TSR awards ceremony
-
జయసుధకు అభినయ మయూరి బిరుదు ప్రదానం
-
మెరిసిన తారాలోకం
వెండితెర తారలు తళుక్కున మెరిశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 56 మంది ప్రముఖ సినీ నటీనటులు ఒకే వేదికపై కనువిందు చేశారు. ఇంతమంది తమ అభిమాన హీరో హీరోయిన్లను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. టి.సుబ్బరామిరెడ్డి కళాపరిషత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టీఎస్సార్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ 2017, 2018 సంవత్సరాలకు ప్రముఖ నటీనటులకు అందజేశారు. స్థానిక పోర్టు స్టేడియంలోఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. అక్కయ్యపాలెం(విశాఖ ఉత్తర): టి.సుబ్బరామి రెడ్డి కళాపరిషత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘టిఎస్సార్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ 2017, 2018 సంవత్సరాలకు ప్రముఖ నటీనటులకు అందజేశారు. ఈ వేడుకకు విశాఖ పోర్టు స్టేడియం వేదికగా నిలిచింది. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటులుగా వెలుగొందుతున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్ అభిమానులను అలరించారు. ఎందరో నటీమణులు కూడా వేదికపై తళుక్కుమన్నారు. ఈ సందర్భంగా సుబ్బరామి రెడ్డి మాట్లాడుతూ కళల్లో ఈశ్వర శక్తి ఉందని, కళాకారులను ప్రోత్సహించడం, ప్రేమించడం ఈశ్వరుని ధ్యానించడమే అన్నారు. అభిమానుల ఆనందమే కళాకారులకు శక్తి అని అన్నారు. వారి ఆనందంకోసం గత పదేళ్లుగా ప్రముఖ సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులను సత్కరిస్తున్నట్టు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సుబ్బరామి రెడ్డి కళాహృదయానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు. అవార్డుల ప్రదానోత్సవం కనులపండువగా జరిగిందని, ఇంత మంది అభిమానుల ఆనందాన్ని గుండెల్లో నింపుకొని ఇంటికి వెళ్తున్నానని అన్నారు. ముందుగా పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ఓటు వద్దు, అభిమానం కావాలన్న మహోన్నత వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని కొనియాడారు. దాసరి లేని లోటు తీర్చలేనిదని, దాసరి మెమోరియల్ అవార్డు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. నాగార్జున మాట్లాడుతూ తనకు నచ్చిన రంగస్థలం, మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలకు అవార్డులు అందజేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు కొరియోగ్రాఫర్లు, సినీ నటులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు ప్రియమణి, కుష్బూ, అలీ, విశాల్, రకుల్‌ప్రీత్, కేథరిన్, ప్రీతం కౌర్, రాశీఖన్నా, విద్యాబాలన్, సుమంత్, బోనీకపూర్, తమన్, ఇళయరాజా,సిరివెన్నెల సీతారామశాస్త్రి, పరుచూరి గోపాలకృష్ణ, దేవిశ్రీప్రసాద్ పాల్గొన్నారు. కశ్మీర్లో అమరులైన జవాన్లకు సినీ ప్రముఖుల నివాళి కదిలించిన శ్రీదేవి స్మృతులు :భార్య నటించిన చిత్రాల క్లిప్పింగులు చూసి బాధాతప్తుడైన బోనీకపూర్ సాక్షి, విశాఖపట్నం: అందాల నటి శ్రీదేవిని విశాఖ మరోసారి స్మరించుకుంది. ఆమెపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. టీఎస్సార్–టీవీ–9 జాతీయ సినిమా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో శ్రీదేవికి మెమోరియల్ అవార్డు ప్రముఖ నటి విద్యాబాలన్‌ను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను అవార్డు అందజేసే సమయంలో వేదికపైకి పిలిచారు. అప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, విద్యాబాలన్ తదితరులు వేదికపైనే ఉన్నారు. శ్రీదేవి నటించిన కొన్ని తెలుగు, హిందీ సినిమాల క్లిప్పింగులను తెరపై ప్రదర్శించారు. వాటిని చూసి బోనీకపూర్ విషాదంలో మునిగిపోయారు. తన నుంచి దూరమైన జీవిత భాగస్వామిని తెరపై చూసి వేదనతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దాంతో ఆయన పలుమార్లు వెనక్కి తిరిగిపోవడం, విషాదంతో పక్కకు వెళ్లడం వంటివి కనిపించాయి. టి.సుబ్బరామిరెడ్డి బోనీకపూర్ భుజంపై చేయి వేస్తూ అనునయించారు. సభకు హాజరైన వారంతా శ్రీదేవిని, ఆమె ప్రతిభను, ప్రాభవాన్ని మరోసారి స్మరించుకున్నారు. -
‘డైలాగ్స్ పలకడంలో ఆయనకు ఆయనే సాటి’
‘‘ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడం సుబ్బరామిరెడ్డిగారికే సాధ్యం. కళాకారులను సన్మానించడానికి ఆయన 120 ఏళ్లు జీవించి ఉండాలి’’ అని మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు అన్నారు. ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి బుధవారం ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు మంచు మోహన్‌బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాసాగర్ రావు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ తర్వాత తెలుగే అని మనం సగర్వంగా చెప్పుకోవాలి. మారుమూల ప్రాంతాల్లోని పేద కళాకారులను సైతం గుర్తించి సన్మానం చేయాలని సుబ్బరామిరెడ్డిగారికి నేను మనవి చేస్తున్నా. ప్రపంచంలోని తెలుగువారందర్నీ కలిపి ఓ వెబ్సైట్ తయారు చేయాలి. తెలుగు భాషకు సంబంధించిన చరిత్ర, అన్ని విషయాలు అందులో ఉండేలా చూడాలి. తెలుగు భాష పేద విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుందనే విషయం మరచిపోకూడదు. సిటీల్లో గ్రాడ్యుయేషన్ వరకూ చదవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. పల్లె ప్రాంతంలో అయితే దాదాపు ఖర్చు లేకుండానే వాళ్లు చదువుకుంటున్నారు. కానీ, గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంజినీరింగ్ కావొచ్చు.. కలెక్టర్ కావొచ్చు.. ధనిక విద్యార్థులతో పోటీ పడుతున్నారు గ్రామీణ విద్యార్థులు. ఈ శక్తి వారికి ఎలా వచ్చిందంటే తల్లిలా ఉండే తెలుగు భాషవల్లే. తెలుగు భాష వల్ల కొన్ని వేల రూపాయల సబ్సిడీ దొరుకుతోంది. అటువంటి భాషను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కులరహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలి. పదునైన పదజాలాన్ని పలకడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు మోహన్‌బాబుగారు. డైలాగులంటే ఎన్టీఆర్ తర్వాత గుర్తుకు వచ్చే వ్యక్తి మోహన్‌బాబుగారే’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు నటన అద్భుతం. ఐదు తరాల ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న ఆయన ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుకు సంపూర్ణ అర్హులు’’ అన్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబుగారి సినిమాలు భారతీయులు.. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రజల గుండెల్లో చెక్కబడి ఉంటాయని చెప్పగలను. ఆయన జీవితం అంతా కళారంగానికే అంకితం చేశారు’’ అన్నారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు 42 ఏళ్లలో 600 చిత్రాలకు పైగా నటించారు. భారతదేశ చలనచిత్ర రంగంలో విలన్‌గా ఉండి హీరో అయ్యి 150 సినిమాలు (హీరోగా) చేసిన ఘనత మోహన్‌బాబుది. ఎంత గొప్ప నటుడో అంత ఖలేజా, దమ్ము ఉన్న మనిషి. 14వేల మంది విద్యార్థులున్న కాలేజీ పెట్టి 4వేల మందికి ఉచితంగా విద్య అందిస్తున్నారు. అటువంటి మోహన్‌బాబుని ‘విశ్వ నట సార్వభౌమ’ అవార్డుతో సత్కరించుకోవడం సంతోషం’’ అన్నారు. అవార్డు గ్రహీత మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘మంచి వ్యక్తి అయిన విద్యాసాగర్ రావు నా ఆత్మీయులు కావడం సంతోషం. ఓరుగల్లు అంటే వరంగల్.. పౌరుషాల గడ్డ. ఆ ప్రాంతం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ. కులమతాలకు అతీతంగా తెలుగు వారంతా కలిసి మెలసి ఉండాలని పోరాడిన వీర వనిత రుద్రమదేవి గురించి తెలుసు. డబ్బున్న వాళ్లు ఎందరో ఉంటారు. అందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన రాదు. పూర్వం రాజులు చేసేవారు. ఇప్పుడు సుబ్బరామిరెడ్డిగారు చేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని నేనీ స్థాయికి వచ్చా. భక్తవత్సలం నాయుడు అయిన నన్ను మా గురువు దాసరిగారు మోహన్‌బాబుగా మార్చారు. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ని స్థాపించి అన్నగారు ఎన్టీఆర్‌తో కొబ్బరికాయ కొట్టించాను. 1992లో నా ఆస్తులు తాకట్టు పెట్టి ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా తీస్తే అది సిల్వర్ జూబ్లీ హిట్ అయింది. మళ్లీ అన్నగారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టా. ఆ మహానుభావుడు నన్ను రాజ్యసభకు పంపారు. అందరికీ కోపం ఉంటుంది. కానీ, నాకు ఎక్కువ ఉంటుంది. ‘తన కోపమే తన శత్రువు’ అన్నట్టు నా కోపం నాకు నష్టాన్ని కలిగించిందే తప్ప ఎవరికీ నష్టం కలిగించలేదు’’ అన్నారు. హీరో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికీ లలిత కళలు బతికి ఉన్నాయంటే సుబ్బరామిరెడ్డిగారిలాంటి వారివల్లే. ‘కాకతీయ కళా పరిషత్’ స్థాపించిన తొలిసారి మోహన్‌బాబుగారిని సత్కరించుకోవడం మా చలనచిత్ర రంగాన్ని సన్మానించడంగా నేను భావిస్తున్నా’’ అన్నారు. హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఏ నుంచి జెడ్ వరకూ మోహన్‌బాబుగారికి అభిమానులే’’ అన్నారు. ఈ సందర్భంగా దివంగత నటులు టీఎల్ కాంతారావు కుటుంబానికి సుబ్బరామిరెడ్డి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. పలువురు కళాకారులను ఈ వేదికపై సత్కరించారు. దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోలు మంచు విష్ణు, మనోజ్, నటులు అలీ, సంగీత దర్శకుడు కోటి, నటీమణులు జయప్రద, జయసుధ, మంచు లక్ష్మి, హీరోయిన్లు శ్రియ, ప్రగ్యా జైస్వాల్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, డీకే అరుణ, ఎమ్మెల్సీ షబ్బీర్ హుస్సేన్‌తో పాటు డి.శ్రీనివాస్, దానం నాగేందర్, గీతారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. -
వైభవంగా టీయస్సార్ అవార్డుల వేడుక
ఇటు దక్షిణాది అటు ఉత్తరాది.. ఏ ప్రాంతమైతేనేమి.. కళాకారులందరూ ఒక్కటే. అయితే అందర్నీ ఒకే వేదిక మీద చూస్తే సినీప్రియులకు కలిగే ఆనందమే వేరు. శనివారం సాయంత్రం వైజాగ్‌లో జరిగిన ‘టీయస్సార్’ అవార్డుల వేడుక అలాంటి ఆనందాన్నే కలిగించింది. 2015, 2016 సంవత్సరాలకు గాను పలువురు కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు.కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత వైభవంగా ఈ వేడుక నిర్వహించారు. 2015లో... ♦ ఉత్తమ నటుడు: వెంకటేశ్ (గోపాల గోపాల) ♦ కథానాయకుడు: అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి) ♦ నటి: శ్రియ (గోపాల గోపాల) ♦ కథానాయిక: రకుల్‌ప్రీత్ సింగ్ (బ్రూస్ లీ, పండగ చేస్కో) ♦ తొలి చిత్రకథానాయకుడు: ఆకాశ్ పూరి (ఆంధ్రాపోరి) ♦ తొలి చిత్రకథానాయిక: ప్రగ్యా జైస్వాల్ (కంచె) ♦ దర్శకుడు: గుణశేఖర్ (రుద్రమదేవి) ♦ చిత్రం: కంచె ♦ ప్రతినాయకుడు: ముఖేశ్ రుషి (శ్రీమంతుడు) ♦ సహాయ నటి : నదియ (బ్రూస్ లీ) ♦ హాస్యనటుడు: అలీ (సన్నాఫ్ సత్యమూర్తి) ♦ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (సన్నాఫ్ సత్యమూర్తి) ♦ గాయకుడు: దేవిశ్రీ ప్రసాద్ (సూపర్ మచ్చి... సన్నాఫ్ సత్యమూర్తి) ♦ గాయని: యామిని (మమతల తల్లి... బాహుబలి) 2016లో... ∙ఉత్తమ నటుడు: నాగార్జున (సోగ్గాడే చిన్ని నాయనా) ∙కథానాయకుడు: బాలకృష్ణ (డిక్టేటర్) ∙స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్టర్ : రామ్‌చరణ్ (ధృవ) ∙స్పెషల్ జ్యూరీ పాపులర్ ఛాయిస్: నాని (జెంటిల్మన్) ∙నటి: రకుల్‌ప్రీత్ సింగ్ (ధృవ, నాన్నకు ప్రేమతో) ∙కథానాయిక: కేథరిన్ త్రేసా (సరైనోడు) ∙తొలి చిత్రకథానాయిక: నివేదా థామస్ (జెంటిల్మన్) ∙దర్శకుడు: సురేందర్‌రెడ్డి (ధృవ) ∙చిత్రం: ఊపిరి ∙హాస్యనటుడు: బ్రహ్మానందం (బాబు బంగారం) ∙సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. తమన్ (సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు) ∙గాయకుడు : శ్రీకృష్ణ (జెంటిల్మన్) ∙గాయని: ప్రణవి (జెంటిల్మన్) ‘స్పెషల్ జ్యూరీ అవార్డు’ విజేతలు ∙మిలీనియమ్ స్టార్ అవార్డ్ – హీరో శత్రుఘ్న సిన్హా ∙మిలీనియమ్ స్టార్ అవార్డ్ – హీరోయిన్ హేమమాలిని ∙సెన్సేషనల్ స్టార్ అవార్డ్ – జాకీ ష్రాఫ్ ∙5 దశాబ్దాల స్టార్ అవార్డ్ – కృష్ణంరాజు ∙4 దశాబ్దాల స్టార్ అవార్డ్ – మోహన్‌బాబు ∙జీవిత సాఫల్య పురస్కారం – సంగీతదర్శకుడు బప్పీ లహరి ∙స్పెషల్ జ్యూరీ అవార్డ్ – రేవంత్ (ఇండియన్ ఐడల్ విన్నర్) 2015, 16 సంవత్సరాలకు గాను స్పెషల్ జూరీ అవార్డులు ∙నేషనల్ స్టార్: ప్రభాస్ (బాహుబలి) ∙బెస్ట్ ఫర్ఫార్మెన్స్: రానా (బాహుబలి) ∙మాస్ ఎంటర్టైనర్: కల్యాణ్‌రామ్ (పటాస్) ∙బెస్ట్ యాక్ట్రెస్: మంచు లక్ష్మి (దొంగాట) ∙బెస్ట్ హీరోయిన్: హెబ్బా పటేల్ (కుమారి 21ఎఫ్) ∙బెస్ట్ డైరెక్టర్: క్రిష్ (కంచె) ∙బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ (లయన్) ∙సింగర్ (మేల్): సింహ (దిమ్మ తిరిగే.. శ్రీమంతుడు) ∙స్పెషల్ అప్రిషియేషన్ హీరో: నాగచైతన్య (ప్రేమమ్) ∙బెస్ట్ డైరెక్టర్: ఇంద్రగంటి మోహనకృష్ణ (జెంటిల్మన్) ∙బెస్ట్ ఆల్‌రౌండర్ యాక్టర్: రాజేంద్ర ప్రసాద్ (నాన్నకు ప్రేమతో) ∙స్పెషల్ అప్రిషియేషన్ యాక్టర్: శర్వానంద్ (ఎక్స్‌ప్రెస్ రాజా) ∙స్పెషల్ అప్రిషియేషన్ హీరో: నారా రోహిత్ (జ్యో అచ్యుతానంద) ∙బెస్ట్ ప్రామిసింగ్ హీరో: విజయ్ దేవరకొండ (పెళ్ళి చూపులు) ∙బెస్ట్ ప్రోగ్రెస్సివ్ ఫిల్మ్: పెళ్ళి చూపులు ∙బెస్ట్ అప్‌కమింగ్ యాక్టర్: దీపక్ సరోజ్ (మిణుగురులు) ∙బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: మాస్టర్ ఎన్టీఆర్ (ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ కుమారుడు – దాన వీర శూర కర్ణ) ∙బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్: దాన వీర శూర కర్ణ ∙స్పెషల్ అప్రిషియేషన్ డైరెక్టర్: బాబ్జి (రఘుపతి వెంకయ్య) ∙సింగర్ (ఫీమేల్): సమీర (తెలుసా తెలుసా... సరైనోడు) ∙బెస్ట్ యాక్టర్ (తమిళ్): మాధవన్ ∙బెస్ట్ యాక్ట్రెస్ (తమిళ్): హన్సిక ∙బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ): ప్రియమణి ∙బెస్ట్ డెబ్యూ యాక్టర్ (కన్నడ): నిఖిల్ గౌడ ∙బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (హిందీ): సోనాల్ చౌహన్ ∙బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (హిందీ): ఊర్వశీ రౌతెల