హెచ్చరించినా.. డోంట్ కేర్!
● భాగ్యనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ ● అధికారులు రంగంలోకి దిగినా పట్టించుకోని రియల్టర్ ● బండరాళ్లు తొలగించినా మళ్లీ పాతిన వైనం
కై లాస్‌నగర్: జిల్లాకేంద్రంలో అక్రమ లేఅవుట్లు జో రుగా వెలుస్తున్నాయి. నిబంధనలు పాటించని వా టి విషయమంలో మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నా పలువురు రియల్టర్లు పట్టించుకోవడం లే దు. బల్దియా అధికారులు వాటిలో బండరాళ్లను తొ లగించినా వీరు మాత్రం తమ తీరు మార్చుకోవ డం లేదు. డోంట్ కేర్ అంటూ వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణం భాగ్యనగర్‌కాలనీలో ఏర్పాటు చేసిన అనుమతి లేని లేఅవుటే ఇందుకు నిదర్శనం.
బండరాళ్లను తొలగించినా...
భాగ్యనగర్ కాలనీలోని వాగు సమీపంలో సర్వేనంబర్ 25/2లో గల రెండెకరాల పంట చేనును ఓ రియల్టర్ గతంలో లేఅవుట్‌గా మార్చాడు. దీనికి మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి గాని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి గాని ఎలాంటి అనుమతులు లేవు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్‌పై ఫిర్యాదులు రావడంతో ఇటీవల బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ పట్టణ ప్రణాళిక విభాగం సి బ్బందితో కలిసి పోలీస్ బందోబస్తు నడుమ అందులో పాతిన బండరాళ్లను పూర్తిగా తొలగించి వేశా రు. నిబంధనలకు విరుద్దంగా లేఅవుట్ ఏర్పాటు చే స్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతవరకు బాగానే ఉండగా తాజాగా సదరు రియల్టర్ ఆ లేఅవుట్‌లోనే మళ్లీ పనులు ప్రారంభించాడు. బల్దియా సిబ్బంది తొలగించిన రాళ్లను తిరిగి పాతడంతో పాటు టిప్పర్ల సాయంతో మొరం తీసుకొచ్చి అంతర్గత మట్టిరోడ్లు ఏర్పాటు చేస్తుండడం గమనా ర్హం. గతంలో చర్యలు చేపట్టిన అధికారులు సైతం ప్రస్తుతం మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలేంటంటే...
సాధారణంగా లేఅవుట్ ఏర్పాటు చేయాలంటే మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అనంతరం లేఅవు ట్ విస్తీర్ణంలో 15 శాతం భూమిని మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేయాలి. ఇది పూర్తయ్యాకే లేఅ వుట్ ప నులు ప్రారంభించాలి. 40 ఫీట్ల రోడ్లతో పాటు, వి ద్యుత్, డ్రెయినేజీ, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలి. కానీ ఈ లేవుట్‌లో అలాంటి సౌకర్యాలేమి కన్పించడం లేదు. అనుమతులేమి లేకుండా కేవలం మట్టి రోడ్లు వేసి ఒక్కో ప్లాటును రూ. 15లక్షల నుంచి రూ.20లక్షలకు విక్రయిస్తూ సొ మ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిని కొనుగోలు చేసిన వారు భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి అనుమతులు లభించక, సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు తప్పవు.
చర్యలు తీసుకుంటాం
భాగ్యనగర్‌లో ఏర్పాటు చేసిన లేఅవుట్ ముమ్మాటికి అక్రమమే. ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేయడంతోనే గతంలో అందులోని బండరాళ్లను తొలగించి వేశాం. మళ్లీ పనులు చేయడం నిబంధనలకు పూర్తిగా విరుద్దం. శాఖాపరంగా తగు చర్యలు తీసుకుంటాం. ప్లాట్లను కొనుగోలు చేసే ప్రజలు లేఅవుట్‌కు అధికారిక అనుమతులు ఉన్నాయా.. లేవా పరిశీలించుకోవాలి. లేదంటే ఇంటి నిర్మాణానికి అనుమతి లభించక ఇబ్బందులు తప్పవు.
– సుమలత, టీపీఓ, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment