ముఖ్యంగా తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వ్యవహారాల్లో అవినీతి చో టు చేసుకుంటుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సరైన పత్రాలు లేకపోయినప్పటికీ ఆఫీ సర్లు లంచం తీసుకుని యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ వంటి శాఖల్లో రోడ్డు నిర్మాణాలకు సంబంధించి ఎంబీ రికార్డు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వివిధ విషయాల్లో ప్రజల నుంచి అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇక పోలీసుశాఖలో స్టేషన్ బెయిల్ మంజూరు కోసం ఇన్‌స్పెక్టర్లు పెద్ద మొత్తం లంచం డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో భూములకు సంబంధించిన అనేక అక్రమాలకు అధికా రులే సూత్రదారులవుతున్నారు. వ్యవసాయ శాఖలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వీటి విక్రయాలకు సంబంధించి ఫర్టిలైజర్ దుకాణాల లైసెన్స్‌కు సంబంధించిన వాటిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాల్లో ఎంబీ రికార్డు కోసం కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటీవల నిర్మల్ మున్సిపాలిటీలో ఓ జూనియర్ అసిస్టెంట్ అదే కార్యాలయంలో పని చేసే ఓ సిబ్బంది రెగ్యూలరైజేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో డబ్బులు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇలా ప్రభుత్వ శాఖల్లో అక్రమాలకు అంతు లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment