ఆదిలాబాద్: కార్తిక ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పండరీపూర్ వరకు ప్రత్యేక రైలు సర్వీస్ (07501) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఆదిలాబాద్ నుంచి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ స్పెషల్ ట్రెయిన్ బయలుదేరుతుంది. ఈనెల 12న ఉదయం 7:30 గంటలకు పండరీపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 15న రైలు (07502) పండరీపూర్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి, 16న మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుంది. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment