Trust members
-
సింగర్ శ్రావణి భార్గవి ఆడియో లీక్
-
మందిరానికి విరాళాలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం
న్యూఢిల్లీ/బెంగళూరు: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేవలం హిందువుల నుంచే కాదు, ఏ మతం వారు విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యుడు, కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని ప్రముఖ పెజావర్ మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి తెలిపారు. రామునిపై విశ్వాసం ఉన్న ఏ మతం వారైనా ఎంతైనా విరాళంగా ఇవ్వవచ్చునన్నారు. ఆగస్టు 5న జరిగే భూమిపూజకు.. అత్యంత సీనియర్ బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, ఎం.ఎం.జోషి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర 200 మందిని ఆహ్వానిస్తామని ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా, కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో చేపట్టే రామాలయ భూమిపూజ కార్యక్రమం దూరదర్శన్‌తోపాటు ఇతర చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని వారన్నారు. దేశంలోని ప్రముఖ యాత్రాస్థలాల మట్టితోపాటు ప్రముఖ సిక్కు, బౌద్ధ, జైన మతాలయాల వద్ద మట్టిని కూడా సేకరించి, అయోధ్యకు పంపుతామన్నారు. -
ట్రస్టు సొమ్ముపక్కదారి..
జిల్లా కేంద్రంలోని మెథడిస్ట్ చర్చి నిధులు దుర్వినియోగమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రస్టు ఆస్తులను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు జట్టుగా మారి.. రూ.5.2 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి పట్టించారు. దీనికి సంబంధించి.. ట్రస్టు సభ్యులు, విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ : అమెరికాకు చెందిన క్రాఫర్డ్ అనే మహిళ తన కూతురు హాల్దా పేరిట వికారాబాద్‌లో మిషన్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. 1913లో పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపాన 5.7 ఎకరాల విస్తీర్ణంలో సేవలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్యంతో పాటు విద్య అందించాలనే సంకల్పంతో పాఠశాలను నెలకొల్పారు. అంతేకాకుండా మెథడిస్ట్ చర్చి, ఆస్పత్రి, విద్యా విభాగాల్లో పనిచేసే సిబ్బంది కోసం క్వార్టర్స్ నిర్మించి చేయూతనిచ్చారు. మొత్తం 120 ఎకరాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రజల కనీస అవసరాలను తీర్చడం కోసం విద్య, వైద్యంతో వేలాది మందికి ప్రాణదానం, అక్షర జ్ఞానం అందించారు. దాదాపు వంద ఏళ్లకు పైగా సమాజ సేవలో ఆపన్నహస్తం అందించారు. కొద్ది సంవత్సరాల క్రితం క్రాఫర్డ్డ్ కన్నుమూశారు. ఆ తర్వాత ట్రస్తు ఆస్తుల పరిరక్షణ కోసం హైదరాబాద్ రీజియన్‌గా తీసుకొని ట్రస్టీని ఏర్పాటు చేశారు. క్రాఫర్డ్ ఉన్నన్ని రోజులు విద్య, వైద్యం, సేవల పరంగా ఈ ప్రాంత ప్రజలు ఎంతో లబ్ధిపొందారు. అనంతరం కాలక్రమేణా ఈ సేవలకు గండిపడింది. పాఠశాలలో ఒకప్పుడు 4 వేల మంది విద్యార్థులు చదువుకుంటే.. ప్రస్తుతం వీరి సంఖ్య 40కి చేరింది. వైద్యాస్పత్రిలో నిధులు లేక సేవలు నీరుగారుతున్నాయి. దుర్వినియోగం ఇలా... మెథడిస్ట్ ఆస్తులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దేశ వ్యాప్తంగా ఏ రీజియన్‌లో జరిగినా సెం ట్రల్ ట్రెజరీ ముంబైలో ఉన్న ఖాతాలోకి డబ్బులు వెళ్లాలనే నిబంధన (బుక్ ఆఫ్ డిసిప్లిన్) బైలాస్ ప్రకారం ఉంది. కానీ దీనికి భిన్నంగా.. పరిహారం కింద వచ్చిన డబ్బులను డీఎస్ తిమోథీ హైదరాబాద్‌లోని ఎస్బీఐ చిరగల్లిబ్రాంచ్లో ఉన్న ఖాతా నంబర్ 35736421990లోకి దారి మళ్లించారు. మెథడిస్ట్ చర్చి పేరు మీద వచ్చిన నష్టపరిహారాన్ని ఈయన సెంట్రల్ ట్రెజరీ అకౌంట్ ముంబైలోని ఖాతాలో జమ చేయకుండా హైదరాబాద్ రీజినల్ కాన్ఫరెన్స్ పేరున ఉన్న ఖాతాలో డిపాజిట్ చేయడంలో కీలక పాత్ర పోషించారని స్థానిక సంఘా లు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇదిలా ఉండ గా సదరు వ్యక్తి రూ.25 లక్షలను ఇటీవల పట్టణానికి చెందిన పారిశ్రామిక కంపెనీ ఖాతాలో జమచేయడంతో పాటు.. ఈ మొత్తాన్ని లంచాల రూ పంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉన్నతాధికారులకు అందజేశారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా డివిజన్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న ఓ వ్యక్తికే ఎక్కువ మొత్తంలో ముట్టజెప్పినట్లు సమాచారం. ఈ అన్యాయాన్ని జీర్ణించుకోలేని పలువురు చర్చి సభ్యులు సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఇన్‌కంట్యాక్స్ శాఖలకు ఫిర్యాదు చేశారు. చెక్కు రూపంలో పరిహారం... ప్రభుత్వం నుంచి మంజూరైన నష్టపరిహారాన్ని వికారాబాద్ ఆర్డీఓ చెక్కు రూపంలో అందజేశారని ట్రస్టు సభ్యులు చెప్పారు. ఈ నిధుల నుంచి డీఎస్ తిమోథీ రూ.25 లక్షలు వికారాబాద్‌లోని ఓ సుద్ద ఫ్యాక్టరీకి ఆర్టీజీఎస్ చేశారన్నారు. మరో వ్యక్తికి రూ.50 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసినట్లు వివరించారు. డబ్బులు కొల్లగొట్టిన వారిని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు. దీనిపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొంటున్నారు. ఇందుకోసం చర్చి మెంబర్లతో సంతకాలు సేకరిస్తున్నామని, నిధుల పక్కదారిపై త్వరలోనే ఫైల్ సిద్ధం చేసి సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. డబ్బులు కాజేశారు మెథడిస్ట్ చర్చి ఆస్తులు అమ్మడానికి ఎవరికీ హక్కులేదు. ఒక వేళ అమ్మాలి అనుకుంటే చర్చి కమిటీ అప్రూవల్ తీసుకోవాలి. కొంతమందితో కుమ్మౖక్కైన బిషప్ రూ.5 కోట్లకు పైగా డబ్బులను కాజేశారు. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే పెరిగా.. చిన్ననాటి నుంచే చర్చి సభ్యుడిగా ఉన్నా. పది నెలల క్రితం చర్చి పేరున ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను స్థానిక ఆర్డీఓతో కలిసి డీఎస్ తిమోథీ, బిషప్ స్టీఫెన్, దయానంద్ కొల్లగొట్టారు. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం. – జేమ్స్, చర్చి సభ్యుడు బిషప్, డీఎస్ హస్తం ఉంది మెథడిస్ట్ ఆస్తులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఏ రీజియ న్లో ఆర్థిక లావాదేవీలు జరిగినా ముంబైలోని సెంట్ర ల్ అకౌంట్లో జమ చేయాలి. దీనికి విరుద్ధంగా చర్చి డబ్బులను హైదరాబాద్‌లోని ఎస్బీఐ అకౌంట్లోకి వేయ డం వెనక బిషప్తో పాటు డీఎస్ హస్తం ఉంది. ఇక్కడి ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. రోడ్డుకు సంబంధించిన నష్టపరిహారాన్ని వాళ్లు సొంత అకౌంట్లో వేసుకునేందుకు వీల్లేదు. హైదరాబాద్‌లోని చిరగల్లిలో ఉన్న ఎస్బీఐ అకౌంట్లో తిమోథీ పేరు ఉన్న ఖాతాలో జమ కావడం ఏమిటో అర్థం కావడం లేదు.ఒకసారి రూ.69 లక్షలు, మరోసారి రూ.4.69 కోట్లు జమయ్యాయి. – సుధాకర్, చర్చి సభ్యుడు -
విరాళాల సేకరణ పేరుతో..
రాజంపేట టౌన్: అమ్మ ఆదరణ సేవా సంస్థ పేరుతో విరాళాలు సేకరిస్తూ ఓ ఇంటిలోకి చొరబడ్డ ముగ్గురు యువకుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పిన సంఘటన బుధవారం సాయంత్రం రాజంపేట పట్టణం సరస్వతీపురంవీధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని అమ్మ ఆదరణ సేవా సంస్థ ప్రతినిధులమంటూ ముగ్గురు యువకులు సరస్వతీపురం వీధిలో ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించారు. అనాథ పిల్లల కోసం తమ సంస్థ ద్వారా విరాళాలు సేకరిస్తున్నామని, ప్రతి ఒక్కరు రూ.500కు తక్కువ కాకుండా ఇవ్వాలని అడిగారు. తమకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లను, తాము చేసే సేవా కార్యక్రమాల ఫొటోలను కూడా చూపించడంతో ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచినంత విరాళాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలి ఇంటిలోకి ముగ్గురు యువకులు నేరుగా వెళ్లారు. దీంతో ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో వారు పరుగు తీశారు. స్థానికులు వెంటపడగా ఇద్దరు పారిపోయారు. రాంబాబు అనే యువకుడు దొరికిపోయాడు. తాను కడప మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు ఒకసారి, తమది విజయవాడలోని కృష్ణలంక అంటూ మరోసారి ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అక్కడి ప్రజలకు అనుమానం వచ్చి దేహశుద్ధి చేశారు. పారిపోయిన మిగతా ఇద్దరికి రాంబాబు సెల్ నుంచి ఫోన్ చేయించగా వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పట్టణ ఎస్ఐ రాజగోపాల్‌కు సమాచారం ఇవ్వగా పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా విరాళాల పేరుతో ఇళ్ల వద్దకు వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రాజగోపాల్ ప్రజలకు సూచించారు. కాగా, రాంబాబు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు తామిచ్చిన విరాళాన్ని అతని వద్ద నుంచి తిరిగి లాక్కోవడం కొసమెరుపు. -
రాజన్న ట్రస్ట్‌బోర్డులో 14 మంది సభ్యులు
తాజాగా మంత్రి మండలిలో నిర్ణయం దరఖాస్తులకు వచ్చే నెల 8వరకు గడువు సెప్టెంబర్ రెండో వారంలో నియామకం వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ట్రస్ట్‌బోర్డులో సభ్యుల సంఖ్యను తొమ్మిది నుంచి 14కు పెంచుతూ ప్రభుత్వం సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమైక్య రాష్ట్రంలో ఆలయ కమిటీలో సభ్యుల సంఖ్య తొమ్మిది ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కొత్త కమిటీని నియమించలేదు. దానికి బదులు ప్రభుత్వం సీఎం కేసీఆర్ అధ్యక్షతన వేములవాడ ఆలయ అభివద్ధి అథారిటీ (వీటీడీఏ)ను ఏర్పాటు చేసింది. వైస్‌చైర్మన్‌గా జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తంరెడ్డిని నియమించింది. అప్పటినుంచి సభ్యుల నియామకంలో జాప్యం జరుగుతోంది. మహాశివరాత్రి జాతరకు రెనోవేషన్ కమిటీని నియమించి ఉత్సవాలను నిర్వహించింది. టీఆర్ఎస్ శ్రేణుల నుంచి నామినేటెడ్ పదవులపై ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేసింది. సభ్యుల సంఖ్యను పెంచి మరికొంత మందికి అవకాశాలు కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇప్పటికే రాజన్న ధర్మకర్తల మండలి నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులకు వచ్చేనెల 8వరకు గడువుంది. పలువురు ఆశావహులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబుతోపాటు ఇతర నాయకులను ప్రసన్నం చేసుకుని కమిటీలో చోటు దక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో రాజన్న ధర్మకర్తల మండలి ఏర్పాటు ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. నియోజకవర్గ నాయకులతోపాటు మంత్రులు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాలు, ఉత్తర తెలంగాణలోని అసెంబ్లీ స్థానాల నుంచి సైతం సభ్యులను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఎమ్మెల్యే రమేశ్‌బాబుపై ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలతో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్రభాదేవి త్రిశతాబ్ది ఏర్పాట్లు పూర్తి
- ఘనంగా నిర్వహించనున్న ట్రస్టు సభ్యులు - ఈ నెల 29తో 300 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్సవాలు సాక్షి, ముంబై: ప్రభాదేవి మందిరం ఆధ్వర్యంలో త్రి శతాబ్ది (300 ఏళ్లు) ఉత్సవాలను నగరంలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. ఆదివారం ఉదయం ప్రారంభమై బుధవారం రాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. త్రి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులపాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని ప్రభాదేవి జన్ సేవా సమితి వర్గాలు తెలిపాయి. దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభాదేవి పరిసర ప్రాంతంలో మరాఠీ, తెలుగు ప్రజలు అధికంగా ఉంటారు. ప్రతి ఏటా జనవరిలో వారం రోజులపాటు జాతర జరుగుతుంది. కుల, మత భేదాలు లేకుండా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. శాకంబరిగా ప్రభాదేవి.. 12వ శతాబ్దంలో ప్రభాదేవి మాతను శాకంభరి పేరుతో కొలిచేవారు. యాదవ్ సామ్రాట్ బింబ్ రాజాకు కులదైవమైన శాకంభరి ఆరు శతాబ్దాల తరువాత శ్యాంనాయక్ అనే వ్యక్తి కలలోకి వచ్చి తనకు మందిరం కట్టించాలని చెప్పింది. నాయక్ మందిరం కట్టించినప్పటి నుంచి అందరూ ప్రభాదేవిగా పిలుస్తున్నారు. మొఘల్ సామ్రాట్ గుజరాత్‌పై దండయాత్ర చేసినప్పుడు ప్రభావతి విగ్రహాన్ని కర్నాటకకు తరలించారు. అయితే అక్కడ సముద్రంలో కొట్టుకుపోయిన ఈ విగ్రహం మాహింలోని తీరం వద్ద తేలింది. దాన్ని చూసిన శ్యాం 1716లో వైశాఖ శుద్ధ ఏకాదశీ రోజున ఈ విగ్రహాన్ని మందిరంలో ప్రతిష్టించారు. -
భోంచేయండి
అనంతపురం అర్బన్ : కరువు జిల్లాలోని ప్రజలు ప్రజావాణిలో కష్టాలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు ప్రతి సోమవారం వస్తున్నారు. రవాణా ఖర్చులకు సరిపడా మాత్రమే ఉన్న డబ్బులు చూసుకుని, మంచినీటితో కడుపు నింపుకుంటున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ దృష్టి సారించారు. పేదల కండుపు నింపేందుకు ఇస్కాన్ ట్రస్టును సంప్రదించారు. సానుకూలంగా స్పందించిన ఆ ట్రస్టు సభ్యులు వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు భోజన సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చారు. జేసీతో చర్చించిన ఇస్కాన్ ట్రస్ట్ కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో జేసీ ఎస్.సత్యనారాయణ, డీఆర్వో సిహెచ్.హేమసాగర్ భోజన ఏర్పాట్లపై ఇస్కాన్ జనరల్ మేనేజర్ దామోదర్ గౌరంగా దాస్‌తో శుక్రవారం చర్చించారు. ఇస్కాన్ ట్రస్ట్ ప్రతి సోమవారం సుమారు 400 నుంచి 500 మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. పెరుగన్నం రూ. 5, సాంబర్ భోజనం రూ.5 అందించేందుకు ఒప్పకుంది. ఈ నెల 22 నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు కలెక్టరేట్ ప్రాగణంలో ఒక రూమ్‌ను భోజన సౌకర్యం కోసం కేటాయించారు. డీఆర్వో, ఇస్కాన్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ ఆ స్థలాన్ని పరిశీలించారు.