thammareddy bharadwaja
-
త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఆరోపణలు.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆరోపణలు ఇప్పటివీ కాదు. తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా గురూజీపై పూనమ్ విమర్శలు చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని ఆమె ట్విటర్ వేదికగా కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.అయితే పూనమ్ కౌర్ ట్వీట్‌పై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దానిపై ప్రశ్న అడగ్గా.. ఆయన మాట్లాడారు. ఆమె 'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కు ఫిర్యాదు ఎప్పుడు చేసిందో మాకు తెలియదు.. ఒకవేళ అప్పటికే కమిటీ ఏర్పడి ఉంటే.. ఫిర్యాదు బాక్స్‌లో తన కంప్లైంట్ వేసి ఉంటే సరిపోయేది.. ఎందుకంటే ఆ ఫిర్యాదును 'మా' వాళ్లు పంపించినా దానిపై మేము చర్చించేవాళ్లం. ఇప్పటికైనా మా వరకు ఫిర్యాదు వస్తే కచ్చితంగా స్పందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కాగా.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్ హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. త్రివిక్రమ్‌పై పూనమ్ ట్వీట్త్రివిక్రమ్ గురించి హీరోయిన్ పూనమ్ కౌర్ ఇవాళ ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
సరికొత్త ప్రేమకథగా స్పీడ్220.. ఆసక్తిగా ట్రైలర్!
గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'స్పీడ్220'. ఈ సినిమాకు హర్ష బీజగం దర్శకత్వం వహిస్తున్నారు. విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా తమారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..' ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా మాదిరి ఒక కొత్త కథ. విభిన్నమైనటువంటి పాత్రలతో చక్కటి దర్శకత్వ ప్రతిభ ఇందులో చూపించారు' అని కొనియాడారు. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు.. ఆర్ఎక్స్ 100 లాంటి మంచి సక్సెస్ అవుతుందన్న నమ్మకముందని దర్శకుడు హర్ష బీజగం అన్నారు.ఈ చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..' మంచి కథతో దర్శకుడు హర్ష రావడం జరిగింది. కథ వినిన వెంటనే మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నాం.ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమ వల్ల జరిగే ఇబ్బందులు, ప్రేమికులు మధ్యన సంఘర్షణ కళ్లకు కట్టినట్లుగా చూపించేలా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు' అని అన్నారు. ఈ మూవీని ఆగస్టు 23న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి శేఖర్ మోపురి సంగీతమందించారు. -
సీఎం అపాయింట్మెంట్ కోసం యత్నించాం: టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శక, నిర్మతా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాము సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని వెల్లడించారు. కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. అందువల్లే సీఎంను కలిసే అవకాశం దక్కలేదని తమ్మారెడ్డి తెలిపారు.గద్దర్ పేరుతో అవార్డ్స్ తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కోసం రెండు, మూడుసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిస్ కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. సీఎం రేవంత్ రెడ్డికాగా.. అంతకుముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. -
ప్రేక్షకులు మరోసారి నిరూపించారు
‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్ , సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. డా బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా సక్సెస్మీట్కు అతిథిగా హాజరైన దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ప్రజల జీవన విధానాలను, వారి ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని కథ సిద్ధం చేసుకుంటే సక్సెస్ వస్తుందని ప్రేక్షకులు మరోసారి నిరూపించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘ఇలాంటి కథలు మన జీవితాలను ప్రపంచానికి తెలియజేస్తాయి’’ అన్నారు ‘బలగం’ ఫేమ్ సుధాకర్‌రెడ్డి. ‘‘‘బలగం’ తరహాలోనే ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కూడా మంచి విజయం సాధించింది’’ అన్నారు తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు. ‘‘నేటివిటీతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం ఇది. ఈ సినిమాపై మాకు ఉన్న నమ్మకం వమ్ము కాలేదు’’ అన్నారు నిర్మాతలు. -
ఆర్ఆర్ఆర్ పై భరద్వాజ కామెంట్లపై నాగబాబు, రాఘవేంద్ర రావు విమర్శలు
-
నాలుగు జంటల ప్రేమకథ
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, జాతీయ రహదారి’ వంటి చిత్రాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ రిలీజ్ చేశారు. ‘‘నరసింహ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేశారు. అదే కమర్షియల్ సినిమాలు తీసి ఉంటే ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో చేరేవారు’’ అన్నారు తమ్మారెడ్డి. ‘‘మధ్య తరగతి జీవితాల్లో జరిగే నాలుగు ప్రేమ జంటల కథలతో ఈ చిత్రం తెరకెక్కించాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘చిత్తూరు, తిరుపతి ్ర΄ాంతాల యాసను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు కర్ర వెంకట సుబ్బయ్య. -
ఆ సినిమా నా వల్లే పోయింది: తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ తెలుగు దర్శక-నిర్మాతల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో రామ్మా చిలకమ్మా ఒకటి. ఇందులో సుమంత్, లయ జంటగా నటించిన ఈ సినిమా పరాజయం పాలైంది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. ఇటీవల ఓ యూట్యూబ్‌లో చానల్‌తో ముచ్చటించిన ఆయన తన సినిమాల ప్లాప్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా పరాజయానికి తానే కారణమంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా? రామ్మా చిలకమ్మాకు సుమంత్ బాగుంటాడని తీసుకుంటాడని తీసుకున్నా. నాగార్జునన కూడా పది ఫ్లాపుల తర్వాత సూపర్‌స్టార్ అయ్యాడు. అందువలనే ఈ సినిమాను సుమంత్‌తో చేయోచ్చని ట్రై చేసిన సినిమా అది’ అన్నారు. ఆ తర్వాత ‘‘రామ్మా చిలకమ్మా’.. ‘స్వర్ణముఖి’.. ‘ఉర్మిళ’’ ఈ మూడు సినిమాలు కూడా నా మనసుకు దగ్గరగా ఉన్నవే. కానీ ఈ సినిమాలేవి బాగా ఆడలేదు. కాకపోతే ఇప్పటికీ మళ్లీ తీయదగిన కథ వాటిలో ఉంది. ఇక ‘ఎంతబాగుందో’ సినిమా విషయానికి వస్తే.. ఆ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించాడు. చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్ స్టార్ మంచి పాయింట్ ఉన్న కథ అది. ఆ సినిమా ఫ్లాప్ కావడంలో ఎవరి తప్పు లేదు. డైరెక్టర్‌గా నేను కాకుండా వేరే వారు ఉన్నట్టయితే ఇది మంచి సినిమా అయ్యుండేది. ఆ సినిమాను నేను మిస్ హ్యాండిల్ చేశాను. నా వల్లే సినిమా పోయిందని అనుకునే సినిమాల్లో అది ఒకటిగా చెబుతాను. మిగతా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అడిగితే చెప్పలేను. కానీ, ఈ సినిమా మాత్రం నా మిస్ హ్యాండిలింగ్ వల్లనే పోయిందని ఒప్పుకుంటాను. ఇక ఇక్కడ సక్సెస్ వస్తే చేసిన తప్పులన్నీ దాంట్లో కొట్టుకుపోతాయి. ఫ్లాప్ వస్తే తప్పులను గురించి మాత్రమే మాట్లాడుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చారు. -
విశ్వక్ సేన్, అర్జున్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. విశ్వక్ సేన్ షూటింగ్‌కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ ఆరోపణలపై విశ్వక్ స్పందిస్తూ.. తన అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ఈ సినిమా షూటింగ్ సమయంలో తన ప్రవర్తన బాలేదని ఒక్క లైట్ బాయ్ చెప్పిన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చదవండి: కోలుకుంటున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘సినిమా మొదలు పెట్టేముందు హీరోలు మనకు ఇష్టం ఉందా? లేదా? ఆ నిర్మాత ఇష్టమా? హీరోకు ఇష్టమా అన్నది లేదా పారితోషికం లాంటి వివిధ విషయాలను ముందే మాట్లాడుకోవాలి. సినిమా మొదలయ్యాక కాదు. సినిమా షూటింగ్ మొదలయ్యాక ఇలాంటి మాట్లాడుకోవడం ఎంతవరకు న్యాయం, ధర్మమో చూస్తే.. ఎన్టీ రామారావుగారు ఎవరి దర్శకత్వంలో చేసినా, ఆయన దర్శకుడు చెప్పినట్టుగా చేసేవారు. దర్శకుడికి సంబంధించిన విషయాల్లో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు. ఇదే నిబద్ధతను నేను బాలకృష్ణగారిలో కూడా చూశాను. ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు. విశ్వక్ సేన్ కొంతవరకూ చేశారు. ‘నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం’ అని అన్నట్టుగా విశ్వక్ చెబుతున్నాడు’’ అన్నారు. ‘ఇక అర్జున్ విషయానికి వస్తే ఆయనకు దర్శకుడిగా కూడా మంచి అనుభవం ఉంది. చాలా సూపర్ హిట్లు ఇచ్చారు. ఆయన అవుట్ డేటెడ్ అనుకుంటే విశ్వక్ ముందుగానే మానుకోవలసింది. సినిమా ఒప్పుకున్నాక మాటలు బాగోలేదు .. పాటలు బాగోలేదు అంటే ఎలా? నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ప్రతి విషయంలోను జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కూడా. కొత్త నిర్మాతలు .. కొత్త దర్శకులు .. వివిధ రకాల కథలతో వస్తున్నారు. చదవండి: ‘బింబిసార’ బ్లాక్‌బస్టర్.. మరో వైవిధ్యమైన కథతో వస్తున్న కల్యాణ్ రామ్ కానీ హీరోలు చెప్పినట్టు చేయడం వలన ఆ సినిమాలన్నీ ఒకేరకంగా ఉంటున్నాయనేది నా ఉద్దేశం’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ‘కొత్తగా వచ్చిన హీరోలంతా దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారు. ఫంక్షన్స్‌లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారు. అర్జున్ గారు అన్నట్టుగా చాలామంది నిర్మాతలు ఇలాంటి హీరోల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. యంగ్ హీరోలంతా ఈ పద్ధతిని మార్చుకోవలసిన అవసరం ఉంది. విశ్వక్ సేన్ చేసిన పని అర్జున్ గారికి మాత్రమే కాదు. నిర్మాత అనే ప్రతి ఒక్కరికీ.. దర్శకుడు అనే ప్రతి ఒక్కరికీ కూడా అవమానమే’’ అంటూ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్క విశ్వక్ సేన్ మాత్రమే కాదు ప్రస్తుతం యంగ్ హీరోల వల్ల చాలామంది దర్శక-నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైన తమ ధోరణి మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
ఆదిపురుష్ టీజర్‌పై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్‌పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్‌తో నిండిపోయయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని, రావణుడు, హనుమంతుడి పాత్రలు ఇలా ఉన్నాయేంటంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీం స్పందిస్తూ ఇది 3డీ చిత్రమని, థియేటర్లో చూస్తేను ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారని దర్శకుడు ఓంరౌత్ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో రీసెంట్గా మూవీ ట్రైలర్‌ను థియేటర్లో విడుదల చేసింది చిత్ర బృందం. అంతేకాదు 20 రోజుల్లో మరో టీజర్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. అయితే తాజాగా ఆదిపురుష్ టీజర్, ట్రైలర్‌పై దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చదవండి: ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలవబోతున్నారా? ఇదిగో క్లారిటీ.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదిపురుష్ టీజర్‌పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ‘‘ఆదిపురుష్ ట్రైలర్ చూశాను. ప్రభాస్ సినిమా అనేసరికి అందరిలో చాలా వేడిగా వాడిగా ఉంటుంది. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ఫుల్ హైప్ క్రియేట్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ మూవీ నిరాశ పరిచింది. యానిమేటెడ్ చిత్రంలా ఉంది. ఓ యానిమేటెట్ చిత్రాన్ని పెద్ద సినిమా ఎలా అంటారో నాకు అర్థం కావడం లేదు. 3డీలో థియేటర్లో ఎక్స్పీరియస్ వేరు ఉంటుందని మూవీ టీం చెప్పింది. నాకు తెలిసినంతవరు 3డీలో చేసిన, 4డీ చేసిన 2డీ చేసినా యానిమేషన్‌కి, లైవ్‌కి చాలా తేడా ఉంటుంది. ఈ మూవీని రజనీకాంత్ రజినీకాంత్ తీసిన కొచ్చాడియన్లా యానిమేటెడ్ చిత్రంలా తీశారని అందరు ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ఆ వార్తలు మాకు చిరాకు కలిగించాయి : మీడియాపై చిరు అసహనం 3డీలో చూసే సరికి మీ అభిప్రాయం మారుతుందంటున్నారు. కానీ 2డీ నుంచి 3డీకి వెళ్లినంత మాత్రాన వారి గేటప్లు, కాస్ట్యూమ్స్ మారవు కదా. పూర్తిగా యానిమేటెడ్ ప్రభాస్‌ను చూసినట్టుంది. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్‌ల మీద కూడా చాలా ట్రోలింగ్ నడిచింది. రాముడిని దేవడిగా కొలిచే దేశంలో ఆయన గెటప్‌ని మార్చేయడం విచిత్రంగా ఉంది. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు. ఆయనకు కూడా దేవాలయాలు ఉన్నాయి. 20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు. నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే. సినిమా మంచిగా రావాలనే ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాని అల్లరి చేయాలని చేయడం లేదు. ఆదిపురుష్ సినిమాకి ఆల్ ది బెస్ట్” అంటూ తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. -
3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ
ఇటీవల విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు మంచి విజయం సాధించాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాలు పోటాపోటీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఈ చిత్రాలు హిట్ కావడంతో తెలుగు పరిశ్రమ సంబరాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాల హిట్‌పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బింబిసార, సీతా రామం హిట్ అయ్యాయని ఆనందపడిపోకూడదని, మూడు నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకూడదని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ రెండు సినిమాలు చూసిన ఆయన తన రివ్యూ ఇచ్చారు. చదవండి: ‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ సీతారామం మూవీ అద్భుతమైన ప్రేమ కావ్యమన్నారు. ఫస్ట్‌హాఫ్‌లో కశ్మీర్ పండితుల సమస్యను నిజాయితిగా చూపించారు. అలాగే హిందూ ముస్లిం వంటి అంశాలను తీసుకుని అద్భుతమైన ప్రేమ చిత్రంగా మలిచాడు డైరెక్టర్. ఓ అనాథను జావాన్‌గా తీసుకోవడం మంచి కాన్సెప్ట్ అన్నారు. ఇలాంటి సున్నితమైన ఎన్నో సమస్యలను తీసుకుని మంచి సినిమాగా తీర్చిదిద్దిన డైరెక్టర్‌ను తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమన్నారు. అనంతరం బింబిసార మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ కథేనన్నారు. కథలో కొత్తదనం లేకపోయిన డైరెక్టర్ వశిష్ఠ సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. అయితే టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఆదిత్య 369తో పోల్చి చూడటం సరికాదన్నారు. చదవండి: చిక్కుల్లో స్టార్ హీరో దర్శన్, ఆడియో క్లిప్‌తో సహా పోలీసులను ఆశ్రయించిన నిర్మాత ఆ సినిమాకు, ఈ సినిమాకు అసలు పోలీకే లేదన్నారు. బింబిసారుడు అనే ఓ క్రూరమైన రాజు కథను తీసుకుని టైం ట్రావెలర్‌లో ఆ రాజు సున్నితంగా ఎలా మారాడో చూపించి ఈ చిత్రాన్ని ఆసక్తిగా తీశారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని చెప్పారు. అయితే ఈ మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకుండ, సినిమా రన్‌టైం పెంచాలన్నారు. థియేటర్లో రెగ్యులర్ ఆడియన్స్ పెరిగేలా సినిమాలను తీసుకురావాలని ఆయన సూచించారు. అలాగే ‘50 రోజుల పాటు సినిమాలు ఎందుకు ఆడటం లేదని? అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందురు రావడం లేదు అనేది ఆలోచించాలి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వచ్చి థియేటర్లను బతికిస్తాయి. సినిమాకు పూర్వ వైభవం వస్తోంది’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. -
వ్యూస్ కోసం అలాంటి థంబ్‌నైల్స్ పెట్టడం కరెక్ట్ కాదు
‘‘డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో తంబ్‌నైల్స్, పైరసీ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. అంతేకానీ కొందరు లైక్‌లు, వ్యూయర్స్ కోసం నిర్మాతలు, నటులు, దర్శకులపై తంబ్‌నైల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం తగదు. యూట్యూబ్ తంబ్‌నైల్స్, పైరసీ చేసేవారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చర్చిస్తాం.. పైరసీ సెల్‌ను యాక్టివ్ చేస్తాం’’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినీ ఇండస్ట్రీవారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, పైరసీ వంటి విషయాలపై చర్చించేందుకు 24క్రాఫ్ట్స్ అధక్షులు, సెక్రటరీలు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు. నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘ఓటీటీలపైనా సెన్సార్ ఉండాలి. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రానికల్లా సినిమా పైరసీ అవుతోంది. ఫిలిం చాంబర్ యాంటీ పైరసీ విభాగం డబ్బున్న వాళ్లకే పని చేస్తోంది.. పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్ పాత్ర శూన్యం’’ అన్నారు. ‘‘యూట్యూబ్‌కి కూడా సెన్సార్ విధానం తీసుకురావాలి’’ అని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ అన్నారు. ‘‘మా కుటుంబంపై వచ్చే అసత్య వార్తల వల్ల 25ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాను. మా కష్టాలను అర్థం చేసుకోండి’’ అని నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ అన్నారు. ‘‘సోషల్ మీడియాలో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉండదు.. వారికి ఇష్టమైంది రాసుకుంటున్నారు.. దీన్ని అరికట్టాలి’’ అన్నారు దర్శకుడు ఎన్. శంకర్. -
గాడ్సే మరణ వాంగ్మూలం
జాతి పిత మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ హంతకుడు గాడ్సే నేపథ్యంలో ‘మరణ వాంగ్మూలం’ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రవిశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రదర్శకుడు భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘గాడ్సే వెనకాల ఉన్న భావజాలాన్ని మా సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. దాదాపు రెండేళ్లు ఈ సినిమాపై పరిశోధన చేశాను. గాంధీ తమ్ముడు గోపాల్ గాడ్సే 19 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి, 2005లో మృతి చెందారు. గాంధీ హత్యలో గోపాల్ గాడ్సే ప్రమేయం ఏంటి? అనే అంశాల్ని కూడా చూపించనున్నాం’’ అన్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ–‘‘గాడ్సే రాసిన పుస్తకం అందర్నీ ఆలోచింపజేస్తుంది. గాడ్సే కోర్ట్‌లో తన వాంగ్మూలం ఇచ్చారు. దాన్ని పరిశీలిస్తే ఆయన ఎందుకు ఆ పని చేశారో అర్థం అవుతుంది’’ అన్నారు. ‘‘భరద్వాజ్‌గారు గాడ్సే మీద సినిమా గురించి చెప్పగానే ఆసక్తిగా అనిపించింది. సినిమాని డిసెంబర్లో ప్రారంభించి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు చిత్రనిర్మాత సూరజ్. -
నాలుగు జంటల కథ
శ్రీజిత్ హీరోగా, శిల్పా దాస్, నిష్కల హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెరసాల’. రాంప్రకాష్ గుణ్ణం దర్శకత్వంలో మాదినేని సురేష్, సుధారాయ్ గుణ్ణం నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ని నిర్మాత రాజ్ కందుకూరి, టైటిల్ లోగోని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. రాంప్రకాష్ గుణ్ణం మాట్లాడుతూ– ‘‘లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకి హారర్ ఎలిమెంట్‌ని మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. నాలుగు జంటల మధ్య సాగే కథ ఇది’’ అన్నారు. ‘‘మా సినిమా రష్ చూసుకున్నాక చెప్పిన దానికంటే దర్శకుడు చాలా బాగా తీశాడని అర్థమైంది. మొదటి ప్రాజెక్ట్‌తోనే మంచి విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది’’ అన్నారు మాదినేని సురేష్. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ తమిరి. -
షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా?
షూటింగ్స్ చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. కొన్ని గైడ్‌లైన్స్ సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రైట్ రైట్ అంది. చిన్న చిన్నగా చిన్న సినిమాలు ప్రారంభమయ్యాయి. మరి భారీ సినిమాల సంగతేంటి? షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా? కరోనా తగ్గేవరకూ నో కాల్షీట్.. వ్యాక్సిన్ వచ్చే వరకూ నో క్యారవ్యాన్... అంటున్నారా? లేదా రంగంలోకి దిగేద్దాం. షూటింగ్ చేసేద్దాం అంటున్నారా? పెద్ద బడ్జెట్ సినిమాలు ప్రారంభించడానికి నిర్మాతలు సిద్ధమా? ప్రస్తుతం చిత్రీకరణల గురించి ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు? ఇదే విషయాలను పలువురు నిర్మాతలను అడిగాం. వాళ్లు ఈ విధంగా చెప్పారు. ఆ విశేషాలు. షూటింగ్‌లు చేయాల్సిందే – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తుతం షూటింగ్‌లు చేసేవాళ్లు చేస్తున్నారు. కానీ జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలి. ఇప్పటికే కార్మికులు ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. కరోనా అనేది రెండు నెలలో, మూడు నెలలో అనుకుంటే షూటింగ్‌లైనా, మిగతా పనులైనా ఆపి కూర్చోవచ్చు. కరోనా మరో రెండు, మూడేళ్లు ఖచ్చితంగా ఉంటుంది. అప్పటివరకు పనులు చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎలా గడుస్తుంది? అందుకని షూటింగ్ చేయటం అవసరం అనుకున్న ప్రతి ఒక్కరూ కరోనా వస్తుందనుకొని ప్రిపేర్ అయ్యి షూటింగ్‌లు చేసుకోవాల్సిందే. అప్పుడే వారికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. కష్టాల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా వర్క్ చేయాల్సిందే. ఒకవేళ ఎవరికైనా షూటింగ్లో పాల్గొన్నపుడు కరోనా వస్తే భయపడకుండా ఆ రిస్క్‌ను తీసుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే. తప్పదు మరి. కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే బడా నిర్మాతలు, హీరోలు ఇప్పట్లో షూటింగ్‌లు చేయకపోయినా పర్లేదు. మధ్యస్తంగా ఉండేవారు తప్పనిసరిగా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం షూటింగ్ అంటే రిస్కే – ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత పి. రామ్మోహన్రావు రెండు నెలల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పర్మిషన్ ఇవ్వటంలో కొత్త పాయింటేం లేదు. ఏదేమైనా షూటింగ్లలో పాల్గొనటమా? లేదా అనేదే ఇక్కడ ప్రశ్న? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొనటం లైఫ్ రిస్కే. కానీ రిస్క్ అయినా çఫర్వాలేదు షూటింగ్ చేద్దాం అనుకునేవాళ్లు చేస్తున్నారు. వారి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. కాకపోతే పెద్ద నటీనటులెవరూ షూటింగుల్లో పాల్గొనటం లేదు. ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం. నేను, సునీల్ నారంగ్ నిర్మిస్తోన్న ‘లవ్‌స్టోరీ’ చిత్రం షూటింగ్‌ను సెప్టెంబర్ 7 నుండి చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. హీరో నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల షూటింగ్ చేయడానికి ముందుకొచ్చారు. కేవలం 15మందితో ఈ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం. వారందరికీ మొదట కరోనా టెస్టులు చేయిస్తాం. అలాగే షూటింగ్ జరిగినన్ని రోజులూ ఎవరూ ఇంటికి వెళ్లం. అందరికీ లొకేషన్ దగ్గరే బస ఏర్పాటు చేయబోతున్నాం. షూటింగ్‌కి తొందరపడటంలేదు – పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామి వివేక్ కూచిభొట్ల మేం ప్రస్తుతానికి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ పనులు చేస్తున్నాం. ఎక్కువ క్రౌడ్ ఉండే సినిమాల షూటింగ్ చేయదలచుకోలేదు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమాలు చేస్తున్నాం. కార్తికేయతో ఓ సినిమా చేస్తున్నాం. ఆ సినిమా చిత్రీకరణ ఫారిన్లో జరపాలి. ప్రస్తుతానికి షూటింగ్స్ చేయడంలేదు. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. అందుకే రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకోలేం. దాని వల్ల తొందరపడి షూటింగ్స్ స్టార్ట్ చేయాలని కూడా అనుకోవడం లేదు. కొన్ని రోజుల్లో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. అది కూడా సీన్లో ఎక్కువ మంది జనం లేని సన్నివేశాలే ముందు షూట్ చేస్తాం’’ అన్నారు. ధైర్యం ఉన్నోళ్లు చేసుకోవచ్చు – నిర్మాత డి. సురేశ్‌బాబు ప్రభుత్వం షూటింగ్‌లు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే కొంతమంది షూటింగ్‌లు చేసుకుంటున్నారు కూడా. కానీ మా బ్యానర్లో తీసే సినిమాల షూటింగ్‌లు చేయటానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుంది. నా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఆరోగ్య భద్రత ఎంతో ముఖ్యం. అది నేనివ్వగలనని గ్యారంటీ లేదు. మా బేనర్లో తీస్తున్న ఓ సినిమాకి 27 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. అవన్నీ యాక్షన్ సీక్వెన్స్‌లే. ప్రతి సీన్లో దాదాపు 50 నుంచి 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కలిపితే 150మంది వరకు అవుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతమందిని కాపాడగలమని నమ్మకం లేదు. రోడ్ మీదకి వెళ్లినప్పుడు మాస్క్ వేసుకుని వెళ్లాలని చెప్తే దాన్ని కూడా కొంతమంది సరిగ్గా ఆచరించటం లేదు. దాదాపు 30 శాతం మంది మాస్క్ పెట్టుకోమంటే అదేదో తప్పులా ఫీలవుతున్నారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు నేను త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని ఎక్కడ విడుదల చేయాలి? నేను వ్యక్తిగతంగా నా ఫ్యామిలీతో కానీ స్నేహితులతో కానీ సినిమా థియేటర్‌కి వెళ్లి ఇప్పట్లో సినిమా చూడను. కారణం ఏంటంటే క్లోజ్డ్ ఏసీ థియేటర్లలో ముక్కుకి, మూతికి మాస్క్ పెట్టుకుని నవ్వొస్తే నవ్వకుండా సినిమా ఫీల్‌ను ఎంజాయ్ చేయలేను. ఉపాధి కోసం షూటింగ్ చేయటం మంచిదే కానీ దాన్ని ఎవరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది ఇక్కడ పాయింట్. ఉదాహరణకు టీవీ వాళ్లు ఉన్నారు. వాళ్లు ఈ రోజు షూటింగ్ చేసి ఆ కంటెంట్‌ను అమ్మితే ఓ యాభైవేల రూపాయలు లాభం వస్తుంది అనే గ్యారంటీ ఉంటుంది కాబట్టి వాళ్లు చేయొచ్చు. సినిమావాళ్లకి ఆ గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఉపాధి కోసమే కదా బాలూ (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)గారు షూటింగ్ చేసింది. ఆయన పరిస్థితేంటి? లక్కీగా బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనకు, సినిమా పరిశ్రమకు ఎంత నష్టం జరిగేది. షూటింగ్ చేయటం, చేయకపోవటం అనేది పూర్తిగా వ్యక్తిగతం. కొంతమందికి చాలా ధైర్యం ఉంటుంది. వాళ్లు చేసుకోవచ్చు. నాలాంటి వాళ్లకు ధైర్యం ఉండదు. పరిస్థితులన్నీ నార్మల్ అయ్యాక, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే షూటింగ్స్ మొదలుపెడతాను. -
పేద సినీ కార్మికులకు సహాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం’ (సీసీసీ) ప్రారంభించారు. నటీనటుల సహా పలువురు దాతల నుంచి సీసీసీకి విరాళాలు వెల్లువెత్తాయి. ముందే ప్రకటించినట్లు ఈ ఆదివారం నుంచి 24 శాఖల్లోని పేద కార్మికులకు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్ బృందం నిత్యావసరాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ –‘‘సినీపరిశ్రమలోని ప్రతి కార్మికుడి ఇంటికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నాం. అందులో భాగంగా ఆదివారం స్టూడియోస్ విభాగం కార్పెంటర్స్కి సరుకులు అందించాం. నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ప్రతి నెలా సరుకులు కార్మికుల ఇంటికే చేరతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త అయిన చిరంజీవిగారితో సహా దాతలందరికీ కృతజ్ఞతలు. ‘సీసీసీ మనకోసం’ కమిటీ సభ్యులైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ , బెనర్జీ.. ఇలా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు మెహర్ రమేష్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అన్నారు. -
ఈ సినిమా సమర్పించడం గర్వంగా ఉంది
‘‘ఇప్పటివర కూ చాలా సినిమాల్లో నా పేరు ఉంది. కానీ వాటన్నింట్లో ‘పలాస’ చాలా ప్రత్యేకమైన సినిమా. నాకు బాగా సంతృప్తి కలిగించిన సినిమా. ‘పలాస’ సినిమాను సమర్పించడం గర్వంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ప్రసాద్ పలు విషయాలు పంచుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లా డుతూ – ‘‘కరుణకుమార్ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎక్కడా వంకలు పెట్టలేని విధంగా చెప్పాడు. గతంలో వచ్చిన ‘మా భూమి’ వంటి సినిమాలా అనిపించింది. ఈ కథను ప్రసాద్‌గారి దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా నచ్చింది. కరుణ కథ చెప్పినట్టే తెరకెక్కించాడు. ఎక్కడా తప్పులు కనిపించలేదు. వర్గ విబేధాలను కరుణ అద్భుతంగా తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనలకు కాస్త కమర్షియల్ అంశాలు జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు. అల్లు అరవింద్‌గారు ఈ సినిమా చూసి కరుణకు వాళ్ల బ్యానర్లో సినిమా చేసే అవకాçశం ఇచ్చారు’’ అన్నారు. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భరద్వాజగారు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేవరకూ మా నీడలా మాతోనే ఉన్నారు. ఆయన మా వెనక ఉండటం వల్ల చాలా సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యాయి. మా ఇద్దరి ఆలోచనా విధానం చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతిసారీ మన సినిమాల్లో గెలిచిన వాళ్ల కథనే చూపిస్తుంటాం. ఇందులో ఓడినవాళ్ల కథను చెప్పాం. అణచివేయబడుతున్నవాళ్ల కథను చెప్పాం’’ అన్నారు. -
ఆ సినిమా చూశాక ధైర్యం వచ్చింది : నాగశౌర్య
‘‘పలాస 1978’ లాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి. అయితే ఈ సినిమా చూశాక చాలా ధైర్యం వచ్చింది’’ అన్నారు హీరో నాగశౌర్య. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా 40 ఏళ్ల సినీ కెరీర్లో ‘పలాస 1978’ మంచి సినిమా అని నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా పోస్టర్‌పై నా పేరు ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు. ‘‘తమిళంలో వెట్రిమారన్లాంటి దర్శకుల్ని చూసి స్ఫూర్తి పొందుతుంటాం.. కానీ మనకూ అలాంటి దర్శకులున్నారని కరుణ్‌కుమార్ గుర్తు చేశాడు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘పలాస’ నా ఫస్ట్ సినిమాగా చేద్దామనుకోలేదు. నాకు చాన్స్ ఇచ్చిన ప్రసాద్‌గారికి, తమ్మారెడ్డి భరద్వాజగారికి రుణపడి ఉంటాను’’ అన్నారు కరుణ్‌కుమార్. నిర్మాతలు రాజ్ కుందుకూరి, ‘మధుర’ శ్రీధర్, సంగీత దర్శకులు రఘు కుంచె, కళ్యాణీ మాలిక్, పాటల రచయిత భాస్కర భట్ల, సిరాశ్రీ తదితరులు మాట్లాడారు. -
పలాస 1978 మంచి చిత్రమని ధైర్యంగా చెప్పగలం
రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా కరుణకుమార్ దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ వచ్చే నెలలో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘కరుణకుమార్ చెప్పింది చెప్పినట్లు తీస్తే తెలుగులో కొత్త రకం సినిమా అవుతుందనిపించింది. చెప్పినదానికంటే బాగా తీశాడు. ఈ సినిమా కోసం అతను దాదాపు 50 రోజులు ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు. ముందు నేను ఫస్ట్ కాపీ చూశాను. ఆ తర్వాత దర్శకుడు మారుతి, నిర్మాత ‘బన్నీ’ వాసు చూశారు. మారుతిగారు అల్లు అరవింద్‌గారిని తీసుకొచ్చారు. ఈ సినిమాకు యూవీ, జీఏ2 పిక్చర్స్ అసోసియేట్ కావడం వల్ల మంచి పబ్లిసిటీ, థియేటర్స్ దొరుకుతాయి. ‘పలాస 1978’ ఒక మంచి చిత్రమని ధైర్యంగా చెప్పగలం’’ అన్నారు. ‘‘నేను, ‘బన్నీ’ వాసు ఈ సినిమా చూసి బాగుందనుకున్నాం. సాధారణంగా ఇలాంటి సినిమాలు తమిళంలో వస్తుంటాయి. ‘పలాస 1978’ చిత్రం తెలుగు ‘అసురన్’లా ఉంటుంది. ఇలాంటి గొప్ప సినిమాలు తక్కువగా వస్తుంటాయి. కరుణకుమార్‌కు సినిమాల పట్ల మంచి ప్యాషన్ ఉంది. యూవీ, జీఏ2లో అడ్వాన్స్ కూడా ఇప్పించాను’’ అన్నారు మారుతి. ‘‘ఈ సినిమా నాకు భావోద్వేగాలతో కూడిన ప్రయాణంలా సాగింది. మాకు అండగా నిలిచిన గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంస్థలకు ధన్యవాదాలు’’ అన్నారు కరుణకుమార్. ‘‘మా నాన్నగారి ప్రోత్సాహంతో ఇంత దూరం రాగలిగాం. ఈ సినిమాను చూసిన దర్శకులు సుకుమార్‌గారు ఫోన్ చేసి అన్ని వేరియేషన్స్ బాగా చేశావని అభినందించారు. గీతా ఆర్ట్స్ 2, యూవీ సంస్థలు విడుదల చేస్తున్నాయంటేæ మా సినిమా మరో స్థాయికి వెళ్లిందనిపిస్తోంది. మారుతిగారు మా ముందుండి నడిపించారు’’ అన్నారు రక్షిత్. -
వ్యవసాయం నేపథ్యంలో పల్లెవాసి
‘సాహసం శ్వాసగా సాగిపో, కిరాక్ పార్టీ’ చిత్రాల ఫేమ్ రాకేందు మౌళి కథానాయకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘పల్లెవాసి’. సాయినాథ్ గోరంట్ల దర్శకత్వంలో రాంప్రసాద్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పల్లెసీమ నేపథ్యంలో మంచి కథని ఎంచుకొన్న చిత్రబృందానికి అభినందనలు’’ అన్నారు పాటల రచయిత వెన్నెలకంటి. ‘‘అక్షరం మీద ఆధారపడిన కుటుంబం నుంచి వచ్చాను. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు రాకేందు మౌళి. ‘‘మా సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సాయినాథ్ గోరంట్ల. ‘‘పల్లెవాసి’ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాంప్రసాద్. ఈ చిత్రానికి కెమెరా: చామంతి లక్ష్మణ్‌రాజ్, సహ నిర్మాత: ఉదయ్‌కుమార్ యాదవ్. -
పలాస కథ
మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో ‘పలాస 1978’ చిత్రాన్ని విడుదల చేసేందుకు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ముందుకొచ్చాయి. పలాసలో జరిగిన వాస్తవ సంఘటనలు, కొన్ని నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి కథ, కథనాలున్న ఈ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీలకు బాగా నచ్చడంతో గీతా ఆర్ట్స్, యూవీ ప్రొడక్షన్స్ పతాకాలపై విడుదల చేయనున్నారు. ‘‘మంచి సినిమాలను అందరికీ చేరువయ్యేలా చూడాలని అల్లు అరవింద్‌గారు భావించడంతో ‘పలాస 1978’ ఈ చిత్రాన్ని జీఏటు యూవీ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాం’’ అని బన్నీ వాసు తెలిపారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె. -
పల్లెటూరి అనుబంధాలు
సీనియర్ నటి అన్నపూర్ణ, జమున, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. నర్రా శివనాగేశ్వరరావు(శివనాగు) దర్శకత్వంలో ఎమ్ఎన్ఆర్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం పాటలను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి సీడీని నిర్మాత కేఎల్.దామోదర్ ప్రసాద్ అందుకున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి మాధవ్ విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ఆర్టిస్టు కావాలనుకున్న శివనాగు దర్శకుడిగా మారారు. ఈ చిత్రం టైటిల్, సన్నివేశాలు, పాటలు చూస్తుంటే పల్లెటూరి వాతావరణ ం కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు దామోదర్ ప్రసాద్. ‘‘మంచి టైటిల్‌తో ఇలాంటి కుటుంబ చిత్రాన్ని తీయడం అభినందనీయం’’ అన్నారు దర్శకులు సాగర్. ‘‘కథకు ప్రాధాన్యం ఇచ్చి తీసిన చిత్రం ఇది’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఈ పాత్రను పోషించడం సంతోషంగా ఉంది’’ అన్నారు మాస్టర్ రవితేజ. ‘‘పల్లెటూరి ప్రేమలను, వాతావరణాన్ని ప్రతిబింబించాల్సిన చిత్రాలు ఇంకా రావాల్సి ఉంది’’ అన్నారు శివనాగు. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం’’ అన్నారు ఎమ్ఎన్ఆర్ చౌదరి. నటుడు బెనర్జీ, సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్, సింగర్స్ పసల, బేబి, నటుడు గోవిందరాజుల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
దాసరి గుర్తుండిపోతారు
రాక్‌స్టార్ ఈవెంట్స్, కింగ్ మీడియా ఈవెంట్స్ సంయుక్తంగా దర్శకరత్న దాసరి నారాయణరావు పేరిట ప్రతి యేటా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఎన్ఆర్ఐలు జై శంకర్, కళ్యాణ్, సాయిప్రసాద్ యండమూరి, నాగ రాజు, నవీన్‌తో పాటు వారి స్నేహితులు కలిసి అక్టోబర్ 26న శిల్పకళా వేదికలో ‘దాసరి అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘మా గురువు దాసరి నారాయణరావుగారు మరణించినా కూడా ఇప్పటికీ ఆయనకి అభిమానులు ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయన పేరిట అవార్డ్స్‌ను ప్రదానం చేయడం ఇంకా ఆనందదాయకం. అక్టోబర్ 25న దాసరి పద్మగారి జయంతి కాబట్టి ఈ మహోన్నత కార్యక్రమాన్ని అక్టోబర్ 26న కాకుండా 25న జరిపితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ప్రతి నెలా కొంతమంది పేద ఆర్టిస్టులకు చెక్కులు ఇవ్వడం, ప్రతియేటా మే 4న తన పుట్టినరోజును పురస్కరించుకొని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమంటే దాసరిగారికి చాలా ఇష్టం. దీనిని∙ఆయన ఓ బాధ్యతగా భావించేవారు. ఆ కార్యక్రమాలను కూడా కళ్యాణ్, నాగరాజు, జై శంకర్ తదితరులు ప్రతి యేటా నిర్వర్తిస్తామని మాటిచ్చారు’’ అన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజర్లు (ఎన్ఆర్ఐ) జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్ యండమూరి, నాగరాజు, నవీన్ పాల్గొన్నారు. -
ఫోరెన్సిక్ పరీక్షల నేపథ్యంలో...
అమలా పాల్ హీరోయిన్గా, అరుణ్ ఆదిత్ హీరోగా అనూప్ పనికర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. ఫణీ ంద్ర కుమార్, ప్రభు వెంకటాచలం నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘రాక్షసుడు’ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి. రామ్మోహన్ రావు క్లాప్ ఇచ్చారు. తమ్మారెడి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ఫోరెన్సిక్ థ్రిల్లర్ అనే కొత్త జోనర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఫోరెన్సిక్ పరీక్షలు అంటే ఏంటో ఈ సినిమాలో చూపించనున్నారు’’ అన్నారు. అమలాపాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నా. తమిళంలో అజయ్ పనికర్‌తో కలిసి నిర్మిస్తున్నా. తమిళంలో ‘కడావర్’ అనే టైటిల్ పెట్టాం’’ అన్నారు. ‘‘నా గత సినిమా విడుదలైన తర్వాత ‘ఇమ్రాన్ హష్మి అవుదామనుకుంటున్నారా?’ అని ప్రశ్నిస్తున్నారు.. అలాంటిదేమీ లేదు’’ అన్నారు అరుణ్ ఆదిత్. ‘‘చెన్నైలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అభిలాష్ ఈ కథ రాశారు’’ అన్నారు అనూప్ పనికర్. నటుడు వినోద్ సాగర్, కెమెరామేన్ అరవింద్ సింగ్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రోనీ. -
తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా
‘‘ఆమె’ సినిమాకి మంచి పేరు వచ్చింది.. కానీ, కలెక్షన్లు ఆశించిన రీతిలో రాలేదు. కలెక్షన్లు రాకపోవడంతో అన్యాయం జరిగిందని చెప్పడం లేదు’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అమలాపాల్ లీడ్ రోల్లో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో రాంబాబు కల్లూరి, విజయ్ మోరవనేని ‘ఆమె’ పేరుతో ఈ నెల 20న తెలుగులో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతలకు నెల కిందటే ‘ఆమె’ కోసం డబ్బులు చెల్లించాం. తమిళనాడులోని డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇచ్చారు. అయితే ఫైనాన్షియర్లకు నిర్మాతలు డబ్బు కట్టలేదు. చివరకు అమలాపాల్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడంతో పాటు ఎదురు డబ్బులు ఇచ్చి విడుదల చేయించింది. ముందుగా అనుకున్నట్లు 19న విడుదలైతే బాగుండేదేమో? ఒక రోజు ఆలస్యంగా విడుదల కావడం వల్ల క్రేజ్ తగ్గిపోయి మా చిత్రం చచ్చిపోయింది. అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ అవుతున్న సినిమా చంపేయబడింది. సరైన విడుదల తేదీ, థియేటర్లు దొరక్క చాలామంది నష్టపోతున్నారు. నాకు దొరికినా తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా. దీనిపై తెలుగు ఫిల్మ్ చాంబర్లో కేసు పెట్టా. ఓ మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని పద్ధతిగా విడుదల చేయడం కూడా అంతే ముఖ్యమనే పాఠాన్ని ‘ఆమె’తో నేర్చుకున్నా. ఇక ఈ సినిమా విషయానికొస్తే... నేటితరం ఆవేశంలో, మద్యం మత్తులో విసిరే సవాళ్లు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తాయనే విషయాన్ని అసభ్యత లేకుండా తీశాడు దర్శకుడు. అమలాపాల్ బాగా నటించింది. ‘మల్లేశం, ఆమె’ లాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి’’ అన్నారు. -
వెంటాడే ఫీల్‌తో..
శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉత్తర’. లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై తిరుపతి ఎస్.ఆర్. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రాజ్ కందుకూరి పాల్గొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘సురేశ్ బొబ్బిలి సంగీతం అంటే చాలా ఇష్టం. సినిమా కథలోని ఆత్మను తన సంగీతంతో పలికించే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు. ‘‘ట్రైలర్ కొత్త ఫీల్‌ని కలిగించింది. ప్రతిభ ఉన్నవాళ్లంతా కలిసి చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ సినిమాలో నన్ను హీరోగా సెలెక్ట్ చేసిన దర్శకునికి రుణపడి ఉంటాను. సినిమాలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు, ఇండస్ట్రీ అందరూ ఆదరిస్తారు. అలాంటి మంచి సినిమానే మేం చేశాం’’ అన్నారు శ్రీరామ్. తిరుపతి మాట్లాడుతూ– ‘‘సహజమైన పాత్రలతో సినిమా ఉంటుంది. సినిమా విడుదలైన కొన్ని రోజుల వరకు ఆ ఫీల్ ప్రేక్షకులను వెంటాడుతుంది’’ అన్నారు. నిర్మాత శ్రీపతి గంగదాస్ మాట్లాడుతూ – ‘‘తిరుపతి సినిమాను బాగా తీశారు. అనుకున్నట్లుగానే సినిమా బాగా రావడానికి కారణం టీమ్’’ అన్నారు. ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు కారుణ్య. -
ఉత్తర ట్రైలర్ లాంచ్
లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన మూవీ ‘ఉత్తర’. శ్రీరామ్, కారుణ్య కత్రేన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తిరుపతి యస్ ఆర్ దర్శకుడు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. రొమాంటిక్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఉత్తర ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ట్రైలర్ లో నన్ను ఎక్కువుగా ఆకర్షించింది మ్యూజిక్. సురేష్ బొబ్బిలి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే దర్శకుడు నాకు కథ చెప్పినప్పుడు ఇలాంటి క్రైం బ్యాక్ డ్రాప్ కథలు చాలా వచ్చాయి, ఇందులో ఏం కొత్తదనం ఉంటుంది అనుకున్నాను. కానీ ట్రైలర్ చూస్తే లుక్ అండ్ ఫీల్ చాలా ప్రెష్ గా ఉన్నాయి. తెలంగాణా యాస తెరపై గమ్మత్తును చేస్తుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు తిరుపతికి మంచి విజయం తో పాటు రెస్సెక్ట్ వస్తుందని నమ్ముతున్నాను ’ అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా బ్యాక్ డ్రాప్ బాగుంది. కొత్త ఫీల్ కలిగింది. స్టార్స్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులను చూస్తే ఈ సినిమా పై మరింత నమ్మకం కలుగుతుంది’ అన్నారు. హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ.. ‘ఏ సినిమాలో అయినా కొత్తదనం ఉంటే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ ఆదరణ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కొత్తదనం నిండిన సినిమాలను ప్రొత్సహించిన వారే. మా సినిమా కూడా అలాంటి కొత్తదనం తోనే వస్తుంది. ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసిన దర్శకుడికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ టీం అందరూ నన్ను బాగా ఎంకేరేజ్ చేసారు. అలాగే కారుణ్య నటన ప్రత్యేకంగా చెప్పుకుంటారు’ అన్నారు. దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో పాత్రలు చాలా సహాజంగా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఆ ఫీల్ మిమ్మల్ని కొన్ని రోజులు వెంటాడుతుంది. ఉత్తర సినిమాలో కనిపించే ప్రతి సన్నివేశంతో ప్రేక్షకులు రిలేట్ అవుతారు. ఈ సినిమాలో వర్క్ చేసిన హీరోయిన్ కారుణ్య, శ్రీరామ్‌ల పాత్రలకు మంచి పేరు వస్తుంది. ఈ ట్రైలర్ లాంచ్ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యావాదాలు’ అన్నారు. -
ధృవ కష్టం తెలుస్తోంది
ధృవ కరుణాకర్ హీరోగా నటించిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్ దర్శకత్వంలో ప్రియా నాయర్, వందనా యాదవ్, ఐశ్వర్యా యాదవ్, శుభ మల్హోత్రా, రూపేష్‌లు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో పి. కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భరద్వాజ మాట్లాడుతూ– ‘‘సంజయ్ వల్లనే ఈ కార్యక్రమానికి వచ్చాను. నన్ను నిర్మాణం వైపు నడిపించిన వ్యక్తి కూడా తనే. ఈ చిత్రం ట్రైలర్ బాగుంది. ధృవ చాలా కష్టపడ్డట్లు తెలుస్తోంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం హాంకాంగ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. డూప్ లేకుండా నటించాను. నన్ను నమ్మి నా కోసం కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు. నేను, దర్శకుడు నితిన్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాం’’ అన్నారు «ధృవ. ‘‘స్టోరీ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సీన్స్ హైలైట్‌గా ఉంటాయి. ఆగస్టులో విడుదల ప్లాన్ చేశాం’’ అన్నారు నితిన్. ‘‘ధృవ చేసిన సాహసాలకు షాకయ్యా. అనుకున్న డేట్ కంటే ముందుగానే సినిమాను పూర్తి చేసే నితిన్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి అవసరం. ఈ చిత్రంలో నేను చేసిన మాంత్రికుడి పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు సుమన్. -
ఆమె వస్తోంది
‘నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమలాపాల్ నటించిన తొలి థ్రిల్లర్ మూవీ ‘ఆడై’. రత్నకుమార్ దర్శకత్వంలో రాంబాబు కల్లూరి, ఎం. విజయ్ నిర్మించిన ఈ తమిళ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకున్నారు. ‘ఆమె’ పేరుతో చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన తెలుగులో విడుదల చేయనున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘రత్నకుమార్ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. అమలాపాల్ బోల్డ్ లుక్ కూడా సంచలనం సృష్టించింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఒ. ఫణీంద్ర కుమార్, సంగీతం: ప్రదీప్ కుమార్, ఊర్క, కెమెరా: విజయ్ కార్తీక్ ఖన్నన్, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్: హరిహర సుతన్. -
జూలై 19న అమలా పాల్ ‘ఆమె’
సెన్సేషనల్ హీరోయిన్ అమలా పాల్ నటించిన తొలి థ్రిల్లర్ సినిమా ఆమె. తమిళంలో ఆడై పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్ చేసిన రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమలా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచలనం సృష్టించింది. జులై 19న ఆమె సినిమా విడుదల కానుంది. ప్రదీప్ కుమార్ ‘ఆమె’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తిక్ ఖన్నన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ సంస్థలో ఆమె చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. -
ఒకే జానర్లో సినిమాలు తీస్తున్నారు
‘‘ముంబైలో మాఫియా ఒకలా, విజయవాడలో మరోలా ఉంటుంది. ప్రతి ఊరిలో ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది. అది ఎలా ఉంటుందన్నది ‘పలాస’లో కొత్తగా ఉంటుంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. రక్షిత్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు మారుతి, తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు ప్రతిదర్శకుడు ఒక్కో జానర్లో సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు అందరూ ఒకే జానర్లో సినిమాలు తీస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ లుక్‌లో కొత్త సబ్జెక్ట్‌తో తీసిన ‘పలాస’ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో లుక్ బాగున్నాయి. తమ్మారెడ్డిగారు ఇలాంటి సినిమాలకు అండగా నిలబడటం çహ్యాపీ’’ అన్నారు. ‘‘తెలుగు కథ వైజాగ్ దాటి ముందుకుపోలేదు. పలాస ప్రాంతం నేపథ్యంలో రాసుకున్న ఈ కథను ప్రసాద్, తమ్మారెడ్డిలకు చెప్పాను. వాళ్లు ముందుకు రావడంతోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నాను. 40 యేళ్లపాటు సాగే కథను 40 రోజుల్లో తీయడం మా టీమ్ సహకారం వల్లే సాధ్యం అయింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘ఇందులో క్రూరమైన పాత్ర చేశాను’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె. ‘‘రెండు నెలల పాటు పలాసలో షూటింగ్ చేశాం. ‘గాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ లాంటి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు రక్షిత్. నక్షత్ర, రచయిత నాగేంద్ర, కెమెరామెన్ విన్సెంట్ అరుల్, వెంకట సిద్ధారెడ్డి మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎ.ఆర్ బెల్లన్న. -
యాక్షన్ థ్రిల్లర్
కార్తీక్ రాజు, వర్ష బొల్లమ్మ జంటగా సంపత్ రాజ్ కీలక పాత్రలో నటించనున్న సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర అసోసియేట్‌గా వర్క్ చేసిన స్వరాజ్ నూనె ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్య మూవీ మేకర్స్ నిర్మాణంలో గురవయ్య యాదవ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు క్లాప్ ఇచ్చారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. శ్రీచరణ్ పాకాల మంచి బాణీలు సమకూర్చారు. జయపాల్ రెడ్డి కెమెరామేన్‌గా చేస్తారు’’ అన్నారు గురవయ్య యాదవ్. ఈ చిత్రానికి ఆర్వీ రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
47 రోజుల సస్పెన్స్
పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన చిత్రం ‘47 డేస్’. ‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’ అనేది ఉపశీర్షిక. సత్యదేవ్ హీరోగా, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోయిన్లుగా నటించారు. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూస్తుంటే బాలచందర్‌గారి ‘47 డేస్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం చిరంజీవి ‘నాకు మొగుడు కావాలి’ సినిమా వాయిదా వేసి మరీ చేశాడు. ఏది ఏమైనా ఈ సినిమా కూడా మా ‘నాకు మొగుడు కావాలి’ అంత హిట్ అవ్వాలి’’ అన్నారు. ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ– ‘‘సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉన్న నేను సినిమా రంగంలోకి వస్తానన్నప్పుడు నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్. ఈ సినిమా ట్రైలర్ రఫ్ కట్ చూసిన రామ్‌గోపాల్ వర్మగారు.. ‘మీరు విజువల్స్‌తో స్టోరీ చెప్పారు’ అనడం పెద్ద ప్రశంసలా అనిపించింది’’ అన్నారు. ‘‘ఒక చిన్న ప్రయత్నంగా ఈ సినిమా మొదలు పెట్టాం. చాలా ఓర్పుతో ఈ చిత్రాన్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చాం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు’’ అన్నారు రఘు కుంచె. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్ ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు శశి భూషణ్, శ్రీధర్, విజయ్. ‘‘ఈ సినిమా హిట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు సత్యదేవ్. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, దర్శకుడు బీవీయస్ రవి, దర్శకుడు వెంకటేష్ మహా, సతీష్ కాశెట్టి, కత్తి మహేష్, లక్ష్మీ భూపాల్, భాస్కరభట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అనిల్ కుమార్ సొహాని, సంగీతం: రఘు కుంచే, కెమెరా: జీకే. -
భవిష్యత్తుని వెంటాడుతుంది
‘‘సువర్ణసుందరి’ లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి చాలా అవసరం. దాని వల్ల కొత్త టెక్నీషియన్స్ పరిచయం అవుతారు. సూర్య రాసుకున్న కథ చాలా బాగుంది. తప్పకుండా ఇది ఓ మంచి సినిమా అవుతుంది’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణసుందరి. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’’ అన్నది ఉపశీర్షిక. ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకులు బి.గోపాల్ విడుదల చేశారు. డైరెక్టర్ సూర్య మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. నటీనటులందరూ నాకు చాలా సహకరించారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ఏడాది పట్టింది. అందుకే సినిమా విడుదల లేట్ అయింది. అయినా అవుట్‌పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘సువర్ణసుందరి’ ఎక్స్ట్రార్డినరీ చిత్రం. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు అందగత్తె జయప్రద. ఆవిడ కూడా ఈ చిత్రంలో నటించారు. టీమ్‌కి ఆల్ ద బెస్ట్’’ అని డైరెక్టర్ సాగర్ అన్నారు. ‘‘ఇది చాలా మంచి సినిమా. పాటలు. ఫైట్స్ చాలా బాగా వచ్చాయి’’ అన్నారు సాక్షీ చౌదరి. ‘‘సహనం అంటే అది సూర్యగారి నుంచే నేర్చుకోవాలి. చాలా ఓర్పుగా మంచి నటన రాబట్టుకున్నారాయన’’ అని పూర్ణ అన్నారు. హీరోలు ఇంద్ర, రామ్, రచయిత విజయేంద్రప్రసాద్, రైటర్ ప్రదీప్, స్టంట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లుమంతి ఈశ్వర్. -
రెండు జంటల ప్రేమకథ
‘‘ప్రేమకథలు ఎన్నిసార్లు చెప్పినా బోర్ కొట్టవు. ట్రెండ్‌కు తగ్గట్టుగా దర్శకులు అప్డేట్ అవుతూ ప్రేమ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు. అలా న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’’ అని నిర్మాత అల్లూరమ్మ (భారతి) అన్నారు. అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రల్లో అవినాష్ కోకటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీ కోసం’. తీర్థసాయి ప్రొడక్షన్స్ పతాకంపై అల్లూరమ్మ (భారతి) నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ‘తొలితొలిగా...’ పాటను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘ఈ పాట చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారాయన. ‘‘రెండు జంటల మధ్య ప్రేమకథను ఈ తరానికి నచ్చేలా తెరకెక్కించిన సినిమా ఇది. ఎంటరై్టన్మెంట్ తగ్గకుండానే ప్రేమకథలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. లవ్‌స్టోరీలో ఎమోషన్స్‌కు ఎప్పుడూ ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలాంటి ఎమోషనల్ అంశాలు మా చిత్రంలో ఉంటాయి. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని అవినాష్ కోకటి అన్నారు. సుదర్శన్, ‘ఈ రోజుల్లో’ సాయి, కేధార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సంగీతం: శ్రీనివాస్ శర్మ, కెమెరా: శివకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజేశ్వరి అన్నపురెడ్డి, సహ నిర్మాతలు: సోమశేఖర్ రెడ్డి, అల్లూరి రెడ్డి. ఏ. -
వాస్తవ సంఘటనతో...
‘లండన్ బాబులు’ ఫేమ్ రక్షిత్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నక్షత్ర హీరోయిన్. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్ నిర్మించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘చాలా చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పని చేసిన నేను ‘పలాస 1978’ సినిమాతో దర్శకుడవుతున్నా. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకోనున్న తొలి చిత్రం మాదే’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: విన్సెంట్ అరుల్. -
200 ఏళ్ల క్రితం కథతో...
కౌశిక్ అంగారిక హీరోగా నౌండ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో వియాన్ జీ, గీతా కౌశిక్ నిర్మించిన సినిమా ‘దమయంతి’. అర్చనా సింగ్, రవళి, అనిక, ఆగస్టీన్ కీలక పాత్రలు చేశారు. హీరో కౌశిక్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా దగ్గర స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా మారాడు. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. 200 ఏళ్ల కిందటి సబ్జెక్ట్‌ను వర్తమాన కాలానికి లింక్ చేసి సినిమా చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్. టీజర్, ట్రైలర్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘శిష్యునిగా నన్ను ఆదరించినందుకు భరద్వాజ్‌గారికి ధన్యవాదాలు. నల చక్రవర్తి భార్యనే దమయంతి. కానీ ఆ తరహా కథ కాదు. పొయెటిక్ స్పర్శతోపాటు థ్రిల్లింగ్ మిళితమై ఉన్న సినిమా ఇది. టీమ్ అందరు బాగా సహకరించారు. నటించినవారందరికీ సమప్రాధాన్యం ఉంది. కథ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శ్రీనివాస్. ‘‘డైరెక్టర్‌ను నమ్మి ఈ సినిమా చేశాను. ఈ సినిమా క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మ్యూజిక్ బాగా వచ్చింది. వచ్చే నెలలో ఆడియోను రిలీజ్ చేస్తాం. సినిమా అందరికీ నచ్చి తీరుతుంది’’ అన్నారు కౌశిక్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఈ చిత్ర నిర్మాత గీతకౌశిక్. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్. ఆత్రేయ. -
అందుకే మెగాస్టార్ అయ్యారు – తమ్మారెడ్డి
‘‘తమ్మారెడ్డి భరద్వాజ, విజయ్, యువన్ శంకర్‌రాజా వల్లే ‘ప్యార్ ప్రేమ కాదల్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నా. తమ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. నా ఫేవరెట్ సంగీత దర్శకుడు యువన్. 1980లలో ఎన్నో హిట్లిచ్చిన ఇళయరాజా కొడుకు అవ్వడం వల్లనే తనంటే అంత ఇష్టం. ‘మా’ అసోసియేషన్ విజయ్ సోదరుడితో సమానం. యువ ప్రతిభావంతులు పరిశ్రమకు రావాలి. ఏ భాష సినిమా అయినా బావుంటే మన తెలుగు ప్రేక్షకులు చూడాలి’’ అని చిరంజీవి అన్నారు. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మించిన తొలి చిత్రం ‘ప్యార్ ప్రేమ కాదల్’. హరీష్ కల్యాణ్, రైజ విల్సన్ జంటగా ఎలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ పతాకంపై యువన్ శంకర్ రాజా, విజయ్ మోర్వనేని అక్టోబరులో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని చిరంజీవి రిలీజ్ చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నాన్నగారిపై కోపంతో చిరంజీవికి ఫోన్ చేసి మనం సినిమా చేయాలి అని అడిగాను. కథేంటి.. దర్శకుడెవరు? అన్నది అడగకుండా అంగీకరించారు. చిరంజీవితో 40 ఏళ్ల క్రితం ‘మొగుడు కావాలి’ సినిమా తీశాను. ఆయనతో నేను రెండు సినిమాలు చేసినా చిరంజీవికి డబ్బులు ఇవ్వలేదు. నేను దర్శకుడిగా మారి ‘అలజడి’ సినిమా చేశా. నేను పిలవకుండానే చిరంజీవి వచ్చి సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఆ రోజు చిరంజీవి వేరు. ఇప్పుడు చిరంజీవి వేరు. ఎంతో కష్టపడ్డారు కాబట్టే 40 ఏళ్లలో ఆయన మెగాస్టార్ అయ్యారు’’ అన్నారు. యువన్ శంకర్ రాజా, విజయ్ మోర్వనేని పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా. -
మెగాస్టార్ మెచ్చిన ‘ప్యార్ ప్రేమ కాదల్’
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కాదల్’. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ పతాకంపై యువన్ శంకర్ రాజా, విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ స్వయంగా సంగీతం అందించారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ -‘టీజర్ లాంచ్‌కి అంగీకరించడానికి కారణం . భరద్వాజ, విజయ్, యువన్‌లే. తమ్మారెడ్డితో 40ఏళ్ల అనుబంధం ఉంది. ఇక జనరేషన్ గ్యాప్ ఉన్నా యువన్ సంగీతం అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ సంగీత దర్శకుడు అతడు. 80లలో ఎన్నో హిట్లిచ్చిన ఇళయరాజా కొడుకు అవ్వడం వల్లనే తనంటే ఇంత ఇష్టం. తను ఇంత బిజీ షెడ్యూల్లోనూ నిర్మాతగా మారుతున్నాడు అంటే ఈ సినిమాలో కంటెంట్ నచ్చడం వల్లనే అని అనుకుంటున్నా. ఇది హిట్టేనని భావిస్తున్నా’ అన్నారు. చిత్ర సమర్పకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...‘యువన్ శంకర్ రాజా తొలి సారి నిర్మాతగా రూపొందించిన ప్యార్ ప్రేమ కాదల్ చిత్రాన్ని బాగా నచ్చి రిలీజ్ చేస్తున్నాం. యంగ్ టీమ్ అద్భుతంగా చేశారు’ అని తెలిపారు. నిర్మాత యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ - ‘మెగాస్టార్ ఆశీస్సులతో ఈ సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతగా తొలి ప్రయత్నం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. అందరి ఆదరణ కావాలి’ అన్నారు. మరో నిర్మాత విజయ్ మోర్వనేని మాట్లాడుతూ - ‘తమిళ్‌లోలానే తెలుగులోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. చక్కని కంటెంట్ ఉన్న సినిమా ఇది’ అన్నారు. -
చిరు చేతుల మీదుగా ‘ప్యార్ ప్రేమ కాదల్’ ట్రైలర్ లాంచ్
-
‘మా’ సమస్య పరిష్కారమైంది
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నరేశ్ మధ్య వాగ్వివాదాలు జరిగాయి. ఈ వివాదం త్వరగానే సద్దుమణిగింది. ఇండస్ట్రీ ప్రముఖులం ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ ఏర్పరచుకొని, జరిగిన సమస్యను పరిష్కరించుకున్నాం అంటూ శనివారం ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, కౌన్సిల్ మరికొన్ని.. వాటిన్నింటిని కలిపితేనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇటీవల మా మధ్యలో కొన్ని మనస్పర్థలు వచ్చాయి. దాని కోసం అందరం కలసి ఓ సపరేట్ బాడీ ఏర్పర్చుకున్నాం. ఏదైనా ఇష్యూ ఉంటే ముందు మాలో మేం మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ ఇష్యూ జరిగినట్టు ఇంకోసారి జరగకూడదని భావించాం. ‘మా’కి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేశాయి. అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. వాళ్లు సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. అగ్రిమెంట్లో లేని చాలా విషయాలు ఇండస్ట్రీ చేతుల్లో ఉండవు. థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల ఏర్పడే వాటిని మేం సెటిల్ చేయలేం కదా? దాని వల్ల మాకు ఎటువంటి లాస్ రాలేదు’’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – ‘‘ఇటీవలే ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్ కమిటీ’ అని పెట్టుకున్నాం. ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి అనుకుంటూ వస్తున్నాం. అనుకోకుండా చిన్న సమస్య ఏర్పడింది. అది పరిష్కరించాం. ఇక నుంచి కూడా హెల్తీగానే జరుగుతుంది, జరగాలి కూడా. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా కలెక్టివ్ కమిటీనే చూస్తుంది. సాల్వ్ చేస్తుంది. ప్యూచర్లో చేసే ఈవెంట్స్ కూడా ఇది వరకులానే మాములుగానే చేస్తారు’’ అన్నారు. ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ మాట్లాడుతూ – ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు, సామాన్యులకు డైరెక్ట్‌గా కనెక్ట్ అయి ఉంది. ఇందులో కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అభిప్రాయభేదాలు రావడం సహజం. మనుషులు కలసి పని చేసేది కాబట్టి. టీఎఫ్ఐ కమిటీ ఏర్పాటు చేసి పెద్దలను కూర్చోబెట్టి వాళ్ళకు మా సమస్యలను వివరించి, చర్చించుకున్నాం. ఇండస్ట్రీ ఇంకా బెటర్ అవ్వడానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. గతం గతః. రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ బాగా చేయడమే మా లక్ష్యం. త్వరలో మహేశ్‌బాబు ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇవన్నీ సక్సెస్ చేస్తాం. దానికి పూర్తి సపోర్ట్ చేస్తాం. ఇక నుంచి అన్ని కార్యక్రమాలు పారదర్శకంగా 100శాతం సక్సెస్ చేస్తాం. ఒకటో తారీఖు నుంచి జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాను’’ అన్నారు. ‘‘టీఎఫ్‌సీసీ నిర్ణయమే మా అందరి నిర్ణయం. చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నాయి. అన్ని ఫైల్స్‌నీ పెద్దల చేతుల్లో పెట్టాం. ఈ పెద్దలంతా మా ఇద్దరికీ చుట్టాలు కాదు. మొత్తం చూసి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదని చెప్పారు. ఇకముందు మహేశ్‌బాబు, ప్రభాస్ ప్రోగ్రామ్‌లను కలసి కట్టుగా చేస్తాం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని ఉన్నత స్థితిలో నిలబెట్టడమే మా లక్ష్యం’’ అని ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో పి.కిరణ్, డా. కె.ఎల్. నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జీరో టెంపరేచర్లో షూటింగ్
మ్యాజిక్ లైట్స్ స్టూడియోస్ మరియు వర్షి స్టూడియోస్ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం ‘ద ఫాగ్’. యంవీ రెడ్డి నిర్మాత. మధుసూదన్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. విరాట్ చంద్ర, హరిణి, చందన, ఆత్మనంద తదితరులు ఈ చిత్రం ద్వారా నటీనటులుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ ఇప్పుడే చూశాను. చాలా కొత్తగా ఉంది. కొత్తగా వచ్చిన కెమెరాలతో ఎటువంటి లైట్స్ లేకుండా కొత్త లొకేషన్స్‌లో జీరో టెంపరేచర్లో హాలీవుడ్ లెవల్లో షూట్ చేశారు. చిన్న సినిమా అని చెప్తున్నారు కానీ పెద్ద సినిమాలా వుంది. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సినిమా కావాలి. అలా తీస్తే సినిమాకు మంచి లాభం వస్తుంది నా అంచనా. ఈ సినిమా ద్వారా దర్శకుడు మధుసూదన్‌కు, సినిమా పరిశ్రమకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యల్లనూరు హరినాథ్, సతీశ్ రెడ్డి, సంగీతం: సందీప్. -
హత్యలు చేసిందెవరు?
‘‘పెద్ద హీరోలు ప్రచారానికి వస్తున్నారు. కానీ, చిన్న హీరోలు ఈ విషయంలో సహకరించడం లేదు. నందు తన సినిమాల ప్రచారంలో పాల్గొనడం లేదు. నిర్మాత తన డబ్బును, దర్శకుడు కెరీర్‌ని పణంగా పెట్టి సినిమా చేస్తారు. అలాంటి దర్శక, నిర్మాతలకు హీరోలు సహకరించాలి’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. నందు, అనురాధ జంటగా ఫణిరామ్ తుఫాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐందవి’. సన్నీ అండ్ విన్నీ సినిమాస్ పతాకంపై శ్రీధర్ లింగం నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఫణి రామ్ మాట్లాడుతూ– ‘‘జనసంచారం లేని ప్రాంతంలో సరదాగా కొన్ని రోజులు గడుపుదామని ఆరుగురు వ్యక్తులు వెళ్తారు. ఒక్కొక్కరుగా హత్య చేయబడతారు. ఆ హత్యలు చేసిందెవరు? ఈ హత్యలకు, ఐందవికి సంబంధం ఏంటి? అన్నదే కథాంశం’’ అన్నారు. ‘‘ఆగస్టు మూడో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు శ్రీధర్లింగం. దిలీప్, అవంతిక, ‘ఛత్రపతి’ శేఖర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఏ ఆర్మాన్, కెమెరా: భరత్ సి. కుమార్, సమర్పణ: రాజేశ్వరి తుమ్మల. -
హరికృష్ణ మంచి హీరో అవుతాడు
దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. అక్షిత హీరోయిన్. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాసరావు మంచి దర్శకుడు. ‘ఎదురులేని మనిషి, జగపతి, బంగారు బాబు, ఢీ అంటే ఢీ’ వంటి చాలా సినిమాలు చేశారు. హరికృష్ణ నటన, డాన్స్ చూస్తుంటే మంచి హీరో అవుతాడనిపిస్తోంది’’ అన్నారు. ‘‘పాటలు, ట్రైలర్ బాగున్నాయి. హరికృష్ణకి మంచి ఎనర్జీ ఉంది’’ అన్నారు హీరో శ్రీకాంత్. ‘‘నిజజీవితంలో జరిగిన వాస్తవ సంఘటనతో తీసిన సినిమా ఇది. లవ్ స్టోరీ అయినా కొత్తగా ఉంటుంది. దర్శకుడిగా ఇది నా 9వ సినిమా. క్లైమాక్స్ సరికొత్తగా ఉంటుంది. జగపతిబాబుగారి వాయిస్ ఓవర్ మా సినిమాలో హైలైట్. త్వరలోనే í విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జొన్నలగడ్డ శ్రీనివాసరావు. రచయిత పరచూరి వెంకటేశ్వర రావు, డైరెక్టర్లు డాలీ, కిశోర్ కుమార్, హరికృష్ణ, అక్షిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భాగ్యలక్ష్మి, సంగీతం: యాజమాన్య, కెమెరా: పి.ఎస్. వంశీ ప్రకాష్. -
దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు
‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి అసోసియేట్‌గాను, నేను నటించిన ‘జగత్ కిలాడీలు, ‘హంతకులు, దేవాంతకులు’ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. ఆ తర్వాత నేను హీరోగా ‘రాధమ్మ పెళ్లి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. 150 సినిమాలకు పైగా తెరకెక్కించిన ఘనత దాసరిగారిది. నాకు తెలిసి భవిష్యత్‌లో ఏ దర్శకుడూ ఇన్ని సినిమాలు చేయలేరేమో’’ అని సీనియర్ నటుడు కృష్ణ అన్నారు. శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జరిగిన దాసరి విగ్రహావిష్కరణలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆయన తన భుజాలపై వేసుకుని పరిష్కరించేవారు. మంచి, చెడు అన్నీ ఆయనే చూసుకునేవారు. పరిశ్రమను తన కుటుంబంలా చూసుకున్నారు. దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు’’ అన్నారు. ‘‘మా నాన్నగారి (నందమూరి తారక రామారావు)తో దాసరిగారు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు తీశారు. ఆయన 150వ చిత్రం ‘పరమవీర చక్ర’లో నటించే అవకాశం నాకు కలిగింది. ఒక కార్మికుడిలా ఇండస్ట్రీ బాగు కోసం జీవితాన్ని త్యాగం చేశారు’’ అన్నారు బాలకృష్ణ. దాసరికి భారతరత్న ఇవ్వాలని, ఈ అంశాన్ని తాము పార్లమెంట్లో కూడా లేవనెత్తామని, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వాలని మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఫిలింనగర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, కార్యదర్శి కాజా సూర్యనారాయణ, నిర్మాతలు సి. కళ్యాణ్, అల్లు అరవింద్, నటి–దర్శకురాలు విజయ నిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మే 4.. డైరెక్టర్స్ డే దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 4ని డైరెక్టర్స్ డేగా ప్రకటించింది తెలుగు సినీ దర్శకుల సంఘం. వేదికపై డైరెక్టర్స్ అందరూ కలిసి ‘హ్యాపీ డైరెక్టర్స్ డే’ అని అనౌన్స్ చేశారు. ‘‘దాసరి జన్మదినాన్ని డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేయాలని నిర్ణయించిన దర్శక పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజానికి ఇది దాసరిగారి హక్కు’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. తనికెళ్ల భరణి ‘సినిమా’ మీద రాసిన కవిత్వం, డైరెక్టర్స్‌పై చంద్రబోస్ రచించిన పాటను ప్రదర్శించారు. ఈ గీతానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. దాసరిపై రచయిత గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలను వినిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్. అప్పుడు దండం పెట్టినవాళ్లు ఇప్పుడు ఎక్కడ? – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దాసరి నారాయణరావు 76వ జయంతి వేడుకలను ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్’ ఛైర్మన్ బీయస్యన్ సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ‘దాసరి టాలెంట్ అకాడమీ వెబ్సైట్’ ఆవిష్కరణ జరిగింది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘దాసరిగారి దగ్గర ఉండాలని చాలామంది పోటీపడేవారు. ఎప్పుడూ గురువుగారి పక్కన ఉండే మాలాంటి వాళ్లని కూడా తోసేసేవారు. వాళ్లు ఈ రోజు రాలేదు. కొన్నేళ్ల క్రితం ‘వీళ్లతో ఎందుకు గురువుగారూ.. మీతో పనులు చేయించుకుని, మీ ఇంటి తలుపు దాటక ముందే తిడుతున్నారు’ అని నేనంటే, ‘ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారో నాకు తెలియదని కాదు. కానీ ఇండస్ట్రీలో ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు అన్న రోజునే వీళ్లందరూ భయపడతారు. లేకపోతే ఇండస్ట్రీ కకావికలం అయిపోతుంది’ అన్నారు. ఆ కకావికలం దాసరిగారు లేని ఈ వన్ ఇయర్లో చూశాం’’ అన్నారు. దాసరిగారు నిజంగా ఓ శిఖరం – ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి మాట్లాడుతూ – ‘‘ఇక్కడున్న అందరికీ దాసరిగారితో సినిమా అనుబంధం ఉంటే నాకు పత్రికానుబంధం ఉంది. ‘ఉదయం’లో పని చేసిన ఏ ఇద్దరు కలిసినా గత 25 ఏళ్లుగా ఏం జరిగిందని మాట్లాడుకోకుండా ‘ఉదయం’ రోజులు ఎలా గడిపాం అని మాట్లాడుకుంటాం. 1984 నుంచి నేనెక్కడున్నా దాసరిగారు ఎక్కడున్నా తప్పకుండా మే 4న ఆయన్ను కలిసి అభినందించాల్సిందే. గతేడాది వరకూ దాసరిగారిని అభినందించని సంవత్సరం లేదు. దాసరిగారు చాలామందికి సహాయం చేసేవారు. ఇటీవల సినిమా పరిశ్రమలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు నారాయణరావుగారు ఉంటే బావుండు అనుకున్నాం. ఈ కథను ఇంత దూరం రానిచ్చేవారు కాదు. పరిష్కరించేవారని మా జర్నలిస్ట్‌లంతా అనుకున్నాం. ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ అని నాలుగు సంవత్సరాల ముందు మొదలుపెట్టాం. దాసరిగారికి ‘దర్శక శిఖరం’ అని బిరుదును కూడా ప్రదానం చేశాం. ఆయన నిజంగా శిఖరం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, సి. కల్యాణ్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దాసరి స్వగృహంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ‘డైరెక్టర్స్ డే’ని ప్రకటిస్తున్న చిత్రరంగ ప్రముఖులు -
ఇక కెమెరా సాక్షిగా ఆడిషన్స్
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో మహిళల భద్రత గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని అంశాలను చలన చిత్ర పరిశ్రమ తీవ్రంగా పరిగణించింది. సినిమాల్లో వివిధ శాఖలకు సంబధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. పరిశ్రమలోని అన్ని శాఖలూ ఈ అంశాలను కూలంకుషంగా చర్చించి సరైన తీరులో సక్రమంగా స్పందించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా కొన్ని దీర్ఘకాలిక నిర్ణయాలను అమలుపరచాలనుకుంటున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత పి. కిరణ్, నిర్మాత ముత్యాల రాందాస్, దర్శకులు ఎన్. శంకర్, నందినీరెడ్డి పాల్గొని, తాము తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ► సెక్సువల్ హెరాస్మెంట్ నియంత్రించడానికి ఏర్పాటు చేస్తున్న ‘క్యాష్’ కమిటిలో 50 శాతం చిత్రపరిశ్రమవారు, 50 శాతం ఇండస్ట్రీ బయట వ్యక్తులు ఉండాలి. డాక్టర్లు, లాయర్లు, సైకాలజిస్టులు అందులో మెంబర్లుగా ఉంటారు. ► ప్యానల్‌కు సంబంధించిన చట్టపరమైన నిబంధల రూపకల్పనకు న్యాయ సలహాలు తీసుకుంటాం. ► మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై చిత్ర పరిశ్రమ వివిధ సంస్థలకి గైడ్ లైన్స్ పంపించడం జరిగింది. మహిళా జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఆడిషన్స్ నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా కెమెరాలు ఉండాలి. ఓ మహిళా స్టాఫ్ తప్పనిసరిగా ఉండాలి. సమాచార సాధనాల్లో భాషను సక్రమంగా వాడేలా చూడాలి. ► 24 క్రాఫ్ట్స్‌లోని మహిళల సమస్యలను తెలుసుకొని వాటికి తగ్గట్టుగా పాలసీలను రూపొందించేందుకు మహిళలందర్ని ఒక చోట కలిపి వర్క్ షాప్ ఏర్పాటు చేయబోతున్నాం. ► లైంగిక వేధింపుల పై ఏర్పాటు చేయనున్న ప్యానల్లో ‘షీ’ టీమ్‌లో ఒక డైరెక్ట్ హాట్‌లైన్ ఉంటుంది. దీని ద్వారా వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ► ఈ–మెయిల్/పోస్ట్ ద్వారా హెల్ప్ లైన్లు ఛాంబర్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ► మోడలింగ్ కో–ఆర్డినేటర్స్‌కు సరైన లైసెన్సింగ్/అర్హతలు ఉండేలా చూస్తాం. ► కొత్తగా ఇండస్ట్రీకి ప్రవేశించాలనే నటీనటులకు కౌన్సిలింగ్ చేసేందుకు ఒక ప్యానెల్ ఏర్పాటు చేయనున్నాం. ఈ చర్యల ద్వారా సినీ పరిశ్రమలోని మహిళలు సురక్షితమైన వాతావరణంలో పని చేసుకునే వీలుంటుందని సమావేశంలో ప్రముఖులు తెలిపారు. -
చిన్నా పెద్దా తేడా లేదు.. క్యాష్తో సమన్యాయం
‘‘తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల లైంగిక వేధింపుల విషయమై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సీరియస్‌గా తీసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో విశాఖ గైడ్‌లైన్స్ పేరుతో ఇచ్చిన సూచనల ఆధారంగా లైంగిక వేధింపుల నిరోధానికి ‘క్యాష్’ (కమిటీ అగైనెస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు పి.కిరణ్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో టి.ఎఫ్.సి.సి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎఫ్.సి.సి అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ– ‘‘క్యాష్’ కమిటీలో చిత్రపరిశ్రమ నుంచి నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఫెడరేషన్ సభ్యులతో పాటు సమాజంలోని స్వచ్ఛంద సంస్థల వారు, లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వాధికారులు ఉంటారు. సినిమా రంగంలోని అన్ని విభాగాల వారు తమకు ఏవైనా వేధింపులు ఎదురైతే ఈ కమిటీ దృష్టికి తీసుకురావచ్చు’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలపడంతో మన కుటుంబంలోని వ్యక్తి ఇలా చేసిందే అని భావోద్వేగానికి గురై ఆ రోజు అలా మాట్లాడాను. అంతేకానీ ఆమెపై వ్యక్తిగతంగా మాకు ఎటువంటి విరోధం లేదు. ‘మా’ సభ్యులెవరూ ఆమెతో కలిసి నటించకూడదని ఆ రోజు అన్నాం. అయితే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, ‘మా’ అసోసియేషన్ పెద్దలు శ్రీరెడ్డి విషయాన్ని పునః పరిశీలించాలని సలహా ఇచ్చారు. ఆమెకు ‘మా’లో సభ్యత్వం విషయాన్ని జనరల్ బాడీలో పరిశీలించే వరకూ ‘మా’ సభ్యులందరూ శ్రీరెడ్డితో కలిసి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నటించొచ్చు. ఈ సందర్భంగా ఆమెకు మేం వెల్కమ్ చెబుతున్నాం. శ్రీరెడ్డికి ఏ సహాయం కావాలన్నా చేస్తాం. తెలుగు నటీనటులకు అవకాశాలు ఇమ్మని ‘మా’ ఎప్పుడూ కోరుతుంది. కానీ, అవకాశాలు ఇచ్చే నిర్ణయం ఆయా దర్శక–నిర్మాతలదే’’ అన్నారు. ‘‘క్యాష్’ కమిటీలో పదిమంది ఇండస్ట్రీవారు, మరో పదిమంది సమాజంలోని ప్రముఖులు ఉంటారు.అతి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. వేధింపుల కేసులన్నీ ఆ కమిటీకి వెళతాయి. ఇక్కడ పెద్దా చిన్నా అనే తేడా ఉండదు. అందరికీ సమన్యాయం జరుగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కె.ఎల్. నారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేసినా మా
-
శ్రీరెడ్డికి అవకాశాలు మాత్రం ఇప్పించలేం..
సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నటి శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేసినా.. అవకాశాలు మాత్రం ఇప్పించ లేదని సభ్యులు తెలిపారు. 'మా' సభ్యులు 900 మందితో శ్రీరెడ్డి నటించే స్వేచ్ఛ, అవకాశం ఆమెకు ఉందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పేర్కొన్నారు. ఇకనుంచి శ్రీరెడ్డి సినిమాలతో పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రముఖ రచయిత కోనవెంకట్, సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై మా బృందం స్పందించింది. కోన వెంకట్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రైటర్స్ అసోసియేషన్ ఉంది. వాళ్లు చూసుకుంటారు. సురేష్ బాబు చిన్న కుమారుడు హీరో కాదు. నిర్మాత, దర్శకుడు కూడా కాదని ఏం సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఇక్కడున్న వారంతా తెలుగువారేనని, ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుగువాళ్లు అవకాశాలు దక్కించుకుని కెరీర్ కొనసాగిస్తున్నారని వివరించారు. శ్రీరెడ్డి వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. అప్పుడున్న సందర్భానికి గాను 'మా' కార్యవర్గం కొంత ఎమోషన్ అయ్యారని అన్నారు. ఆ సమయంలో ఆమెను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అది పద్ధతి కాదు అని శ్రీరెడ్డిని కూడా మనలో ఒకరిగా భావించి ముందుకెళ్లాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. దీంతో ఆమెపై బ్యాన్‌ను ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయించాం. ఇలాంటి వివాదాలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు, కాస్ట్ కౌచింగ్ లేకుండా చూసేందుకు కమిటీ అగైనెస్ట్ సెక్యువల్ హెరాస్మెంట్ (క్యాష్)ను ఏర్పాటు చేశాం. ఇందులో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో పాటు బయటి వాళ్లు కూడా ఉండేలా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ తనతో అసభ్యంగా చాటింగ్ చేసేవారంటూ మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోన వెంకట్ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టి అసలైన నిందితులను శిక్షించాలి. లీగల్ యాక్షన్ తీసుకోవాలి. చీప్ పబ్లిసిటీ కోసం సినిమా పరిశ్రమను, సినీ ప్రముఖులను వాడుకుంటున్నందుకు జాలేస్తోంది. తెలుగు నటీనటులకు నేనూ మద్దతిస్తాను. కానీ ఈ ఆరోపణలు మాత్రం సహించలేనంటూ’ కోన వెంకట్ ట్వీట్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. -
సున్నితమైన ప్రేమకథ
సంతోష్ ప్రతాప్, అనమ్ ఖాని జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ద్వారం’. క్రాఫ్ట్‌మెన్ ఫిల్మ్ కార్పొరేషన్, పద్మశ్రీ క్రియేషన్స్, రాగె మూవీస్ పతాకాలపై ఆనంద్ చిత్రసేడు స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. దర్శకులు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శక–నిర్మాత మాట్లాడుతూ– ‘‘సున్నితమైన ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఇది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. మరో హీరోయిన్ని సెలక్ట్ చేయాల్సి ఉంది. హైదరాబాద్, వైజాగ్, అరకు, కేరళలో మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేస్తాం’’ అన్నారు. -
నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది..
‘‘నీదీ నాదీ ఒకే కథ’ టైటిల్ విని ఈరోజుల్లో ఇటువంటి సినిమాలు ఎవరు చూస్తారులే అనుకున్నా. రివ్యూస్ చూశాక సినిమా చూడాలనిపించింది. ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంత మంచి సినిమా నిర్మించిన నిర్మాతలకు దండం పెట్టాలనిపించింది’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. శ్రీ విష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. చిత్ర సమర్పకుడు నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘మా ఆరాన్ మీడియా వర్క్స్ బేనర్లో కొత్తదనం ఉన్న కథలతో మరిన్ని సినిమాలు వస్తాయి. ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు? అని చెప్పారు. అయినా నా డబ్బు, నా ఇష్టం. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘నా సినిమాలకు వేణు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి నాలాంటి దర్శకులందరికీ కొత్త ఉత్సాహాన్ని కలిగించిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మదన్. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు దర్శకుడు వేణు, శ్రీవిష్ణులే కన్పించారు’’ అన్నారు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి. ‘‘సినిమా చూస్తున్నంత సేపు నాకు బాలచందర్‌గారే గుర్తుకొచ్చారు’’ అని దర్శకుడు వీఎన్ ఆదిత్య అన్నారు. ‘‘ఈ సినిమా చేయకపోయుంటే జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని మిస్ అయ్యేవాణ్ణి’’ అన్నారు దేవిప్రసాద్. ‘‘ప్రతి ఒక్కరూ ఇది నా కథ, మా ఇంట్లో జరిగిన కథ అని ఓన్ చేసుకుంటున్నారు. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘రివ్యూస్ బాగున్నాయి. కొన్ని విమర్శలూ ఉన్నాయి. అవన్నీ సరిదిద్దుకొని తర్వాత ఓ మంచి సినిమా తీయడానికి కృషి చేస్తా’’ అన్నారు వేణు ఊడుగుల. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామెన్ రాజ్ తోట, ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ అధినేత నారాయణరావు, నిర్మాతలు రాజ్ కందుకూరి, బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు..! బానిసలెవరు?
-
టీడీపీపై దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్
-
చంద్రబాబుకు దర్శక, నిర్మాత చురకలు
హైదరాబాద్ : నంది అవార్డులు తీసుకోలేదు.. పంచుకున్నారని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. నంది అవార్డులు తీసుకున్నపుడు గొడవ చేశామన్నారు కదా.. ఆ నంది అవార్డు కమిటీలు వేసింది కూడా మీరే(చంద్రబాబు నాయుడు)కదా అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తమరు పంచిన నంది అవార్డులు తీసుకున్న వారు ఈ విషయంపై ఎందుకు స్పందించరని అడిగారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు తమరి పక్కనే ఉన్నారు కదా వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? మీరే (టీడీపీ నాయకులనుద్దేశించి) లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు. తాము రాత్రి, పగలు కష్టపడితే పది మందికి అన్నం దొరుకుతున్నదని తెలియజేశారు. తమరికి ప్రత్యేక హోదా విషయం కంటే జగన్, మోదీ, పవన్ ఎక్కడ కలుస్తారనే విషయం భయంగా ఉందని, అందుకే సినిమా వాళ్ల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు కానీ అప్పటి నుంచీ మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సూటిగా అడిగారు. సినిమా వాళ్ల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినపుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని గట్టిగా ప్రశ్నించారు. -
డ్రగ్స్‌పై రాజీ అతి పెద్ద నేరం..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు రహస్యంగా ఉత్తరాలు ఇచ్చేసి తీరా విభజన జరిగిపోయాక అర్ధరాత్రి విభజించారు, ఆంధ్రుల పొట్టకొట్టారు అని ఆరోపిస్తే ఎలా? పైగా విభజన తర్వాత ఇంత అవినీతికర పాలనను చూడలేదు. చేతులు తడపందే ఏపీలో ఇప్పుడు ఏదీ జరగదని అధికారులే చెబుతున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో తప్పితే హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో అయినా ప్రజలు నడిచిగానీ, కారులో కానీ వెళ్లే చాన్స్ ఉందా? బాబు చేసిన అభివృద్ధి ఇదేనా? దేశమంతా కోట్లమంది డ్రగ్స్‌కు అలవాటు పడినప్పడు సినీ పరిశ్రమను మాత్రమే కౌంటర్ చేయడం తప్పని టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అంటున్నారు. డ్రగ్స్ తీసుకోవడం అతి పెద్ద నేరం కాగా దానికి క్షమాపణలు చెప్పడం, కాస్త సరళంగా వ్యవహరించమనడం ఇంకా పెద్ద నేరమని అన్నారు. పైగా సోర్సును బట్టే సిట్ విచారణ జరిగి ఉంటే, దర్శకుడు పూరీ జగన్నాథ్ క్యాంప్‌కు చెందిన వారినే ఎందుకు విచారించారని ప్రశ్నించారు. ఆడవారు ఇళ్లల్లోనే ఉండటం అనేది ఇప్పుడు పోవడంతో సమాన హక్కులూ వచ్చాయనీ.. దురలవాట్లకు సంబంధించి ఆడా మగా తేడా లేదంటున్న తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... సినిమారంగం అప్పుడెలా ఉండేది, ఇప్పుడెలా ఉంటోంది? అప్పట్లో కలెక్టివ్‌గా టీమ్ వర్క్ ఉండేది. ఇప్పుడు అది పోయింది. అప్పుడు కూడా హీరో, హీరోయిన్ని కేంద్ర స్థానంలో ఉంచి సినిమాలు తీసేవారు. ఇప్పుడయితే హీరో కోసమే సినిమాలు తీస్తున్నారు. మా రోజుల్లో చిన్న సినిమాలను మా ఇష్టమొచ్చిన హీరో, హీరోయిన్లను కొత్తవారిని తీసుకుని తీసేవారం. ఇప్పుడు అలా కాదు. ఫలానా హీరో సినిమా సూపర్ హిట్ అయితే దాన్ని కొత్తవాళ్లను పెట్టి కాపీ చేస్తున్నారు. ఒకరకంగా డూప్లికేట్ సినిమాలన్నమాట. ట్రెండ్ నడుస్తోంది.. అలాగే వెళ్లాలి అనేది ఇప్పుడు ఫ్యాషన్. నష్టాలపై చిత్ర పరిశ్రమలో ఒక ఏర్పాటు, విధివిధానాలు పెడితే మంచిదేమో కదా? అలాంటి కన్వెన్షన్లు ఏవీ పెట్టకూడదు. ఇవ్వకూడదు. వ్యాపారం వ్యాపారమే. ఏ సిని మాకయినా ఒక అంచనా ఉంటుంది. బాహుబలి–2 చాలాబాగా ఆడింది. వేల కోట్లు బిజినెస్ చేసింది. రేపు ఇంకొకరెవరైనా అంత ఖర్చు పెట్టి సినిమా తీస్తానంటే అంత బిజినెస్ ఏ సినిమా కూడా చేయదు. టాలీవుడ్లో సినిమా బిజినెస్ వందకోట్లు, ఇప్పుడయితే మరో 20 కోట్లు ఎక్కువగా బిజినెస్ చేయవచ్చేమో.. కానీ బాహుబలి రూ.2 వేల కోట్లు బిజినెస్ చేసింది కాబట్టి నాకు కూడా 2 వేల కోట్లు ఇవ్వు అని నేను అమ్మితే కొనుక్కున్నవాడు ఏమైపోతాడు? రేపు మరో పెద్ద హీరో సినిమాను 500 కోట్లకు కొంటాను అని ఎవడైనా సిద్ధపడితే అది వాడి తప్పు అంతే. డ్రగ్స్ కేసు ఇండస్ట్రీ మీద వేసిన ప్రభావం ఎంత, మీ స్పందన ఏంటి? చిత్రపరిశ్రమపై డ్రగ్స్ ప్రభావం ఉండదు. దేశంలో డ్రగ్స్ తీసుకునేవారు కోట్లమంది ఉంటున్నారు. సినీ పరిశ్రమలో కొన్ని వేలమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉండవచ్చు. ఇలాంటి వారివల్ల సినీ పరిశ్రమపై ప్రభావం ఉండదు. సినీ పరిశ్రమ క్షమాపణలు చెప్పడం, వర్మ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయం? క్షమాపణలు చెప్పలేదు కానీ ఈ కేసులో కాస్త సరళంగా వెళ్లమని కోరినట్లున్నారు. అది కూడా తప్పే. అలా ఎందుకడగాలి? తమ్మారెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని తెలిస్తే ఫిలిం చాంబర్ వెంటనే ఈ భరద్వాజను లోపల వేయండి అని చెప్పాలి. అతడు మా చాంబర్‌కు ప్రెసిడెంటుగా చేశాడు. కొంచెం చూసీ చూడనట్లుగా ఉండండి అని చెప్పకూడదు. డ్రగ్స్ కేసులో ఇదే జరిగి ఉంటే తప్పు. మావాళ్లను చూసీ చూడనట్లుగా ఉండండి, వదిలేయండి అని ఆ ఉత్తరంలో ఉంటే మాత్రం అది క్రైమ్ అండి. చాలా పెద్ద క్రైమ్. సిట్ విచారణ ప్రాతిపదిక సరైందేనా? నాకు తెలిసినంతవరకు ఫిలిం చాంబర్ పెద్దలు క్షమాపణ చెప్పలేదు. ఒక వేళ చెప్పి ఉంటే తప్పు. కాస్త ఉదారంగా చూడమని చెప్పి ఉన్నా తప్పే. అదే సమయంలో డ్రగ్స్ కేసు విచారణ తీరు కూడా తప్పే. ఎందుకంటే సిట్ విచారించిన వారిలో రవితేజ, చార్మితోసహా తొమ్మిదిమంది పూరీ జగన్నాథ్ క్యాంపులో ఆఫీసులో కూర్చునేవారే. అంటే ఇంత పెద్ద చిత్రపరిశ్రమలో పూరీ జగన్నాథ్ తాలూకూ మనుషులే, ఆ క్యాంప్‌కు సంబంధించినవారే డ్రగ్స్ తీసుకుంటున్నారా అనేది నా ప్రశ్న. సోర్సును బట్టే చేసి ఉంటే మిగతావారిని ఎందుకు వదిలేశారు? నటులే కాదు నటీమణులకు డ్రగ్స్ ఎలా అలవాటు అవుతోంది? మీరు హైటెక్ సిటీకి వెళ్లండి. సాయంత్రంపూట రోడ్డుమీదే అమ్మాయిలు సిగిరెట్లు తాగుతూ మందు బాటిళ్లు పట్టుకుని నడిచి వెళుతుంటారు. వాళ్లకు అలవాటు అయిందా అంటే మనం ఏం చెబుతాం? దురలవాట్లకు సంబంధించి ఆడా మగా అని లేదండి. సమాజంలో చాలా తేడా వచ్చేసింది. మన బాల్యంలోలాగా ఆడవారు ఇళ్లల్లోనే ఉండటం అనేది ఇప్పుడు పోయింది. సమాన హక్కులూ వచ్చాయి వాటితో వాటు ఇలాంటి మార్పులు కూడా వచ్చేశాయి. లిబరలైజ్ అయ్యారు. వాళ్ల హక్కు వాళ్లది. వైఎస్ఆర్, బాబు పాలనలో మీరు గమనించిన పోలికలు, తేడాలు ఏమిటి? ఇద్దరికీ మధ్య పోలికలు లేవండి. నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడాలే ఉన్నాయి. మొదట్లో చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. తనకు విజన్ ఉంది. కానీ ఆయన మనుగడకోసమే ఉండే విజన్ అది. సమాజాన్ని బాగు చేయడానికి విజన్ ఉంటుంది. సమాజాన్ని ఆకర్షించడానికి విజన్ ఉంటుంది. చంద్రబాబుది మాత్రం ఆకర్షణా విజన్ అని చెప్పొచ్చు. తొలిసారి ఆయనతో భేటీలో నాతో అయిదుగంటలపాటు మాట్లాడారు. ఆయన మాటలని చూస్తే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప రాష్ట్రం లేదనిపించింది. బాబు మాటలు వింటున్నంత సేపు ఇలాంటి సీఎంకి మనం చాకిరీ చేయకపోతే జీవితమే వేస్ట్ అనిపించింది. అంతగా నమ్మేసి పొద్దున్న ఆరుగంటలకు ఆయన కార్యాలయానికి వెళితే రాత్రి 12 గంటలకు బయటపడేవాడిని. బాబు ఇంట్లోనే పడి ఉండేవాళ్లం. గంటలు గంటలు చెబుతుంటారు కాని దాని అమలు మాత్రం కనబడేది కాదు. ఈరోజుకి కూడా ఆయన మాట్లాడితే హైదరాబాద్‌ను డెవలప్ చేశానంటారు. అంత అభివృద్ధి జరిగివుంటే ఒక హైటెక్ సిటీ ప్రాంతంలో తప్పితే నగరం మొత్తం మీద ఏ అభివృద్ధి ప్రాంతంలో అయినా ప్రజలు నడిచిగానీ, కారులో కానీ వెళ్లే చాన్స్ ఉందా? ఎవరికి వాళ్లు ఇష్టానుసారం తోచిన చోట నిర్మాణాలు చేసుకుంటూ పోతుంటే ఇక హైదరాబాద్‌ను నేనే డెవలప్ చేశానంటే కుదురుతుందా? ప్రజలకోసం కాదు, బాబు కోసం విజన్ అంటున్నారు, స్పష్టంగా చెబుతారా? ఎన్టీఆర్‌ను గద్దె దింపాక చంద్రబాబుతో నాలుగేళ్లు కొనసాగాను. ఆ నాలుగేళ్లలో ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు. ప్రయత్నాలు కొన్ని జరిగాయి. స్లో అయి ఉంటే క్షమించవచ్చు. కానీ దేన్నయితే తాను మాటల్లో వ్యక్తం చేశారో, దాంట్లో 50 శాతం అయినా పని జరగాలి. జరగలేదు. అదే వైఎస్ఆర్ విషయానికి వస్తే సినీ పరిశ్రమకోసమో, ఫిలిం చాంబర్ కోసమో ఫలానా సహాయం చేయాలి అని చెప్పి మేం వెనక్కి వస్తుండగానే దారిలోనే ఫోన్ చేసి ఎలాంటి సహాయం కావాలి అని అడిగేవారు. అంటే ఇచ్చిన మాటకు ఫాలో అప్ చేసేవారు. ఏదైనా సహాయం కోరి ఆయన్ని కలిసి కాగితం ఇచ్చి తిరిగి వస్తే ఆ పని కచ్చితంగా పూర్తయ్యేది. అంత నమ్మకాన్ని ఆయన కలిగించారు. చంద్రబాబు పాలనలో అలాంటిది చూడనేలేదు. నేను బాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడిని. కాని ఆయన తన నీడను కూడా నమ్మరు. అంత భయం. అవతలివాళ్లు అడిగారంటే మంచికోసమే అడిగి ఉంటారు అని నమ్మి దాన్ని పూర్తి చేయడం వైఎస్సార్ శైలి అయితే. ఈ పని చేస్తే ఏమవుతుందో, ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని ఒకటికి పదిసార్లు అనుమానించే తత్వం చంద్రబాబుది. మొత్తానికి ఆ పని అయ్యేది కాదు. ఫలానా పని కావాలని అడిగితే ఇది కుదుర్తుంది. ఇది కుదరదు అని వైఎస్సార్ స్పాట్లోనే చెప్పేసేవారు. కాని చంద్రబాబు అయితే ఎంత చిన్నా పెద్దా విషయంలో కూడా తేల్చి చెప్పరు. అలా పని జరిగే ప్రాసెస్ చాలా లేటు అయ్యేది. చాలాసార్లు జరిగేది కాదు కూడా. విభజన సమయంలో చంద్రబాబు వైఖరిపై మీ అభిప్రాయం? చాలా అసహ్యంగా ఉంటుంది. రెండు మూడు సార్లు తెలంగాణకు అనుకూలంగా ఉత్తరాలు ఇచ్చేసి తర్వాత విభజన జరిగిపోయాక అర్ధరాత్రి విభజించారు, పొట్టకొట్టారు అని ఇతరులపై ఆరోపిస్తే ఎలా.. పైగా విభజన తర్వాత ఇంత అవినీతికర పాలన నేనెన్నడూ చూడలేదు. చిన్న పనికావాలన్నా చేతులు తడపందే ఏపీలో ఇప్పుడు జరగదని అధికారులే చెబుతున్నారు. (తమ్మారెడ్డి భరద్వాజతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/eCkgR4 https://goo.gl/wZLqoZ