2019 నుంచి నిలిచిన ‘టీ–ప్రైడ్’ నిధులు
జిల్లాలో రూ.10.81కోట్ల రాయితీ బకాయిలు
లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ
ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు
కై లాస్‌నగర్: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పి ంచా లనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యూబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్ (టి–ప్రైడ్) పథకాన్ని అమలు చేసింది. ట్రాక్టర్లు, కార్లు, మ్యాక్స్ ఫికప్ వాహనాలు, జేసీబీలు, లారీలు, బస్సులు, డీసీఎంలు, బోర్‌మిషన్లు, హార్వెస్టర్లు వంటి వాహనాలను ఈ పథకం కింద కొనుగోలు చేసేందుకు అవకాశం క ల్పించింది. బ్యాంకు రుణాల ద్వారా కొనుగోలు చేసిన ఔత్సాహికులకు పరిశ్రమల శాఖ ద్వారా 35 శాతం సబ్సిడీని అందించేది. అయితే ఐదేళ్లుగా ఈ సబ్సిడీ నిధులు విడుదల కావడం లేదు. రాయితీ బకాయిల కోసం లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం ఉండని పరిస్థితి.
ప్రయోజనం ఇలా..
ట్రీ ఫ్రైడ్ పథకం కింద కొనుగోలు చేసే వాహనాలకు జిల్లా, రాష్ట్రస్థాయిలో మంజూరు చేస్తారు. రూ.10లక్షల లోపు విలువ కలిగిన వాహనాలకు కలెక్టర్ చైర్మన్‌గా కలిగిన జిల్లాస్థాయి కమిటీ మంజూరు చేయగా, రూ.10లక్షల నుంచి రూ.75లక్షల వరకు కలిగిన వాహనాలకు పరిశ్రమల శాఖ డైరెక్టర్ చైర్మన్‌గా కలిగిన కమిటీ ఆమోదం తెలుపుతుంది. పురుషులకు 35 శాతం, మహిళలకు 40 శాతం సబ్సిడీని అందజేస్తోంది. ఈ కేటగిరీలకు సంబంధించి జిల్లాలో 201మంది లబ్ధిదారులు బ్యాంకు రుణాల ద్వారా వాహనాలను కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి రూ. 10కోట్ల 81లక్షల 67వేల 263 సబ్సిడీ నిధులు విడుదల కావాల్సి ఉంది. 2019 ఆగస్టు నుంచి ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులతో పాటు పరిశ్రమలశాఖ కార్యాలయం చుట్టూ లబ్ధిదారులు చెప్పులరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
● జిల్లా స్థాయి పరిధిలో రూ.10లక్షల లోపు వాహనాలను మంజూరు చేస్తారు. వాటికి సంబంధించి 38 మంది ఎస్సీలకు రూ.1,06, 17,461 స బ్సిడీ రావాల్సి ఉంది. అలాగే 104 మంది ఎస్టీలు రాయితీ కింద వాహనాలను పొందారు. వీ రికి రూ.3,02,90,287 సబ్సిడీ పెండింగ్‌లో ఉంది. ఇక దివ్యాంగుల కేటగిరీలో ముగ్గురు వాహనాలు తీసుకోగా వారికి రూ.8,99,535 సబ్సిడీ ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది.
● రూ.10లక్షల నుంచి రూ.కోటి వరకు విలువ కలిగిన బస్సులు, జేసీబీలు, లారీలు వంటి వాటిని సైతం ఈ పథకం కింద మంజూరు చేశారు. వీటికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 56 మంది లబ్ధిదారులకు రూ.6,63,59,980 సబ్సిడీ విడుదల కావాల్సి ఉంది. ఇందులో 15 మంది ఎస్సీలకు రూ.1,72,64,773 రావాల్సి ఉండగా 39 మంది ఎస్టీలకు రూ.4,77,06,087 విడుదల కావాల్సి ఉంది. అలాగే దివ్యాంగులకు సంబంధించి ఇద్దరికి రూ.13,89,120 అందాల్సి ఉంది.
జిల్లాలో టీ ప్రైడ్ పథకం లబ్ధిదారులు, రావాల్సిన సబ్సిడీ వివరాలు..
కేటగిరి లబ్ధిదారులు రావాల్సిన సబ్సిడీ (రూ.లలో)
ఎస్సీ 53 2,78,82,234
ఎస్టీ 143 7,79,96,374
దివ్యాంగులు 05 22,88,655
ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం
ట్రీ ప్రైడ్ పథకం కింద వాహనాలు కొనుగోలు చేసిన వారికి సంబంధించిన సబ్సిడీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని కోరుతూ గత ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సైతం సమస్యను నివేదించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటాం. – పద్మభూషణ్ రాజు, పరిశ్రమల శాఖ జీఎం
Comments
Please login to add a commentAdd a comment