దోపిడీ ఉన్నంతకాలం.. ఉద్యమాలు
● సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి టి.శ్రీనివాస్
పాతమంచిర్యాల: సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం విప్లవోద్యమాలు ఉంటాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి టి.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి లాల్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్లో అమరవీరుల సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం అనేక మంది కమ్యూనిస్టులు, విప్లవకారులు, ఉద్యమకారులు ప్రాణాలు త్యాగా లు చేశారన్నారు. నవంబర్లోనే ఎక్కువ మంది ఉద్యమకారులు మృతి చెందడంతో నవంబర్ 1 నుంచి 10 వరకు సంస్మరణ సభను ఏటా నిర్వహిస్తున్నామన్నారు. అమరుల ఆదర్శాలను, స్ఫూర్తిని నింపుకుని భవిష్యత్ కార్యాచరణకు పార్టీ పూనుకుంటుందన్నారు. ఈ సందర్భంగా అమరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు మేకల రామన్న, బ్రహ్మానందం, దొండ ప్రభాకర్, మల్లన్న, శ్రీనివాస్, ఆర్.తిరుపతి, డి.శ్రీకాంత్, జ్యోతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment