vegetable market
-
‘శారదా మార్కెట్’ స్వాదీనంపై హైకోర్టు స్టే
నెహ్రూనగర్: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కొల్లి శారదా హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో ఉన్న షాపుల లీజు కాలపరిమితి ముగియడంతో గత కొద్ది రోజుల క్రితం గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు షాపుల స్వా«దీనానికి నోటీసులిచ్చారు. దీని విషయమై లీజుదారులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారం పాటు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది. 13వ తేదీలోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలని పేర్కొంది. కొల్లి శారదా మార్కెట్లో 1999లో 88 షాపులు నిర్మించారు. 25 ఏళ్ల లీజుతో షాపులను లీజుదారులకు అప్పగించారు. ఇటీవల గడువు ముగియడంతో వాటి స్వా«దీనానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఆ షాపులను కాపాడుకునేందుకు లీజుదారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతం బస్టాండ్ దగ్గరలో ఉండటం.. అదీగాక హోల్‌సేల్ మార్కెట్ కావడంతో రైతుల క్రయ, విక్రయాలు, వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడ రోజుకు కొన్ని రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా, కొంత మంది రెవెన్యూ అధికారులే లీజు దారుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అడ్డదారిలో షాపుల నిర్వహణకు సంబంధించి లూప్ హోల్స్ చెప్పి.. ఆ షాపులను నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలున్నాయి. -
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ!
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ! -
వెజిటబుల్స్ ఆన్ వీల్స్.. మొబైల్ మార్కెట్ రెడీ
మార్కెటింగ్ శాఖ ప్రారంభించిన మొబైల్ కూరగాయల మార్కె ట్లకు మంచి స్పందన లభిస్తోంది. తాజా కూరగాయలను రైతులే తమ ప్రాంతానికి తెచ్చి అమ్ముతుండటం, ధరలు కూడా ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుండటంతో వినియోగదారులు సంచార వాహనాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా చాలావరకు కూరగాయలు అమ్ముడుపోతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి విశేష స్పందన నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ ఫోన్ లేదా ఈమెయిల్ చేస్తే వినియోగదారులు కోరుకున్న ప్రాంతానికి ఈ మొబైల్ రైతు బజార్లను పంపించే వెసులుబాటు కల్పించింది. కూరగాయలు సైతం వివిధ యాప్‌ల ద్వారా ఆల్‌లైన్‌లో డోర్ డెలివరీ అవుతుండటం, వారానికో రోజు మండే మార్కెట్, ట్యూస్డే మార్కెట్ల వంటివి వీధి మలుపుల్లోనే కొనసాగుతుండటం, ఇళ్లకు సమీపంలోనే భారీ దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో ఇటీవలి కాలంలో రైతుబజార్లకు వెళ్లే వారి సంఖ్య కొంత తగ్గింది. గతంలో మాదిరి కిటకిటలాడటం లేదు. చాలా సందర్భాల్లో శ్రమకోర్చి తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోక రైతులు నష్టపోతున్నారు. కొన్నిసార్లు పాడైన కూరగాయలను అక్కడే పారబోసి వెళ్ళాల్సి వస్తోంది. పరిస్థితిని గమనించిన మార్కెటింగ్ శాఖ వినూత్నంగా ఆలోచించింది. వాహనాలు సమకూర్చి రైతులే కూరగాయల్ని బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ సముదాయాలకు తీసుకెళ్లి విక్రయించుకునే ఏర్పాటు చేసింది. రైతుబజార్లకు వచ్చే రైతులు అక్కడినుంచి కూరగాయలను వాహనాల్లో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు వెళతారన్నమాట. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని మూడు ప్రధాన రైతుబజార్ల నుంచి మార్కెటింగ్ శాఖ వాహనాలు పంపిస్తోంది. రైతులు వాహనాలకు సంబంధించిన డీజిల్, ఇతరత్రా ఖర్చులు ఏవీ భరించాల్సిన అవసరం లేకుండా తానే వ్యయాన్ని భరిస్తోంది. ప్రస్తుతం ఎర్రగడ్డ, ఫలక్‌నుమా, మెహిదీపట్నం రైతుబజార్ల నుంచి రైతులు వాహనాల్లో కూరగాయలు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. ఆన్లైన్లో వచ్చే కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చూసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తాజా కూరగాయలు కళ్లెదుటే కని్పస్తుండటం వల్ల వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. రైతుబజార్లకు తగ్గిన తాకిడి.. నగరవాసులు అన్ని వస్తు వులు ఆన్లైన్ ద్వారా డోర్ డెలివరీ పొందుతున్నారు. దీంతో రైతుబజార్లకు తాకిడి తగ్గింది. రైతులు కష్టపడి తెచ్చిన కూరగాయలు పూర్తిగా అమ్ముడవ్వక నష్టపోతున్నారు.దీంతో రైతులు వాహనాల్లో బస్తీలకు తీసుకెళ్లి విక్ర యించుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాం. – లక్ష్మీబాయి, డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ ధరలు తక్కువ ఉంటున్నాయ్.. మా ఏరియాలో హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ కానీ రైతుబజార్ కానీ లేదు. దీంతో కూరగాయలు కొనాలంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేంది. ధరలు కూడా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం వారానికి రెండుసార్లు బాలానగర్ బస్తీకి మొబైల్ రైతుబజార్ వస్తోంది. ధరలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. – గణపతి, బాలానగర్ నివాసి నిర్ధారించిన ధరలకే.. కూరగాయల ధరలను మార్కెటింగ్ శాఖే నిర్ణయిస్తోంది. ఆయా ధరలను రైతులు తమ వాహనం వద్ద బోర్డుపై ప్రదర్శిస్తున్నారు. ఆయా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ మార్కెటింగ్ శాఖ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. రైతులు ఇష్టమొచి్చన ధరలకు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తు తం ఒక్కో రైతుబజార్ నుంచి 10 చొప్పున మొత్తం 30 వాహనాలు ఈ విధంగా బస్తీలకు కూరగాయలు తీసుకెళుతున్నాయి. ప్రజల నుంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో నగరంలో మొత్తం 11 రైతుబజార్లు ఉండగా..మరికొన్ని ప్రధాన రైతుబజార్ల నుంచి మొత్తం 125 వాహనాలు నడిపే ఆలోచనలో మార్కెటింగ్ శాఖ ఉంది. కూరగాయల కోసం కాల్ చేయాల్సిన నంబర్లు.. ఎర్రగడ్డ రైతుబజార్.. 7330733746 ఫలక్‌నుమా.. 7330733743 మెహిదీపట్నం.. 7330733745 ఈమెయిల్.. ఎర్రగడ్డ రైతుబజార్.. MRB.E.HYD@Gmail.com మెహిదీపట్నం.. MRB.M.HYD@Gmail.com ఫలక్‌నుమా.. MRB.F.HYD@Gmail.com -
Lemon Prices: జనాల జేబుల్ని పిండేస్తున్న నిమ్మ!
దేశంలో నిమ్మకాయ జనాల జేబుల్నిపిండేస్తోంది. ఎండకాలం కావడంతో ధర పైపైకి ఎగబాకుతోంది. మొన్నటిదాకా 50-60 రూపాయలకు కేజీ పలికిన నిమ్మ.. ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు అధికంగా పలుకుతోంది. పట్టణాల్లో, నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్కెట్లో నిమ్మకాయల రేట్లు వాయించేస్తున్నాయి. ప్రధానంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కిలో నిమ్మకాయల ధర రూ. 200 కనిష్టంగా పలుకుతుండడం విశేషం. ఖుల్లా విషయానికొస్తే.. కాయకో రేటు, పండుకో రేటు లాగా అమ్ముతున్నారు. విడిగా ఒక్కో కాయను ఏడు నుంచి పది రూపాయలకు అమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల.. కిందటి ఏడాది ఇదే సీజన్ (మార్చి) పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం. ఇప్పుడు ఇలా ఉంటే.. ఏప్రిల్-మే నెలలో పరిస్థితి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సామాన్యుడి ‘కిచెన్ బడ్జెట్’లో నిమ్మ చిచ్చు పెడుతోంది. ఎండకాలం కావడంతో డైట్ తప్పనిసరి లిస్ట్‌లో కనిపించే నిమ్మ.. బడ్జెట్ పరిధిని దాటించేస్తోంది. ధరలు ఎప్పుడు దిగుతాయో అని ఎదురు చూడడం వినియోగదారుల వంతు అవుతోంది. మార్కెట్లో దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అయితే నిమ్మ ధరలు Lemon Prices ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటోంది. ఇంతకు ముందులా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేకపోతున్నారు కొందరు. నాణ్యతను కూడా పట్టించుకోకుండా కొనేస్తున్నారు ఇంకొందరు. నిమ్మను గుత్తగా అమ్మేవ్యాపారులే కాదు.. రోడ్ల మీద తోపుడు బండ్లపై రసాలు, నిమ్మసోడా అమ్మేవాళ్ల మీదా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆఖరికి టీ పాయింట్లలో లెమన్ టీ కొరత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్పత్తి తగ్గిపోవడం వల్లే.. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా నిమ్మకాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ముందస్తుగానే.. ఉత్పత్తిని గణనీయంగా తగ్గించేస్తున్నారు. అయినా కూడా ధరలను లెక్కచేయకుండా జనాలు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో.. బల్క్ మార్కెట్లో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. పెరిగిన ధరల కారణంగా తక్కువ పరిమాణంలో నిమ్మకాయల్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లే అధిక ధరలకు అమ్మేసుకుంటున్నారు. ఉత్పత్తి పెరిగితేనే.. ధరలు దిగొచ్చేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
విషాదం: బిడ్డను గమనించని తండ్రి.. వాహనాన్ని ముందుకు నడపడంతో
గీసుకొండ: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు.. పొరపాటున తండ్రి నడిపించే గూడ్స్ వాహనం కిందపడి తనువు చాలించింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ కాలనీలో మంగళవారం జరిగింది. బొలెరో గూడ్స్ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్న వల్లెపు రమేశ్‌కు కూతురు చందన (5), కుమారుడు ఉన్నారు. రమేశ్ ఉదయం ఇంటి నుంచి గూడ్స్ వాహనాన్ని వరంగల్ కూరగాయల మార్కెట్‌కు తీసుకుని వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. దివ్యాంగురాలైన చందన పాకుకుంటూ ఆ వాహనం వెనుక టైరు వద్దకు చేరింది. కూతురుని గమనించని తండ్రి వాహనాన్ని ముందుకు నడపడంతో టైరు కిందపడి చందన అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దేవేందర్ తెలిపారు. (చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఢీకొట్టిన లారీ) -
నకిలీ సొసైటీ పేరుతో రూ.14కోట్ల స్థలానికి ఎసరు!
చంచల్‌గూడ: అక్రమార్కులు కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తూ కోట్ల విలువ చేసే స్థలానికి ఎసరు పెడుతున్నారు. ఒక సొసైటీలోని కొందరు వ్యక్తులు చట్ట విరుద్ధంగా మరో సొసైటీ ఏర్పాటు చేసి రూ.14 కోట్లు విలువ చేసే స్థలాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు పథకం పన్నారు. ♦ కుర్మగూడ డివిజన్ మాదన్నపేటలో దయానంద వెజిటెబుల్ మార్కెట్ పేరుతో 4 ఎకరాల్లో కూరగాయల మార్కెట్ 1980లో స్థాపించారు. ♦ ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు అసలైన సంస్థకు ‘శ్రీ’జోడించి శ్రీ దయానంద పేరుతో మరో నకిలీ సొసైటీ ఏర్పాటు చేశారు. స్థలం కాజేసేందుకు పథకం రచించారు. ♦ కమిటీకి సంబంధం లేని బయటి వ్యక్తికి దాదాపు 2500 గజాలు నకిలీ సొసైటీ పేరుతో అప్పజెప్పారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను మోసం చేసి చట్ట విరుద్ధంగా ఈ చర్యలకు పాల్పడ్డారని అసలు కమిటీ ఆరోపణలు చేస్తోంది. ♦ స్థలం తీసుకున్న వ్యక్తి, నకిలీ సొసైటీ పేరుతో స్థలం అప్పజెప్పిన వారు పరస్పర కేసుల పేరుతో కుమ్మకై మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నకిలీ కమిటీ ఏర్పాటు చెల్లదంటూ సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు నకిలీ సొసైటీని రద్దు చేసింది. ♦ స్థలాన్ని మోసపూరితంగా కాజేసేందుకు యత్నించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అసలు కమిటీ సిద్ధమైనట్లు సమాచారం. -
ఈమె మా అమ్మ
మధుప్రియ పేదింటి అమ్మాయి. కష్టపడి చదివింది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడిక ప్రమోషన్ కూడా వచ్చింది. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంటుందని చుట్టుపక్కల అందరికీ తెలుసు. అయితే ప్రియకు తన తల్లి గురించి ఈమధ్యే .. అదీ నాన్న చెబితే.. ఒక నిజం తెలిసింది. అంత నిజం తెలిశాక మధుప్రియ ఊరుకుంటుందా? ‘చూడండి ఈ తల్లి కూతుర్నే నేను..’ అని లోకానికి చెప్పడం కోసమే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చుని తక్కెడ పట్టుకుంది. ఇంతకీ ప్రియకు తెలిసిన నిజం ఏమిటి? మధుప్రియకు పెద్ద ప్రమోషనే వచ్చింది. గత రెండేళ్లుగా చెన్నైలోని ఎఫ్.పి.ఎస్. ఇన్నొవేషన్స్ ల్యాబ్‌లో సీనియర్ హ్యూమన్ రిసోర్స్ అసోసియేట్‌గా పని చేస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు అదే కంపెనీకి అసోసియేట్ మేనేజర్ అయింది. యూఎస్ కంపెనీ అది. పెద్ద జీతం. ఇక ప్రమోషన్ అంటే ఇంకా పెద్ద జీతం. మధుప్రియ ఇంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆడపిల్లలెవరూ లేరు. తనే మొదటి అమ్మాయి. డిగ్రీ చదువుతుండగానే క్యాపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలక్ట్ అయింది. ఎఫ్.పి.ఎస్. (ఫుల్ పొటెన్షియల్ సొల్యూషన్స్) లోనే. సాఫ్ట్వేర్ కంపెనీ అది. అయితే ఇప్పుడొచ్చిన ప్రమోషన్ కన్నా పెద్ద ప్రమోషన్ ఆమె జీవితంలో మరొకటి ఉంది. ‘‘ఈమె మా అమ్మ’’ అని గర్వంగా చెప్పుకోవడమే ఆమె తనకు తను ఇచ్చుకున్న ప్రమోషన్. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంది. తండ్రికి చిన్న ఉద్యోగం. వాళ్లిద్దరి రోజువారి సంపాదనను బట్టి చూస్తే ప్రియ పేదింటి అమ్మాయే. కష్టపడి చదివింది. మంచి ఉద్యోగం సంపాదించింది. ఇందులో విశేషం ఏమీ లేదు. ‘‘ఇప్పుడు నేను సాధించిన ప్రమోషన్లో కూడా విశేషం లేదు’’ అంటోంది ప్రియ! అలా ఆమె అనడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం కూడా తండ్రి చెబితేనే ఆమెకు తెలిసింది. చిన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్‌కి తండ్రి వెళ్లేవాడు. తల్లి ఆలస్యంగా వెళ్లేది! ఆలస్యంగా అంటే.. మీటింగ్ అయిపోయాక. ఎప్పుడూ అంతే. ‘‘ఎందుకమ్మా ఆలస్యంగా వస్తావ్’’ అని ప్రియ అడిగేది. ‘‘ఇప్పటికి పనైందమ్మా’’అని తల్లి చెప్పేది. అయితే.. తన బిడ్డ కూరగాయలమ్మే ఆమె కూతురు అని తక్కిన పిల్లలకు తెలియకుండా ఉండటం కోసం ఆమె కావాలని ఆలస్యంగా చేసేదని తండ్రి చెప్పినప్పుడు ప్రియ కళ్ల వెంబడి నీళ్లు తిరగాయి. వెళ్లి తల్లిని కావలించుకుంది. అక్కడితో ఆగలేదు. ‘ఈమె మా అమ్మ’ అని చెప్పాడానికే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చొని తక్కెడ పట్టుకుంది. ప్రమోషన్ వచ్చి ఇప్పుడు పెద్ద మేనేజర్ అయినా కూడా అమ్మతో కలిసి కాసేపైనా కూరగాయలు అమ్ముతుంది! ఈ అమ్మ కూతుర్నని చెప్పుకోవడాన్ని మించిన ప్రమోషన్ ఏముంటుంది అని నవ్వుతుంది. ‘‘ఈ ప్రమోషన్ మా అమ్మకే అంకితం’’ అంటోంది. ∙ -
కోవిడ్ పేషెంట్ కలకలం.. మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతూ..
సాక్షి, నల్గొండ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా వేల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఆరిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్, కఠిన ఆంక్షలు అని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.అదే క్రమంలో వైరస్ సోకిన వారిని హోం ఐసోలేషన్, పౌష్టికాహారాలను తీసుకోవాలని సూచిస్తోంది. ఇంతలా చర్యలు తీసుకుంటూ, అప్రమత్తం చేస్తున్నా.. కొందరు మాత్రం ఏ భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా కొందరు బయట నిర్లక్ష్యంగా తిరుగడం, భౌతిక దూరం పాటించకపోవడం లాంటివి చేస్తూ వైరస్ వ్యాప్తికి దారులు తెరుస్తున్నారు. మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతూ.. ఇంకొందరు అయితే కరోనా సోకి కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండకుండా.. బయట యధేచ్చగా తిరుగుతూ వారే ప్రాణాలే కాక ఇతర ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. తాజాగా కరోనా సోకిన ఓ మహిళ మార్కెట్లో సాఫీగా కూరగాయలు అమ్ముతోంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ క్వారెంటైన్లో ఉండకుండా బయట రోడ్లపై తిరుగుతుంది. ఇటీవల ఆమెకు పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఇలా బయటకు వచ్చింది. అవగాహన లేమితో కారణంగా కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతోంది. ఇది గమనించిన అధికారులు ఆ మహిళను మార్కెట్ నుంచి ఐసోలేషన్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆ మహిళ వద్ద చాలామందే ఆకుకూరలు కొన్నట్లు తెలిపింది. దీంతో వారితో పాటు.. మార్కెట్‌కు వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
రామభద్రపురం.. వేలాది కుటుంబాలకు వరం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర కేంద్రంగా అంతర్ రాష్ట్ర అతిపెద్ద కూరగాయల మార్కెట్‌గా విరాజిల్లుతోంది రామభద్రపురం వెజిటబుల్ మార్కెట్. విజయనగరం జిల్లా రామభద్రపురంలో గల ఈ మార్కెట్ వేలాది మంది చిరు వ్యాపారులను అమ్మలా ఆదుకుంటోంది. ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలు, పండ్లను నిత్యం వీరభద్రపురం మార్కెట్ నుంచి ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. కూరగాయలు పండించే కూరాకుల కులస్తులు దాదాపు 600 కుటుంబాల వరకు ఇక్కడ ఉండటంతో ఈ మార్కెట్‌కు ప్రాచుర్యం వచ్చింది. రామభద్రపురంతో పాటు, ఆరికతోట, కొత్తరేగ, బాడంగి మండలం ముగడ, కోడూరు తదితర ప్రాంతాల్లో కూరాకుల కులస్తులు ఉన్నారు. ప్రతి కుటుంబం 25 సెంట్ల విస్తీర్ణంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తూ జీవనోపాధి పొందుతోంది. వీరితో పాటు రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు, గజపతి నగరం, మెంటాడ, సాలూరు, బొబ్బిలి మండలాల నుంచి రోజూ 3 వేల మంది వరకు రైతులు కూరగాయలు, పండ్లను ఈ మార్కెట్‌కు తెస్తుంటారు. పండ్లకూ కొదవ లేదు ఇక్కడ మామిడి, బొప్పాయి, జామ, పనస, అనాస, బత్తాయి, సపోటా, దానిమ్మ, ద్రాక్ష, అరటి తదితర పండ్లు కూడా లభ్యమవుతాయి. వీటిని దాదాపు 150 మంది వరకూ విక్రయిస్తుంటారు. స్థానికంగా పండేవే కాకుండా తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి అరటి గెలలు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి టమాటా రామభద్రపురం వస్తుంటాయి. అనాస, పనస పండ్లు శ్రీకాకుళం జిల్లా పాలకొండ, సీతంపేట నుంచి తీసుకువచ్చి ఈ మార్కెట్లో విక్రయిస్తుంటారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా కేంద్రాల్లోని అన్ని హోటళ్లకు ఇక్కడి నుంచే కాయగూరలు రోజూ ప్రత్యేక వ్యాన్లలో వెళ్తుంటాయి. ఈ మార్కెట్ వల్ల ఏటా సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆశీళ్ల ఆదాయం వస్తోంది. విపత్తు వేళా ఠీవీగా.. కరోనా ప్రభావంతో అనేక రంగాలు కుదేలయ్యాయి. ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ రామభద్రపురం అంతర్ రాష్ట్ర కూరగాయల మార్కెట్ తట్టుకుని నిలబడగలిగింది. కూరగాయ రైతులు యథావిధిగా సాగును కొనసాగించడం ఇందుకు ఎంతో దోహదపడింది. రైతు భరోసా పథకం ద్వారా కూరగాయ రైతులకు సైతం ఏటా రూ.13,500 సాయం అందించడంతో మరింత ఉత్సాహంతో పంటల సాగు చేపడుతున్నామని రైతులు చెబుతున్నారు. ఈ మార్కెట్టే ఆధారం మా తాతల కాలం నుంచి కూరగాయల సాగే మా వృత్తి. అప్పటి నుంచి ఈ మార్కెట్‌కే కూరగాయలను తెస్తున్నాం. ఈ ఏడాది రెండెకరాల్లో కూరగాయలు వేశాను. దిగుబడి బాగా వచ్చింది. వాటిని రామభద్రపురం మార్కెట్లోనే విక్రయిస్తున్నా. – కర్రి అప్పారావు, మెట్టవలస, బొబ్బిలి మండలం ఎందరో కార్మికులకు ఉపాధి రామభద్రపురం కూరగాయల మార్కెట్ మా లాంటి ఎందరో కార్మికులకు ఉపాధినిస్తోంది. నేను పదేళ్ల నుంచి కళాసీగా పనిచేస్తున్నాను. రోజూ రూ.300 నుంచి రూ.400 వరకు కూలీ రావడంతో జీవితం సాఫీగా వెళ్తోంది. – ఎరుసు రామకృష్ణ, కళాసీ, రామభద్రపురం 40 ఏళ్లుగా వ్యాపారం ఈ మార్కెట్లో సుమారు 40 ఏళ్ల నుంచి కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఇక్కడ పండిన కాయగూరలు, పండ్లను ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తాను. అక్కడ పండే టమాటా, మునగకాడలు, దుంపలు, క్యారెట్, బీట్రూట్ను ఇక్కడికి తెస్తుంటాను. – మామిడి చిన్న, వ్యాపారి, రామభద్రపురం -
పీపీఈ కిట్ ధరించి.. కూరగాయలు కొనడానికి వచ్చిన నటి
కరోనా సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. కేసుల సంఖ్య ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలంతా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి రాఖీ సావంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రాజకీయ నాయకులకంటే మీరు వంద రేట్లు మేలు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. రాఖీపై ఇంతలా ప్రశంసలు కురవడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. తాజాగా రాఖీ సావంత్ కూరగాయలు కొనడానికి సమీప మార్కెట్‌కి వెళ్లారు. అసలే కరోనా విజృంభిస్తోంది. పైగా సెలబ్రిటీ బయట కనిపించింది అంటే చాలు.. జనాలు ఎలా గుమిగూడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాఖీ సావంత్ ఓ వినూత్న ఆలోచన చేశారు. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్ ధరించి మార్కెట్ వెళ్లారు రాఖీ సావంత్. చేతులకు గ్లౌవుజులు.. ఒంటి మీద పీపీఈ కిట్ ధరించిన రాఖీ సావంత్.. ఓ కూరగాయల బండి దగ్గరకు వెళ్లి బేరమాడి.. మంచి ధర చెల్లించి మరి కూరగాయలు కొన్నారు. ఈ సమయంలో సదరు కూరగాయలమ్మే వ్యక్తిని మాస్క్ సరిగా ధరించమని సూచించారు. ఇక ఆమె షాపింగ్ అయిపోయిన తర్వాత రాఖీ ఒక్కసారిగా అరిచారు. ‘‘ఇన్ని కూరగాయలకు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనా.. నా జీవితంలో ఇన్ని ఎక్కువ ఐట్సెం ఇంత తక్కువ ధరకు ఎప్పుడు కొనలేదు’’ అంటూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు రాఖీ సావంత్. అంతేకాక బయటకు వెళ్లినప్పడు పీపీఈ కిట్ ధరించి వెళ్లడం చాలా మంచిది అంటూ అభిమానులకు సూచించారు. ఈ వీడియో ప్రసుత్తం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మాటలు చెప్పే రాజకీయ నాయకుల కన్నా మీరు చాలా బెటర్.. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటున్నావా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) -
కూరగాయల ధరలు కుతకుత
సాక్షి, సిటీబ్యూరో: వంటింట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత నెలలో కురిసిన వర్షాలతో చాలా ప్రాంతాల్లో పంట చేతికందకుండానే నేలపాలైంది. వాస్తవానికి ప్రతి చలికాలంలో కూరగాయల ధరలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ధరలు మాత్రం రెట్టింపయ్యాయి. గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ మోండా, మాదన్నపేట వంటి మార్కెట్లతో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్న 11 రైతుబజార్లకు రోజువారీగా దిగుమతి కూరగాయలు రాక తగ్గిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. చదవండి: కూరగాయల ధరలు 37% అప్! ► నగర జనాభా ప్రకారం ప్రతిరోజు దాదాపు మూడు వేల టన్నుల కూరగాయలు అవసరం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలే 60 శాతం తీరుస్తాయి. ► మిగతా కూరగాయలు కర్నూలు, చిత్తూరు, అనంతపురంతో పాటు కర్ణాటకలోని చిక్బల్లాపూర్ నుంచి దిగుమతి అవుతాయి. ► కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లతో ఏజెంట్లదే పెత్తనం. దీంతో వారు నిర్ణయించిన ధరే ఖరారు అవుతోంది. ► వ్యాపారులంతా సిండికేట్ కావడంతో రైతులకు కూడా నష్టం వాటిల్లుతోంది. ► గ్రేటర్ పరిధిలో కూరగాయలు నిల్వ చేయడానికి ఎక్కడా కోల్డ్ స్టోరేజీ లేదు. దీంతో రైతులు నిల్వ చేసుకునే పరిస్థితి లేక ఎంతో కొంతకు అమ్ముకోవాల్సి వస్తోంది. కూరగాయలు గత ఏడాది ప్రస్తుత ధరలు గతేడాది నవంబర్‌లో ప్రస్తుత ధరలు(కిలోకు) టమాటా రూ. 15 రూ. 30 బెండకాయ రూ. 30 రూ. 60 బిన్నీస్ రూ. 40 రూ. 80 వంకాయ రూ. 20 రూ. 40 దొండకాయ రూ. 20 రూ. 40 క్యాబేజీ రూ. 30 రూ. 60 కాప్సికం రూ.40 రూ. 80 పచ్చిమిర్చి రూ. 20 రూ. 50 -
కూరగాయల సంతలో ఎస్సై విధ్వంసం
లక్నో: పోలీస్ జీపుతో కూరగాయల మార్కెట్లో హల్చల్ చేసి భయాందోళనలు సృష్టించిన సబ్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడమే కాక ప్రయాగ్‌రాజ్ జిల్లా నుంచి బదిలీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లా గూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నాడు చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుమిత్ ఆనంద్ గురువారం నాడు జరిగిన వారాంతపు సంతలో పోలీస్ జీపుతో కూరగాయల మార్కెట్లో విధ్వంసం సృష్టించాడు. అమ్ముకునేందుకు పోసిన కూరగాయలను పోలీస్ జీపుతో అతివేగంగా వచ్చి వరుసగా తొక్కించాడు. అంతటితో ఆగక వెహికల్‌ను రివర్స్ చేసి మిగతా కూరగాయల పైనుంచి పోనిచ్చాడు. మార్కెట్ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లాలని, కూరగాయలు అమ్మొద్దన్న తన ఆదేశాలు పాటించని కారణంగా ఆగ్రహించిన ఎస్సై ఇలా చేసినట్లు సమాచారం. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో ఉన్నతాధికారులు సుమిత్‌పై చర్యలు చేపట్టారు. (సొంతంగా రెండు చక్రాల సవారీ..) ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్ ఎస్ఎస్పీ సత్యార్థ్ అనిరుద్ పంకజ్ శుక్రవారం నాడు మీడియా ఎదుట మాట్లాడుతూ... సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశాము. ఇది హేయమైన చర్య. దర్యాప్తుకు ఆదేశించాము’ అని పేర్కొన్నారు. వాస్తవానికి బుధవారం, శుక్రవారం నాడు సంతకు అనుమతి ఉంది. కానీ గ్రామస్తులు గురువారం సైతం సంతను నిర్వహించారు. దాంతో మార్కెట్‌ను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా సుమిత్ వారికి తెలిపాడు. వారు వినకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డట్లుగా తెలిసిందన్నారు. లాక్డౌన్ కొనసాగింపు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వారాంతపు సంతకు అనుమతి తెలపగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. (15 రోజుల్లోగా పంపేయండి) -
కూరగాయల రైతుకు నష్టాల దిగుబడి
సాక్షి, హైదరాబాద్: రైతుల రోజువారీ ఆదాయ మార్గమైన కూరగాయల సాగు సంక్షోభంలో పడింది. సాగు పనులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. మార్కెట్లో అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నా, ధరలు పతనం కావడంతో లాభాలు మడిలోనే ఆవిరవుతున్నాయి. టమాట, బీర, బెండ, దొండ, దోస తదితర పంట దిగుబడులు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. సాధారణంగా ఈ సీజన్లో కూరగాయల ధరలు భగభగమండేవి. పెళ్లిళ్లు, శుభకార్యాలతో డిమాండ్ బాగా ఉండేది. అయితే, కరోనా, లాక్డౌన్ ప్రభావాలతో కూరగాయల విక్రయాలకు గండిపడింది. రైతుబజార్లలో కూరగాయల మార్కెట్లు మూతబడ్డాయి. దాదాపు నెలన్నరగా రైతులు దిగుబడులను సగానికి సగం తగ్గిస్తూ విక్రయిస్తుండడంతో నష్టాలపాలవుతున్నారు. రవాణా చార్జీలు సైతం గిట్టుబాటు కాక దిగాలు పడుతున్నారు. కొనేవారు లేక.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో భాగంగా రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లకు తాళం పడింది. ఇప్పటివరకు కూరగాయల దిగుబడులను నేరుగా రైతుబజార్‌కు తెచ్చి హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయించే రైతులకు తాజా పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. దిగుబడులను ఎక్కడ విక్రయించాలో తెలియని పరిస్థితి నెలకొంది. రిటైల్ విక్రయాలకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. ఇంటింటి విక్రయాలు జరిపినప్పటికీ కరోనా భయంతో కొనుగోళ్లకు వినియోగదారులు ముందుకు రావట్లేదు. దీంతో మధ్యవర్తులకు దిగుబడులను అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయలు సాగుచేసిన రైతులు కూలీలతో దిగుబడులను వేరు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కూలీలకు రోజుకు సగటున రూ.500 వరకు చెల్లించాలి. అయితే కూలీలకు చెల్లించే మొత్తం కూడా దిగుబడుల విక్రయంతో దక్కడం లేదు. దీంతో కొందరు రైతులు గిట్టుబాటు కావడం లేదని పంట దిగుబడులను పొలాల్లోనే వదిలేస్తున్నారు. కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు కావడం లేదనే కారణంతో రైతులు కూరగాయల సాగును వదిలేయడమే మంచిదనే భావనతో ఉన్నారు. అదే జరిగితే ఇబ్బందులు తప్పవు. కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గితే డిమాండ్‌కు సరిపడా దిగుబడులు మార్కెట్లోకి రావు. దీంతో ధరలు పెరిగిపోతాయి. రాబడి 60 శాతం తగ్గింది అరెకరంలో టమాట, మరో అరెకరంలో దొండ సాగుచేస్తున్నా. మరో రెండు మడుల్లో గోకర, బీర వేశాం. దిగుబడి బాగుంది. కానీ ధరల్లేవు. గతేడాది ఇదే సమయంలో రోజుకు సగటున రూ.1,000 రాబడి వచ్చేది. కానీ ఇప్పుడు రూ.400 దాటడంలేదు. ఇది పెట్టుబడికే సరిపోవట్లేదు. మా కుటుంబసభ్యులతోనే సాగు పనులు చేస్తున్నాం. కూలీలను పెట్టుకుంటే నష్టాలు తప్ప పెట్టుబడి కూడా దక్కదు. – సిలువేరు మల్లయ్య, రైతు, సర్వేల్, యాదాద్రి జిల్లా పంటను పొలంలోనే వదిలేశా.. రెండెకరాల్లో టమాట, ఎకరంన్నరలో క్యాబేజీ, మరో రెండెకరాల్లో మునగ పంటలు వేశా. కూరగాయలకు ధరల్లేకపోవడం, కూలీలను పెట్టుకుంటే గిట్టుబాటు కాదని పంటంతా పొలాల్లోనే వదిలేశా. పొలం పక్కనున్న వారికి అవసరమైన కూరగాయలను తెంపుకోమని చెప్పా. – రొక్కం భీంరెడ్డి, రైతు, తుర్కయాంజాల్, రంగారెడ్డి జిల్లా -
అతి తక్కువ ధరలకే కూరగాయాల విక్రయం
-
రైతుబజార్లో జేసీ ఆకస్మిక తనిఖీలు
-
కూరగాయాల మార్కెట్ పరిశీలన
-
రైతు బజార్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు
-
కూరగాయలకు పోటెత్తిన ప్రజలు
-
కొండెక్కిన కూరగాయల ధరలు
-
విజయవాడలో జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్
సాక్షి, విజయవాడ : విజయవాడలో జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్ కనిపిస్తోంది. రైతు బజార్లకు వినియోగదారులు పోటెత్తుతున్నారు. రేపు(ఆదివారం) జనతా కర్ఫ్యూకి ముందస్తుగా కూరగాయల కొనుగోళ్లు చేస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు రావటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. థర్మల్ సెన్సార్‌తో వినియోగదారులకు పరీక్షలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. రేపు పెట్రోల్ బంకులు కూడా మూతపడుతుండటంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కొత్తపేట గడ్డి అన్నారం కూరగాయల మార్కెట్‌కు ప్రజలు భారీగా వస్తున్నారు. భారీ స్థాయిలో ప్రజలు రావడంతో కొద్ది రోజులతో పోల్చుకుంటే వ్యాపారం బాగా జరిగిందంటూ వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత తెచ్చిన సరుకంతా అమ్ముడుపోయిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. (‘జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి’) కృష్ణా జిల్లా : కరోనాను నివారించడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్బాబు సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 15 రోజులపాటుగా స్వీయ నిర్బందనలో ఉండాలన్నారు. జనతా కర్ఫ్యూ ప్రజల క్షేమం కోసమేనని, పోలీస్ వారి నుంచి ఎలాంటి బలవంతపు నిర్బంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. (ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక!) జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటల బంద్! -
కూరగాయల మార్కెట్ వద్ద రైతుల ఆందోళన
-
వెజిట్రబుల్!
సాక్షి సిటీబ్యూరో: నగర జనాభా కోటిదాటింది. ఇంతమందికి సరిపడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్ల కోసం తగినన్ని మార్కెట్లు అవసరం. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన నగరంలో కనీసం 50 మార్కెట్లు ఉండాలనేది నిపుణుల అభిప్రాయం. పోనీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున అనుకున్నా 27 ఉండాలి. కానీ గ్రేటర్లో కేవలం11 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నగరవాసులు 5–6 కిలోమీటర్లు ప్రయాణించి, 3–4గంటల సమయం వెచ్చించి రైతు బజార్లలో కూరగాయలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులకు గిట్టుబాటు ధర, సిటీజనులకు తాజా కూరగాయలు అందించాలనే సంకల్పంతో 1999లో రైతుబజార్లు ఏర్పాటు చేశారు. అప్పటి జనాభాకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేయగా... జనాభా అంతకంతకూ పెరగగా, రైతు బజార్లను మాత్రం పెంచలేదు. మార్కెటింగ్ శాఖ కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ నగరంలో ఖాళీ స్థలం దొరకడం లేదు. కనీసం ఎకరం స్థలం ఉంటేనే రైతు బజార్ ఏర్పాటు చేస్తామని మార్కెటింగ్ శాఖ పేర్కొంటోంది. నగరంతో పాటు శివార్లలో చాలా ప్రాంతాల్లో ఎకరం కంటే తక్కువ స్థలాలున్నా వాటిని ఉపయోగించుకోవడం లేదు. మో‘డల్’ మార్కెట్లు.. రైతుబజార్లు ఏర్పాటు చేసినప్పుడు గ్రేటర్ జనాభా 40 లక్షలు. ఇప్పుడు కోటి దాటింది. జాతీయ పోషకాహార సంస్థ సూచనల మేరకు ప్రతి ఒక్కరూ 300 గ్రాముల తాజా కూరగాయలు, 100 గ్రాముల పండ్లు తీసుకోవాలి. ఈ లెక్కన కోటి మందికి 3వేల టన్నుల కూరగాయలు అవసరం. ఆ మధ్య ప్రారంభించిన మేడిపల్లి, ఎల్లమ్మబండ రైతుబజార్లతో కలిపితే మొ త్తం 11 రైతుబజార్లు ఉన్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటే కిలోమీటర్ల ప్రయాణం తప్పడం లేదు. ప్రతి 10వేల మందికి ఒక మార్కెట్ ఉండాలని... నగర వ్యాప్తంగా మోడ ల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కానీ ఇంతవరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ తూకమే... ఇప్పుడంతా డిజిటల్ యుగం. కానీ మార్కెటింగ్ శాఖ పరిధిలో ఇంకా తరాజు సిస్టమ్ కొనసాగుతోంది. ఇదే అదనుగా కొన్ని మార్కెట్లలో తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చే కూరగాయల ఆధారంగా మార్కెటింగ్ శాఖ «అధికారులు రోజూ ధరలు నిర్ణయిస్తారు. ఆ ధరలకు అనుగుణంగానే రైతుబజార్లలో విక్రయాలు జరగాలి. కానీ అలా ఎప్పుడూ జరగడం లేదు. రైతుబజార్ బోర్డుపై రాసిన ధరలకు, అమ్మే ధరలకు పొంతన ఉండడం లేదు. రైతుబజార్లలో ధరలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వినియోగదారుల నుంచి నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక రైతుబజార్లలో అరకిలో కంటే తక్కువ విక్రయించరు. ఒకవేళ అడిగినా తూకాలు లేవని చెబుతారు. డిజిటల్ తూకాలు ఉంటే ఈ సమస్య ఉండదు. దళారుల దందా... నగరంలోని దాదాపు అన్ని రైతుబజార్లలో రైతులు నామమాత్రంగానే కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇక్కడ ఏడాది పాటు దళారుల పెత్తనమే సాగుతోంది. కొన్ని సందర్భాల్లో రైతులకు స్థలాలు లేక రైతుబజార్ల బయట విక్రయాలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని రైతుబజార్లలో 150–250 వరకు షాపులు ఉన్నాయి. ఒక్కో బజారులో సాధారణ రోజుల్లో 1,500–2,000 క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు జరుగుతాయని మార్కెటింగ్ శాఖ అధికారుల అంచనా. ఇక పెద్ద రైతుబజార్లయిన ఎర్రగడ్డ, కూకట్పల్లి, సరూర్‌నగర్, మెహిదీపట్నం మార్కెట్లలో రోజూ 3,500 క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఒక్కో రైతుబజార్ÆŠకు రోజూ 10వేల మంది వస్తారు. దాదాపు రోజుకు రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు విక్రయాలు జరుగుతాయి. ఇక ఆదివారాల్లో అయితే 25వేల మంది వస్తారని.. రూ.50 లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ విక్రయాలన్నీ రైతుల పేర్లతో జరుగుతున్నాయి. కానీ వాస్తవానికి విక్రయించేది మాత్రం దళారులు. దీంతో ఇంత మొత్తంలో వ్యాపారాలు జరుగుతున్నా వాణిజ్య పన్ను ఎవరూ చెల్లించడం లేదు. స్టాళ్ల సంఖ్య పెంపు గ్రేటర్ పరిధిలో రైతుబజార్ల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలు లభించడం లేదు. రైతుబజార్ల ఏర్పాటు కోసం కనీసం ఎకరం అవసరం. కొత్తగా రైతుబజార్ల ఏర్పాటుకు ప్రణాళికలు వేశాం. నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చాడాకి ‘మన కూరగాయలు’ స్టాళ్ల సంఖ్యను పెంచుతున్నాం. – లక్ష్మిబాయి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ -
అర్ధరాత్రి ఎగసిన అగ్నికీలలు
తగరపువలస ప్రాంతంలో అతిపెద్ద ప్రైవేటు మార్కెట్ ఇది. కూరగాయల నుంచి అన్ని నిత్యావసర వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రోజూ రూ.5 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఆశీలు రూపంలో నిర్వాహకులకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఇక్కడ ఉండరు. సాయంత్రం ఆరు.. ఏడు గంటల తరువాత వ్యాపారులంతా దుకాణాలు కట్టేసి వెళ్లిపోతారు. ఆ తరువాత ఆకతాయిలు చొరబడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి తరువాత పెద్ద ఎత్తున అగ్నికీలలు చుట్టిముట్టి సర్వం బూడిదైంది. సాక్షి, తగరపువలస (భీమిలి) : ఇక్కడి ప్రైవేట్ మార్కెట్ గురువారం అర్ధరాత్రి తరువాత అగ్నికి ఆహుతైపోయింది. ఈ ప్రమాదంలో 73 దుకాణాలు కాలి బూడిదైనట్టు రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం రూ. 47.29 లక్షల ఆస్తి నష్టం నష్టం సంభంవించినట్లు ప్రాథమిక అంచనా. ఇందులో కాలిపోయిన వస్తువుల విలువే రూ.27.29 లక్షలు, షెడ్ల విలువ రూ. 20 లక్షల వరకు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెప్పారు. రాత్రి ఒంటి గంటన్నర ప్రాంతంలో మొదలైన మంటలు తెల్లవారు జామున నాలుగు గంటల వరకు ఎగిసి పడుతూనే ఉన్నాయి. ముందుగా మెయిన్ రోడ్డుకు చేరువలో ఉన్న తట్టలు, చాపలు అంటుకుని ఆరు లైన్లలో ఉన్న దుకాణాలను చుట్టుముట్టడంతో అగ్నికీలలు మార్కెట్‌ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో కాయగూరలు, ఉల్లి, ఫ్యాన్సీ, గాజులు, అరటిపండ్లు, కోడిగుడ్లు, నూనె, కిరాణా, మిర్చి, పసుపు, కుంకుమ, చీపుళ్ల దుకాణాలు కాలిపోయాయి. ఒక్కో వ్యాపారి రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోయారు. ఇది గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే చేసిన పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ఫైరింజన్లు శ్రమించినా.. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ సిబ్బంది తాళ్లవలస అగ్నిమాపక సిబ్బందిని వెంట పెట్టుకుని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే నీరు అయిపోవడంతో నగరం నుంచి మరో ఫైరింజన్‌ను తీసుకువచ్చారు. సమయానికి నీరు అందుబాటులో లేకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు మార్కెట్‌ను మిర్చి, మసాలా కాలిన ఘాటు పొగతో నిండిపోయింది. దీంతో రెండు బాబ్కాట్లు, జేసీబీతో మార్కెట్లో బూడిద తరలించడానికి అంతరాయం ఏర్పడింది. తరచూ అగ్ని ప్రమాదాలు.. మార్కెట్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ జరగలేదు. వ్యాపారులకు సరైన గిడ్డంగి వసతులు లేకపోవడంతో దుకాణాల్లోనే సామగ్రి భద్రపరచుకుని వెళ్లిపోతుంటారు. ఆరు మండలాలకు కేంద్రంగా ఉన్న ఈ మార్కెట్‌కు ఆశీళ్ల రూపంలో రోజుకు రూ.40 వేలు, ఆదివారం సంత సమయంలో రూ.1.50 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. ప్రతిరోజు రూ.2 కోట్ల విలువైన వస్తువులు ఉంటున్నా ప్రయివేట్ యాజమాన్యం కాపలాదారులను ఉంచకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మందుబాబులు రాత్రి 8 దాటితే మార్కెట్లో దుకాణాలను బార్లుగా మార్చేస్తుంటారు. తిని తాగి దుకాణాలపై ప్రతాపం చూపిస్తుంటారు. ఈ అగ్ని ప్రమాదానికి కూడా మందుబాబులే కారకులై ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. -
ఏమ్మా... గిరాకీలు ఎట్లా ఉన్నయ్ ?
గజ్వేల్: ఏమ్మా... బాగున్నారా.. గిరాకీలు ఎట్లా ఉన్నయ్? సౌలత్లకు ఇబ్బంది లేదు కదా? అంటూ మహిళా కూరగాయ రైతులను మంత్రి హరీశ్‌రావు ఆత్మీయంగా పలకరించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్–పాతూరు కూరగాయల మార్కెట్‌ను ఆయన సందర్శించారు. మహిళా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ మార్కెట్‌తో మంచి ఫలితాలు రావడం ఆనందంగా ఉందన్నారు. మహిళా రైతులు మంత్రితో మాట్లాడుతూ.. సార్ మీరు రాక చాలా రోజులవుతుందంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కూరగాయలు కొనడానికి వచ్చిన వారిని కూడా మంత్రి పలకరించారు. దీంతో హరీశ్‌తో పలువురు వినియోగదారులు సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. -
ఉప్పల్ వెజిటెబుల్ మార్కెట్లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని వెజిటెబుల్ మార్కెట్ లో శుక్రవారం అర్ధ రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. యాదాద్రి, మేడ్చల్ జిల్లాల రైతులు చాలా మంది ఇక్కడకు కూరగాయలు తీసుకొచ్చి విక్రయం చేస్తుంటారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా మార్కెట్ లో మంటలు అలుముకున్నాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో ఐదు కూరగాయల షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఎలా చెలరేగాయి అనే సంగతి తెలియలేదు. ఎవరైనా కావాలని చేశారా ? లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రమాదాని గల కారణాల గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.