నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
● ప్రకటించిన ప్రైవేట్ వ్యాపారులు
ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ ఎల్–1, ఎల్–2, ఎల్–3 పేరుతో బిల్లుల్లో కఠిన నిబంధనలు అమలు చేయడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ అసోసియేషన్ నిరవధికంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచే కొనుగోళ్లు చేపట్టడం లేదని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు చింతవార్, మనీష్ మాల్‌పాని తెలిపారు. దీంతో సీసీఐ ద్వారా కూడా పత్తి కొనుగోళ్లు జరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రైవేట్ వ్యాపారుల జిన్నింగ్ మిల్లుల్లోనే సీసీఐ ద్వారా కొనుగోలు చేసిన పత్తిని నిల్వ ఉంచడంతో కొనుగోళ్లు జరగని పరిస్థితి నెలకొంది. అయితే సీసీఐ, ఆదిలాబాద్ మార్కెటింగ్ అధికారులు మాత్రం పత్తి కొనుగోళ్ల నిలిపివేతకు సంబంధించి ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. దీంతో రైతుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. పంట దిగుబడిని మార్కెట్‌కు తీసుకెళ్లాలా, లేదా అనే సందేహంలో ఉన్నారు. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం కొనుగోళ్లు చేపట్టేదిలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment