train services
-
నేటి నుంచి టాయ్‌ట్రైన్ పునఃప్రారంభం
సాక్షి, ముంబై: వర్షాకాలం నేపథ్యంలో సుమారు నాలుగు నెలలుగా నిలిచిపోయిన మాథేరన్ టాయ్‌ట్రైన్ (మినీ రైలు) సేవలు పునఃప్రారంభం కానున్నాయి. నవంబరు 4వ తేదీ శనివారం నుంచి ఈ ట్రైన్ ప్రారంభించేందుకు సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నేరుల్–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్ రెండేసి చొప్పున.. మొత్తం నాలుగు సర్విసులు నడపనున్నారు. మరోవైపు మార్పులు చేసిన సమయాలనుసారం అమన్ లాడ్జీ–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్ మార్గాల్లో ఆరు చొప్పున మొత్తం 12 సర్విసులు, శని, ఆదివారాల్లో అదనంగా రెండేసి చొప్పున ప్రత్యేక టాయ్ రైళ్లను నడపనున్నారు. వర్షాకాలంలో నిలిపివేత.. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షా కాలం ప్రారంభం కాగానే టాయ్ ట్రైన్ సేవలు నిలిపివేస్తారు. ఆ తరువాత మళ్లీ అక్టోబరు 15వ తేదీ నుంచి సర్విసులు పునఃప్రారంభిస్తారు. కానీ ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా పునఃప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతంలో ఒకటైన మాథేరాన్‌ను సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రైలులో కొండల మధ్య నుంచి ప్రయాణిస్తూ.. జలపాతాలు, పచ్చదనాన్ని చూసేందుకు ఇష్టపడతారు. నేరుల్ నుంచి 21 కి.మీ. దూరంలో కొండపై ఉన్న మాథేరాన్ చేరుకోవాలంటే రోడ్డు మార్గం కంటే మినీ రైలులో వెళ్లే ఆనందమే బాగుంటుందని పర్యాటకులు ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంటుంటారు. రెలు మార్గం దాదాపు 90 శాతం కొండ అంచుల మీదుగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో రైల్వే ట్రాక్ కిందున్న మట్టి కొట్టుకుపోవడం, కొండ చరియలు విరిగిపడడం, వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యేంత వరకు రైలు సేవలు పూర్తిగా నిలిపివేస్తారు. ఈ సమయంలో పర్యాటకులు రోడ్డు మార్గం మీదుగా మాథేరాన్ చేరుకోవల్సిందే. ఇప్పుడు టాయ్ ట్రైన్ సేవలు ప్రారంభమవుతుండటంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
రేపటి నుంచి సిద్దిపేటలో రైలుకూత
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో రెండు ప్యాసింజర్ రైళ్లు మంగళవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటతో పాటు గజ్వేల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాచగిరి (నాచారం), కొమురవెల్లి తదితర ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. తొలుత కాచిగూడ–సిద్దిపేట మధ్య రైళ్లు తిప్పాలని భావించినా, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది సికింద్రాబాద్‌కు వస్తున్నందున, సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్–సిద్దిపేట (నిడివి 116 కిలోమీటర్లు) డెమూ రైలుచార్జీ :రూ.60 హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట ట్రిప్పులు ఇలా... సిద్దిపేటలో రైలు(నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు రాత్రి 8.40 గంటలకు చేరుకుంటుంది. అయితే ఉదయం సిద్దిపేట బదులు సికింద్రాబాద్ నుంచే రైలు బయలుదేరేలా చూడాలని స్థానిక నేతలు రైల్వేకు లేఖ రాశారు. దీనికి రైల్వే సమ్మతిస్తే ఈ వేళలు అటూ ఇటుగా మారుతాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సుచార్జీ రూ.140. ప్రయాణ సమయం రెండున్నర గంటలు. రైలులో ప్రయాణ సమయం కాస్త ఎక్కువగా ఉన్నా, చార్జీ మాత్రం బస్సుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉంది. రైలులో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రానుపోను రూ.120 అవుతుండగా, పాస్ తీసుకుంటే రూ.90 ఉండొచ్చు. కృష్ణా టు రాయచూర్ రైలు రాకపోకలు షురూ మహబూబ్‌నగర్–మునీరాబాద్ (కర్ణాటక) మధ్య 234 కి.మీ. నిడివితో నిర్మించే రైల్వే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా వరకు పనులు పూర్తి కావటంతో కొత్త రైలు సర్విసు ప్రారంభమైంది. కాచిగూడ–బెంగుళూరు మార్గంలో ఉన్న దేవరకద్ర నుంచి కొత్తలైన్ మొదలు, అటు సికింద్రాబాద్–వాడీ మార్గంలో ఉన్న కర్నాటక సరిహద్దు స్టేషన్ అయిన కృష్ణాకు ఇది అనుసంధానమైంది. దీంతో కాచిగూడ నుంచి కృష్ణా స్టేషన్ మీదుగా కర్ణాటకలోని రాయచూరు వరకు ప్యాసింజర్ డెమూ రైలు సర్విసును ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కృష్ణా నుంచి కొత్త రైలు బయలుదేరి కాచిగూడకు చేరుకుంది. సోమవారం నుంచి కాచిగూడ–రాయచూరు మధ్య ప్రారంభమవుతుంది. రైలుచార్జీ: 85.. రోజుకు ఒకటే ట్రిప్పు కాచిగూడ–రాయచూరు (నిడివి 221 కిలోమీటర్లు) ప్రస్తుతం స్పెషల్ సర్వీసుగా ఉన్నందున ఎక్స్‌ప్రెస్ చార్జీలున్నాయి. రెగ్యులర్ సర్విసుగా మారిన తర్వాత ఆర్డినరీ చార్జీలు అమలులోకి వస్తాయి. అప్పుడు చార్జీ రూ.50 ఉంటుంది.హాల్ట్‌స్టేషన్లు: కాచిగూడ, మలక్‌పేట, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్, తిమ్మాపూర్, కొత్తూరు, షాద్‌నగర్, బూర్గుల, బాలానగర్, రాజాపురా, గొల్లపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి, యెనుగొండ, మహబూబ్‌నగర్, మన్యంకొండ, దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా, చిక్సుగుర్, రాయచూరు రైలు (నంబరు:07477) వేళలు ఇలా కాచిగూడలో ఉదయం 9.40కి బయలు దేరి 11.50గంటలకు మహబూబ్‌నగర్, 12.14కు దేవరకద్ర, మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా, 3 గం.కు రాయచూరు చేరుకుంటుంది. తిరిగి రాయచూరులో మధ్యాహ్నం.3.30 గంటలకు రైలు(నంబరు:07478)బయలుదేరి 3.49కి కృష్ణా, 5.29కి దేవరకద్ర, 6.05కు మహబూబ్‌నగర్ రాత్రి 9.10గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. -
సిద్దిపేటకు రైలు.. తిరుపతి, బెంగళూరు, ముంబయికి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: ఆగస్టులో సిద్దిపేటకు రైలు సర్విసులు ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా జూలై చివరి నాటికి లేదా ఆగస్టు మొదటి వారాంతానికి సిద్దిపేట వరకు రైల్వే లైన్ సిద్ధం కాబోతోంది. ప్రస్తుతం సిద్దిపేట సమీపంలోని దుద్దెడ వరకు పూర్తిస్థాయి ట్రాక్ ఏర్పాటు పూర్తికాగా, అక్కడి నుంచి సిద్దిపేట చేరువ వరకు తాత్కాలిక ట్రాక్ ఏర్పాటు పూర్తయింది. సిద్దిపేట బైపాస్ వరకు ఆ పనులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన పట్టాలు ఏర్పాటు చేస్తారు. ఆ వెంటనే రైల్వే సేఫ్టీ కమిషనర్ దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ట్రాక్ సామర్థ్యాన్ని పరీక్షించి అనుమతి ఇవ్వగానే రైలు సేవలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్పుల్.. ఎక్స్‌ప్రెస్‌లు.. గజ్వేల్ వరకు లైన్ నిర్మాణం పూర్తయిన వెంటనే గతేడాదే అక్కడి నుంచి నగరానికి ప్యాసింజర్ రైలు నడపాలని నిర్ణయించారు. కానీ కోవిడ్ ఆంక్షలతో ఇందుకు ఆటంకం ఎదురయ్యింది. తర్వాత ప్రారంభించాలని భావించినా, గజ్వేల్ నుంచి నిత్యం నగరానికి ఓ రైలుకు సరిపడా ప్రయాణికులు ఉండరన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో ఆ ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. ఇప్పుడు సిద్దిపేట నుంచి సరిపడ సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని నిర్ధారించుకున్న అధికారులు.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్పుల్ రైలు ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. సిద్దిపేట నుంచి కాచిగూడకు ఆ రైలు నడుస్తుందని చెబుతున్నారు. ఇక తిరుపతికి, బెంగళూరుకు గాని ముంబయికి గాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా సిద్దిపేట నుంచి నడపాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతున్న కొన్ని ఎక్స్‌ప్రెస్‌లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే, కరీంనగర్ ప్రయాణికులకు కూడా వెసులుబాటుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సిద్దిపేట స్టేషన్ వద్ద ఐదు లైన్లు.. సిద్దిపేటలో రైల్వే స్టేషన్ భవనం వేగంగా సిద్ధమవుతోంది. దాంతోపాటు సరుకు రవాణాకు భారీ గూడ్సు యార్డును నిర్మిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఐదు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి మెయిన్ లైన్, రెండు లూప్లైన్లు, ఒకటి గూడ్సు లైను, ట్రాక్ మెయింటెనెన్స్‌కు వినియోగించే ట్రాక్ మిషన్ కోసం సైడింగ్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్‌ఫామ్స్ 750 మీటర్ల పొడవుతో సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి సరుకు రవాణా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్న రైల్వే శాఖ, అందుకోసం దాదాపు 800 మీటర్ల పొడవుతో గూడ్సు షెడ్డును ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే గజ్వేల్‌లో 600 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన సరుకు రవాణా యార్డు బాగా ఉపయోగపడుతోంది. ఈ ప్రాంతానికి కావాల్సిన ఎరువులు రైలు ద్వారానే వస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి ధాన్యం క్రమం తప్పకుండా ఎగుమతి అవుతోంది. సిద్దిపేటలో కూడా సరుకు రవాణా ప్రాంగణం అందుబాటులోకి వస్తే ధాన్యం తరలింపు ఊపందుకోనుంది. -
పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు
సాక్షి, హైదరాబాద్/లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ► సికింద్రాబాద్–అనకాపల్లి (07435/07436) ప్రత్యేక రైలు ఈ నెల 13న సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 14న సాయంత్రం 6.30 గంటలకు అనకాపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–నర్సాపూర్ (07489) (వయా గుంటూరు, విజయవాడ) ప్రత్యేక రైలు 12వ తేదీ (నేడు) రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ► సికింద్రాబాద్–తిరుపతి (07437) స్పెషల్ ట్రైన్ 12వ తేదీ సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ► కాచిగూడ–కర్నూల్ సిటీ (17435/17436) డెము రైలు 12వ తేదీ సాయంత్రం 5.35 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి రాత్రి 11.40 గంటలకి కర్నూలు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 13వ తేదీ ఉదయం 7 గంటలకు కర్నూలులో బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. -
ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న మరిన్ని సర్వీసులు
-
కూకట్పల్లి నుంచి కోకాపేటకు లైట్ ట్రైన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రహదారులపై ఇక రైలు కూతలు వినిపించనున్నాయి. బస్సు ప్రయాణం మాదిరిగానే రోడ్డుపైనా ఏర్పాటు చేసే ట్రాక్‌ల మీదుగా వచ్చే లైట్ ట్రైన్‌ను ఎక్కేసి ఎంచక్కా అనుకున్న సమయానికే గమ్యం చేరుకునే ‘లైట్ ట్రైన్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్’నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. కేపీహెచ్‌బీలోని జేఎన్టీయూ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి కోకాపేట వరకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు అనుబంధమైన యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఉమ్టా) అధ్యయనం చేస్తోంది. దాదాపు 28 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు సా«ధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. గత మూడు నెలల నుంచి దీనిపై అధ్యయనం చేస్తున్న సిబ్బంది సాధ్యమైనంత తొందర్లోనే ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఉపయోగాలేంటంటే.. నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినా మెట్లెక్కి పైకెళ్లి టికెట్ తీసుకొని ఆ రైలు ఎక్కాలంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. అదే లైట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి వస్తే నేరుగా రహదారిపై బస్సులు ఎక్కినట్టుగానే ప్రయాణికులు ఆయా స్టాప్ల వద్ద టికెట్లు తీసుకొని రైలు రాగానే ఎక్కేయొచ్చు. బస్సు మాదిరిగానే వీటికి స్టాప్‌లు ఉండటంతో గమ్యస్థానంలో అనుకున్న సమయానికి దిగేయవచ్చు. ముఖ్యంగా నగరవాసుల సమయం మరింత ఆదా కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ట్రాఫిక్ తిప్పలుండవు.. అలాగే ఈ సేవల వల్ల కాలుష్యం తగ్గుతుంది. ఆయా మార్గాల్లో ఉన్న ఆస్తుల విలువ పెరగడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు మరింత ఊపందుకునే ఆస్కారముంటుంది. దీంతో పాటు పేదలు కూడా ఎక్కేలా తక్కువ చార్జీలకే ఈ సేవలు అందుబాటు లో ఉండే అవకాశముంది. ఇటు పర్యాటకంగా మరింత అభివృద్ధి బాటలు పట్టే చాన్స్ ఉంది. ఏయే మార్గాల్లో...? ఐటీ కారిడార్‌కు నెలవైన ప్రాంతాల్లో ఈ లైట్ ట్రైన్ సేవల దిశగా ఉమ్టా సిబ్బంది అధ్యయనం చేస్తోంది. కేపీహెచ్‌బీ నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఓఆర్ఆర్ మీద నుంచి కోకాపేట వరకు ఈ రవాణా మార్గం అనువుగా ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు 28 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారి కుడివైపున మీటర్ గేజ్ ఏర్పాటు చేసి బ్యాటరీ ఆపరేటింగ్ లేదంటే విద్యుత్ సరఫరాతో ఈ రైలును నడపనున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది ప్రయాణికులు ఈ రైలులో ఎక్కి హ్యాపీగా జర్నీ చేయవచ్చని అధికారులు అంటున్నారు. బస్సులు, ఇతర వాహనాల మాదిరిగానే రోడ్డుపై లైట్ ట్రైన్ వెళ్తుందని, ఈ సే వలు అందుబాటులోకి వస్తే విశ్వనగరంగా హైదరాబాద్‌కు మరింత ప్రతిష్ట పెరుగుతుందని చెబుతున్నారు. చదవండి: స్టాఫ్‌నర్స్ పోస్టుల వెయిటేజీలో అవకతవకలు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: మేయర్ -
హైదరాబాద్–మహబూబ్‌నగర్.. ‘డబుల్ లైన్’ జూన్‌లో!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు, తిరుపతిలకు హైదరాబాద్ నుంచి త్వరలో కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్–మహబూబ్‌నగర్ మధ్య రెండో రైలు మార్గాన్ని వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని తాజాగా రైల్వే టార్గెట్‌గా పెట్టుకోవటమే దీనికి కారణం. ఇది బెంగళూరుకు ప్రధాన మార్గం. కానీ హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ప్రస్తుతం సింగిల్ లైన్ మాత్రమే ఉంది. ఆ తర్వాత డోన్ నుంచి రెండు లైన్లు ఉన్నాయి. సింగిల్ లైన్ కావటంతో ఈ మార్గంలో ఎక్కువ రైళ్లు నడిపే అవకాశం లేకుండా పోయింది. అందుకే రాజధాని లాంటి ప్రీమియం కేటగిరీ రైళ్లను మహబూబ్‌నగర్ మీదుగా కాకుండా వికారాబాద్, గుంతకల్లు మీదుగా నడుపుతున్నారు. ఆ మార్గంతో పోలిస్తే మహబూబ్‌నగర్ మీదుగా బెంగళూరు 50 కి.మీ. తక్కువ దూరం అవుతుంది. ఇక తిరుపతికి కూడా ఇదే ప్రధాన మార్గం కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతికి ఐదు ప్రధాన రైళ్లు నడుస్తుండగా, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ఒక్కోదాన్ని ఒక్కో రూట్లో నడుపుతున్నారు. కాజీపేట మీదుగా ఒకటి, నడికుడి మీదుగా రెండోది, వికారాబాద్ మీదుగా మూడోది, వికారాబాద్ నుంచి పాకాల మీదుగా నాలుగోది, మహబూబ్‌నగర్ మీదుగా ఐదోది నడుస్తున్నాయి. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ పని పూర్తయితే ఈ మార్గం మీదుగా తిరుపతికి మరికొన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. తిరుపతికి డిమాండ్ అధికంగా ఉన్నందున అది లాభదాయక ప్రాంతంగా రైల్వే భావిస్తోంది. అదనంగా మరికొన్ని నడిపేందుకు వెంటనే సంసిద్ధత వ్యక్తం చేస్తుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ‘షటిల్ సర్వీసు’లతో సౌలభ్యం హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ 100 కి.మీ. లోపే ఉంటుంది. దీంతో ఎంతోమంది ఉద్యోగులు, ఇతర చిరువ్యాపారులు నిత్యం హైదరాబాద్‌కు వచ్చిపోతుంటారు. కానీ సింగిల్ లైన్ కావటంతో నగరం నుంచి అక్కడికి ఎక్కువ రైళ్లు నడిపే అవకాశం లేకుండా పోయింది. సాధారణ ఎక్స్‌ప్రెస్‌రైళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించేవారు వందలమంది ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నగరం నుంచి మహబూబ్‌నగర్‌కు షటిల్ సర్వీసులు నడపాలన్న డిమాండ్ ఉంది. డబ్లింగ్ పని పూర్తి కాగానే కొన్ని షటిల్ సర్వీసులు నడిపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇండస్ట్రియల్ క్లస్టర్స్‌కు ఊతం.. షాద్‌నగర్, జడ్చర్లలు క్రమంగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్‌గా అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల మౌలిక వసతుల్లో రైల్వే అనుసంధానం కూడా కీలకమైంది. సరుకు తరలింపు, కార్మికుల రాకపోకలకు రైల్వే మార్గం చాలా అవసరం. ఈ రకంగా కూడా ఈ డబ్లింగ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. రోడ్డును ఆనుకున్నట్టుగా రైల్వే మార్గంతో పరిశ్రమలకు చాలా ఉపయోగం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తాజా బడ్టెట్‌లో ఈ డబ్లింగ్ పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో ఆ ప్రాజెక్టు పూర్తి కానుంది. సత్తుపల్లికీ ప్రాధాన్యం.. రైలు చార్జీల్లో సబ్సిడీ భాగం ఎక్కువగా ఉండటంతో బస్సు చార్జీలతో పోలిస్తే రైలు టికెట్ రుసుము తక్కువగా ఉంటుంది. ఈ సబ్సిడీల వల్ల రైల్వే భారీగా నష్టాలు మూటగట్టుకుంటోంది. కానీ సరుకు రవాణా ద్వారా వచ్చే లాభాలతో ఆ నష్టాలను అధిగమిస్తోంది. అందుకే మోదీ ప్రభుత్వం వచ్చాక సరుకు రవాణాకు చాలా ప్రాధాన్యం ఇస్తోంది. 2010లో మంజూరై, భద్రాచలం–సత్తుపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త లైన్‌కు పూర్తిగా బొగ్గు రవాణాకు ఉద్దేశించింది. సింగరేణి సంస్థ పాత బొగ్గు గనుల్లో నిల్వలు తగ్గిపోతుండటంతో కొత్తవాటిని అన్వేషిస్తోంది. ఈక్రమంలో సత్తుపల్లి వైపు కొత్త గనులు తవ్వనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బొగ్గు రవాణాకు కొత్త లైన్ కావాలని రైల్వేను కోరింది. భూసేకణ భారం రైల్వే తీసుకుంటే లైన్ నిర్మాణ వ్యయాన్ని తాను భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకు అంగీకరించిన రైల్వే 54 కి.మీ. నిడివి గల ఈ లైన్‌ను రూ.704 కోట్ల వ్యయంతో సంయుక్త ప్రాజెక్టుగా నిర్మిస్తోంది. గత బడ్జెట్లో ఏకంగా రూ.520 కోట్లు కేటాయించటంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సంవత్సరంతో పనులు పూర్తి కానుండటంతో మరో రూ.267 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం భద్రాచలం రోడ్ వరకే నడుస్తున్న రైళ్లు ఇక సత్తుపల్లి వరకు చేరుకోవచ్చు. బొగ్గు రవాణాకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. భవిష్యత్తులో సత్తుపల్లి నుంచి పొడిగించి ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు వరకు దాన్ని నిర్మించాలన్నది ప్రతిపాదన. అప్పుడు ప్రయాణికుల రైళ్లకు కూడా ఇది ప్రధాన మార్గం అవుతుంది. ప్రయారిటీ లిస్ట్‌లో ఈ రెండు.. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం కొన్ని ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసే లక్ష్యంగా ప్రయారిటీ జాబితాను రైల్వే రూపొందించుకుంది. మొత్తం 54 ప్రాజెక్టులకు గాను అందులో తెలంగాణ నుంచి పై రెండు చోటు దక్కించుకున్నాయి. ఈ సంవత్సరం జూన్‌నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
2022 మార్చిలో... సిద్దిపేటకు రైలు కూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ పట్టణంగా ఎదిగిన సిద్దిపేటకు వచ్చే సంవత్సరం మార్చి నాటికి రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాజధాని నగరంతో ఈ కీలక పట్టణం రైల్వే పరంగా అనుసంధానం కానుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉన్నప్పటికీ, ప్రధాన రైల్వే మార్గంలో లేకపోవటం సిద్దిపేటకు పెద్ద లోపం. ఇప్పుడు మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పుణ్యాన ఆ లోపం తీరుపోనుంది. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతుండటంతో వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్దిపేటకు రైలు సేవలు ప్రారంభించాలని తాజాగా రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులో గజ్వేల్ వరకు పూర్తిస్థాయి పనులు పూర్తి కావటంతో ప్రయోగాత్మకంగా రైలు నడిపి లోపాలు లేవని నిర్ధారించుకున్నారు. దీనికి రైల్వే సేఫ్టీ కమిషనర్ కూడా అనుమతి ఇవ్వటంతో రెగ్యులర్ సర్వీసుల్లో భాగంగా సిబ్బందితో ఓ రైలు నడుపుతున్నారు. లాక్డౌన్ నిబంధనల్లో మరిన్ని సడలింపులు ఇస్తూ సాధారణ రైలు సేవలను పెంచితే గజ్వేల్ వరకు నిత్యం ఓ సర్వీసు నడపాలని నిర్ణయించారు. త్వరలో అది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ సంవత్సరం జూన్ నాటికి కొడకండ్ల వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, అది కూడా సిద్ధమైతే గజ్వేల్ మీదుగా అక్కడి వరకు రైలు సేవలు పొడిగించాలని కూడా నిర్ణయించారు. ఇది గజ్వేల్ తర్వాత 11.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జూన్– జూలై నాటికల్లా పనులు పూర్తి చేసేలా కొత్త షెడ్యూల్ రూపొందించుకున్నారు. ఏవైనా అవాంతరాలు ఎదురై ఆలస్యం జరిగినా, సెప్టెంబరు నాటికన్నా రైలు అక్కడికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. 2023లో మరో 37.15 కి.మీ. పనులు పూర్తి చేసి సిరిసిల్ల వరకు ట్రాక్ సిద్ధం చేయాలని, 2024లో మిగతా 39 కి.మీ. పనులు పూర్తి చేసి చివరిస్టేషన్ కొత్తపల్లి వరకు పనులు చేయటం ద్వారా ప్రాజెక్టును ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా వెల్లడించారు. ఇప్పటికే వంతెనల పనులు పూర్తి మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైను ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 31 కి.మీ. దూరంలో ఉన్న గజ్వేల్ వరకు పూర్తి పనులు అయిపోయాయి. అక్కడి నుంచి దుద్దెడ మధ్య ఎర్త్‌వర్క్ చివరి దశలో ఉంది. మధ్యలో 52 చిన్న వంతెనల పనులు పూర్తయ్యాయి. పెద్ద వంతెనలు నాలుగుండగా... మూడు చివరి దశలో ఉన్నాయి. కుకునూరుపల్లి వద్ద రాజీవ్ రహదారి మీద నిర్మించాల్సిన పెద్ద వంతెన పనులు మరో నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కొడకండ్ల వద్ద కెనాల్ మీద నిర్మిస్తున్న వంతెన చివరి దశలో ఉంది. మరో వారం రోజుల్లో కొడకండ్ల వరకు రైలు ట్రాక్ పరిచే పని ప్రారంభం కానుంది. రిమ్మనగోడు– కొడకండ్ల మధ్యæ, కొడకండ్ల కెనాల్ క్రాసింగ్, వెలికట్ట, సిద్దిపేట కలెక్టరేట్ వద్ద, దుద్దెడ స్టేషన్ సమీపంలో పెద్ద వంతెనల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈమార్గానికి ఇంకా విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరు కాలేదు. దీంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి డీజిల్ ఇంజిన్ రైళ్లు నడవనున్నాయి. -
12 నుంచి మరో 80 రైళ్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో నిలిచిపోయిన మరికొన్ని రైళ్లకు రైల్వే శాఖ పచ్చ జెండా ఊపింది. ఈ నెల 12 నుంచి మరో 80 ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లలో రిజర్వేషన్ సౌకర్యాన్ని 10 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురాను న్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 230 రైళ్లు నడుస్తున్నాయి. వాటికి అదనంగా మరో 80 రైలు సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నట్టుగా రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదన్ శనివారం చెప్పారు. రైలు సర్వీసుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, మొదట్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న రైళ్లలో ఈ మధ్య కాలంలో వెయిటింగ్ లిస్టులు పెరిగిపోతున్నాయని యాదవ్ తెలిపారు. వెయిటింగ్ లిస్ట్‌లు మరింతగా పెరిగిపోతే క్లోన్ రైళ్లను కూడా నడుపుతామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్లివే.. రైల్వేశాఖ ఈ నెల 12 నుంచి నడపనున్న 80 ప్రత్యేక రైళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లివే.. సికింద్రాబాద్ – దర్భంగా (07007); దర్బంగా– సికింద్రాబాద్ (07008); బెంగళూరు – గువాహటి (02509); గువాహటి – బెంగళూరు (02510); కోర్బా – విశాఖపట్నం (08517); విశాఖ– కోర్బా (08518); హైదరాబాద్ – పర్బణి (07563); పర్బణి – హైదరాబాద్ (07564). -
బస్సులు, రైళ్లలో జర్నీకి ఝలక్ !
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.పండగలు, వరుస సెలవులు తదితర ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్లు, బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తారు. రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో దర్శనమిస్తుంది. ఇక పండగ రోజుల్లోనైతే రైలు ప్రయాణం అసాధ్యం. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ప్రతి రోజు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. సాధారణ రోజుల్లో లక్షలాది మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తుండగా ప్రస్తుతం 50 శాతం కంటేమించి ప్రయాణాలు చేయడం లేదని ఆర్టీసీ, రైల్వే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసంహైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిçన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మినహా తెలంగాణలోనిఅన్ని ప్రాంతాలకునగరం నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని వినియోగించుకునేవారి సంఖ్య మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు అందుబాటులోకి వచ్చి నెల రోజులు దాటినా ప్రయాణికుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 18 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా ఆగస్ట్ 12 వరకు సాధారణ రైళ్ల రాకపోకలను నిలిపివేయనున్నట్లు రైల్వేశాఖ తాజాగా ప్రకటించడం గమనార్హం. కరోనా ఉద్ధృతి దృష్ట్యానే రైళ్ల రాకపోకలపై నియంత్రణ కొనసాగుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. (భారత్‌లో 5లక్షలు దాటిన కరోనా కేసులు) అప్పుడు అలా.. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి నిత్యం సుమారు 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరో వందకు పైగా ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే 1.85 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. మరో లక్ష మంది ప్రయాణికులు కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరుతారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులతో పాటు అన్ని రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, ముఖ్యంగా వివిధ అవసరాల దృష్ట్యా నగరానికి వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాలకు సైతం రాకపొకలు స్తంభించాయి. దీంతో ఉద్యోగ, వ్యాపార వర్గాలు.. ప్రత్యేకించి సాఫ్ట్వేర్ నిపుణులు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వేసవి సెలవుల దృష్ట్యా బంధువుల ఇళ్లకు చుట్టపు చూపుగా వచ్చిన వారు సైతం ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఇలా.. లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ద.మ రైల్వే 18 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. మొదట్లో బెంగళూరు– న్యూఢిల్లీ, సికింద్రాబాద్–న్యూఢిల్లీ మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బెంగళూరు– సికింద్రాబాద్, ముంబై– సికింద్రాబాద్, హైదరాబాద్– న్యూఢిల్లీ, తిరుపతి– ఆదిలాబాద్, సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– విశాఖ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 18 ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతిరోజు 1.85 లక్షల మంది ప్రయాణికులు ఒక్క సికింద్రాబాద్ నుంచే రాకపోకలు సాగించగా ప్రస్తుతం కేవలం 25 వేల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. ‘ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి రైళ్లు అందుబాటులో లేకపోవడం ఒక్కటే కారణంగా భావించలేం. కోవిడ్ కారణంగా చాలా మంది రాకపోకలు సాగించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం బెర్తుల సామర్థ్యం మేరకు మాత్రం ప్రయాణికులు బయలుదేరుతున్నారు. సాధారణ రద్దీలో ఇది 50 శాతం మాత్రమే. ప్రయాణికుల రాకపోకలు సాధారణ స్థితికి రావడానికి మరి కొంత సమయం పట్టవచ్చు’ అని ద.మ రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బస్సుల్లోనూ అంతే.. ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు ఆచితూచి రాకపోకలు సాగిస్తున్నారు. తప్పనిసరైతేనే ఇళ్లల్లోంచి బయటకు వస్తున్నారు. సాధారణంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచే ప్రతిరోజు 3,500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు అంతర్రాష్ట బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో సుమారు 1000 బస్సులు మాత్రం తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకపోకలు సాగిస్తున్నాయి. బస్సుల్లోనూ ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ‘ఒక్కో బస్సులో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. కరోనా కారణంగా ప్రజలు తమ ప్రయాణాలను చాలా వరకు వాయిదా వేసుకున్నారు. బహుశా ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య పెరగవచ్చు’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. -
నేడు పట్టాలెక్కనున్న సాదారణ రైళ్లు
-
నేటి నుంచి రైళ్లు షురూ
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రైళ్లు మళ్లీ పరుగు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. లాక్డౌన్ తర్వాత తొలిసారి సాధారణ ప్రయాణికుల రైళ్లు ప్రారంభమవుతున్నాయి. వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు, కొన్ని రాజధాని స్పెషల్ రైళ్లు కాకుండా టైం టేబుల్లోని షెడ్యూల్ రైళ్లు సోమవారం నుంచి మొదలవుతున్నాయి. దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడుస్తుండగా, దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి 8 రైళ్లు (9వ రైలున్నా.. అది నాందెడ్ వాసులకు అందుబాటులో ఉంటుంది) ప్రారంభమవుతున్నాయి. ఇవికాక ఇతర జోన్లకు చెంది దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా ప్రయాణించే మ రో 5 రైళ్లు కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబా టులో ఉండనున్నాయి. రైళ్లలో కరోనా నిబంధనలు పాటించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైనా.. రైళ్లలో సీట్ల మధ్య దూరం ఉండని నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అగత్యం ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణానికి సిద్ధం కాకపోవటం మంచిద న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తోటి ప్రయాణికుల్లో ఎవరైనా అనారోగ్య లక్షణా లతో ఉన్నా, తోటి ప్రయాణికులు మాస్క్ ధరించకున్నా ఫిర్యాదు చేయాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో మొదలు: రైళ్ల పున:ప్రయాణం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో మొదలు కానుంది. సోమవారం ఉదయం 6 గంటలకు ఈ రైలు నాంపల్లి స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్, మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్, అనంతరం ముంబై వెళ్లే హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, తర్వాత హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, సాయంత్రం నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్, తర్వాత విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ బయల్దేరతాయి. నెల రిజర్వేషన్ ఫుల్: ఇప్పటికే నెలకు సంబంధించిన బెర్తులన్నీ ఫుల్ అయ్యాయి. తొలుత ఈ రైళ్లకు నెల రోజుల రిజ ర్వేషన్ మాత్రమే కల్పించారు. ఆ తర్వాత 120 రోజులకు పెం చారు. మిగతా రోజులకూ రిజర్వేషన్ వేగంగా పూర్తవుతోంది. నాలుగు రైళ్లకే కొన్ని సీట్లు ఖాళీ ఉండగా, మిగతావి దాదాపు పూర్తయ్యాయి. ఈ రైళ్లలో ప్రస్తుతానికి రిజర్వేషన్ ప్రయాణా నికే అవకాశం కల్పించారు. దీంతో అన్‌రిజర్వ్‌డ్‌గా ఉండే జనరల్ బోగీల్లో కూర్చుని ప్రయాణించేలా సీట్లు ఏర్పాటు చేశారు. వాటికి కూడా రిజర్వేషన్ టికెట్లనే అందుబాటులో ఉంచారు. గంటన్నర ముందే..: రైలు బయలుదేరటానికి గంటన్నర ముందే ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవాలి. ప్రయాణికుల్లో కరోనా లక్షణాలున్నా, ఇతరత్రా అనారోగ్యంతో ఉన్నా అనుమతించరు. ప్రతి ఒక్కరిని థర్మో స్క్రీనింగ్ ద్వారా పరీక్షిస్తారు. కన్ఫర్మ్ టికెట్ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ప్రయాణికుల వెంట వచ్చే వారు బయటే ఉండాల్సి ఉంటుంది. రైళ్లలో భోజనం అందించరు. ప్రయాణికులు ఇంటి నుంచే నీళ్లు, భోజనం తెచ్చుకోవటమే శ్రేయస్కరం. బెర్తులపై పడుకునేవారు శుభ్రమైన బె డ్షీట్ తెచ్చుకోవటం మంచిది. వృ ద్ధులు, చిన్నపిల్లలు ప్రయాణానికి దూరంగా ఉంటే మంచిది. కూలీ లు అందుబాటులో ఉండనందున తక్కువ లగేజీతో వెళ్లటం మం చి ది. స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రారంభమవుతున్న రైళ్లు ఇవే.. హైదరాబాద్–ముంబై సీఎస్టీ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–దానాపూర్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్–తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే ఇతర జోన్ల రైళ్లు.. ముంబైæ–భువనేశ్వర్, ముంబై–బెంగళూరు, దానాపూర్–బెంగళూరు, న్యూఢిల్లీ–విశాఖపట్నం, హౌరా–యశ్వంతపూర్. -
చార్జీలు వసూలు చేయకండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల నుంచి రైళ్లలోగానీ, బస్సుల్లోగానీ చార్జీలు వసూలు చేయరాదని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల ప్రయాణానికి వారి వంతు వచ్చే వరకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో రాష్ట్రాలు వలస కార్మికులకు ఆహారం, నీరు అందించాలనీ, రైళ్లలో రైల్వే శాఖ భోజనం, మంచినీరు సరఫరా చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వేలాది మంది వలస కార్మికులు అష్టకష్టాలు పడుతూ రోడ్లపై నడిచి వెళ్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం.. వలస కార్మికుల సమస్యను మే 26న సుమోటోగా స్వీకరించి, గురువారం విచారణ చేపట్టింది. కాలినడకన వెళుతోన్న వలస కార్మికులకు రవాణా సదుపాయాలను కల్పించాల్సిందిగా రాష్ట్రాలను కోరాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన సూచనలను కోర్టు గుర్తించింది. వలస కార్మికులు ఎందరున్నారు, వారి తరలింపు, వారి రిజిస్ట్రేషన్ విధానం తదితర పూర్తి సమాచారం రికార్డు చేయాలని సూచించింది. పేరు నమోదు చేసుకున్న తర్వాత వారిని ఎన్ని రోజులకు సొంత రాష్ట్రాలకు చేరుస్తామనే విషయంలో నిర్దిష్టత ఉండాలంది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటిదాకా 3,700 రైళ్లలో వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చినట్టు సొలిసిటర్ జనరల్ మెహతా తెలిపారు. -
రైళ్లను ఇప్పుడే నడపొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అప్పుడే ప్యాసింజర్ రైళ్లను నడపవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కోరారు. ఈ నెల 17తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధానంగా మూడు అంశాలను ప్రధాని మోదీకి వివరించారు. ప్రస్తుత పరిస్థితులలో వెంటనే రైళ్లను పునరుద్దరించవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రైళ్లను నడిపితే రాకపోకలు ఎక్కువ అవుతాయని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని అన్నారు. అంతేకాకుండా వీరందరికీ పరీక్షలు చేయడం సాధ్యం కాదని, అలాగే వారిని క్వారంటైన్‌కు తరలించడం కూడా కష్టం అవుతుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇక ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (అప్పుడే సాధారణ పరిస్థితులు: ప్రధానితో సీఎం జగన్) ఇక జులై, ఆగస్ట్ మాసంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, ఈ వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బీఎం పరిధిని కూడా పెంచాలని కేసీఆర్ కోరారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని, రాష్ట్రాలకు ఆదాయాలు లేనందున అప్పులు కట్టే పరిస్థితి లేదన్నారు. అన్ని రాష్ట్రాల రుణాలను రీ షెడ్యూల్ చేసేలా కేంద్రం చొరవ చూపాలన్నారు. ఇక కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఎలాంటి అలక్ష్యం వద్దని అన్నారు. జోన్ల విషయంలో పాజిటివ్, యాక్టివ్ కేసులు లేని జిల్లాలను ...రాష్ట్రాలు కోరిన వెంటనే మార్పులు చేయాలని అన్నారు. కరోనా ఇప్పుడు వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదని, కలిసి జీవించాల్సిందేనని, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. (సడలింపులపై దృష్టి పెట్టండి: మోదీ) కరోనాతో కలిసి సాగాల్సిందే... కాగా అంతకు ముందు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా ఎంత కాలం ఉంటుందో ఎవరికీ తెలియదన్న ఆయన.. కరోనా ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగించాలో ప్రణాళిక అవసరమన్నారు. కొన్ని ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించాలని, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కార్యకలాపాల కొనసాగింపుపై ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. (ప్లాస్టిక్ కవర్లలో శవాలు.. పక్కనే పేషెంట్లు) -
ఇక ‘స్మార్ట్ లాక్డౌన్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలాన్ని పొడిగించడం ఖాయమేనని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) దేశాన్ని ఉద్దేశించి చేయనున్న ప్రసంగంలో ఏయే అంశాలను ప్రస్తావించనున్నారు? లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండబోతోందా? గత మూడువారాలుగా కొనసాగిన విధంగా కఠినంగానే ఉండబోతోందా? ఆంక్షల సడలింపుపై ఏవైనా నిర్ణయాలుంటాయా? ఉంటే.. ఎలాంటి మినహాయింపులుంటాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. మూడు వారాల లాక్‌డౌన్‌తో ఇప్పటికే కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ.. మరో రెండు వారాల పాటు నిర్బంధం ఇలాగే కొనసాగితే ఏ స్థాయికి పడిపోతుందోనని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ లాక్డౌన్ కాకుండా.. ఆర్థికాభివృద్ధికి వీలు కల్పించే ‘స్మార్ట్ లాక్డౌన్’ను ప్రధాని ప్రతిపాదించే అవకాశముందని తెలుస్తోంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ.. ప్రాణాలు కాపాడటంతో పాటు దేశæ ఆర్థికాభివృద్ధి పైనా(జాన్ భీ.. జహాః భీ) దృష్టి పెట్టాల్సి ఉందని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. మద్యం అమ్మకాలకు ఒత్తిడి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చాలామంది ముఖ్యమంత్రులు మద్యం అమ్మకాల విషయం ప్రస్తావించారు. ఖజానాకు అత్యంత కీలకమైన ఆదాయ వనరు అయిన మద్యం అమ్మకాలపై ఆంక్షల సడలింపును వారు కోరారు. బార్లు, రెస్టారెంట్లకు అనుమతివ్వకుండా.. పాక్షికంగా, రోజులో కొన్ని గంటల పాటు అయినా మద్యం అమ్మకాలకు వీలు కల్పించాలన్నారు(దీనిపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి). దాంతో, రాష్ట్రాలు కోరితే.. ఆంక్షల సడలింపులో భాగంగా.. మద్యం అమ్మకాలను పాక్షికంగా అనుమతించే అవకాశం ఉంది. ► స్వల్ప స్థాయిలో దేశీయ విమాన, రైల్వే, మెట్రోరైల్ సర్వీసులను అనుమతించే అవకాశం ఉంది. అయితే, 30 శాతం టికెట్లను మాత్రమే విక్రయించేలా ఆంక్షలు పెట్టే అవకాశముంది. ► కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. అంతర్రాష్ట్ర ప్రయాణాలను పలువురు సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు. -
50 రోజుల్లో రైలు!
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్‌లో రైలు కూత పెట్టనుంది. అందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. సరిగ్గా మరో 50 రోజుల్లో రైలు రాబోతోంది. కమిషనర్ ఫర్ రైల్వే సేఫ్టీ నుంచి వెంటనే అనుమతి వస్తే ఏప్రిల్ తొలివారంలో గజ్వేల్–సికింద్రాబాద్ మధ్య రైలు సేవలు మొదలవుతాయి. ప్రస్తుతం ట్రాక్‌పై పర్మినెంట్ పట్టాలు బిగించే కీలక పని చివరిదశకు వచ్చింది. స్టేషన్ భవనాలు, ప్లాట్‌ఫాంల పనులు మరో పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయి. మార్చి చివరి వారంలో ట్రయల్ రన్ నిర్వహించేలా పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆపై రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాయి, వెంటనే మెమూ రైలును ప్రారంభించనున్నారు. వెరసి దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న.. రైల్వే ప్రాజెక్టు ద్వారా కరీంనగర్‌ను రాజధానితో అనుసంధానించే కీలక ప్రాజెక్టు తొలిదశ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. తనిఖీ చేసిన వారంలో రైల్వే సేఫ్టీ కమిషనర్ నివేదికిచ్చే అవకాశముంటుందని అధికారులు చెబున్నారు. పట్టాల తరలింపు సమస్య పరిష్కారం.. మనోహరాబాద్ నుంచి ఈ మార్గం మొదలవుతుంది. అక్కడికి 32 కి.మీ. దూరంలో ఉన్న గజ్వేల్ వర కు మొదటిదశ కొనసాగుతుంది. గజ్వేల్‌కు 21 కి.మీ. ముందు నిజామాబాద్ హైవే వరకు గతంలో నే అన్ని పనులు పూర్తి చేశారు. కానీ హైవే దాటి గ జ్వేల్ వైపు పట్టాల తరలింపు సాధ్యం కాక అటు వైపు పనులు చేయలేదు. ప్రస్తుతం పట్టాల లోడుతో గూడ్సు రైలు వచ్చేందుకు వీలుగా గజ్వేల్ వైపు చి న్న పట్టాలతో తాత్కాలిక ట్రాక్ సిద్ధం చేశారు. రైలు వచ్చేందుకు తాత్కాలిక పట్టాలు అనుకూలంగా ఉన్నాయో లేదో పరిశీలించేందుకు ఐదు రోజుల క్రి తం ఓ ఇంజిన్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు. 21 కి.మీ.కు గాను 16 కి.మీ.కు సరిపోయేలా మూడు లోడులతో పట్టాలను తెచ్చి డంప్ చేశారు. ఇందులో ఇప్పటికే కొన్ని కి.మీ. మేర పనులు పూర్తయ్యా యి. మరో 25 రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత స్లీపర్ ప్యాకింగ్ యంత్రంతో వాటిని జో డించటంతో ఈ పనులు మొత్తం పూర్తవుతాయి. ఇక ఈ మార్గంలో ఉండే 3 స్టేషన్లకు సంబంధించి మనోహరాబాద్ భవనం సిద్ధమైంది. ఆ తర్వాత నాచారం, అప్పాయిపల్లి, గజ్వేల్‌లలో స్టేషన్లు ఉంటాయి. వీటిల్లో నాచారం, గజ్వేల్ భవనాలు పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలిఉన్నాయి. అప్పాయిపల్లిలో భవనం పూర్తికావొచ్చింది. ప్లాట్ఫారంల పనులు పూర్తి కావాల్సి ఉంది. పూర్తయిన బ్రిడ్జీల నిర్మాణం.. ఇక ఈ 32 కిలోమీటర్ల మార్గంలో ఆరు రోడ్ ఓవర్, బ్రిడ్జీలు మూడు రోడ్ అండర్ బ్రిడ్జీలున్నాయి. అవన్నీ పూర్తయ్యాయి. నాచారం వద్ద హల్దీ నదిపై, గన్పూర్, అప్పాయిపల్లిల్లో మధ్యస్థ వంతెనల పనులు పూర్తయ్యాయి. నిజామాబాద్ మీదుగా సాగే 44వ నంబర్ జాతీయ రహదారిని రైల్వే లైన్ క్రాస్ చేసే చోట దాదాపు 100 మీటర్ల మేర పెద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. ఆ పనిని జాతీయ రహదారుల విభాగం చేపడుతోంది. ఇప్పటికే రెండు అండర్‌పాస్‌లు నిర్మించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలను వాటి గుండా మళ్లించారు. ఆ రోడ్డును రైలు దాటేందుకు వీలుగా పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. -
పంజాబ్ మెయిల్ 107 డెక్కన్ క్వీన్ 90
ముంబై: మన దేశంలోనే అత్యంత దూరం నడిచే ఆ పాత రైలు బండి పంజాబ్ మెయిల్. ఆ రైలు జూన్ 1తో 107 ఏళ్లను పూర్తి చేసుకుంది. ముంబై నుంచి పుణెకు నడిచే డెక్కన్ క్వీన్ 89 ఏళ్లు పూర్తి చేసుకుంది. పంజాబ్ మెయిల్ ఆవిరితో నడిచే రైలు. ముంబై నుంచి పెషావర్ (ప్రస్తుతం పాక్‌లో ఉంది) వరకు నడిచింది. ఈ రైలు సర్వీసు మొదట్లో బ్రిటిషర్ల కోసమే ఉండేది. తర్వాత దిగువ తరగతి వారికీ అందుబాటులోకొచ్చింది. 1930లో ఈ రైలుకి మూడో తరగతి బోగీలను అమర్చారు. 1945లో ఏసీ సౌకర్యం వచ్చింది. ప్రస్తుతం ఈ రైలు విద్యుత్‌పైనే నడుస్తోంది. దేశ విభజనకు ముందు పంజాబ్ మెయిల్ ముంబై నుంచి పెషావర్ వరకు 2,496 కి.మీ. దూరం 47 గంటల్లో వెళ్లేదని సెంట్రల్ రైల్వేకు చెందిన చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సునీల్ చెప్పారు. బ్రిటీష్ ఇండియాలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలు ఇదే. ప్రస్తుతం ఈ రైలు ఫిరోజ్‌పూర్ వరకు నడుస్తోంది. అప్పట్లోనే పంజాబ్ మెయిల్లో బాత్రూమ్, రెస్టారెంట్ కార్, లగేజ్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ ఉండేవి. ఆరు బోగీలు ఉండే మెయిల్లో 3 ప్రయాణికుల కోసం కేటాయిస్తే మిగతావి ఉత్తరాల రవాణాకు వాడారు. ఈ 3 బోగీల్లో కేవలం 96 మంది ప్రయాణించే వీలుండేది. ఇక డెక్కన్ క్వీన్ రైలు 1930జనవరి 1న ప్రారంభమైంది. పుణె నుంచి ముంబై వరకు నడిచిన ఈ రైలు దేశంలో తొలి డీలక్స్ రైలు. ఈ డెక్కన్ క్వీన్ ఠంచనుగా షెడ్యూల్ టైమ్‌కు నడిచేది. అందుకే ఈ రైల్లో ప్రయాణించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించేవారని సునీల్ వివరించారు. -
రెండో దశ..నిరాశ
సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ప్రహసనంగా మారాయి. ఐదేళ్లుగా కొనసాగుతున్న పనులు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. పనులు పూర్తయిన మార్గాల్లో రైళ్లు పట్టాలెక్కలేదు. రెండో దశ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటి నుంచి 2013లో ప్రారంభించే వరకు, తర్వాత పనులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలొచ్చాయి. ఏడాదికోసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా రైల్ నిలయంలో పార్లమెంట్ సభ్యుల సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ ప్రాజెక్టు మాత్రం నత్తనడకనే సాగుతుండడం నేతల అంకితభావానికి అద్దం పడుతోంది. రెండో దశ రైళ్లను పట్టాలెక్కించేస్తామని రెండేళ్ల క్రితం అప్పటి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ చెప్పారు. ఆరు మార్గాల్లో చేపట్టిన పనులను దశలవారీగా పూర్తిచేసి గత డిసెంబర్ నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కానీ మరో డిసెంబర్ వచ్చినా రెండో దశ ఎంఎంటీఎస్ ఎక్కడా కనిపించనే లేదు. ఆర్టీసీ తర్వాత ప్రజా రవాణాలో కీలకమైన ప్రాజెక్టుగా భావించే ఎంఎంటీఎస్‌పై కమ్ముకున్న నిర్లక్ష్యపు నీడలు తొలగిపోవడం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లోనూ ఈ ప్రాజెక్టుకు స్థానం లభించడం లేదు. చివరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల ప్రసంగాల్లోనూ ఈ ప్రాజెక్టు పత్తా లేదు. హైదరాబాద్‌లో ప్రజారవాణా విస్తరణకు మెట్రో రైల్‌ను ఏకైక మార్గంగా భావిస్తున్నారు. కానీ నగర శివార్లను అనుసంధానం చేస్తూ అనూహ్యంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాన్ని అందజేసే ముఖ్యమైన ప్రాజెక్టు ఎంఎంటీఎస్ మాత్రమే. ఎన్నో ఏళ్లుగా అదే నిర్లక్ష్యం.. పటాన్చెరు, ఘట్కేసర్, మేడ్చల్, ఉందానగర్, శంషాబాద్ తదితర నగర శివార్లను కలుపుతూ ఎంఎంటీఎస్ రెండో దశను రూపొందించారు. చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 5.75 కి.మీ, బొల్లారం–మేడ్చల్ (14 కి.మీ) మాత్రం పూర్తయ్యాయి. బొల్లారం–సికింద్రాబాద్ మధ్య రైల్వే భద్రతా కమిటీ తనిఖీలు కూడా పూర్తి చేసి రైళ్లు నడిపేందుకు అనుకూలమేనని సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ రెండు మార్గాలు మినహాయించి మిగతా మౌలాలీ–ఘట్కేసర్, సనత్‌నగర్–మౌలాలి, ఫలక్‌నుమా–ఉందానగర్ తదితర మార్గాల్లో పనులు సాగుతునే ఉన్నాయి. సుమారు రెండేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న మౌలాలి– సనత్‌నగర్ మార్గంలో రక్షణశాఖతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇటీవల పరిష్కారం లభించింది. కానీ పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. ఈ రూట్లో డిఫెన్స్ భూముల్లోంచి మూడు కి.మీ మేర రైల్వేలైన్లను వేయాల్సి ఉంది. రక్షణశాఖ అధికారులు అడ్డుకోవడంతో రెండేళ్ల క్రితం పనులు నిలిచిపోయాయి. సుమారు రూ.850 కోట్ల అంచనాతో 2012లో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను తర్వాత ఏడాదికి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అడ్డంకులతో సాగుతున్నాయి. మొత్తం 88.05 కి.మీ మేర రెండో దశ కింద చేపట్టారు. కనీస సదుపాయాలు లేని స్టేషన్లు ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్న ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, నాంపల్లి–సికింద్రాబాద్ మార్గాల్లోని 26 స్టేషన్లలో చాలా వరకు రోడ్డు కనెక్టివిటీ, సిటీ బస్సు సదుపాయం లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ మార్గాల్లో ప్రతిరోజు 121 సర్వీసులు సడుస్తున్నాయి. లక్షా 50 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. లింగంపల్లి, హైటెక్‌సిటీ, బేగంపేట్, సికింద్రాబాద్, కాచిగూడ, విద్యానగర్, నాంపల్లి వంటి కొన్ని ప్రధాన స్టేషన్లు మినహాయించి మిగతా స్టేషన్లకు సిటీ బస్సు సదుపాయం లేదు. ట్రైన్ దిగిన ప్రయాణికులు కనీసం రెండు కి.మీ నడిస్తే తప్ప బస్సులు లభించని పరిస్థితి. దీంతో ప్రయాణికులు ఆటోడ్రైవర్ల దోపిడీకి గురవుతున్నారు. కేవలం రూ.8 తో 30 కి.మీ. ఎంఎంటీఎస్‌లో ప్రయాణం చేసినవారు మరో 2 కి.మీ. కోసం రూ.50 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఫలక్‌నుమా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, సీతాఫల్మండి, బోరబండ, హఫీజ్‌పేట్, మల్కాజిగిరి తదితర స్టేషన్లకు రోడ్డు కనెక్టివిటీ అంతంత మాత్రమే కావడం సమస్యగా మారింది. ఇక వేసవిలో స్టేషన్లలో తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్‌నీర్ లభించడం లేదు. నల్లాల్లో నీరు రాదు. మరోవైపు స్వచ్ఛరైల్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు రైల్వే స్టేషన్లను వెక్కిరిస్తున్నాయి. ప్రత్యేక లైన్ లేకపోవడంతో సమస్య ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకల్లోనూ జాప్యం ప్రయాణికుల పాలిట పెద్ద శాపం. రైళ్లు నడిచేందుకు ప్రత్యేకమైన లైన్ లేకపోవడం వల్ల ప్రధాన రైళ్లు నడిచే మార్గాల్లోనే వీటిని నడుపుతున్నారు. దీంతో ఎక్స్‌ప్రెస్, మెయిల్ సర్వీసులు వచ్చి వెళ్లే వరకు ఎంఎంటీఎస్ రైళ్లు ప్లాట్‌ఫామ్‌లపైనే నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. కొన్నిసార్లు సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేయడం పెద్ద శాతంగా మారింది. 2003లో ఎంఎంటీఎస్‌ను ప్రారంభించినప్పుడు ఈ రైళ్ల కోసం ఒక ప్రత్యేక లైన్ ఉండాలని ప్రతిపాదించారు. 2019 నాటికి కూడా అలాంటి లైన్ ఒకటి నిర్మాణం కాకపోవడం గమనార్హం. రెండో దశ ప్రాజెక్టు ఇదీ.. ♦ మౌలాలి–ఘట్కేసర్ 12.20 కి.మీ ♦ ఫలక్‌నుమా–ఉందానగర్–ఎయిర్‌పోర్టు 20 కి.మీ ♦ బొల్లారం–మేడ్చల్ 14 కి.మీ ♦ సనత్‌నగర్–మౌలాలి 22.10 కి.మీ ♦ తెల్లాపూర్ –రామచంద్రాపురం 5.75 కి.మీ ♦ మౌలాలి–సీతాఫల్మండి 10 కి.మీ మొత్తం రూట్ పొడవు 88.05 కి.మీ -
జియోరైల్ యాప్‌తో విలువైన సేవలు
హైదరాబాద్ : తమ వినియోగదారులకు రైలు టికెట్లు బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటి సేవలను అందించేందుకు జియోరైల్ యాప్‌ను రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. జియోరైల్ యాప్ ద్వారా ఏ జియో ఫోన్‌తో అయినా ఐఆర్సీటీసీ రిజర్డ్వ్ టికెట్ బుకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌తో పాటు ఈ వ్యాలెట్ ఉపయోగించి టికెట్లు బుక్ చేసుకోవడం, రద్దు చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవడం, రైళ్ల రాకపోకల వేళలు, రూట్లు, అందుబాటులో ఉన్న సీట్లు వంటి పలు సేవలను జియో ఫోన్ ద్వారా వినియోగదారులు పొందే వెసులుబాటు కల్పించారు. -
పండగకు ప్రయాణమెట్టా?
రానున్నవంతా నూతన సంవత్సరం.. సంక్రాంతి పండుగల సెలవులే. అత్యధికులు వారి సొంత ఊళ్లకు వచ్చివెళ్లేందుకు రైల్వే ప్రయాణాన్నే సౌకర్యంగా భావిస్తారు. కానీ వరుస సెలవులు.. ప్రయాణికుల రద్దీపై రైల్వే మంత్రిత్వ శాఖ, జోనల్ అధికారులు శ్రద్ధ చూపని కారణంగా పండగ సెలవుల్లో ప్రయాణం ఎట్టా...? అనే ఆందోళన సగటు ప్రయాణికుడిలో వ్యక్తమవుతోంది.. విశాఖపట్నం: నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతోన్న ప్రయాణికులకు ‘ రైల్వే’ అవస్థలు వెంటాడుతున్నాయి. రాష్ట్రం విడిపోకముందు విజయవాడ, విశాఖ మార్గాల్లో ఉన్న రైళ్లే ఇప్పటికీ శరణ్యంగా ఉండడం కూడా ప్రయాణికుల ఆందోళనకు మరో కారణం. విజయవాడకు రాజధాని మారిన తర్వాత 13 జిల్లాల నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య లక్షల్లో పెరిగింది. పెరిగిన రద్దీకి సౌకర్యంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని చెబుతున్నా అనువైన తేదీల్లో లేని కారణంగా అవి నామమాత్రంగా మారాయి. ఉన్న రైళ్లకు అదనపు బోగీల ఏర్పాటులో మాత్రం రైల్వేశాఖ ఏటêవిఫలమవుతూనే ఉంది. ఒక్కో రైలుకు గరిష్టంగా 1200 మంది చొప్పున ప్రయాణించినా అన్ని రైళ్లలో పట్టుమని 6వేల మంది కూడా ప్రయాణించే సౌకర్యం ఉండడం లేదు. రాజధాని విజయవాడకు మారాక విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి రోజూ భారీ సంఖ్యలో వెళ్లివస్తున్నారు. సకాలంలో, సరైన రైళ్లులేక వారి ప్రయాణ అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. పండగ సెలవుల్లో ఆ రద్దీ రెట్టింపు ఉన్నట్టు రైల్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రానున్న పండగల సెలవుల్లో రైల్వే ప్రయాణికులకు అవస్థలు తప్పేలా లేవు. చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ సాధారణ రోజుల్లోనే విశాఖపట్నం, విజయవాడ రైళ్లకు రిజర్వేషన్ టికెట్ల వెయిటింగ్ లిస్ట్ 180కి పైగా దాటుతోంది. కొందరైతే వెయిటింగ్ లిస్ట్‌లకు భయపడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ మార్గాల్లో రైళ్లకు నెల రోజుల ముందు టికెట్లు కొనుక్కున్నా ప్రయాణించే రోజుకు బెర్త్‌లు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితులు ఉండడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే... సంక్రాంతివరుస సెలవులకు ఇంకా 20 రోజులు గడువు ఉన్నప్పటికీ రిజర్వేషన్ టికెట్లు మంజూరుకాక రిగ్రెట్ వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. పెరగని ‘ఈక్యూ’ కోటాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేలా రైల్వే ప్రయాణాలకు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ కోటా(ఈక్యూ) ద్వారా బెర్తులు మంజూరు చేసే విధానం అమలులో ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విజయవాడ, హైదరాబాద్ మార్గాల రైళ్లకు ఉన్నన్ని ఈక్యూ బెర్తులే ఇప్పటికీ అమలు కావడంతో నిత్యం రైల్వే అధికారులకు సైతం బెర్తుల విషయంలో తల ప్రాణం తోకకు వచ్చినంత పనవుతోంది. అందుకు తెలంగాణ మార్గాల్లోని రైళ్లకు అమలు చేస్తున్న ‘ఈక్యూ’ కోటాను బాగా తగ్గించి, ఏపీలోని రైళ్లకు కోటా పెంచడం ఒక్కటే మార్గంగా తెలుస్తోంది. -
శబరి దరి చేరేదెలా అయ్యప్పా!
సాక్షి,సిటీబ్యూరో: నగరం నుంచి సంక్రాంతికి సొంతూరికి వెళ్లేందుకే కాదు.. అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లేందుకూ ‘దారి’ కనిపించడం లేదు. ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్న మాలధారులకు సైతం రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. మరో రెండు నెలల వరకు అంటే వచ్చే ఫిబ్రవరి దాకా అన్ని రైళ్లలో వెయిటింగ్ జాబితాయే దర్శనమిస్తోంది. కొన్నింటిలో ‘రిగ్రెట్’ కనిపిస్తోంది. ఏటా లక్షలాది మంది నగర వాసులు సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల కంటే రైళ్లే అనుకూలంగా ఉంటాయి. చార్జీలు తక్కుగా ఉండడమే కాకుండా సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయాన్నే సొంత ఊరు చేరుకొనేందుకు సౌకర్యంగా ఉంటుంది. కానీ అన్ని రైళ్లలోనూ భారీగా పెరిగిన వెయిటింగ్ లిస్టు ప్రస్తుతం ప్రయాణికులను వెక్కిరిస్తోంది. మరోవైపు డిసెంబర్ రెండో వారం నుంచి సంక్రాంతి వరకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరికి వెళతారు. ఈ ఏడాది కనీసం10 లక్షల మంది వెళ్లే అవకాశం ఉంది. కానీ ద.మ. రైల్వే ప్రకటించిన అరకొర రైళ్లు ఇటు సంక్రాంతి ప్రయాణికులను, అటు అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. నగరం నుంచి చాలా తక్కువ ఏటా లాగే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప దర్శనానికి వెళ్లేందుకు నగర భక్తులు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్ నుంచి శబరికి వెళ్లే ఒకే ఒక్క రైలు శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఫిబ్రవరికి కూడా ఇప్పుడే బుక్ అయ్యాయి. భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు వేయాల్సిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 90 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. శబరికి వెళ్లే భక్తులు, సంక్రాంతి ప్రయాణికుల కోసం ప్రకటించిన ఈ రైళ్లలో హైదరాబాద్ నుంచి బయలుదేరేవి చాలా తక్కువే. పైగా ప్రత్యేక రైళ్లలోనూ బుకింగ్‌లో పూర్తయ్యాయి. ‘కేవలం పది, పదిహేను రైళ్లు మాత్రమే అదనంగా నడుపుతారు. ఎలా వెళ్లి రాగలం’ అంటూ నగరంలోని అయ్యప్ప భక్త సమాజాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చివరి క్షణాల్లో హడావిడిగా ప్రత్యేక రైళ్లను వేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే ప్రస్తుత రద్దీకి అనుగుణంగా రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హడావుడిగా వేస్తే దళారులకే లాభం గతంలో మకరజ్యోతి దర్శనం ముంచుకొస్తున్న తరుణంలో హడావిడిగా కొద్దిపాటి రైళ్లను ప్రకటించారు. ఆ రైళ్లు కూడా విజయవాడ, విశాఖ, కాకినాడ నుంచి బయలుదేరాయి. నగరం నుంచి వెళ్లినవి పరిమితమే. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పైగా ఉదయం వెళ్లాల్సినవి సాయంత్రం, సాయంత్రం వెళ్లాల్సిన రైళ్లు అర్ధరాత్రి బయలుదేరాయి. సకాలంలో దర్శనానికి చేరుకోలేక భక్తులు నిరాశ చెందారు. పైగా ప్రత్యేక రైళ్లలో నీటి సదుపాయం లేక భక్తులు స్నానం, పూజ చేసుకోలేపోయారు. దళారులపై నిఘా ఏదీ మరోవైపు శబరి ప్రత్యేక రైళ్లలో బెర్తులను ఎగరేసుకు పోయేందుకు దళారులు, ఏజెంట్లు ఇప్పటి నుంచే మోహరించారు. భక్తుల ప్రయాణంపై పెద్ద ఎత్తున బేరం చేసుకొనేందుకు రంగంలోకి దిగారు. ఇలాంటి వారిని నియంత్రించేందుకు నిఘా అవసరం. ప్రతిసారి ముహూర్తం ముంచుకొచ్చిన తరువాత ప్రత్యేక రైళ్లు ప్రకటించడం వల్ల భక్తుల కంటే దళారులే ఎక్కువగా లబ్ధిపొందుతున్నారు. వారి నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈసారి కూడా అయ్యప్ప భక్తులకు అదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంది. సంక్రాంతి ప్రయాణమూ కష్టమే.. సంక్రాంతి సెలవుల్లో సుమారు 25 లక్షల మంది నగరం నుంచి వెళుతుంటారు. వీరిలో కనీసం 15 లక్షల మంది రైళ్లపైనే ఆధారపడతారు. రైళ్లలో అవకాశం లేకపోతేనే సొంత వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు 150 నుంచి 200 వరకు చేరింది. కొన్నింటిలో ‘నో రూమ్’ దర్శనమిస్తోంది. -
23 వరకు పలు రైళ్లు రద్దు
-ఖుర్దారోడ్ డివిజన్లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు తాటిచెట్లపాలెం: ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖుర్దారోడ్ డివిజన్లోని చుడాంగాగఢ్, బారంగ్, భువనేశ్వర్ న్యూ, మాంచేశ్వర్ స్టేషన్ల వద్ద నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ పేర్కన్నారు. ఈ నాన్-ఇంటర్ లాకింగ్ పనులు దృష్ట్యా ఈ నెల 17 నుండి 23 వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నామని ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు. రద్దయిన రైళ్ల వివరాలు రైలు నెం. 22874 – విశాఖ - డిఘా వీక్లీ ఎక్స్‌ప్రెస్ (విశాఖ నుండి 15, 22వ తేదీల్లో) రైలు నెం. 22873 – డిఘా - విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (డిఘా నుండి 16, 23వ తేదీల్లో) రైలు నెం. 22810 – విశాఖ - పారాదీప్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (విశాఖలో 18న రద్దు) రైలు నెం. 22809 – పారాదీప్–విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (పారాదీప్‌లో 21న రద్దు) రైలు నెం. 58528 –విశాఖ – రాయపూర్ పాసింజర్ రైలు (విశాఖలో 15 నుండి 22 వరకు) రైలు నెం. 58527 రాయ్‌పూర్ – విశాఖ పాసింజర్ రైలు (రాయ్‌పూర్‌లో 16 నుండి 23 వరకు) రైలు నెం.58538– విశాఖ – కోరాపుట్ పాసింజర్ (విశాఖలో 15 నుండి 22వరకు) రైలు నెం. 58537 కోరాపుట్–విశాఖ పాసింజర్ రైలు (కోరాపుట్‌లో 16 నుండి 23 వరకు) -
ఆలస్యంగా నడుస్తున్న 70 రైళ్లు
న్యూఢిల్లీ: ఉత్తరాదిలో పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏడు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరో 70 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మరో 22 రైళ్లు రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది. రద్దు చేసిన ఏడు రైళ్లలో ఇవాళ, రేపు బయలుదేరాల్సి ఉంది. రద్దైన రైళ్లలో వారణాసి– జోధ్‌పూర్, న్యూఢిల్లీ–వారణాసి కాశీ విశ్వనాథ్, డెహ్రాడూన్–హౌరా ఉపాసన ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. అలాగే ఢిల్లీ జంక్షన్– మల్దా టౌన్ ఫరక్కా ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. మరోవైపు పొగమంచు ప్రభావం విమాన సర్వీసుల మీద ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులనుంచి పలు ఢిల్లీ రైలు సర్వీసులకు, విమాన సర్వీసులకు సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. -
పొగమంచు ఎఫెక్ట్: 69 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి 69 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 16 రైళ్ల వేళలలో మార్పులు చేశారు. కాగా, 4 రైళ్ల సర్వీసులను రైల్వే అధికారులు రద్దుచేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉదయం రన్ వే సరిగా కనిపించడం లేని అధికారులు చెప్పారు. పొగమంచు కారణంగా 9 అంతర్జాతీయ, 3 డొమెస్టిక్ విమాన సర్వీసులు ఆలస్యం కానున్నాయి. ఒక అంతర్జాతీయ, రెండు డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేశారు. గత కొన్ని రోజులనుంచి పలు ఢిల్లీ రైలు సర్వీసులకు, విమాన సర్వీసులకు సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. -
కశ్మీర్లో మళ్లీ రైలు సర్వీసు