వరకట్న వేధింపులకు వివాహిత బలి | - | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులకు వివాహిత బలి

Published Sat, Nov 9 2024 12:44 AM | Last Updated on Sat, Nov 9 2024 12:44 AM

వరకట్న వేధింపులకు వివాహిత బలి

వరకట్న వేధింపులకు వివాహిత బలి

దస్తురాబాద్‌: వరకట్న వేధింపులకు జిల్లాలో మరో వివాహిత బలైంది. ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండంలోని రేవోజీపేట గ్రామానికి చెందిన సంద నాగరాజుకు జగిత్యాల జిల్లా సారాంగపూర్‌ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన లతతో ముడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 15 నెలల కుమారుడు ఉన్నాడు. కొన్ని రోజులుగా భర్త నాగరాజు, అత్త, మామ సంద సత్తవ్వ, వెంకటి అదనపు కట్నం తేవాలని లతను వేధిస్తున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో శుక్రవారం బాత్‌రూంలో ఉరివేసుకుంది. సంఘటన స్థలాన్ని తహసీల్దార్‌ నావాజ్‌ సర్ఫరాజ్‌ చేరుకుని పంచనామా చేశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతురాలి తల్లి పోగుల మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement