గుప్తనిధుల తవ్వకాలకు యత్నం
బోథ్: గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు యత్నించారు. మండలంలోని సాకెర శివారులో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సాకెర శివారు గల పురాతన గడి వద్ద గుప్తనిధుల తవ్వకాలు జరిపే చోటు వద్ద కొందరు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపుతో పూజలు చేశారు. ఈ తతంగం ఓ వ్యక్తి ద్వారా బోథ్ పోలీసులకు చేరింది. కాగా గుప్త నిధుల కోసం తవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు వస్తున్నారని తెలియడంతో సదరు వ్యక్తులు పారిపోయారు. అయితే మహారాష్ట్రకు చెందినవారే ఉంటారని భావిస్తున్నారు. మండలానికి చెందిన వ్యక్తి ద్వారానే ఈ ప్రణాళిక చేశారని తెలుస్తోంది. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment