● ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్
ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న హెల్త్‌కార్డుల ప్రయోజనాలు వచ్చేనెల నుంచి చేకూరనున్నాయని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జీవో 317 ద్వారా స్పౌజ్ ఉపాధ్యాయులకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కానున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక వార్డెన్లు నియమించాలన్నారు. ఉన్నతీకరించిన ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఇటీవల నూతనంగా నియామకమైన ఉపాధ్యాయులతో పాటు పదోన్నతులు పొందిన వారిని సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి దిలేష్ చౌహాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శీతల్ చౌహాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్వ అధ్యక్షులు చిలుక విలాస్, ముకుందరావు, పోల్ రెడ్డి, జిల్లా సహాధ్యక్షులు జాదవ్ రవికుమార్, ఆత్మరామ్, ఆర్థిక కార్యదర్శి మనోహర్, కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment