సెస్.. అందట్లే
● సమస్యల్లో సరస్వతీ నిలయాలు ● బకాయిల చెల్లింపులో జాప్యం ● నిర్వహణకు తప్పని తిప్పలు ● స్థానిక సంస్థల నుంచి రూ.3కోట్ల వరకు పెండింగ్
ఆదిలాబాద్: స్వరాష్ట్ర సాధనలో భాగంగా తొలిదశ పోరాటంలో గ్రంథాలయోద్యమానిది కీలకపాత్ర. అప్పట్లో ఉద్యమకారులు ఊరూరా గ్రంథాలయాలు నెలకొల్పి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం రగిలించారు. అయితే స్వరాష్ట్రంలో మా త్రం విజ్ఞాన భాండాగారాలు నిర్వహణ లేమితో కొ ట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బంది కొరతతో పాటు పూర్తిస్థాయిలో పుస్తకాలు లేక ఉనికిని కోల్పోతున్నా యి. లైబ్రరీలు స్థానిక సంస్థల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. సెస్ రూపంలో గ్రంథాలయాలకు విధిగా చెల్లించాల్సి ఉంటుంది. వీటితోనే నిర్వహణ సాధ్యపడుతుంది. అయితే కొన్నేళ్లుగా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల నుంచి రా వాల్సిన సెస్ బకాయిలు అందక లైబ్రరీల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతోంది.
అందని సెస్..
సమాజాభివృద్ధిలో ఎంతో కీలకంగా వ్యవహరించే పుస్తకాల ప్రాధాన్యతను గుర్తించిన గత ప్రభుత్వాలు పౌరులు చెల్లించిన పన్నులో లైబ్రరీల అభివృద్ధి కోసం సెస్ చెల్లించాలనే నిబంధనలు పెట్టాయి. స్థా నిక సంస్థలకు అందే ఆస్తి పన్నులో ప్రతీ రూపాయిలో 8 పైసలు సెస్ రూపంలో అందించాల్సి ఉంటుంది. దీనిని స్థానిక సంస్థలు ఎప్పటికప్పుడు చెల్లి స్తే లైబ్రరీలు ఆటంకం లేకుండా మనుగడ సాగిస్తా యి. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల నిర్లి ప్తత వెరసి గ్రంథాలయాలకు శాపంగా మారుతుంది. సెస్ సంబంధిత బకాయిలు చెల్లించడానికి పలు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ విముఖత ప్రదర్శిస్తుండడంతో సరస్వతీ నిలయాలు సమాజంలో మొక్కుబడిగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి.
నిధులు లేక నిస్తేజంగా...
సెస్ నిధులే గ్రంథాలయాలకు ప్రధాన ఆదాయవన రు. వీటి ద్వారా మౌలిక వసతుల కల్పన, గ్రంథా ల య భవనాలకు మరమ్మతులు, నిర్వహణ, టాయిలెట్స్ నిర్మాణం, నూతన పుస్తకాల కొనుగోలు, ఆన్‌డిమాండ్ బుక్స్ అందుబాటులో ఉంచడం వంటి వాటికి అవకాశం ఉంటుంది. తాగునీటి సౌకర్యం, విద్యుత్, పార్ట్‌టైం వర్కర్లకు కూలి, వస్తువుల కొ నుగోలు వంటి వాటికి పలు సందర్భాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలోని ఎన్నో గ్రంథాలయాలకు సొంత భవనాలు లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. దాతల సహకారంతో రెంట్ ఫ్రీ భవనాల్లో లైబ్రరీలు నడుస్తుండడం వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. సరైన సమయంలో బ కాయిలు రాకపోవడంతో అరకొర నిధులు, దాతల సహకారంతో పాఠకులకు సౌకర్యాలు కల్పించాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment