● ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ దృష్టి ● ప్రారంభమైన ప్రత్యేక తరగతులు ● దృష్టి సారించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

● ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ దృష్టి ● ప్రారంభమైన ప్రత్యేక తరగతులు ● దృష్టి సారించిన కలెక్టర్‌

Published Mon, Nov 11 2024 12:37 AM | Last Updated on Mon, Nov 11 2024 12:37 AM

● ఎస్

● ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ దృష

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ..

పదో తరగతి విద్యార్థులపై విద్యా శాఖ ప్రత్యే క దృష్టి సారించింది. కలెక్టర్‌ రాజర్షిషా ఆదేశాలతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టా రు. చాలా పాఠశాలల్లో ఇప్పటికే ప్రారంభం కాగా, కొన్ని పాఠశాలల్లో ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. ఇటీవల విద్యా శాఖా ధికారులతో పాటు ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా చూడాలని ఆదేశించారు. రాత్రి, ఉదయం వేళల్లో వేకప్‌ కాల్స్‌ చేయాలని సూచించారు. తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఇంటి వద్ద టీవీలు, ఫోన్లకు దూరంగా ఉండేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులు ఫోకస్‌ పెంచా రు. ఇటీవల జరిగినఎస్‌ఏ–1 ఫలితాల ఆధా రంగా విద్యార్థుల ప్రతిభను పరిశీలించి మూడు గ్రూప్‌లుగా విభజిస్తున్నారు. సి– గ్రూప్‌ వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారు కనీసం ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇదివరకు జరిగిన పదో తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలతో ప్రాక్టిస్‌ చేయాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచి స్తున్నారు. ఈఏడాది టాప్‌–10లో ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు వారు పేర్కొంటున్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థుల భవిష్యత్తుకు పదో తరగతి తొలిమెట్టు. ఈ మార్కులే అన్నింటికి ప్రామాణికం. ఇందులో భాగంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపడంతో పాటు చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా కలెక్టర్‌ ఫోకస్‌ పెట్టారు. ఇందులో భాగంగా విద్యా శాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్నారు. అయితే కొంత మంది ఉపాధ్యాయులు మాత్రం విధులపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో డీఈవో పరిధిలో 127 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 105 జెడ్పీ, ప్రభుత్వ యాజ మాన్య పాఠశాలలు ఉన్నాయి. అలాగే 17 కేజీబీవీ లు, 6 మోడల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో 5వేలకు పైగా విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. అయితే కొంత మంది ఉపాధ్యాయులు పిల్లల చదువుపై కాకుండా ఇతర వ్యాపకాలపై దృష్టి పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ఉంటాయి. డిసెంబర్‌ 31వరకు సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉంది. చాలా పాఠశాలల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించి 50 శాతం సిలబస్‌ కూడా పూర్తి కాలేదు. ఉపాధ్యాయుల కొరత కూడా కారణంగా తెలుస్తోంది. అయితే గత నెలలో డీఎస్సీ ద్వారా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కొంత ఊరట కలిగింది. సెప్టెంబర్‌లోనే ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టారు. అయితే కొంత మంది వారికి కేటాయించినా ఉన్నత పాఠశాలలకు వెళ్లి విధులు నిర్వహించలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో పాఠాలు ముందుకు సాగడం లేదు. ఇక జైనథ్‌ మండలంలోని ఓ పాఠశాలలో లెక్కలు బోధించే ఓ టీచర్‌ కేవలం రెండు యూనిట్లు మాత్రమే పూర్తి చేశారు. దీంతో గమనించిన సదరు ప్రధానోపాధ్యాయుడు ఆ టీచర్‌కు మెమో ఇచ్చారు. ఇలా చాలా మంది ఉపాధ్యాయులు ఇంకా సిలబస్‌ పూర్తి చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఇటీవల బదిలీ ప్రక్రియ జరగడంతో సిలబస్‌ పూర్తి చేయలేదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటుండడం గమనార్హం.

దృష్టి సారిస్తున్నాం..

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఉన్నత పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. చదువుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నాం. వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతున్నాం. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై దృష్టి సారించాలి. – ప్రణీత, డీఈవో

జిల్లాలో గడిచిన రెండేళ్లలో

పదో తరగతి ఫలితాలు

విద్యాసంవత్సరం ఉత్తీర్ణత రాష్ట్రస్థాయిలో

శాతం స్థానం

2023–24 92 17

2022–23 88.68 19

No comments yet. Be the first to comment!
Add a comment
● ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ దృష1
1/1

● ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ దృష

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement