Vamshi Paidipally
-
వైజాగ్ మా సెంటిమెంట్ : వంశీ పైడిపల్లి
అల్లిపురం (విశాఖ దక్షిణం): వైజాగ్ మా సెంటిమెంట్ అని వారసుడు చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. వైజాగ్ వచ్చినప్పుడల్లా నగరంలో సంపత్ వినాయగర్ ఆలయం, సింహాచలం సింహాద్రి అప్పన్న గుడికి వెళ్లడం ఆనవాయితీ అన్నారు. తన సినిమాలన్నీ విశాఖలోనే షూటింగ్‌లు జరుపుకున్నాయన్నారు. భారత్ సూపర్ స్టార్ విజయ్ ఇటువంటి కథ ఒప్పుకోగానే తనకు భయమేసిం దన్నారు. వారసుడు చిత్ర యూనిట్ నగరంలోని మెలోడి థియేటర్లో శుక్రవారం సాయంత్రం సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ వారసుడు తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కావడం గర్వంగా ఉందన్నారు. తమన్ సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచిందన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ బృందావనం తరువాత దర్శకుడు వంశీతో మళ్లీ పని చేశానన్నారు. దిల్‌రాజు ఉత్తమ నిర్మాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నటి సంగీత, డి్రస్టిబ్యూటర్ ప్రతినిధి దిల్ శ్రీనివాస్, థియేటర్ మేనేజర్లు గౌరీ శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
‘వారసుడు డైలీ సీరియల్’.. ట్రోలర్స్‌పై వంశీ పైడిపల్లి ఫైర్
తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘వారసుడు’ డైలీ సీరియల్ అంటూ వస్తున్న విమర్శలపై దర్శకుడు వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ సినిమా డైలీ సీరియల్‌ను తలపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ పోస్టులపై వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. డైలీ సీరియల్స్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయని.. కానీ సినిమా తీయడం సాధారణ విషయమేమీ కాదు.' అంటూ ఫైరయ్యారు వంశీ. వంశీ మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టమైన పని. ఇదంతా టీమ్ వర్క్. ప్రేక్షకులను అలరించడానిక్ మేం పడే కష్టం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ప్రతి సినిమా వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. మనదేశంలో సూపర్‌స్టార్స్‌లో విజయ్ కూడా ఒకరు. ప్రతి సన్నివేశానికి రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేయగలమనేది మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు. ఆయనే నా సినిమాకు సమీక్షకుడు, విమర్శకుడు. ఆయన కోసం సినిమా చేశా. మరీ ఇంత నెగెటివ్‌గా ఉండకండి. సాఫ్ట్వేర్ జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చా. ఈ రోజు నేనేంటో నాకు తెలుసు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే మూవీ చేశా.' అని అన్నారు. -
తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి
సంక్రాంతి రోజున ఓ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆయన తాజాగా తెరకెక్కించిన మూవీ వారసుడు(తమిళంలో వారీసు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పండుగ రోజున వంశీ తన తల్లి, తండ్రి, భార్యతో కలిసి కుటుంబ సమేతంగా థియేటర్లో వారసుడు మూవీ చూశారు. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన ఇక ఈ సినిమా చూసిన వంశీ పైడితల్లి తండ్రి సైతం భావోద్వేగానికి గురయ్యారు. పుత్రోత్సాహంతో ఆయనను హుత్తుకుని ఎమోషనల్ అయిన వీడియో వంశీ పైడిపల్లి షేర్ చేశారు. ‘‘నా జీవితంలో అతి పెద్ద విజయం సాధించాను. ‘వారసుడు’ వీక్షించి నా తండ్రి ఎంతగానో ఆనందించారు. ఈరోజు నేను నా జీవితంలో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాను. జీవితాంతం ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. నాన్నా.. నువ్వే నా హీరో. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ వంశీ రాసుకొచ్చారు. చదవండి: ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..? ‘మహర్షి’ వంటి కమర్షియల్ విజయం తర్వాత వంశీ తెరకెక్కించిన పూర్తిస్థాయి తమిళ చిత్రం ‘వారీసు’. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించగా.. జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్, శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు. తమిళంలో ఈ చిత్రం జనవరి 11న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. My Biggest achievement was today when My " Naanna / Appaa " was overwhelmed watching #Vaarasudu ( #Varisu )... This is the moment I will cherish for lifetime.. " You are my HERO Naannaa ".....Love You to Eternity... ❤️ pic.twitter.com/E5SokU8x8g — Vamshi Paidipally (@directorvamshi) January 14, 2023 -
Varasudu Movie Review: వారసుడు మూవీ రివ్యూ
టైటిల్: వారసుడు నటీనటులు: విజయ్, రష్మిక మందన్నా, శరత్ కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, శ్రీకాంత్, జయసుధ, సుమన్, శ్యామ్, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ దర్శకత్వం: వంశీ పైడిపల్లి సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ విడుదల తేదీ: జనవరి 14, 2023 తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వారీసు. టాలీవుడ్లో 'వారసుడు'గా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటించింది. తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. తమిళ వర్షన్ జనవరి 11నే విడుదల కాగా.. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. శరత్‌కుమార్(రాజేంద్ర) ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. అతని భార్య జయసుధ(సుధ). వీరికి ముగ్గురు కుమారులు. విజయ్(విజయ్), శ్రీకాంత్(జై), శ్యామ్(అజయ్). పెద్ద పెద్ద మైనింగ్ కాంట్రాక్టులు డీల్ చేస్తుంటారు. రాజేంద్రతో జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) బిజినెస్‌లో పోటీ పడుతుంటాడు. రాజేంద్రతో పాటు శ్రీకాంత్, శ్యామ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. ముగ్గురు కుమారులు కావడంతో వారసుడిని ప్రకటించి బిజినెస్‌ను ఎవరికీ అప్పగించాలనే ఆలోచిస్తూ ఉంటాడు రాజేంద్ర. కానీ విజయ్‌కు తన తండ్రి వ్యాపారంలో కొనసాగడం ఇష్టం లేదని చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోమంటాడు రాజేంద్ర. ఆ తర్వాత సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తాడు. మరోవైపు జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) రాజేంద్ర కాంట్రాక్టులు కొట్టేసేందుకు కుట్రలు చేస్తుంటాడు. కానీ అతని వల్ల కాకపోవడంతో శ్రీకాంత్(జై), శ్యామ్(అజయ్)ను పావులుగా వాడుకుని వారి కుటుంబాన్ని దెబ్బతీస్తాడు. ఊహించని సంఘటనలతో రాజేంద్ర కుటుంబం విడిపోతుంది. ఆ తర్వాత రాజేంద్రకు ఓ భయంకర నిజాన్ని డాక్టర్ ఆనంద్(ప్రభు) చెబుతాడు. అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంటి నుంచి వెళ్లగొట్టిన విజయ్ తిరిగొచ్చాడా? అసలు రాజేంద్రకు డాక్టర్ చెప్పిన భయంకర నిజం ఏంటి? ఆ తర్వాత కుటుంబం అంతా కలిసిందా? జై, అజయ్ మళ్లీ కుటుంబంతో కలిశారా? రాజేంద్ర తన వారసుడిగా ముగ్గురిలో ఎవరినీ ప్రకటించారు? రాజేంద్ర బిజినెస్‌ను అలాగే కొనసాగించారా? చివరికి కుటుంబం, బిజినెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే అసలు కథ. కథ ఎలా ఉందంటే.. కథ విషయానికొస్తే.. రోటీన్ స్టోరీ అయినప్పటికీ తెరపై రిచ్ లుక్ కనిపించేలా చేశారు. ప్రకాశ్ రాజ్ ఎంట్రీతో కథ మొదలు కావడం, బిజినెస్ డీల్స్, కాంట్రాక్టులు అంతా రోటీన్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ తప్ప.. రొమాంటిక్ సీన్స్ పెద్దగా కనిపించవు. విజయ్, కిచ్చా మామ(యోగిబాబు) మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు తెప్పించడం ఖాయం. ఫస్టాప్‌లో కుటుంబంలో గొడవలు, బిజినెస్ కాంట్రాక్టలతో కథనం సాగుతుంది. కథలో జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకులు ఊహకు అందేలా ఉన్నాయి. అయితే సీరియస్ సీన్లలోనూ కామెడీ పండించడం వంశీ తనదైన మార్క్ చూపారు. కథలో కొత్తదనం లేకపోవడం వల్ల ప్రేక్షకులకు అంతగా ఆసక్తి కలగకపోవచ్చు. కథ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ప్రేమ, అప్యాయతలను కొత్త కోణంలో చూపించారు డైరెక్టర్ వంశీ. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఒకవైపు బిజినెస్ కాపాడుకోవడం, అలాగే కుటుంబాన్ని ఒక్కటి చేయడం ఈ రెండు అంశాల ఆధారంగా కథను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు విజయ్ యాక్షన్ ప్రేక్షకులకు అలరిస్తాయి. హీరోయిన్ రష్మిక పాత్రను కొంతమేరకే పరిమితం చేశారు. కుటుంబ సభ్యుల మధ్యే పోటీ, బిజినెస్‌లో పెత్తనం కోసం వారి మధ్య జరిగే పోరాటం చుట్టే స్టోరీ నడుస్తుంది. విజయ్ ఫైట్స్, పాటలు అభిమానులను అలరించడంలో సందేహం లేదు. సెకండాఫ్‌లో రంజితమే సాంగ్ గ్రాండ్‌గా తెరకెక్కించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఫ్యామిలీ ఎమోషన్స్, బిజినెస్ చుట్టే కథను నడిపించడం రోటీన్‌గా అనిపిస్తుంది. ఇలాంటి కథలు గతంలోనూ వచ్చినప్పటికీ కాస్త భిన్నంగా చూపించారు. కొన్ని చోట్ల ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కంటతడి పెట్టించారు. ఓవరాల్‌గా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను తెరపై సరికొత్తగా ఆవిష్కరించారు వంశీ. ఎవరెలా చేశారంటే.. విజయ్ తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. సీరియస్ సీన్లలో కామెడీ పండించడం, ఫైట్ సీన్స్, డ్యాన్స్‌తో విజయ్ అదరగొట్టారు. ముఖ్యంగా ఫైట్ సీన్స్‌లో తనదైన మార్క్ చూపించారు. రష్మిక పాత్ర చిన్నదే అయినప్పటికీ తన గ్లామర్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిజినెస్ మ్యాన్‌గా శరత్ కుమార్, అమ్మ పాత్రలో జయసుధ ఒదిగిపోయారు. శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, ప్రభు, యోగిబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. తమన్ సంగీతం సినిమాకు అదనపు బలం. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగుంది. ప్రవీణ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. -
రెమ్యూనరేషన్లో ఆల్ టైమ్ రికార్డ్.. వారీసుకు రూ.150 కోట్లు..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం 'వారీసు'. తెలుగులో వారసుడు పేరుతో ఈనెల 14న రిలీజ్ కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 11న విడుదల కానుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి విజయ్ తీసుకున్న పారితోషికంపై నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారీసు కోసం విజయ్ రూ.150 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ నిలవనున్నారు. దాదాపు ఇది బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్‌ను మించిపోయింది. అంతే కాకుండా కోలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. (ఇది చదవండి: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం) విజయ్ సినిమాల ఎంపికలోనూ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్‌లతో సహా యువ దర్శకుతలతో జతకట్టాడు. విజయ్ పూర్తిగా స్క్రిప్ట్‌ల ఆధారంగా సినిమాలను నిర్ణయిస్తాడని.. కమర్షియల్‌తో పాటు ఎంటర్టైనర్కు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూస్తానని నెల్సన్ అన్నారు. విజయ్‌కి ఓవర్సీస్లోనూ ప్రజాదరణ ఎక్కువగా ఉంది. అలాంటి ఆదరణ ఉన్న చాలా తక్కువ మంది దక్షిణాది నటుల్లో ఈయన ఒకరు. వారిసు సినిమా తమిళంలో జనవరి 11న, హిందీలో జనవరి 13న, తెలుగులో సంక్రాంతి స్పెషల్‌గా 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. -
విజయ్,రష్మిక మందన్నా 'వారసుడు' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్!
దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వారసుడు. తమిళంలో వారిసు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేయనుంది. మొదట జనవరి 11న రావాల్సిన ఈ చిత్రాన్ని జనవరి 14కు వాయిదా వేసినట్లు తాజాగా దిల్ రాజున ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అనంతరం ఈ సినిమాపై పలువురు పాత కథ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొత్త పాయింట్ ఏం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చదవండి: 'వారసుడు' వాయిదా వేస్తున్నాం.. నేనే వెనక్కి తగ్గాను : దిల్‌రాజు గతంలో వంశీ పైడిపల్లి తాను తీసిన బృందావనం చిత్రాన్నే అటూ ఇటూ మార్చి వారసుడు రూపొందించాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో వారసుడు మూవీ సంబంధించిన స్టోరీ లైన్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పలు తమిళ్ వెబ్సైట్లు ఈ మూవీ కథ ఇదేనంటూ కథనాలు రాసుకొస్తున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. వంశీ పైడిపల్లి కొత్త పాయింట్‌తో వారసుడు తెరకెక్కించాడు అంటున్నారు. చదవండి: నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై రష్మిక స్పందన ‘వారసుడు మూవీ విజయ్ రాజేంద్రన్ అనే బడా వ్యాపారి చూట్టూ చూట్టూ తిరుగుతుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో విజయ్ తల్లిదండ్రులు శరత్ కుమార్, జయప్రద నటిస్తుండగా.. శ్రీకాంత్, శ్యామ్‌లు అన్న పాత్రలు పోషించారు. ఇందులో ప్రకాశ్ రాజ్ విజయ్‌కి వ్యతిరేకంగా ఉన్న కంపెనీ ఓనర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వారిసు ట్రైలర్
తమిళ స్టార్ విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం వారిసు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. తెలుగులో వారసుడు పేరిట సంక్రాంతికి విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఇందులో ఫ్యామిలీ బంధాలను చూపిస్తూనే విజయ్ను బిజినెస్‌మెన్‌గా చూపించారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా ట్రైలర్ అలా రిలీజైందో లేదో అప్పుడే #VarisuTralier ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. కాగా దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. చదవండి: రష్మికపై ట్రోలింగ్.. రాళ్లు కూడా విసురుతారన్న కన్నడ స్టార్ డూప్లెక్స్ ఇంటిని అమ్మేసిన హీరోయిన్, ఎన్ని కోట్లంటే? -
ఆర్మీ క్యాంపులో విజయ్ దేవరకొండ.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయాడా? లైగర్ ఫ్లాప్ తర్వాత కాస్త విరామం తీసుకున్న యంగ్ హీరో మరో ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన తదుపరి సినిమా జనగణమన షూటింగ్ కోసం సైనికులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గన్ పట్టుకుని ఉన్న ఓ ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. బాక్సాఫీస్ వద్ద లైగర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆపేసినట్లు చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా విజయ్ ఆర్మీ క్యాంపులో కనిపించడంతో ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫోటో-షేరింగ్ యాప్‌లో చిత్రాన్ని షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. 'దేశంలో అత్యంత పెద్ద దుర్ఘటన యూరీ' అని రాశాడు. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రకటన కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఛాపర్ నుండి బయటకు రావడం కనిపించింది. గతంలో ఈ చిత్రం ఆగిపోయిందన్న రూమర్లను నిర్మాత ఛార్మీ కౌర్ అవన్నీ ఫేక్ అంటూ ట్వీట్ చేసింది. వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్‌ల సహకారంతో ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ పాన్-ఇండియా చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో 3 ఆగస్టు 2023న విడుదల కానుంది. -
సూపర్ స్టార్ బర్త్‌డే.. మహేశ్‌కు చిరు, వెంకీల స్పెషల్ విషెస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నేటితో 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. మంగళవారం(ఆగస్ట్ 9) మహేశ్ బర్త్‌డే సందర్భందగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ దగ్గుబాటితో పాటు ప్రముఖ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లిలు మహేశ్‌కు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్‌డే మహేశ్’ అంటూ రాసుకొచ్చారు. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻 Wishing @urstrulyMahesh a happy birthday. 💐🎂 pic.twitter.com/7fDFnDDtwi — Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2022 వెంకటేశ్ ట్వీట్ చేస్తూ.. ‘హ్యపీ బర్త్‌డే చిన్నోడా’ అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలోని వారిద్దరి ఫొటోను షేర్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, సురేందర్ రెడ్డి, అడవి శేష్ పలువురు సినీ ప్రముఖులు మహేశ్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఇక ఫ్యాన్ హంగామా అయితే మాములుగా లేదు. సోషల్ మీడియాను మహేశ్ బర్త్‌డే విషెష్ చెబుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో మహేశ్ బాబు బర్త్ డే ట్యాగ్ నెంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. Happy birthday dearest @urstrulyMahesh! Wishing you love and laughter this year Chinnoda ❤️ pic.twitter.com/jPcmyazO8v — Venkatesh Daggubati (@VenkyMama) August 9, 2022 Happy Birthday @urstrulymahesh anna! Wishing you lots of joy and success as always! — Jr NTR (@tarak9999) August 9, 2022 Happiest birthday to the most humble Superstar, an Amazing Director's Hero and more than that an incredible human being @urstrulyMahesh garu ♥️🤗 Wish you many More Blockbuster Hits sir! ✨#HBDSuperstarMahesh pic.twitter.com/QedO98qVjV — Anil Ravipudi (@AnilRavipudi) August 9, 2022 Happiest Birthday @urstrulyMahesh Sir... Wishing my brother all the more Happiness and the Best of everything always.. 🤗🤗 #HBDSuperstarMahesh pic.twitter.com/kkIYoStoGx — Vamshi Paidipally (@directorvamshi) August 9, 2022 Happy Birthday Superstar @urstrulyMahesh.. You are a heart-throb not only for the fans but also for the directors.. Keep Amazing all of us!!#HBDSuperStarMahesh pic.twitter.com/bCJ1dM1Sp8 — Sreenu Vaitla (@SreenuVaitla) August 9, 2022 Happy Birthday to the actor class apart and a true gentleman @urstrulyMahesh anna. Wishing you all the love and success 🤗 #HBDSuperstarMaheshBabu pic.twitter.com/A66F9r2RtS — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 9, 2022 Many many happy returns of the day sir 🤗 .@urstrulyMahesh So beautiful how the world is celebrating your birthday & we, the #Major team, are happy to have received your mentorship, love & support. You’ve been a guiding light and inspiration. Lots of love sir & happy birthday :) — Adivi Sesh (@AdiviSesh) August 9, 2022 -
విజయ్, రష్మికల ‘వారీసు’ మూవీ ఎలా ఉంటుందంటే
తెలుగు, తమిళ భాషల్లో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం వారీసు(తెలుగులో వారసుడు). ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది విజయ్‌కి స్పెషల్ చిత్రం అని చెప్పాలి. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై ఎందుకంటే ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈ మూవీతో నేరుగా పలకిరించబోతున్నాడు. దీంతో ఈ మూవీ కథ, కథనాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 4వ షెడ్యూల్‌ను ఇటీవలే హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. త్వరలో విశాఖపట్టణంలో షూటింగ్‌కు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోందని సమాచారం. ఇలాంటి సందర్భంలో వారీసు, చిత్ర అప్డేట్ను నటుడు శరత్‌కుమార్ వెల్లడించారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత ఇది కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ అంటూ జనరంజిక కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా విజయ్ అభిమానులు కోరుకునే విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయన్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో ఒక్క పాత్రలోనే కనిపిస్తారని స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. విజయ్ అభిమానులకు ఈ చిత్రం డబుల్ ధమాకా అవుతుందట! -
విజయ్ బర్త్‌డే: వారసుడు నుంచి విజయ్ సెకండ్ లుక్ పోస్టర్
తమిళ స్టార్ దళపతి విజయ్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక తమిళనాట అయితే విజయ్ పుట్టిన రోజు వేడుకలను ఫ్యాన్స్ గ్రాండ్ సెలబ్రెట్ చేస్తున్నారు. విజయ్‌కి పలువురు సినీ ప్రముఖులు సైతం విషెస్ తెలుపుతున్నారు. అంతేకాదు ఆయన బర్త్‌డే సందర్భంగా విజయ్ సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంతో తెరకెక్కుతున్న విజయ్ 66 మూవీకి సంబంధించిన మరో అప్డేట్ను తాజాగా వదిలారు మేకర్స్. నిన్న ఈమూవీ టైటిల్‌తో పాటు విజయ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చిత్రం బృందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Vijay As Varisu: వారసుడుగా వస్తోన్న దళపతి విజయ్ వారిసు(తెలుగులో వారసుడు) అని టైటిల్ ఖారారు చేశారు ఈ మూవీకి. తాజాగా ఈ చిత్రంలోని విజయ్‌కి సంబంధించిన మరోలుక్ వదిలారు. చూట్టూ పిల్లలు, గాలి పటాలు, చెరుకు గడలు మధ్య ఎండ్ల బండిలో పడుకుని ఆకాశం వైపు చూస్తూ కనిపించాడు విజయ్. ఈ సెకండ్ లుక్ పోస్టర్ చూస్తుంటే సంక్రాంతిని గుర్తు చేస్తుంది. అంటే ఇందులో విజయ్ పలు షేడ్స్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఇందులో సరదాగా నవ్వుతూ కనిపించిన విజయ్ లుక్కు అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో విజయ్ కొత్తలుక్ పలు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. చదవండి: ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే! Sankranthi 2023 is going to be special with the arrival of #Vaarasudu #VaarasuduSecondLook#Vaarasudu#Varisu#HBDDearThalapathyVijay Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/GySYHlT488 — Sri Venkateswara Creations (@SVC_official) June 22, 2022 -
విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ 66వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్ లోకేషన్స్‌కు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఓ నర్సరీలో చిత్రికరించిన సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. దీంతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఆసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ బృందానికి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టాడట. ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు షూటింగ్ స్పాట్లో ఎవరిని మొబైల్ ఫోన్స్ అనుమతించడం లేదని సమాచారం. చదవండి: వెకేషన్లో చరణ్, ఉపాసన.. క్యూట్ పిక్ షేర్ చేసిన మెగా హీరో హైదరాబాద్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలో విజయ్, రష్మికలకు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఇందులో విజయ్ క్యాజువల్ డ్రెస్‌లో ఉండగా.. రష్మిక పోట్టి ఫ్రాక్‌లో కనిపించింది. ఆ నర్సరీ రోడ్డు పక్కనే ఉండటంతో వాహనదారులంతా ఆగి మరి షూటింగ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వంశీ రూపొందిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. చదవండి: ఆ హీరో నన్ను అలా పిలవడం ఇష్టం లేదు: రష్మిక షాకింగ్ కామెంట్స్ #Thalapathy66 - Exclusive Pic 💥🔥 pic.twitter.com/RDFXA0EGdl — M∆HI - Infinity Plus YouTube (@MahilMass) June 10, 2022 #Thalapathy66 Shooting Spot Full Size Image 😍🔥#Beast @actorvijay pic.twitter.com/0JvsS91yHg — Vijay Fans Page (@VijayKWoodKing) June 9, 2022 #Thalapathy66 leaked 🥳 pic.twitter.com/DuhRm1WEbs — Kings😎 (@ikarthik7744) June 8, 2022 -
Vijay 66: హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న విజయ్ మూవీ
దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్లో పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. దళపతి 66 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్! అలాగే ఈ సినిమాలో చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు షూటింగ్ పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు సెట్స్‌కి వచ్చి షూట్లో పాల్గొనడంతో ప్రతిరోజూ ఒక పండగలా షూటింగ్ జరిగింది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయిలో సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: సింగర్ దారుణ హత్య, ప్రాణాలు తీసే ముందు 10 నిద్ర మాత్రలు.. Hai Chellam sssss. We are back #thalapathy66 pic.twitter.com/K2mK2TlNgi — Prakash Raj (@prakashraaj) May 22, 2022 -
సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ నటుడు విజయ్ (ఫొటోలు)
-
విజయ్-వంశీ పైడిపల్లి సినిమా వచ్చేది ఆ పండుగకే..
Vijay Vamshi Paidipally Movie Will Release In 2023: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా ఓ సినిమా రానుంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మంగళవారం (మే 10) తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో భారీ తారాగణం కనువిందు చేయనుందని సమాచారం. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కనువిందు చేయనున్నారట. వీరితో పాటు శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. అలాగే ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. భారీ తారాగణంతోపాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు కూడా వర్క్ చేస్తున్నారు. చదవండి: పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు Privileged to have @RealSarathKumar sir onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @karthikpalanidp#TeamThalapathy66 pic.twitter.com/9tYxYISbSP — Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గ్రాండ్ గా లాంచ్ అయిన విజయ్-రష్మిక మూవీ (ఫొటోలు)
-
చెన్నైలో గ్రాండ్ లాంచ్ అయిన విజయ్-రష్మిక మూవీ, నిర్మాత దిల్ రాజు
Vijay, Rashmika Mandanna Movie Starts In Chennai: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ ద్విభాషా చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ నేరుగా చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. ఇదివరకు దీనిపై ప్రకటన రాగా తాజాగా ఈ మూవీ చెన్నైలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమా బుధవారం ఉదయం పూజ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు హీరోహీరోయిన్ల తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. చదవండి: హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందించనున్నాడు. నేటి నుంచే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందని ఈ సందర్భంగా చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే మిగతా నటీనటులకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Elated to kick start the ambitious#Thalapathy66 with a Pooja ceremony in Chennai @actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_official @Cinemainmygenes #Thalapathy66Launched pic.twitter.com/3Z6Rev7fbi — Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2022 -
వేరే లెవల్.. దిల్‌రాజుకు షాకిచ్చిన విజయ్
Thalapathy Vijay Shocking Remuneration For Vamshi Paidipally Movie: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ త్వరలోనే తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం విజయ్ దాదాపు రూ.100కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. విజయ్‌కి తమిళం తర్వాత తెలుగులోనూ మాంచి మార్కెట్ ఉంది. చివరగా ఆయన నటించిన మాస్టర్ సైతం తెలుగులో సుమారు రూ.15 కోట్లు రాబట్టిందని టాక్. దీంతో తన మేనియాను దృష్టిలో ఉంచుకొని వంద కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. ఇక విజయ్ చేస్తున్న తొలి తెలుగు ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. -
దుబాయ్‌లో మహేశ్‌బాబు న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తుంటారు. ఇటీవలె మోకాలి సర్జరీ కోసం దుబాయ్ వెళ్లిన మహేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అక్కడే ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ఆయన తాజాగా న్యూ ఇయర్ వేడకలు జరుపుకుంటున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం ఫ్యామిలీతో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో జాయిన్ అయ్యారు. దీంతో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీపా దగ్గర వీరంతా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ ప్రీమియర్ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేశారు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన సతిమణి, అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, బాబీ, గుణశేఖర్, అలీ, సత్యదేవ్, విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండతో పాటు రొమాంటి చిత్ర బృందం, పూరీ, ఛార్మీలు పలువురు సినీ సెలబ్రెటీలు ఈ ప్రీమియర్ షోని వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘రొమాంటిక్’ సినిమా చాలా బాగుందని.. హీరోగా ఆకాశ్ తప్పకుండా విజయం సాధిస్తాడని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రీమియర్ షోకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికాశర్మ హీరోయిన్గా నటించింది. చదవండి: భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తమిళ హీరో విజయ్‌ని డైరెక్ట్ చేయనున్న వంశీ పైడిపల్లి
‘మహర్షి’ సినిమాకి జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి తన నెక్ట్ మూవీని ప్రకటించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న నటుడు దళపతి విజయ్‌తో తదుపరి సినిమా చేయనున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి ఆదివారం (సెప్టెంబర్ 26న) డైరెక్టర్ వంశీ అధికారిక ప్రకటన చేశాడు. ఈ ప్రాజెక్టు గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక బృందం ఈ మూవీకి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. కాగా విజయ్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘బీస్ట్’లో నటిస్తున్నాడు. ఆ మూవీ పూర్తి కాగానే వంశీ సినిమా పట్టాలెక్కనుంది. చదవండి: ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాదే హీరో: దిల్ రాజు #Thalapathy66... Sharing with you all an exciting update about my next film with The #Thalapathy @actorvijay Sir, Produced by #DilRaju garu & #Shirish garu under my home banner @SVC_official pic.twitter.com/R24UhFGNlW — Vamshi Paidipally (@directorvamshi) September 26, 2021 -
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
-
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
అన్నదాతలు, సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, సాహసమే శ్వాసగా తీసుకునే పరాక్రమవంతులు, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలు... మరెందరో స్ఫూర్తి ప్రదాతలకు సాక్షి మీడియా గ్రూప్ సలాం చేస్తోంది. వారి ప్రతిభకు గుర్తింపుగా ఈనెల 17న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డులను అందజేసింది. అందులో భాగంగా 2019గాను మహేశ్‌బాబుకు మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘థ్యాంక్యూ భారతీగారు.. మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘మహర్షి’ చిత్రం మా అందరికీ చాలా ప్రత్యేకం. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ.. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులైంది.. ఇలాంటి ఓ అవార్డు ఫంక్షన్ చూసి. మా నిర్మాతలు అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజుగార్లకు థ్యాంక్స్.. ‘మహర్షి’కి పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకం. 2020 అనే ఏడాదిని మేమందరం మిస్ అయిపోయాం.. మీరు అవార్డు ఇచ్చి మళ్లీ ఫంక్షన్స్ చేసుకునేలా చేశారు.. మా డైరెక్టర్ వంశీకి థ్యాంక్స్. ‘మహర్షి’ లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు మహర్షి’ విడుదలై రెండున్నరేళ్లు అయింది.. ఈ అవార్డు మేం చేసిన పనికి గుర్తింపు మాత్రమే కాదు.. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు.. మళ్లీ మంచి రోజులు వస్తాయని. ఇది నా ఒక్కడి అవార్డే కాదు.. మొత్తం మా టీమ్‌ది. నేను చేసిన ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజుగారు నా కుటుంబ సభ్యుల్లో ఒకరు. రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్లకు కూడా థ్యాంక్స్. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంటే కాదు.. మన సంస్కృతి. మళ్లీ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడే రోజుల కోసం వేచి చూస్తున్నా. ‘మహర్షి’ ప్రొఫెషనల్‌గా నాకు ఎంత ఇచ్చిందో తెలియదు కానీ వ్యక్తిగతంగా మహేశ్‌బాబుని ఇచ్చింది. నాకు జీవితాంతం రుణపడి ఉంటారని మహేశ్ అన్నారు.. ఆ మాట నాది. నేను ‘మహర్షి’ కథ చెప్పిన రోజు ఆయన చెప్పారు.. ‘ఈ సినిమాకి చాలా అవార్డులు అందుకుంటారని.. ఆ మాటలన్నీ నిజమయ్యాయి.. నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ సార్’. – వంశీ పైడిపల్లి, మోస్ట్ ఇన్స్పైరింగ్ మూవీ (మహర్షి) మహేశ్ వెన్నెముకగా నిలిచారు ఈ అవార్డుకి మా ‘మహర్షి’ సినిమాని ఎంపిక చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి థ్యాంక్స్. నాకెప్పుడూ ఓ ఎగై్జట్‌మెంట్ ఉంటుంది. మంచి సినిమా తీస్తే డబ్బులే కాదు.. గొప్ప గౌరవం తీసుకొస్తుందని నమ్ముతాను. ‘మహర్షి’ కథను వంశీ చెప్పినప్పుడు అదే నమ్మాను.. దానికి మహేశ్‌గారు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమా ప్రేక్షకులకే కాదు అవార్డ్స్, రివార్డ్స్ వరకూ వెళుతున్నందుకు థ్యాంక్స్. వంశీ పైడిపల్లి చెప్పినట్లు మాది పెద్ద ప్రయాణం. తన ఐదు సినిమాల్లో నాలుగు సక్సెస్‌ఫుల్‌గా చేశాం.. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. మహేశ్‌గారితో కూడా మా బ్యానర్లో హ్యాట్రిక్ సాధించాం. – నిర్మాత ‘దిల్’ రాజు, మోస్ట్ పాపులర్ మూవీ (మహర్షి) -
ఒకే ఫ్రేములో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్
Vamshi Paidipally Birthday: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకచోట చేరితే ఎలా ఉంటుంది? అబ్బో, ఆ సందడే వేరంటారా? ప్రముఖ దర్శకులంతా కలిసి ఇప్పుడు అదే పని చేశారు! టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి జూలై 25న పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన స్నేహితులతో పాటు ఇండస్ట్రీ సహచరులకు పార్టీ ఇచ్చాడు. ఈ క్రమంలో బర్త్‌డే వేడుకలకు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో టాలీవుడ్ దర్శకులంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, పరశురామ్, సుకుమార్, బోయపాటి శ్రీను, మెహర్ రమేశ్, కీర్తి సురేశ్, దిల్ రాజు- ఆయన భార్య, కార్తీ, అల్లు అరవింద్, సోనూసూద్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ బర్త్‌డే వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, పరశురామ్ సుకుమార్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, మెహర్ రమేశ్‌లు ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇది కాస్త ఆలస్యంగా బయటకు రాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.