నార్నూర్: మండలంలోని రాజులగూడ గ్రామానికి చెందిన కుమ్ర రేణుకబాయి(30) బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్సై గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జైనూర్ మండలంలోని ఉషెగాం గ్రామానికి చెందిన తొడసం పార్వతిబాయి –రాంజీ దంపతుల పెద్ద కుతూరు తొడసం రేణుకబాయిని నార్నూర్ మండలం రాజుగూడ గ్రామానికి చెందిన కుమ్ర అంకోష్కు ఇచ్చి 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. ఆమెకు గత కొన్నేళ్ల నుంచి మతి స్థిమితం లేదు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన రేణుకబాయి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం రాజులగూడ గ్రామ శివారులో ఉన్న బావిలో రేణుకబాయి మృతదేహం లభ్యమైంది. పార్వతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment