సర్వే పకడ్బందీగా చేపట్టాలి
ఇంద్రవెల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. మండలకేంద్రంలో కొనసాగుతున్న సర్వేను ఆదివారం ఆయన పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అందుబాటులో ఉన్న సమయంలో ఇళ్లకు వెళ్లి సర్వే వివరాలు సేకరించాలన్నారు. ఇందులో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, మేజర్ గ్రామపంచాయతీ ఈవో సంజీవ్‌రావు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment