స్కానింగ్ సెంటర్ల తనిఖీ
ఎఫెక్ట్..
ఆదిలాబాద్‌టౌన్: ఈనెల 22న ‘ఒకే సెంటర్.. వేర్వేరు రిపోర్టులు’ శీర్షిక న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాని కి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ స్పందించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రెండు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశా రు. రికార్డులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కానింగ్ చేస్తున్న వారికి అర్హతలు ఉన్నా యా.. డయగ్నోస్టిక్ సెంటర్లు నిబంధనల ప్రకారం కొనసాగుతున్నాయా అనే విషయాలపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మా ట్లాడుతూ, స్కానింగ్ రిపోర్టులు సక్రమంగా అందించాలని, అర్హత లేనివారితో పరీక్షలు చేయిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బోర్డుపై వాటి ధరలు ప్రదర్శించాలని ఆదేశించారు. ఆయనవెంట జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట్‌రెడ్డి, సిబ్బంది రాము తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment