అనంతపురం అర్బన్ : కరువు జిల్లాలోని ప్రజలు ప్రజావాణిలో కష్టాలు చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు ప్రతి సోమవారం వస్తున్నారు. రవాణా ఖర్చులకు సరిపడా మాత్రమే ఉన్న డబ్బులు చూసుకుని, మంచినీటితో కడుపు నింపుకుంటున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ దృష్టి సారించారు. పేదల కండుపు నింపేందుకు ఇస్కాన్ ట్రస్టును సంప్రదించారు. సానుకూలంగా స్పందించిన ఆ ట్రస్టు సభ్యులు వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు భోజన సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చారు.
జేసీతో చర్చించిన ఇస్కాన్ ట్రస్ట్
కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో జేసీ ఎస్.సత్యనారాయణ, డీఆర్వో సిహెచ్.హేమసాగర్ భోజన ఏర్పాట్లపై ఇస్కాన్ జనరల్ మేనేజర్ దామోదర్ గౌరంగా దాస్‌తో శుక్రవారం చర్చించారు. ఇస్కాన్ ట్రస్ట్ ప్రతి సోమవారం సుమారు 400 నుంచి 500 మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. పెరుగన్నం రూ. 5, సాంబర్ భోజనం రూ.5 అందించేందుకు ఒప్పకుంది. ఈ నెల 22 నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు కలెక్టరేట్ ప్రాగణంలో ఒక రూమ్‌ను భోజన సౌకర్యం కోసం కేటాయించారు. డీఆర్వో, ఇస్కాన్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ ఆ స్థలాన్ని పరిశీలించారు.
భోంచేయండి
Published Sat, Dec 20 2014 2:35 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement