No Headline
కై లాస్‌నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా చేపట్టిన కళా యాత్ర శుక్రవారం ఆదిలాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను తమ ఆటపాటల ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రెయినీ కలెక్టర్ అభిఘ్నాన్ మాల్వియా, ఆర్డీవో వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment