పింఛన్ హామీ నిలబెట్టుకోవాలి
కైలాస్నగర్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ ఇస్తామన్న హామీని సీఎం రేవంత్రెడ్డి వెంటనే నెరవేర్చాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సూర్యవంశీ సుజాత డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచుతామని ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభు త్వ తీరుకు నిరసనగా ఈ నెల 26న నిజాం కళాశాలలో నిర్వహించనున్న సభకు దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వితంతువులు అధిక సంఖ్యలో తరలిరావా లని కోరారు. ఇందులో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్, వీహెచ్పీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రేంరాజ్, తుమ్మల రాజు, బాలాజీ, నందేవ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment