బాలింత అదృశ్యం
● మూడు రోజుల క్రితం ఆడపిల్ల జననం ● శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించని తల్లి ● నిర్మల్ మాతాశిశు ఆస్పత్రిలో ఘటన
నిర్మల్‌టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రి నుంచి బాలింత శుక్రవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా మండలం అస్గుల్ గ్రామానికి చెందిన నాగమణి మూడు రోజు ల క్రితం ఆడబిడ్డకు జన్మనించ్చింది. ఈమెకు భర్త సాయినాథ్, ఇదివరకే ఒక పాప, బాబు ఉన్నాడు. భర్త వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా డు. తల్లి బిడ్డ ఆరోగ్యంగానే ఉనానరు. అయితే మ ధ్యాహ్నం తర్వాత నుంచి నాగమణి కనిపించలేదు. దీంతో బంధువులు ఆస్పత్రి ఆవరణలో వెతికారు. ఆచూకీ లేకవడంతో భర్త సాయినాథ్ పట్టణ పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆస్పత్రికి వెళ్ళి సీసీ ఫుటేజీలను పరిశీ లించారు. ఇందులో నాగమణి తానే స్వయంగా బెడ్ మీది నుంచి ఆస్పత్రి బయటకు వెళ్లినట్లు రికార్డు అయింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment