vishakapatnam district
-
నాపై 74 తులాల బంగారం చోరీ కేసు, చచ్చిపోదామనుకున్నా:నటి
జూనియర్ ఆర్టిస్ట్, నటి సౌమ్య శెట్టి బంగారు ఆభరణాలను దొంగిలించిందంటూ కొద్దిరోజుల క్రితం ఓ వార్త వైరలైంది. విశాఖపట్నం దొండపర్తిలో రిటైర్డ్ పోస్టల్ అధికారి జనపాల ప్రసాద్‌బాబు ఇంట్లో 74 తులాల బంగారం చోరీ చేసిందంటూ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ నగల్లో కొంత విక్రయించి గోవా వెళ్లి ఎంజాయ్ చేయగా మిగిలిన 40 తులాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. నోరు నొక్కేస్తున్నారు బెయిల్‌మీద బయటకు వచ్చిన సౌమ్య ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. నా మీద తప్పుడు కేసు పెట్టారు. లేనిపోని నిందలు వేశారు. రిమాండ్‌లో లేకపోయినా రిమాండ్‌లో ఉంది, జైల్లో ఉందంటూ అసత్య ప్రచారం చేసి నన్ను జాతీయ స్థాయిలో పాపులర్ చేశారు. బయటకొచ్చి నిజాలు చెప్తుంటే ఏవేవో కేసులు పెట్టి నోరు నొక్కేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నా.. కానీ నా భర్త బతికి పోరాడాలని చెప్పారు. ఫైట్ చేస్తాను. పోరాడతా.. మీరు అబద్ధాన్ని నిజం చేశారు. కానీ నన్ను భయపెట్టలేరు. నాకు దొంగ అని ట్యాగ్ వేసి పిచ్చికుక్కను చేసి జైల్లో వేద్దామనుకున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. నేనూ నా నిజం చెప్పుకోవాలి. కోర్టులో ఏది రుజువు కాకముందే నా జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేశారు. నా వైపు దేవుడున్నాడు. పోరాడతాను' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది. అలాగే రిటైర్డ్ పోస్టల్ అధికారి కుటుంబానిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తనపై దుష్ప్రచారం చేసిన గీతూరాయల్, ధనుష్‌లపై పరువునష్టం దావా వేయబోతున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Soumya killampalli (@soumyashettysomu23) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే.. మరి థియేటర్లో..! -
వివాహ వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లినర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రికి చేరుకుంటారు. ఓ కాలేజీ ఆవరణలో జరుగుతోన్న అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి వెళ్లనున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్. ఇదీ చదవండి: AP: ఇకపై పింఛన్ రూ.2,750 -
LPG cylinder: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్
దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలతో సామాన్యుడు ఆందోళనకు గురవుతుంటే గ్యాస్ బండ రూపంలో మరోసారి షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటవ తేదీన సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగానే (May 1st) మే ఒకటవ తేదీన కూడా సిలిండర్ ధరలను సవరించాయి. ఈ క్రమంలో సామాన్యులకు, వ్యాపారులకు మరోసారి షాకిచ్చాయి. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర (19 కేజీలు) రూ.102.5 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో 19 కేజీల సిలిండర్ ధర రూ.2355.5కి చేరింది. అంతకు మందు రూ. 2,253 ఉంది. కాగా, ఏప్రిల్ 1వ తేదీన 19 కేజీల సిలిండర్ ధరను ఒకేసారి రూ.250 పెంచిన విషయం తెలిసిందే. ఇక ఇళ్లలో ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. చివరి సారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటును రూ.50 పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,002గా కొనసాగుతోంది. కాగా, చిన్న గ్యాస్ సిలిండర్ (5కేజీలు) ధర రూ. 655గా కొనసాగుతోంది. ఇక పెరిగిన ధరల ప్రకారం.. - హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,563 - విశాఖపట్టణంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2, 413. - విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,501కి చేరుకుంది. The price of a 19-kg commercial LPG cylinder has been hiked to Rs 2355.50 from Rs 2253; a 5kg LPG cylinder is priced at Rs 655 now. — ANI (@ANI) May 1, 2022 ఇది కూడా చదవండి: కరోనా నష్టాలు పూడ్చుకోవడానికి పన్నెండేళ్లు: ఆర్బీఐ -
విశాఖ జిల్లాలో మరికొన్ని కొత్త గ్రామాలు
-
విశాఖపట్నంలో ప్రారంభమైన భోగి సంబరాలు
-
నోట్లో డీజిల్ పోసుకుని ఫైర్ చేస్తుండగా రివర్స్ ఫైర్
-
చంద్రబాబు రైతులను మోసం చేశాడు: కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు గతంలో రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రుణ మాఫీ చేస్తానని రైతులను నిలువునా ముంచింది బాబు కాదా? అని ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తి బాబును మండిపడ్డారు. చంద్రబాబు హైటెక్ మోజులో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. రైతుల పట్ల టీడీపీకి ఏ విధానం కూడా లేదని మండిపడ్డారు. చరిత్రలో ఏనాడు కూడా చంద్రబాబు ఎలాంటి ప్రోత్సహకాలు ఇవ్వలేదన్నారు. రైతులకు ఏలాంటి మేలు కూడా బాబు చేయలేదన్నారు. వైఎస్సార్ వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు. తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. -
విశాఖకు చంద్రబాబు అనుకూలమా?.. కాదా?: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నానికి చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయని అన్నారు. హైదరాబాద్‌పై పెట్టుబడి పెట్టడం వల్ల విభజనతో ఇప్పుడు నష్టం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగితే విద్వేషాలు ఏర్పడవని వివరించారు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయని తెలిపారు. అత్యాశగా విశాఖపట్నం రాజధాని కోరలేదని, అన్ని అర్హతలు ఉన్నాయి కనుకనే విశాఖను రాజధాని నగరంగా ప్రకటించామని చెప్పారు. టీడీపీకి విశాఖపట్నంలో ఓట్లు, సీట్లు కావాలి కానీ అభివృద్ధి మాత్రం అవసరం లేదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉప్పుడు పట్టించుకున్నారా అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేమి లేదన్నారు. టీడీపీ నేతలు చెప్పిన అబద్దాలే పదేపదే చెబుతున్నారని మంత్రి అవంతి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉందని అన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని గుర్తు చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. చదవండి: ‘టీడీపీ అండ్ కో పిచ్చి మాటలు మానుకోవాలి’ -
AP: శ్మశానవాటికలో దారుణం.. శిశువు బతికుండగానే ఖననానికి యత్నం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశానవాటికలో దారుణం చోటు చేసుకుంది. నలుగురు ఓ శిశువు బతికి ఉండగానే ఖననం చేయడానికి యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును బతికుండగానే ఖననం చేయడానికి ప్రయత్నించారు. కవర్లో ఉంచిన శిశువును పాతి పెట్టాలని వారు శ్మశానవాటిక సిబ్బందిని కోరారు. దీంతో కవర్ తెరవగా శిశువు ఏడ్వటంతో శ్మశానవాటిక సిబ్బంది షాక్‌కు గురయ్యారు. సిబ్బంది ప్రశ్నించడంతో శిశువును వదిలి నలుగురు పరారయ్యారు. వెంటనే శ్మశానవాటిక సిబ్బంది కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్మశానవాటికకు చేరుకొని శిశువును రైల్వే న్యూకాలనీలోని ఆస్పత్రికి తరలించారు. -
ఆటో డ్రైవర్ కుమారుడు.. ఐఏఎఫ్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆరిలోవ ప్రాంతం రవీంద్రనగర్ దరి ఎస్ఐజీ నగర్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమారుడు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) లో ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. ఎస్ఐజీ నగర్‌కు చెందిన గుడ్ల సూరిబాబు కొన్నేళ్లుగా ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమారుడు గుడ్ల గోపినాథ్ రెడ్డి ఎంఎస్సీ, ఎంబీఏ, కుమార్తె గౌరీప్రియ ఎమ్మెస్సీ పూర్తి చేశారు. గోపినాథ్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ (వీడీఏ)లో ఇంటర్, వీఎస్ కృష్ణా కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదువుకున్నారు. 2009లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు ఆయనను ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. ఆ ఉద్యోగంలో గోపినా«థ్ త్వరలో చేరనున్నట్లు అతని తల్లిదండ్రులు సూరిబాబు, చిన్నతల్లి తెలిపారు. కాగా, తమ కుమారుడు దేశ రక్షణ విభాగంలో భాగస్వామ్యం అవడం గర్వకారణంగా ఉందని గోపినాథ్ తల్లిదండ్రులు ‘సాక్షి’ కి తెలిపారు. చదవండి: కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పేంటి? -
సింహగిరి.. భక్తఝరి
సాక్షి,సింహాచలం(విశాఖపట్నం) : విరులు పులకించాయి. ఝరులు స్వాగతించాయి. గిరులు ఉప్పొంగిపోయాయి. అడుగులో అడుగేస్తూ అప్పన్నను తలుస్తూ ముందుకు సాగింది భక్తజనం. అన్ని దారులూ సింహగిరివైపే.. అందరి నోటా గోవింద నామస్మరణే.. స్వామి తలపుతో గిరియాత్ర సాగిపోయింది.సింహ గిరీశా పాహిమాం..రక్షమాం..అంటూ భక్తజనం వేడుకుంది. స్వామే నడిపిస్తున్నారనే భావనతో అలవోకగా ప్రదక్షిణలో నిమగ్నమైంది. భక్తిభావం ఉప్పొంగింది. ఎటు చూసినా ఉత్సాహం.. ప్రదక్షిణోత్సాహం.. ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సింహగిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణలో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ చేసేందుకు ఉదయం 8 గంటల నుంచే సింహాచలానికి భక్తులు చేరుకున్నారు. రాత్రి 10 వరకు ప్రదక్షిణ చేసేందుకు భక్తులు సింహాచలం తరలివస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు ప్రదక్షిణకు తరలివచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు, యువత గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఘల్లుమన్న జానపదం రథోత్సవంలో సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పురుషోత్తపల్లికి చెందిన ‘ఓం నమో వెంకటేశాయ భజన మండలి’ మహిళల డప్పు వాయిద్య కార్యక్రమం ఈ ఏడాది ప్రత్యేకం.విజయనగరం జిల్లా పూసపాటిరేగకి చెందిన తప్పెటగుళ్లు, పులివేషాలు, విశాఖకి చెందిన కోలాటం తదితర ప్రదర్శనలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రదక్షిణలో పదనిసలు భక్తుల సందడి ఉదయం 8 గంటల నుంచే మొదలైంది. 10 గంటలకు భక్తుల తాకిడి పెరిగింది. రథోత్సవం జరిగే సమయానికి 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం భక్తులతో నిండిపోయింది. తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ ఏడాది 26 క్యూలను ఏర్పాటు చేశారు. నగరం నుంచి పాత గోశాల వైపు వచ్చే బస్సుల్ని ఉదయం నుంచే గోశాల జంక్షన్ వద్ద నిలిపివేశారు. కొన్ని వాహనాలను శ్రీనివాసనగర్ నుంచే అనుమతించలేదు. దీంతో చాలామంది భక్తులు శ్రీనివాసనగర్ నుంచి కాలినడకన తొలిపావంచా వద్దకు చేరుకున్నారు. హనుమంతవాక నుంచి బీఆర్టీఎస్ రోడ్డులో అడవివరం జంక్షన్ వరకు మాత్రమే అనుమతించారు. అక్కడి నుంచి తొలిపావంచాకి వచ్చే భక్తులను గాంధీనగర్, పుష్కరిణి, రాజవీధి మీదుగా మళ్లించడంతో భక్తులంతా ఆ మార్గంలోనే నడిచి వెళ్లారు. కొంతమంది భక్తులు సింహగిరి ఘాట్‌రోడ్‌లోకి వెళ్లి కొత్త ఘాట్‌రోడ్డు మీదుగా అడవివరం జంక్షన్ చేరుకుని ప్రదక్షిణ చేశారు. యువత సెల్ఫీలు తీసుకుంటూ ప్రదక్షిణ చేసారు. రథోత్సవం ప్రారంభమయ్యే సమయానికి వరుణుడు చిరుజల్లులు కురిపించాడు. సాయంత్రం అడవివరంలో చినుకులు పలకరించాయి. భక్తులు తడుస్తూనే గిరి ప్రదక్షిణ చేశారు. -
లక్షలు ఖర్చుపెట్టా.. వసూలు చేయండి!
సాక్షి, గుంటూరు : ‘గత ప్రభుత్వంలో రూ.లక్షలు ఖర్చుపెట్టి పోస్టింగ్ తెచ్చుకున్నా.. ఆ నగదు మీరే వసూలు చేసి పెట్టాలి’ అంటూ జిల్లా స్థాయి ఎక్సైజ్ అధికారి సిబ్బందికి హుకుం జారీ చేయడంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది హడలిపోతున్నారు. సుమారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఎక్కడ వసూలు చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో అయోమయంలో పడ్డారు. ఆ అధికారి వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖలో జోరుగా చర్చ సాగుతోంది. బదిలీల హడావుడి ప్రస్తుతం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో బదిలీలు నడుస్తున్నాయి. గుంటూరు నగరంలో 1–టౌన్, 2–టౌన్ ఎక్సైజ్ స్టేషన్లు, ఈఎస్ టాస్క్‌ఫోర్స్, డిస్టిక్ కంట్రోల్ రూమ్ అనే విభాగాలు ఉన్నాయి. ఈ మూడు విభాగాల్లో సుమారు 30 వరకూ సీఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పనిచేయడానికి వీలుంటుంది. గుంటూరు నగరంలో పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నవారందరూ ఎక్సైజ్ స్టేషన్లు, టాస్క్‌ఫోర్స్‌లకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ పోస్టింగ్‌ల కోసం సుమారు వంద వరకూ సిబ్బంది పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్లో ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలకు అవకాశం ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసే సిబ్బంది జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ బెల్టుషాప్‌లు, సార తయారీ, విక్రయ కేంద్రాలు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, ఇతరత్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. జిల్లా స్థాయి వేధింపులకు భయపడి ఎన్ఫోర్స్మెంట్లో పోస్టింగ్‌కు ఎవ్వరు ముందుకు రావడం లేదని సిబ్బంది చర్చించుకుంటున్నారు. తగ్గిన ఉల్లంఘనలు.. నూతనంగా ఏర్పాటైన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మద్యం షాపులు, బార్లకు నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో గత ప్రభుత్వంలో వచ్చినంతగా అక్రమ సంపాదన క్షేత్రస్థాయిలో రావడం లేదు. దీంతో జిల్లా అధికారికి డబ్బు వసూళ్లు చేసిపెట్టడానికి సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వస్తోంది. డబ్బు వసూలు కావడం లేదని చెప్పినప్పటికీ ఆ అధికారి అర్థం చేసుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నారని లబోదిబోమంటున్నారు. ఆగిన కానిస్టేబుల్ బదిలీలు.. గుంటూరు నగరంలో పోస్టింగ్ కోరుకుంటున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోకి వెళ్లబోమని తేల్చి చెబుతుండటంతో జిల్లాలో బదిలీలు నేటికీ జరగలేదు. రెండు మూడు రోజులుగా ఈ బదిలీలు నిర్వహించాలని గుంటూరు, నరసరావుపేట, తెనాలి సూపరింటెండెంట్లు అర్ధరాత్రి వరకూ ఆఫీస్‌లో కూర్చుని ఎన్ఫోర్స్మెంట్కు వెళ్లేవారు ఎవ్వరు దొరక్క బదిలీలు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో ఆ అధికారి బదిలీ అవుతారని సిబ్బంది అందరూ కోటి ఆశలతో ఎదురు చూశారు. అయితే ఆయన బదిలీపై జిల్లాకు వచ్చి కొద్ది రోజులే కావడంతో బదిలీ చేయలేదు. -
లైఫ్‌తో వీడియోగేమ్
గతంలో మాదిరిగా ఇప్పుడు పేకాట క్లబ్‌లు పెద్దగా నడవట్లేదు. ఇళ్లలో, పనిచేసే కార్యాలయాల్లో, దుకాణాల్లో, బజారులో ఎక్కడంటే అక్కడ కూర్చుని సెల్ఫోన్లో పేకాట (రమ్మీ) ఆడుతున్నారు. పేకాట ఆడేవాళ్లను ఆకర్షిస్తూ అందర్నీ కలిపి ఓ ప్లాట్‌ఫాంగా మార్చారు. పేకాటరాయుళ్లు, రమ్మీలో సత్తా చాటాలనుకునే వారు అటు చూస్తున్నారు. మొదట్లో డబ్బులు బాగానే వచ్చినా తరువాత నుంచి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఆన్లైన్ రమ్మీ ఆడాలనుకునే వారి బ్యాంకు ఖాతాల నుంచి పందానికి సరిపోయే నగదును ముందుగా సర్దుబాటు చేసుకుంటున్నారు. తరువాత పందెం వస్తే డబ్బులు వేయడం లేదంటే వెనక్కి లాక్కోవడం ఉంటుంది. సాక్షి, విశాఖపట్నం : ఉదయం లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు రోజులో 40 నుంచి 60 శాతం చాలా మంది చేతుల్లో సెల్‌ఫోన్ ఉంటుంది. స్మార్ట్ఫోన్లు పట్టుకుని ఈ లోకంలో లేనట్లు, తమదైన లోకంలో ఉన్నట్లుగా వీడియో గేమ్‌లు ఆడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక రోజు వీడియో గేమ్ ఆడకుంటే ఏదో కోల్పోయామనే భావన వారిలో నెలకుంటోంది. పిల్లలు కార్టూన్ నెట్‌వర్క్‌తో పాటు వీడియో గేమింగ్‌కు బానిసలుగా మారుతుంటే, పెద్దలు, ఉద్యోగులు గృహిణులు సైతం ఆ ఆటల్లో లీనమైపోతున్నారు. సెల్‌ఫోన్ పట్టుకుని నిద్రాహారాలు మాని వీడియో గేమ్‌లు ఆడేవారు ప్రతి ఇంట్లోనూ ఉంటున్నారు. వారి జీవనశైలి మిగిలిన వారిపై ప్రభావం చూపించడమే కాకుండా పెద్దల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. నగరంలో మానసిక వైద్య నిపుణుల వద్దకు వెళ్లే కేసుల్లో వీడియో గేమింగ్ వ్యసనంతో అనారోగ్యం బారిన పడిన వారే ఎక్కువ మంది ఉంటున్నారు. తెరపై ఆటలు అనారోగ్యానికి బాటలు వేస్తున్నాయని తెలిసినా చాలా మంది ఆ ఉచ్చులో పడుతున్నారు. బ్లూవేల్ గేమ్ చాలామంది ప్రాణాల్ని తోడేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఆటను నిషేధించారు. పబ్జీ అనే ఆట ఇప్పుడు ఎక్కువ మందిని ప్రభావితం చేస్తోంది. ఈ ఆట ప్రపంచం ప్లాట్ ఫాంగా నడుస్తోంది. ఆటలో తోటివారు సాయం చేయకపోయినా, తుపాకీ సాయంగా ఇవ్వకపోయినా నేరుగా చిరునామా తీసుకుని దాడులకు తెగబడుతున్న సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. గేమింగ్ బానిసల లక్షణాలివి.. ఇతర పనుల కన్నా మొబైల్ లేదా వీడియో గేమ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం మొబైల్ లేదా వీడియో గేమ్ చేతిలో ఉంటే గేమ్స్ ఆడాలనే కోరికను ఆపుకోలేకపోవడం గేమ్ ఆడుతున్న ప్రతిసారీ ఆనందాన్ని పొందుతుండడం గేమ్ ఆడడం మొదలెట్టాక, దాన్ని ఎప్పుడు ఆపాలో తెలుసుకోలేకపోవడం గేమ్ ఆడడం వల్ల చదువు, ఉద్యోగం లేదా ఇతర పనులపై చెడు ప్రభావం ఎవరైనా 12 నెలల కంటే ఎక్కువ కాలం ఇలా ఉన్నప్పుడు డాక్టర్ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం సీరియస్.. ఆన్లైన్ రమ్మీని ఇప్పటికే తెలంగాణలో నిషేధించారు. మన రాష్ట్రంలో కూడా ఆన్లైన్ రమ్మీని నిషేధం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలోని చాలా మంది యువకులు, ఉద్యోగులు ఈ గేమ్ బారిన పడి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. ఆన్లైన్ ఆట నిర్వహణకు వేదిక ఏర్పాటు చేసిన వారిని పట్టుకుంటే ఈ ఆటకు చెక్ పెట్టి వ్యసనం నుంచి చాలా మందిని కాపాడేందుకు అవకాశముంటుంది. పిల్లల వద్ద పెద్దలు సరదాకు కూడా ఈ ఆట ఆడవద్దని మానసిక వైద్య నిపుణుల హెచ్చరిస్తున్నారు. ఈ గేమ్‌పై పోలీసుల నిఘా లేకపోవడంతో సెల్‌ఫోన్, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లలో ప్రత్యక్షమవుతోంది. ఏం చేయాలి వీడియో గేమింగ్ నుంచి బయటడేందుకు పాఠశాల నుంచి పిల్లలు రాగానే సెలవులు, ఖాళీ సమయాల్లో టీవీ, సెల్ఫోన్ల వద్దకు పంపించకుండా కాసేపు సరదాగా ప్రకృతిలోకి తీసుకెళ్లి వారితో ఆటలు, క్రీడలు, సంగీతం, నృత్య సాధన చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. పుస్తక పఠనం ముఖ్యంగా వేమన పద్యాలు చదివించడం, మహానీయుల స్ఫూర్తిగాథలు చదివించడం, ఉప కరణాలతో బోధన చేయాలి. ఎన్సీఆర్టీఈ అమలుచేసే జ్ఞానదర్శిని, ఇస్రోకు చెందిన విజ్ఞాన్‌ప్రసార్, జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కే టీవీ చానళ్లు చూపించాలి. గేమింగ్ బాధితుల చికిత్స కోసం మానసికవేత్తలు, మానసిక వైద్య నిపుణుల సాయం తీసుకోవాలి. ఇద్దరూ ఒకే సమయంలో చికిత్స చేయడం వల్ల రోగిలో త్వరగా మార్పు కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా 6–8 వారాల్లో ఈ గేమింగ్ వ్యసనం వదిలిపోతుంది. అసలు దీని నుంచి బయటపడే కారణాలను వివరిస్తూ, అసలు గేమ్స్ ఆడడం అలవాటు చేయకపోవడమే మంచిదని నిపుణులు సలహా చేస్తున్నారు. -
మాడగడలో ఆంత్రాక్స్ కలకలం
సాక్షి, అరకు(విశాఖపట్నం) : మాడగడ పంచాయతీ కేంద్రంలో ఇద్దరు గిరిజనులు ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ గ్రామానికి చెందిన జి.బుజ్జిబాబు, ఎం.కోటిబాబు చేతులు వాపు, చిన్న కురుపులు ఏర్పడడంతో స్థానిక పీహెచ్సీ వైద్యబృందం నాలుగు రోజుల క్రితం సేవలందించారు. ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాల అనుమానంతో వీరిద్దరిని కేజీహెచ్‌కు తరలించి,ఉ న్నత వైద్యసేవలు కల్పించారు. అయితే కేజీహెచ్ వైద్యులు బుజ్జిబాబు, కోటిబాబుల నుంచి రక్త నమునాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. వీరికి సోకినది ఆంత్రాక్స్.. ఇతర చర్మవ్యాధా అనేది నిర్థారణ కావల్సి ఉంది. సందర్శించిన సబ్ కలెక్టర్ మాడగడలో ఇద్దరు గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారనే సమాచారం మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. పాడేరు సబ్‌కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మంగళవారం మాడగడ గ్రామాన్ని సందర్శించారు. డీఎంహెచ్‌వో తిరుపతిరావు, పశు సంవర్థకశాఖ ఏడీ రామకృష్ణ, పీహెచ్సీ వైద్యాధికారి వినీల, ఇతర వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశారు. సబ్‌కలెక్టర్ గ్రామంలోని అన్ని వీధులను సందర్శించారు. ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు గిరిజనుల కుటుంబాలను పరామర్శించారు. బుజ్జిబాబు,కోటిబాబు ఆహార అలవాట్లపై ఆయన ఆరా తీశారు. వారం రోజుల క్రితం సుంకరమెట్ట వారపుసంతలో కొనుగోలు చేసిన పశుమాంసాన్ని వండుకు తినినట్టు కుటుం సభ్యులు కలెక్టర్‌కు తెలిపారు. బాకా బాబురావు అనే గిరిజనుడు తన చేతికి కూడా దురదలు వస్తున్నాయని చెప్పడంతో వెంటనే వైద్యసేవలందించి కేజీహెచ్‌కు తరలించాలని వైద్యబృందాన్ని సబ్‌కలెక్టర్ ఆదేశించారు. పశుమాంస విక్రయాలు నియంత్రిస్తాం ఏజెన్సీలోని అనారోగ్య పశువుల వధ, నిల్వ మాంసం అమ్మకాల విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ విలేకరులకు తెలిపారు.వారపుసంతల్లో పశుమాంసం విక్రయాలపై తనిఖీలు చేపట్టి, అవసరమైతే అమ్మకాలపై నిషేధం అమలుకు పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీకి నివేదిక ఇస్తామన్నారు. ఆంత్రాక్స్ వ్యాధిపై గ్రామాల్లో గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహించి, పశుమాంసానికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పశువులకు ఆంత్రాక్స్, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పశు వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు.మాడగడ గ్రామంలో ఇద్దరు గిరిజనులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని, అయితే వారికి ఆంత్రాక్స్ వ్యాధి నిర్థారణ కాలేదన్నారు. గ్రామంలో అందరు గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు వైద్యబృందాలను అప్రమత్తం చేస్తున్నామని సబ్‌కలెక్టర్ వివరించారు. -
ఎస్ఐ తీరుపై వైసీపీ కార్యకర్త మౌనదీక్ష
సాక్షి,విశాఖపట్నం : గొలుగొండ ఎస్ఐ ఎం.నారాయణరావు తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకుడు సుర్ల గిరిబాబు మౌనదీక్ష చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం రాత్రి దీక్ష చేశారు. వివరాల్లోకి వెళితే..చీడిగుమ్మల గ్రామానికి చెందిన లోకారపు రామరాజు తనపై నాలుగు రోజులు క్రితం ఇదే గ్రామానికి చెందిన కామిరెడ్డి గోవింద్ రాయితో దాడి చేశాడని.. తీవ్రంగా గాయపడి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత గొలుగొండ ఎస్ఐ నారాయణరావుకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. అయితే ఎస్ఐ ఎటువంటి చర్యలు తీసుకోలేదని రామరాజు గిరిబాబుకు చెప్పడంతో ఆయన వచ్చి ఎస్ఐకి కలసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి కుసిరెడ్డి రాజుబాబుపై ఇంటి దారి స్థలం వివాదం జరిగితే పక్క ఇంటి యజమాని ఫిర్యాదు ఇవ్వడంతో రాజుబాబును ఎస్ఐ కొట్టినట్టు గిరిబాబు ఆరోపించారు. ఇదేం తీరు అని ఎస్ఐను నిలదీసి పక్కనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. గిరిబాబుకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు లెక్కల సత్యనారాయణ, పోలిరెడ్డి రాజుబాబు, మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, చిటికెల వరహాలబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గండెం ఈశ్వర్రావు మద్దతు తెలిపారు. దీంతో ఎస్ఐ వచ్చి గిరిబాబుకు క్షమాపణ చెప్పారు రామరాజుపై దాడి చేసిన కామిరెడ్డి గోవింద్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో గిరిబాబు దీక్షను విరమించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని గిరిబాబు ఎస్ఐని కోరారు. -
గంజాయితో తప్పించుకోబోయి..
సాక్షి, చింతపల్లి (విశాఖపట్నం) : మండలంలోని లోతుగెడ్డ జంక్షన్ వద్ద సోమవారం పర్యాటకుడిని గంజాయి తరలిస్తున్న ఆటో బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో పర్యాటకుడు తీవ్రంగా గాయపడగా ఆటో బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే.. లోతుగెడ్డ జంక్షన్లో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. దీంతో ప్రధాన రహదారిలో పింఛనుదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కాస్తున్నారు. ఇదే సమయంలో సోమవరం ప్రాంతం నుంచి ఆటో వేగంగా వస్తోంది. ఇక్కడ ఉన్న పోలీసులను గమనించి ఆటో డ్రైవరు ఆందోళనకు గురై ఆటో వేగం పెంచాడు. ఇదే సమయంలో సమీపంలోని పంచవటి తోటల వద్ద విశాఖపట్నం పర్యాటకుడు శ్రీను భోజనం చేసి బయటకు వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో అతడిని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడగా పర్యాటకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆటో బోల్తా పడ్డాక వారు అక్కడ నుంచి పరారు అయ్యారు. వారికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆటో అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పొలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జగన్ నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తున్నారు
-
జగన్ నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తున్నారు
సాక్షి, విశాఖపట్నం : గత నెల రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను తెలుగు ప్రజలు స్వాగతిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ప్రజల నీటి కష్టాలు తీర్చే ప్రయత్నంలో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అవడం శభపరిణామమని పేర్కొన్నారు. గతంలో రాయలసీమకు నీరందించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో వైఎస్ దూరమవడంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ దానిని విస్మరించిందని విమర్శించారు. 1995 నుంచి 2004 మధ్య ఆలమట్టి డ్యాం నిర్మాణం చేపట్టినప్పుడు ప్రజల నీటి కష్టాల గురించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోలేదని ఆరోపించారు. తాజాగా వైఎస్ జగన్ ఏకైక ఆధారమైన గోదావరి నీటిని శ్రీశైలం తీసుకువెళ్లి రాయలసీమకు అందించాలని యోచిస్తుంటే, టీడీపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచనతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొరుగు రాష్ట్రాల సీఎంలతో స్నేహ సంబంధ భావంతో మెలుగుతున్నారని తెలిపారు. -
బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయడం హర్షనీయం
సాక్షి, అరకు : బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, వారు జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరకు లోయలో సంబరాలు నిర్వహించిన అనంతరం స్థానిక గిరిజనులతో కలిసి వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అశోక్, సుబ్రమణ్యం,భాస్కర్, చిన్నారావు పాల్గొన్నారు. -
ఆర్కే బీచ్‌లో సందడి చేశారుగా!
సాక్షి, విశాఖపట్నం : ఒలింపిక్ డే సందర్భంగా విశాఖ సాగరతీరంలో నిర్వహించిన రన్ ఉత్సాహంగా సాగింది. క్రీడల్లో పతకాలు సాధించిన వారితో పాటు ఔత్సాహిక క్రీడాకారులు, పలు పాఠశాలల విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. ది ఒలింపిక్ సంఘం విశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఐదు కిలోమీటర్ల పరుగును సంఘం ప్రతిని«ధి, ఎమ్మెల్యే పీవీజీఆర్ నాయుడు ప్రారంభించారు. సాగరతీరంలోని కాళీమాత ఆలయం నుంచి ప్రారంభమైన పరుగు వైఎంసీఏ వద్ద ముగిసింది. వాస్తవానికి ఒలింపిక్ డే రన్ జూన్ 23న జరగనుంది. రాష్ట్ర స్థాయిలో ఆదివారం జరగనుండగా సంఘీభావంగా విశాఖలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరిచి పతకాలందుకున్న పలువురు క్రీడాకారుల్ని సంఘం ప్రతినిధులు సత్కరించారు. సాయిగణేష్, పి.బోనంగి, వై.హరికృష్ణ, ఆర్.స్వాతి, ఉత్తేజితరావు, నిషితా, శ్రీదేవి, ముత్యాలమ్మ, ఐశ్వర్యాదేవి, ఎస్.మహేష్, రామయ్య, ఉషా, ఎన్.సునీల్, కే.శ్రీను, కే.రాజేష్, జి.వెంకటేశ్వరరావు, ఎం.రాము, వి.తులసీ, వి.సత్యనారాయణ, వి.రమేష్, ఆర్.అరుణ సాయికుమార్, కే.యశ్వంత్, సాయి సంహిత, బి.అన్మిష, ఎస్.మేరీ, జి.వినయ్‌కుమార్, పూర్ణిమాలక్ష్మి, పవన్‌కుమార్, నారాయణమ్మ, నాగలక్ష్మి, అప్పలరాజు, సీహెచ్ దీపిక, ఎస్‌కెఎల్ బషీర్, జి.క్రాంతి, కె.భావన, సీహెచ్ దత్త అవినాష్, టి.ఆషిత, పీవీటీ కుమార్, జె.గణేష్, గుణష్నిత, పి.గాయత్రి, బి.కావ్య, జి.మేఘన, ఎ.కిషోర్, వీరుబాబు, నాగేంద్ర, అరుణ సాయికుమార్, యశ్వంత్ సత్కారం అందుకున్నారు. వీరిలో కొందరు జాతీయస్థాయిలో పతకాలు సాధించగా, మరికొందరు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. రన్ ముగింపు కార్యక్రమంలో ది ఒలింపిక్ సంఘం విశాఖ ప్రతినిధి పీవీజీఆర్ నాయుడు మాట్లాడుతూ విశాఖలో ప్రతి క్రీడకు సంఘం ఉందని, అవి చక్కగా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. తొలుత జిల్లా సంయుక్త కలెక్టర్–2 వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒలింపిక్ రన్లో క్రీడాకారులు పాల్గొనడం ఎంతో సంతోషకరమన్నారు. సంఘం అధ్యక్షుడు ప్రసన్నకుమార్ ఒలింపిక్ డే రన్ ప్రత్యేకతను వివరించారు. చక్కటి ప్రోత్సాహం అందించే కోచ్‌లను సత్కరించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు టీఎస్ఆర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, మాణిక్యాలు, రామయ్య, కె.సూర్యనారాయణ, ఏయూ వ్యాయామ విద్యావిభాగ హెడ్ విజయ్‌మోహన్, పలు క్రీడాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
దేశానికే ఆదర్శ సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : గిరిజన మహిళనైన తనను ఉప ముఖ్యమంత్రిని చేసి యావత్ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. శనివారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో పుష్పశ్రీవాణి పుట్టినరోజు వేడుకలు పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాతూ.. చిన్నవయసులోనే తనకు పెద్దపదవి అప్పగించి గిరిజన మహిళలు, ప్రజల పట్ల అత్యున్నత గౌరవాన్ని చూపించిన తమ నాయకుడు జగన్మోహన్రెడ్డికి తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మేనిఫెస్టో అంటే ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వపాలన ఉంటుందని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇళ్లు రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలన్నారు. రైతుబాంధవుడిగా చెరగని ముద్రవేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ‘రైతు భరోసో’ పేరుతో అత్యున్నత సంక్షేమ పథకం సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేశారని తెలిపారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా కింద అర్హులైన రైతులకు రూ.12,500 జమ చేస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు వారాలు కాకుండానే పదికి పైగా సంక్షేమ పథకాలు అమలుచేశారని కొనియాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు 600 పైగా హామీలిచ్చి ఒక్క హామీకూడా పూర్తిగా అమలు చేసిన పాపానపోలేదన్నారు. అందుకే ప్రజలు టీడీపీనీ భూస్థాపితం చేశారని, మరో 25 ఏళ్ల పాటు టీడీపీ మనుగడే ఉండదని జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీని వాస్ మాట్లాడుతూ మహిళలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శులు సత్తిరామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, నడిపల్లి కృష్ణంరాజు, పేర్లవిజయచందర్, మొల్లి అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం అధికారప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, నగర అనుబంధసంఘాల అధ్యక్షులు కొండారాజీవ్ పాల్గొన్నారు. -
గ్రేటర్ ఎన్నికలకు కొత్త చిక్కు
మహా నగరపాలక సంస్థ ఎన్నికలకు మరోచిక్కు వచ్చిపడింది. ఆర్నెల్లో ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే వార్డుల విభజన, ఓటరు జాబితాల ప్రకటన పూర్తి చేసిన జీవీఎంసీ ఎన్నికల దిశగా అడుగులేస్తోంది. కానీ మహా ఎన్నికలకు కొత్త చిక్కు వచ్చిపడింది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రకటిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు మహా ఎన్నికలకు ఆటంకం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : మహావిశాఖనగరపాలక సంస్థ..ఒకప్పుడు 72వార్డులతో ఉండేది. నేడు దాని పరిస్థితి విస్తరించ డంతో వార్డు సంఖ్య 81కు చేరింది. దేశంలోనే అత్యంత పురాతమైన మున్సిపాల్టీల్లో ఒకటైన భీమిలితో పాటు అనకాపల్లి మున్సిపాల్టీలను జీవీఎంసీలో విలీనం చేశారు. అలాగే విశాఖనగరంలో అంతర్భాగంగా ఉన్న పెందుర్తి మండలంతో పాటు సబ్బవరం, పరవాడ మండలాల్లో ఒక్కో పంచాయతీ, అలాగే అనకాపల్లి మండలంలోని మూడు పంచాయతీలు జీవీఎంసీలో విలీనమయ్యాయి. ఇక భీమిలి మండలంలోని ఐదు పంచాయతీల విలీనం కోర్టు వివాదాల్లో కొనసాగుతూనే ఉంది. కాగా ఆ ఐదు గ్రామాలు మినహాయించగా మిగిలిన జీవీఎంసీ పరిధిలోని ప్రాంతాన్ని 81 వార్డులుగా విభజించి గత నెలలోనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించారు. వార్డుల్లో కులాల వారీగా ఓటర్ల జాబితా గణన కూడా పూర్తి చేశారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికలకు వెళ్లేందుకు జీవీఎంసీ ఓ వైపు ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. కానీ ఇప్పుడే అసలు చిక్కు వచ్చి పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు అనివార్యంగా కన్పిస్తున్న తరుణంలో జీవీఎంసీ పరిధిలో ఉన్న అనకాపల్లి మున్సిపాల్టీ, పెందుర్తి మండలం, అనకాపల్లి, సబ్బవరం, పరవాడ మండలాల్లోని పంచాయతీల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రాంతాలన్నీ ఆరో జోన్లో ఉన్నాయి. అనకాపల్లి మున్సిపాల్టీతో పాటు అనకాపల్లి మండలంలోని వల్లూరు, రాజుపాలెం, కొప్పాక, పరవాడ మండలం తాడి గ్రామాలను కలిపి 67, 68, 69, 70 వార్డుల పరిధిగా విభజించారు. ఈ వార్డుల్లో 99,895 మంది జనాభా ఉన్నట్టుగా లెక్క తేల్చారు. ఇక పెందుర్తి మండలంలోని వేపగుంట, సుజాతనగర్, చినముషిడివాడ, పెందుర్తి, నరవ, సింహాచలం, అప్పన్నపాలెం, నాయుడుతోట, ఇస్లాంపేట, సబ్బవరం మండలంలోని వెదుళ్ల నరవ గ్రామాలు కలిపి 57, 69, 70, 71,72 వార్డులుగా విభజించారు. ఈ వార్డుల పరిధిలో లక్ష మందికి పైగా జనాభా ఉన్నారు. -
సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ పరలోకానికి
సాక్షి, విశాఖపట్నం : సముద్ర స్నానానికి వెళ్లి వస్తూ ఓ వృద్ధురాలు తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనం నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయింది. పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకొంది. వివరాలు... చోడవరం దరి భోగాపురానికి చెందిన ఆడారి కన్నంనాయుడు భార్య పిల్లలతో కలసి లంకెలపాలెంలో నివసిస్తున్నాడు. కూలిపనులు చేసుకుంటూ ఆ కుటుంబం బతుకుతోంది. కన్నంనాయుడు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మరణించిన భర్త కన్నంనాయుడి ఆత్మశాంతి కోసం బుధవారం మూలన కొత్త బట్టలు పెట్టడానికి భార్య మంగతల్లి (65), కుమారులు నాగార్జున, బంగారు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు ముత్యాలమ్మపాలెం సముద్రంలో మైలస్నానం చేయడానికంటూ శనివారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలపై తల్లీకొడుకులు వచ్చి స్నానాలు ఆచరించి తిరుగు ప్రయాణమయ్యారు. వెంకటపతిపాలెం దాటిన తరువాత కొట్టుమసేను మిల్లు వద్ద వాహనం వెనుక కూర్చున్న మంగతల్లి జారి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తల వెనుకవైపు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కళ్లముందే తల్లి మృతి చెందడంతో కుమారులు కన్నీరుమున్నీరు అయ్యారు. మంగతల్లికి ఒక కుమార్తె కూడా ఉంది. కాగా..ప్రమాదంపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,విశాఖపట్నం : పరీక్షల్లో తప్పానన్న మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పాతనగరంలో శని వారం ఈ సంఘటన జ రిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకపేటలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న శీలం మణితేజ (22) బీటెక్ (డీఎంఈ) నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఫెయిల్ అయిన మణితేజ మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మణితేజ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఏఎస్ఐ వి.మురహరి ఆధ్వర్యంలో సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉన్నది 200 మంది.. కానీ రెండే గదులు
సాక్షి, నర్సీపట్నం(విశాఖపట్నం) : కస్తూర్బా పాఠశాలను తొలుత మాకవరపాలెం ప్రాథమిక పాఠశాలలో అరకొర సౌకర్యాల మధ్య ప్రారంభించారు. దీంతో ఏళ్ల తరబడి విద్యార్థులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2015లో భీమబోయినపాలెం సమీపంలో కొండ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషించారు. ఇక నుంచి తమకు వసతి సమస్య తప్పినట్టేనని వారు సంబరపడ్డారు. కానీ ఈ కొత్త భవనంలో విద్యార్థులకు సరిపడిన గదులు లేకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ భవనం ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటికీ అదనపు గదులు నిర్మించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నాలుగేళ్లయినా అలాగే.. ఈ పాఠశాలకు ప్రస్తుతం తొమ్మిది గదులు ఉన్నాయి. వీటిలో ఐదింటిలో తరగతులు, ఒక గదిలో ఆఫీస్, మరో గదిలో కంప్యూటర్, స్టాఫ్ రూమ్‌గా వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన రెండు గదులు మాత్రమే 200 మంది విద్యార్థులు రాత్రి సమయంలో నిద్రించేందుకు ఉన్నాయి. ఇవి చాలక విద్యార్థులు ఉన్న వాటిలోనే తమ సామగ్రిని పెట్టుకుని ఇరుకుగా పడుకుంటున్నారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం మరో రెండు గదులు డార్మెటరీకి, మూడు గదులు గ్రంథాలయం, ల్యాబ్‌కు అవసరం. మొత్తం ఐదు గదులు మంజూరు చేస్తే ఇక్కడి విద్యార్థులకు, సిబ్బందికి పూర్తిగా ఇబ్బందులు తొలగిపోతాయి. అయ్యన్న హామీ ఇచ్చినా.. ఈ పాఠశాలను ప్రారంభించిన అప్పటి మంత్రి అయ్యన్న కొండ ప్రాంతంలో నిర్మించడమేంటని అధికారులను ప్రశ్నించారు. అయితే భవనానికి రక్షణగా చుట్టూ ప్రహరీ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు ప్రధాన రహదారి నుంచి పాఠశాల వరకు తారురోడ్డు నిర్మాణానికి కూడా ప్రతిపాదించాలన్నారు. గదుల కొరత కారణంగా మరో మూడు అదనపు గదులను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తామని కస్తూర్బా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలోనే అప్పటిలో ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో మూడేళ్ల అనంతరం రోడ్డు పనులు చేపట్టారు. ఇక ప్రహరీ నిర్మాణం జరగలేదు. ఇక అదనపు గదుల హామీ ఇప్పటికీ అమలు చేయకపోవడంతో నిత్యం విద్యార్థులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు.