ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వందశాతం ప్రసవాలు జరిగేలా వైద్యులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై పీహెచ్‌సీల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు రెగ్యులర్‌గా వైద్యపరీక్షలు నిర్వహించుకునేలా ప్రత్యేక అవగాహన కల్పించాలన్నారు. సామ్–మామ్ చిన్నారులపై శ్రద్ధ వహిస్తూ ఆరోగ్యవంతులుగా ఎదిగేలా చూడాలన్నారు. పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. గర్భిణులు స్థానిక ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో ట్రెయినీ కలెక్టర్ అభిఘ్నాన్ మాల్వియా, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, డీఐవో వైసీ శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి సబిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment