గిరి గ్రామాల అభివృద్ధికి కేంద్రం కృషి
● ఎంపీ గోడం నగేశ్
ఆదిలాబాద్రూరల్: మారుమూల గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మండలంలోని దివ్యగూడ, పొట్టంలొద్ది గ్రామాల్లో శుక్రవారం వారు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆయా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, దయాకర్, స్వామి, ముకుందరావు, రాజు, తుకా రాం, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment