక్కల పరిసరాలతోపాటు సరిహద్దు ప్రాంతాలైన దౌండ్, ఉరులి కాంచన్, రాజ్‌గురునగర్, చికిలీ, చాకణ్, తలేగావ్, శిఖరాపూర్, సనస్ వాడి, ఇందాపూర్, బారామతి, టింబూర్ణి తదితర ప్రాంతాలకు వస్తున్నారు. వీరిలో అనేక మంది అద్దెకు ఇళ్లు తీసుకునే స్థోమత లేకపోవడంతో తాత్కాలిక గుడారాల్లో తలదాచుకుంటున్నారు. గతంలో కరీంనగర్, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, హుజురాబాద్, వరంగల్, జనగామ, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, వనపర్తి, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, తాండూర్ ప్రాంతాల నుంచి ముంబై, దాని చుట్టుపక్కల ప్రాంతాలైన బివండీ, థానేకు వలసలు ఎక్కువగా ఉండేవి. వీరికోసం తెలంగాణ నుంచి ముంబైకి ఏకంగా 28 ఆర్టీసీ బస్సులు నడిచేవి. ఇప్పుడు ఏడు బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ముంబైలో పనుల్లేక ఇబ్బందులు ముంబైలో పనులు కరువవడంతో ఇప్పటికే అక్కడికి వలస వెళ్లిన తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాకా కార్మికులకు వారంలో సగం రోజులే పనులు దొరుకుతున్నాయి. మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక రాజకీయ నాయకులు అండగా నిలుస్తున్నారు. వారికి తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరికొందరు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకుంటున్నారు. తెలంగాణకు చెందినవారు కూడా కొందరు ఈ తాత్కాలిక షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ నుంచి ముంబైలో సుమారు 10 లక్షల మంది ఉన్నారు. వీరిలో 70 శాతం తెలంగాణకు చెందినవారే ఉన్నారు. కుటుంబంతో వచ్చా.. మాకు ఊళ్లో జామ, బత్తాయి పండ్ల తోట ఉంది. కానీ నీళ్లు లేక ఎండిపోయింది. అప్పుల పాలయ్యాం. నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోవడంతో చేసేదేమీ లేక పుణేకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్‌గురునగర్‌లో పనులున్నాయని చెబితే కుటుంబ సమేతంగా పుణే వచ్చాం. - బాబ్జానాయక్, కొత్తపల్లి, మహబూబ్‌నగర్ సెంట్రింగ్ పనుల కోసం వచ్చా వరుసగా మూడు, నాలుగేళ్లుగా వర్షాభావంతో వ్యవసాయం పనులు నడవడం లేదు. తాగునీరు కూడా లభించడం లేదు. ఉన్న రెండెకరాల భూమి బీడుగా మారింది. పుణేలోని పాషాణ్లో సెంట్రింగ్ పనులు, వాటర్ ప్రూఫ్ పనులున్నాయంటే భార్యా పిల్లలతో కలసి వచ్చా. - గోపాల్ హఠియా, కిష్టాపురం తండా, మహబూబ్‌నగర్ పనులు దొరకడం లేదు వర్షాభావం కారణంగా మా ఊర్లో ఎన్నడూ లేనంత కరువు ఏర్పడింది. పిల్లలు, భార్యను అక్కడే వదిలేసి పని కోసం ముంబై వచ్చా. కానీ ఇక్కడ కూడా పనులు దొరకడం లేదు. - మెట్టపల్లి మల్లయ్య, సీతారాంపట్టి, సిద్దిపేట, మెదక్ 27 బోర్లు వేయించినా నీరు పడలేదు పంట కోసం 27 బోర్లు వే యించా. ఒక్కదాంట్లోనూ సరిగా నీరు పడలేదు. అప్పులు తీర్చేందుకు మరో మార్గంలేక ముంబైకి పనుల కోసం వచ్చా. - బాపురం అంజలయ్య, రాధపూర్, దోమ మండలం, రంగారెడ్డి -
ఎన్నో చెబుతారు...కొన్నే చేస్తారు
► కేటాయింపులకూ...పనులకూ ► పొంతన లేని వైనం జీహెచ్ఎంసీలో వింత పరిస్థితి సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ బడ్జెట్లో పొందుపరిచే పనులకు... వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. ఏడాదిలో ఎన్నో పనులు చేయనున్నట్లు బడ్జెట్లో చెబుతున్నా.. అవి అమలుకు నోచుకోవడం లేదు. ఆర్థిక సంవత్సరం మొద ట్లో ప్రతిపాదించిన పనులను అక్టోబర్‌లో రివైజ్డ్ బడ్జెట్ రూపొందించే నాటికే కుదిస్తున్నారు. నిధులు లేకపోవడం ఒక కారణమైతే.. తగినంత మంది అధికారులు లేకపోవడం మరో కారణం. రివైజ్డ్ బడ్జెట్లో తగ్గించిన మేరకైనా పనులు చేయగలరో లేదో రానున్న 40 రోజు ల్లో తేలనుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో చేయాలనుకున్న పనులు.. ఇప్పటి వరకు చేసినవి పరిశీలిస్తే.. ♦ రూ.700 కోట్లతో రహదారుల పనులు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. దీన్ని అక్టోబర్ రివైజ్డ్ బడ్జెట్లో రూ.605 కోట్లకు కుదించారు. ఇవి ఎంతమేర పూర్తి చేయగలరన్నది నెల రోజులు గడిస్తే కానీ తెలియదు. ♦ పేద బస్తీల ప్రజలకు శుద్ధ జలం కోసం రూ.50 కోట్లు కేటాయించారు. రివైజ్డ్‌లో రూ.25 కోట్లకు తగ్గించా రు. రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు. ♦ స్లాటర్‌హౌస్‌ల ఆధునీకరణకు రూ.40 కోట్లు కేటాయించినా.. వాస్తవ పరస్థితుల్ని అంచనా వేసి రూ.15 కోట్లకు తగ్గించారు. ♦ స్లమ్‌ఫ్రీ కోసం రూ.450 కోట్లు కేటాయించి.. అనంతరం రూ.250 కోట్లకు తగ్గించారు. ♦ మల్టీపర్పస్ హాళ్లకు రూ.106 కోట్లు కేటాయించినా.. పనులు జరగలేదు. ♦ ఆధునిక మార్కెట్లదీ అదే దారి. తొలుత రూ. 70 కోట్లు కేటాయించి.. అనంతరం రూ.50 కోట్లకు త గ్గించారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. ♦ పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటుకు రూ. 20 కోట్లు కేటాయించి.. రూ. 9 కోట్లకు తగ్గించారు. ఇంతవరకు ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాల్లేవు. ♦ మహిళల టాయ్లెట్లకు బడ్జెట్లో రూ.10 కోట్లు చూపారు. ఎక్కడా ఏర్పాటు కాలేదు. రివైజ్డ్‌లో రూ.7.31 కోట్లకు తగ్గించారు. ♦ సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల బలోపేతానికి బడ్జెట్లో రూ.12 కోట్లు కేటాయించి...రూ. 3.24 కోట్లకు కుదించారు. ♦ సీనియర్ సిటిజన్ల ఆసరా కార్యక్రమాలకు తొలుత రూ.10 కోట్లు కేటాయించి, వాస్తవ పరిస్థితుల దృష్ట్యా తిరిగి రూ. 2.04 కోట్లకు తగ్గించారు. ♦ ఇలా అంచనాల్లో మాత్రం భారీ సంఖ్యలు ఉన్నప్పటికీ, వాస్తవంలో కనిపించడం లేదు. అక్టోబర్‌లో నిధులు తగ్గించి రివైజ్ చేసినప్పటికీ... అనంతరం వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్, ఇతరత్రా కారణాలతో పనులు కదల్లేదు. -
చితికిపోతున్న చేనేత బతుకులు
- ముడి సరుకు పంపిణీని నిలిపేసిన పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ - పనిలేక వలసపోతున్న చేనేత కార్మికులు - ఆదుకునేవారే కరువయ్యారంటూ ఆవేదన సంతకవిటి: చేనేత బతుకులు చితికిపోతున్నాయి. మొన్నటి వరకు దర్జాగా బతికినవారు నేడు పనులు లేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నారు. మరికొందరు పొట్టచేతపట్టుకుని వలసపోతున్నారు. దీనికి సంతకవిటి మండలంలోని సురవరం, మందరాడ, మామిడిపల్లి, కాకరాపల్లి, మండాకురిటి తదితర గ్రామాల్లోని వందలాది చేనేత కార్మిక కుటుంబాల జీవనకష్టాలే సజీవసాక్ష్యం. ఈ గ్రామాల్లోని చేనేత కార్మికులు పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంస్థలో సభ్యులుగా ఉండేవారు. దీంతో సంస్థ ముడిసరుకును అందజేస్తే వాటిని మగ్గాలపై నూలువడికి తిరిగి సరఫరా చేసేవారు. దీంతో మహిళలకు కూడా చేతినిండా పని ఉండేది. సీజన్‌తో సంబంధం లేకుండా పనిదొరికేది. ఇంటిదగ్గరే ఉంటూ రోజుకు రూ.60 నుంచి రూ.70వరకు ఆదాయం పొందేవారు. పురుషులు వస్త్రాలను నేసి డబ్బులు సంపాదించేవారు. దీంతో జీవనం సాఫీగా సాగిపోయేది. ఏడాదిగా ఆంధ్రాఫైన్ కార్మికాభివృద్ధి సంస్థ వీరి బాగోగులను పక్కనపెట్టింది. ముడిసరుకైన పత్తిని ఇవ్వడం నిలుపుదలచేసింది. ఫలితంగా వీరికి పనిలేక రోడ్డున పడ్డారు. ఈ గ్రామాల్లోని సుమారు 300 కుటుం బాల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది గుంటూరు, చీరాల ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. మరికొంత మంది తమ కుటుంబ సభ్యులను విడిచిపెట్టి విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువు చేనేత కార్మికులు పనిలేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యార ని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు అందజేయడం లేదని, అర్హులకు కొత్తగా పింఛన్లు కూడా మంజూరు చేయడంలేదంటూ వాపోతున్నారు. ముడిసరుకు లభించడంలేదు... గతంలో జిల్లాలో పత్తి విరివిగా లభించేంది. చౌకగా కొనుగోలుచేసి సురవరంలోని చేనేత కార్మికులుకు అందించేవాళ్లం. వారు వాటిని ఒడికి నూలు తయారుచేసి మాకు ఇచ్చేవారు. గతేడాది నుంచి పంటలు పండక పత్తి దొరకడం లేదు. అందుకే ముడిసరుకు అందించలేకపోతున్నాం. - కె.సుధాకర్, పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ సంస్థ ప్రతినిధి ఇబ్బందులు పడుతున్నాం... ముడిసరుకు ఇవ్వకపోవడంతో మాకు పనులులేవు. ఉపాధిపనులు కూడా వేసవిలో తూతూ మంత్రంగా ఉంటున్నాయి. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోతున్నాయి. బతకడం కష్టంగా మారింది. - దువ్వాకుల సుశీల, చేనేతకార్మికరాలు, సురవరం వలసలే గతి.. స్థానికంగా పనిలేక గ్రామంలో పురుషులంతా పట్టణాలకు వలసబాటపడుతున్నారు.అక్కడ కష్టంగా ఉండడంతో మహిళలను తీసుకెళ్లడంలేదు. మేం ఇంటివద్దే ఉంటున్నాం. -ఎ.వరలక్ష్మి, చేనేత కార్మికరాలు, సురవరం -
షాక్‌ఫార్మర్
రైతన్నకు ఫికర్ - అధ్వానంగా ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ - కరెంటోళ్ల నిర్వాకం.. అన్నదాతకు సంకటం - కొత్తవి ఇవ్వరు.. మరమ్మతు చేయరు - 3,500 ట్రాన్స్ఫార్మర్ల కోసం అర్జీలు - 600కే మంజారుఅనుమతులు - ఆమ్యామ్యాలు ఇస్తేనే పనులు - ఒక్కో దానికి రూ.10వేల నుంచి 15వేల వరకు వసూళ్లు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం.. అంతకు మించి కాసుల కక్కుర్తి.. ఫలితంగా రైతన్నల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు, కాలిపోయిన వాటికి మరమ్మతులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో అన్నదాతలకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. రూ. వేలకు వేలు గుమ్మరిస్తేనే టాన్స్‌ఫార్మర్లు రిపేరు అవుతున్నాయి. లేకుంటే పంటలు ఎండిపోవడం ఖాయం.. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో చిక్కుకుంది. జిల్లాలో మొత్తం 1.75 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా దాదాపు 4.59 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకపాత్ర ట్రాన్స్‌ఫార్మర్‌దే. వీటి ఏర్పాటులో విద్యుత్ శాఖ సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని రైతు డీడీ తీసిన దగ్గరి నుంచి పొలంలో ఏర్పాటు చేసేందుకు నెలలు, సంవత్సరాలు పడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎలా ఉన్నా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల ట్రాన్స్ఫార్మర్ కష్టాలు కడతేరడం లేదు. కొత్తవాటిని ఏర్పాటు చేయాలంటే విద్యుత్ సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేయడమేకాక, వేల రూపాయలు ముట్టజెప్పాల్పి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై ఓవర్‌లోడ్ పడి ట్రిప్ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లతో పాటు లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కూడా కాలిపోతుండడంతో రైతుల దుస్థితి గోరుచుట్టపై రోకటి పోటు చందంగా తయారయింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి అలా ఉంటే కాలిపోయిన వాటికి మరమ్మతు చేసే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ సమస్యను 48 గంటల్లో పరిష్కరించాల్సి ఉన్నా.. అది జరగడం లేదు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను ఎస్పీఎం సెంటర్‌కు తీసుకెళ్లి మరమ్మతు చేయించి మళ్లీ రైతు పొలంలో ఏర్పాటు చేసేందుకు వాహనాలు ప్రభుత్వమే సమకూర్చినా ఆ భారం కూడా రైతుల పైనే అధికారులు వేస్తున్నారు. కాలిపోయిన దానికి తీసుకెళ్లడానికి ఒక రోజు, మరమ్మతు అయిన దానిని తీసుకెళ్లేందుకు మరో రోజు రైతుకు రూ. వేలకు వేలు రవాణా భారం పడుతోంది. చేతులు ‘తడిపితేనే’.... విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది లంచాలుగా తీసుకుంటున్న మొత్తం రూ. కోట్లు దాటుతాయనే ఆరోపణలున్నాయి. కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా 3 వేల కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా, వాటికి ఆమ్యామ్యాల కింద ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు సగటున రూ. 10 నుంచి 15వేల చొప్పున రూ.3.5 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టిందని అంచనా. దీనికి తోడు కరెంటు పోల్స్, వైర్లు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతులపై ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రూ.2 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఇంత ఖర్చు చేసినా రైతుకు మాత్రం సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులోకి రావడంలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 3,650 ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉండగా, అందులో కేవలం 600 ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే వర్క్ ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. వాటిలో కూడా ఆ రెండు నియోజకవర్గాలదే అగ్రస్థానం. కొత్త ట్రాన్స్ఫార్మర్ల మంజూరు నుంచి దాన్ని బిగించే వరకు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టచెప్పాల్సిందే. ఎంతగా అంటే.. జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ భాగం విద్యుత్ శాఖ సిబ్బంది ఉండడం గమనార్హం. -
నాలుగు రోజులకే రోడ్లు ఛిద్రం
జిల్లాలో పలు ప్రాంతాల్లో అర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు వేసిన రోడ్లలో నాణ్యత లోపించింది. కమీషన్లకు అలవాటు పడ్డ అధికారులు నాణ్యత గురించి పట్టించు కోవడం లేదనే విమర్శలున్నాయి. రోడ్ల మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఫలితంగా రోడ్లు వేసిన నాలుగు రోజులకే ఛిద్రమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పలు రోడ్లు అడుక్కొక గొయ్యి, గజానికో గుంటలుగా మారాయి. - కోట్ల రూపాయలు రోడ్డు పాలు - కమీషన్లుకు అలవాటు పడ్డ అధికారులు - జిల్లాలో 3,272 కి.మీ. ఆర్అండ్బీ రోడ్లు - 5,052 కి.మీ. పీఆర్ రోడ్లు నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో 3,272 కిలోమీటర్ల ఆర్అండ్బీ, 5,052 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఆర్‌కు సంబంధించి సుమారు రూ.120 కోట్లతో 84 పనులు చేపట్టారు. వాటిలో 60కు పైగా రోడ్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీకి సంబంధించి 46 పనులు మంజూరు చేశారు. రూ.91 కోట్లు కేటాయించారు. 46 రోడ్డు పనుల్లో 10కి పైగా టెండర్ల దశలో ఉన్నాయి. మిగిలిన పనులు జరుగుతున్నాయి. అధ్వానంగా ఉన్న రోడ్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న బీటీ రోడ్లపై రోడ్లు వేస్తున్నారు. ఈ ప్రక్రియ సంవత్సరం మొత్తం జరుగుతుంది. చిన్నపాటి వర్షానికే...: చిన్నపాటి వర్షానికే ఈ రోడ్లు దెబ్బతింటున్నాయి. గ్రామీణ ప్రాంతాల రోడ్లలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. గూడూరు, రాపూరు, కలువాయి, ఆత్మకూరు, వెంకటగిరి, మర్రిపాడు, జలదంకి, బోగోలు తదితర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సోమశిల జలాశయం నుంచి పరమానందయ్య ఆశ్రమం వరకు 20 సంవత్సరాల కిందట బీటీ రోడ్డు వేశారు. నేటికీ అది చెక్కుచెదరలేదు. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. రోడ్డ్డు కాంట్రాక్టర్లకు వరాలిచ్చే గనులుగా ఉన్నాయి. ప్రజలకు ఉపయోగం ఉండడంలేదు. అధికారులు కుడా కాంట్రాక్టర్లకు అనుకులంగా పనులు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. గ్రామల్లో నిర్మించిన గ్రావెల్ రోడ్లు తుతూ మంత్రంగా వేస్తున్నారు. సమీపంలోని ప్రాంతాల్లోని గులకను తీసుకువచ్చి రోడ్లు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బీటీ రోడ్డు వేసిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించాలి. అయితే వీరు నామ మాత్రంగా పరిశీలించి వారికి రావలసిన వాటాను పుచ్చుకుంటున్నారనే విమర్శలున్నాయి. నాణ్యత లోపిస్తే సహించేదిలేదు: ప్రతి నెలా రోడ్డు పనులు జరుగుతుంటాయి. అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతాం. అనుమతి వచ్చిన తరువాత టెండర్లు నిర్వహిస్తాం. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తరువాత పనులు చేపడతాం. రోడ్డు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేదిలేదు. నాణ్యత లేకుండా రోడ్డు వేస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు చేపడతాం. -విజయకుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ -
లీకేజీల రామప్ప
- మోసం తెచ్చిన రింగ్‌బండ్ - తూము మరమ్మతుల్లో నిర్లక్ష్యం - పనులు పర్యవేక్షించని అధికారులు - ఆగని నీటి ప్రవాహం - లబోదిబోమంటున్న రైతులు తూములోకి నీరు రాకుండా అడ్డుగా మట్టి పోస్తున్న రైతులు,(ఇన్సెట్లో)తూములోకి ఉధృతంగా వస్తున్న నీరు వరంగల్ : జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒక్కటైన రామప్ప చెరువు నీరు లీకేజీల కారణంగా వృథాగా పోతోంది. వెంకటాపు రం మండలంలోని రామప్ప సరస్సు తూము దశాబ్దాల కిత్రం నిర్మించినందున తరచూ లీకవుతోంది. మూడు స్థాయిల్లో నీటిని విడుదల చేసే విధంగా షెటర్లు ఉన్న ఈ తూము ను నిజాం కాలంలో పునర్నిర్మించారని స్థాని కులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాతబడిన తూము షటర్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు 2012లో సుమారు రూ.20లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. ఇందులో రూ.10 లక్షలు ఎంపీ బలరాంనాయక్ తన సీడీఎఫ్ నుంచి సమకూర్చగా, మరో రూ.10 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. అసలేం జరిగింది... రామప్ప ప్రధాన తూము నుంచి ఓగరు చానల్ ద్వారా రామాంజపూర్ పరిధిలోని చివరి ఆయకట్టు పొలాలకు సాగు నీరందించేందుకు డీఈఈ ఆనందం ఆదేశాలతో ఐబీ శాఖ ఉద్యోగి శుక్రవారం సాయంత్రం తూము షటర్లను లేపాడు, సరస్సు నీరు అధికమోతాదులో పోతుండడంతో షటర్లు దింపేందుకు ప్రయత్నించగా.. దిగలేదు. షటర్ల కిందకు రాళ్లు వచ్చి చేరడంతో ఈపరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. తూము ద్వారా నీరు వృథాగా పోతోందని తెలిసిన ఐబీ అధికారులు ఆదివారం చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో తొలగించిన రింగ్‌బండ్‌ను మళ్లీ పోసేందుకు ప్రయత్నించినా.. నీటి ఉధృతి కారణంగా పనులు పూర్తి చేయలేకపోయారు. ఉన్నతాధికారులు నిర్లక్ష్యం... వేల ఎకరాలకు సాగు నీరు, వందలాది గ్రామాలకు తాగు నీరందించే రామప్ప సరస్సుపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సరస్సు నిర్వహణకు రెగ్యులర్ ఏఈని నియమించలేదు. వెంకటాపూర్ మండల ఏఈగా నియమితులైన మహిళా ఇంజనీరు ప్రస్తుతం సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. ఈమె స్థానంలో ఉద్యోగ విరమణ పొందిన ఇంజనీరు విధులు నిర్వర్తిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలో పర్యవేక్షణ లోపం కారణంగానే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పూర్తి చేసినట్లు సమాచారం. అందువల్లే రింగ్‌బండ్ తొలగించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఏఈ, డీఈఈలు రాలేదని స్థానికులు తెలిపారు. ఆదివారం ఈఈతో పాటు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు లీకేజీలు అరికట్టేందుకు చెరువు వద్దకు వచ్చినట్లు తెలిసింది. నీరు ఉధృతి కారణంగా చేతికి వచ్చిన పంట మొత్తం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. నీటి లీకేజీలను వెంటనే అరికట్టి, ఇప్పటికైన పూర్తి స్థాయి ఏఈని నియమించాలని రైతులు కోరుతున్నారు. కాగా, పొక్లెయినర్ తీసుకువచ్చి పనులు పూర్తి చేసి నీటి లీకేజీలను అరికడతామని ములుగు ఈఈ గోపాలరావు తెలిపారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర - 66
ఆచారాలు - నమ్మకాలు అదే దశలో, మనిషికి చేయవలసిన పనులూ (కర్తవ్యాలు), మనుషులు చేయడగూడని పనులూ (నిషేధాలు) అనేవి ఒక క్రమంలో పటిష్టమై, ఆచారాల జాబితాలో కలిసి, అనుభవజ్ఞుల జ్ఞాపకంలో పొడవాటి సరంగా పాదుకొని ఉండాలి. అలా కాకపోతే, గుంపును క్రమశిక్షణలో ఉంచడం సాధ్యాపడదు. క్రమశిక్షణ లేని గుంపుకు మనుగడ ఉండదు. ఆనాటి గుంపులు నిరవధికంగా మనుగడ కొనసాగించడమేగాక, తెగలుగానూ, జాతులుగానూ ప్రపంచవ్యాప్తంగా విసృ్తతి చెందడమే పై సమాచారానికి రుజువు. మరికొంత ముందుచూపు ఏర్పడిన తరువాత, సంచార జీవితంలోనే పశువుల కాపరిగా నెలకొన్న దరిమిలా, సూర్యచంద్రులవల్ల ప్రయోజనం తనకు ఇదివరకు తెలిసినదానికంటే చాలా ఎక్కువగా ఉందని మానవుడు గ్రహించాడు. వలసలకు పగిటివేళలు అనుకూలమైనవిగా ఎన్నుకున్నాడు. పొద్దు పొడుపు, పొద్దు క్రుంకు ప్రదేశాలను తూర్పు పడమరలుగా విభజించుకున్నాడు. నక్షత్రాలను గుర్తించడం ద్వారా ఉత్తర దక్షిణాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పిల్ల తెమ్మర, విసురుగాలి, హోరుగాలి, ప్రచండమారుతం, ప్రళయమారుతం వంటి తేడాలతో గాలి ప్రవర్తించడం గమనించాడు. చిరుజల్లు మొదలు జడివాన దాకా వర్షపాతంలోని తేడాలను తెలుసుకున్నాడు. వాటి అనుకూలతను బట్టి వలసలను మలుచుకోవడమేగాదు, వాటిని సర్వసాధారణమైనవిగాకాక, ఏదో ప్రత్యేకతలు వాటిలో ఉన్నట్లు అనుమానించాడు. పశువుల కాపరిగా ఇప్పుడతనికి దిక్కులతోనూ, వాతావరణంతోనూ, వర్షాలతోనూ అనుబంధం ఏర్పడటమేగాక, నేల కొలతలతో గూడా అవసరం తన్నుకొచ్చింది. అవెస్టాలో ప్రకృతి శక్తుల సమాచారం ఉన్నప్పటికీ వాటి ప్రాముఖ్యత పెద్దగా కనిపించదు. న్యాయం, ధర్మం వంటి సామాజిక అంశాలకే అందులో ప్రాధాన్యత కనిపిస్తుంది. రుగ్వేదంలో భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నిప్పు, నీరు వంటి దృగ్గోచర పదార్థాలకేగాక, గాలికీ, శౌర్యప్రతాపాల వంటి గుణాలకూ, జ్ఞానానికి, శరీరంలో ఉత్పన్నమయ్యే ఉద్రేకాలకూ రూపం కల్పించి, వాటివల్ల ఒనగూరే ప్రయోజనాలను పొందేందుకూ, వాటివల్ల కలిగే నష్టాలను నివారించుకునేందుకూ, ఆశక్తులకు ‘ప్రీతి’ కలిగించే కార్మకాండ ప్రారంభమయింది. ఈ అడుగుతో, ప్రలోభాలతోపాటు భయం కూడా నమ్మకాల జాబితాలో చేరిపోయింది. రుగ్వేద కాలంనాటికి తిథులూ, మాసాలూ ఏర్పడిన దాఖలాలు కనిపించవు. కానీ ‘సినీవాలి’ ప్రస్తావనతో చాంద్రాయణాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు బోధపడుతుంది. బైబిల్లోని ‘నోవా అండ్ ది ఆర్క్’ వృత్తాంతం వివరంగా పరిశీలిస్తే, ఆ ఘోరమైన జలప్రళయం నాటికి చాంద్రాయణమాసం, దినాలూ మెసపటోమియా ప్రాంతంలో అప్పటికే ఏర్పడినట్టు అర్థమౌతుంది. ‘బుక్ ఆఫ్ జెనిసిస్’ తొలి అధ్యాయంలో దేవుడు మొదటి రోజు నుండి ఆరవరోజు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి, ఏడవరోజు విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉండడంతో, బైబిల్ తయారౌతున్న సమయానికి కాలాన్ని రోజులుగా విభజించి, ఏడురోజులు కలిపి ఒక ‘వారం’గా చేసుకున్న ఏర్పాటు వెల్లడౌతుంది. లెక్కింపు కోసం కాలాన్ని విభజించుకునే ప్రయత్నం రుగ్వేదకాలం తరువాతి ఆర్యుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చాంద్రాయణ మాసాన్ని నాలుగు వారాలుగా కాకుండా, రెండు ‘పక్షాలు’గా విభజించుకున్నారు. చంద్రుడు పెరగడం మొదలుపెట్టి పూర్ణబింబంగా ఎదిగేవరకు నడిచేది ‘శుక్లపక్షం’. చంద్రుడు తరిగేది మొదలై పూర్తిగా మాయమయ్యేవరకు నడిచేది ‘బహుళపక్షం’ వారంలోని విభజన ఏడు రోజులై ఉండగా, పక్షంలోని విభజన పదిహేను తిథులకింద జరిగింది. మహాభారత కాలంనాటికి కూడా దినాలను తిథులతోనేగాని, ‘సోమవారం, మంగళవారం’ వంటి రోజులుగా లెక్కించడం కనిపించదు. ఆ తిథుల్లో కొన్ని మంచివిగానూ, మరికొన్ని చెడ్డవిగానూ భావించే సంప్రదాయం ఏర్పడినట్టు కనిపించదు. ఎందుకంటే, మహాభారతంలో శుభకార్యాలకు సుముహూర్తాలు కనిపించవు గాబట్టి. లెక్కింపు కోసం కాలాన్ని విభజించుకునే ప్రయత్నం రుగ్వేదకాలం తరువాతి ఆర్యుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చాంద్రాయణ మాసాన్ని నాలుగు వారాలుగా కాకుండా, రెండు ‘పక్షాలు’గా విభజించుకున్నారు. చంద్రుడు పెరగడం మొదలుపెట్టి పూర్ణబింబంగా ఎదిగేవరకు నడిచేది ‘శుక్లపక్షం’. చంద్రుడు తరిగేది మొదలై పూర్తిగా మాయమయ్యేవరకు నడిచేది ‘బహుళపక్షం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
నూతన సంవత్సర శుభ్ర కాంక్షలు
ఈ సంవత్సరం మార్చి నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పరీక్ష ఎక్కడ నిర్వహిస్తారో, ఎప్పుడు నిర్వహిస్తారో, ఎలా నిర్వహిస్తారో, ఇంకా చెప్పాలంటే ఎందుకు నిర్వహిస్తారో, ఏ విశ్వవిద్యాలయంలో ఎక్కడ, ఎలా ప్రవేశాలు జరుగుతాయో చెప్పగలిగిన జ్యోతిషుడికి, హుద్ హుద్ స్థాయిలో చందాలు వేసుకుని, విద్యార్థులంతా ఊరేగింపులు, సత్కారాలు జరపాలని తీర్మానించడమైంది. మనకు ఒకప్పుడు ఒక రాష్ట్రపతి ఉండేవారు. ‘కలలు కనండీ కలలు కనండీ’ అంటూండేవారాయన (ఇప్పటికీ ఆయన అదే మాట చెప్తారు రాష్ట్రపతి కాకున్నా). అప్పట్లో ప్రజలకు అర్థమయ్యేది కాదు; సమస్యలు ఎలా ఉన్నాయంటే నిద్రే పట్టదు; ఇంక కలలు ఎలా కనాలి అని. ఇప్పటికీ ప్రజల సమస్య అదే. కానీ 2014లో మనకు దైవవశాన లభించిన తాజా తాజా ప్రధానమంత్రి, తాజా తాజా ముఖ్యమంత్రులు ఆ కలల్ని ఎగిరి గంతేసి పట్టుకున్నారు. వాళ్లది సామ్యవాదం కనక తమ కలలు అందరివీ, అందరి కలలూ తమవి అనుకున్నారు. అందుచేత గబగబా వేదికల మీద, పత్రికా గోష్టుల్లో కలలు కనేసి, అందరికీ పంచేస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఒకే కలలు వస్తున్నాయి. పే.....ద్ద భవనాలు, వీధికొక యూనివర్సిటీ, కులానికో భవనం.. చవగ్గా అనేక రకాల చీపుర్లు.. నామకరణం వేళకు లాప్‌టాప్‌లు, ఇండియాలో తయారైన చైనా గోడలు, స్టాట్యూ ఆఫ్ లిబర్టీలు... ఇలా అనంతమైన కలలు. ఫ్రాయిడ్ గనక ఇప్పుడు పుడితే తన ‘ఇంటర్‌ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ ఎంత చెత్త పుస్తకమో గ్రహించి, సరికొత్త పుస్తకాన్ని రాస్తాడు. గత సంవత్సరం మనకు లభించిన ఈ దైవాంశ సంభూతుల కలల్ని ఈ సంవత్సరం నిజం చేయడం భారతపౌరులుగా మన కర్తవ్యం. ముందు చీపురునే తీసుకుందాం. ఎవ్వరి ఇళ్లలోను ఇకపై వ్యాక్యూమ్ క్లీనర్లు ఉండేందుకు వీల్లేదు. ఒకవేళ ఉంటే బయటకు పారేయండి. ఎర్ర రిబ్బను చీపుర్లు, నల్లరిబ్బను చీపుర్లు, నీలం చీపుర్లు, ఇలా మీకు ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు రిబ్బన్లున్న చీపురులను తయారు చేయడం, వాడడం మన తక్షణ కర్తవ్యం. కావాలంటే అన్నీ కాషాయరంగు చీపుర్లయినా ఫర్వాలేదు. చల్తా. అలా కొన్నాక ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంటిల్లిపాదీ ఊడ్చేందుకు టైం టేబిల్ వేసుకోవాలి. అలా ఊడవడం కొత్త సంవత్సరానికి చాలా అవసరం. ఊడ్చిన తర్వాత శుభ్రంగా ఉన్న దేశంలో మనం అన్నిటినీ తయారుచేసుకుందాం. వీలైతే ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ లో కూడా తయారు చేసుకుందాం. ఎందుకంటే మేడిన్ ఇండియా ఎంత ముఖ్యమో, మేడిన్ ఆంధ్రా, మేడిన్ తెలంగాణా కూడా అంతే ముఖ్యం. కొత్త సంవత్సరం అనగానే అందరికీ కొత్త ఆశలు, కొత్త తీర్మానాలూ ఉంటాయట. రెండూ తీరకూడదట కూడా. తీరిపోతే మళ్ళీ సంవత్సరానికి తాజాగా కొత్త ఆశలు కల్పించుకోవడం కష్టం కాబట్టి అవి తీరకుండా భగవంతుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాడట. అసలు భగవంతుడికి చాలా బద్ధకం. అందుకే పెళ్లిని ‘ఏడేడు జన్మల బంధం’ అన్నాడు. ప్రతి జన్మలోనూ ఒక్కో అబ్బాయికీ, అమ్మాయికీ కొత్తగా జంటను కుదర్చడం తనకు టైం వేస్టని, ఏడు జన్మల వరకూ మీరే కలిసి ఏడవండి అని చెప్పేశాడు. మనమేమో అది పవిత్ర జన్మజన్మల బంధం అనుకుంటాం. అమాయకులం కదా! ఇంతకూ కొత్త ఆశలు మనం దేనిపై పెట్టుకోవాలిట? భారతదేశంలో ప్రజలకు ఉత్సాహం కలిగించేవి రెండే (ఏ టీవీ ఛానెల్‌ని అడిగినా అదే చెప్తారు): సినిమాలు, రాజకీయాలు కనక ఈ కింది తీర్మానాలు చేద్దాం. మహేశ్‌బాబు ‘వన్’ లాంటి సినిమాలు చేయడం మానేసి , పోకిరి-2 అతడు-3 చేయవలెనని తీర్మానించడమైనది చిరంజీవి 150వ చిత్రం మరో నాలుగేళ్ళ వరకూ వస్తూనే ఉండవలెననీ, ఈ లోగా ‘ఈ భూమి మీద సూర్యచంద్రులు తిరుగాడినంతకాలం నిలిచే’’ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే, మళ్లీ దాన్ని పీట మీద కూర్చోబెట్టి ఢిల్లీలో ఆయన మంత్రిగా వెలగాలని తీర్మానించడమైనది ‘వందకోట్ల సినిమాలు’ వంటి విశేషణాలు ఇష్టం లేదంటూనే 300 కోట్ల జాబితాలో చేరానా లేదా అని చూసుకునే అమీర్‌ఖాన్ మరిన్ని ‘సందేశాత్మక’ చిత్రాలతో మనల్ని సన్మార్గంలో నడిపించాలని తీర్మానించడమైంది బ్రహ్మానందం చెంపదెబ్బలు తినని తెలుగు సినిమా ఏదైనా పొరబాటున విడుదల అయితే, దాన్ని నిషేధించాలని తీర్మానం చేయడమైనది. కుటుంబ సభ్యులతో మాటలు తగ్గించాలని తీర్మానించడమైంది. దీనివల్ల పరిసరాల్లో ధ్వనికాలుష్యం తగ్గుతుంది. రోజు అమ్మానాన్నలు తాము ఈరోజు వండుకున్న వంటలూ, తిరగబోతున్న ప్రదేశాలు, ఆఫీసులో చేసిన పనులు, వాటన్నిటి ఫోటోలు ఫేస్బుక్లో పెట్టాలి. వీలైతే తమ పాస్‌పోర్టు ఫోటోలతో. ఎందుకంటే తమ పిల్లలు తమ పేర్లను గుర్తిస్తారో లేదో. తాము రాసిన దానికి ‘లైక్’ కొట్టమని పిల్లలకు ఒక ఎస్ఎమ్ఎస్లో లేదా వాట్సాప్‌లో సందేశం పంపాలని తీర్మానించడమైనది. కొత్త సంవత్సరానికి ఈ తీర్మానాలు అంతం కావు; ఆరంభం.. -
గడవని పూట.. వలసబాట
కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో కలిపి సుమారు 150 వరకు గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో సుమారు 35వేల వరకు ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో బతుకుదెరువు నిమిత్తం పుణే, ముంబై తదితర పట్టణాలకు 60శాతం మందికి పైగా వలస వెళ్లారు. నిత్యం కుల్కచర్ల, గండేడ్ మండలాల నుంచి పరిగి, మహబూబ్‌నగర్, తాండూరు డిపోల ఆర్టీసీ బస్సులు ముంబై, పుణేలకు రద్దీగా వెళ్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీవిత కాలమంతా .. బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన గిరిజనులు యేడాదిలో ఎనిమిది నెలలు అక్కడే పనులు చేసుకుంటున్నారు. నాలుగు నెలలు మాత్రం తిరిగివచ్చి తమ కుటుంబాలు, వ్యవసాయాన్ని చూసుకుని వెళ్తున్నారు. తిండి గింజలు ఇంట్లోవేసి, పిల్లల్ని పెద్దల దగ్గర ఉంచి తిరిగి పట్టణాలకు పయనమవుతారు. ఇంటిదగ్గర ఉన్న వృద్ధులపైనే అధిక భారం పడడంతో కాయాకష్టం చేసి, కట్టెలు అమ్ముకుని పిల్లల్ని కాపాడుకుంటున్నారు. పడని అడ్డుకట్ట.. వలసల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. అవగాహనా లోపమో, లేక ఇక్కడ లభిస్తున్న ఉపాధి కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదన్న కారణమో గానీ వలసలు మాత్రం ఆగడం లేదు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులతో ఆయా తండాల్లో మరింత పెరిగాయి. కూతుళ్ల పెళ్లికని చేసిన అప్పు తీర్చేందుకు కొందరు, తల్లిదండ్రుల ఆరోగ్యం నిమిత్తం ఉన్నదంతా ఖర్చు చేసి తిరిగి సంపాదించుకునేందుకు మరికొందరు, తాముపడిన కష్టం పిల్లలు పడకూడదని వారిని బాగా చూసుకునేందుకు కాస్తోకూస్తో కూడబెట్టాలనే తాపత్రయంతో ఇంకొందరు.. ఇలా గ్రామాలను విడిచి వెళ్తున్నారు. భరోసా ఇవ్వన్ని ‘ఉపాధి’ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం గిరిజనులకు భరోసా కల్పించలేకపోతోంది. నెలలు గడిచినా చేసిన పనికి కూలీ డబ్బులు చేతికందకపోవడంతో దీనికన్నా వలసబతుకు లే మేలని అటువైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం కల్పిం చే ఉపాధికన్నా ముంబై, పుణేల్లో చేసే కూలీ పనులకే ఎక్కువ గిట్టుబాటవుతోందని అంటున్నారు. చేసిన పనికి వారంరోజుల్లో కూలీ డబ్బులు చెల్లిస్తే, ఉన్న ఉపాధిని నిరుపేద రైతుల వ్యవసాయానికి అనుబంధం చేస్తే కొంతవరకు వలసలను నిరోధించవచ్చని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే.. మారుమూల గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే సంక్షేమ నిధులు వస్తాయని, వాటితో అభివృద్ధితోపాటు స్థానికులకు ఉపాధి దొరుకుతుందని గిరిజనులు పేర్కొంటున్నారు. అప్పుడు ఇక్కడే ఉండి తమ పిల్లల బాగోగులు, చదువులు కూడా చూసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. -
ఆశలపై నీళ్లు!
గద్వాల/మక్తల్: కరువు ప్రాంతంగా పేరొందిన పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. సిరులు పండించే భూములున్నా నీళ్లు లేకపోవడంతో బీళ్లుగా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి పచ్చని పాలమూరుగా మారుస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రధాన ప్రాజెక్టులకు తొలిబడ్జెట్‌లో అరకొరగానే నిధులు విదిల్చింది. దీంతో పనులు పూర్తయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏటా మూడు పంటలు పండించుకోవచ్చని భావించిన ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ అత్తెసరు నిధులతో సకాలంలో సాగునీరు అందుతుందా..? అన్న సందేహం రైతుల్లో నెలకొంది. జిల్లాలో 87వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) నుంచి 30వేల ఎకరాలకు మించి అందడం లేదు. దీంతో ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీళ్లందని పరిస్థితిని అధిగమించేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ప్రతిపాదించారు. అందుకు అనుగుణంగా డీపీఆర్‌కు అనుమతించాల్సిన నీటిపారుదలశాఖ అధికారులు ఫైల్‌ను తరువాత చూద్దాంలే..అని పక్కకు పెట్టేశారు. ఇదిలాఉండగా, ఆర్డీఎస్ తాత్కాలిక పనుల నిర్వహణకు రూ.13కోట్లు కేటాయించాలని అధికారులు నివేదించగా ప్రభుత్వం రూ.2.70కోట్లు మాత్రమే కేటాయించి ప్రతిపాదనల్లో కోత విధించింది. అయిజ, మానవపాడు, వడ్డేపల్లి మండలాల్లో ఆర్డీఎస్ కాల్వలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీల షట్టర్లు, పిల్లకాల్వలను బాగుచేయాల్సి ఉంది. ‘భీమా’కు భరోసా ఏది? మక్తల్ నియోజకవర్గంలోని 1.11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తే అసంపూర్తి పనులు పూర్తయి వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందుతుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు రూ.150 కోట్లు కేటాయించాలని సాగునీరు పారుదల శాఖ అధికారులు ప్రతిపాదించగా, ప్రభుత్వం మాత్రం తొలి బడ్జెట్లో రూ.83.50కోట్లు మాత్రమే కేటాయించింది. రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లోనే రూ.750కోట్లను భీమా ఫేజ్-1 కింద కేటాయించారు. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.922కోట్లకు పెరిగింది. 2008లోనే పూర్తికావాల్సి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడి పనులు అక్కడే..! భీమా ప్రాజెక్టు కింద సంగంబండ, ఉ జ్జెల్లి, నేరడిగొమ్ము, భూత్పూర్, నాలు గు గ్రామాలను ముంపుప్రాంతాలుగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు బాధితులకు నష్టపరిహారం చెల్లించడం లో తీవ్రజాప్యం జరుగుతోంది. మక్తల్ మండలం పంచదేవ్‌పాడ్ వద్ద భీమా మొదటిదశ గ్రావిటీకెనాల్ బ్లాస్టింగ్ ప నుల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డి మాండ్చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పెండింగ్‌లో ఉన్న పనులకు రూ. 150కోట్లు ప్రతిపాదించగా ప్రస్తుత బడ్జెట్లో రూ. 83.50కోట్లు కేటాయించడంతో పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకా శం కనిపిం చడం లేదు. ఈ నిధులు తా త్కాలిక అ వసరాలకే సరిపోతాయని ప్ర తిపక్షాలు విమర్శిస్తున్నాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంతో పా టు వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీళ్లు అం దించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
‘కల్వకుర్తి’ మూడోదశ పూర్తయ్యేదెప్పుడు?
ఆరు నెలలుగా ఆగిన పనులు పనుల గడువును ఏడాది పొడిగించినా మారని కాంట్రాక్టు సంస్థ తీరు వచ్చే జూన్‌లోగా ప్రాజెక్టు పూర్తికావడం అనుమానమే సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన మహబూబ్‌నగర్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జిల్లాలోని పదిహేను మండలాల పరిధిలో 3.4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి సాగునీరందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు. వివిధ కారణాలను చూపుతూ కాంట్రాక్టు సంస్థ ఆరు నెలలకు పైగా పనులను పూర్తిగా నిలిపివేసి చోద్యం చూస్తోంది. పనులు పూర్తి చేసేందుకు గతంలో విధించిన గడువు ఈ ఏడాది జూన్‌తోనే ముగిసినా, పనుల చివరి దశలో ఇతర కాంట్రాక్టు సంస్థకు ఇవ్వటం ఇష్టం లేక ప్రభుత్వం పాత సంస్థకే మరో ఏడాది గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు దశలుగా ప్రాజెక్టు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 3.40లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా, ప్రాజెక్టు మొత్తాన్ని మూడు దశలుగా విడగొట్టారు. ఇందులో కొల్లాపూర్ ఒకటో దశ కింద 13వేల ఎకరాలు, జొన్నలబొగడ రెండో దశ కింద 47వేల ఎకరాలు, మూడో దశ గుడిపల్లెగట్టు కింద 2.80లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందులో మూడో దశ కింద 42.80 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు పంప్‌హౌస్, రిజర్వాయర్లను నిర్మించేందుకు 2005-06లో గ్యామన్ ఇండియా అనే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. 13 మెగావాట్ల సామర్థ్యంగల ఐదు పంపులు 800ల క్యూసెక్కుల నీటిని 117 మీటర్ల ఎత్తుకి పంప్ చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. ఈ పనులను పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన గ్యామన్ ఇండియా 2010లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జరిగిన జాప్యం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు గడువును పొడిగించింది. ఈ ఏడాది మే వరకు ఆ సంస్థ 82 శాతం పనులను పూర్తి చేసింది. అయితే జూన్ మొదటివారం నుంచి పనులను పూర్తిగా నిలిపివేసింది. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యానే కాంట్రాక్టు సంస్థ పనులు నిలిపివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. గడువు పొడిగించినా కదలని పనులు.. కాగా ప్రాజెక్టు పనులకు సంబంధించి ఈ ఏడాది జూన్‌తో గడువు ముగియగా సెప్టెంబర్‌లో ప్రభుత్వం మరోమారు గడువును ఏడాది పాటు పొడిగించింది. ఈ లెక్కన వచ్చే జూన్ నాటికి మధ్యలో నిలిచిపోయిన సుమారు రూ.110కోట్ల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరందించాలని ఆదేశించింది. అయితే గడువు పొడిగించి రెండు నెలలు గడుస్తున్నా అడుగు ముందుకు కదల్లేదు. దీనిపై స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను పిలిచి మాట్లాడినా ఫలితం కానరావడం లేదు. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. -
ప్రారంభానికి ముందే పగుళ్లు!
ఐటీడీఏలో నాసిరకం పనులు పెచ్చులూడుతున్న హాస్టల్ భవనాలు చినుకుపడితే చెమ్మ వస్తున్న పైకప్పు మరో పూత వేస్తామంటున్న ఏఈ సాక్షి, హన్మకొండ : గిరిజనుల సంక్షేమ కోసం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)తో గిరిజనుల కంటే ఐటీడీఏ అధికారులు, కాంట్రాక్టర్లే లబ్ధి పొందుతున్నారు. కాగితాలపై గిరిజన సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తున్నా వాస్తవంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఇందుకు ములుగు మండలం జాకారంలో నిర్మాణంలో ఉన్న బాలురు, బాలికల హాస్టల్ భవనాలే ఉదాహరణగా నిలుస్తాయని చెప్పవచ్చు. విద్య ద్వారానే గిరిజనుల్లో అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని.. ఐటీడీఏ కోట్లాది రూపాయలు గిరిజనుల చదువు కోసం వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా ములుగు మండలం జాకారంలో ఒక్కొక్కటి కోటి రూపాయల వ్యయంతో బాలికలు, బాలురులకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవనాలను నిర్మిస్తున్నారు. గత ఏప్రిల్ ఈ భవనాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగడుగునా ప్రతీ పనిని నాసిరకంగానే చేపడుతున్నారు. నిర్మాణం పూర్తికావొచ్చిన ఈ భవనాలను ఉపయోగించకముందే పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి, గోడలకు పగళ్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు, డాబాకు నీటి చెమ్మలు వచ్చాయి. ఈ భవన నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు నాసిరకంగా చేపట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పనులు నాసిరకంగా జరుగుతుంటే దాన్ని అరికట్టాల్సి ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. అంతేకాదు.. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ ఎంతో నాణ్యతతో కూడుకున్నవని కితాబిస్తున్నారు. పైగా భవనానికి వచ్చిన పగుళ్లు, డాబా పెచ్చులు ఊడి పోవడం వంటిని సాధరణంగా జరిగేవే అంటూ నాసిరకం ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఈ పనులు పర్యవేక్షించేందుకు ఏఈ జన్నపురెడ్డి రాంరెడ్డి మంగళవారం జాకారం వచ్చారు. ఈ సందర్భంగా నాసిరకం పనులపై ఆయనను ప్రశ్నించగా ‘పనులు పూర్తిస్థాయిలో జరగని కారణంగా ప్రస్తుతం బయటికి పగుళ్ళు కనిపిస్తున్నాయి. వీటిపైన మరోపూత వేయాల్సి ఉంది. ఆ పని జరిగిన తర్వాత ఈ పగుళ్లు కనిపించవు’ అని సమాధానం ఇచ్చారు. రెండేళ్లుగా నిర్మాణం.. ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్-2 పథకం కింద 2012-13 సంవత్సరంలో రూ. కోటి అంచనా వ్యయంతో బాలికలు, బాలురకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ మంజూరైంది. అయితే రెండేళ్ల నుంచి ఈ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఈ విద్యాసంవత్సర ప్రారంభమై మూడు నెలలు కావోస్తున్నా ఇంత వరకు పూర్తికాలేదు. దానితో హాస్టల్ సౌకర్యం లేక ఏజెన్సీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి రూ. కోటితో గర్ల్స్ హాస్టల్, రూ. కోటితో బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత వేసవిలో పనులను ప్రారంభించాం. పనుల ను నిభందనలకు అనుగుణంగా నాణ్యతాగానే చేపడుతున్నాం. పనులు పూర్తిస్థాయిలో జరగని కారణంగా ప్రస్తుతం బయటికి పగుళ్ళు కనిపిస్తున్నాయి. వీటిపైన మరోపూత వేయాల్సి ఉంది. వేసిన తరువాత ఆ పగ్గుళ్ళు కనిపించవు. ఎప్పటికి అప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నాం. నెల రోజుల్లో పనులు పూర్తిచేసి అప్పగిస్తాం. - జన్నపురెడ్డి రాంరెడ్డి, ఐటీడీఏ ఏఈ -
‘ఉపాధి’కీ తప్పని కాక
సాక్షి, రాజమండ్రి : అటు మండుతున్న ఎండలు, ఇటు కొత్త సర్కారు యోచన.. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు కుంటుపడ్డాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం పని దినాలు భారీగా తగ్గాయి. ఈ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగిస్తుందన్న వార్తలతో వారిలో నెలకొన్న అభద్రత కూడా పనులు మందకొడిగా సాగడానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఉగ్రరూపంలో కొనసాగుతున్న వాతావరణమే ఈ పథకం పనులు తగ్గడానికి కారణమని అధికారులు అంటున్నారు. జూన్ ఒకటి నుంచి ఏడవ తేదీతో ముగిసిన మొదటి వారంలో జిల్లాలోని 58 మండలాల్లో 1.90 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. అంతకు ముందు మే 25 నుంచి 31 తో ముగిసిన వారంలో 1.81 లక్షల మంది పనులకు హాజరయ్యారు. కానీ జూన్ ఎనిమిది నుంచి 14తో ముగిసిన రెండో వారంలో కేవలం 75,766 మందికి మాత్రమే పనులు కల్పించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారంతో పోలిస్తే లక్ష మందికి పైగానే కూలీలకు ఉపాధి పనులకు దూరంగా ఉన్నారు. పలు మండలాల్లో తగ్గిన హాజరు జిల్లాలోని పలు మండలాల్లో ఉపాధి కూలీల హాజరు గణనీయంగా తగ్గిపోయింది. ఈనెల మొదటి వారం కపిలేశ్వరపురం మండలంలో 3,800 మంది ఉపాధి పనులకు హాజరవగా రెండో వారంలో కేవలం 81 మంది మాత్రమే హాజరయ్యారు. శంఖవరం మండలంలో మొదటి వారంలో 1,250 మంది ఉపాధి పనులు చేయగా రెండో వారంలో 15 మంది మాత్రమే హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగిలో జూన్ తొలి వారంలో సుమారు 6,500 మంది పనులకు హాజరు కాగా రెండో వారంలో 1,008 మంది మాత్రమే పనులు చేశారని లెక్కలు చెబుతున్నాయి. కొత్తపేట మండలంలో తొలి వారంలో 6,150 మంది పనులకు హాజరు కాగా రెండో వారంలో పనులకు హాజరైన వారి సంఖ్య 1,650 మాత్రమే. జిల్లాలో ఉపాధి పనులు జరుగుతున్న మొత్తం 1,012 గ్రామ పంచాయతీల్లో 515 పంచాయతీల్లో రూపాయి కూడా చెల్లింపులు జరగలేదు. మొత్తం 2,450 జనావాసాలకు 1,725 జనావాసాల్లో పనులు జరగలేదు. ఈ నెల ఆరంభం నుంచి ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. మే నెలలో సైతం కాయని ఎండలు జూన్ రెండో వారంలో కాశాయి. ఈ వారంలో గరిష్టంగా 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పనులకు హాజరయ్యేందుకు కూలీలు భయపడ్డారని అధికారులంటున్నారు. మరో వంక తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన విశాఖలో నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో ఉపాధి ఫీల్డు అసిస్టెంట్లను తొలగించాలని భావించినట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఫీల్డు అసిస్టెంట్లలో నిస్పృహ, కలవరం నెలకొని, ఆ ప్రభావం కొంతమేరకు పనులపై పడింది. -
ఉప కేంద్రాలకు నిధులు
రూ.75 లక్షలతో తాగునీటి సౌకర్యం కలెక్టర్ ఆరోఖ్యరాజ్ పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలో ఆరో గ్య ఉపకేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పనకు రూ.75 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో ఏజెన్సీలో పథకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తాగునీటి సౌకర్యం కోసం మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లాపరిషత్ సీఈఓను ఆదేశించారు. ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, జామిగుడ, రూడకోట గ్రామా ల్లో పర్యటించి తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఈని ఆదేశించారు. రూ.2.15 కోట్లతో ఏజెన్సీలో తాగునీటి సదుపాయాల కల్పనకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్ల తొలగింపు టెండర్లు పూర్తయి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్దేశిత సమాయానికి పనులు చేపట్టకపోతే వారిని తొలగించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలకు మంజూరైన వంట గదుల నిర్మాణం జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పనులకు బిల్లులు సమర్పించిన వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ నెల 12లోగా ఉపాధి కూలీలు, పింఛనుదారుల ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలని ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీ చెల్లింపులు, పింఛన్ల చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు. ఈసమావేశంలో ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్, ఆర్డీఓ జి.రాజుకుమారి, ఏపీఓ పీవీఎస్ నాయుడు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డ్వామా పీడి శ్రీరాములు నాయుడు, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈఈ కాంతినాథ్ పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి ఎక్స్‌ప్రెస్ హైవే పనులు
మొదలైన రోడ్డు సర్వే ప్రక్రియ ఐదు మీటర్ల ఎత్తులో, 300 మీటర్లతో రోడ్డు నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి కానున్న సర్వే మార్కింగ్ రూ.4,800 కోట్ల అంచనాతో ప్రాజెక్టు పలమనేరు, న్యూస్‌లైన్: బెంగళూరు నుంచి చెన్నై వరకు పలమనేరు మీదుగా నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ హైవే (6 ట్రాక్‌రోడ్)కు సంబంధించి సర్వే పనులు ప్రారంభమయ్యాయి. అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన ప్రైవేటు కంపెనీ ఇంజనీర్లు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు మండలంలోని జల్లిపేట, వెంకటేష్‌పురం కాలనీ, కొలమాసనపల్లె, బేలుపల్లె క్రాస్ గ్రామాల సమీపంలో ఆదివారం మార్కింగ్‌లు ఇచ్చారు. ఈ ప్రక్రియ మరో ఆరునెలలపాటు జరుగుతుందని సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులు చంద్రారెడ్డి, గిరీశ్వరయ్య తెలిపారు. విమాన మార్గం ఆధారంగా నిర్మితం కానున్న ఈ రోడ్డు భూమికి ఐదు మీటర్ల ఎత్తులో, 300 మీటర్ల వెడల్పుగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం బంగారుపాళ్యం, పలమనేరు ప్రాంతాల్లో రెండు బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని వారు పేర్కొన్నారు. రూ.4,800 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు ఈజీఎస్ ఇండియా ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సౌజన్యంతో రూ.4,800 కోట్ల వ్యయంతో ఎక్స్‌ప్రెస్ హైవేను చేపట్టేందుకు రెండేళ్ల క్రితం ముందుకొచ్చింది. ఈ రోడ్డు పనులకు అవసరమైన సర్వే, భూముల సేకరణకు సంబంధించి ఆ ప్రతినిధులు అప్పట్లోనే ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఏడాది క్రితం ఇక్కడ భూమి పటుత్వ పరీక్షలను సైతం నిర్వహించారు. ఎలా నిర్మిస్తారంటే.. బెంగళూరు సమీపంలోని హొస్కోట నుంచి చెన్నై సమీపంలోని శ్రీపెరంబదూర్ వరకు 268 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇది సిక్స్‌ట్రాక్ రహదారిగా ఐదు మీటర్ల ఎత్తు కల్గి రోడ్డుకు ఇరువైపులా ఏడుమీటర్ల వెడల్పుతో గ్రామీణ రహదారులకు అనుసంధానం చేస్తారు. బహుళ ప్రయోజనకారిగా ఈ రహదారిని ఉపయోగించుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని హొస్కోట, కోలారు, ముళబాగల్, మన రాష్ట్రంలోని బెరైడ్డిపల్లె, పలమనేరు రూరల్, బంగారుపాళ్యం, గుడిపాల మండలాల మీదుగా ఈ రహదారి తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబదూర్ వరకు నిర్మిస్తారు. మామూలు రోడ్ల మాదిరి కాకుండా ఆకాశమార్గం ఆధారంగా పాయింట్ టు పాయింట్ నిర్మాణం జరుగుతుంది. రోడ్డు నిర్మాణంతో లాభాలెన్నో.. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు పెరిగి ఉపాధితో పాటు రైతులు పండించిన పంటలను ఇటు చెన్నై, అటు బెంగళూరుకు తరలిం చేందుకు వెసులుబాటు కలుగుతుంది. అంతేగాక ఈ రోడ్డుకు ఆనుకుని భవిష్యత్తులో కోట్లాది రూపాయల వ్యయంతో భారీ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందనే ప్రచారంతో స్థానికంగా భూముల విలువ ఇప్పటికే అమాంతం పెరిగింది. మరోవైపు చెన్నై-బెంగళూరుకు వంద కిలోమీటర్లు ప్రయాణదూరం తగ్గుతుంది. ఫలితంగా 2.30 గంటల్లో బెంగళూరు నుంచి చెన్నైకు చేరుకోవచ్చు. -
ఫ్లోర్ లీడర్లతో మేయర్ భేటీ
సాక్షి, సిటీబ్యూరో: డెబ్రిస్(నిర్మాణ వ్యర్థాల) తొలగింపునకు ప్రతి డివిజన్‌కు ఒక వాహనాన్ని కేటాయించాల్సిందిగా గత స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ కమిషనర్‌కు సూచించారు. సుదీర్ఘ విరామం తర్వాత మేయర్ మాజిద్ బుధవారం డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమావేశమయ్యారు. ప్రజావసరాల దృష్ట్యా చేపట్టాల్సిన పనుల గురించి సమావేశంలో చర్చించారు. ఆమేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సదరు పనులు వెంటనే చేయాల్సిందిగా క మిషనర్‌కు సూచించారు. వాటిల్లో ముఖ్యాంశాలు.. డెబ్రిస్ తొలగింపు పనులు వెంటనే పూర్తిచేయాలి. కార్పొరేటర్ల బడ్జెట్ నిధుల (కోర్ ఏరియా వారికి రూ. 1.50 కోట్లు, శివారు ప్రాంతాల వారికి రూ. 2 కోట్లు)నుంచి స్వల్పకాలిక టెండర్లు పిలిచి అవసరమైన పనులు వెంటనే చేపట్టాలి. బీటీ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలే తప్ప బీటీ ప్లాంట్లను మూసివేయరాదు పాట్‌హోల్స్ పనులు వెంటనే పూర్తిచేసి జాబితా సిద్ధం చేయాలి. డివిజన్ల వారీగా కొత్త రహదారుల వివరాలు 26న ‘షాబ్- ఎ- మైరాజ్’ను పురస్కరించుకొని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాత్కాలిక వీధిదీపాల ఏర్పాటు. శ్మశానవాటికల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు. రూ. 5లకే భోజనం అమలు తీరుపై నివేదిక. అదనంగా ఏర్పాటు చేయాల్సిన కేంద్రాల జాబితా. నాలాల డీసిల్టింగ్ పనులపై నివేదిక తిరిగి 23వ తేదీన జరుగనున్న సమీక్ష సమావేశానికి పై నివేదికల తో సంబంధిత అధికారులంతా హాజరుకావాలి. సమావేశంలో ఫ్లోర్‌లీడర్లు దిడ్డి రాంబాబు(కాంగ్రెస్), ఎండి నజీరుద్దీన్(ఎంఐఎం), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ), జీహెచ్ఎంసీ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మురుగు తోడేదెప్పుడు!
గాడి తప్పిన సాగర మథనం ఎక్కడి పూడిక అక్కడే ఫీల్ గుడ్ భ్రమల్లో హెచ్ఎండీఏ సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్ సాగర్ ప్రక్షాలన పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. సాగర మథనం మాటున వాటాల పరంపర కొనసాగుతూనేవుంది. నిబంధనల మేరకు పూడికతీత పనులు జరగకపోయినా... సదరు కాంట్రాక్టు సంస్థకు బిల్లుల చెల్లింపు మాత్రం టంఛన్‌గా జరిగిపోతోంది. ఇప్పటివరకూ చేసిన డ్రెజ్జింగ్ పనులకు, రికార్డుల్లో చూపిస్తున్న లెక్కలకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం అంతర్గత పరిశీలనలో వెల్లడైనట్లు వినికిడి. అయితే... విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్లు సమాచారం. రూ.43 కోట్ల వ్యయంతో డ్రెజ్జింగ్ పనులకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తొలుత పికెట్ నాలా ముఖద్వారం వద్ద పూడికతీత పనులు ప్రారంభించి మమ అనిపించిన అధికారులు, ఇప్పటికే సుమారు రూ.12 కోట్లకు పైగా బిల్లులు చెల్లించేశారు. అక్కడ పనులు పూర్తిస్థాయిలో జరిగాయా? లేదా? అన్నది నిర్ధరించుకోకుండానే డ్రెజ్జింగ్ యంత్రాలను బంజారా, బల్కాపూర్ నాలాల ముఖద్వారాల వైపు మళ్లించారు. నిజానికి పికెట్ నాలా వద్ద పూర్తిస్థాయిలో పనులు జరగలేదన్నది హెచ్ఎండీఏ అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ నాలా ముఖద్వారానికి 500 మీటర్ల పరిధిలో పూడిక తీత పనులు జరపాలన్నది కాంట్రాక్టర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం. అయితే... ఈ నాలా సాగర్‌లో కలిసే చోట కూకట్పల్లి ఐ అండ్ డీ పైపులైన్ ఉండటంతో అక్కడ పూడిక తొలగించలేని పరిస్థితి. దీనికితోడు ఆ ప్రాంతంలో పెద్దపెద్ద రాళ్లున్నాయి. వీటి పైన మేట వేసిన పూడిక అంతా అలాగే ఉంది. దీన్ని తొలగించేందుకు డ్రెజ్జర్తో సాధ్యం కాకపోవడంతో డీయూసీ మెషీన్‌ను ఉపయోగించి ఆ పూడికను వెలికి తీసినట్లు భ్రమ కల్పించారు. కానీ పూడిక అలాగే ఉంది. ప్రస్తుతం ఎండల తీవ్రతకు సాగర్‌లో నీరు తగ్గిపోవడంతో ఈ దిబ్బలు బయటపడ్డాయి. ఎన్నికల తరుణంలో పట్టించుకొనే వారు లేకపోవడంతో డ్రెజ్జింగ్ పనుల్లో అవకతవకలు గుట్టుగా సాగిపోతున్నాయి. లెక్కా పత్రం ఏదీ? సాగర్ నుంచి తొలగించిన వ్యర్థాలు చిక్కబడ్డాక నగరం వెలుపలికి తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఎంత పరిమాణంలో వ్యర్థాలను వెలికి తీశారు? దాన్ని ఎన్ని లారీల్లో తరలించారన్న విషయంలో రికార్డులకు, వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. సాగర్ నుంచి వెలికితీసిన వ్యర్థాలకు రికార్డుల్లో లెక్కలు పక్కాగా చూపిస్తున్నా... ఆ మేరకు డంపింగ్ సైట్లో వ్యర్థాలు కనిపించక పోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనలో భాగంగా బంజారా, బల్కాపూర్, పికెట్ నాలాల ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన సుమారు 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలన్నది లక్ష్యం. అయితే... ఇప్పటివరకు అందులో సగం కూడా వెలికి తీయలేదు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మెరైన్ పోర్టు విభాగం సిబ్బంది సాగర్‌లో సర్వే నిర్వహించి ఒక్కో నాలా వద్ద సుమారు 500 మీటర్ల దూరం వరకు 5-6 మీటర్ల మందంలో పూడిక పేరుకుపోయినట్లు తేల్చార ని అధికారులు చెబుతున్నారు. ఆ లెక్కల ప్రకారమే పనులు చేపట్టామంటున్నారు. అయితే... ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో కాంట్రాక్టర్ యథేచ్ఛగా అవకతవకలకు పాల్పడుతున్నారని హెచ్ఎండీఏ సిబ్బందే వ్యాఖ్యానిస్తున్నారు. తీవ్ర జాప్యం వాస్తవానికి సాగర్ డ్రెజ్జింగ్ పనులను 12 నెలల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం. అయితే... ఇప్పటికే 17 నెలలు గడిచిపోయాయి. నిర్దేశించిన లక్ష్యంలో సగం పూడిక కూడా వెలికి తీయకపోవడం ప్రక్షాళన ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి అద్దం పడుతోంది. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞాణంతో కూడిన ‘కట్టర్ సక్షన్ డ్రెడ్జింగ్’ విధానంలో ఈ పూడికతీత పనులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా... ఆ ప్రమాణాలు కనిపించట్లేదు. ప్రస్తుతం డ్రెడ్జింగ్ యంత్రం పట్టుమని 10 నిముషాలు పనిచేస్తే... దానిపైపుల్లో ప్లాస్టిక్ కవర్లు, దిండ్లు, ఇతర వ్యర్థాలు అడ్డుపడి మెషీన్ ఆగిపోతుండటంతో సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఈ యంత్రాలకు రోజుకు 1200 నుంచి 1500 క్యూ.మీ. మించి పూడిక తోడే సామర్థ్యం లేదు. మరి ఎప్పటికి పూర్తి చేస్తారన్నది అర్థంగాని విషయం. గతంలో పాలిమరైజేషన్ పేరుతో అక్రమాలకు తెరలేపిన అధికారులు ఇప్పుడు కాంట్రాక్టు గడువు పెంచి ఆ మేరకు ప్రయోజనం పొందేందుకు బీజం వేశారని వినవస్తోంది. -
‘ఉపాధి’ స్కాం...ఢాం..!
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: పల్లెల్లో వలసలు నివారించి,గ్రామాల్లో ఉన్న చోటనే పేద ప్రజలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని అవినీతి తిమింగలాలు అమాంతం మింగేస్తున్నాయి. జిల్లాలో 2007 నుండి ఇప్పటి వరకు అయిదు విడతల్లో జరిగిన సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్)లలో 20.40 కోట్ల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. జిల్లా ఉపాధి విజిలెన్స్ అధికారులు మాత్రం ఇప్పటి వరకు వాటిపై విచారించి అందులో రూ.10.16 కోట్లు కచ్చితంగా కట్టాల్సిందేనని తేల్చేశారు. దాంట్లో అవినీతికి పాల్పడిన సిబ్బంది నుండి అధికారులు ఇప్పటి వరకు వసూళ్లు చేసింది మాత్రం రూ. 3.48 కోట్లు మాత్రమే. మిగతా 6.68 కోట్ల రికవరీ పెండింగ్‌లోనే ఉంది. మరో 10.23 కోట్ల అవినీతి గుట్టు విప్పేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఇది మాత్రమే కాకుండా రూ.2కోట్ల మేర అవినీతికి పాల్పడ్డట్లు వచ్చిన ఆరోపణలపై డ్వామా అధికారులు విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చేశారు. వామ్మో..ఇంత మింగుడా జిల్లాలో రోజురోజుకు ఉపాధి పనుల్లో అవినీతి చిట్టా పెరిగి పోతుండడంతో జిల్లా అధికారులు కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 10.16 కోట్లను రికవరీ చేయాలని విజిలెన్స్ అధికారులు తేల్చగా గత అయిదేళ్లుగా కేవలం రూ.3.48 కోట్లనే చేయగలిగారు. అక్రమాలు గుర్తించినా ఇతర ఉపాధి సిబ్బందికి పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేసినా వాటిని పట్టించుకోలేదు. ఇక రూ. 6.68 కోట్లను రికవరీ చేయడం డ్వామా అధికారులకు తలకు మించిన భారంగా మారింది. కొందరు వీటిపై కోర్టులను ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరూ తమ రాజకీయ ప్రాబల్యంతో గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నారు.రూ. 10.23 కోట్ల అవినీతిపై విచారించాల్సి ఉంది. అది జరిగే లోపే మరిన్ని సోషల్ ఆడిట్ల ద్వారా వచ్చి చేరుతున్నాయి. ఇలా ఈ చిట్టా పెరిగిపోతుండడం అందర్నీ బెంబేలెత్తిస్తోంది. ఒక మండలంలోనే రూ.2.50 కోట్ల పనుల్లో అవకతవకలు లింగాల మండలంలో గతేడాది 13 గ్రామాలలో జరిగిన పనులపై గత నెల 12వ తేదీన జరిగిన అయిదో విడత సామాజిక తనిఖీలో రూ.4.37 కోట్ల పనులకు ఆడిట్ చేయగా ఏకంగా రూ.2.50 కోట్ల మేర అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించింది.సామాజిక తనఖీల రాష్ట్ర డెరైక్టర్ సౌమ్య నేతృత్వంలో జరిగిన ప్రజావేదికలో ఈ అక్రమాల చిట్టా బయట పడ్డాయి. వీరిలో వలసలు వెళ్లినవారు, పెళ్లిళ్లు జరిగి ఇతర గ్రామాలకు వెళ్లిపోయిన వారు, ఆఖరికి చనిపోయిన వారి పేర్లు కూడా ఉన్నాయి. వారి పేర్లను మస్టరుల్లో రాసి బినామి బిల్లులతో స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఏర్పడింది. పలువురిపై వేటు వేసినా... వివిధ సామాజిక తనిఖీల్లో గుర్తించిన అవినీతి ఆధారంగా పలువురిపై రికార్డు స్థాయిలో వేటు వేసినా అవినీతి పరులు చలించడం లేదు. ఇటీవలే పెద్ద సంఖ్యలో ఉపాధికి సంబంధించి కొందరిపై చర్యలు తీసుకున్నారు. ఉపాధి పనుల్లో ఏకంగా రూ. 2.50 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించిన జిల్లా అధికారులు లింగాల మండల స్థాయి సిబ్బందిపై క ఠిన చర్యలు తీసుకునేందుకు పూనుకున్నారు.సామాజిక తనిఖీలో జరిగిన అక్రమాలు వెలువడిన వెంటనే ఆ మండల ఏపిఓ లక్ష్మినారాయణతోపాటు నలుగురు టి.ఏలు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఎనిమిది మంది క్షేత్ర సహాయకులను విధుల నుంచి ఇటీవల తాత్కలికంగా తొలగించారు.వారిపై ఉన్న అభియోగాలపై విచరణ చేపట్టే పనిలో అధికారులు ఉన్నారు.అంతేకాకుండా అదే మండలానికి చెందిన 150 మంది మేట్లను శాశ్వతంగా విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. ఇలా ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది ఉపాధి సిబ్బంది రూ. 20 కోట్లకు పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విధులకు కొందరు తాత్కాలికంగా దూరమవ్వగా, మరికొంత మంది సిబ్బందిని శాశ్వతంగా విధుల నుండి తొలగించారు. ఇందులో ఎక్కువగా గ్రామాల్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు 1086మంది ఉన్నారు. వీరే దాదాపు 10 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డట్టు సామాజిక తనిఖి నివేదికల ద్వారా అధికారులు గుర్తించారు. వారి తరువాతి స్థానంలో సాంకేతిక సహాయకుల(టి.ఏ) రెండో స్థానంలో నిలిచారు.జిల్లాలోని 725 మంది టి.ఏలపై రూ. 5.41 కోట్ల మేర అవినీతికి పాల్పపడ్డట్టు అధికారులు గుర్తించారు.ఇలా ఆయా మండలాల్లో 1999 మంది మేట్లు 1.10కోట్లు,31 మంది ఏఈఈలు రూ.కోటి, 57మంది ఏపిఓలు 32లక్షలు ,159మంది సి.ఓలు 14లక్షలు, సర్పంచ్‌లు రూ.23లక్షల, 71 మంది ఈసీలు అవినీతికి పాల్పపడ్డట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు.