ఆయిల్‌పాం సాగు లాభదాయకం
తాంసి: ఆయిల్‌పాం సాగుతో అధిక దిగుబడి సా ధించవచ్చని జిల్లా ఉద్యానవన అధికారి సుధాకర్ అన్నారు. మండలంలోని హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో ఆయిల్‌పాం తోటలను శనివారం ఆయన పరిశీలించారు. కీటకాల ద్వారా పరపరాగ సంపర్కం చేసే విధానంపై క్షేత్రస్థాయిలో కంపెనీ ప్రతినిధులతో కలిసి శిక్షణ ఇచ్చారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇందులో కంపెనీ మేనేజర్ మల్లేశ్వర్‌రావు, ఏరియా మేనెజర్ శ్రీకాంత్, క్లస్టర్ ఆఫీసర్ రమేశ్, రైతులు పాల్గొన్నారు.
తలమడుగు: మండలంలోని ఖోడథ్, ఉండం గ్రామాల రైతులు సాగు చేస్తున్న ఆయిల్ పాం పంటలను సుధాకర్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment