Ugadi celebrations
-
ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శిస్తూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది స్ఫూర్తిని సరిహద్దులు దాటించారు. తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు తెలుగు శోభను అద్దారు.స్థానిక తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి, సంస్కృతి చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారత రాయబారి హరీష్ పర్వతనేని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. దాదాపు రోజంతా జరిగిన ఉత్సవాలలో సాయంత్రం నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ హైలైట్‌గా నిలిచింది.ఈ సంగీతోత్సవంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృథ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని, ఇతిపాడ్ బ్యాండ్‌కి చెందిన సాకేత్ కొమండూరి ల సంగీత ప్రదర్శనలు ఉత్సవ హోరును శిఖరాలకు చేర్చాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఫ్రాంక్ఫర్ట్ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి గ్రున్‌బర్గ్ హాజరయ్యారు. అతిథులలో.. యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని తదితరులున్నారు. -
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
ప్రయత్నిస్తే మంచి ఫలితమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అధికార పక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ భవన్లో పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ప్రయతి్నస్తే ఈ ఎన్నికల్లో విజయం పొందే అవకాశం ఉందన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రోధి నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని పండితులు తెలిపారు. కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పాడి పంటలు మంచిగా పడుతాయని చెప్పారు. అయితే ధరలు అధికమవుతాయన్నారు. ఈ ఏడాదంతా కేసీఆర్‌కు బాగుంటుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాశి కర్కాటకం అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నందున ఈ సంవత్సరమంతా కేసీఆర్‌కు బాగుంటుందని తెలిపారు. కర్కాటక రాశి వాళ్లు వేసే ఎత్తుగడలు ఫలిస్తాయని, వారి నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. వారి మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని చెప్పారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలా ఉంటే కేటీఆర్ ప్రజాభిమానాన్ని పొందుతారు కేటీఆర్‌ది మకర రాశి అని, ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్‌గా చేయాలని సూచించారు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉందని పండితులు తెలిపారు. మాటను కట్టడి చేసుకొని మృదువుగా మాట్లాడం వల్ల , చక్కటి ఉపకారాన్ని, అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందని పండితులు తెలిపారు. -
మళ్లీ బీజేపీదే అధికారం
సాక్షి, హైదరాబాద్: దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని పంచాంగ శ్రవణకర్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి జోస్యం చెప్పారు. –ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందనీ, పార్టీ నాయకుల్లో ఐక్యత పెరుగుతుందనీ, సమష్టి విజయం సాధించాలనే సంకల్పం సిద్ధిస్తుందన్నారు. తమ శక్తి మేర ప్రజలకు వ్యయం చేస్తే నాయకులకు పేరు వస్తుందన్నారు. వృద్ధుల సహకారం ఉంటేనే యువకులు విజయం పొందుతారని తెలిపారు. ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తాను 14 ఏళ్ల క్రితం బీజేపీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొని అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం తర్వాత మళ్లీ కలుసుకుందామని చెప్పినట్టు మూర్తి గుర్తుచేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దంపతులు హోమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డుసభ్యుడు డా.కె.లక్ష్మణ్ , ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీ‹Ùబాబు, రాష్ట్రపార్టీ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పాల్గొన్నారు. మోదీ సర్కార్‌నే ప్రజలు కోరుకుంటున్నారు: కిషన్‌రెడ్డి పంచాంగ శ్రవణం అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ క్రోధి నామ సంవత్సరం చాలా ప్రాధాన్యత కలిగిన సంవత్సరమని, మోదీ నాయకత్వంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మంచి వర్షాలతో, పాడిపంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. మోదీ నేతృత్వంలో మరింత సుస్థిర, స్థిరమైన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశం కోసం పనిచేస్తున్న మోదీ నాయకత్వానికి మద్దతు తెలిపి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
మరింత మంచి పాలన
సాక్షి, హైదరబాద్: క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవారం గాం«దీభవన్‌లో ఘనంగా జరిగాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వర్కింగ్ ప్రెసిసెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుడు శ్రీనివాసమూర్తి పంచాంగ పఠనం చేశారు. ప్రజాభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన సాగిస్తుందన్నారు. వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేసి, ప్రజాదరణ పొందారని, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ ఈ క్రోది నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కాంగ్రెస్ కార్యకర్తలు పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు కుమార్‌రావ్, నిరంజన్, చల్లా నర్సింహారెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నవ వసంతంలో అందరికీ మేలు జరగాలి
గన్¸పౌండ్రీ (హైదరాబాద్): క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో క్రోధినామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలలో పున్నమి వెన్నెలను నింపడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో భాగంగా బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాగ పఠనం చేశారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/కాణిపాకం(చిత్తూరు రూరల్)/శ్రీశైలం టెంపుల్: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి అర్చకులు విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై, ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు నూతన వ్రస్తాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఆలయంలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్‌తో ఏర్పాటు చేసిన ఫల–పుష్ప అలంకరణలు ఆకట్టుకున్నాయి. అయోధ్య రామాలయం, బాలరాముడి సెట్టింగ్, నవధాన్యాలతో రూపొందించిన మత్స్య అవతారము మైమరిపించింది. టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పుష్పాలంకరణ కళాకారులు, 100 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది 2 రోజులు శ్రమించి ఈ ఆకృతులను రూపొందించారు. వైభవంగా దుర్గమ్మకు పుష్పార్చన.. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవి ఈ నెల 18 వరకు జరుగుతాయి. మంగళవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవిరాట్‌కు స్నపనాభిషేకం నిర్వహించారు. దేవస్థానం రూపొందించిన పంచాంగాన్ని దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆవిష్కరించారు. అమ్మవారి ప్రధానాలయం, ఉపాలయాలను పుష్పాలతో అలంకరించారు. దుర్గమ్మకు విశేష పుష్పార్చన చేపట్టారు. ఉగాది సందర్భంగా ధర్మపథం వేదికపై కప్పగంతుల సోమయాజుల సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహించారు. కాణిపాకంలో అంగరంగ వైభవంగా.. కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని పలు రకాల పుష్పాలు, మామిడి తోరణాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు. వేకువజామున స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈవో వెంకటేశు స్వామి వారికి పట్టువ్రస్తాలను సమరి్పంచారు. శివకుమార్ శర్మ రచించిన కాణిపాక దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించారు. పురోహితులు మోహన్, రామలింగం పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను కాణిపాకం పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. శ్రీశైలంలో వేడుకగా రథోత్సవం... శ్రీశైలంలో మల్లన్న రథోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేయించి ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపజేశారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతులిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని రమావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ఏడాది దేశం పారిశ్రామికరంగంలో అభివృద్ధి చెందుతుందని శ్రీశైలం దేవస్థాన ఆస్థాన సిద్దాంతి పండిత బుట్టే దైవజ్ఞ తెలిపారు. ఉగాది సందర్భంగా ఆయన ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. -
ఉగాది వేడుకల్లో మెగాస్టార్ మనవరాలు నవిష్క (ఫొటోలు)
-
Ugadi 2024: సెలబ్రిటీల సంబరాలు
-
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు
-
కన్య రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..
-
ములుగు శివజ్యోతి ఉగాది రాశి ఫలాలు
-
వృషభ రాశి ఫలితాలు ములుగు శివజ్యోతి
-
అంతా సమానమే..
-
వారు ఆ విషయంలో జాగ్రత్త పాటించాలి
-
అదృష్టాన్ని నమ్ముకోవచ్చు..
-
రాజకీయ నాయకులకు అండదండలు.. కానీ
-
అన్నీ ఎక్కువే..
-
చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉగాది వేడుకలు
-
విశాఖలో ఘనంగా ఉగాది ఉత్సవాలు
-
శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
-
సత్యసాయి నిగమంలో ఉగాది ఉత్సవాలు
-
‘తాల్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలు-2023 ఘనంగా జరిగాయి. లండన్‌లోని సత్తావిస్ పటిదార్ సెంటర్లో ఏప్రిల్ 22న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లండన్, పరిసర ప్రాంతాలకుచెందిన సుమారు వెయ్యి మంది తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాల్ కల్చరల్ సెంటర్ (TCC) విద్యార్థులచే గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉగాది కోసం ప్రత్యేకంగా మూడు నెలలపాటు నిర్వహించిన సినీ నృత్య శిక్షణ శిబిరాలలో సుమారు వంద మంది చిన్నారులు, గృహిణులు, భార్య భర్తలు పాల్గొని, ఆ నృత్యాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. అవి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ, సినీ సంగీత నృత్యాలతో, విభిన్న కార్యక్రమాలతో వేదిక హోరెత్తింది. హాజరైన వారికి తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ఉగాది మిఠాయిలు, రుచికరమైన వంటకాలు అరిటాకులో వడ్డించారు. తాల్ చైర్పర్సన్ భారతి కందుకూరి, వైస్-చైర్మన్ , కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదంసేతి మరియు కిషోర్ కస్తూరి పాల్గొన్నారు. 'తాల్' ఉగాది-2023 కన్వీనర్ శ్రీదేవి అల్లెద్దుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు, హీరో, డబ్బింగ్ కళాకారుడు సాయి కుమార్ తన 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని, తన జీవిత విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన సినిమాలలో ప్రేక్షకాదరణ పొందిన డైలాగులు చెప్పి తెలుగువారిని, ప్రేక్షకుల్లో ఉన్న కొందరు కన్నడ వారికోసం కన్నడ డైలాగులు చెప్పి వారిని కూడా కేరింతలు కొట్టించారు. యూకేలో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో, ప్రోత్సహించడంలో 'తాల్' చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. 'తాల్' వార్షిక పత్రిక “మా తెలుగు”ను సాయి కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తాల్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ , బ్రిటన్ ఓబీఈ గ్రహీత, KIMS ఉషా లక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురాం పిల్లరిశెట్టికి అందించి సత్కరించారు. డాక్టర్ రఘురాం మాట్లాడుతూ ఈ పురస్కారం తన జీవితంలో ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అన్నారు. అలాగే 'తాల్' చేస్తున్న సేవా సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. లండన్‌లోని హై కమిషన్ ఆఫ్ ఇండియా మినిస్టర్ (కోఆర్డినేషన్) దీపక్ చౌదరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసి, లండన్‌లో 'తాల్' తెలుగువారి కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే తెలుగు వారికి భారత దౌత్య కార్యాలయం 'తాల్' సమన్వయంతో సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని గుర్తు చేశారు. ప్రముఖ పర్వతారోహకుడు, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అన్మిష్ వర్మ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారతదేశం నుంచి విచ్చేశారు. తన ఎవరెస్టు శిఖరం ఎక్కినప్పటి అనుభవాలను, రణ విద్యలలో తను గెలుచుకున్న ప్రపంచ స్థాయి పథకాల ప్రక్రియలో ఎదుర్కొన్న సవాళ్లను వివరించి ప్రేక్షకులలో ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపారు. ప్రముఖ యాంకర్, నటి శ్యామల, కెవ్వు కార్తీక్, ఆర్జే శ్రీవల్లి తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు హారిక నారాయన్, అరుణ్ కౌండిన్యలు తమ ప్రసిద్ధ తెలుగు పాటలతో మైమరిపించడమే కాకుండా ఉర్రూతలూగించే పాటలతో ప్రేక్షకులుమైమరచిపోయారు. లండన్ బారో ఆఫ్ హన్స్లో మేయర్ రఘువీందర్ సింగ్ అతిథిగా విచ్చేసి, 'తాల్' క్రీడల పట్ల చేస్తున్న కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి సంవత్సరం 'తాల్' ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 20-20 క్రికెట్ పోటీలు, 'తాల్' ప్రీమియర్ లీగ్ (TPL), ఈ సంవత్సరం ప్రైమ్ నార్త్ టీపీఎల్ 2023గా, మే 6 నుంచి మూడు నెలల పాటు నిర్వహించబోతున్నట్టు తెలియజేస్తూ టోర్నీకి సంబంధించిన పోస్టర్ని TPL కమిటీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రేక్షకులకు, నిర్వాహక కమిటీకి, కళాకారులకు, వాలంటీర్లకు, తోటి సంస్థలు, తోడ్పాటు అందించిన స్పాన్సర్లందరికీ 'తాల్' చైర్పర్సన్ భారతి కందుకూరి ధన్యవాదాలు తెలిపారు. -
టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు మరియు పంచాంగ శ్రవణం తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో లో మర్చి 22న ఘనంగా జరిగాయి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వ దినా న సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో బాగంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు సింగపూర్‌లో తొలిసారి స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేక గంటల పంచాంగాన్ని సభ్యులకు అందించారు. జోతిష పండితులు పంచాంగకర్తలు కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు , మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ దీన్ని రూపొందించారు. ఈ వేడుకల్లో సుమారు 200-250 మంది ప్రవాసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి, భక్షాలు, పులిహోర ప్రసాదం పంపిణి చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహిస్తున్నపలు భక్తి, స్వచ్చంద సేవా కార్యక్రమాలు అభినందనీయమని భక్తులు కొనియాడారు. సాంస్కృతిక నృత్యాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, నంగునూరి వెంకట రమణ, కాసర్ల శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల మరియు సతీష్ పెసరు వ్యవరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాత లకు, స్పాన్సర్స్ కు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి,కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, నడికట్ల భాస్కర్, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి కృష్ణ విజాపూర్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యం గా ఈ వేడుకలకు ఘనంగా జరగడానికి చేయూతనందించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
తాడేపల్లి: సీఎం జగన్ నివాసంలో శోభకృత్ నామ ఉగాది వేడుకలు (ఫొటోలు)